Tuesday, August 4, 2026

కామెర్ల వ్యాధి - లక్షణాలు - ఒకే మూలిక ఉపయోగించి చికిత్స చేసే విధానం .

కామెర్ల వ్యాధి - లక్షణాలు - ఒకే మూలిక ఉపయోగించి చికిత్స చేసే విధానం . 
  
   కామెర్ల వ్యాధిని జాండిస్ అంటారు. ఇది సాధారణంగా నీటి కాలుష్యం వలన వస్తుంది. బాగా వరదలు వచ్చే ప్రాంతంలో కూడా ఎక్కువుగా వచ్చే అవకాశం ఉన్నది. ఇది వైరస్ వల్ల వచ్చే వ్యాధి . దీని మూలంగా చర్మం , కళ్లు , మల , మూత్రాదులు పసుపు రంగులో మారతాయి. విరేచనం తెల్లగా లేదా బూడిద రంగులో మారుతుంది . దీనికి ప్రధాన కారణం రక్తంలోని "బైలురూబిన్ " శాతం ఎక్కువ అవ్వడమే . 
           ఆయుర్వేదంలో కామెర్లని మూడు రకాలుగా విభజించారు . అవి 
    1 . కోష్ఠశ్రీత కామల .
 
    2 . శాఖాశ్రీత కామల .
    3 . కుంభ కామల 
      కామల అనగా ఆయుర్వేదంలో కామెర్ల వ్యాధికి ఉన్న మరొక పేరు . 
  వ్యాధి లక్షణాలు -
     రోగిని పరీక్షించినప్పుడు కాలేయం ( liver ) ఆకారం పెరిగి ఉంటుంది. 
  1 . కళ్లు పసుపు రంగులో ఉంటాయి.
   2 . శరీరం కూడా వ్యాధితీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు పసుపు వర్ణంలో మారుతుంది . 
   3 . అన్నం తినాలనిపించదు.
   4 . వాంతులు అవుతాయి.
   5 . కొంతమందిలో దురద వస్తుంది . 
   
  పాటించవలసిన ఆహారనియమాలు -
    కొవ్వు పదార్ధాలు , సిగిరెట్లు , ఆల్కాహాల్ , మాంసం మానివేయాలి . నూనె పదార్దాలు , స్వీట్స్ , నెయ్యి , పూరి , చపాతీ తినకూడదు. తేలికైన మరియు త్వరగా జీర్ణం అయ్యే ఆహారం తీసుకోవాలి . పాలు , మజ్జిగ , ఆకుకూరలు తినవచ్చు. గ్లూకోజ్ బాగా తాగాలి. పళ్లరసాలు , కాచి చల్లార్చిన నీరు , చెఱుకురసం బాగా త్రాగాలి.
  ఒకే మూలికని ఉపయోగించి చికిత్స చేసే విధానం - 
 * నేల ఉసిరి సమూల రసం తీసి మజ్జిగతో సేవిస్తే కామెర్లు తగ్గును. నేల ఉసిరికి కామెర్లని కలగజేసే వైరస్ ని సంహరించే గుణం ఉన్నది.
 * నేల వేము 50ml కషాయం , 2 గ్రాముల శొంఠి కలిపి రోజుకి రెండుసార్లు సేవించాలి . 
 * తిప్పతీగ స్వరసం ( చెట్టు మొత్తాన్ని దంచి తీసిన రసం ) 14ml తీసుకుని 14 మిల్లి గ్రాముల తేనెలో ఉదయం , సాయంత్రం సేవించాలి . 
 * ఏరణ్డ మూల చూర్ణం తేనెతో కలిపి తీసుకున్న కామెర్ల వ్యాధి నయం అగును. 
 * కటుకరోహిణి చూర్ణం 2 నుంచి 3 గ్రాములు తేనెతో సేవించిన కామెర్ల వ్యాధి నయం అవ్వును. 
 * త్రిఫలా చూర్ణం 3 గ్రాములు తేనెతో కలిపి తీసుకున్న కామెర్ల వ్యాధి నయం అగును.
 * చింతాకు చిగుళ్లు 4 గ్రాములు , వేపాకు చిగుళ్లు 1 గ్రాము ముద్దగా చేసి ఉదయం పరగడుపున మ్రింగించి పాలు త్రాగిస్తే కామెర్ల వ్యాధి నయం అగును.
        కఠిన ఆహారనియమాలు పాటిస్తే తొందరంగా వ్యాధి నుంచి బయటపడగలరు. 
  

మనుష్య శరీర అవయవాల పైన ఉండు గ్రహాల ప్రభావం -

మనుష్య శరీర అవయవాల పైన ఉండు గ్రహాల ప్రభావం -

      మన యొక్క శరీరంలో అయస్కాంత క్షేత్రాలు ఉన్న విషయం ఇటు భారతదేశంలోనే కాక పాశ్చాత్య శాస్త్రవేత్తల పరిశోధనలో కూడా తేలింది. మనిషి మెదడులో మాగ్నటిక్ శక్తి విడుదల అవుతుంది అని లండన్ లొని డాక్టర్లు పరిశోధించి తేల్చారు. మనదేశంలో కూడా పూనాలోని డాక్టర్ ఖరే గారి పరిశోధన గురించి దూరదర్శన్ లో కూడా చూపించారు. డాక్టర్ ఖరే గారు పరిశోధించి మనిషి మెదడు, గుండె, కాలేయం మొదలయిన అవయవాలన్నిటికి అయస్కాంత క్షేత్రాలు ఉన్నాయి అని నిరూపించడమే కాకుండా వాటిని కొలిచే పరికరం కూడా తయారుచేశారు.

                 యోగశాస్త్రం వివరించే మూలాధారం వంటి చక్రాలు కూడా మనిషి శరీరంలో ఇమిడి ఉన్న అయస్కాంత శక్తి కేంద్రాలు మాత్రమే .ఈ విధంగా అయస్కాంత శక్తి నిలయం అయిన మానవ శరీరం వివిధ గ్రహాల నుంచి వస్తున్న విద్యుతయస్కాంతాల తరంగాల వైబ్రేషన్లకు అనుగుణంగా మార్పుచెందును. 

             ఇప్పుడు మీకు కొన్ని ఉదాహరణలు వివరిస్తాను. జ్యోతిష్య శాస్త్రంలో తెలిపినట్లు చంద్ర కుజుల వలన స్త్రీల ఋతుధర్మం , గురుని వలన కాలేయం , రవి వలన హృదయము , బుధుని వలన నరములు , శుక్రుని వలన మూత్రపిండములు ప్రభావితం అవ్వడం గురించి మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు . పైత్యరసం పసుపు రంగులో ఉండటం కూడా గురుని ప్రభావం అని ఎప్పుడో నిరూపితం అయింది. చంద్రుని యొక్క ప్రభావం గర్భాశయం పైన , ప్రసవం పైన ఉంటుంది అని నిరూపితం అయిన విషయమే. అక్కడివరకు ఎందుకు మనపెద్దవారు పౌర్ణమి నాడు పిచ్చి ఎక్కువ అవుతుందని అమావాస్యకు తగ్గుతుంది అని ఎప్పుడో చెప్పారు . ఆ తరువాత అమెరికా వారు ఎన్నో రోజులు పరిశోధించి అది నిజమే అని ఒప్పుకున్నారు. శరీరంలోని సంపూర్ణ ద్రవ మరియు పార్షిక ద్రవ పదార్ధాలు ఏవైతే ఇనుమును కలిగి ఉన్నాయో అవన్ని చంద్రుని ఆకర్షణ శక్తికి లోనవుతున్నాయి అని అట్టి చర్యల వలన మానసిక భావోద్రేక సమస్యలకు మనుష్యుడు లోనవుతున్నాడు అని శాస్త్రవేత్తలు కనుగొన్నారు .

         బృహజ్జాతకం వంటి పురాతన జ్యోతిష్య గ్రంథాలను పరిశీలిస్తే గర్భస్థ శిశువు పిండం దశ నుండి ప్రసవం వరకు ఏ గ్రహం వలన ఏయే అవయవాలు ఏర్పడుచున్నవో కూడా వివరణ ఇవ్వబడుచున్నది. పాతకాలంలో చాలా మంది వైద్యులకు జ్యోతిషం తెలిసి ఉండేది. రోగము కనపడిన రోజు నక్షత్రమును బట్టి ఆ రోగం ఎన్ని రోజులకు పోతుందనే లెక్కలు ఆయుర్వేద గ్రంథాలలో కనిపిస్తాయి.

       ఇప్పుడు మీకు మనిషి శరీరంలోని ఏయే అవయవాల పైన ఏయే గ్రహాల ప్రభావం ఉంటుందో ఇప్పుడు మీకు తెలియచేస్తాను.

 రవి -

   రక్తం, గుండె , పురుషుల కుడికన్ను , స్త్రీల ఎడమకన్ను.

 చంద్రుడు -

   స్తనములు, పాలు , గర్భాశయం, ప్రసవం, లింఫ్ గ్రంథులు, పురుషుల ఎడమ కన్ను, స్త్రీలకు కుడికన్ను , అండములు , కడుపు, ఆహారనాళం .

 కుజుడు -

    ఎముకలలోని మజ్జ, కండరములు, బాహ్య జననేంద్రియములు, మూత్రకృచ్చం .

 బుధుడు -

    మెదడు, శరీరంలోని నరాలు అన్ని బుధుడుకి సంబంధించినవి . చర్మము, నాలుక , వోకల్ కార్డు నరాలు , స్వరపేటిక, మాటలు , తెలివితేటలు .

 గురుడు -

     కాలేయం, గాల్ బ్లాడర్ , సంతానం దాని ఉత్పత్తికి సంబంధించిన భాగాలు , శరీరంలోని కొవ్వు, కఫం, తొడలు, మూత్రపిండాలు.

  శుక్రుడు -

     వీర్యము, లోపలి జననేంద్రియాలు , కామమునకు సంబంధించిన అన్ని అవయవములు, మూత్రపిండములు, శరీరంలోని గ్లూకోజ్ , పాంక్రీయాస్ , శరీరంలోని నీరు , రతిక్రియ , యోని లొపలి భాగములు .

  శని -

     ఎముకలు, చర్మం, విసర్జన కార్యము , మలము , గుదము , రెక్టమ్ , చెమట , గోళ్లు , శరీరం పైన గల వెంట్రుకలు , పెద్దప్రేగులు , వాతం .

         పైన చెప్పిన విధంగా ఆయా అవయవాల పైన ఆయా గ్రహాల ప్రభావం ఉంటుంది.  

  

శరీరంలో అతివేడిని తగ్గించుటకు సులభ యోగం -

శరీరంలో అతివేడిని తగ్గించుటకు సులభ యోగం - 

      రాత్రిసమయంలో ఒక మూడు కప్పుల అన్నమును ఒక గిన్నెలో వేసి ఆ అన్నము మునిగే విధముగా వేడిపాలు పోసి గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచం పెరుగు వేసి తోడుపెట్టాలి.ఉదయాన్నే తోడుకున్న ఆ అన్నము పెరుగుల మిశ్రమానికి బాగా నీరు కలిపి కొంచం ఉప్పు చేర్చుకొని ఎర్ర ఉల్లిగడ్డ చిన్నటి ముక్కలుగా కోసి కలుపుకుని తినవలెను . 

              ఇది తీసుకున్న గంటన్నర తరువాత 80ml అలోవెరా జ్యూస్ కి 160 ml నీరు కలిపి లొపలికి తీసికొనవలెను . మరలా సాయంత్రం 6 గంటల సమయంలో మరొకసారి తీసికొనవలెను. పైన చెప్పిన పెరుగుతో కూడిన అన్నం ఉదయం పూట మాత్రమే చాలు 

 గమనిక - 

    మసాలా పదార్థాలు , కారం , పులుపు , వంకాయ , గొంగూర , టీ , కాఫీ , మద్యం , సిగిరెట్, 
ఎండలో అతిగా తిరగడం , ఎక్కువ దూరం నడవడం , అతిగా శ్రమ చేయుట , పొగలు కక్కుతున్న వేడివేడి అన్నం భుజించటం , నువ్వులు , వెల్లుల్లి , మినుములు , అవిసె ఆకు , కొత్త నీరు , పులిసిన గంజి , వేడి నీరు , గో మూత్రము , తాంబూలం , పెరుగు , రేగిపళ్ళు , నూనె వేపుళ్లు , చింతపండు , కోడిమాంసం , చేదు , లవణ , ఆమ్ల రసాల గల పదార్దాలు నిషిద్దం .

  పైన చెప్పిన ఔషధ యోగాన్ని పాటిస్తూ పథ్యం చేసిన త్వరగా సమస్య నుంచి బయటపడతారు . ఈ ఆహార పథ్యం మీ శరీరంలో వేడి తగ్గేవరకు పాటించి ఆ తరువాత మోతాదులు తగ్గించి తీసుకోవలెను 

  

నాడి పరిజ్ఞానము - నాడిని పట్టుకొని రోగనిర్ణయం చేయుట .

నాడి పరిజ్ఞానము - నాడిని పట్టుకొని రోగనిర్ణయం చేయుట . 
 
 శుక్లశోణిత సంయోగముచే జనించిన దేహము నందు చర్మము , రక్తము , మాంసం కొవ్వు , ఎముకలు , నరములు గూడుకట్టుకుని ఉన్నవి. మరియు మానవశరీరం నందు 70 వేల నరములు ఉన్నవని శరీరశాస్త్రం తెలుపుతుంది. ఈ నరములు శరీరమున గల లక్షణములను తనచలనములు వలన నిరూపించుచున్నవి ఈ నరముల చలనములే నాడీపరిజ్ఞానముకు మూలాధారములు అయి ఉన్నవి.
     
శరీరమున గల నాడులు 5 నామములతో పిలవబడుచున్నవి . అవి 
   *  భూతనాడి .
   *  వాతనాడి .
   *  పిత్తనాడి .
   *  శ్లేష్మనాడి . 
   *  గురునాడి . 
       
       ఆహారవిహారాదుల యందు మానవుడు సరైన మార్గమము అనుసరించక పోవడం వలెనే రోగములు ఉద్భవించుచున్నవి. ఈ నాడుల మూలము వలనే రోగనిర్ధారణ చేయవచ్చు.
     
       ఏ రోగము నందు అయినను వాత,పిత్త,శ్లేష్మములు ప్రకోపించి రోగ హేతువులు అగుచున్నవి. రోగి యొక్క మణికట్టు నందు 3 అంగుళాల ప్రదేశము నందు నాడి చలించును. పురుషులకు కుడిచేతి మణికట్టు , ఆడవారికి ఎడమచేతి మణికట్టు నందు పరీక్షించవలెను. బొటనవ్రేలి నందు భూతనాడి , చూపుడువ్రేలు నందు వాతనాడి , మధ్యవ్రేలు నందు పిత్తనాడి , ఉంగరపు వ్రేలు నందు శ్లేష్మనాడి , చిటికిన వ్రేలు నందు గురునాడి చలించును. వాతపిత్తశ్లేష్మనాడులు యే రోగనిర్ణయముకు ఆధారభూతములు . వాతనాడి పామునడక వలే మెలికలుగా జలగ గమనము వలే సంచరించుచుండును. పిత్తనాడి నెమలి వలే హంసవలే చలించుచుండును. శ్లేష్మనాడి ఊరపిచ్చుక వలే , పావురమువలే ,కోడివలే నడుచుచుండును. వాతనాడికి బ్రహ్మయు , పిత్తనాడికి విష్ణువుయు , శ్లేష్మనాడికి పరమేశ్వరుడు అధి దేవతలు .
       
      ఒక్కోసారి రోగ లక్షణములును బట్టికూడా వైద్యం చేయవచ్చు . శరీరం నందు వేడిమి అధికం అయినకొలది చురుకుదనం అధికరించును .అదే శరీరం చల్లదనం అయినచో నాడి చురుకుదనం క్షీణించును. నాడి యొక్క గమనం అధికం అయ్యి వృద్ధినొందునచో గుండె యెక్క కార్యక్రమము చెడుపుచున్నది అని గ్రహించవలెను. ఇది చాలా అనుభవము నందు అలవడును . 

నాడి పరీక్షించు విధానం -
       
     వ్యాధిగ్రస్తుని చేతిని పట్టుకొని మెటికలు విరిచి బొటనవేలు ప్రక్కన , మణికట్టు దాటియున్న స్థలమున నాడి పరీక్షించవలెను. 
పురుషులకు కుడిచేతిని , స్త్రీలకు ఎడమచేతిని పరీక్షించవలెను. అందులో 3 నాడులు పలుకుచుండును. మొదటి నాడి వాతమును , రెండోవది పిత్తమును , మూడొవది శ్లేష్మమును తెలుపును. ఇందులో యేది ఎక్కువ ఉదృతముగా ఉన్నచో ఆ ధాతువు ఎక్కువ ఉన్నది అని తెలుసుకొనవలెను. 
 
వైద్యుడు గమనించవలసిన ముఖ్యవిధి  - 
 
   వైద్యుడు వ్యాధిగ్రస్తునకు మందు ఇచ్చుటకు పూర్వము అతని వయస్సు , వృత్తి , వ్యాధి ఎప్పటినుంచి ఉన్నది , శరీరతత్వము , మల,ముత్ర విసర్జన క్రమము , నాడి మొదలగు వాటిని చక్కగా తెలుసుకొని వయస్సును అనుసరించి మందు ఇవ్వవలెను. 
  

  

వివాహాల్లో రకాలు - అష్టవిధ వివాహాలు - సంపూర్ణ వివరణ. -

వివాహాల్లో రకాలు - అష్టవిధ వివాహాలు - సంపూర్ణ వివరణ. - 
 
* బ్రాహ్మము - 
     
మంచి గుణవంతుడు అయిన వరునకు వస్త్రాభరణాలు  ధరింప చేసి పూజించి  కన్యాదానం చేయుట వరదక్షిణం  అనవచ్చు.దక్షిణం ఇవ్వడం శాస్త్ర సాంప్రదాయం. తులసి దళం కుడా దక్షిణగా ఇవ్వొచ్చు.
 
 * దైవ వివాహం - 
  
  తన యజ్ఞయాగాదులను ప్రారంభం నుంచి పురోహితకర్తగా ఉన్న వానిని పూజించి కన్యాదానం చేయుట అంటే అతనిని దైవంగా భావించి ప్రీతి నోన్దించుట .
 
 * ఆర్షం - 
    
ధర్మార్ధం గా , గోమిదునం ను గ్రహించి దానికి బదులుగా కన్యాదానం చేయుట అంటే ఇదొక విధమైన కన్యాశుల్కం.అనబడు ఒలి అంటే బదులకు బదులు.
 
* ప్రాజాపత్యం - 
      
 నేను ఇంకొక ఆశ్రముముని స్వీకరించక గృహస్తామునే ఉండి గృహస్థ ధర్మములు నిర్వహిస్తాను అని వరునిచే ప్రమాణం చేయించి కన్యాదానం చేయుట . ఇది కాశి యాత్ర పేరున వివాహం లొ కలదు.ఎట్టి పరిస్థితులలో నేను నా భార్యను వదలను అని ప్రమాణం చేయుట .

 * రాక్షసం - 
     
 కన్య మొరపెట్టుకోనినను వినక బలవంతంగా ఎత్తుకోనిపోయి వివాహం ఆడుట . అయితే ఇది ఆరోజులలో బలాబలాల ప్రదర్శన పైన మేటి వీరునిగా అందరిని గెలిచి కన్యని తీసుకుని పోయి వివాహం ఆడుట .ఇది చొర పద్ధతి .
 
 * అసురం - 
        
 ఇదోరకం కన్యాశుల్కం.పిల్లకు,
కన్యదాతకు కొంత ముట్టజెప్పి వివాహం ఆడుట.దీనిని ఓలి మనువు అంటారు.
 
 * గాంధర్వం - 
      
 ప్రేమించి పెళ్లి చేసుకోవడం  .
 
* పైశాచికం - 
   
దీనిని "పిశాచ పీడ" అని అంటారు. నిద్రలోగాని , మైకములో గాని , తన శీల విషయంలో పరాకుగా ఉన్న కన్యను ఆకస్మికం గా మెరుపుదాడి చేసి సంబోగించి చేసుకోను వివాహమును, ఏదో మిషతో శీలం చేరిచి తిరిగి ఆమెనే వివాహం ఆడుట పైశాచిక వివాహం అనబడును.
 
అష్టవిద నాయకలు -
 
* ప్రోషిత భర్త - 
 
    భర్త పరదేశమునకు పోగా ఒంటరి అయి ఉండి పతి ఆగమమున నీరిక్షణ కలది.
 
* ఖండిత - 
 
ఇతర స్త్రీలతో కూడి వచ్చిన సంగతి తెలిసి భర్తని ద్వేషించునది. 
 
 * కలహంతరత - 
   
    భర్తను అవమానపరచి పరితాపం నోన్దునది.
 
 * విప్రలబ్ద -
    
ప్రియుని చూడదలచి సంకేతం తో ప్రియునికి రాయబారం పంపునది.
  
* వాసవ సజ్జిక - 
  
భర్త వచ్చుచున్నాడని సంతొషం తొ భర్త రాకకై శయ్యను అలంకరించు నాయక .
  
* స్వాధీన పతిక - 
    
భర్తను తన చెప్పుచేతుల్లో ఉంచుకోనునుది. గీచిన గీటు దాటని మగాడు కల ఆడది.
 
