Tuesday, September 15, 2026

మంత్రాలకు..*చింతకాయలు *రాలుతాయా?*

*మంత్రాలకు..*చింతకాయలు *రాలుతాయా?*
          
*ప్రశ్న 1:*
`మంత్రాలు మనిషి ఆయుష్షును పెంచుతాయా? ఏ మంత్రం చదివితే ఆయుష్షు ఎలా పెరుగుతుందో ఆధునిక సైన్స్ ఎప్పుడైనా పరిశోధించిందా?

*జవాబు:*
`'అవును, కచ్చితంగా పరిశోధించింది!' ఆధునిక సైన్స్ కేవలం మంత్రం మీదే కాకుండా, ఆ మంత్రం పలికేటప్పుడు గొంతులో, నాభిలో పుట్టే పౌనఃపున్యం (Frequency) మరియు శ్వాస లయ (Rhythm) మీద దశాబ్దాలుగా ప్రయోగాలు చేసి అద్భుతమైన నిజాలను వెలికితీసింది. ఆయుష్షును పెంచే ప్రధానమైన మూడు నాదాలు/మంత్రాలు వాటిపై జరిగిన అంతర్జాతీయ పరిశోధనలు ఈ వాస్తవాలను నిర్ధారించాయి.

*ప్రశ్న 2:*
`గాయత్రీ మంత్రం మెదడు ఆయుష్షును (Cognitive Longevity) ఎలా పెంచుతుంది?

*జవాబు:*
`గాయత్రీ మంత్రం ఋగ్వేదంలో (3వ మండలం) ఉన్న అత్యంత శక్తివంతమైన మంత్రం.

`సైంటిఫిక్ నిరూపణ: న్యూఢిల్లీలోని ఎయిమ్స్ (AIIMS) మరియు ఐఐటీ (IIT Delhi) శాస్త్రవేత్తలు సంయుక్తంగా మ్యాగ్నెటోఎన్సెఫలోగ్రఫీ (MEG) స్కాన్ల ద్వారా భారీ ప్రయోగాలు చేశారు. ఈ మంత్రంలోని నిర్దిష్టమైన అక్షరాల (తత్ సవితుర్వరేణ్యం..) కలయికను పలికేటప్పుడు మెదడులోని 'ప్రీఫ్రంటల్ కార్టెక్స్' విపరీతంగా ఉత్తేజితం అవుతుందని తేలింది.

*ఆయుష్షు పెంపు:
`ఈ మంత్ర ఉచ్చారణ వల్ల మెదడులో 'గ్రే మ్యాటర్' పెరుగుతోంది. ఇది వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు (Dementia, Alzheimer's) రాకుండా అడ్డుకుంటుంది. మెదడు కణాలు త్వరగా క్షీణించకుండా కాపాడటం ద్వారా మనిషి మానసిక ఆయుష్షును ఇది పదిలపరుస్తుంది.

*ప్రశ్న 3:*
`గాయత్రీ మంత్రం ఏది? అందులో ఏ అక్షరాలు ఉంటాయి? దాని అర్థం ఏమిటి?
*జవాబు:* 
`"గాయంతం త్రాయతే ఇతి గాయత్రీ" – అంటే, ఎవరు దీనిని పఠిస్తారో, వారిని అజ్ఞానం, భయం మరియు జీవిత సమస్యల నుండి రక్షించే మంత్రం.
*గాయత్రి మంత్రం యొక్క
ప్రతి పదార్థ వివరణ:-

*ఓం (Om):*
`ప్రణవ నాదం, పరమాత్మ స్వరూపం.

*భూర్ (Bhūḥ):* 
`భూలోకం (అస్తిత్వానికి ఆధారం).

*భువః (Bhuvaḥ):* 
`భువర్లోకం (అంతరిక్షం, ప్రాణశక్తి).

*స్వః (Svaḥ):*
`సువర్లోకం (స్వర్గం, ఆనందమయ స్థితి).

*తత్ (Tat):*
`ఆ (నిర్గుణ పరబ్రహ్మను సూచించేది).

*సవితుర్ (Savitur):*
`సకల సృష్టికి మూలమైన ఆ ప్రేరణ శక్తికి (ప్రేరకుడు).

*వరేణ్యం (Vareṇyam):* `కోరుకోదగిన అత్యున్నతమైన, లేదా వరించదగిన ఆరాధించ దగిన.

*భర్గః (Bhargaḥ):*
`పాపాలను, అజ్ఞానాన్ని దహించే దైవిక తేజస్సు.

*దేవస్య (Devasya):*
`ప్రకాశించే స్వభావం గల దైవం యొక్క.

*ధీమహి (Dhīmahi):*
`మేము ధ్యానిస్తున్నాము.

*ధియో (Dhiyaḥ):*
`బుద్ధులను.

*యో (Yaḥ):* 
`ఏ (తేజశ్శక్తి/పరమాత్మ) అయితే.

*నః (Naḥ):*
`*మమ్మల్ని / మా యొక్క.

*ప్రచోదయాత్ (Pracodayāt):* `ప్రేరేపించుగాక (సన్మార్గంలో నడిపించుగాక.

`చాలా ప్రార్థనలూ మంత్రాలూ వ్యక్తిగత కోరికల కోసం ఉంటాయి. కానీ గాయత్రి 'నః' (మా యొక్క) `అని వేడుకుంటుంది. అంటే, ఇది లోకంలోని సమస్త మానవాళికి కావలసన* 'జ్ఞానం' ఇంకా 'వివేకం' `*కోసం చేసే సార్వత్రిక ప్రార్థన.*

*ప్రశ్న 4:* 
`మంత్రాలు పఠిస్తున్నప్పుడు 'వేగస్ నెర్వ్' `ఎలా యాక్టివేట్ అవుతుంది? అప్పుడు విడుదలయ్యే ద్రవం ఏమిటి?
*జవాబు:* 
`మన శరీరంలోని 10వ క్రానియల్ నెర్వ్ అయిన ` 'వేగస్ నెర్వ్' (Vagus Nerve) `మెదడు నుండి మొదలై, గొంతు (Vocal cords), గుండె, మరియు జీర్ణవ్యవస్థల గుండా ప్రయాణిస్తుంది.

