• మఱ్ఱిచెట్టును పూజిస్తే ఆధ్యాత్మికంగా ఎన్నో ప్రయోజనాలని చెబుతారు అవేంటంటే.... వ్యాపారం, ఉద్యోగంలో వచ్చిన కష్టనష్టాల నుంచి బయటపడాలంటే మఱ్ఱిచెట్టు కింద నెయ్యి దీపం వెలిగిస్తే అన్ని అడ్డంకులు తొలగిపోతాయి.
• ఇంట్లో ఎవరైనా చాలా కాలంగా అనారోగ్యంతో ఉంటే, రాత్రిపూట వారి దిండుకింద మఱ్ఱివేరు ఉంచితే ఆరోగ్యం క్రమంగా మెరుగు పడుతుందని విశ్వసిస్తారు.
• మఱ్ఱిచెట్టు కింద కూర్చుని హనుమాన్ చాలీసా పఠించడం వల్ల భయం తొలగిపోయి మానసిక ఒత్తిడి తగ్గుతుందని చెబుతారు.
• ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉంటే, గుడి దగ్గరున్న మఱ్ఱిచెట్టు కొమ్మను తీసుకొచ్చి ఇంట్లో పెడితే పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుందని చెబుతారు.
• మఱ్ఱి చెట్టు ఆకులు ఇంకా విచ్చుకోక ముందు ఎర్రగా మొగ్గల్లా ఉంటాయి. వాటిని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని త్రాగితే తరచు విరేచనాలు, డిసెంట్రీతో బాధపడేవారికి మంచిది.
• మఱ్ఱిపాలు 5 చుక్కల్ని 1 గ్లాసుడు పాలలో కలిపి తీసుకుంటే బ్లీడింగ్ పైల్స్ కి మంచి మందు.
• ఊడల నుంచి జాలువారే లేత వేరులు స్త్రీల సంతాన సాఫల్యత పెంచుతాయి. మఱ్ఱి వేర్లను ఎండించి, దంచి, పొడుమువలె చేసి పాలలో కలిపి ఋతుస్నానం అయిన తర్వాత వరుసగా 3 రాత్రుల పాటు తాగితే సంతానం కలుగుతుందని ఆయుర్వేదం చెబుతుంది. అలాగే మఱ్ఱి స్త్రీల జననాంగ సమస్యలలో కూడా బాగా ఉపకరిస్తుంది. మఱ్ఱి బెరడును కషాయం కాచి దానిని గోరు వెచ్చగా ఉండగా యోని ప్రక్షాళన చేస్తే లుకేరియా తగ్గుతుంది.
• మఱ్ఱి ఊడలతో పళ్ళు తోముకుంటే దంత సమస్యలు రావు.
• మఱ్ఱి పాలు కీళ్ళ నొప్పులున్న చోట రాస్తే నొప్పులు తగ్గుతాయని గిరిజనుల నమ్మకం.
• మఱ్ఱి ఆకులు కోయగా వచ్చిన పాలను పులిపిరులమీద ఉంచితే అవి తగ్గిపోతాయి.
• పాదాలు పగిలిపోతే మఱ్ఱి చెట్టు కాండం నుంచి వచ్చిన రసాన్ని ఆ పగుళ్ళకు రోజూ రాస్తే ఉపయోగం ఉంటుంది.
• మఱ్ఱి వూడలను చిన్న ముక్కలుగా కోసి, గాలికి ఎండబెట్టి దంచి పొడిజేసి జల్లెడ పట్టి నిల్వ జేసుకోవాలి. రోజూ రెండు పూటలా ఒక చెంచా మోతాదుగా ఈ పొడిని తిని మంచినీరు త్రాగుతుంటే రకరకముల యోని స్రావాలు తగ్గిపోతాయి. అధిక వేడి నశించిపోతుంది. శరీరమునకు మంచి రంగు, కాంతి వస్తాయి. అంతకుముందు తరిగిపోయిన బలం మరలా సమకూరుతుంది.
• మఱ్ఱిచెట్టు లేత వూడల రసం 10 గ్రాములు తీసుకొని దానిలో మెత్తగా నూరిన 5 మిరియాల గంధాన్ని కలిపి ప్రతిరోజూ సేవిస్తుంటే కుష్టు రోగాలు, సవాయి మేహరోగములు, చర్మరోగములు హరించిపోతుంది.
• ఎర్రగా ఉండే మెత్తని మఱ్ఱి చిగుళ్లను తెచ్చి నీడలో ఎండించి పొడి చేయాలి. అరచెంచా పొడిచేసి పావులీటరు కషాయం మిగిలే వరకు చిన్నమంటపై కాచి దించి వడపోసి దానిలో తగినంత కలకండ గలిపి వేడిగా ఉదయం సాయంత్రం తాగుతుండాలి. దీనివల్ల మెదడుకు బలం కలుగుతుంది. తలలో పేరుకున్న కఫము హరించిపోయి తుమ్ములు ఆగిపోయి, ప్రశాంతత కలుగుతుంది.