 * అభిసారిక -
  
బంగారు బొమ్మలా శృంగారించుకొని సంకేత స్థలమునకు వెళ్లు నాయక.
 
 * వరిహోత్కంటిక - 
      
ప్రియుడు ఎంతసేపటికి రాడని విరహాగ్ని చేత తపించ బడు నాయక.

 పెండ్లి అయ్యాక భార్య ఏ నాయకో గ్రహింప మర్మం ఇది.

 వివాహం - 
 
స్త్రీకి 18 నుంచి 21 సంవత్సరములకు మద్య , పురుషునకు 21 నుంచి 27 సంవత్సరముల మద్య వివాహానికి తగిన సమయం.వివాహం కన్యకు సమవర్ష ప్రాయం లొను, పురుషునకు విషమవర్శ ప్రాయం లొను వివాహం చేయవలెను .వివాహానికి లగ్నబలం ఎంతో ముఖ్యమైనది. లగ్నం సాద్యమైనంత వరకు బలం, శుద్ధమైనధి, దొషం లేకుండా ఉండాలి. శాస్త్రం చెప్పిన 21 దోషాలలో సాధ్యమైనవి వదిలేసి శుభలగ్నం పెట్టాలి .

 వివాహానికి శుభమైన వారములు. - 
 
 సొమ, గురు, శుక్ర వారములు శ్రేష్టమైనవి.ఆది, మంగళ , శని వారములు అశుభములు. జన్మ కుండలిలో రవి, శని, కుజులు వివాహా కారకులు.అయినను ఆది, మంగళ , శని వారములలొ జరపవచ్చు. బుద, గురు, శుక్ర వారములు శుబధాయకం . ఆది, శని వారములు మధ్యమం, మంగళవారం దుఖప్రధం. సోమవారం వధువుకు సవితి కలుగజేయును. పునర్వివాహం వరునికి కలగాజేయును.
 
వివాహానికి తిధులు - 

 అష్టమి, షష్టి , అమావాస్య, తిదులు తప్ప మిగిలిన అన్ని తిధులు స్వీకరించవచ్చు.అందులొ శుక్ల తిధులు శ్రేష్టమైనవి.

 వివాహానికి సరైన నక్షత్రాలు. - 
 అందరి చేత సమ్మతించబడిన శుభ నక్షత్రాలు  రోహిణి , మృగశిర, మఖ, ఉత్తర, హస్త, స్వాతి , మూల , అనురాధ, రేవతి . మధ్యమం అయిన నక్షత్రాలు అశ్విని, చిత్త, ధనిష్ఠ, శ్రవణం,ఉత్తరాబాద్ర,లలొ కొన్ని నక్షత్రాలు స్వీకరించవచ్చు. రోహిణి , పునర్వసు , హస్త, జైష్ట , శ్రావణం, రేవతి నక్షత్రాలను కారకత్వాన్ని బట్టి ఎక్కువ శుభామైనవి గా భావించాలి. ముఖ్యం గా నక్షత్రం నందు పాపగ్రహ సంచారం గాని , పాపగ్రహ దృష్టి గాని ఉండరాదు. జన్మ నక్షత్రమునకు 10 వ నక్షత్రములో మరియు జన్మ నక్షత్రములొ వివాహం చేయరాదు .

 వివాహ యోగములు - 
 వ్యరిపాత, వైద్రుతి యోగాములను పూర్తి గాను , పరి యోగములకు మొదటి సగాబాగమును , వివాహమునకు పూర్తిగా వర్జించవలెను . మిగిలిన వాటిలో శుభయోగములను తీసుకొనుట ఉత్తమము.

 వివాహ కరణములు -

 వివాహమునకు అన్ని శుభ కరణములు స్వీకరించ వచ్చు. విష్టి కరణమును పూర్తిగా వదిలివేయవలెను.

 వివాహ లగ్నం -
  
వివాహ లగ్నం చాలా బలం గా ఉండాలి. వివాహ లగ్నం బలం గా ఉంటే ఆ జంట ఎటువంటి మనోవ్యాధి పీడితులు కాకుండా విడదీయలేని బంధం గా ఉంటారు. వివాహం చేయుటకు ఉత్తరాయణ కాలం చాలా ఉత్తమం అయినది.పెల్లికుమారుని కంటే పెళ్లి కూతురు మంచి జాతకురాలు అయ్యి, మంచి సాముద్రికా లక్షణాలు కలిగి ఉంటే దన, పుత్ర వంతురాలు అవుతుంది. మిధున, కర్కాటక, సింహ, కన్య , తుల, ధనుస్సు,కుంభ లగ్నాలు మంచివి.మిక్కిలి శ్రేష్టమైనవి. రవి కర్కాటక , కన్యా రాశులలో ఉన్నప్పుడు ఈ రాశులను వివాహ లగ్నాలుగా స్వీకరించ రాదు.
 
వివాహనికి మాసములు - 

 వైశాఖం, జైష్టం, మాగం , ఫాల్గుణం, మాసాలు వివాహానికి శ్రేష్టమైనవి . సుర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలం లొ ఉన్నప్పుడు వచ్చే మాసాలు శ్రేష్టమైనవి.మార్గశిరం మధ్యమం, ఆషాడ , కార్తీకాలు నిన్ధ్యములు. మేష , చైత్రములు కూడా ప్రశస్తం .
    
  

తెలుగు రాష్ట్రంలోనే న‌వ‌గ్రహ సంబంధిత క్షేత్రాలు..

తెలుగు రాష్ట్రంలోనే న‌వ‌గ్రహ సంబంధిత క్షేత్రాలు............!!
న‌వ‌గ్రహ సంబంధిత క్షేత్రాలను సందర్శించాలనుకునే వారు రాష్ట్రఎల్లలు దాటిపోవాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలోనే చాలా క్షేత్రాలలో నవగ్రహ పూజలు చేసుకోవచ్చు. 
అలాంటివి మన రాష్ట్రంలోనే చాలా జిల్లాలలో ఉన్నాయి. 

1. సూర్యుడు..!
1.అరసవెల్లి సూర్యనారాయ‌ణ స్వామి!
(శ్రీకాకుళం)
2. పెద్దాపురం సూర్యనారాయ‌ణ స్వామి!
(తూర్పుగోదావ‌రి)
3. గొల్లల‌మామిడాడ సూర్యనాయ‌ణ స్వామి!
(తూర్పు గోదావరి)
4. నందికొట్టూరు సూర్యనారాయ‌ణ స్వామి!
(కర్నూలు)

2. చంద్రుడు..!
1. గునుగుపూడిలో సోమేశ్వరస్వామి! (భీమ‌వ‌రం).
(ప‌శ్చిమ గోదావ‌రి ) 
2. కోటిప‌ల్లి సోమేశ్వరస్వామి!
(తూర్పుగోదావ‌రి) 
3. విజ‌య‌వాడ‌లో క‌న‌క‌దుర్గాదేవి!
పెద్దక‌ళ్ళే ప‌ల్లెలో దుర్గాదేవి!
 (కృష్ణా జిల్లా)
4. జొన్నవాడ కామాక్షిత‌యారు అమ్మవారు!
(నెల్లూరు)

3. అంగార‌కుడు (కుజుడు)..!
1. మోపిదేవి సుబ్రమ‌ణ్యస్వామి! మ‌రియు చోడ‌వ‌రం
(కృష్ణా జిల్లా)
2.బిక్కవోలు సుబ్రమ‌ణ్యస్వామి!మ‌రియు పెద్దాపురం
(తూర్పుగోదావ‌రి)
3.పెద్ద నందిపాడు, నాగులపాడు పుట్ట, పెద్దకూర‌పాడు పుట్ట, మంగ‌ళ‌గిరి సుబ్రమ‌ణ్య స్వామి, పొన్నూరు.
(గుంటూరు)
కుజ దోష నివారణకు యాదగిరి, ధర్మపురిలాంటి నృసింహ క్షేత్రదర్శనం కూడా మంచి ఫలితం ఇస్తుంది.

4. బుధుడు..!
1. ద్వార‌కా తిరుమ‌ల‌!
(ప‌శ్చిమ గోదావ‌రి) 
2. ర్యాలీ, అన్నవ‌రం, పిఠాపురం కుంతీమాధ‌వ స్వామి!
(తూర్పుగోదావ‌రి)
3.శ్రీకాకుళంలో ఆంధ్రా మ‌హావిష్ణువు.
4.తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వర స్వామి!
(చిత్తూరు)

5. బృహ‌స్పతి (గురువు)..!
1. చేబ్రోలు బ్రహ్మ దేవుడు.
(గుంటూరు)
2. అలంపురంలో బ్రహ్మదేవుడు.
(మ‌హ‌బూబ్ న‌గ‌ర్ )
3.కోటిప‌ల్లిలో కోటిలింగేశ్వర స్వామి!
మంద‌ప‌ల్లిలో బ్రహే్శ్వర స్వామి!
(తూర్పుగోదావ‌రి) 
4. అమ‌రావ‌తిలో అమ‌ర‌లింగేశ్వర స్వామి! కోట‌ప్పకొండ త్రికూటేశ్వర స్వామి!
(గుంటూరు)

6. శుక్రుడు..!
1. విశాఖ ప‌ట్టణం క‌న‌క‌మ‌హాల‌క్ష్మి, 
సింహాచ‌లం ల‌క్ష్మీ దేవి.
(విశాఖ)
2. అలిమేలు మంగాపురం, ప‌ద్మావ‌తీదేవి!
(చిత్తూరు)
3. పెంచ‌ల‌కోన ఆదిల‌క్ష్మీదేవి!
(నెల్లూరు)

7. శ‌ని..!
1. మంద‌ప‌ల్లెలో మందేశ్వర స్వామి!
(తూర్పుగోదావ‌రి)
2. హిందుపురం తాలూకా పావ‌గ‌డ‌లోని శ‌నిమ‌హాత్ముడు!
(అనంత‌పురం)
3. విజ‌యవాడ‌లోని కృష్ణన‌ది తీరాన జ్యేష్ణదేవి స‌హిత శ‌నైశ్చర్య స్వామి!
(కృష్ణా జిల్లా) 
4. న‌ర్శింగోలు (సింగ‌రాయ కొండ వ‌ద్ద) శ‌నీశ్వర స్వామి!
(ప్రకాశం)

8. రాహువు, 9. కేతువు..!
1. శ్రీ కాళ‌హ‌స్తి!
(చిత్తూరు)
2. మంద‌మ‌ల్లి నాగేశ్వర స్వామి!
(తూర్పుగోదావ‌రి)
3. విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గాదేవి!
(కృష్ణా జిల్లా)
4. సంప‌త్ వినాయ‌క స్వామి!
(విశాఖ) 
5. అమ‌రావ‌తి వినాయ‌క‌స్వామి, 
తెనాలి వైకుంఠ‌పురం పుట్ట.
(గుంటూరు)

వడదెబ్బ నివారణా యోగాలు -

వడదెబ్బ నివారణా యోగాలు -

 * ఉల్లిపాయ రసమును వంటికి పట్టించిన వడదెబ్బ నివారణ అగును.

 * వేసవి ఎండలో నడవవలసి వచ్చినపుడు ఒక ఉల్లిపాయ టోపిలో గాని రుమాలులో గాని నడినెత్తిన పెట్టి కట్టుకొని నడిచిన వడదెబ్బ తగలదు.

 * నీరుల్లిపాయ రసం రెండు కణతలకు , గుండె ప్రదేశములో పూసిన వడదెబ్బ తగలడం వలన కలిగిన బాధలు తగ్గును.

 * వడదెబ్బ తగిలిన ముఖము పైన , శరీరము పైన నీళ్లు చల్లుతూ తలపైన మంచుగడ్డలు ఉంచి తాగుటకు నిమ్మరసంలో ఉప్పు కలిపి ఇవ్వవలెను.

 * కుమ్మున ఉడికించిన మామిడికాయ రసములో ఉప్పు , జీలకర్ర కలిపి భోజనం నందు తాగుచుండిన వడదెబ్బ తగలదు.

 * విశ్రాంతిగా పడుకోనిచ్చి ఆ తరువాత కాఫీ ఇచ్చిన వడదెబ్బ నుంచి తేరుకొందురు.

 * 48 గ్రాముల చన్నీటిలో ఒక తులము తేనె కలిపి ఇచ్చిన వడదెబ్బ నివారణ అగును.

 * వడగళ్ళు పడినపుడు ఆ ఐస్ గడ్డలను ఏరి విభూతిలో వేసి నిలువ ఉంచి జాగ్రత్తగా దాచి ఆ విభూతిని మూడువేళ్ళకు వచ్చినంత తీసుకుని మంచినీటిలో వేసి వడదెబ్బ తగిలిన వారికి ఇచ్చిన వడదెబ్బ నివారణ అగును.

 * తరువాణి తేటలో ఉప్పును చేర్చి ఇవ్వవలెను.

 * తాటిముంజలు పంచదారతో కలిపి తినిపించవలెను.

 * నాలుకకు పాత ఉశిరిక పచ్చడి రాసి పుల్లని ఆవుమజ్జిగ లో ఉప్పువేసి అన్నంలో పోసి పిసికి పిప్పిని పారవేసి ఆ రసమును తాగించవలెను .

 * చన్నీటితో స్నానం చేయించవలెను .

 * వేడివేడి పలచటి గంజిలో ఉప్పు వేసి తాగించవలెను .

        వడదెబ్బ తగిలినప్పుడు పైన చెప్పిన యోగాలలో మీకు వీలైనవి పాటించి సమస్య నుంచి బయటపడండి . ప్రస్తుత పరిస్థితుల్లో ఎండలు చాలా ఎక్కువ అవుతున్నాయి. వీలున్నంతవరకు బయటకి పోకుండా ఉండటం మంచిది . వెళ్ళవలసి వస్తే పైన చెప్పిన యోగాలు పాటిస్తూ జగ్రత్త వహించండి.

  
 

మూత్ర కృచ్చ వ్యాధి - కారణాలు - నివారణ .

మూత్ర కృచ్చ వ్యాధి - కారణాలు - నివారణ .

మూత్రం అతికష్టంగా బయటకి రావడమే మూత్రకృచ్చ వ్యాధి అంటారు. మూత్రం సాఫీగా ధారాళంగా బయటకి రాకుండా అగిఆగి కొద్దికొద్దిగా అది కూడా చాలా కష్టంగా వస్తుంది .

కారణాలు -

ముత్ర ద్వారంలో కొన్ని రకాల వాయువులు బిగబట్టడం లేదా ఏవైనా వ్యర్ధపదార్ధాలు అడ్డుపడటం వలన మూత్రం కష్టంగా వెలువడుతుంది. దీనికి ప్రధాన కారణం మన ఆహారపు అలవాట్లు . మనశరీరానికి విరుద్ధమైన ఆహారం సేవించడం వలన శరీరంలో ఎల్లప్పుడూ సమానంగా ఉండవలసిన వాత,పిత్త,కఫ దోషాలు చెడిపోయి అసమానమై ఈ మూడు దోషాలు విడివిడిగా కాని , ఏ రెండు కలిసి అయినా కాని లేక మూడు ఒకేసారి ప్రకోపించి మూత్రాశయంలో ను , మూత్రపిండాలలోను చేరి మూత్రప్రసరణకి ఆటంకం కలిగించడం వలన "మూత్రకృచ్చం " అనే వ్యాధి సంభవిస్తుంది.

నివారణ -

చిన్న ఏలకులు , కొండపిండి చెట్టు సమూలం , కర్పూర శిలాజిత్తు , పిప్పిళ్లు వీటిని సమభాగాలుగా దంచి చూర్ణం కొట్టి పూటకు 6 గ్రాముల మోతాదుగా బియ్యం కడిగిన నీటితో కలిపి రెండు పూటలా తాగిస్తూ ఉంటే మూత్రం బిగించడం వలన మృత్యుముఖానికి చేరిన రోగులకు కూడా మూత్రం ధారళంగా వెలువడి జీవించగలరు .

నా అనుభవ యోగం -

మూత్రం బిగించి క్షణక్షణంకి కడుపు ఉబ్బుతున్న ఒకరికి తమలపాకు కి ఆముదం పూసి క్యాండిల్ కి దగ్గరగా తమలపాకు పెట్టి వేడి చూపించి పొత్తి కడుపు భాగంపై వేశాను . 10 నిమిషాలలో మూత్రం ధారళంగా వెలువడినది.


కుంకుమ పువ్వు - సంపూర్ణ వివరణ - ఔషధోపయోగాలు .

కుంకుమ పువ్వు - సంపూర్ణ వివరణ - ఔషధోపయోగాలు .

కుంకుమ పువ్వుని సంస్కృతము నందు కాశ్మీరజము , కుంకుమము , బాహ్లీకము , శోణితము , సంకోచము , పీతనకము అనే పేర్లతో పిలుస్తారు . భావప్రకాశము అనే ప్రాచీన ఆయుర్వేద గ్రంథము నందు కుంకుమపువ్వు యొక్క నాణ్యత మరియు ఔషధగుణములు ఆయా దేశ వాతావరణ పరిస్థితుల పై ఆధారపడి ఉంటుంది అని తెలియచేయబడినది. వానిలో కాశ్మీర దేశము నందు పుట్టెడు కుంకుమపువ్వు చిన్నచిన్న కేశరములు కలిగి కొంచం అంత ఎరుపురంగుతో కూడుకుని కమలం వంటి పరిమళము కలిగి ఉండును అనియు ఇదే అత్యంత శ్రేష్టం అని రాయబడినది.

ద్రవ్యకోశము అనే వైద్యగ్రంధము నందు లేత ఎరుపురంగుతో , మంచి పరిమళముతో , చేతితో నలిపిన చేతికి అంటుకొని రంగువీడక యున్నచో అట్టి కుంకుమ పువ్వు శ్రేష్టం అయినది అనియు , బాగా ఎరుపు రంగుతో ఉండి నోటియందు వేసుకొనిన మిక్కిలి చేదుగా , పసుపుపచ్చ రంగుతో ఉన్నచో అట్టి కుంకుమపువ్వు తక్కువరకము అని తెలుసుకొనవలెను .

కుంకుమపువ్వు సాధారణముగా కొంచం చేదు కలిగి ఉండి నాలుకకు తిమ్మిరి కలిగించునదిగా మెత్తగా ఉండును. ఇది జిగటగా ఉండును. కొంతమంది ఈ కుంకుమపువ్వుని చందనంతో అరగదీసి పైపూతగా వాడుదురు . మరికొంతమంది తాంబూలముతో లోపలికి సేవించెదరు. శరీరం నందు వేడిని పుట్టించి వీర్యవృద్ధిని , కాంతిని , బలము , ఆయుర్వృద్దిని కలిగించి విషము , శోష , మదప్రకోపము , నేత్రవ్యాదులు , శిరోవ్యాధులు , గొంతుజబ్బులు , శరీరము నందలి మచ్చలు , దురదలు , కుష్టు , చిడుము , గజ్జి మున్నగు చర్మరోగములు , రసదోషములు , మేధోరోగములు మొదలైనవానిని హరించును . రక్తశుద్ది కలిగించి శరీర దుర్బలత్వము హరించును . గడ్డలను కరిగించును . చర్మరోగములు మాన్పును . కస్తూరి వలే ఏ ఔషధమునకు అయినను అనుపానంగా ఇచ్చిన ఔషధం త్వరగా పనిచేయును . టైఫాయిడు జ్వరము , ఉన్మాదరోగము , అపస్మారము , ప్రసవించు సమయంలో సంభవించు వాతరోగములు , ఋతురక్తబద్ధం , సమస్త నేత్రరోగములు ( కంటి పైన పట్టు వేయవలెను ) , ఓడలలో ప్రయాణము చేయువారికి వచ్చు జబ్బులు , మనోచాంచల్యములు పోగొట్టును .

గమనిక -

మితిమీరిన మోతాదులో తీసుకున్నచో రక్తము విరిచి అమితమగు వేడి పుట్టించి దౌర్బల్యము కలిగించును. కొన్నిసార్లు స్త్రీల గర్భకోశము పాడుచేయును . కుంకుమపువ్వు పుచ్చుకోదగిన ప్రమాణము 5 మొదలు 15 గోధుమగింజల ఎత్తు మాత్రమే .



విషములు వాని లక్షణములు -

విషములు వాని లక్షణములు - 

 మహా విష సర్పములు - 

 శ్మశానము , రచ్చ చావిళ్ళు, పాడుబడిన యజ్ఞ స్థానములు, పాడుబడిన ఇండ్లు, నాలుగు దోవలు కలిసిన తావు, నీళ్ల గట్టు, పాడు తోటలు, మాణి తొర్రలు, పాలమాను, వేపచెట్టు, సెలయేళ్ళు, గుహలు, వీనియందు ఉండు సర్పములు , జడలు ధరించిన సర్పములు , చత్రరేఖలు, మత్స్యరేఖలు, కుంభ రేఖలు , త్రిశుల రేఖలు , గల సర్పములు , ఎర్ర ముఖము , ఎర్ర కన్నులు గల సర్పములు కరచిన యెడల వీనికి కాల నియమం లేదు . విషము ఎక్కుటకు క్రమము లేదు . ఈ విషమును తిప్పుటకు మంత్ర ఔషదములు లేవు . ఒకవేళ బలి, నమస్కార , జప, శాంతి, మంత్ర ఔషధుల చేత ఎవడన్నా బ్రతికినా రూపము చెడును. అంగవైకల్యం కలుగును.

