Monday, December 1, 2025

ఒక్కొక్కరి ఆరోగ్యానికి తగ్గట్టు ఒక్కో రైస్ ఉంటుంది.

*అందరూ తెల్ల రైస్ తినడం కాదు అండి...* 
*షాప్ వాడు చెప్పినదే కొనడం కాదు...*

*ఒక్కొక్కరి ఆరోగ్యానికి తగ్గట్టు ఒక్కో రైస్ ఉంటుంది...ఆ రైస్ తినడం ఉత్తమం...మీ ఆరోగ్యానికి తగ్గట్టు ఏ రైస్ మంచిదో చెప్పే 15 ప్రాచీన వరి రకాల పూర్తి సమాచారం*

*1.రక్తశాలి:*
రక్తశాలి >ఎరుపు> సన్నరకం> పంటకాలం>110 నుంచి 115 రోజులు.
ఈ ధాన్యం ఎరుపు రంగులో ఉంటుంది.అత్యంత పోషక విలువలు, ఔషధ మూలికా విలువలు కలిగినది. ఆయుర్వేదలో వాతము పిత్తము కఫము నివారించును అని మరియు మూడు వేల సంవత్సరాల కన్నా ఎక్కువ కాలము నాటిది అని చెప్పబదినది. ఈ ధాన్యాన్ని ఎర్రసాలి,చెన్నేల్లు,రక్తాసలి అని కూడా అంటారు. ఎరుపు రకాల్లో ఇది అమృత తుల్యమైన ధాన్యం.

*2.కర్పూకవుని:* 
కర్పూకౌవుని >నలుపు> పొడవురకము> పంటకాలం>110 నుండి120 రోజులు.
ఈ ధాన్యం నలుపు రంగులో ఉంటుంది.బరువు తగ్గుటకు అనువైన ఆహారము. కొలెస్ట్రాల్ తగ్గుటకు, క్యాన్సర్ నివారణకు ఉపయోగపడుతుంది. ఈ రైస్ను యాంటీ ఏజింగ్ రైస్ అని కూడా అంటారు.

*3.కుళ్లాకార్:* 
కుల్లాఖర్ > ఎరుపు> లావురకము> పంటకాలం>110 నుండి115 రోజులు. 
ఈ ధాన్యం ఎరుపు రంగులో ఉంటుంది.గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది సాధారణ ప్రసవానికి తోడ్పడుతుంది. పిల్లలకు జ్ఞాపకశక్తి ఎక్కువగా పెరుగుతుంది. ఈ రైస్లో మాంగనీసు,విటమిన్ బి6,కాల్షియం, ప్రోటీన్స్ ,కార్బోహైడ్రేట్స్ ,పొటాషియం ,ఫైబర్ అధికంగా ఉంటాయి. 

*4.పుంగార్:*
పుంగార్ >ఎరుపు >లావురకం> పంటకాలం>95 నుండి115 రోజులు.
ఈ ధాన్యం ఎరుపు రంగులో ఉంటుంది. అధిక పోషకాలు,ప్రోటీన్స్ కలిగి ఉంటుంది. ఆకలిని కూడా ప్రేరేపిస్తుంది. శరీరానికి బలాన్ని ఇస్తుంది. గర్భాధారణ సమయంలో తీసుకుంటే సుఖ ప్రసవానికి తోడ్పడుతుంది. ఇది100% మహిళలకు మంచిది.

*5.మైసూర్ మల్లిగ:*
మైసూర్ మల్లిగ >తెలుపు>సన్నరకము> పంటకాలం>110 నుంచి 120 రోజులు.
ఈ ధాన్యం తెలుపు రంగులో ఉంటుంది. ఎదిగే పిల్లలకు అవసరమైన అధిక పోషకాలు, ప్రోటీన్స్ లభించే గుణం కలిగి ఉంది. పిల్లలకు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. పిల్లలకు ఈ బియ్యంతో అన్నం చేసి పెట్టడం చాలా అవసరం.

*6.కుజిపాటలియా,సన్నజాజులు, చింతలూరు సన్నాలు,సిద్ధ సన్నాలు:* 
కుజీపటాలీయా >తెలుపు>సన్నరకము> పంటకాలం>120 నుండి 125రోజులు.
ఇవి తెలుపు, సన్న రకాలు.ఈ బియ్యం కొవ్వు రహితం, సోడియం లేనివి. తక్కువ కేలరీలు కలిగి వుంటాయి. గ్లూకోజ్ పదార్థాలు తక్కువగా ఉంటాయి, రోగనిరోధకశక్తి పెరగడానికి తోడ్పడతాయి.