`మంత్రం పఠించేటప్పుడు మనం 'దీర్ఘ శ్వాస' తీసుకుని, శబ్దాన్ని ఉచ్చరిస్తూ 'నెమ్మదిగా గాలి వదులుతాము' (Extended exhalation).

`వేగస్ నెర్వ్ గాలి వదిలే సమయంలో మరియు గొంతులో వచ్చే ప్రకంపనల (Vibrations) వల్ల యాక్టివేట్ అవుతుంది.

`*అప్పుడు విడుదలయ్యే ద్రవం* ఎసిటైల్ కొలిన్ (Acetylcholine). `(1921లో ఒట్టో లోవి దీనిని కనుగొని దీనికి Vagusstoff అని పేరు పెట్టారు).

`ఈ రసాయనం గుండె రక్తనాళాలను విశాలం చేసి, హృదయ స్పందనను నెమ్మదించేలా చేస్తుంది. శరీరంలో ఒత్తిడి ఆగిపోయి,
 'రెస్ట్ అండ్ డైజెస్ట్' (Rest and Digest) `అనే ప్రశాంతమైన వ్యవస్థ యాక్టివేట్ అవుతుంది.

*ప్రశ్న 5:*
`ప్రాచీనులు సూచించినట్లు 108 సార్లు పఠించడానికి ఎంత సమయం పడుతుంది?
*జవాబు:*
`ప్రాచీనులు సూచించిన క్రమబద్ధమైన శ్వాస (Resonant breathing) ప్రకారం, ఒక మనిషి నిమిషానికి 5.5 నుండి 6 సార్లు శ్వాస తీసుకోవాలి.

`*ఒకసారి గాయత్రీ మంత్రం పఠించడానికి (దీర్ఘంగా గాలి పీల్చి, మంత్రం ఉచ్చరిస్తూ గాలి వదలడానికి) సుమారు 10 సెకన్ల సమయం పడుతుంది. అనగా నిమిషానికి సరిగ్గా 6 సార్లు.*

`108 సార్లు పూర్తి చేయడానికి: 108 / 6 = సరిగ్గా 18 నిమిషాలు పడుతుంది. (సగటున 5.5 శ్వాసల చొప్పున పఠిస్తే సుమారు 20 నిమిషాలు పడుతుంది).

*ప్రశ్న 6:*
`మహామృత్యుంజయ మంత్రం కణాల మరమ్మత్తు (Cellular Repair) ఎలా చేస్తుంది?
*జవాబు:*
 "త్ర్యంబకం యజామహే.." `అంటూ సాగే ఈ మంత్రం ఋగ్వేదంలో (7వ మండలం) ఉంది. ఇది ప్రాణరక్షణకు ప్రసిద్ధి.

*సైంటిఫిక్ నిరూపణ: `హార్వర్డ్ మెడికల్ స్కూల్ (USA) మరియు ఎన్‌ఐఎంహెచ్‌ఎన్ఎస్ (NIMHANS - India) అధ్యయనాల ప్రకారం, ఈ మంత్రంలోని మహాప్రాణ అక్షరాల కూర్పు దేహంలో 'లో-ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్స్' `సృష్టిస్తుంది..

*ఆయుష్షు పెంపు: `ఈ వైబ్రేషన్స్ శరీరంలో దీర్ఘకాలిక వాపును (Chronic Inflammation) తగ్గించి, ప్రమాదకరమైన
 'సైటోకిన్' (Cytokines) `స్థాయిలను నియంత్రిస్తాయి. ముఖ్యంగా కణాలలో ఉండే 'టెలోమెరేస్' (Telomerase) `అనే ఆయుష్షు ఎంజైమ్‌ను చురుగ్గా మారుస్తాయి. దీనివల్ల కణాలు ముసలిబారిపోవడం (Cellular Senescence) నెమ్మదిస్తుంది.

*ప్రశ్న 7:* 
`'ఓం' కారం (Pranava Nada) చదవడం వల్ల గుండెకు జరిగే లాభం ఏమిటి?
*జవాబు:*
`వేద మంత్రాలకు మూలం ఈ ఓంకారమే. జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధన ప్రకారం, 'ఓం' అని దీర్ఘంగా పలికినప్పుడు వచ్చే అనునాదం (Resonance) కచ్చితంగా 0.1 Hz పౌనఃపున్యానికి వస్తుంది (ఇది భూమి సహజ పౌనఃపున్యం). దీనివల్ల 'హార్ట్ రేట్ వేరియబిలిటీ' (HRV) పెరుగుతుంది. ఎవరికైతే గుండె లయ (HRV) ఎక్కువగా ఉంటుందో, వారు వందేళ్లు దాటి జీవిస్తారని మెడికల్ సైన్స్ ఘంటాపథంగా చెబుతోంది.

*ప్రశ్న 8:*
`*ఈ మంత్రాలను ఎవరు, ఎక్కడ, ఎంతసేపు చదవాలి? (The Protocol)*
*జవాబు:* 
`మంత్రం అనేది ఒక బయోలాజికల్ టూల్ (Biological tool). దానికీ కులానికీ, మతానికీ సంబంధం లేదు.

*ఎవరు చదవాలి?: `ఎవరైనా చదవచ్చు. స్త్రీ, పురుషులు, పిల్లలు, పెద్దలు ఎవరైనా ఉచ్చారణ దోషం లేకుండా స్పష్టంగా పలకగలిగే ప్రతి ఒక్కరూ చదవవచ్చ.*`

*ఎక్కడ చదవాలి?: `ఇంట్లో గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే చోట లేదా ఆరుబయట. ఎందుకంటే, మహాప్రాణాలు పలికేటప్పుడు ఊపిరితిత్తులకు స్వచ్ఛమైన ఆక్సిజన్ అవసరం.

