Friday, October 29, 2021

ఉబ్బసవ్యాధి నివారణ కొరకు అద్బుత యోగం

ఉబ్బసవ్యాధి నివారణ కొరకు అద్బుత యోగం -

 
      చక్కగా పెద్దగా ఎదిగిన కలబంద మట్టని మొదలకి కొసి తెచ్చుకోవాలి . దీన్ని అడ్డంగా వెదురుబద్ధ చీల్చినట్టు రెండుగా చీల్చుకొని అందులో నవాసారం పొడిని తగినంతగా చల్లి తిరిగి రెండింటిని యధాప్రకారం చేర్చి దారంతో చక్కగా కట్టి ఎండలో వేలాడదీసి దీనికింద ఒక గాజు లేక పింగాణి పాత్రని ఉంచాలి. ఎండవేడికి కరిగి రెండు గంటల్లో పాత్రలోకి కలబంద ద్రావణం దిగుతుంది. పూర్తిగా దిగినతరువాత దీనిని ఒక గాజుసీసాలో పోసి మూత గట్టిగా బిగించాలి.

           తరువాత ఒక పాత్రలో నీళ్లు తీసుకుని బాగా మరిగేలా కాచి దించి ఆ పాత్రలో నీటిలో ఈ గట్టిగా బిగించిన సీసాని ఉంచాలి . సీసాతోపాటు ద్రావకం కూడా వేడెక్కుతుంది . అలా వేడెక్కిన తరువాత సీసాని తీసి భద్రం చేయాలి . 

  వాడే విధానం  - 

      ఉదయం , సాయంత్రం రెండుపూటలా అరకప్పు నీటిలో అయిదు చుక్కలు ఈ ద్రావకం కలుపుకుని సేవించాలి . వారం రోజుల్లో మీకు ఫలితం కనిపిస్తుంది. 

  

Thursday, October 21, 2021

చనుబాలు వృద్ది అగుటకు సులభ యోగాలు -

చనుబాలు వృద్ది అగుటకు సులభ యోగాలు -

 * ఆవుపాలలో బియ్యం వేసి వండి అందు పటికబెల్లం పొడి కూడా కలిపి ప్రతినిత్యం తినుచుండిన యెడల స్త్రీలకు చనుబాలు వృద్ది అగును. నాటు ఆవుపాలు శ్రేష్టం .

 * గోధుమ పిండితో చేసిన పూరీలను నేతిలో ఉడికించి తీసి పాలలో నానబెట్టి తినుచుండిన బాలింతలకు పాలు వృద్ది అగును. ఆవునెయ్యి శ్రేష్టం.

 *  వాము కషాయం ఇచ్చిన రొమ్ములలో చనుబాలు సిద్ధం అగును.

 * ఆకుపత్రి కషాయం సేవించిన చనుబాలు పడును .

 * చిట్టాముదపు ఆకులకు ఆముదం రాసి రొమ్ములపై వేసి కట్టిన రొమ్ములలో చనుబాలు సిద్దం అగును.

 * బొప్పాయి కాయ కూరగా చేసుకుని తినుచుండిన యెడల స్త్రీలకు చనుబాలు వృద్ది అగును.

 * ముళ్లతోటకూర ఆకులను పప్పులో వేసుకొని తినుచుండిన బాలింతలకు పాలు వృద్ది అగును.

 * తెల్ల జీలకర్ర చూర్ణం , పటికబెల్లం చూర్ణం రెండింటిని సమానంగా తీసుకుని కలిపి ఉదయం , సాయంత్రం 10 గ్రాముల చూర్ణమును అరకప్పు మంచినీటిలో కలుపుకుని తాగుచుండిన యెడల 15 రోజుల్లొ చనుబాలు వృద్ది అగును.

 *  అతిమధురం చూర్ణం 5 గ్రాములు తీసుకుని అరకప్పు ఆవుపాలలో కలిపి 20 గ్రాములు పటికబెల్లం పొడిని కలిపి ప్రతినిత్యం తాగుచుండిన యెడల చనుబాలు వృద్ది చెందును .

      పైన తెలిపిన యోగాలలో మీకు సులభమైన వాటిని ఉపయోగించుకుని సమస్యని పరిష్కరించుకోగలరు.