*7.రత్నచోడి:*
రత్నచోడి > తెలుపు>సన్నరకం> పంటకాలం>130 నుండి135 రోజులు.
ఈ ధాన్యం తెలుపు,సన్నరకం అధిక పోషక విలువలు ఉన్నాయి. కండపుష్టికి, శరీర సమతుల్యతకు ఉపయోగపడుతుంది. శరీరానికి బలాన్ని చేకూరుస్తుంది. పూర్వకాలంలో సైనికులకు ఆహారంగా వాడేవారు.రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

*8.బహురూపి,గురుమట్టియా,వెదురు సన్నాలు:*
తెలుపు,లావు రకం ఈ బియ్యంలో అధిక పోషకాలు,పీచు పదార్థంలు కలిగి ఉంటాయి. కాల్షియం,ఐరన్,జింకు ఎక్కువగా ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి తోడ్పడుతాయి. బహురూపి శ్రీకృష్ణదేవరాయల వారు కూడా తినేవారు.రోగనిరోధకశక్తి పెరగడానికి సహాయపడుతాయి.

*9.నారాయణ కామిని:*
నారాయణ కామిని >తెలుపు>సన్నరకం> పంటకాలం>130 నుండి140 రోజులు.
ఈ ధాన్యం తెలుపు, సన్న రకము .ఇందులో అధిక పోషకాలు, పీచుపదార్థాలు,కాల్షియం ఎక్కువగా ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి తోడ్పడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

*10.ఘని:*
ఘని >తెలుపు>పొట్టిరకం>పంటకాలం> 125 నుండి 130 రోజులు.
ఈ ధాన్యం తెలుపు, చిన్న గింజ రకం. అధిక పోషకాలు కాల్షియం ఐరన్ ఎక్కువ. శరీరానికి బలాన్ని చేకూరుస్తుంది.వర్షా కాలమునకు ఇది అనువైన విత్తనం.చేను పై గాలికి పడిపోదు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

*11.ఇంద్రాణి:*
ఇంద్రాణి >తెలుపు>సన్నరకం>పంటకాలం> 120 నుండి 125 రోజులు.
ఈ ధాన్యం తెలుపు,సన్నరకం, సెంటెడ్ రకము. కాల్షియం,ఐరన్,D విటమిన్ ఎక్కువగా ఉంటుంది.పిల్లలు బాగా ఇష్టపడి తింటారు.పెద్దవాళ్లు కూడా తినవచ్చు. గుల్ల బారిన(బోలు)ఎముకలు దృఢముగా మారడానికి సహాయపడుతుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

*12.ఇల్లపు సాంబ:*
ఇల్లపుసాంబ > తెలుపు> సన్నరకం> వంటకాలం>140 నుండి145 రోజులు.
ఈ ధాన్యం తెలుపు, సన్నరకం. ఇది మైగ్రేన్ సమస్యలను,సైనస్ సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

*13.చిట్టి ముత్యాలు:*
ఈ ధాన్యం తెలుపు,చిన్న గింజ రకం,కొంచెం సువాసన కలిగి ఉంటుంది. ప్రసాదాలకు ,పులిహారమునకు, బిర్యానీలకు చాలా బాగుంటుంది. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

*14. దేశీ బాసుమతి:*
ఈ ధాన్యం తెలుపు,పొడవు రకము,సువాసన కలిగి ఉంటుంది. ఇది బిర్యానీలకు అనుకూలంగా ఉంటుంది. 

*15.కాలాజీరా:*
ఈ ధాన్యం తెలుపు రంగులో ఉంటుంది.ఇది సువాసన కలిగిన బేబీ బాస్మతి రైస్.ఇది బిర్యానీలకు చాలా అనుకూలంగా ఉంటుంది.


రోగములు - ఏకమూలికా ప్రయోగాలు .

రోగములు - ఏకమూలికా ప్రయోగాలు . 
     
      ఆయుర్వేద వైద్యము నందు ఒక రోగమునకు ఎన్నో రకాల వైద్యయోగాలు ఉంటాయి . కొన్నిసార్లు అనేక రకాల మూలికలను ఒక మొతాదులో కలిపి ఆయా రోగాలకు ఔషధాలను తయారుచేయడం జరుగును . కాని కొన్ని ప్రత్యేకమైన మూలికలు ఉంటాయి . అవి ఒక్క మూలికా ఉన్నను చాలు రామబాణం వలే ఆ రోగము మీద ప్రయోగించి ఆ రోగాన్ని నయం చేయవచ్చు . 
     
      ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ ఏకమూలికా యోగాలు నేను అనేక పురాతన గ్రంథ పఠనం మరియు నా పరిశోధనలో తెలుసుకొనినవి మీకు దాచుకోకుండా అందచేస్తున్నాను . 
 