 స్థాన విధి దోషము - 

 శ్మశానము, రచ్చ మాకులు వీని యందు పంచమి, పక్ష సంధులు, అష్టమి, నవమి, సంధ్యలు, అర్ధరాత్రి ఈ కాలముల యందు ఎట్టి పాము కరిచినను విషం ఎక్కును.

 నక్షత్ర దోషము - 

 భరణి, కృత్తిక, ఆశ్లేష, విశాఖ, పుబ్బ, పుర్వాబాద్ర, పుర్వాషాడ , మఖ, శతబిషం , నైర్రుత ముహూర్తం , పర్వములు వీని యందు పాము గరిచిన యెడల మనుష్యుడు జీవించుట దుర్లభం .

 విష సాధ్య లక్షణములు - 

  పాము కరిచిన వానికి తలవెంట్రుకలు రాలుట , మూర్చ, శ్వాసము, వెక్కిళ్ళు, దగ్గు , వాంతి , రొమ్ము బరువు, వణుకు, వికారము , వేదన, కన్నులు ఎరుపు ఎక్కుట , గొంతు పట్టుట, పండ్లు నేరేడు పండ్లు వలే నల్లనగుట, నవ రంధ్రముల నుండి రక్తము కనిపించుట, నోట నురుగు వచ్చుట, కాళ్ళు, చేతులు నల్లగా అగుట ఈ లక్షణాలు కనిపించిన ఆ మనుష్యుడు బ్రతకడు. 

 తేలు విషము - 

  సర్ప శరీరములు మురగిన యెడల తేళ్ళు జనించును.మరియు పేడ లొను , శ్మశాన దగ్ధ స్థలముల యందు బుట్టును. వీని విశములు మంత్ర ఔషధములకు సాద్యం కాదు. అవి తెలుపు,ఎరుపు,నలుపు వర్ణములు కలిగియుండును. వీని విషం ఎక్కినవానికి నాలుక మంధమేక్కును , మిక్కిలి నొప్పి , ముక్కున నెత్తురు వచ్చుట, శరీరం చెమర్చుట, మూర్చ, నోరెండుట కలుగును. 

 గర విష లక్షణము - 

 స్త్రీలు పురుషులను వశపరుచుకోనుటకు , అట్లే పురుషులు , స్త్రీలను వశపరుచుకోనుటకు నానా జంతువుల బస్మ, మల, మూత్రాదులు, ఔషధములను , అల్ప వీర్యములు గల విషములు మొదలగు వానితో కుడా చేర్చి అన్నపాన తాంబూలం, మద్యపానం తో నోసంగేదరు. దీనినే గర విషము , పెట్టుడు మందు అనికూడా అంటారు. 

 పెట్టుడు మందు లక్షణము - 

 ముఖము తెల్లగా అగుట,ఓడలు చిక్కుట, అగ్నిమాంద్యము, దగ్గు , ఉబ్బసము , వాత ప్రకోపము, మహోదరము, గుండెలలో నొప్పి , బలహీనత, హీన స్వరము, మోహము, కడుపు ఉబ్బారము, నిద్ర యందు భ్రమ. స్వప్నం నందు నక్క,పిల్లి, ముంగీస, పాము , కోతి, ఎండిన గుంటలు, కాలిన మానులు , వీనిని చూచుట, తన దేహము నానా వర్ణములు గా కనిపించుట, ముక్కు విరిగినట్టుగా ఉండుట, కన్నులు గుంటలు పడుట ఈ లక్షణములు పెట్టుడు మందు వలన కలుగును. ఇవి కనిపించిన వెంటనే చికిత్స చేసిన బ్రతుకును. లేనిచో మరణం తప్పదు. 

 విషాన్న లక్షణము - 

 విషముతో కూడిన అన్నము తేలికగా నుండక దట్టముగా ఉండును.చిరకాలమునకు పక్వమగును. పక్వమైన అన్నము చద్ది అన్నము వలే ఉండును. అన్నం ఉడుకుతున్నప్పుడు దాని మీద ఆవిరి నెమలి కంట మ్ రంగు వలే ఉండును. ఆ అన్నం చూసినప్పుడు మొహము, మూర్చ , నోట నీళ్ళను కనిపించును. వర్ణము, వాసనయు హీనమగును. ఆవిరి యందు తళుకులు కలిగి ఉండును. 

 విషము కలిపిన కూరలు - 

 విషముతో కలిసిన కూరలు ఎండి నట్టు ఉండును. కాషాయ వర్ణం కలిగి రుచిహీనమై వేరొక వికారm చెందును. ఆ కూరల పైన నురుగు వలెను , సీమంత రేకల వలెను , బుగ్గల వలెను కనపడును. ఇలా ఉండిన కూరల యందు విషం కలిసినట్టు . 

 విషాన్న పరీక్ష - 

  విషముతో కూడిన అన్నమును అగ్నిలో వేసిన జ్వాల పుట్టాక ఉండును. పొగ , దుర్గంధం పుట్టును. ఆ అన్నం మీద ఈగలు వాలిన చచ్చును. కాకి చూచినా హీన స్వరముగా కూయును . నెమలికి మంద దృష్టి కలుగును . చిలుకలు, గోరువంకలు చూచిన మిక్కిలి కూయును . కొతి మలం జార్చుకోనును. కావుణ బుద్ధిమంతుడు అయిన వాడు పరీక్షించి తినవలెను. 

        

పురాతన శరీర విజ్ఞాన పరీక్ష - శస్త్ర చికిత్స .

పురాతన శరీర విజ్ఞాన పరీక్ష - శస్త్ర చికిత్స .

భారతీయ పురాతన ఆయుర్వేద నిపుణులు , మహర్షులు మానవ శరీర నిర్మాణమును తెలుసుకొనుటకు వారి వారి ఆశ్రమాలలో శవాలను తీసుకొచ్చి వాటిని కోసి పుర్తిగా పరీక్షించే వారు .
 సుశ్రుతములో శరీర పరీక్ష గురించి కొంత వివరణ ఇవ్వబడింది. ఇప్పుడు దాని గురించి మీకు తెలియజేస్తాను. మొదట శరీర స్థానం నందు పూర్తి పరిజ్ఞానం తెలుసుకొవలెను. అటు మనిషుని యెక్క శరీరమును "ద్రుష్ట కర్మం" ( Dissection) కు సిద్దం చేసి ప్రతి అవయవ భాగం ను ప్రత్యక్షం గా పరీక్షించ వలెను.

     పరీక్షార్ధం నిర్దిష్టమైన మృత కళేబరం తీసుకొనవలెను. వ్రుద్దునిది, ధీర్గకాల రోగ పీడితునది , విషాదుల చేత మృతి నొందినది కాక సర్వాయవ స్పూర్తి నొందినది కలిగి ఉండవలెను. ముందు మృత కళేబరం నందు ఉండు వ్యర్ధములను " వస్థి కర్మం " ( enema) చేత బయటకి వెడలించి శోధనం చేయవలెను . పిదప ముంజ గడ్డి , దర్భ, నార మొదలగు వాని చేత అన్ని అవయవములను బాగుగా కట్టి చేపలు మొదలగు నీటి జంతువులు తినకుండా ప్రవాహం నందు కొట్టుకొని పోకుండా పంజరస్థం గావించి నిలువయున్న నీటిలో వాగునందు కుళ్లే విదంగా ఉంచవలెను. అలా 7 దినములు నీటిలో ఉంచవలెను. 7 దినములు అయిన తరువాత బాగుగా కుళ్ళిన శరీరమును పైకి దీసి దర్భ, గడ్డి వీని వేళ్ళతో చేసిన కుంచెను గాని , వెదురు కుంచెతో గాని చర్మం , మాంస కండరములు , సిరలు , నరములు , ధమనులు, ఆంత్రము ( Intestines) , యక్రుత్తు ( Liver) , ప్లీహము (spleen) , హృదయము (Heart) , వ్రుక్కములు ( kidneys) , పుప్పుసము ( Lungs) , క్లోమము ( pancreas) మొదలగు అవయవములును , అస్తులు (Bones) ,అస్థి సంధులు (Joints) . మొదలగు చర్మ బాహ్య,అంతర అవయవాలను విభజించి బాగుగా పరీక్షించ వలెను.ఈ రీతి శరీర శాస్త్రమును చక్కగా అభ్యసించవలెను .

* శరీర పరీక్ష నేర్చుకునే విధానము.-
 
     పలుమార్లు శిష్యునకు శవ పరీక్షా విదానం చేసే విదానం చూపించిన తరువాత శిష్యుని చేత స్వయంగా పరీక్ష చేయించవలెను.

* చేదన కర్మం -
 సోరపుచ్చ, నూగు దోస , బుడమ, పెద్ద దోస , మొదలగు కాయలను కోసి చూపవలెను .అదే విదంగా ఉత్కర్థానము (పైకి కోయుట ), పరికర్థనము (ధిగువకు కొయుట ).మొదలుగునవి కుడా బోధిం పవలెను .

* బేధ్య కర్మం -
 
    నీరు నింపిన తిత్తులు గాని , మృతి చెందిన జంతువుల మూత్ర కోశములు గాని , జిగురు వస్తువులలో , లేక పలుచనైన బురదతో నింపిన తోలుతిత్తులను గాని చీల్చి చూపవలెను .
* లేఖ్య కర్మం -
 
   రోమయుక్తమగు చర్మమును పైన , లొపల బేదములు ను చూపవలెను .

* వేద్య కర్మం -
 మృత జంతువులు యెక్క సిరలును కలువ కాడలును , మొదలగువానిని వేధించి చూపవలెను . ఇయ్యది కేవలం జలోదరం, మూత్ర వృద్ది మొదలగు వాని యందు ఉపయోగించవచ్చు .

* ఏష్య కర్మం -
 
  పురుగు తినిపోయిన బెజ్జములు గల కొయ్య కర్రల యందు , వెదురు గోట్టములు , తుటి కాడలు, తామర కాడలు, ఎండిపొయిన సొరకాయలు, మొదలగు వానిని ముఖ ములములందు చేయవలసిన శస్త్ర చికిత్సకు ఉదాహరణగా చూపించ వచ్చు. దీనిని ఏషిని అను శలాకమ్ ఉపయొగించి నేర్పించవలెను .

* ఆహార కర్మం -
 
పనస, మారేడు, దొండ, మొదలగు ఫలముల నుండి గింజలు బయటకు తీయు విద్యను అభ్యసించవలెను. ఈ విదానం నోటిలోని దంతము లను ఉడ దీయుటకు ఉపయొగించ వలెను.

* విశ్రావ్య కర్మం -
 విశ్రావ్య కర్మను శాల్మలి ఫలకం నందు మైనం పూసి ప్రతిమలు చేసీ ఆయా ప్రదేశం నందు చీము మొదలగు వానిని స్రవింప జేయవలెను .

* సీస కర్మం -
 మృదువగు వస్త్రములును చర్మం మొదలగు వాని ఎందు యుంచి కుట్టి సేవన కర్మం చేయవలెను .

స్థల బేధమున శస్త్ర ఉపయోగ బేదములు -
 
   కనుబొమ్మ, కణత , నొసలు, గండ భాగము, కనురెప్ప, క్రింద పెదవి, పంటి చిగురు, చంక, కటి, బోడ్డు , గజ్జ, వీని యందు దిర్యక్చేధనం చేయవలెను .అరిచేయి , అరికాలు, వీనీ యందు జంద్ర మండలాక్రుతి గా ( గుండ్రముగా ) కోయవలెను. గుదము, మేడ్రము వీని యందు అర్థ చంద్రాక్రుతిలో కొయవలెను లేనిచో సిరలు (venis) , ధమనులు తెగిపోయి మిగుల బాధను కలిగించును. అలగే మానుట చాలా కష్టం. అలానే ఉంటే ఆ గాయం గ్రందిలా తయారగును. కనుక జాగ్రత్త వహించవలెను.

 శస్త్ర చికిత్స చేయు విదానం -

    శస్త్ర చికిత్స చేయుటకు పూర్వం రోగి కి చాలా తక్కువ ఆహారం ఇవ్వవలెను. శస్త్ర చికిత్స బాధలు తెలియకుండా ఉండుటకు బాగా మత్తుగా ఉండు మధ్యములను త్రాగిపించవలెను . శస్త్ర చికిత్స ముందు భుజించడం మూలాన "మూర్చ " మొదలగునవి కలవు. మద్య ద్రవ్యములను ఉపయోగించుట చేత బాద తెలియకుండును.

శస్త్ర చికిత్సకు కావలిసిన వస్తువులు.-

• శస్త్రములు - ( Inustruments , Lancet etc .)
• యంత్రములు - ( surgical అప్ప్లైంచెస్)
• క్షారము - ( Alkali) .
• అగ్ని - ( Fire for cauterisation) .
• జలూక - ( Leeches) .
• శలాక - ( Probe or direetor ).
• జాంబ వోష్ణము -( CavtersingInusruments) .
• పిచువు - (Cotton) .
• ప్లోతము - ( Lint) .
• సూత్రము - (Thread) .
• పట్టము - ( Tow ).
• తేనే - ( Honey) .
• నెయ్యి - ( Ghee) .
• కొవ్వు.
• పాలు.
• నూనే .
• తర్పణం - ( powederd wheat soaked inwater ) .
• కషాయం - ( Decoctions) .
• అలేపము - ( Medicated Plasters) .
• కల్కము - ( Paste) .
• చన్నీళ్ళు.
• వేడి నీళ్ళు .
• కవలిక - ( Splints) .
• వెదురు వేళ్ళు - ( Skin of Bamboos ).
• స్పటికం - ( Lens) .
• కురువింద రాళ్ళు .
• అయస్కాన్థములు .
• గాజు తునకలు.
• టేకు ఆకులు. మరియు మత్తు కలగ చేయు పదార్దం
   
     పైన చెప్పిన విధముగా రకరకాల పరికరాలు ఉపయోగించి అత్యంత నైపుణ్యతతో మన పూర్వికులు శస్త్రచికిత్సలు చేసెడివారు .  


భారతదేశపు పురాతన విద్య - రసవాద విద్య .

భారతదేశపు పురాతన విద్య - రసవాద విద్య .

. మన ప్రాచీన భారతీయుల విఙ్ఞానం అమోఘమైనది . వారు పరిశోధించి కనుగొనిన అనేక అంశాలు అత్యంత రహస్యంగా నిక్షిప్తం చేసి ఉంచారు . మన భారతీయ వేదాలలో ఎంతో విజ్ఞానం నిక్షిప్తం అయ్యి ఉంది. కాని మనం దానిని పట్టించుకోకుండా పాశ్చాత్త్యా సంప్రదాయాల మోజులో పడిపోయి మన పూర్వీకుల విజ్ఞానాన్ని మనం పట్టించుకోవడం లేదు . తాళపత్రాలలో మరియు మన పురాతన గ్రంథాలలో నిక్షిప్తం అయిన అద్బుత విజ్ఞానాన్ని వారు తమ తమ పరిశోధనలలో ఉపయోగించుకుంటున్నారు. మనం పోగొట్టుకున్న ఒక అద్భుత రహస్య విద్య గురించి ఇప్పుడు మీకు వివరిస్తాను.
 
. మనం పోగుట్టుకున్న , మరిచిపోయిన ఆ రహస్య విద్య పేరే "రసవాద విద్య" ఈ విద్య గురించి వివరించాలంటే చాలా పెద్ద చరిత్ర ఉంది. ఈ విద్యలో ముఖ్యంగా చెట్ల రసాలు , పాదరసం వంటి లోహాలు ఉపయోగించి "బంగారం " తయారుచేయుట . రహస్యంగా ఉండిపోయిన ఈ విద్య గురించి కొంత సమాచారమును నేను సేకరించాను . కొన్ని పురాతన గ్రంథాలను కూడా నేను ఈ విద్య గురించి తెలుసుకోవడానికి చదవడం జరిగింది. ఇప్పుడు మీకు ఆ విశేషాలు తెలియచేస్తాను. అగస్త్య మహర్షులవారు అగస్త్యప్రోక్తం అను రసాయనిక గ్రంధమును రచించి అందులో పాషాణ , రససమ్మేళణాదులు ఉపయోగించు విధానం పేర్కొనెను. నీచలోహాలను స్వర్ణముగా మార్చు విధానములు సవివరముగా తెలియచేస్తూ రసవాదులకు మార్గదర్శకుడు అయ్యెను . ఈ రసవాదం సంపూర్ణంగా సిద్ధించుటకు అత్యంత ప్రజ్ఞ కలవాడై ఉండవలెను . పురాతన సిద్ధులు మాత్రమే కాకుండా కొంతమంది ఆధునిక రసవాద పరిశోధకులు కూడా స్వర్ణాన్ని తయారుచేశారు. వారిలో కాశీ నివాసి "పండిత్ కృష్ణపాల్ " 1943 సంవత్సరంలో హృషికేష్ లోని ప్రముఖుల సమక్షాన రసవాద విద్య ద్వారా స్వర్ణాన్ని తయారుచేశారు. ఆ బంగారం ఆ కాలంలో 72000 రూపాయలకు విక్రయించబడినది. ఆ మొత్తం పంజాబ్ లోని సనాతన ధర్మ ప్రతినిధి సభకు విరాళంగా ఇవ్వబడినది. బనారస్ హిందూ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో విశ్వనాధ మందిరం పై అంతస్తులో రసవాద విద్యలో ప్రముఖ ఆచార్యుడు అయిన నాగార్జుని చిత్రంతో పాటు పాలరాతిపై ఈ వివరాలు కూడా చెక్కబడి ఉన్నాయి . 11 వ శతాబ్దంలో "ఆల్బెరుని " అనే విదేశీ యాత్రికుడు మనదేశం సందర్శించి ఇక్కడి సిద్దులు బంగారం తయారుచేసేవారు అని పేర్కొన్నాడు. దేశంలో కరువుకాటకాలు ఏర్పడినపుడు రసాయనాచార్యులు కృత్రిమంగా స్వర్ణాన్ని తయారుచేసెవారు అని అనేక గ్రంథాలలో వివరించబడి ఉంది. ఈ రసవాద విద్యను "స్వర్ణకరణి" పగారవిద్య అని అంటారు. ఈ విద్యను ఉర్దూలో కీమియా అని ఇంగ్లిష్ భాషలో ఆల్కెమీ అని పిలుస్తారు . ఈ రసవాదవిద్యలో నీచ వస్తువుని స్వర్ణంగా మార్చడానికి ఉపయోగించు ఒక వస్తువును "పరుసవేది " అని పిలుస్తారు . ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను ఈ రసవాద విద్య సిద్దించక భ్రష్టుడు , పిచ్చివాడు కావొచ్చేమోకాని ఒక గొప్ప వైద్యుడు మాత్రం తప్పక అవుతాడు. అందుకనే మన పూర్వీకులు " వాదభ్రష్టో వైద్య శ్రేష్ఠ" అని అన్నారు. ఆధునిక శాస్త్రవేత్తలు స్వర్ణం తయారుచేయడాన్ని ఒక పిచ్చిపనిగా , చెప్పినవాడ్ని పిచ్చివానిగా చూస్తారు. వారు చెప్పినట్లు స్వర్ణం ఒక ఎలిమెంట్ అణుసంఖ్య పట్టికలో దీని సంఖ్య 79 . AU కాంతి లోహ సంబంధమైనది . ప్రకృతిసిద్ధంగా లభించే బంగారుస్పటికముల అవయవ రూపత్వం ఇసొమెట్రిక్ భూమి యొక్క ఉష్ణోగ్రతకు కరిగి కిందికి దిగి పేరుకుని పొందే అవయవాకృతిని "నగ్గెట్స్" అంటారు. బంగారం యొక్క కాఠిన్యం 2 .5 to 3 .రష్యా వంటి దేశాలలో ప్రయోగశాలలలో కృత్రిమంగా తయారుచేశారు. బయట ఉన్న బంగారం ఖరీదు కంటే తయారు చేయుటకు అయ్యే వ్యయం ఎక్కువ ఆగుతుంది. అందువల్ల పరిశోధనలు ఆగిపోయాయి. భారతీయ పురాణాల్లో చెప్పినదాని ప్రకారం ఈ రసవాద విద్యలో ప్రముఖులు ఆదిమ చంద్రసేనుడు , లంకేశ్వరుడు, మత్తమాండవ్య ఇంద్రదత్త , కలంబి, నాగార్జునుడు, ఋషిశృంగ, రసేంద్రాతిలక , భాలుకి , మైధిలి , హరీశ్వర మొదలగు 27 మహామహులు చేత సింహగుప్తుని కుమారుడు అయిన వాగ్భాటాచార్యుడు , వేమనయోగి వంటి ఎందరో మహాత్ములు , సిద్దులు మొదలయిన వారు ఎందరొ ఉన్నారు. మనకు తెలిసిన వేమన గొప్ప రసవాది ఆయన ఒక చోట ఇలా చెప్పాడు . " వెన్నెల నిలుచుండి , వేపాకు పడవేసి అడ్డసరం రసమందు నదియు పిండి రాగి కరుగవేయ రమణ బంగారమౌ విశ్వదాభిరామ " అని చెప్పాడు . మరియొక చోట " పుట్టమీద కాయ , పుట్టమీద మన్ను పుట్టలోనివాని పుట్టుతుదను గట్టియవచనము కాంచనాంబగయ" అని చెప్పాడు. నేపాల్ దేశంలో పరుశువేది లింగం ఉన్నట్టు శ్రీశైల క్షేత్రంలో కూడా శివలింగానికి కింద ఉన్న సప్తమ లింగం కూడా పరశువేది లింగం అంటూ కొన్ని ప్రాచీన రహస్య గ్రంధాలలో ఉన్నది.
రసవాద విద్య గురించి సంపూర్ణంగా వివరించే అత్యంత ప్రాచీన గ్రంథాలు -
గ్రంధాల పేర్లు -

• అగస్త్య రసాయనిక తంత్రం.
• కక్షపూట తంత్రం.
• కూపిపక్వ రస నిర్మాణ్ విజ్ఞాన్.
• ద్వాదశ లోహ భస్మ విధానము.
• పారద విజ్ఞానం.
• పారద సంహిత.
• రస చింతామణి.
• రసరత్నాకరము .
• రసాయన ఖండం.
• రసార్ణవము.
• రసేంద్ర చూడామణి.
• రసేంద్ర కల్పద్రుమ.
• సనారి విశ్వేశ్వర సంవాదం.
• రస కంకాలియ.
• రస కౌముది.
• రస పారిజాత.
• రసరత్న మణిమాల.
• రస ప్రదీప.
• రసేంద్ర మంగళం .
• సూత ప్రదీపిక.
• రస సాగరః.
• రస రాజలక్ష్మి.
• రస ముక్తావళి.
• రసరాజ శిరోమణి.
• రస సంగ్రహ సిద్ధాంత .
• రస కిన్నెర .
• స్వర్ణ తంత్రం.
• కనకమంజరి.
• కళాయి శాస్త్రం. పైన చెప్పిన గ్రంథాలు అత్యంత ప్రాచీనం అయినవి . ఇంకా కొన్నిచోట్ల అరుదుగా లభ్యం అగుచున్నవి.