*ఎంతసేపు చదవాలి?: `రోజంతా జపమాలలు పట్టుకుని కూర్చోవాల్సిన పనిలేదు. ఉదయం ప్రశాంతమైన వాతావరణంలో కేవలం 10-15 నిమిషాలు లయబద్ధంగా పఠిస్తే చాలు. ఇది డాక్టర్ హెర్బర్ట్ బెన్సన్ చెప్పిన*` 'రిలాక్సేషన్ రెస్పాన్స్' (Relaxation Response) `ను యాక్టివేట్ చేసి, రోజంతా కణాలను సేఫ్ మోడ్‌లో ఉంచుతుంది.*

*శాస్త్రీయ ఆధారాలు:
`వేద మంత్రాల లయబద్ధమైన పఠనం శరీరంలో ఒక 'బయో-ఎకౌస్టిక్ రెజోనెన్స్' (జీవ-ధ్వని అనునాదం) `సృష్టిస్తుందని నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్ (NBRC) నిరూపించింది. ఈ ప్రక్రియ వల్ల శరీరంలో ఒత్తిడి తగ్గి, కణాలలో 'టెలోమెరేస్' (Telomerase) `*అనే ఎంజైమ్ చురుగ్గా మారుతుంది. సైన్స్ ప్రకారం, ఈ ఎంజైమ్ నేరుగా మనిషి కణాల ఆయుష్షును పెంచడానికి మరియు జన్యువుల మరమ్మత్తుకు కారణమవుతుంది*

*Proof 2: `ఎయిమ్స్ (AIIMS) మరియు ఐఐటీ ఢిల్లీ సంయుక్తంగా నిర్వహించిన fMRI పరిశోధనల్లో, గాయత్రీ మంత్రం* పఠించడం వల్ల మెదడులోని` ప్రీఫ్రంటల్ కార్టెక్స్ `అత్యంత చురుగ్గా మారినట్లు తేలింది. ఈ నాడీ ఉత్తేజం వల్ల వయసు పైబడే కొద్దీ వచ్చే 'మతిమరుపు' (Dementia) `వంటి మెదడు సంబంధిత వ్యాధులు రాకుండా అడ్డకోబడతాయి*.

*Proof 3: 
`ఇటలీ పరిశోధకుడు డాక్టర్ లూసియానో బెర్నార్డి నిర్వహించిన అధ్యయనంలో, వయోజనులు లయబద్ధంగా మంత్రాలను పఠిస్తున్నప్పుడు వారి శ్వాస రేటు సహజంగానే నిమిషానికి కచ్చితంగా 6 శ్వాసలకు పడిపోయిందని నిరూపించబడింది. ఈ కచ్చితమైన ఫ్రీక్వెన్సీ నేరుగా వేగస్ నెర్వ్‌ను ప్రేరేపించి, అత్యంత లోతైన శారీరక ప్రశాంతతను మరియు మెరుగైన గుండె ఆరోగ్యాన్ని ఇచ్చిందని స్పష్టమైంది

*#ఆధారం: 
`బ్రిటీష్ మెడికల్ జర్నల్ (BMJ), సంపుటం 323, పేజీలు 1446-1449.
                             -సేకరణ.
.

Saturday, September 12, 2026

సన్యాసి అంటే ఎవరు ?**అవధూత అంటే ఎవరు ?*

*సన్యాసి అంటే ఎవరు ?*

*అవధూత అంటే ఎవరు ?* 


ఆధ్యాత్మిక ప్రయాణంలో *సన్యాసం* అంటే కేవలం గృహాన్ని, బంధువులను, సంపదను విడిచిపెట్టడం మాత్రమే కాదు. 

లౌకిక విషయాలపై ఆసక్తి తగ్గించుకుని, మమకారం–అహంకారాలను అధిగమించి, ఆత్మజ్ఞానం మరియు మోక్షసాధన వైపు జీవితం పూర్తిగా మళ్లించుకోవడం సన్యాస భావన.

సన్యాసుల స్థితులను, వారి ఆచారాలను వివిధ సన్యాసోపనిషత్తులు వివిధ విధాలుగా వివరిస్తాయి. 

నారద పరివ్రాజకోపనిషత్ ఆరు రకాల పరివ్రాజకులను పేర్కొంటుంది.

🔸 ౧. కుటీచకుడు

నిర్దిష్టమైన ప్రదేశంలో నివసిస్తూ, శిఖ, యజ్ఞోపవీతం, దండం, కమండలువు వంటి చిహ్నాలను ధరించి, నియమబద్ధమైన సాధనలో జీవించేవాడు.

🔸 ౨. బహూదకుడు

భిక్ష ద్వారా దేహధారణ చేస్తూ, నియమబద్ధమైన జీవితం మరియు సాధనను కొనసాగించేవాడు. ఆహారాన్ని భోగం కోసం కాకుండా దేహధారణకు అవసరమైనదిగా మాత్రమే స్వీకరిస్తాడు.

🔸 ౩. హంసుడు

వైరాగ్యంతో సంచరిస్తూ, జపం, ధ్యానం, ఆత్మవిచారణ వంటి సాధనలలో నిమగ్నమై ఉండేవాడు.

🔸 ౪. పరమహంసుడు

బాహ్య చిహ్నాలు, లౌకిక సౌకర్యాలపై ఆధారపడకుండా, అత్యల్ప అవసరాలతో జీవిస్తూ ఆత్మజ్ఞానం, ధ్యానం, బ్రహ్మవిచారణలో స్థిరంగా ఉండేవాడు.

🔸 ౫. తురీయాతీతుడు

జాగ్రత్, స్వప్న, సుషుప్తి స్థితులకు అతీతమైన తురీయ చైతన్యాన్ని లక్ష్యంగా చేసుకుని, దేహాభిమానాన్ని అధిగమించిన స్థితిలో ఉండేవాడిగా వర్ణించబడతాడు.