          

Tuesday, October 19, 2021

మలేరియా జ్వరమునకు తులసితో చికిత్స -

మలేరియా జ్వరమునకు తులసితో చికిత్స -

      మలేరియా జ్వరం వర్షాకాలం  నందు విపరీతంగా వ్యాప్తి చెందును. ఇది ఇప్పుడు సర్వసాధారణం అయినది. దీనికి ఇతర వైద్యులు "క్యూనైన్ "మందుగా వాడటం జరుగుతుంది. దీనిచే జ్వరం తగ్గును. కానీ తలనొప్పి , చెవులలో హోరుమను శబ్దం , తలతిరుగుట , చెవుడు మొదలుకొని హృదయసంబంధ కాంప్లికేషన్స్ అగుపిస్తున్నాయి. మన ఆయుర్వేద వైద్యం నందు తులసితో ఎటువంటి సైడ్ ఎఫక్ట్స్ లేకుండా ఈ జ్వరాన్ని సులభంగా నివారించవచ్చు. 

  నివారణోపాయాలు  - 

 *  7 మిరియాలు , 7 తులసి ఆకులు కలిపి నమిలి మ్రింగుచున్న  మలేరియా జ్వరం 3  రోజులలో హరించును . 

 *  మానిపసుపు , పిప్పిళ్ళు , వెల్లుల్లి , జీలకర్ర , శొంఠి , తులసి , నారింజ పిందెలు , వావిలి వ్రేళ్ళు , ఆకుపత్రి వీటిని సమాన భాగాలుగా కలిపి చూర్ణించి పూటకు అరతులం వంతున ఇచ్చుచున్న చలిజ్వరములు తగ్గును. 

 *  తులసి ఆకులు 60 గ్రా , కొద్దిగా మందార పుష్పదళములు , కొద్దిగా ఉమ్మెత్త పుష్పదళములు , మిరియాలు 10 గ్రా , కొద్దిగా నీరువేసి మర్దించి బఠాణి గింజంత పరిమాణంతో మాత్రలు చేసి చలిజ్వరం వచ్చుటకు గంట ముందుగా రెండు మాత్రలు తీసుకున్న చలిజ్వరం రాకుండానే పోవును.అలాగే రొజు మార్చి రొజు వచ్చు మలేరియా జ్వరం లందు మంచి ఫలితాన్ని ఇచ్చును . 

 *  మలేరియా జ్వరం మొండిగా ప్రతిసంవత్సరం వస్తూనే ఉండిన తులసీదళములు , మిరియాలు నీటిలో వేసి ఉడికించిన కషాయములో కొద్దిగా బెల్లం , నిమ్మరసం కలిపి వేడిగా ఉన్నప్పుడే కాఫీ వలే తాగి రగ్గు కప్పుకొని పడుకోవలెను . ఇలా మూడు గంటలకు ఒకమారు చేయుచుండిన మంచి ఫలితం ఉండును. 

 *  తులసి వ్రేళ్ళ కాషాయం త్రాపిన బాగుగా చెమటపట్టి చలిజ్వరం వెంటనే తగ్గును. 

 *  మలేరియా జ్వరం ప్రతిసంవత్సరం భాదించుచున్న వ్యక్తికీ తులసిరసం , పుదీనా రసం , అల్లం రసం ఒక్కొక్కటి 5 గ్రాముల వంతున కలిపి తాగుచున్న మంచి ఫలితం కనిపించును.

  గమనిక  - 

      తులసి చెట్టు వైద్యం కొరకు కుండీలలో ఇంట్లో పెంచుకొనుట చాలా మంచిది.

   అనుభవం - 

         ప్రతిరోజు 2 స్పూన్స్ తులసి రసం ఇచ్చి టాబ్లెట్ లేకుండా రక్తపోటు 170 నుంచి 130 కి తీసుకొనివచ్చాను కేవలం 2 వారాలలోనే  ఇలా కొంతకాలం తులసిరసం వాడటం వలన రక్తపోటు పూర్తిగా పోతుంది. 

   
          

Thursday, October 7, 2021

రెట్టమత శాస్త్రము - పంటలు వేయుటకు శుభ సమయాలు, తిధులు , నక్షత్రాలు తెలుపు శాస్త్రం .

రెట్టమత శాస్త్రము - పంటలు వేయుటకు శుభ సమయాలు, తిధులు , నక్షత్రాలు తెలుపు శాస్త్రం .

 * హస్తా నక్షత్రం, మృగశిర నక్షత్రం, మాఘ నక్షత్రం, ధనిష్టా నక్షత్రం, రేవతి నక్షత్రం, ఉత్తర ఫాల్గుణ నక్షత్రం, ఉత్తరాషాడ నక్షత్రం, ఉత్తరాబాద్ర నక్షత్రం, నందు భూమి యందు విత్తనములు చల్లినచొ చక్కగా ఫలించును.