 రసవాదం నందు వివరించిన కొన్ని ప్రయోగాలు -

• తెల్ల వాకుడు రసం తో పాదరసాన్ని నూరిన మైనం . ఆ మైనంలో ఆ పిప్పిలో పొదిగి , ఆరబెట్టి చిన్న పుటం పుట్టిన భస్మం అగును. రాగిని కరిగించి అందులో ఈ భస్మం వేసిన హేమించును

• ఒక శేరు ఇంగిలీకమును 5 శేరుల పచ్చిపసుపు రసమున 4 జాములు చురకా ఇచ్చి తరువాత 15 శేరుల తంగేడుపువ్వుల రసముతో చురకా ఇచ్చిన కట్టును . ఇది నిశ్చయం. అది వెండి మీద పదోవంతు వేసిన బంగారం అగును.

• అడవి మెంతి ఆకు పాదరసమున వేసి నూరి శుద్ద రాగి బిళ్లకు పట్టించి గజపుటం వేసిన వెండి అగును ఇది నిశ్చయం .

• శంఖు పాషాణం వంకాయలో పెట్టి మట్టిరాసి ఆరబెట్టి 21 పుటములు పెట్టవలెను . 10 పుటముల వరకు 4 నుంచి 5 వేసినను కట్టును . తరువాత 4 కి 1 పిడక చొప్పున పుటములు పెట్టవలెను. దీనిని రసంలో వేసి రాగికి జోడించి కరిగించిన స్వర్ణం అగును.

• నల్ల ఉమ్మెత్త సమూలం నూరి శుద్ద రాగి బిళ్లకు పట్టించి గజపుటం పెట్టిన భస్మం అగును. ఆ భస్మమును రాగి కరుగుచుండగా వేసిన స్వర్ణం అగును. శుద్ధ రాగి కొరకు నైజామ్ అర్ధరూపాయి వెడల్పాటిది శ్రేష్టం.

• రెండు నేరేడు పండ్లు తెచ్చి ఒక్కోటి సగం వరకు కోసి కొంచం గుజ్జు తీసి రెండు తులముల రాగి రజను అందులో పోసి తీసిన గుజ్జు మీద వేసి రెండు డిప్పలు కలిపి గుడ్డ చుట్టి 7 సార్లు శీలమన్ను ఇవ్వవలెను . పిమ్మట ఏరు పిడకలతో పుఠం పెట్టి సాంగశీతలమున బలి ఇచ్చి తీసి చూచిన 6 వన్నె బంగారం అగును .కరిగించి దూచిన సరిపోవును .పైన చెప్పిన యోగాలు కొన్ని ప్రాచీన అత్యంత అరుదయిన గ్రంథాల నుంచి నేను సేకరించినవి . ఇవి కేవలం మీ విజ్ఞానం కోసం మాత్రమే వివరిస్తున్నాను. అత్యాశకు పోయి మీకుటుంబాలను , మీ మీద ఆధారపడ్డ వారిని ఇబ్బందులపాలు చేయొద్దని నా మనవి. ఆ సర్వేశ్వరుడు ఎవరెవరికి ఏమి ఇవ్వాలో ఆయనకి తెలుసు . కావున ఇచ్చినదానితో తృప్తిగా కుటుంబంతో సంతోషంగా ఉందాం. 

    

ఆకలి లేనివారికోసం సులభ యోగాలు -

ఆకలి లేనివారికోసం సులభ యోగాలు - 

 * మిరియాలను నూరి తీసిన రసం గాని మిరియాల కషాయం కాని తీసుకొనుచున్న అగ్నిమాంద్యం , ఆకలి లేకపోవటం వంటి సమస్య తొలగి జీర్ణశక్తి వృద్ది అగును.

 * వేడిగా ఉన్న అన్నం వార్చిన గంజిలో కొంచం పొంగించిన ఇంగువ , సౌవర్చ లవణం కలిపి తాగుచున్న అగ్నిమాంద్యం తొలగును .

 * యవాక్షారం , శొంఠి సమాన భాగాలుగా తీసుకుని చూర్ణం చేసి పూటకు 5 గ్రాముల చొప్పున ఉదయం , సాయంత్రం తీసుకొనుచున్న మంచి ఆకలి కలుగును.

 * బెల్లం , జీలకర్ర సమాన భాగాలుగా కలిపి తినుచున్న ఆకలి పెరుగును .

 * పిప్పళ్లు చూర్ణం చేసి బెల్లముతో కలిపి తీసుకొనుచున్న ఆకలి పెరుగును .

 * కరక్కాయ , పిప్పళ్లు , సౌవర్చ లవణం సమపాళ్లలో తీసుకుని నూరి చూర్ణం చేసి పెరుగు పైన ఉండే నీటితో కలిపి సేవించుచున్న అగ్నిమాంద్యం తొలగి ఆకలి పెరిగి జీర్ణశక్తి వృద్దిచెందును.

         పైన చెప్పిన యోగాలలో మీకు ఏది సులభముగా చేయగలరో చూసుకుని పాటించి అగ్నిమాంద్యం సమస్య నుంచి విముక్తి పొందగలరు.

 అగ్నిమాంద్య సమస్య ఉన్నవారు పాటించవలసిన ఆహారనియమాలు -

 తినవలసినవి -

 తేలికైన పాతబియ్యపు అన్నం , పెసలు , పేలాలు , పెసర కట్టు, చిన్న చేపలు , లేత ముల్లంగి , వెల్లుల్లి , లేత అరటికాయలు , లేత మునగకాయలు , పొట్లకాయ , బీరకాయ , వంకాయ , నక్క దోసకాయ , కాకరకాయ , అల్లం , చుక్కకూర, చెంచలికూర , ఉశిరికాయ , దానిమ్మపండు , నారింజపండు , పలచని మజ్జిగ , తాంబూలం , వేడినీళ్లు సేవించవలెను , తేనె , కారం , నూనె , చేదు , వగరు పదార్థాలు , వ్యాయమం .

 తినకూడనవి -

        కొత్తబియ్యం , చేపలు , బచ్చలికూర , ఎక్కువుగా నీరు తాగరాదు , కంద , ఆలుగడ్డ మొదలగు దుంప కూరలు , నేరేడు పండ్లు , గోధుమలు , పిండివంటలు , మాంసపదార్దాలు , పాలు , పాలతో వండిన పదార్దాలు , చారపప్పు , ఎక్కువుగా నూనె ఉండు పదార్థాలు , పూర్తిగా ఉడకని పదార్ధాలు మరియు అన్నం , మద్యపానం, ముందు తినిన పదార్దాలు పూర్తిగా అరగకముందే మరలా భుజించటం , అమిత భోజనం , నిద్రపోకుండా మేలుకుని ఉండటం, మలమూత్ర నిరోధం .

        పైన చెప్పిన ఆహార నియమాలు పాటిస్తూ ఔషధ యోగాలు వాడుచున్న సమస్య త్వరగా పరిష్కారం అగును.

         

Tuesday, May 12, 2026

హనుమాన్ చాలీసా పై... *ప్రశ్నలు, సమాధానములు

14e4;125f8;
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

    *హనుమాన్ చాలీసా పై...*                    
       *ప్రశ్నలు, సమాధానములు!*
                   ➖➖➖✍️


*1. చాలీసా" అంటే ఏమిటి?* ``` 
జ. ఈస్తోత్రంలో 40 శ్లోకాలు ఉన్నాయి కనుక చాలీసా అని పేరు(చాలిస్ అంటే హిందీ లో 40 అని.)```

*2. హనుమాన్ అంటే అర్థం ఏమిటి?*```
జ. హనుమాన్ అంటే గట్టివైన దవడలు కలవాడు అనే కాక హను = జ్ఞానం కాబట్టి జ్ఞానవాన్ అని అర్థం. ‘అజ్ఞానమును’ హననము చేయునది కనుక జ్ఞానమునకు హనుమ అని పేరు.```

*3. ఆంజనేయ - అర్థం?*```
జ. ఆంజనేయ అంటే... సామాన్య కంటితో చూడలేని దానిని చూపించేదే అంజనం, జ్ఞానాంజనం వల్ల మాత్రమే దొరికే పరతత్వం కనుక ఆంజనేయుడు అని పేరు.```

*4. తులసీదాస్ అస్సలు పేరు?*```
జ. రామ్ బోల. ఎప్పుడూ రామ నామం స్మరిస్తూ వుండడం వల్ల ఆ పేరు వచ్చింది.```

*5. హనుమoతుడు బ్రహ్మచారి అయితే మరి సువర్చల ఎవరు?*```
జ. దేవుళ్ళ భార్యలను, మానవ సంబంధాల దృష్ట్యా చూడరాదు. భార్య అంటే దేవుని యొక్క విడదీయరాని శక్తి, సూర్యుని వద్ద నేర్చుకున్న విద్యవల్ల వచ్చిన తేజో వర్చస్సు యే “సువర్చల”.
ఆ విద్య సూర్యుని దగ్గర నేర్చుకోవడం మూలాన సువర్చల సూర్యుని పుత్రిక అంటారు.```

*6. హనుమంతుడు మనికిచ్చే అష్టసిద్ధులు ఏంటి?*```
జ. ‘బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగతా అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్’ 
హనుమంతుని స్మరించటం వలన మనం పొందే అష్టసిద్ధులు ఇవే.```

*7. సూర్యునితో పాటు తిరుగుతూ విద్య నేర్చుకున్నాడు హనుమ. అంటారు కదా అసలు సూర్యుడు తిరగడు కదామరి?*```
జ. తిరగడం అంటే ఇక్కడ, ఉదయించినప్పటి నుండి అస్తమించే వరకు, క్షణక్షణం సూర్యుని తేజస్సు మారుతూ ఉంటుంది దానిని నిరంతరం ఉపాసించడంగా అర్ధం చేసుకోవాలి.```

*8. హనుమంతుని పంచ ముఖములు ఏవి?*```
జ. హనుమ శివాంశ సంభూతుడు. శివుని పంచముఖములు, హనుమంతునిలో ఏ పేర్లతో చెప్పబడ్డాయో చూస్తే...తూర్పున వానర ముఖం జన్మతః వచ్చినది అది సద్యోజాత శివవదనము.
దక్షిణం వైపు నార సింహం. అది శివుని వామదేవ ముఖం. రాక్షస సంహారం చేయడంలో చూపించాడు.
పశ్చిమం గరుడ ముఖం. అది శివుని అఘోర రూపం. వేగ గమనము, సర్వరోగ నివారణ చేసి చూపాడు.
ఉత్తరం వరాహ ముఖం. అది శివుని తత్పురుష రూపము. సంపత్ ప్రసాదం, ఉద్ధరణ. శోక సముద్రంలో ఉన్న సీతమ్మని ఉద్ధరించడం ద్వారా దానిని ప్రకటించాడు. 
ఊర్ధ్వం హయగ్రీవ ముఖం. అది శివుని ఈశాన ముఖం. వేద పారంగతుడు, సకల విద్యా కోవిదుడు. ప్రతీ ముఖానికి మూడు కళ్ళు వుంటాయి. ఈ మూర్తి పది చేతులతో వుంటాడు. వేద విద్య, త్రిమూర్తి స్వరూపం అని సీతమ్మ నమస్కరించిన హనుమత్ విరాట్ స్వరూపం ఇది.

9. “జయ” హనుమాన్ అని హనుమకి జయం చెప్పడమేంటి?
జ. ఎవరైనా ఏది సాధించడానికి ( పురుషార్థాలను) పుట్టారో అది సాధించడమే జయం అంటే. జయం అంటే అన్నింటినీ మించిపోయి ఉండడం. దేవుళ్లకు మనం జయమగు గాక అంటూ ఉంటాము అంటే నా హృదయంలో నీవు అన్నింటినీ మించి ఉండు అని అర్థము.

10. తులసీదాస్ ఎంతకాలం (వయస్సు) జీవించాడు?
జ.126 సం.జీవించాడు.

11. హనుమ బలం హనుమకు ఎందుకు తెలియదు? 
జ. మునుల శాప కారణంగా. ముని ఆశ్రమంలో వయస్సు మించిన శక్తి తో అల్లరి చేస్తున్న హనుమని కట్టడి చేయటానికై మునులు ఇచ్చిన శాపం అది.ఆ వయస్సుకి ఆయనకి ఆ శక్తి అవసరం లేదు కనుక అవసరం వచ్చినపుడు, ఎవరైనా గుర్తు చేస్తేహనుమకి గుర్తు వస్తుంది అని అనుగ్రహించారు.కనుక ఒక విధంగా ఇది శాపం అని అనుకో నక్కరలేదు. కట్టడి మాత్రమే.

12. రాక్షస సంహారానికై హనుమ సంగీతం పాడినది ఎప్పుడు?
జ. ఒకప్పుడురాక్షసుల అరాచకం అరికట్టడానికి కశ్యపుడు యజ్ఞం చేయ సంకల్పిస్తాడు..త్రిశూల రోముడనే రాక్షసుడు భూమికి నష్టం చేయడానికై, యజ్ఞ ధ్వంసం ద్వారా చేయాలని సంకల్పించుకుంటాడు. ఆ సంగతి నారదుని ద్వారా హనుమ తెలుసుకుంటాడు, వాడు యజ్ఞం ధ్వంసం చేయబోగా , హనుమ అడ్డగిస్తాడు. భీకర యుధ్ధం జరుగుతుంది. వాడు సూక్ష్మ రూపం దాల్చి గుహలో ప్రవేశించగా, దేవతలంతా ఇప్పుడు ఏం జరుగుతుందని ఆత్రుతతో ఎదురు చూస్తూండగా అప్పుడు హనుమ ఆ గుహ ముందు కూర్చుని ఎవరూ అప్పటివరకూ ఆలపించని ఒక సరికొత్త రాగం పాడగా, ఆ గుహయొక్క శిల కరిగి, వాడు బయటపడగానే వధిస్తాడు. అలా తన సంగీత చతురతతో వాడిని సంహరించాడు.

13 . రామకార్యం చేయడంలో ఆత్రుత ఎపుడు కనపరచాడు ?
జ. మైనాకుని ఆతిథ్యం స్వీకరించకుండా వెళ్ళడంలో.

14 . సీతారాములు పట్టాభిషేక అనంతరం హనుమ కిచ్చిన బహుమతులు ఏంటి?
జ. పుట్టింటివారు,అత్తింటి వారు కలిపి చేయించిన అపురూపమైన ముత్యాల హారం సీతమ్మ ఇస్తే, రాముడు ఆలింగనాన్ని బహుమతిగా ఇచ్చాడు.

15. కపీశ అంటే అర్థం ఏమిటి?
జ. కపీశ అంటే...
a) కపులకు ఈశుడు
b) కపి రూపంలో ఉన్న ఈశుడు
సి) కం(జలం) పిబతి (తాగడం) =కపి జలమును తాగేవాడు అంటే సూర్యుడు, సూర్యునిలా తేజస్వరూపుడు అని అర్థం.

16. హనుమ చిరంజీవి. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు?
జ. రామ నామ స్మరణ జరిగే చోటుకి ఇప్పటికీ వస్తాడు.అంతే కాక గంధమాదన పర్వతం పై ఇప్పటికీ వున్నాడు, వుంటాడు🙏

17. హనుమ రామదూత ఎలా అయ్యాడు ?
జ. రాముని ఉంగరాన్ని దూతలా వెళ్ళి సీతమ్మ కు ఇచ్చాడు. వేదం అగ్నిని దూతగా చెప్పింది. ఏ దేవతను తృప్తి పరచాలన్నా అగ్ని ద్వారానే  
అగ్ని ముఖావై దేవాః. 
దేవతలు అనుగ్రహించాలి అంటే మంత్రము స్తోత్రము చెబుతాము. అంటే వాక్ రూపం. ఇక్కడ వాక్కు దూత అయింది. వాక్కుకు అధిదేవత అగ్ని. అయితే అగ్నికి , హనుమకి ఏమిటి సంబంధం అంటే సృష్టి క్రమంలో ఆకాశం నుండి వాయువు వచ్చింది. వాయువు నుండి అగ్ని వచ్చింది. వాయువు నుండి వచ్చింది అంటే అగ్ని వాయుపుత్రుడు అని కదా! కథ ప్రకారం వాయుపుత్రుడు హనుమ కదా! అందుకు అలా అగ్ని తో పోల్చారు. అగ్ని ఏవిధంగా అయితే ఆహూతులను దేవతలకు అందజేస్తుందో, అలానే, ఈ అగ్నిరూప హనుమ మనం చేసే అనుష్టానాలను పరబ్రహ్మ స్వరూపుడైన ఆ రామచంద్రమూర్తికి చేరవేసే దూత అయ్యాడు. అంతేకాక రాముడు లక్ష్మణునితో అంటాడు నేను యజ్ఞ స్వరూపునిగా వచ్చినపుడు హనుమని దూతలా స్వీకరిస్తాను అని- అలా దూత అయ్యాడు . కనుక దూత అంటే just messenger అని మాత్రమే కాదు.

18 . అతులిత బలధామా అంటే అర్థం ? ఒక ఉదాహరణ?
జ. ఎవ్వరితో పోల్చతగ్గ బలం లేని వాడు.అంటే పోల్చలేని బలం. అందుకే సీతాన్వేషణ కై హనుమని ఎంచుకోవడం.

19 . ఇంతకూ హనుమ కేసరి నందనుడా? వాయు పుత్రుడా?
జ. కేసరి క్షేత్రమైన అంజనీ దేవి యందు సూర్య నాడి ద్వారా వాయుదేవుడు సర్వ దేవతా తేజస్సు ప్రవేశ పెట్టాడు కాబట్టి ఇద్దరికీ.

20 . నామస్మరణ మహిమ ఏమిటి?
జ. కలియుగంలో తరించడానికై ఇచ్చిన సులువైన మార్గం.

21. మహాత్ముడు అంటే ఎవరు ?
జ. శౌర్యం, సౌమ్యం కలిసి ఉన్నవారు. తన ప్రతాపాన్ని తానే నిగ్రహించుకో గలవాడు అతనే మహాత్ముడు( ఇక్కడి సందర్భానుసారం ఇలా చెప్పబడింది.) 

22 . ఆ రోజులలో ఉన్న వానరుల ప్రత్యేకత ఏమిటి? 
జ. నరులతో సమానంగా వేదాధ్యయనం చేసిన జాతి.

23 . *వీర* లో ఎన్ని రకాలు అవి ఏవి?
జ. దానవీర, దయవీర, యుద్ధ వీర, ధర్మ వీర, ఇవన్నీ ఉన్న వారు మహావీర.

24 . విక్రమ అంటే అర్థం ఏమిటి?
జ. క్రమించుట అంటే నడచుట అనగా వివిధ విధాలుగా తన బలాన్ని బయటపెట్టిన వాడు విక్రముడు. ఎటువైపు అయినా వెళ్లగలిగినవాడు.

25. సూక్ష్మరూపం ఎప్పుడు ధరించాడు ?
జ. లంకా ప్రవేశ సమయంలో పిల్లి లా మారాడు . మరో సారి సీతమ్మ ముందుకు చెట్టు పై నుండి చిన్న ఆకారంలో దూకాడు .

26. వికటరూపం అంటే ఏమిటి ?
జ. వికట = హద్దు లేనిది అని అర్థం, వికట రూపం = భయంకర ఘోర రూపం - లంకా దహన సమయంలో చూపుతాడు.