🔶 ౬. అవధూతుడు

ఈ ఆరు స్థితులలో అత్యంత విశిష్టమైన స్థితిగా అవధూతుని పేర్కొంటారు.

అవధూతుడు అంటే పిచ్చివాడిలా తిరిగేవాడు కాదు. విచిత్రమైన వేషధారణ కలిగినవాడని మాత్రమే కూడా అర్థం కాదు.

*దేహాభిమానం, అహంకారం, మమకారం, గౌరవ–అవమాన భావనలు, సుఖ–దుఃఖ ద్వంద్వాలు వంటి బంధనాలను అధిగమించి, ఆత్మతత్త్వంలో స్థిరపడిన జ్ఞాని అవధూతుడు.*

అతని దృష్టిలో ఈ నశ్వరమైన శరీరం తన అసలు స్వరూపం కాదు. ఆత్మస్వరూపమే తన నిజమైన స్వరూపమనే జ్ఞానంలో అతడు స్థిరంగా ఉంటాడు.

అందువల్ల అవధూతత్వం బాహ్య వేషంలో కాదు — ఆత్మజ్ఞానంలో ఉంది.


సన్యాసి — 

లౌకిక బంధాలను, ఆసక్తులను అధిగమించి ఆత్మజ్ఞానం–మోక్షసాధన వైపు పయనించేవాడు.

అవధూతుడు — 

ఆత్మజ్ఞానంలో స్థిరపడి, బాహ్య బంధనాలకు అతీతమైన స్థితిని పొందిన జ్ఞాని.

బయటి ప్రపంచాన్ని విడిచిపెట్టడం కంటే, మనస్సులోని “నేను–నాది” అనే బంధాన్ని విడిచిపెట్టడమే నిజమైన త్యాగానికి పరమార్థం.

ఆత్మజ్ఞానమే పరమ లక్ష్యం. 


Thursday, September 10, 2026

తెలుగు అక్షరాలన్నింటితో పెళ్లి ఆహ్వానం ఎలా ఉందో మీరే చూడండి...

*తెలుగు అక్షరాలన్నింటితో పెళ్లి ఆహ్వానం ఎలా ఉందో మీరే చూడండి...* 
..............................................
తెలుగు వర్ణమాలతో పెళ్లి ఆహ్వానం
...............................................

అ :- అరుదైన అమ్మాయి
ఆ :- ఆకతాయి అబ్బాయి
ఇ :- ఇద్దరికి
ఈ :- ఈడు జోడి కుదిరి
ఉ :- ఉంగరాలను తొడిగి
ఊ :- ఊరంతా ఊరేగించారు
ఋ :- ఋణాల కోసం
ఎ :- ఎ వరెవరినో అడుగుతూ ఉంటే
ఏ :- ఏనుగు లాంటి కుభేరుడితో అడిగి
ఐ :- ఐశ్వర్యం అనే కట్నం ఇచ్చి
ఒ :- ఒకరికి ఒకరు వియ్యంకులవారు
ఓ :- ఓర్పుతో ఒప్పందం చేసుకొని
ఔ :- ఔదార్యాని ఇరు కుటుంబాలకు
అం :- అందించాలని కోరుకుంటూ
అ :- అ : అంటూ
క :- కలపతో తయారయిన పత్రికలపై కలంతో రాసిచ్చి
ఖ :- ఖడ్గలతో నరికిన పందిరి ఆకులను
గ :- గడప ముందుకు తీసుకొచ్చి
ఘ :- ఘనమైన ఏర్పాట్లు చేయించి
చ :- చాపుల (బట్టలు)నింటిని కొని
ఛ :- ఛత్రం (గొడుగు) పట్టి గండదీపాని
జ :- జరిపిస్తూ
ఝ :- ఝాము రాత్రి దాక
ట :- ట పకాయలను కాలుస్తూ
ఠ :- ఠీవిగా (వైభవంగా)
డ :- డ ప్పులతో
ఢ :- ఢం ఢం అని శబ్దాలతో సాగుతుంది
ణ :- కంక ణా లు చేతికి కట్టుకొని
త :- తట్టలో తమలపాకులు పట్టుకొని
థ :- థమన్(మ్యూజిక్ డైరెక్టర్) డప్పులతో
ద :- దగ్గరి బంధువులను పిలిచి
ధ :- ధ నవంతులను కూడా పిలిచి
న :- న అనే నలుగురిని పిలిచి
ప :- పది మందిని పలకరిస్తూ
ఫ :- ఫంక్షన్ కి రావాలని చెప్తూ
బ :- బ లగాలతో బంగార దుకాణాలకు వెళ్లి
భ :- భటువులని (ఆభరణాలు) కొని
మ :- మంగళ స్నానాలు చేయించి, రాజసూయ
య :- యాగం లాంటి పెళ్లికి
ర :- రా రండోయ్ వేడుక చూద్దాం అని చెప్పి
ల :- లక్షణమైన
వ :- వధూవరులను మీరు
శ :- శతమానం భవతి అని
ష :- షరతులు లేకుండా ఆశీర్వదించడానికి
స :- సప్తపది (పెళ్లి) వేడుకలో
హ :- హంగు ఆర్భాటాలతో రెడీ అయిన మండపంలో
ళ :- క ళ త్రం (భార్య) కాబోతున్న ఆమె ప్రక్కన వరుడు కూర్చొని
క్ష :- క్షత్రియ చెంత ఉండే బ్రాహ్మణుల సాక్షిగా జరిగే ఈ పెళ్లికి
ఱ :- ఱండి
 *తెలుగు భాష చమత్కారాలు ఎంతో వైవిధ్యంగా ఉంటుంది. అందుకే అన్నారు దేశ బాషలందు తెలుగు లెస్స అని....👏* 🙂

Sunday, September 6, 2026

పొందాలి" అంటే ముందు "ఇవ్వాలి" - అంతా ఈ జన్మలోనే...