 ఏకమూలికా ప్రయోగాలు - 

 * తుంగముస్తలు , పర్పాటకం - జ్వరం నందు శ్రేష్టం . 
 * నీటియందు సన్నని ఇసుక , పెంకులు వేసి కాచి వడబోసి చలార్చి ఇచ్చిన జలం అతిదాహం నివారించును . 
 * పేలాలు ఛర్ధిరోగము ( వాంతుల ) యందు శ్రేష్టం . 
 * శిలజిత్ మూత్రసంభంధ రోగముల యందు శ్రేష్టం . 
 * ఉసిరి , పసుపు ప్రమేహము నందు శ్రేష్టం . 
 * లోహచూర్ణం పాండురోగము నందు శ్రేష్టం . 
 * కరక్కాయ వాత, కఫ రోగముల యందు శ్రేష్టం . 
 * పిప్పలి ప్లీహ ( Spleen ) రోగము నందు శ్రేష్టం . 
 * లక్క ఎముకల సంధానము ( అతుక్కొనుట ) నందు శ్రేష్టం . 
 * దిరిసెన విషము నందు శ్రేష్టం . 
 * గుగ్గిలము మేడీ ఆమ్రయమయిన వాయవు నందు శ్రేష్టం . 
 * అడ్డసరం రక్తపిత్తము నందు శ్రేష్టం . 
 * కోడిశెపాల అతిసారం నందు శ్రేష్టం . 
 * నల్లజీడి మొలల రోగము నందు శ్రేష్టం . 
 * స్వర్ణభస్మం పెట్టుడు మందు నివారణకు శ్రేష్టం . 
 * రసాంజనము శరీర అధికబరువు నివారణలో శ్రేష్టం . 
 * వాయువిడంగములు క్రిమిరోగము నందు శ్రేష్టం . 
 * మద్యము , మేకపాలు , మేక మాంసం క్షయరోగము నందు శ్రేష్టం . 
 * త్రిఫల నేత్రరోగముల యందు శ్రేష్టం . 
 * తిప్పతీగ వాతరక్తం నందు శ్రేష్టం . 
 * మజ్జిగ గ్రహణి రోగము నందు శ్రేష్టం . 
 * ఖదిర కుష్ఠు నందు శ్రేష్టం . 
 * గోమూత్ర శిలజిత్ అనేక రోగముల యందు శ్రేష్టం . 
 * పురాణ ఘృతం ( పాత నెయ్యి ) ఉన్మాదము నందు శ్రేష్టం . 
 * మద్యము శోకము నందు శ్రేష్టం . 
 * బ్రాహ్మి అపస్మారము నందు ప్రశస్తము . 
 * పాలు నిద్రానాశనము నందు శ్రేష్టం . 
 * రసాలము ( పెరుగు నుండి తయారు చేయబడును ) ప్రతిశ్యాయము నందు శ్రేష్టం . 
 * మాంసము కార్శ్యము ( Liver ) నందు శ్రేష్టం . 
 * వెల్లుల్లి వాతము నందు శ్రేష్టము . 
 * స్వేదకర్మ స్తంబము ( బిగదీసుకొని పోయిన అవయవాలు ) నందు శ్రేష్టం . 
 * బూరుగ బంక నశ్యము రూపమున చేతులు , భుజములు , భుజశిరస్సు శూల యందు శ్రేష్టం . 
 * వెన్న , పంచదార ఆర్ధిత వాతము నందు శ్రేష్టం . 
 * ఒంటె మూత్రము , ఒంటె పాలు ఉదరరోగము నందు శ్రేష్టం . 
 * నస్యము శిరోగములకు ప్రశస్తం . 
 * రక్తమొక్షము నూతనముగా వచ్చిన విద్రది ( కురుపు ) నందు శ్రేష్టం . 
 * నస్యము , ఔషధద్రవ్యమును పుక్కిలించుట ముఖరోగముల యందు శ్రేష్టం . 
 * నస్యము ( ఔషధ చూర్ణము ముక్కు ద్వారా లోపలికి పీల్చుట , అంజనం ( ఔషధద్రవ్యమును కాటుకలా కంటికి పెట్టటం ) , తర్పణం ( శుభ్రపరచుట ) నేత్రరోగముల యందు శ్రేష్టం . 
 * పాలు , నెయ్యి వృద్దాప్యము ఆపుట యందు శ్రేష్టం . 
 * చల్లనినీరు , చల్లనిగాలి , నీడ మూర్చ యందు ప్రశస్తము . 
 * మద్యము , స్నానము శ్రమ యందు శ్రేష్టం . 
 * పల్లేరు మూత్రకృచ్చము నందు ప్రశస్తం . 
 * వాకుడు కాసరోగము నందు శ్రేష్టం . 
 * పుష్కరమూలము పార్శ్వశూల ( ఒకవైపు వచ్చు తలనొప్పికి ) శ్రేష్టం . 
 * ఉసిరిక రసాయనముల యందు శ్రేష్టం . 
 * త్రిఫల , గుగ్గిలం వ్రణముల యందు శ్రేష్టం . 
 * వస్తి ప్రయోగము వాతరోగముల యందు ప్రశస్తం . 
 * విరేచనము పిత్తరోగముల యందు ప్రశస్తం . 
 * వమనము శ్లేష్మరోగముల యందు ప్రశస్తం . 
 * తేనె కఫరోగముల యందు ప్రశస్తం . 
 * నెయ్యి పిత్తరోగముల యందు ప్రశస్తం . 
 * తైలము వాతరోగముల యందు ప్రశస్తం . 
       పైన చెప్పిన వాటిలో కొన్ని దేశ కాల , బలములను అనుసరించి కలపడం కాని తీయటం కాని వైద్యుని విచక్షణ పైన ఆధారపడి ఉండును.