27. హనుమ తత్వాన్ని ఏ కార్యంలో చూస్తాము?
జ. లంకా దహన సమయంలో హనుమ తత్వాన్ని చూస్తాము.

28. భీమరూపధారిగా ఎపుడు వున్నాడు?
జ. అసుర సంహారం లో , ఉగ్రమైనదే భీమ రూపం .

29. రామచంద్రుని కార్యం చక్కబెట్టడానికి ఏం చేసాడు ?
జ. తనదైన ముద్రతో దూతే ఇంత చేస్తే ఇంక రాజు ఎంత చేస్తాడో అని రావణుడు భయపడాలి అని భావించి లంకా దహనం చేసాడు.

30. అశోకవన నాశనానికి ప్రతిగా రావణుడు హనుమకి ఇచ్చిన దండన ఏది? 
జ.వానరులకు వారి తోక అంటే ఇష్టం ఉంటుంది కనుక తోకకు నిప్పు పెట్టమన్నాడు.( హనుమని చంపమని ఆదేశిస్తున్న రావణునితో విభీషణుడు, దూతను చంపరాదు అంటాడు) .

31. రఘువీరుడు ఎందుకు సంతోషించాడు ?
జ. ఇంద్రజిత్తు అస్త్రం వల్ల వానర సైన్యం, రావణుని శక్తి అస్త్రం వల్ల లక్ష్మణుడు పడిపోతే సంజీవనీ పర్వతం (2సార్లు) తెచ్చి రామునికి ఆనందం కలిగించాడు హనుమ.

32. అపుడు రాముడు హనుమని ఎవరితో పోల్చాడు?
జ. నీవు నా తమ్ముడు భరతునితో సమానం అని అంటాడు.

33. భీముడు హనుమని కోరినదేమిటి (జెండా పై వుండమని కాకుండా) ?
జ. మహత్ రూపం చూపమని అడుగుతాడు.

34. హనుమ ఎన్ని సార్లు తన మహత్ రూపం చూపాడు? ఎపుడు ?
జ. మహేంద్ర పర్వతం పైన మొదటిసారి, వ్యాకరణం నేర్చుకున్నపుడు, అశోకవనంలో సీతమ్మ దగ్గర మొత్తం మూడు సార్లు తనమహత్ రూపాన్ని చూపాడు.
(సహస్ర వదన తుంహరో యశ గానై---1000 వదనముల హనుమంతుని మహత్ రూపాన్ని శ్రీపతి అనగా సీతారాములు పొగిడారు)🙏🙏

35. హనుమంతుని జన్మదినం రెండు మాసాలలో చెబుతారు ఏది సరి అయినది? 
జ) చైత్ర పౌర్ణమి నాడు జన్మించాడు కాని ఇంద్రుని దెబ్బకు మూర్ఛిల్లిని హనుమ బ్రహ్మ స్పర్శద్వారా తిరిగి ఉత్తేజితుడు అయినది వైశాఖ బహుళ దశమి శనివారంనాడు. అందుకు అలా రెండు మాసాలలో చెబుతారు. ప్రాంతాన్ని బట్టి జరుపుతుంటారు.

36. హనుమ - ఓంకార స్వరూపుడు- ఎలా?
జ)` *హ* 'లో 'అ', *ను'* లో 'ఉ', ' *మ* ని మ గా తీసుకుంటే అకార, ఉకార, మకారాత్మకమే ఓంకారం కదా అదే హనుమ అంటే.

 37. భజరంగీ అంటుంటాం - ఎందుకు? 
జ) వజ్రం వంటి అంగములు అంటే అవయవములు కలవాడు. అదే వజ్రాంగీ కాస్తా భజరంగీ అయింది.

38. తుమ్హారో మంత్ర విభీషణ మానా .. విభీషణునికి మంత్రం ఇవ్వడం ఏమిటి?
జ) రావణాసురుని కొలువులో రావణునితో హనుమ అంటాడు- రాముని శరణు వేడమని చెబితే బాగుపడే లక్షణం లేక వినడు కానీ అక్కడే ఉండి విన్న విభీషణుడు పాటించాడు. మంత్రం- ఆలోచన, వ్యూహరచన.

39. అర్జునుడి జెండాపైన హనుమంతుడు ఎందుకు ఉంటారు?
జ. అర్జునుడు రాముడు అంతటి వాడిని అనిపించు కోవాలి అనుకుంటాడు. ఒకసారి కృష్ణునితో, రాముడు సేతువు రాళ్లతో కట్టడమెందుకు బాణాలతో కట్టవచ్చుకదా అని అంటే, సరే నీవు ప్రయత్నించు అంటాడు. కొంత మేర కట్టగానే హనుమంతుడు ఎక్కి కూల్చుతాడు. నీవు కూల్చలేని సేతువు నిర్మిస్తానని అంటాడు. అలా చేస్తే నీవు ఏం చెబితే అది చేస్తానని అంటాడు హనుమ. కట్టలేకపోతే గాండీవం వదిలేస్తా నంటాడు అర్జునుడు. అయితే హనుమ మళ్లీ కూల్చితే, అర్జునుడు గాండీవం వదలబోగా, ఈసారి ప్రయత్నించు అని కృష్ణుడు చెప్పగా, దానిని హనుమ కూల్చ లేకపోతాడు.( అర్జునుడు గాండీవం వదిలితే జరగవలసిన కార్యం జరగదు).నేను ఓడిపోయాను నువ్వు ఏం చెబితే అది చేస్తాను అంటాడు హనుమ. అప్పుడు అర్జునుడు, నిన్ను ఆజ్ఞాపించే వాడిని కాను అర్థిస్తున్నాను నా రథం పై వుండి నన్ను రక్షించు అంటాడు. అప్పుడు కృష్ణుడు హనుమతో నువ్వు ఓడలేదయ్యా అంటాడు ,మరి అర్జునుడు ? అని అడిగితే , అర్జునుడు గెలవలేదయ్యా అని కృష్ణుడు తన వీపు చూపగా, మొత్తం నెత్తుటి మరకలు వుంటాయి. సేతువు నిలవడానికి వీపు అడ్డుపెట్టాను అంటాడు. తనను శరణు పొందిన అర్జునుని విజయానికి అలా కారణమై నాడు.

యుద్ధసమయంలో అర్జునుడు కృష్ణునితో అంటాడు, నేను చంపాలనుకున్న వారిని నా కన్నా ముందే జటాధారియై త్రిశూలం పట్టుకొని ఒకరు చంపుతూ వుంటే, వారిపై నేను బాణాలు వేసి చంపిన కీర్తి తెచ్చుకుంటున్నాను అని అంటే రథ జెండా పై వున్నఆ శివాంశ సంభూతుడు అయిన హనుమనే అలా చేసినవాడు అని రహస్యం వెల్లడిస్తాడు కృష్ణుడు.🙏🙏🙏🙏

40 . హనుమ సంజీవనీ పర్వతం ఎప్పుడు తెచ్చాడు?
జ) రెండుసార్లు- వానరసైన్యం మూర్చిల్లినప్పుడు.
లక్ష్మణుడు మూర్ఛ పోయినప్పుడు.

41 . సుందర కాండకి ఆ పేరు ఎందుకు వచ్చింది ? 
జ. సుందరకాండలో రామ కథ రెండు సార్లు చెప్పబడింది. అందుకు ఆ కాండకు ఆ పేరు.
పోయిన దాని యొక్క జాడ తెలుసుకొని ఆనందాన్ని ఇచ్చేవాడే సుందరుడు.ఆ సుందరుని గురించి చెప్పేదే సుందరాకాండ.

పోయిన వస్తువు అపురూపంగా సుందరంగా ఉంటుంది.అటువంటి సీత జాడ కనుక్కోవడమే సుందరాకాండ.

హృదయమనే అశోక వనంలో ఆత్మ వస్తువనే సీతను దొరక బుచ్చుకోడమే సుందరాకాండ. 

పరబ్రహ్మ తత్వమే, *సత్యం శివం సుందరం.* అటువంటి పరబ్రహ్మ గురించి అసలయిన తత్వాన్ని వెల్లడించిన కాండ కనుక *సుందర* *కాండ* . 

42. చూసి రమ్మంటే కాల్చి రావడమేమిటి?
జ. చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అని అంటే, మరి రాముని మాట జవదాటాడు అని అనుకుంటే హనుమ శివాంశ సంభూతుడు చూపులోనే అగ్ని ఉన్నవాడిని చూసి రమ్మంటే కాల్చి రావడమే కదా మరి.

43. రాబోయే కల్పానికి హనుమంతునికి రాముడిచ్చిన పదవి ఏంటి?

జ. *బ్రహ్మ పదవి.* 

పట్టాభిషేక అనంతరం హనుమ గంధమాదన పర్వతం పై తపస్సుకు వెళితే ఒకసారి రాముడు రమ్మని కబురు చేస్తాడు. "బ్రహ్మ నా అంగుళీయాన్ని పూజించుకుంటాను అంటే ఇచ్చాను దానిని సీతమ్మ చూస్తానంటుంది బ్రహ్మలోకం వెళ్లి తీసుకు రమ్మంటాడు. యోగ మార్గం( సుషుమ్నా) ద్వారా బ్రహ్మ లోకం వెళ్లి బ్రహ్మ ను అడిగితే, ఇచ్చిన దానిని అడగరు అని అంటాడు. చర్చ అనవసరం ఇవ్వమంటాడు. ఇవ్వనంటాడు బ్రహ్మ .అప్పుడు బ్రహ్మ కి వింశతి (20) బాహువుల హనుమ దర్శనమిస్తాడు. దాంతో బ్రహ్మ నమస్కరించి, తాను పూజిస్తున్న పళ్ళెంలోని అంగుళీయాన్ని తీసుకో మన గా చూస్తే అందులో చాలా ముద్రికలు ఉన్నాయి . ఎన్నో కల్పాలు ఎందరో రాములు. నాకు 100 కల్పాల ఆయువు. కాబట్టి ఇప్పటి ముద్రిక ఏదో వెతికి తీసుకో అని అంటాడు బ్రహ్మ.హనుమ గుర్తించి తీసుకుంటాడు.

 బ్రహ్మకు హనుమ గొప్పతనం తెలియజేయడానికే రాముడు అలా చేస్తాడు.

తిరిగి వచ్చిన హనుమతో బ్రహ్మలోకం ఎలా ఉంది అని రాముడు అడిగితే , బానే ఉంది కానీ కొన్ని లోపాలు ఉన్నాయి అని అంటాడు.అప్పుడు రాబోయే కల్పానికి నీవే బ్రహ్మవు, ఆ దోషాలను నువ్వు అప్పుడు సరిదిద్దు అని చెబుతాడు.

*వింశతి భుజ హనుమ అభీష్ట సిద్ధి రూపం.* 
20 చేతులలో *ఖడ్గం* , **డాలు,మొనగలిగిన ఆయుధం,పరశువు,పాశం,* *త్రిశూలం,వృక్షం,చక్రం, శంఖం, గద, ఫలం,అంకుశం,అమృత పాత్ర, నాగలి,పర్వతం, టంకం (పార),పుస్తకం,ధనుస్సు,సర్పం* , **ఢమరుకం* ధరించి వున్నాడు.

అటువంటి హనుమకు బ్రహ్మతో సహా మనందరo మానసికంగా దర్శించుకొని ప్రణమిల్లుదాం.✍️```

**రామ లక్ష్మణ జానకీ** **హనుమాన్ కిజై*
 *జై హనుమాన్* ,* 
 *జై జై హనుమాన్.**
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                    🌷🙏🌷```
 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀

Tuesday, May 5, 2026

మన_సంస్కారాల_అంతరార్థం

*మన_సంస్కారాల_అంతరార్థం*

భారతీయ సంస్కృతిలో చెప్పబడినవన్నీ సమజహితం కోసమే ఉద్దేశించబడినవి. సమాజం అంటే మనుష్యులు తప్ప వేరెవరో కాదు. అందుకే మన సంప్రదాయయలు మానవ వికాసానికై ౠషులచే నిర్దేశించబడ్డాయి. ఈ సంప్రదాయలనే సంస్కారాలు అని చెబుతారు. మన జీవితాలు ఏదో ఒక దశలో ఈ సంప్రదాయలను అనుసరించే ముందుకు సాగుతుంటాయి.సంస్కారాలను 12 సంస్కారాలుగా గుర్తించింది.

1. వివాహాం, 2. గర్భాధానం, 3. పుంసవనం, 4. సీమంతం, 5. జాతకర్మ, 6. నామకరణం, 7. అన్నప్రాశనం, 8. చూడాకర్మ, 9. నిష్క్రమణం, 10. ఉపనయనం, 11. కేశాంతం, 12. సమావర్తనం.
అయితే మరికొంతమంది స్మౄతికాకురులు ఈ సంస్కారలను షోడశ (16) సంస్కారాలుగా పేర్కొన్నారు. కర్ణభేధం, విద్యారంభం, వేదారంభం, అంత్యేష్టి అంటూ మనువు చెప్పిన 12 సంస్కారాలకు, ఈ నాలుగు సంస్కారాలను జోడించి షొడశ సంస్కారాలుగా గుర్తించారు.

మనిషి పుట్టుకనుంచి చనిపోయేవరకు సంస్కారమయమే. ఇందులో అంత్యేష్టి తప్ప మిగిలిన 15 కర్మల ద్వారా జీవుడు సంస్కరింపబడుతూ మరణం తర్వాత ఉత్తమలోక ప్రాప్తిని పొందడం జరుగుతుంది. సంస్కారాల వలన జన్మాంతర దోషాలు కూడ తొలిగి మానవ జీవిత లక్ష్యమైన మోక్షప్రాప్తి సిధ్దిస్తుంది. సంస్కారల ఆచరణ మనిషి జీవితంలో వివాహాంతో మొదలవుతుంది. అంటే తల్లి గర్భంలో ఏర్పడే పిండం పవిత్రంగా ఏర్పడాలన్నదే. స్త్రీ పురుష సంయోగం మంత్రం చేత పునీతమవుతుంది. అంటే తల్లి గర్భంలో ఏర్పడే పిండం పవిత్రంగా ఏర్పడాలన్నదే. స్త్రీ పురుష సంయోగం మంత్రం చేత పునీతమవుతుంది. తద్వారా మన సంస్కారములు ప్రధానోద్దేశ్యం జీవుల క్షేమమేనని తేటతెల్లమవుతోంది. వేదోపనిషత్తుల ప్రకారం మన శరీరం ఐదు అంశాలమయంగా విభజింపబడింది.

1. అన్నమయ కోశం – భౌతిక శరీరం
2. ప్రాణమయ కోశం – శక్తి కేంద్రం
3. మనోమయ కోశం – చింతనా కేంద్రం
4. బుద్ధిమయ కోశం – వివేకం
5. అనందమయ కోశం – పరమశాంతి
మన శరీరంలో ఈ ఐదు అంశాలు షోడశ సంస్కారాల ద్వారా సక్రమమైన రీతిలో చలిస్తాయనేది శాస్త్రవచనం ఈ సంస్కారాల వెనుకనున్న వైజ్ణానిక రహస్యాలు నేతి వైజ్ణానికులకు సైతం అశ్చర్యపరుస్తాయి.

1. వివాహం : వివాహం సమయంలో వధూవరులచే పలుమంత్రాలు చెప్పించబడుతుంటాయి. ఆ సమయంలో వరుడు, “భగ, ఆర్యమ, సవిత, పురంధి అనే దేవతలు గార్హపత్యం కోసం నిన్ను నాకు అనుగ్రహించగా, నా జీవితం సుఖమయమయమ్ అయ్ఏందుకు నీ చేయిని నేను పట్టుకున్నాను” అని చెబుతాడు.
2. గర్భాదానం : స్త్రీ పురష సంయోగం ద్వారా పుట్టబోయే సంతానం యోగ్యులుగా ఉండేందుకై ఈ సంస్కారం నిర్దేశించబడింది.
3. పుంసవనం : తల్లిం గర్భంలోని పిండం పవిత్రంగా ఏర్పడేందుకు ఉద్దేశించబడిన సంస్కారమే పుంసవనం.
4. సీమతం : గర్భవతికి ఈ సంస్కారాన్ని నిర్వహించడం వల్ల దుష్టశక్తుల నుంచి రక్షింపబడుతుంది.
5. జారకకర్మ : బిడ్డకు నెయ్యిని రుచి చూపి, పది నెలలు తల్లి గర్భంలో ఉండి ఈ ప్రపంచానికి వచ్చిన జీవికి జరిపే తొలి సంస్కారం ఇది.
6. నామకరణం : బిడ్డ ఈ సమజంలో తనకంటూ ఓ వ్యక్తిత్వంతో వౄద్ధిలోకి రావాలన్న కోరికతో తల్లి దండ్రులు జరిపే సంస్కారం.
7. నిష్క్రమణం : బిడ్దను తొలిసారిగా బయటకు తీసుకెళ్ళడం, చంటిబిడ్డను విభిన్న వాతావరణాలకు పరిచయం చేయడమే ఈ సంస్కారంలోని అంతరార్ధం.
8. అన్నప్రాశనం : బిడ్డకు బలవర్ధకమైన, ఆహారాన్ని పరిచయం చేయడం.
9. చూడాకర్మ : పుట్టువెంట్రుకలను తీయించడం ఈ సంస్కారంలోని ప్రత్యేకత.
10. కర్ణబేధ : చెవులు కుట్టించడం.
11. ఉపనయనం : బాల బ్రహ్మచారికి జరిపే సంస్కారం.
12. వేదారంభం : సమవర్తన సంస్కారాన్ని చక్కగా ముగించేందుకే వేదారంభం.
13. సమావర్తనం : పిల్లలు విద్య ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఈ సంస్కారం జరుపబడుతుంది.
14. వానప్రస్ధం : బాధ్యతలను వారసులకు అప్పగించి వచ్చే జన్మకై జరిపే కర్మ.
15. సన్యాసం : ఐహిక బంధాల నుంచి విముక్తి పొందడం.
16. అంత్యేష్టి : పిత్రూణం తీర్చుకునేందుకు పుత్రులు చేసే సంస్కారం. 

Wednesday, April 1, 2026

కొన్ని *పెళ్లి మంత్రాలు - అర్థాలు

కొన్ని *పెళ్లి మంత్రాలు - అర్థాలు*
                

*1. కన్యాదానం సమయంలో...*     

*కన్యాం కనక సంపన్నాం* *కనకాభరణైర్యుతామ్!*
*దాస్వామి విష్ణవే తుభ్యం*
*బ్రహ్మలోక జిగీషయా!!*
```
బ్రహ్మలోక ప్రాప్తికోసం నేను సువర్ణ సంపద గల, స్వర్ణాభరణ భూషిత అయిన ఈ కన్యను లక్ష్మీనారాయణ స్వరూపుడివైన నీకు దానం చేయబోతున్నాను.```


*2. సుముహూర్తంలో...*```
(జీలకర్ర బెల్లం పెట్టే సమయం)```

*అస్య ముహూర్తస్య సుతిథిం సువారం*
*సునక్షత్రం సు యోగం సుకరణం*
*సుచంద్ర తారాబలం అనుకూలం*
*శుభశోభనాస్సర్వేగ్రహః సునక్ష త్రాః శుభై కాదశస్థాన ఫలదాః సుప్రీతాః సుముహూర్తాః సుప్రసన్నా వరదాః భవంతు*```

ఈ ముహూర్తమునకు మంచి తిథిని మంచి వారమును మంచి నక్షత్రమును మంచి యోగమును మంచి కరణమును మంచి చంద్రతారాబలమును అనుకూలముగా చేసి శుభములు శోభనములునయి అన్ని గ్రహములును ఫలము నిచ్చునవై మంచి ప్రీతి గలవై సుముహూర్తములు గలవై సుప్రసన్నతగలవై వరములనిచ్చునవై అవుగాక.```


*3.మాంగల్య ధారణలో...*

*మాంగల్యం తంతునానేన మమ జీవన హేతునా!*
*కంఠే బధ్నామి సుభగే! త్వంజీవ శరదాం శతమ్!!*
```
నా సుఖ జీవనానికి హేతువైన ఈ సూత్రంతో మాంగల్యాన్ని నీ మెడలో కడుతున్నాను. నీవు నూరేళ్లు వర్ధిల్లు!
```

*4. వధువు వరునితో ఏడడుగులు వేసే ముందు ...*
```
సప్తపది జరిగిన తర్వాత వధువు గోత్రం వరుని గోత్రంగా మారిపోతుంది. తన వెంట ఏడడుగులు నడిచే వధువుని ఉద్దేశించి వరుడు జపించే మంత్రాలివి…```