💰💸 సంపద విజయ రహస్యాలు 💸💰

*రహస్యం*

 అంశం: దానం - ప్రధానం


"పొందాలి" అంటే ముందు "ఇవ్వాలి" - అంతా ఈ జన్మలోనే...

మీరు మనస్ఫూర్తిగా ఆశించినంత సంపదను, మీరు హృదయ పూర్వంగా కోరుకున్న సంపదను, మీరు భౌతికంగా అనుభవించాలి అనుకున్న సంపదను, ఖచ్చితంగా పొందాలి అనుకుంటే, మీరు ఇతరులకు ఏదైన దానం చేయడం అనే "అవకాశం" ద్వారా అనంత విశ్వం ఆశీస్సులతో అనంత సంపదని పొందడానికి మార్గం సుగమం అవుతుంది.
ఇది సంపద విజయ రహస్యాలు...
 దానం చేస్తే పుణ్యం రాదు - దానం చేస్తే సంపద పొందుతారు. ఇది నిరూపించబడిన నిజం
(పుణ్యం అనేది విశ్వంలో లేదు)

 విద్య దానం - జ్ఞాన దానం - మహా దానం

బహిరంగ దానం, గుప్త దానం అని ముఖ్యంగా రెండు రకాల దానాలు ఉన్నాయి.

★ దానం(Donation) ఏదైనా ఇతరులకు అడిగినా, అడగకపోయినా, ఎవరికైనా వారి అవసరాలకోసం ఇవ్వడం.
★ దానం చేసిన వ్యక్తిని దాత(Donor) అంటారు. 
★ దానం తీసుకునే వారిని
గ్రహీతలు అంటారు.
★ దానం ఇమ్మని అర్ధించేవారిని యాచకులు అంటారు.

★ దానం ఇచ్చేవి ధనం, వస్తువు, ఆభరణాలు, భూమి, రూపంలో గాని సేవా రూపంలో గాని ఉంటుంది. దుస్తులు, పుస్తకాలు, బొమ్మలు, ఆహార పదార్ధాలు, వాహనాలు, పశువులు, మొదలైన వస్తువులు దానం చేస్తారు.

★ ఆపత్కాల దానం
 భూకంపం, వరదలు వంటి కొన్ని అత్యవసర పరిస్థితులలో మానవతాదృష్ట్యా వారి జీవనానికి అవసరమైన వాటన్నింటినీ కొందరు వ్యక్తులు, సంస్థలు బాధితులకు దానం అందిస్తాయి.

★ రక్త దానం(Blood Donation) అనేది ప్రాణ దానం తో సమానం. రోగ నివారణ గమ్యంగా పెట్టుకుని లేదా అత్యవసర పరిస్థితుల్లో ఒకరి రక్తం, మరొకరికి ఇచ్చే పద్ధతిని రక్త దానం అంటారు. ప్రపంచంలో చాల మంది తమ రక్తాన్ని దానం చేస్తారు.

★ అవయవ దానం  
 వైద్యంలో ఒక వ్యక్తికి అవసరమైన రక్తం, వివిధ అవయవాలను కొందరు దానం ఇచ్చే అవసరం ఉంది. 'అమ్మకం' అనకుండా 'దానం' అని ఎందుకు అన్నారంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నైతిక విలువల ప్రకారం ఒకరి శరీరంలో ఉన్న అవయవాలని కంటి పొర (Cornea), చర్మం (Skin), గుండె (Heart), మూత్రపిండం (Kidney), రక్తం, వగైరాలు మరొకరి అవసరానికి వాడ దలుచుకున్నప్పుడు వాటిని దాత స్వచ్ఛందంగా ఇవ్వాలే తప్ప వ్యాపార దృష్టితో అమ్మకూడదు.
 కళ్ళు, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు కూడా దానమిస్తున్నారు. దీనిని *అవయవ దానం (Organ Donation)* అంటారు. 

★ అన్న దానం
ఆకలితో ఉన్న వ్యక్తికి పిడికెడు అన్నాన్ని దానం చేసిన వ్యక్తి ధన్యుడు. ముఖ్యంగా కరువు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఇవి ఇంకా అవసరం. అలాంటి క్లిష్ట సమయాలలో అన్నదానం చేసిన వ్యక్తిని ప్రజలంతా దేవునితో సమానంగా పూజిస్తారు.

★ కన్యాదానం
కన్యాదానం వివాహంలో పెళ్ళికూతురు తండ్రి, కన్యగా తన కూతుర్ని ఇచ్చే దానం. వరకట్న ప్రభావం వల్ల ఇది కన్యతో పాటు ధన వస్తు కనక వాహన దానం గా కూడా పేరుగాంచింది.

★ భూదానం - గోదానం - సువర్ణ దానం
 వేదకాలంలో వందలలో, వేలల్లో ఆవులను దానం చేసేవారు. వందల ఎకరాలు భూమిని దానం చేసేవారు...
 తరువాతి కాలంలో చక్రవర్తులు, రాజులు, ప్రభువులు ప్రజలకు పశువులను, జీవాలను (గొఱ్ఱెలు, మేకలు మొ౹౹) దానం చేసేవారు. 
మొన్నటి వరకు కూడా భాగ్యవంతులు బంగారము, వెండి, రత్నాలు, ముత్యాలు కూడా దానం ఇచ్చారు. వేల రెట్లు సంపద పొదారు...

క్రైస్తవ, ముస్లీం, బౌద్ధ, హిందూ, యూదా, జైన మొదలగు అన్ని మతలలో, దానం గురించి చాలా చోట్ల ప్రస్తావన వస్తుంది...

 పురాణాలలో దానం 
◆ వైశాఖమాసము దానాలు ఇవ్వడానికి ప్రశస్తమైన మాసంగా పురాణాలు పేర్కొన్నాయి. 
◆ బలి చక్రవర్తి మూడడుగులు విష్ణుమూర్తికి దానం చేసి చిరస్మరణీయుడైనాడు.
◆ శిబి చక్రవర్తి పావురం రూపంలో వచ్చిన దేవతలకు తన శరీరాన్ని కోసి దానం ఇచ్చిన ఉత్తముడు.
◆ కర్ణుడు తనకు సహజంగా ఉన్నకవచకుండలాలను రక్షకకవచాన్ని దానం చేసి "దాన కర్ణుడి"గా నిలిచాడు.
◆ ఏకలవ్యుడు తన బొటనవేలును కోసి ఇచ్చాడు.