 * పుష్యమి నక్షత్రం, పునర్వసు నక్షత్రం, రోహిణి నక్షత్రం, యందు భూమి యందు చల్లిన వడ్లు , చామలు సమృద్ధిగా పండును. మూలా నక్షత్రం నందు చల్లిన అన్ని ధాన్యములు చక్కగా ఫలించును.

 * అశ్వని నక్షత్రం, పుబ్బా నక్షత్రం, పుర్వాషాడ నక్షత్రం, ఆర్దా నక్షత్రం, పూర్వాభాద్ర నక్షత్రం, నాడు ప్రత్తి విత్తనములు నాటిన పక్షమున అవి మొలచి చక్కగా పెరిగి ప్రత్తి బాగుగా పండును. శతబిష నక్షత్రం, విశాఖ నక్షత్రం, నాడు నాటబడిన భుమిలో పెరుగు దుంప దినుసులు, చెరకు తోటలు లెస్సగా ఫలించును. శ్రవణా నక్షత్రం నాడు మొలక వేసిన చెన్నంగి అను వడ్లు చక్కగా పండును. ఉత్తర ఫాల్గుని నక్షత్రం నాడు తమలపాకు తీగలు నాటిన యెడల హద్దు లేకుండా పెరుగును. 

 * కృత్తికా నక్షత్రం నాడు , హస్తా నక్షత్రం నాడు, చల్లిన శెనగలు భూమి యందు జనులు తృప్తి పొందునట్టు హెచ్చుగా పండును. భరణి నక్షత్రం నాడు గొధుమలు నాటిన యెడల అవి ఫలించును. అనగా ఆయా నక్షత్రం నాడు ఆయా గింజలు నాటవలెను.

 * పుబ్బా నక్షత్రం నాడు శెనగ గింజలు చల్లిన పక్షమున ఆ పంట పండక చెడిపోవును. ఆర్దా నక్షత్రం నాడు చల్లిన యెడల ఏదేని జబ్బు తగిలి చేను పెరగక ఉండును. చిత్తా నక్షత్రం నాడు శెనగ విత్తనములు నాటినచో ఆ పైరుని అతివేగముగా మిడుతలు తినివేయును.

 * భూమి యందు మృగశిరా నక్షత్రం నాడు చల్లిన గొధుమ పంటను మృగములు తృప్తిగా తినిపోవును. అదే జైష్టా నక్షత్రం నాడు చల్లిన పంటలు పండవు . ఒకవేళ పండినా ఆ పంట దొంగలపాలు అగును.

 * ఆశ్లేషా నక్షత్రం నాడు ప్రత్తి విత్తనాలు చల్లినచొ స్వల్పముగా ఫలించును. కాని ఫలిన్చవలసినంతగా ఫలించవు. కావున నక్షత్రం మంచిదో కాదో ఆలోచించకుండా విత్తనములు వేసినచో అవి పండినట్లే పండి చెడిపోవును.

 * శతబిష నక్షత్రమున , విశాఖ నక్షత్రమున అవిసె గింజలు, మునగ విత్తనములు నాటిన యెడల ఆ సస్యములు వృద్ది నొందక మిక్కిలి ఆశ్చర్యముగా పురుగుపట్టి పాడుచేయును.

 * పాపగ్రహములు ఉన్న లగ్నముల యందు ఆ పాపగ్రహములను చూచుచున్న లగ్నముల యందు విత్తనములు నాటుట మంచిది కాదు.

 * శుక్రుడు లగ్నము నందు ఉండిన ఆ లగ్నమునకు సూటిగా 7 వ ఇంట ఉండిన ను భూమి యందు నెల్ల ధాన్యములను నాటవచ్చును .

 * చంద్రుడు కేంద్ర స్థానం నందు ఉండిన పాపగ్రహములు మంచివిగా కాకున్నను వేసిన సస్యములు అన్నియు ఫలించును.

 * సూర్యుడు ఆర్ద నక్షత్రం నందు ప్రవేశించి నప్పుడు మొదలుకొని భూమి యందు చల్లిన విత్తనములు అన్నియూ , ఆ సమయం చాలా మంచి సమయం అగుటచే వృద్ది నొంది చక్కగా ఫలించును.

 * శ్రవణా నక్షత్రం నందు చల్లిన రాజనములు అను ఒక దినుసు ధాన్యము స్వల్పముగా ఫలించును. ఆరుద్రా నక్షత్రము నందు , పుష్యమి నక్షత్రము నందు, భరణి నక్షత్రము నందు, పునర్వసు నక్షత్రము నందు, రోహిణి నక్షత్రము నందు, మాఘ నక్షత్రము నందు, నాటిన విత్తనములు వృద్ది నొంది చక్కగా ఫలించును.