• బాగా ముదిరిన మఱ్ఱి ఆకులను ఎండించి ఒక లీటరు మంచినీటిలో 10 గ్రాముల బరువు ఉన్న మఱ్ఱి ఆకులను వేసి పావులీటరు కషాయము మిగిలేవరకు చిన్న మంటపై మరగపెట్టి దించి వడపోసి అందులో మూడు చిటికెలు ఉప్పు కలిపి ఉదయం, సాయంత్రం తాగుతుండాలి. దీని వల్ల పీడకలలు రావటం, గుండె బరువై వూపిరాడక పోవటం, నిద్రలో పెద్దగా అరవటం భయపడడం తగ్గిపోతాయి.
• లేత మఱ్ఱి ఆకులు 10 గ్రాములు తీసుకొని మంచినీరు 150 గ్రాములు కలిపి మెత్తగా నూరి పల్చని గుడ్డతో వడకట్టాలి. అందులో కొంచెం కలకండ కలిపి రెండుపూటలా త్రాగుతుంటే గుండెదడ పూర్తిగా తగ్గిపోతుంది.
• మఱ్ఱి ఆకులు 20 గ్రాములు, 7 లవంగాలు ఈ రెండింటినీ కలిపి మెత్తగా నూరి ఆ ముద్దను బట్టలో వేసి రసం పిండి దానిలో కొంచెం కలకండ కలిపి త్రాగితే వాంతులు వెంటనే తగ్గిపోతాయి.
• లేత మఱ్ఱి మొగ్గలు 10 గ్రాములు గ్రహించి తగినంత నీరు కలిపి మెత్తగా నూరి బట్టలో వడపోసి కండ చక్కెర కలిపి రెండు పూటలా త్రాగుతుంటే విరేచనాలు, నీళ్ల విరేచనాలు కట్టుకుంటాయి.
• లేత మఱ్ఱి ఆకులు 25 గ్రాములు తీసుకొని పావు లీటరు మంచి నీటిలో కలిపి మెత్తగా నూరి గుడ్డలో వడపోసుకుని రోజూ త్రాగుతుంటే రక్తమొలలు పూర్తిగా తగ్గిపోతాయి. రక్తస్రావం వెంటనే ఆగిపోతుంది.
• లేత మఱ్ఱి మొగ్గలు 10 గ్రాములు గ్రహంచి దానితో పాటు బాగా లేతగా ఉన్న దేశవాళీ వంకాయ ఒకటి కలిపి, ఆ రెండింటినీ కలుపుకుని తింటుంటే నడుము నొప్పి తగ్గుతుంది.
• మఱ్ఱి ఆకులను నీటిలో వేసి చిన్నమంటపైన మరగబెడుతూ కషాయం చిక్కబడే వరకు మరిగించి దించి ఆ కషాయంలో తగినంత కలకండ కలిపి సేవిస్తుంటే అపరిమితమైన వీర్యవృద్ధి వృద్థి కలుగుతుంది.
• మఱ్ఱి ఆకులను నీడలో ఎండబెట్టి దంచి పొడిచేసి సమానముగా చక్కెర కలిపి నిలువ చేసుకోవాలి. ఉదయం సాయంత్రం సగము చెంచా మోతాదుగా ఈ పొడిని మంచి నీటితో సేవిస్తుంటే స్త్రీల బట్టంటు రోగాలు పూర్తిగా తగ్గిపోతాయి.
• మఱ్ఱి ఆకుల చూర్ణమును చేసుకొని రెండు పూటలా పావు చెంచా మోతాదుగా ఈ పొడిని మంచినీటితో సేవిస్తుంటే కీళ్ళనొప్పులకు అద్భుతంగా పనిచేస్తాయి.
• మఱ్ఱి ఆకులు 20 గ్రాములు తీసుకొని కొంచెం నలగ గొట్టి అరలీటరు మంచినీటిలో వేసి పావు లీటరు కషాయము మిగిలే వరకు చిన్నమంటపై మరగబెట్టి దించి వడపోసి గోరువెచ్చగా అయిన తరువాత దానిలో ఒక చెంచా మంచి తేనె ఒక చెంచా కలకండ కలిపి రెండుపూటలా సేవిస్తుంటే రక్తములోని మాలిన్యాలు తొలగిపోయి రక్తము శుభ్రపడి చర్మవ్యాధులు తగ్గిపోతాయి.
No comments:
Post a Comment