★ అపాత్రదానం
 మానవునికి ఉన్న సుగుణాలలో ఒకటి దానం చేయడం.
 దానం చేసే వ్యక్తి దానం స్వీకరించే వ్యక్తి దానం స్వీకరించడానికి తగిన పాత్రుడా కాదా అని ఆలోచించి లేదా రుజువు చేసుకొని అతను దాన స్వీకరణకు అర్హుడు అయినట్లయితే అతనికి దానం ఇవ్వాలి.
 దానం స్వీకరించే వ్యక్తి దాన స్వీకరణకు తగిన పాత్రుడు కానప్పటికి అతనికి దానం ఇచ్చినట్లయితే అటువంటి దానాన్ని అపాత్రదానం అంటారు.

★ దాతృత్వం:
 మానవులు దాన గుణం కలిగి వుండడం.
ప్రపంచంలో మాల్టా లైబీరియా ప్రజలకు దాన గుణం ఎక్కువట.
 వరల్డ్ గివింగ్ ఇండెక్స్ సంస్థ 153 దేశాల్లో నిర్వహించిన సర్వేలో శ్రీలంక, ఐర్లాండ్, కెనడా, గయానా, సియర్రా లియానే వాసుల్లో దానం చేసే లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది.

నేటి యుగంలో, నేటి సామాజిక పరిస్థితులో అన్నిటి కన్నా గొప్ప దానం:
 "విద్య దానం" - "ఉన్నత దానం"
 "జ్ఞాన దానం" - "మహోన్నత దానం"
మీ తోటి వారికి, మీకు తెలిసిన వారికి విద్యా దానం జ్ఞానదానం ఇవ్వండి, ఇప్పించండి. ఎన్నో రెట్ల సంపదను పొందండి. 

"పొందాలి" అంటే ముందు "ఇవ్వాలి" - అంతా ఈ జన్మలోనే...


Wednesday, August 12, 2026

"మన సంస్కృతిలో పసుపు – కుంకుమ ప్రాధాన్యత."

"మన సంస్కృతిలో పసుపు – కుంకుమ ప్రాధాన్యత."

మన సనాతన భారతీయ సంస్కృతిలో కొన్ని వస్తువులు సాధారణంగా కనిపించినప్పటికీ, వాటి వెనుక తరతరాలుగా వస్తున్న గొప్ప ఆధ్యాత్మిక భావం దాగి ఉంటుంది. 

అలాంటి పవిత్రమైన మంగళద్రవ్యాలే పసుపు–కుంకుమలు.

మన ఇంట్లో ఏ పూజ ప్రారంభించినా, వ్రతం ఆచరించినా, శుభకార్యం మొదలుపెట్టినా, దేవతను ఆరాధించినా, సుమంగళిని గౌరవించినా పసుపు–కుంకుమలకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.

పసుపు మన సంప్రదాయంలో పవిత్రతకు, మంగళత్వానికి, శుభారంభానికి ప్రతీకగా భావించబడింది. 

అందుకే పూజా కార్యక్రమాల్లో పసుపుకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. 

పసుపుతో గణపతి రూపాన్ని తయారు చేసి పూజించే సంప్రదాయం ఉంది. 

అలాగే కొన్ని పూజా విధానాల్లో పసుపుతో గౌరీదేవి రూపాన్ని సిద్ధం చేసి ఆరాధిస్తారు.

సాధారణమైన పసుపుకు దైవస్వరూపాన్ని కల్పించి, మంత్రపూర్వకంగా పూజించడం మన సనాతన ధర్మంలోని దైవభావానికి ఒక అందమైన ఉదాహరణ.

పసుపుతో ముడిపడిన కుంకుమకు కూడా మన సంస్కృతిలో విశిష్టమైన స్థానం ఉంది. 

దేవతకు కుంకుమ సమర్పించడం, పూజలో ఉపయోగించడం, పూజ అనంతరం ప్రసాదంగా స్వీకరించడం వంటి ఆచారాలు మనలో భక్తి, శుభభావనలను పెంపొందిస్తాయి.

నుదుటిపై కుంకుమ ధరించడం కేవలం అలంకారం కాదు; దైవస్మరణతో, మంగళభావంతో జీవించాలనే ఆంతర్యాన్ని గుర్తుచేసే పవిత్ర చిహ్నంగా మన సంప్రదాయం దానికి స్థానం ఇచ్చింది.

మన జీవితంలోని శుభసందర్భాలను గమనిస్తే పసుపు–కుంకుమలు మన ఆచారాల్లో అంతర్భాగంగా కనిపిస్తాయి. 

వివాహం వంటి మంగళకార్యాల్లో, వ్రతాల్లో, పూజల్లో, దేవతారాధనలో, సుమంగళి గౌరవంలో వీటికి ప్రత్యేకమైన స్థానం ఉంది. 

అందుకే ఇవి కేవలం పూజా సామగ్రి కాదు; మన శుభసంకల్పానికి, మంగళభావానికి, సనాతన కుటుంబ సంప్రదాయానికి ప్రతీకలు.

సుమంగళికి పసుపు–కుంకుమ ఇవ్వడం మన సంస్కృతిలో ఎంతో అందమైన ఆచారం.

ఆమెకు పసుపు–కుంకుమ అందించడం ద్వారా ఆమె జీవితంలో మంగళం, శుభం, సౌభాగ్యం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. 

అందువల్ల ఇది కేవలం ఒక వస్తువును ఇవ్వడం కాదు; ఒక మంగళాశీస్సును అందించడం, మన శుభభావాన్ని పంచుకోవడం.