 * స్వాతి నక్షత్రము నందు, పుర్వాషాడ నక్షత్రము నందు, పుర్వాబాద్ర నక్షత్రము నందు, ప్రత్తి గింజలు నాటు వేసిన  పక్షమున హెచ్చుగా ప్రత్తినిచ్చును. జైష్టా నక్షత్రమున మినుములు చల్లిన యెడల పంట హెచ్చుగా పండును.

 * హస్తా నక్షత్రము నందు,పెసర విత్తనములు, ఆరుద్రా నక్షత్రము నందు నువ్వు విత్తనములు , మూలా నక్షత్రము నందు కంది విత్తనములు నాటిన పక్షమున అనురాధా నక్షత్రము న పత్తి విత్తనములు నాటిన చక్కగా పండును.

 * అశ్వని నక్షత్రము నందు శెనగ విత్తనములు , పుర్వాషాడ నక్షత్రము నందు అలసంద విత్తనములు నాటిన పక్షమున చక్కగా ఫలించును.

 * ఉత్తరా నక్షత్రం నందు, అనురాధా నక్షత్రం నందు, మూలా నక్షత్రం నందు, రోహిణి నక్షత్రం నందు, రేవతి నక్షత్రం నందు విత్తనాలు నాటు వేయుట చాలా మంచిది. 

 * ఉత్తరా నక్షత్రం, రోహిణి నక్షత్రం, అనురాధా నక్షత్రం, రేవతి  నక్షత్రం, యందు జొన్న విత్తనాలు నాటుట చాలా మంచిది.

 * భుమి మీద విత్తనములు నాటుటకు అశ్వని నక్షత్రం, ధనిష్టా నక్షత్రం, శతబిష నక్షత్రం, శ్రవణా నక్షత్రం, పునర్వసు నక్షత్రం మధ్యమములు.

 * మకర రాశి యందు , సింహరాశి యందు , వృషభ రాశి, మీనరాశి, కర్కాటక రాశి, విత్తనములు చల్లుటకు చాలా మంచిది. అది చల్లునట్టి లగ్నమున గురుడు ఉండిన బుదుడు, శుక్రుడు ఉండుట చాలా మంచిది.

 * చాయాదేవి కొడుకైన శని మేషము నందు ఉన్నప్పుడు గురుడు వృషభ రాశి యందు ఉన్నప్పుడు ధనస్సు నందు సూర్యుడు ప్రవేశించి  మొదలుకుని మాఘ మాసం వరకు స్వాతి నక్షత్రం నందు, ములా నక్షత్రం నందు, అనురాధా నక్షత్రం నందు, మకర రాశి యందు , మీనరాశి యందు , కర్కాటక రాశి యందు చల్లిన పక్షమున జొన్న పంట హెచ్చుగా పండును.

 * పైన వివరించిన నక్షత్రములను ఆ రాశులకు కాక మిగిలిన నక్షత్రముల యందును, రాశుల యందును, జొన్న విత్తనములు నాటవేసిన పక్షమున మూడు వంతుల పంట ఎర్రబడి చెడిపోవును. ఒక్క వంతు మాత్రమే ఫలించును.

 * ముందుగా గంధము , అక్షంతలు, ధూపము, నైవేద్యము అనునవి దున్నిన పొలము మీదను, దున్నేడు యంత్రముకు కుడా సమర్పించవలెను. అలాగే విత్తనములు చల్లు యంత్రముకు కుడా సమర్పించవలెను. అటుపైన సంతోషముతో జొన్నలు మొదలయిన విత్తనములు నాటిన పక్షమున తక్కువ కాకుండా ఫలించును. విత్తనములు చల్లునప్పుడు వేగముగా పగ్గములు అయినను, మోకులు అయినను తెగిపోయినట్లు అయినను , ఎద్దులు మూలిగినను , ఎద్దులు పడిపోయినను ఆ పండిన పంట రాచకార్యముల చేత పాడైపోవును. ముందుగా ఎద్దు పడిపోయిన ఆ దొషం చేత ఆ పంట దొంగలపాలు అయినను పడును. అంతేకాకుండా  పండించే డి కాపునకు, వాని తమ్మునుకు గట్టిగా కీడు తగలవచ్చు.

 * విత్తనములు చల్లుటకు పోవునప్పుడు పైడికంటి అను పక్షి, ఎడమవైపు కూసి , నిలిచినను , కుడివైపు గాడిద కాని , ముంగీస కాని , కాకి కాని పోయినను, కుక్క ఎడమ దిక్కుకు పోయినను సంతోషించి ముత్తైదువులు నేసలు చల్లినను, సంతోషంతో బ్రాహ్మణులు వేదములు పటించు చున్నను , విత్తనములు చల్లుచున్నప్పుడు ఎద్దు ఎడమవైపు చాలు చేసిననూ ఆ పైరు చక్కగా ఫలించును.