*ఏకమిషే విష్ణుస్తా వన్వేతు, ద్వే ఊర్ఙే విష్ణుస్త్వా న్వేతు.*
*మయో భవాయ విష్ణుస్త్వా న్వేతు. త్రీణి వ్రతాయ విష్ణుస్త్వా నేతు. చత్వారి*
*మయో భవాయ విష్ణుస్త్వా న్వేతు. పంచ పశుభ్యో విష్ణుస్త్వా న్వేతు. షడృతుభ్యో విష్ణుస్త్వా న్వేతు. సప్త హోత్రాభ్యో విష్ణుస్త్వా న్వేతు*
```
ఓ చిన్నదానా! నీవు నా వెంట నడు. విష్ణుమూర్తి నీవు వేసే మొదటి అడగువల్ల అన్నాన్ని, రెండవ అడుగువల్ల బలాన్ని, మూడో అడుగువల్ల మంచి కార్యాలను, నాల్గో అడుగువల్ల సౌఖ్యాన్ని, ఐదో అడుగువల్ల పశుసమృద్ధిని, ఆరో అడుగువల్ల ఋతు సంపదలను, ఏడో అడుగువల్ల ఏడుగురు హోతలను నీకు అనుగ్రహించుగాక.```

*సఖా సప్తపదా భవ. సఖాయౌ సప్తపదా బభూవ. సఖ్యంతే గమేయం. సఖ్యాల్తే మా యోషం. సఖ్యాన్మే మా యోష్ఠాః సమయావ. సంకల్పావ హై సంప్రియౌ రోచిష్ణూ సుమనస్యమానౌ ఇష మూర్జ మభి సంవసానౌ సం నౌ మనాంసి సంవ్రతా సముచిత్తాన్యకరమ్*
```
నాతో ఏడడుగులు నడచి నాకు మంచి స్నేహితురాలివి కావాలి. మనమిద్దరం కలిసి ఏడడుగులు నడిస్తే స్నేహితులమౌతాం. అప్పుడు నేను 
నీ స్నేహాన్ని ప్రేమను పొందుతాను. 
నీ స్నేహాన్నుంచి ఎన్నటికీ వియోగం పొందను. నా స్నేహాన్నుంచి 
నీ వెన్నడూ వియోగం పొందకు! పరస్పరం ప్రేమతో, అనుకూల దాంపత్యంతో ప్రకాశిస్తూ, నిండు మనస్సుతో ఆహారాన్ని, బలాన్ని పొందుతూ కలసి ఉందాం. కలసి ఆలోచించుకుందాం. మన మనస్సులు కలిసేలా నడుచుకుందాం. అలాగే అన్ని నియమాల్లోనూ బాహ్యేంద్రియాలు కూడా కలిసి ఉండేటట్లు నడుచుకుందాం.```

