Monday, August 5, 2024

జపం ఎలా చేయాలి!

*🌳జపం ఎలా చేయాలి!*
మన ఇష్టదైవం యొక్క నామాన్ని కానీ., మంత్రాన్ని కానీ., ఒక క్రమపద్ధతిలో భక్తిగా జపించే విధానాన్నే జపం అంటారు. రోజుకు ఇన్నిసార్లు జపం చెయ్యాలనే సంఖ్యానియమం కూడా ఉంటుంది. ఒకవేళ అనుకోని ఇబ్బందులవల్ల ఆ రోజు జప సంఖ్య పూర్తి చేయలేని పక్షంలో., మరునాడు ఈరోజు మిగిలిన జపసంఖ్యను చేర్చి చేయవలసి ఉంటుంది.

జపాన్ని ఏదో మొక్కుబడిగా చెయ్యకూడదు. సంఖ్య పూర్తిచెయ్యడమే ప్రధాన లక్ష్యంగా జపం చెయ్యకూడదు. భక్తి చాలా ప్రధానం. జపం చెయ్యడానికి ఒక పద్ధతి ఉంది.

వాచికశ్చ ఉపాంశుశ్చ మానసస్త్రివిధః స్మృతః
త్రయాణాం జపయఙ్ఞానాం శ్రేయాన్ స్యాదుత్తరోత్తరమ్

జపం.. వాచికము, ఉపాంశువు, మానసికము అని మూడు విధాలుగా ఉంటుంది.

*వాచికము:* బయటకు వినిపించే విధంగా జపం చేసే పద్ధతిని ‘వాచికము’ అంటారు.

*ఉపాంశువు:* బయటకు వినిపించకుండా, కేవలం పెదవులు కదుపుతూ నాలుకతో జపం చేసే విధానాన్ని ‘ఉపాంశువు’ అంటారు.

*మానసికము:* నాలుక, పెదవులు కదలకుండా మౌనంగా మనస్సు లోలోపలే జపం చేసే విధానాన్ని ‘మానసికము’ అంటారు.

ఈ మూడింటిలో వాచికము కంటే ఉపాంశువు., ఉపాంశువు కంటే మానసికము మరింత శ్రేష్ఠము అని శాస్త్ర ప్రమాణము.

No comments:

Post a Comment