మన పూర్వీకులు ప్రతి ఆచారానికీ ఒక ఆధ్యాత్మిక భావాన్ని జోడించారు. 

పసుపులో మంగళాన్ని, కుంకుమలో శక్తి–సౌభాగ్య భావాన్ని, అక్షింతల్లో సంపూర్ణతను, దీపంలో జ్ఞానాన్ని, పుష్పంలో భక్తిని దర్శించే ఆధ్యాత్మిక దృష్టిని మనకు అందించారు.

అందుకే పూజా మందిరంలో పసుపు–కుంకుమ కనిపించినప్పుడు వాటిని సాధారణమైన వస్తువులుగా మాత్రమే చూడకుండా, మన పూర్వీకులు తరతరాలకు అందించిన మంగళసంప్రదాయానికి పవిత్రమైన గుర్తులుగా భావించాలి.

పసుపు–కుంకుమలు మన ఇంటి అలంకారం కాదు, మన సనాతన సంస్కృతి అందించిన మంగళానికి చిరునామా. 

మన సంప్రదాయాన్ని తెలుసుకుందాం. 🙏

భక్తితో ఆచరిద్దాం - భావితరాలకు అందిద్దాం. 

✍🏻 వంగల ఆంజనేయ అవధాని

Tuesday, August 4, 2026

కామెర్ల వ్యాధి - లక్షణాలు - ఒకే మూలిక ఉపయోగించి చికిత్స చేసే విధానం .

కామెర్ల వ్యాధి - లక్షణాలు - ఒకే మూలిక ఉపయోగించి చికిత్స చేసే విధానం . 
  
   కామెర్ల వ్యాధిని జాండిస్ అంటారు. ఇది సాధారణంగా నీటి కాలుష్యం వలన వస్తుంది. బాగా వరదలు వచ్చే ప్రాంతంలో కూడా ఎక్కువుగా వచ్చే అవకాశం ఉన్నది. ఇది వైరస్ వల్ల వచ్చే వ్యాధి . దీని మూలంగా చర్మం , కళ్లు , మల , మూత్రాదులు పసుపు రంగులో మారతాయి. విరేచనం తెల్లగా లేదా బూడిద రంగులో మారుతుంది . దీనికి ప్రధాన కారణం రక్తంలోని "బైలురూబిన్ " శాతం ఎక్కువ అవ్వడమే . 
           ఆయుర్వేదంలో కామెర్లని మూడు రకాలుగా విభజించారు . అవి 
    1 . కోష్ఠశ్రీత కామల .
 
    2 . శాఖాశ్రీత కామల .
    3 . కుంభ కామల 
      కామల అనగా ఆయుర్వేదంలో కామెర్ల వ్యాధికి ఉన్న మరొక పేరు . 
  వ్యాధి లక్షణాలు -
     రోగిని పరీక్షించినప్పుడు కాలేయం ( liver ) ఆకారం పెరిగి ఉంటుంది. 
  1 . కళ్లు పసుపు రంగులో ఉంటాయి.
   2 . శరీరం కూడా వ్యాధితీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు పసుపు వర్ణంలో మారుతుంది . 
   3 . అన్నం తినాలనిపించదు.
   4 . వాంతులు అవుతాయి.
   5 . కొంతమందిలో దురద వస్తుంది . 
   
  పాటించవలసిన ఆహారనియమాలు -
    కొవ్వు పదార్ధాలు , సిగిరెట్లు , ఆల్కాహాల్ , మాంసం మానివేయాలి . నూనె పదార్దాలు , స్వీట్స్ , నెయ్యి , పూరి , చపాతీ తినకూడదు. తేలికైన మరియు త్వరగా జీర్ణం అయ్యే ఆహారం తీసుకోవాలి . పాలు , మజ్జిగ , ఆకుకూరలు తినవచ్చు. గ్లూకోజ్ బాగా తాగాలి. పళ్లరసాలు , కాచి చల్లార్చిన నీరు , చెఱుకురసం బాగా త్రాగాలి.
  ఒకే మూలికని ఉపయోగించి చికిత్స చేసే విధానం - 
 * నేల ఉసిరి సమూల రసం తీసి మజ్జిగతో సేవిస్తే కామెర్లు తగ్గును. నేల ఉసిరికి కామెర్లని కలగజేసే వైరస్ ని సంహరించే గుణం ఉన్నది.
 * నేల వేము 50ml కషాయం , 2 గ్రాముల శొంఠి కలిపి రోజుకి రెండుసార్లు సేవించాలి . 
 * తిప్పతీగ స్వరసం ( చెట్టు మొత్తాన్ని దంచి తీసిన రసం ) 14ml తీసుకుని 14 మిల్లి గ్రాముల తేనెలో ఉదయం , సాయంత్రం సేవించాలి . 
 * ఏరణ్డ మూల చూర్ణం తేనెతో కలిపి తీసుకున్న కామెర్ల వ్యాధి నయం అగును. 
 * కటుకరోహిణి చూర్ణం 2 నుంచి 3 గ్రాములు తేనెతో సేవించిన కామెర్ల వ్యాధి నయం అవ్వును. 
 * త్రిఫలా చూర్ణం 3 గ్రాములు తేనెతో కలిపి తీసుకున్న కామెర్ల వ్యాధి నయం అగును.
 * చింతాకు చిగుళ్లు 4 గ్రాములు , వేపాకు చిగుళ్లు 1 గ్రాము ముద్దగా చేసి ఉదయం పరగడుపున మ్రింగించి పాలు త్రాగిస్తే కామెర్ల వ్యాధి నయం అగును.
        కఠిన ఆహారనియమాలు పాటిస్తే తొందరంగా వ్యాధి నుంచి బయటపడగలరు. 
  