 * శుక్రుడు , బుదుడు ఉన్న లగ్నం నందు, చంద్రుడు ఉన్నటువంటి యానవంశముల యన్ధైనను ఈ భూమి మీద కలిగిన ధాన్యములు ఏవి చల్లినను తప్పక ఫలించును.

 * దేవతల గురువగు బృహస్పతి లగ్నము నందు ఉండగా విత్తనములు చల్లుట యును , నాల్గోవ ఇంట ఉండగా పైరు కాలం తప్పకుండా కొయుట యును , సప్తమ స్థానం నందు ఉండగా వేగముగా ఆ పైరులు జాగ్రత్తగా పెట్టుకొనుట చాలా మంచిది. కాబట్టి గురుబలం విచారించి మరియు విత్తనములు చల్లవలెను.

 * కొరిక కలిగి పంటలను కోయుటకు పోవుచున్నప్పుడు కాకి కుడి ప్రక్కకు వచ్చి కర్రకర్ర అని కూసినను, దాని కుడి అవయవముల తో ఏదేని చేష్ట చేసినను పంట విస్తారముగా లబించును.

 * పండిన చేను కోయుటకు పోవునప్పుడు ఆలోచించగా విధవ కాని , చెవుల పిల్లికాని, నిప్పు కాని , కసువు కాని ఎదురుగా వచ్చిన పక్షమున పండించుకొన్న పంట దక్కదు.

      

Friday, October 1, 2021

అంటుకట్టడం

వృక్ష విచిత్రములు  - అంటు కట్టడం ద్వారా విచిత్రాలు సృష్టించుట 

 * మామిడి టెంక నాటిన పిదప మొలచిన మొక్క జానెడు వరకు పెరిగిన పిదప చిగురు కత్తిరించిన యెడల నాలుగైదు కొమ్మలు పుట్టి పెరుగును. ఆ కొమ్మలు వ్రేళ్ళు వలె పెరిగిన పిమ్మట నాలుగు కొమ్మలకు నాలుగు జాతుల అంటు మామిడి అంట్లు కట్టిన నాలుగు వైపులా నాలుగు రంగుల కాయలు కాచును. 

 * పనస మొక్కకు మామిడి కొమ్మ కట్టి నాటిన మొదటను పనస కాయలును, కొమ్మలకు మామిడి కాయలను కాయును .

 * నేరేడు మొక్క యెక్క కొమ్మకు గులాబి, జామ, అంటును కట్టవచ్చు.

 * నిమ్మ , దబ్బ , కమలా, నారింజ, ఈ జాతులు ఒక జాతి మొక్కకు అన్ని జాతుల మొక్కలు అంట్లు కట్టవచ్చును.

 * పాల మొక్కకు సపోటా, పనస అంటు కట్టవచ్చును.

 * పొగాకుకు , గరుడ వాహన , జాజికి చమెలి, గులాభికి  పల్ల సంపెంగి , మాలతికి సాంబ్రాణి అంట్లు కట్టవచ్చు. 

 * మల్లె చెట్టు దగ్గర నొక యెర్ర బాడిధ కొమ్మను పాతి ఆ కొమ్మ చిగిర్చిన పిదప అడ్డగముగా నొక రంధ్రము చేసి ఆ రంధ్రములో నుండి ఒక మల్లె కొమ్మని తీసి పేడ మన్ను ఆ రంధ్రముని గప్పి నీళ్లు పోయుచుండిన కొంతకాలానికి ఆ రంద్రములో గల కొమ్మకి వేర్లు వచ్చును. పిమ్మట ఆ కొమ్మని మొదటకి కోసి నాటిన మంకెన ( బాడిధ ) పువ్వులు పూయును. 

 * పొగడ చెట్టు కొమ్మకు సంపెంగ మొక్కకు అంటు కట్టిన ఒక పక్క పొగడ పువ్వులు , ఇంకో పక్క సంపెంగ పువ్వులు పూయును.

 * సూర్య కాంత ( sunflower ) గింజలు పాలలొ 7 మార్లు నానవేసి ఎండబెట్టి నాటి రోజు పాలతో తడుపు చుండిన తెల్లని పువ్వులు పూయును. 

 * ఎర్ర గన్నేరుకు , తెల్ల గన్నేరుకు అంటు కట్టిన రెండు రకాల పువులు పూయును.