***********


*అరుంధతీ నక్షత్రం*

వివాహం జరిగిన రాత్రి వధూవరులను ఇంటి బయట తూర్పు లేదా ఉత్తరానికి తీసుకువెళ్లి మొదట ధృవ నక్షత్రాన్ని, తర్వాత అరుంధతీ నక్షత్రాన్నీ చూపిస్తారు.
```
ధృవనక్షత్రంలా వారు నిశ్చలమైన మనస్తత్త్వాలతో స్థిరంగా ఉండాలని, వధువు అరుంధతిలా మహా పతివ్రత కావాలనే ఆకాంక్ష ఇందులో కలదు.

Sunday, March 1, 2026

ధర్మ సందేహాలు - సమాధానాలు .

ధర్మ సందేహాలు - సమాధానాలు . 

 * వాస్తు పురుషుడు ఎప్పుడు జన్మించాడు ?
 
భాద్రపద బహుళ తదియ, మంగళవారము, కృత్తిక నక్షత్రము, వ్యతిపాత యోగము, భద్రనాకరణము గుళికతో కూడిన కాలములో వాస్తు పురుషుడు జన్మించాడు.
 
* ఏడుగురు అప్సరసల పేర్లు ఏవి ?
 
1.రంభ. 2. ఉర్వశి. 3.మేనక 4.తిలోత్తమ. 5.సుకేశి. 6. ఘ్రుతాచి 7. మంజుగోష .

 * సప్త సంతానములు అంటే ఏమిటి ?
 
1. తటాక నిర్మాణం. 2. ధన నిక్షేపం. 3. అగ్రహార ప్రతిష్ట . 4. దేవాలయ ప్రతిష్ట . 5. ప్రభంధ రచన. 
6. స్వసంతానం ( పుత్రుడు ).
 
* తొమ్మిది రకాల ఆత్మలు ఏవి ?
 1. జీవాత్మ. 2. అంతరాత్మ. 3. పరమాత్మ.
 4. నిర్మలాత్మ. 5. శుద్దాత్మ. 6. జ్ఞానత్మ  
7. మహాధాత్మ . 8. భూతాత్మ . 9. సకలాత్మ.

 * పదిరకాల పాలు ఏవి ?
 1. చనుబాలు. 2. ఆవుపాలు . 3. బర్రెపాలు .
 4. గొర్రె పాలు. 5. మేక పాలు. 6. గుర్రం పాలు.
 7. గాడిద పాలు. 8. ఒంటె పాలు. 9. ఏనుగు పాలు.
 10. లేడి పాలు.

 * యజ్ఞోపవీతం లొ ఎన్నిపోగులు ఉంటాయి?
 యజ్ఞోపవీతం లొ 9 పోగులు ఉంటాయి. ఆ తొమ్మిది పోగుల్లో 9 మంది దేవతలు నివసిస్తారు. వారు  
 1. బ్రహ్మ . 2. అగ్ని. 3. అనంతుడు. 4. చంద్రుడు . 5. పితృ దేవతలు . 6. ప్రజాపతి. 7. వాయువు .
 8. సూర్యుడు . 9. సూర్య దేవతలు .

 * అష్టాదశ ఆయుర్వేద సంహితలు ఏవి ?
 1. చరక సంహిత. 2. శూశ్రుత సంహిత. 3. పరాశర సంహిత. 4. హరిత సంహిత. 5. అగ్నివేశ సంహిత. 6. చ్యవన సంహిత. 7. ఆత్రేయ సంహిత. 8. భోజ సంహిత. 9. బృగు సంహిత. 10. బెడ సంహిత. 
11. అగస్త్య సంహిత. 12. వరాహ సంహిత. 
13. అత్రి సంహిత. 14. నారయణ సంహిత. 
15. చంద్ర సంహిత. 16. నారసింహ సంహిత. 
 17. శివ సంహిత. 18. సూర్య సంహిత.
 
* గృహ నిర్మాణం ఏ విధంగా చేపడితే సర్వ సుఖాలు పొందుతారు?
 1. ఈశాన్యం లొ పూజలు , పవిత్ర కార్యాలును నిర్వర్తించే విధంగా పూజగది ఉండాలి.
 2. ఆగ్నేయం లొ అగ్నికి సంబందించిన వంటావార్పు చేసుకొనే విధంగా వంటగది ఉండాలి.
 3. నైరుతిలో ఆయుధ సామగ్రి మొదలయిన వాటిని పెట్టుకోవడానికి ఒక గది ఉండాలి.
 4. వాయువ్యం లొ స్వతంత్రబిలాష చిహ్నములు .
 5. తూర్పు దిక్కున సూర్యునికి ప్రీతికరమైన పనులు.
 6. యమస్థానం అయిన దక్షిణం వైపు తలపెట్టి నిద్రించుట.
 7. కుభేర స్థానం అయిన ఉత్తరం వైపు చూస్తూ నిద్రలేచుట.
 8. వరుణ స్థానం అయిన పశ్చిమాన పాడిపశువులు పెంచుటకు తగిన స్థలం ఉండవలెను.
 ఈ విధంగా చేయుటవలన ఆయా దిక్కులలోని ఉన్న దేవతలు సంతృప్తి చెంది ఆ గృహములో నివసించేవారికి సర్వసుఖాలు, సర్వ సంపదలు ఇస్తారు.
 
* వివిద ఫలాల నైవేద్యం - ఫలితాలు.
 
కొబ్బరి కాయ ( పూర్ణ ఫలం ) - భగవంతుడికి కొబ్బరి కాయను నైవేద్యం గా సమర్పిస్తే మొదలు పెట్టిన పనులన్నీ త్వరితగతిన సులభంగా విజయవంతం అవుతాయి.

 అరటి పండు - భగవంతుడికి అరటిపండు నైవేద్యం గా సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగుతుంది. అరటిపండు గుజ్జుగా చేసి నైవేద్యం గా సమర్పిస్తే అప్పుల బాధనుండి విముక్తి పొందుతారు. చేజారిన సొమ్ము తిరిగి సకాలంలో చేతికి అందుతుంది. చిన్న అరటిపళ్లు నైవేద్యం గా సమర్పిస్తే మద్యలో నిలిచిపోయిన పనులు సక్రమంగా పూర్తి అవుతాయి.
 
నేరెడు పండు. - శనీశ్వరునికి నేరెడు పండు నైవేద్యం గా పెట్టి ఆ ప్రసాదాన్ని తింటే వెన్నునొప్పి, నడుమునొప్పి, మోకాళ్ల నొప్పి వంటివి తొలిగిపోయి ఆరొగ్య వంతులు అవుతారు.

 ద్రాక్ష పండు. - భగవంతుడికి నివేదించిన ద్రాక్ష పండ్లు ముందు చిన్నపిల్లలకు, తరవాత పెద్దలకు పంచినట్లైతే ఎల్లవేళలా సుఖసంతోషాలతో వర్దిల్లుతారు. రోగాలు నశిస్తాయి. కార్యజయం లభిస్తుంది.
 
మామిడి పండు. - మామిడి పండుని నైవేద్యం గా పెడితే ప్రభుత్వం నుంచి రావలసిన నగదు ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో అందుతుంది. నమ్మి మోసపోయినప్పుడు నైవేద్యం గా పెట్టిన మామిడి పండుని దేవునికి అభిషేకం చేసిన తేనెలో కలిపి నైవేద్యం గా పెట్టి అందరికి పంచి తరువాత తిన్నట్లయితే మోసం చేసిన వారు స్వయంగా మీ నగదును మీకు తిరిగి ఇచ్చేస్తారు.
 
అంజూర పండు. - భగవంతుడికి నైవేద్యం పెట్టిన అన్జురాపండు ను అందరికి పంచిన తరువాత తిన్నవారికి ఆనారోగ్య భాధలు అన్ని తొలగి ఆరొగ్య వంతులు అవుతారు.
 
సపోట పండు. - సపోట పండు నైవేద్యం గా సమర్పిస్తే పెళ్లి నిశ్చయ సంభంద విషయాలలో అవాంతరాలు అన్ని తొలగిపోతాయి.
 
యాపిల్ పండు - భగవంతుడికి యపిల్ పండు ని నైవేద్యంగా పెడితే దారిద్ర్యం తొలగి ధనవంతులు అవుతారు.
 
కమలా పండు. - భగవంతుడికి కమలా పండు నివేదించి నట్లయితే నిలిచిపోయన పనులు సజావుగా పూర్తి అవుతాయి.

 పనసపండు - పనసపండు ని దేవుడికి నైవేద్యంగా పెడితే శత్రు నాశనము, రోగావిముక్తి కలిగి సుఖంగా ఉంటారు.

 * పంచవిధ సూతకములు అంటే ఏమిటి ?
 1.జన్మ సూతకము. 2. మృత సుతకము. 3. రజః సూతకం . 4. అంటు (రొగ ) సూతకం . 5. శవదర్శన సూతకం .

 * దేవాలయాల వద్ద గృహ నిర్మాణం చేయడం దోషమా ?
 
శివాలయానికి నూరు బారుల దూరం లొపల, విష్ణువాలయముకు వెనక ఇరవై బారుల దూరం లొపల, శక్తి ఆలయముకు సమీపం లొను గృహనిర్మాణం చేయకూడదు . దీనికి వ్యతిరేఖంగా గృహ నిర్మాణం జరిగితే సఖల సంపదలు నశించి కష్టాలపాలు అవుతారు. గుడి దగ్గర ఉన్న ఇళ్ళకు ఏ వైపునైనా , ఏ మాత్రమైనా గుడి నీడ పడిందంటే దరిద్రం, ప్రాణనష్టం వంటి అనేక కష్టనష్టాలు ఎదుర్కోక తప్పదు.

 * తాంబూలం సేవించేప్పుడు తమలపాకు తొడిమ, చివర్లు ఎందుకు తుంచాలి ?
 తాంబులం వేసుకునే ముందు తమలపాకుల తొడిమలు, చివరలు తుంచివేయాలి. ఎందుకంటే తొడిమను తినడం వ్యాదికారకం అవుతుంది. చిగుర్లు పాపానికి ప్రతీకలు అని అంటారు. కనుక తమలపాకు తొడిమలు , చివరలు తుంచిన తర్వాతే తాంబులం వేసుకొవడం ఆరొగ్య ప్రధమం . అలాగే తమలపాకులో ఉండే ఈనెలు బుద్దిని మందగింప చేస్తాయి. అందుకే తమలపాకును నమిలి మొదటగా నోటిలో ఊరిన రసాన్ని ఉమ్మివేయాలి. తొడిమలు, చివరలు తున్చివేసినా ఇంకా అవి తమలపాకులో శేషించి ఉంటాయి కనుక 

 * శ్రీ గోవింద రాజస్వామి వారి సన్నిధిలో కుంచం ఉంటుంది ఎందుకు ?
 తిరుపతి శ్రీ గొవింద రాజస్వామి వారి సన్నిదిలో కుంచం ఉండటం నిజమే . దీనికి కారణం ఈ విధంగా చెబుతారు. తిరుమల స్వామి శ్రీ వెంకటేశ్వరస్వామి కుబేరుని వద్ద అప్పు చేసాడట . దానిని తీర్చుట కొరకు ద్రవ్యాన్ని కుంచం తో కొలిసి ఇచ్చేవారట స్వామివారు. స్వామివారి పక్షాన గొవింద రాజస్వామి ఈ కార్యమును సాగించారని ఒక కధ ప్రచారం లొ ఉంది. ఆ కుంచం తన తలక్రింద ఉంచుకున్నాడు అని ప్రతీతి.
 
* నవగ్రహాలకు సంభందించిన సమిధలు ఏవి ?
 1. సూర్యుడు - జిల్లెడు. 2. చంద్రుడు - మొదుగ .
 3. అంగారకుడు - చండ్ర. 4. బుదుడు - ఉత్తరేణి .
 5. బృహస్పతి - రావి . 6. శుక్రుడు - అత్తి .
 7. శని - జమ్మి . 8. రాహువు - దర్భ. 
 9. కేతువు - గరిక .
  * ఎటువంటి స్థలం లొ గృహ నిర్మాణం చేయరాదు .
 1. గోవుల మందలు ఉండే ప్రదేశాలలోనూ .
 2. స్మశాన భూమికి సమీపం లొను .
 3. మలమూత్రాలు విసర్జించు ప్రదేశాలలోను .
 4. ఉప్పు నేలలోను, చవుడు నేలలయందు .
 5. ఎల్లప్పుడు నీటి వుటలు గల ప్రదేశాలలోను .
 6. రాతి భూముల యందు , మిక్కిలి రక్త వర్ణం గల భూమి యందు 
 7. చెరువులను పూడ్చి గృహ నిర్మాణం చేయరాదు అలా చేయడం వలన అనేకములు అయిన పంది జన్మలు ఎత్తి రౌరవాది నరకములు అనుభవించి కష్టాల పాలవుతారు .
 
* పుజాంగాలు ఎన్ని రకాలు ?
 పుజాంగాలు 5 రకాలు.
 1.అభిగమనము - దైవాన్ని స్మరిస్తూ దేవాలయానికి వెళ్ళుట.
 2. ఉపాధానము - పూజా సామగ్రిని సంపాదించుట
 3. ఇజ్య - దూప, దీప, నైవేద్యములతో పూజించుట.
 4. స్వాద్యాయము - తనకు తానుగా మంత్రోచ్చారణ తో స్తుతించడం.
 5. యోగము - తదేకమైన నిష్టతో ధ్యానించుట .
  
 * ఏయే గృహాలకి ఎటువంటి శంఖువు ప్రతిష్ట చేయాలి ?
 రాతితో కట్టే గృహానికి ఆ రాతితోనే శంఖువు తయారు చేసి శంఖుస్థాపన చేయవలెను . ఇటుకలతో కట్టిన గృహమునకు ఇటుకలతోనే శంఖువు చేసి ప్రతిష్ట చేయవలెను .గోడలు పెట్టక కర్రలతో , నిట్రాట లతో వేయు పాకలకు కర్రతో శంఖువు తయారు చేసి ప్రతిష్ట చేయవలెను . శంఖువును నవరత్న, సువర్ణ, తామ్ర , రజిత నాణేలతో , నవధన్యములతో పూజించి , స్థాపించవలెను . అన్ని రకాల గృహములకు కర్ర శంఖువు ప్రతిష్టించరాదు . కాష్ట శంఖువు భుమిలొ ఎంతకాలం ఉండునో అంతకాలం ఆ గృహం శుబప్రధంగా ఉండును. ఆ తరువాత ఆ గృహములలో నివసించువారికి కష్టాలు కలుగును.కావున కర్రతో చేసిన శంఖువు కంటే రాతితో చేసిన శంఖువు ఉత్తమం అని తెలుస్తుంది.

 * గృహ నిర్మాణం లొ ఇంటి కిటికీలు, ద్వారాలు ఏ విధంగా అమర్చాలి ?
 గృహంలో కిటికీలు, ద్వారములు సమసంఖ్యలో ఉండాలి. వేటికవే విడివిడిగా సమసంఖ్యలొ ఉండాలి. కిటికీలు సరిసంఖ్యలోను , ద్వారాలు సరిసంఖ్యలొను ఉండాలి. అలమారాల గురించి శాస్త్రం లొ ఏమీ చెప్పలేదు. వాటి ఉపయోగాన్ని అనుసరించి సరిసంఖ్యో, బేసి సంఖ్యలొ నో పెట్టుకొవాలి. వాటికి స్థల నిర్ణయం కూడా చెప్పలేదు కిటికీలు , ద్వారాలు సరిసంఖ్యలో ఉన్నా చివరన సున్నా లేకుండా ఉండాలి. అనగా 10,20,30 ఇలా చివరన సున్నా రాకూడదు. అలాగే మొత్తం గృహం లొ ఉన్న ద్వారాలు, కిటికీలు అన్ని లెక్కపెట్టాలి.

 * వివిధ జన్మలు ఏవి ?
 1. దేవతలు . 2. మనుష్యులు. 3. మృగములు.
 4. పక్షులు . 5. పురుగులు. 6. జలచరములు.
 7. వృక్షములు .
 * శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఏడుకొండల పేర్లు ?
 
 1. వ్రుషబాద్రి . 2. నీలాద్రి. 3. గరుడాద్రి. 
 4. అంజనాద్రి. 5. శేషాద్రి. 6. వెంకటాద్రి.
 7. నారాయణాద్రి.
 * ఎవరెవరికి యే విధంగా నమస్కరించాలి?
 1. విష్ణుమూర్తి యెక్క సర్వ అవతారాల విగ్రహాలకు మరియు శివునికి 12 అంగుళాల ఎత్తులొ చేతులు జోడించి శిరస్సు వంచి భక్తి , శ్రద్దలతో వినయంగా నమస్కరించాలి.
 2. ఇతర దేవుళ్ళకు శిరస్సు పై రెండు చేతులు జోడించి నమస్కరించాలి.
 3. గురువుకి నోటితో " నమస్కారం " అని చెప్పకుండా రెండు చేతులు జోడించి వినయవిధేయలతో నమస్కరించాలి.
 4. మహానుభావులకు , యోగులకు రెండు చేతులు వక్షస్థలం పై జోడించి నమస్కరించాలి.
 5. తండ్రికి , పరిపాలకుడికి రెండు చేతులు నోటి మీదగా జోడించి నమస్కరించాలి.
 6. తల్లికి ఉదరం పై రెండు చేతులు జోడించి నమస్కరించాలి.
  * శ్రీ చక్రం నందు గల దేవతలు ఎవరు?
 1. వశిని . 2. కామేశ్వరి. 3. మోదిని . 4. విమల.
 5. అరుణి . 6. జయిని . 7. సర్వేశ్వరీ . 8. కాళిని .

 * ధర్మం అంటే ?
 
  ధృతి, క్షమ , దమము, అస్తేయము, శౌచము, ఇంద్రియ నిగ్రహము, ధీ , విద్య, సత్యము, అక్రోధము. ఈ పది లక్షణములు కలిగినదే "ధర్మము"
 
* సహంపక్తి బోజనాల సమయం లొ అందరూ ఒకేసారి లేవాలి అంటారు ఎందుకు ?
 సహంపక్తి బోజనానికి కూర్చున్న వారందరి జీవన ప్రమాణం ఒకేవిధంగా ఉండదు. సహంపక్తి బోజనాలలో రకరకాల వారు ఉంటారు. వారిలొ మంచివారు ఉంటారు. అలాగే చెడు అలవాట్లు ఉన్నవారు ఉంటారు. ఎవరి శరీరాల్లోని విద్యుత్ వారి వారి శరీరపు శక్తిని అనుసరించే పనిచేస్తూ ఉంటుంది . కాని సహపంక్తి లొ కూర్చున్నప్పుడు దాదాపు అందరి శరీరాల్లోని విద్యుత్ నియంత్రణ అందరిలో ఒకేలా ఉంటుంది. అటువంటప్పుడు తక్కువ శక్తితో ఉన్న వ్యక్తీ అందరికంటే ముందుగా లేచినచో మిగిలిన వారి శక్తి అతనికి ఎంతోకొంత వెళ్ళిపోతుంది.
          కనుకనే సహపంక్తి బోజనానినికి కుర్చున్నప్పుడు ఎవరు ముందు తిన్నా , ఎవరు వెనక తిన్నా , అందరూ ఒకేసారి లేవాలన్న నియమం పూర్వకాలం నుండి ఆచరణలో ఉంది.
 
* దేవతా లక్షణాలు ఏవి ?
 1. రెప్పపాటు లేకుండుట . 2. భూమి మీద పాదాలు ఆనించ కుండా ఉండుట.3. వ్యసనం లేకుండా ఉండుట.

 * నవ వ్యాకరణాలు అనగా ఏవి ?
 1. పాణి నీయం . 2. కలాపం. 3. సుపద్మం. 
4. సారస్వతం. 5. ప్రాతిశాఖ్యం ( కుమార వ్యాకరణం ) 6. ఐంద్రం . 7. వ్యాఘ్ర బౌతికం. 
 8. శాఖటా టా యానం . 9.శాకల్యం .
 
* శ్రీ రాముని జన్మనక్షత్రం , మాసం ఎప్పుడు ?
 శ్రీ రాముడు చైత్ర మాసం , నవమి తిధిలో కర్కాటక లగ్నంలో జన్మించాడు. ఆయన జన్మ నక్షత్రం పునర్వసు .
 
* పర్వ దినాలలో వడపప్పుని ఎందుకు పెడతారు 
 భగవంతుడికి ప్రతి పండగనాడు వడపప్పుని , చలిమిడిని తప్పకుండా చేసి పెడతారు. అలాగే తల స్నానం చేసి ఆయా దేవుళ్ళకి ఇష్టమైన పిండి వంటలు చేయడం వల్ల వేడి చేసి తిన్న పిండి వంటలు సరిగ్గా అరగవు . తద్వార అనారోగ్యం కలుగుతుంది.
         
     ఇటువంటి ఉపద్రవాలు తలెత్తకుండా ఉండటానికి కొన్ని ప్రాంతాలలో వడపప్పు, పానకం , చలిమిడి తప్పకుండా చేస్తారు . పెసరపప్పుతో చేసిన వడపప్పు తినడం వలన తిన్న పిండి వంటలు జీర్ణం అయ్యి వేడి చేయకుండా చలువ చేస్తుంది .
 
* శ్రీ వారి సుప్రబాతాన్ని ఎవరు ఎప్పుడు రచించారు.?
 శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రసిద్ధ సుప్రబాతాన్ని రచించిన వారు శ్రీ ప్రతివాది భయంకర అన్నన్ అనే ఆచార్యులు. వీరు అష్టదిగ్గజాలుగా ప్రసిద్ధులైన శ్రీ మనవాల మహామునుల శిష్యులలో ప్రముఖులు వీరు క్రీ .శ . 1361 లొ జన్మించి 1454 వరకు అంటే 93 సంవత్సరాలు జీవించి ఉన్నారని పరిశోధకుల అభిప్రాయం.వీరు తమ జీవిత కాలంలో అనేక కృతులు రచించారు. వీరి రచనలలో శ్రీ స్వామివారి సుప్రబాతం అనన్య సామాన్యమైన ప్రచారం పొందింది.

 * పంచ కోశాలు అంటే ఏమిటి ?
 1. అన్నమయ కోశం. 2. ప్రాణమయ కోశం .
 3. మనోమయ కోశం . 4. విజ్ఞానమయ కోశం .
 5. ఆనందమయ కోశం .
 * శౌచమంటే ఏమిటి ?
 శుచి అంటే శుభ్రము , శుద్ధము . ధర్మాది పరీక్షల చేత భాహ్య అంతరములలో పరిశుద్దిని పొందుటయే " శౌచం" అనబడును. శౌచం రెండు విధములు 
 1. బాహ్య శౌచం.
 2. అంతః శౌచం .
 భాహ్య శౌచం - శరీరం పైన ఉండే మలినాలను పోగొట్టుకోవడానికి చేసే స్నానాదులు, శరీరం పరిశుద్ధం గా ఉండేందుకు పూసే సుగంద ద్రవ్యాలు వంటివి. వీటిని భాహ్య శౌచం అంటారు.
 అంతః శౌచం - మనస్సులో ఎటువంటి చెడు భావాలు లేకుండా అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద , వాత్సర్యాలు లేకుండా నిర్మలమైన అంతహకరణను కలిగి ఉండటమే అంతః శౌచం అనబడను. అంతః శౌచం మనస్సుకి సంభందించినది. కాబట్టి దీనికి శాస్త్రాలలో అదిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.

 * ఏయే ప్రదేశాల్లో జపం చేస్తే ఎంతెంత ఫలితం ?
 ఇంట్లో చేసే జపానికి సత్ఫలితమే ఉంటుంది . కాని ఇంట్లో జపం చేస్తే అంతే ఫలితం ఉంటుంది. అదే జపాన్ని నది పరీవాహక ప్రాంతాల్లో చేస్తే రెట్టింపు ఫలితం ఉంటుంది . గోశాలలో చేసే జపం వల్ల వందరెట్ల ఫలితం ఉంటుంది . యాగశాలలో చేసే జపం వలన వందరెట్ల కంటే అధికమైన ఫలితం వస్తుంది. దేవాలయాలలో , పుణ్య ప్రదేశాలలో చేసే జపం వలన పదివేల రెట్లు ఫలితం కలుగుతుంది. శివాలయాలలో , శివ సాన్నిద్యం నందు చేసే జపం వలన అత్యున్నతమైన ఫలితం దక్కుతుంది.
 
* రావణుడు ప్రతిష్టించిన 6 శివ లింగాలు ఏవి ?
 1. వైద్యనాధ లింగం. 2. వక్రేశ్వర నాద లింగం.
 3. సిద్ధినాద లింగం. 4. తారకేశ్వర లింగం.
 5. ఘటేశ్వర లింగం. 6. కపిలేశ్వర లింగం.

 * పదనాలుగు లోకాలలో ఎవరెవరు ఉంటారు ?
 పదనాలుగు లోకాలలోని మొదటి మూడు లోకాల్లోను అంటే భూలోకం , భువర్లోకం, స్వర్లోకాలను " కృతక లోకాలు " అంటారు. జీవులు తాము చేసుకొన్న కర్మఫలాన్ని బట్టి ఈ మూడు లొకాల్లొను ఉంటారు.
 
 నాల్గొవదైన మహర్లోకం కల్పాన్తములో కూడా నశించదు. ఈ లొకం లొ కల్పాంత జీవులు ఉంటారు.
 అయిదోవది అయిన జనలోకం లొ బ్రహ్మ దేవుని మానస పుత్రులైన సనక సనందన సనత్కుమారాదులు నివసిస్తారు.
 ఆరొవదైన తపోలోకంలో దోష వర్జితులు , దేహ రహితులు అయిన వైరాజులనే వారు ఉంటారు.
 పదనాలుగు లోకములలో ఏడో లొకం మరియు ఊర్ధ్వ లోకములలో ఆఖరది అయిన సత్యలోకం మరణ దర్మం లేని పుణ్య లొకం. ఇందులొ సిద్ధాది మునులు నివసిస్తారు.
 ఎనిమిదొవ లోకం అయిన అతలంలో మయదానవుని సంతతికి చెందిన అసురులు నివశిస్తారు.
 తొమ్మిదొవది అయిన వితలం లొ హోటకేస్వరుడు మరియు ఆయన పరివారం ఉంటారు.
 పదోవది అయిన సుతలం లొ బలిచక్రవర్తి , అతని అనుయాయులు నివశిస్తూ ఉంటారు.
 పదకొండవధి అయిన తలాతలం లొ త్రిపురాధిపతి అయిన యమధర్మ రాజు , మహాదేవ రక్షితుడై ఉంటాడు.
 పన్నెండో వది అయిన మహాతలం లొ క్రదువ సంతతి వారైన నానా శిరస్సులు గల కాద్రవేయులు ఉంటారు. వీరిలో తక్షకుడు, కాలుడు, సుషేణుడు మొదలైనవారు ఉన్నారు .
 పదమూడవధి అయిన రసాతలం లొ "పణి " అనబడే దైత్యులు , రాక్షసులు నివశిస్తూ ఉంటారు. నిరత కవచులు, కాలేయులు, హిరణ్య పురవాసులు వీరే .
 పదనాలుగోవ ది అయిన పాతాళ లొకం లో శంఖుడు, మహాశంఖుడు, శ్వేతుడు , ధనంజయుడు, శంఖచూడుడు, కంబలుడు, ధృతరాష్ట్రుడు, అశ్వతరుడు, దేవదత్తుడు మొదలయిన సర్వజాతుల వారు నివశిస్తు ఉంటారు.
 
* శరీరానికి సంభందించిన వివిధ అగ్నులు ఏవి ?
 1. క్షుధాగ్ని.( ఆకలి బాధ ). 2. క్రొధాగ్ని ( కొపం ).
 3. కామాగ్ని.( కొరిక ). 4. జట రాగ్ని 
 * అక్షౌహిణి అంటే ఏమిటి ?
 కురుక్షేత్రంలో 18 రోజులు జరిగిన యుద్దంలో కౌరవ పక్షాన 11 అక్షౌహిణి ల సైన్యం , పాండవుల పక్షాన 7 అక్షౌహిణి ల సైన్యం పాల్గోనినట్లు భారతంలో ఉంది. ఒక్క అక్షౌహిణి లొ 21, 870 రధాలు, అంతే సంఖ్యగల ఏనుగులు, 65,610 గుర్రాలు, 1,09350 పదాతి దళాలు ఉండేవి . వీటి సముచ్చయాన్ని ఒక్క అక్షౌహిణి అనేవారు.
 
* ఎటువంటి నీటిని తాగితే దుష్ట పీడలు నశిస్తాయి 
 1. భగవంతుడికి అభిషేకం చేసిన నీటిని,
 2. అర్ఘ్యము ఇవ్వగా మిగిలిన జలమును,
 3. ఆచమనము ఇచ్చిన జలమును,
 4. పాదోదకము ను సేవించినవారికి సర్వ తీర్ధాలలో ను స్నానం ఆచరించినంత పుణ్యం కలుగుతుంది. అన్ని తీర్దాలలోని జలంతో దేవుడుకి అభిషేకం చేసినంత ఫలితాన్ని పొందవచ్చు. పైన పేర్కొన్న జలమును సేవించిన వారికి సర్వపీడలు సమసిపోతాయి.
 
* ద్వాదశ భిక్షాటన ఉపాయాలు ఏమిటి ?
 1. బిగ్గరగా అద్యయనం చేయడం . 2. పురాతన గాధలు చెప్పడం. 3. ఆడవారితో మాట్లాడటం. 4.పిల్లల్ని లాలించడం. 5. ఆడవారి వంటావార్పు స్తుతించడం. 6. వారి భర్తలను స్తుతించడం . 
 7. దీనత్వం ప్రదర్శించడం. 8. అంగవైకల్యం. 
 9. సాముద్రికం. 10. జ్యోతిష్యం . 11. చిట్కా వైద్యం. 12. గారడీ మంత్ర బాల విద్యలు.
 
* ఎన్ని సంవత్సరాలు కలిస్తే మహాయుగం అవుతుంది ?
 మనందరకి తెలిసిన యుగములు నాలుగు. అవి
 1. కృతయుగం - 17,20,000 సంవత్సరాలు.
 2. త్రేతా యుగం - 12,96,000 సంవత్సరాలు.
 3. ద్వాపర యుగం - 8, 64,000 సంవత్సరాలు .
 4. కలి యుగం - 4,32,000 సంవత్సరాలు.
   ఈ విధంగా మొత్తం నాలుగు యుగాలు కలిస్తే 
43,12,000 సంవత్సరాలు అవుతాయి. ఈ నాలుగు యుగాలు కలిసిన కాలమే ఒక మహాయుగం అవుతుంది.
 
* ఏయే అవయవాల యందు ఎన్నెన్ని రుద్రాక్షలు ధరించాలి ?
 శిఖ యందు 1. కం టం నందు 32, చేతుల యందు 12, తలకి 45, ఒక్కో చెవికి 6 రుద్రాక్షలు చొప్పున ధరించాలి. ఈ విధంగా సంఖ్యను అనుసరించి రుద్రాక్షలు ధరించి , నియమ నిష్టలతో పరమేశ్వరునిని పుజించి నట్లయితే వారికి అనంతమైన ఫలం దక్కుతుంది అని రుద్రాక్ష శాస్త్రము చెబుతుంది. అంతేకాకుండా 1000 రుద్రాక్షలను ధరించిన వారికి దేవతలు కూడా నమస్కరిస్తారు అని చెబుతుంది.