మనుష్య శరీర అవయవాల పైన ఉండు గ్రహాల ప్రభావం -

మనుష్య శరీర అవయవాల పైన ఉండు గ్రహాల ప్రభావం -

      మన యొక్క శరీరంలో అయస్కాంత క్షేత్రాలు ఉన్న విషయం ఇటు భారతదేశంలోనే కాక పాశ్చాత్య శాస్త్రవేత్తల పరిశోధనలో కూడా తేలింది. మనిషి మెదడులో మాగ్నటిక్ శక్తి విడుదల అవుతుంది అని లండన్ లొని డాక్టర్లు పరిశోధించి తేల్చారు. మనదేశంలో కూడా పూనాలోని డాక్టర్ ఖరే గారి పరిశోధన గురించి దూరదర్శన్ లో కూడా చూపించారు. డాక్టర్ ఖరే గారు పరిశోధించి మనిషి మెదడు, గుండె, కాలేయం మొదలయిన అవయవాలన్నిటికి అయస్కాంత క్షేత్రాలు ఉన్నాయి అని నిరూపించడమే కాకుండా వాటిని కొలిచే పరికరం కూడా తయారుచేశారు.

                 యోగశాస్త్రం వివరించే మూలాధారం వంటి చక్రాలు కూడా మనిషి శరీరంలో ఇమిడి ఉన్న అయస్కాంత శక్తి కేంద్రాలు మాత్రమే .ఈ విధంగా అయస్కాంత శక్తి నిలయం అయిన మానవ శరీరం వివిధ గ్రహాల నుంచి వస్తున్న విద్యుతయస్కాంతాల తరంగాల వైబ్రేషన్లకు అనుగుణంగా మార్పుచెందును. 

             ఇప్పుడు మీకు కొన్ని ఉదాహరణలు వివరిస్తాను. జ్యోతిష్య శాస్త్రంలో తెలిపినట్లు చంద్ర కుజుల వలన స్త్రీల ఋతుధర్మం , గురుని వలన కాలేయం , రవి వలన హృదయము , బుధుని వలన నరములు , శుక్రుని వలన మూత్రపిండములు ప్రభావితం అవ్వడం గురించి మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు . పైత్యరసం పసుపు రంగులో ఉండటం కూడా గురుని ప్రభావం అని ఎప్పుడో నిరూపితం అయింది. చంద్రుని యొక్క ప్రభావం గర్భాశయం పైన , ప్రసవం పైన ఉంటుంది అని నిరూపితం అయిన విషయమే. అక్కడివరకు ఎందుకు మనపెద్దవారు పౌర్ణమి నాడు పిచ్చి ఎక్కువ అవుతుందని అమావాస్యకు తగ్గుతుంది అని ఎప్పుడో చెప్పారు . ఆ తరువాత అమెరికా వారు ఎన్నో రోజులు పరిశోధించి అది నిజమే అని ఒప్పుకున్నారు. శరీరంలోని సంపూర్ణ ద్రవ మరియు పార్షిక ద్రవ పదార్ధాలు ఏవైతే ఇనుమును కలిగి ఉన్నాయో అవన్ని చంద్రుని ఆకర్షణ శక్తికి లోనవుతున్నాయి అని అట్టి చర్యల వలన మానసిక భావోద్రేక సమస్యలకు మనుష్యుడు లోనవుతున్నాడు అని శాస్త్రవేత్తలు కనుగొన్నారు .

         బృహజ్జాతకం వంటి పురాతన జ్యోతిష్య గ్రంథాలను పరిశీలిస్తే గర్భస్థ శిశువు పిండం దశ నుండి ప్రసవం వరకు ఏ గ్రహం వలన ఏయే అవయవాలు ఏర్పడుచున్నవో కూడా వివరణ ఇవ్వబడుచున్నది. పాతకాలంలో చాలా మంది వైద్యులకు జ్యోతిషం తెలిసి ఉండేది. రోగము కనపడిన రోజు నక్షత్రమును బట్టి ఆ రోగం ఎన్ని రోజులకు పోతుందనే లెక్కలు ఆయుర్వేద గ్రంథాలలో కనిపిస్తాయి.

       ఇప్పుడు మీకు మనిషి శరీరంలోని ఏయే అవయవాల పైన ఏయే గ్రహాల ప్రభావం ఉంటుందో ఇప్పుడు మీకు తెలియచేస్తాను.

 రవి -

   రక్తం, గుండె , పురుషుల కుడికన్ను , స్త్రీల ఎడమకన్ను.

 చంద్రుడు -

   స్తనములు, పాలు , గర్భాశయం, ప్రసవం, లింఫ్ గ్రంథులు, పురుషుల ఎడమ కన్ను, స్త్రీలకు కుడికన్ను , అండములు , కడుపు, ఆహారనాళం .

 కుజుడు -

    ఎముకలలోని మజ్జ, కండరములు, బాహ్య జననేంద్రియములు, మూత్రకృచ్చం .

 బుధుడు -

    మెదడు, శరీరంలోని నరాలు అన్ని బుధుడుకి సంబంధించినవి . చర్మము, నాలుక , వోకల్ కార్డు నరాలు , స్వరపేటిక, మాటలు , తెలివితేటలు .

 గురుడు -

     కాలేయం, గాల్ బ్లాడర్ , సంతానం దాని ఉత్పత్తికి సంబంధించిన భాగాలు , శరీరంలోని కొవ్వు, కఫం, తొడలు, మూత్రపిండాలు.

  శుక్రుడు -

     వీర్యము, లోపలి జననేంద్రియాలు , కామమునకు సంబంధించిన అన్ని అవయవములు, మూత్రపిండములు, శరీరంలోని గ్లూకోజ్ , పాంక్రీయాస్ , శరీరంలోని నీరు , రతిక్రియ , యోని లొపలి భాగములు .

  శని -

     ఎముకలు, చర్మం, విసర్జన కార్యము , మలము , గుదము , రెక్టమ్ , చెమట , గోళ్లు , శరీరం పైన గల వెంట్రుకలు , పెద్దప్రేగులు , వాతం .

         పైన చెప్పిన విధంగా ఆయా అవయవాల పైన ఆయా గ్రహాల ప్రభావం ఉంటుంది.