Sunday, December 19, 2021

గ్రంధులు - చక్రాలు - 3 :



గ్రంధులు   -   చక్రాలు - 3 : 

3.  థైరాయిడ్ గ్రంధి :  ఇది చాలా పెద్ద గ్రంధి. Larynx  కి దగ్గరగా wind pipes కి పైన కంఠము వద్ద ఉన్నది. ఇది  sex gland గా తరచూ వర్ణిస్తారు.  దీనిని మూడవ ovary గా వర్ణిస్తారు. అనేక ovation cases లో ఇది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అంతేకాక కి tissues మధ్య భేదాలను గుర్తించగలదు. దీనికి anti toxic power ఉన్నది.  విష ప్రభావం నుంచి రక్షణ ఇస్తుంది. మరియు విష నిరోధక శక్తిని పెంచుతుంది. విషం అనగా విషయ వాసనల వైపుకి మనలను ఆకర్షించే స్పందనలు.

      థైరాయిడ్ గ్రంథి యొక్క అతిముఖ్య క్రియాకలాపం ఏమిటంటే శక్తి యొక్క మెటబాలిజమ్ నియంత్రిస్తుంది. అందువల్ల దీనిని శక్తి రూపాంతరణ యొక్క సక్షమ లూబ్రికేటర్ (efficient lubricator) గా పేర్కొంటారు. శరీరము లో ఉన్న శక్తి యొక్క అత్యంత శక్తివంతమైన ఉత్ప్రేరకము. ఇది జీవించే విధానం యొక్క వేగాన్ని నియంత్రణ చేస్తుంది.

 ఈనాటి వేగవంతమైన జీవితం ....కారణమేమిటంటే - విశుద్ధ చక్రము యొక్క క్రియాశీలతే కారణము. ఇది endocrine system యొక్క ఆధార శిల.

4. థైమస్ :  ఇది ఛాతి యొక్క పై భాగమున ఉండును. ఇది పిల్లల యొక్క బాధ్యతారహిత స్వభావమునకు సంబంధించి ఉంటుంది. పెద్దలలో దీని యొక్క అతి సక్రియత వలన,  బాధ్యతారహితంగా నైతిక విలువలను పట్టించుకోని వ్యక్తులుగా తయారవుతారు.

 5. పాంక్రియాస్ :  ఇది బొడ్డు దగ్గర ఉంటుంది. దీని స్రావం "ఇన్సులిన్" ఇది solar plexus కి దగ్గరుండి జంతు స్వభావము యొక్క మెదడు గా పనిచేస్తుంది . భౌతిక, మానసిక లక్ష్యసాధన గా పనిచేస్తుంది . ఇది రెండు రకాల స్రావాలు ను ఉత్పత్తి చేస్తుంది . రెంటినీ "ఇన్సులిన్" అంటారు. ఒకటి జీర్ణ క్రియకు ఉపయోగపడితే, రెండవది సుగర్ మెటబాలిజంలో ప్రధాన పాత్ర వహిస్తుంది.

6. అడ్రినల్స్ :  ఇది మూత్ర పిండములో వెనుక ఉంటుంది. స్వాధిష్ఠాన చక్రము దగ్గర ఉంటుంది. కార్టెక్స్ అడ్రినల్ స్రావాలు తెలియవు. ఎడ్రినల్ నుండి ఎడ్రినలైన్ అనే స్రావము వస్తుంది. ఇది సాధారణంగా పెరుగుదల మీద ప్రభావాన్ని చూపిస్తుంది. బ్రె ముఖ్యంగా దీనిని "కంబాట్ గ్లాండ్"(combat gland) అంటారు. ప్రస్తుతం లభించిన సాక్ష్యాధారాల ఆధారంగా మెడుల్లా భయాన్ని కలిగించే స్రావాలు ఉత్పత్తి చేస్తే, కోర్టెక్స్ ఉత్పత్తి చేసే స్రావాలు కోపాన్ని కలుగ జేస్తాయి.

 7. గొనాడ్స్ :  పొత్తికడుపు క్రింది భాగము పురుషులలో టెస్టిస్, స్త్రీలలో ఓవరీస్ గా ఉంటాయి.
     
 ఒక సాధువు దుర్మార్గుడు గాను, ఒక దుర్మార్గుడు సాధువుగానూ... మారడం అనేది...గ్రంధుల అంతస్రావాల యొక్క,ఎక్కువ లేదా తక్కువ సక్రియత వలన జరుగుతుంది. ఈ విధంగా వ్యక్తి, తాను ప్రపంచంలోకి ఏ విధమైన పరికరాలతో వచ్చాడో(endocrine system)...ఆ విధంగానే ఉంటాడు. అతను దీనిని దురుపయోగము చేసుకోనూ వచ్చు లేదా అభివృద్ధి పరచుకోనూవచ్చు. కానీ ఈ పరికరమే నిర్ణయాత్మకమైనది. దీని వలన free will అనేది తీసివేయబడుతుంది. అందుచేత ఈ ఆధునిక విజ్ఞాన సిద్ధాంతాల వలన అమరత్వము అసంభవమౌతుంది.

 వ్యక్తికి గ్రంధులు, ఆ గ్రంథుల స్రావాలు ప్రాథమిక కారణాలా లేక కేవలం విశేష స్థితుల యొక్క ప్రభావాలా? ఈ గ్రంథులు, శరీరము వెనకాతల (mechanism) ఇంకా ముఖ్యమైన పెద్దదైన సత్యం ఏదైనా ఉన్నదా? ప్రతి వ్యక్తిలోనూ " ఆత్మ "ఈ పరికరముల ద్వారా అభివ్యక్తం అవుతోందా? ఈ ప్రశ్నలకు జవాబు గా, మనము భారతీయ ఋషుల జ్ఞానాన్ని కూలంకషంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. (సశేషం)

No comments:

Post a Comment