 * రాక్షసులతో సమానులు ఏవరు ?
 1. రాజాజ్ఞ మీరినవారు.
 2. ఆధారం లేక అప్పు చేసినవారు.
 3. తనంతటి వాడు లేడని గర్వించేవాడు .
 4. జన్మనిచ్చిన వారిని కష్టపెట్టేవాడు.
 5. చేసిన ఉపకారాన్ని మరిచేవాడు.
 6. ఆడదాని మాటలు విని కలహించేవాడు.
 7. నమ్మించి మోసగించేవాడు.
 8. స్త్రీని బలాత్కారంగా అనుభవించేవాడు.
 9. నిరసంగా పరిహసించువాడు .
 10. సభకు విగ్నం కలిగించువాడు.
 11. పురుషుని అదుపాజ్ఞలలో ఉండని స్త్రీ .
 12. హంతకుడు.
 * స్పటిక మాలను గృహస్తులు ధరించావచ్చా ?
 స్పటికమాలను గృహస్తులు ధరించరాదు అని శాస్త్రం చెబుతుంది.

 * అర్జునిడికి గల దశానామాలు ఏవి ?
 1. అర్జునుడు. 2. ఫల్గుణుడు. 3. పార్ధుడు. 
 4. కిరీటి . 5. శ్వేత వాహనుడు. 6. భీభత్సుడు 
 7. విజుయుడు. 8. కృష్ణుడు. 9. సవ్యసాచి.
 10. ధనుంజయుడు.
  గణపతి అనుగ్రహం పొందాలంటే ఏ విధంగా పూజించాలి ?
 ఎట్టి విఘ్నాలు లేకుండా సర్వ కార్యాలు విజయవంతం అవ్వడానికి శీఘ్రమే గణపతి అనుగ్రహం పొందటానికి ప్రతి ఒక్కరూ వినాయకుడ్ని ఈ విధంగా ధ్యానించి పూజించాలి .
    సమస్త గణాలకు అధిపతి అయిన పార్వతీ నందనా ! సకల సౌభాగ్యాలు, సిద్ధులు ప్రసాదించే ఏకదంతం కలవాడా ! గజ ముఖం కలిగిన వాడా !
 మూషిక వాహనా ! నీవు కుమారస్వామికి గురువువి. అటువంటి నీకు నమస్కరిస్తున్నాను. అని ధ్యానించి భక్తి, శ్రద్దలతో పూజ ప్రారంబించాలి. అలా పూజించిన వారికి గణపతి అనుగ్రహము శీఘ్రమే లభిస్తుందని మహేశ్వరుడు మహా శివపురాణం లొ చెప్పాడు.

 * మనోదోషములు ఎన్ని ?
 1. కామము. 2. క్రోధము. 3. లోభము. 
4. మోహము 5. మదము. 6. మాత్స్చార్యము .
 7. రాగము. 8. ద్వేషము. 9. ఈర్ష్య . 10. అసుయ 
 11. దర్పము. 12. దంబము. 13. అహంకార దోషము.

 * భగవంతుడికి నివేదించే సమయం లొ గుర్తు ఉంచుకోవలసినవి ?
 భగవంతుడికి నివేధించేప్పుడు ఎటువంటి పొరపాట్లు చేయరాదు . తెలిసి చెసినా,తెలియక చేసినా తప్పు తప్పే అంటారు. కనుక నివేధించేప్పుడు ప్రతివారు తప్పక చేయవలసినవి .
 1. దేవునికి నైవేద్యం గా పెట్టడానికి చేసిన వంటకాలలో నుంచి కొంత విడిగా తీయరాదు .పాత్ర మొత్తాన్ని దేవుని ఎదుట పెట్టాలి .
 2. పదార్ధాలు వేడిగా ఉన్నప్పుడు నివేదిన్చరాదు . చల్లారాక పెట్టాలి .
 3. నివేదనలో మంచినీటిని కుడా తప్పనిసరిగా పెట్టాలి.
 4. నివేదించే వంటకాలలో పంచదారకు బదులు బెల్లం వాడాలి.
 * ఊర్ధ్వ పుండ్ర ములు ఎందుకు ధరిస్తారు ?
 ఆర్య మతంలో ముఖధారణం (బొట్టు ) ఒక ఆర్ష సాంప్రదాయంగా ఏర్పడింది. అది త్రి పుండ్రము , ఊర్ధ్వ పుండ్రము. అని రెండు రకాలుగా విభజించబడింది. వైష్ణవులు ఊర్ధ్వ పుండ్రము లు ధరిస్తారు . స్త్రీలు తిలకధారణ చేస్తారు . 
     తిరుమణిని నిలువునా మూడు రేఖలుగా ధరించడంనే ఊర్ధ్వ పుండ్ర దారణ అంటారు.ఈ మూడు రేఖలు అకార, ఉకార, మకార స్వరూపమైన ప్రనవాన్ని సూచిస్తాయి. అకారం - సత్వ స్వరుపడైన శ్రీ మహావిష్ణువును , ఉకారం - చిత్వ స్వరూపిణి అయిన మహాలక్ష్మిని , మకారం భగవద్భాక్తులైన భాగవతులను తెలియజేస్తాయని చెబుతారు. శైవులు భస్మాన్ని మూడు అడ్డరేకులుగా నుదుట ధరిస్తారు .
    తిరుమణి మట్టికి సంభందించినది . కావున అది మట్టి నుండి కలిగిన ఈ శరీరం చివరికి మట్టిలోనే కలిసిపోతుందని సుచిస్తుంది. ఇందువల్ల వైరాగ్యం కలుగుతుంది. ముక్తి కోరేవానికి వైరాగ్యం చాలా ముఖ్యం. విభూతి దారణ కూడా ఈ శరీరం చివరికి బూడిద అయ్యేది అనే తత్వాన్ని నిర్దేశిస్తుంది. ముఖదారణ లేకుండా చేసే సత్కర్మలు నిరర్ధకాలు అని ఆగమాలు పేర్కొన్నాయి.
  ద్వాదశ (12) ఊర్ధ్వ పుండ్రము లు ధరించడం కూడా కద్దు. నాడులు, హృదయం మొదలయిన శరీర భాగములను చల్లబరుచుటకు కూడా ఆయా స్థానములలో ఊర్ధ్వ పుండ్ర దారణ అవసరమయిన వైజ్ఞానికం గా విశ్లేషణ చేసి కొంతమంది వివరిస్తున్నారు . ఉర్ధ్వ పుండ్రం లొ ఉపయొగించే వస్తువులకు చల్లదనం కలిగించే లక్షణం ఉంది.
 
* నదులలోను, సముద్రాలలోను పవిత్ర స్నానాలు చేసేప్పుడు పాటించవలసిన నియమాలు ఏవి ?
 నదీ స్నానం , సముద్ర స్నానం వంటివి చేసే ముందు నదీ స్నానం అయితే నదీమ తల్లిని, సముద్ర స్నానం అయితే సముద్రున్ని, అనంతరం క్షేత్ర దేవతల్ని, మనస్సులొ స్మరించుకొని సంకల్పం చెప్పుకుని స్నానం చేయాలి .
 
* రాత్రి పూట నిద్రించే టైములో ఒంటిపై ధరించిన వస్త్రాలతో నదిలో మునగరాదు. ఈ బట్టలను విడిచి శుభ్రమైన వస్త్రములను ధరించాలి.

 * పుణ్య నదులలో పాప పరిహారార్ధం చేసే పవిత్ర స్నానముల సమయం లొ ఖచ్చితమైన నియమాలు పాటించి తీరాలి.

 * స్నాన అనంతరం ఆ బట్టల్ని నదుల్లో పిండ రాదు అలాగే సబ్బులను ఉపయొగించి కూడా బట్టలను ఉతకరాదు . 
 
* అభ్యంగ స్నానం అంటే కుంకుళ్ళు , షాంపు లు మొదలయిన వాటిని ఉపయొగించి తలంటు స్నానం చేయరాదు . 

 * పొరబాటున కూడా నదిలోగాని, నదీ తీరాల్లోగాని మలముత్రాలు విసర్జిన్చరాదు . ఈ నియమానికి వ్యతిరేకంగా చేస్తే పాపం అంటుతుంది.
 
* ఆఖరికి నీళ్లను పుక్కిలించి ఉమ్మి వేసినా కూడా మహా దొషం అవుతుంది.
 * పవిత్ర స్నానములు ఆచరించే సమయంలో అ మంగళ కరమైన మాటలు మాట్లడకుడదు. కసురుకోవడం, కోప్పడటం, వంటివి చేయకూడదు .

 * సముద్ర స్నానం కేవలం పర్వదినములలో మాత్రమే చేయాలి .మాములు సమయాలలో సముద్రాన్ని తాకకూడదు .

 * స్నానం చెసే ముందు సంకల్పం చెప్పుకోవాలి.
             
    

శరీరంలో అతివేడిని తగ్గించుటకు సులభ యోగం -

శరీరంలో అతివేడిని తగ్గించుటకు సులభ యోగం - 

      రాత్రిసమయంలో ఒక మూడు కప్పుల అన్నమును ఒక గిన్నెలో వేసి ఆ అన్నము మునిగే విధముగా వేడిపాలు పోసి గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచం పెరుగు వేసి తోడుపెట్టాలి.ఉదయాన్నే తోడుకున్న ఆ అన్నము పెరుగుల మిశ్రమానికి బాగా నీరు కలిపి కొంచం ఉప్పు చేర్చుకొని ఎర్ర ఉల్లిగడ్డ చిన్నటి ముక్కలుగా కోసి కలుపుకుని తినవలెను . 

              ఇది తీసుకున్న గంటన్నర తరువాత 80ml అలోవెరా జ్యూస్ కి 160 ml నీరు కలిపి లొపలికి తీసికొనవలెను . మరలా సాయంత్రం 6 గంటల సమయంలో మరొకసారి తీసికొనవలెను. పైన చెప్పిన పెరుగుతో కూడిన అన్నం ఉదయం పూట మాత్రమే చాలు 

 గమనిక - 

    మసాలా పదార్థాలు , కారం , పులుపు , వంకాయ , గొంగూర , టీ , కాఫీ , మద్యం , సిగిరెట్, 
ఎండలో అతిగా తిరగడం , ఎక్కువ దూరం నడవడం , అతిగా శ్రమ చేయుట , పొగలు కక్కుతున్న వేడివేడి అన్నం భుజించటం , నువ్వులు , వెల్లుల్లి , మినుములు , అవిసె ఆకు , కొత్త నీరు , పులిసిన గంజి , వేడి నీరు , గో మూత్రము , తాంబూలం , పెరుగు , రేగిపళ్ళు , నూనె వేపుళ్లు , చింతపండు , కోడిమాంసం , చేదు , లవణ , ఆమ్ల రసాల గల పదార్దాలు నిషిద్దం .

  పైన చెప్పిన ఔషధ యోగాన్ని పాటిస్తూ పథ్యం చేసిన త్వరగా సమస్య నుంచి బయటపడతారు . ఈ ఆహార పథ్యం మీ శరీరంలో వేడి తగ్గేవరకు పాటించి ఆ తరువాత మోతాదులు తగ్గించి తీసుకోవలెను 

  

వివాహాల్లో రకాలు - అష్టవిధ వివాహాలు - సంపూర్ణ వివరణ. -

వివాహాల్లో రకాలు - అష్టవిధ వివాహాలు - సంపూర్ణ వివరణ. - 
 
* బ్రాహ్మము - 
     
మంచి గుణవంతుడు అయిన వరునకు వస్త్రాభరణాలు  ధరింప చేసి పూజించి  కన్యాదానం చేయుట వరదక్షిణం  అనవచ్చు.దక్షిణం ఇవ్వడం శాస్త్ర సాంప్రదాయం. తులసి దళం కుడా దక్షిణగా ఇవ్వొచ్చు.
 
 * దైవ వివాహం - 
  
  తన యజ్ఞయాగాదులను ప్రారంభం నుంచి పురోహితకర్తగా ఉన్న వానిని పూజించి కన్యాదానం చేయుట అంటే అతనిని దైవంగా భావించి ప్రీతి నోన్దించుట .
 
 * ఆర్షం - 
    
ధర్మార్ధం గా , గోమిదునం ను గ్రహించి దానికి బదులుగా కన్యాదానం చేయుట అంటే ఇదొక విధమైన కన్యాశుల్కం.అనబడు ఒలి అంటే బదులకు బదులు.
 
* ప్రాజాపత్యం - 
      
 నేను ఇంకొక ఆశ్రముముని స్వీకరించక గృహస్తామునే ఉండి గృహస్థ ధర్మములు నిర్వహిస్తాను అని వరునిచే ప్రమాణం చేయించి కన్యాదానం చేయుట . ఇది కాశి యాత్ర పేరున వివాహం లొ కలదు.ఎట్టి పరిస్థితులలో నేను నా భార్యను వదలను అని ప్రమాణం చేయుట .

 * రాక్షసం - 
     
 కన్య మొరపెట్టుకోనినను వినక బలవంతంగా ఎత్తుకోనిపోయి వివాహం ఆడుట . అయితే ఇది ఆరోజులలో బలాబలాల ప్రదర్శన పైన మేటి వీరునిగా అందరిని గెలిచి కన్యని తీసుకుని పోయి వివాహం ఆడుట .ఇది చొర పద్ధతి .
 
 * అసురం - 
        
 ఇదోరకం కన్యాశుల్కం.పిల్లకు,
కన్యదాతకు కొంత ముట్టజెప్పి వివాహం ఆడుట.దీనిని ఓలి మనువు అంటారు.
 
 * గాంధర్వం - 
      
 ప్రేమించి పెళ్లి చేసుకోవడం  .
 
* పైశాచికం - 
   
దీనిని "పిశాచ పీడ" అని అంటారు. నిద్రలోగాని , మైకములో గాని , తన శీల విషయంలో పరాకుగా ఉన్న కన్యను ఆకస్మికం గా మెరుపుదాడి చేసి సంబోగించి చేసుకోను వివాహమును, ఏదో మిషతో శీలం చేరిచి తిరిగి ఆమెనే వివాహం ఆడుట పైశాచిక వివాహం అనబడును.
 
అష్టవిద నాయకలు -
 
* ప్రోషిత భర్త - 
 
    భర్త పరదేశమునకు పోగా ఒంటరి అయి ఉండి పతి ఆగమమున నీరిక్షణ కలది.
 
* ఖండిత - 
 
ఇతర స్త్రీలతో కూడి వచ్చిన సంగతి తెలిసి భర్తని ద్వేషించునది. 
 
 * కలహంతరత - 
   
    భర్తను అవమానపరచి పరితాపం నోన్దునది.
 
 * విప్రలబ్ద -
    
ప్రియుని చూడదలచి సంకేతం తో ప్రియునికి రాయబారం పంపునది.
  
* వాసవ సజ్జిక - 
  
భర్త వచ్చుచున్నాడని సంతొషం తొ భర్త రాకకై శయ్యను అలంకరించు నాయక .
  
* స్వాధీన పతిక - 
    
భర్తను తన చెప్పుచేతుల్లో ఉంచుకోనునుది. గీచిన గీటు దాటని మగాడు కల ఆడది.
 
 * అభిసారిక -
  
బంగారు బొమ్మలా శృంగారించుకొని సంకేత స్థలమునకు వెళ్లు నాయక.
 
 * వరిహోత్కంటిక - 
      
ప్రియుడు ఎంతసేపటికి రాడని విరహాగ్ని చేత తపించ బడు నాయక.

 పెండ్లి అయ్యాక భార్య ఏ నాయకో గ్రహింప మర్మం ఇది.

 వివాహం - 
 
స్త్రీకి 18 నుంచి 21 సంవత్సరములకు మద్య , పురుషునకు 21 నుంచి 27 సంవత్సరముల మద్య వివాహానికి తగిన సమయం.వివాహం కన్యకు సమవర్ష ప్రాయం లొను, పురుషునకు విషమవర్శ ప్రాయం లొను వివాహం చేయవలెను .వివాహానికి లగ్నబలం ఎంతో ముఖ్యమైనది. లగ్నం సాద్యమైనంత వరకు బలం, శుద్ధమైనధి, దొషం లేకుండా ఉండాలి. శాస్త్రం చెప్పిన 21 దోషాలలో సాధ్యమైనవి వదిలేసి శుభలగ్నం పెట్టాలి .

 వివాహానికి శుభమైన వారములు. - 
 
 సొమ, గురు, శుక్ర వారములు శ్రేష్టమైనవి.ఆది, మంగళ , శని వారములు అశుభములు. జన్మ కుండలిలో రవి, శని, కుజులు వివాహా కారకులు.అయినను ఆది, మంగళ , శని వారములలొ జరపవచ్చు. బుద, గురు, శుక్ర వారములు శుబధాయకం . ఆది, శని వారములు మధ్యమం, మంగళవారం దుఖప్రధం. సోమవారం వధువుకు సవితి కలుగజేయును. పునర్వివాహం వరునికి కలగాజేయును.
 
వివాహానికి తిధులు - 

 అష్టమి, షష్టి , అమావాస్య, తిదులు తప్ప మిగిలిన అన్ని తిధులు స్వీకరించవచ్చు.అందులొ శుక్ల తిధులు శ్రేష్టమైనవి.

 వివాహానికి సరైన నక్షత్రాలు. - 
 అందరి చేత సమ్మతించబడిన శుభ నక్షత్రాలు  రోహిణి , మృగశిర, మఖ, ఉత్తర, హస్త, స్వాతి , మూల , అనురాధ, రేవతి . మధ్యమం అయిన నక్షత్రాలు అశ్విని, చిత్త, ధనిష్ఠ, శ్రవణం,ఉత్తరాబాద్ర,లలొ కొన్ని నక్షత్రాలు స్వీకరించవచ్చు. రోహిణి , పునర్వసు , హస్త, జైష్ట , శ్రావణం, రేవతి నక్షత్రాలను కారకత్వాన్ని బట్టి ఎక్కువ శుభామైనవి గా భావించాలి. ముఖ్యం గా నక్షత్రం నందు పాపగ్రహ సంచారం గాని , పాపగ్రహ దృష్టి గాని ఉండరాదు. జన్మ నక్షత్రమునకు 10 వ నక్షత్రములో మరియు జన్మ నక్షత్రములొ వివాహం చేయరాదు .

 వివాహ యోగములు - 
 వ్యరిపాత, వైద్రుతి యోగాములను పూర్తి గాను , పరి యోగములకు మొదటి సగాబాగమును , వివాహమునకు పూర్తిగా వర్జించవలెను . మిగిలిన వాటిలో శుభయోగములను తీసుకొనుట ఉత్తమము.

 వివాహ కరణములు -

 వివాహమునకు అన్ని శుభ కరణములు స్వీకరించ వచ్చు. విష్టి కరణమును పూర్తిగా వదిలివేయవలెను.

 వివాహ లగ్నం -
  
వివాహ లగ్నం చాలా బలం గా ఉండాలి. వివాహ లగ్నం బలం గా ఉంటే ఆ జంట ఎటువంటి మనోవ్యాధి పీడితులు కాకుండా విడదీయలేని బంధం గా ఉంటారు. వివాహం చేయుటకు ఉత్తరాయణ కాలం చాలా ఉత్తమం అయినది.పెల్లికుమారుని కంటే పెళ్లి కూతురు మంచి జాతకురాలు అయ్యి, మంచి సాముద్రికా లక్షణాలు కలిగి ఉంటే దన, పుత్ర వంతురాలు అవుతుంది. మిధున, కర్కాటక, సింహ, కన్య , తుల, ధనుస్సు,కుంభ లగ్నాలు మంచివి.మిక్కిలి శ్రేష్టమైనవి. రవి కర్కాటక , కన్యా రాశులలో ఉన్నప్పుడు ఈ రాశులను వివాహ లగ్నాలుగా స్వీకరించ రాదు.
 
వివాహనికి మాసములు - 

 వైశాఖం, జైష్టం, మాగం , ఫాల్గుణం, మాసాలు వివాహానికి శ్రేష్టమైనవి . సుర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలం లొ ఉన్నప్పుడు వచ్చే మాసాలు శ్రేష్టమైనవి.మార్గశిరం మధ్యమం, ఆషాడ , కార్తీకాలు నిన్ధ్యములు. మేష , చైత్రములు కూడా ప్రశస్తం .
    
  

స్వర్ణభస్మం ఉపయోగాలు - సంపూర్ణ వివరణ .

స్వర్ణభస్మం ఉపయోగాలు  - సంపూర్ణ వివరణ . 
      
కొన్నిరకాల వ్యాధులలో మరియు కొన్ని మొండి జబ్బులలో ఔషధాలుగా మూలికలు కు బదులుగా భస్మాలు ఉపయోగించడం జరుగుతుంది. వీటి ఫలితం కొన్ని సమయాలలో ఎలా ఉంటుంది అంటే అల్లోపతి వైద్యవిధానంలో ఇంజక్షన్ మందు పనిచేసే సమయంకంటే లోపలే ఈ భస్మ ఔషధం అత్యంత వేగంగా ఫలితాన్ని ఇవ్వగలదు . 
                
      ప్రస్తుత పరిస్థితులలో కూడా ఇంకా భస్మాలు తయారు చేసే ప్రక్రియ మరియు తయారుచేసే వ్యక్తులు ఇంకా ఉన్నారు . మూలికలు ఉపయోగించి ఔషదాలు తయారు చేసే ప్రక్రియకు పూర్తి బిన్నదిశలో ఈ భస్మ తయారి ప్రక్రియ ఉంటుంది.  
    
      మొదట మనం తయారు చేయాలి అనుకుంటున్న భస్మానికి మూల ధాతువుని సేకరించుకోవాలి . ఉదాహరణకి చెప్పాలంటే స్వర్ణభస్మ తయారి విధానం గురించి మీకు వివరిస్తాను .
         
. మంచి స్వర్ణపు రేకులను సేకరించుకొనవలెను . అది అత్యంత స్వచ్ఛమైనది అయి ఉండవలెను . ఆ రేకులను మొదట కాల్చి నువ్వులనూనె , పుల్లటి మజ్జిగ , ఉలవ కట్టు , ఆవుపంచితం వీనిలో 7 పర్యాయములు వేసిన శుద్ది అగును. లేదా ఎర్రటి ముండ్ల తోటకూర నూరి ఆ రసము నందు బంగారు రేకులను 2 దినములు నానబెట్టినను స్వర్ణం శుద్ది అగును. 
                   
      ఆ విధంగా శుద్ది అయినటువంటి స్వర్ణపు రేకులను చిన్న కుండ యందు ఉంచి పైన ఒక మట్టిచిప్ప బోర్లించి లోపలికి వాయుప్రసారం జరగకుండా చుట్టూ చీల మన్ను ఉపయోగించి సీలు వేయవలెను . దానిని నడుము వరకు తీసినటువంటి గొయ్యి మధ్యభాగం నందు ఉంచి అన్నివైపులా సెగ తగిలేవిధంగా చుట్టూ ఆవుపిడకలని పేర్చుకుంటూ రావలెను . ఆ పిడకల సంఖ్య 500 వరకు ఉండవలెను . దీనినే ఆయుర్వేద పరిభాషలో            
" గజపుటం " అంటారు . 
                 
      ఈ విదంగా అన్నివైపుల సమానంగా పేర్చిన తరువాత మన ఇష్టదైవాన్ని మరియు ధన్వంతరిని ప్రార్ధించి ఒక క్రమ పద్దతిలో ఆ పిడకలని వెలిగించవలెను . ఆయొక్క పిడకల వేడికి లోపల ఉన్నటువంటి స్వర్ణపు రేకులు భస్మంగా మారతాయి.  ఆ తరువాత దానిని జాగ్రత్తగా సేకరించుకుని తగిన మోతాదుల్లో ఔషదాల్లో వాడుకోవచ్చు .  ఇది అత్యద్బుతంగా పనిచేయును . తరుచుగా కొన్ని ప్రత్యేక ఔషధాలలో నేను దీనిని వాడుతాను. 
            
       దీనిని ఉపయోగించుట వలన త్రిదోషములు అనగా వాత ,పిత్త ,కఫములు దోషం పొందడం వలన కలుగు వ్యాదులను పొగొట్టును. ముఖ్యంగా వాతవ్యాధులను హరించుటలో చాలా ఉపయోగపడును. లొపలికి తీసుకోవడడం వలన నేత్రవ్యాధులను హరించును . ఆయుషుని వృద్ధిపరుచును. బుద్దిని పెంచును. నేను ఇప్పటివరకు దీనిని చాలా రోగాలపై ప్రయోగించి విశేషమైన ఫలితాలు పొందాను. క్షయరోగం నివారించుటలో ఇది నాకు చాలా సహాయపడింది.  అజీర్ణం వలన కలుగు జ్వరాన్ని నివారించును. ఎంతో బలమైన ఔషదాలు వాడినను తగ్గని మొండి వ్యాదులను ఈ స్వర్ణభస్మ సేవన వలన తగ్గించవచ్చు.  
     
                  విషము తిని ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తి ముందు తామ్రభస్మంతో ముందు వాంతిని చేయించి  ఒక పావుతులం స్వర్ణ భస్మమును లొపలికి ఇచ్చిన విషము కంటే వేగముగా హృదయమును చేరి హృదయం నకు విషమును చేరకుండా అడ్డుకొనును . కాని పావుతులం ఒకేసారి ఒక్క మోతాదుగా ఇవ్వవలెను . 
              ఈ స్వర్ణభస్మముని 10 గ్రాములను 60 మోతాదులుగా లేదా 100 మోతాదుగా విభజించి వాడుకోవచ్చు . దీనిని ఎంత పెద్ద మోతాదులో వాడినను ఎటువంటి విపరీత పరిణామాలు సంభవించవు. మీకు ఎటువంటి సమస్యలు లేకున్నను ధనమును ఖర్చుపెట్టగలవారు వాడుకొనవచ్చు. 
          
. మంచి ఆరోగ్యం , మేధాశక్తి, హృదయమునుకు బలమునిచ్చును. రక్తపోటు వ్యాధి ఉన్నవారు దీనిని వాడటం వలన మంచిఫలితాన్ని పొందవచ్చు. ఇది పూర్తిగా రసాయన ఔషదం దీనిని ఉపయోగించువారికి పెట్టుడు మందులు మరియు విషములు వారిపై పనిచేయవు.  ఆపకుండా 20 సంవత్సరములు ఉపయొగించువారికి "కాయసిద్ధి " కలగచేయును . అనగా వయస్సు పెరుగుతున్నా ముసలి లక్షణములు కలగవు. 
           
  ఈ స్వర్ణభస్మానికి మరికొన్ని భస్మాలు కలిపి మధుమేహరోగులు తీసుకోవచ్చు. ఈ స్వర్ణభస్మ సేవించడం వలన మధుమేహ రోగులలో అంతర్గత అవయవాలు మధుమేహం పెరగటం వలన దెబ్బతినకుండా కాపాడవచ్చు. అదేవిధముగా స్త్రీలకు , పిల్లలకు లేహ్యాలలో కలిపి ఇవ్వడం ద్వారా వయస్సురీత్యా వచ్చు హార్మోనల్ సమస్యలకు మరియు శరీరంలో రోగనిరోధక శక్తి పెంపొందించుటకు అద్భుతముగా పనిచేయును . పిల్లలకు మంచి తెలివితేటలు కలుగును. మేధస్సు పెరుగును . శరీరదోషాలు పోగొట్టును. 
           
   మరికొన్ని ఉపయోగాలు కూడా మీకు వివరిస్తాను.

   *  స్వర్ణభస్మం త్రిదోష జనితవ్యాధులను పోగొట్టును . విశేషముగా వాతవ్యాధులను హరించును . 
 *  శరీరం నందలి వాత, పిత్త , శ్లేష్మాలను సమానస్థితి యందు ఉంచును. 
 * వీర్యమును అభివృద్ది చేయును . బలాన్ని కలిగించును. గొప్ప రసాయనఔషధము . 
 * స్వర్ణసేవన వలన నేత్రరోగములు హరించి నేత్రాలకు బలము కలుగును. 
 *  ఆయుష్షుని పెంచడంలో దీనికిదే సాటి . ఆయువుని వృద్ధిచేయు ఔషధములు లోకము నందు బహు అరుదుగా ఉన్నవి. ఆ ఔషధములలో స్వర్ణభస్మం ప్రధానమైనది. 
 *  ఇది అత్యంత శ్రేష్టమైనది  బుద్ధిబలాన్ని , జ్ఞాపకశక్తిని , ఆలోచనాశక్తిని అనగా బుద్ది , స్మృతి , మతిని కలిగించును. 
 *  ఉన్మాదం వంటి మానసిక రోగములను పోగొట్టును . 
 *  రక్తాన్ని  శుభ్రపరచును. శరీరకాంతి కలిగించును. 
 *  పాపము వలన సంక్రమించు రోగములను పోగొట్టు శక్తి కలిగినది . 
 *  క్షయరోగమును పోగొట్టటంలో శక్తివంతముగా పనిచేయును . 
 *  వ్యాధివలన కాని లేక మరేదైనా కారణం వలన శరీరం చిక్కిపోయినవారికి శరీరాన్ని బాగుచేసి కండపుష్ఠి కలిగించును. 
 *  రక్తము నందలి , ఉపిరితిత్తుల యందలి క్రిములను నాశనం చేయును . 
 *  జ్వరములను హరించును . 
 *  ఇతర ఔషధముల వలన తగ్గని మొండివ్యాధులు ఈ స్వర్ణభస్మ సేవన వలన తగ్గును . 
 *  పంచకర్మలు చేసినప్పుడు ఇది ఉపయొగించవలెను . 
 *  స్వర్ణభస్మ సేవన చేయువానికి పెట్టుడు మందులు , విషాలు ఎక్కవు. 
 * ఇది ఎంత పెద్ద మోతాదు వాడినను ప్రమాదము లేదు . వ్యాది బలాన్ని అనుసరించి 1 తులము 60 మోతాదుల నుండి 100 మోతాదులుగా వాడుకోవచ్చు . 
.*  శరీరం నందలి కండరాలు , ఎముకలు , నరాలకు అత్యంత శక్తికి ప్రసాదించును. 
 *  రక్తపోటు ( BP ) సమస్య నివారించును . 
 *  ఇది ఆపకుండా వాడిన ముసలితనమును దగ్గరకు రానివ్వదు. సమస్త  వాతరోగములను హరించును .