Monday, June 30, 2025

సర్వేజనాః సుఖినో భవంతు" అనే మహాశ్లోకానికి తెలుగు భాషలో వివరణ, అర్థము మరియు జీవన మార్గదర్శనము

😌🙏 *మహా శుభోదయము*

*"ఓం సర్వేజనాః సుఖినో భవంతు" అనే మహాశ్లోకానికి తెలుగు భాషలో వివరణ, అర్థము మరియు జీవన మార్గదర్శనము:*

🕉️ *శ్లోకం:*

😌🙏 
*ఓం సర్వే జనాః సుఖినో భవంతు*
*సర్వే సంతు నిరామయాః।*
*సర్వే భద్రాణి పశ్యంతు।*
*మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్॥*
*ఓం శాంతిః శాంతిః శాంతిః*

✨ *ప్రతిపదార్థము:*
🪷 *ఓం* – *పరబ్రహ్మ స్వరూపమైన శబ్దము. ఇది శుభారంభానికి సంకేతము.*

🪷 *సర్వే జనాః సుఖినో భవంతు* – *ఈ లోకములోని ప్రతిఒక్కరూ సుఖముగా, శాంతితో జీవించాలి.*

🪷 *సర్వే సంతు నిరామయాః* – *అందరూ రోగాలు లేని ఆరోగ్యవంతులై ఉండాలి.*

🪷 *సర్వే భద్రాణి పశ్యంతు* – *అందరూ మంచి విషయాలను మాత్రమే చూసేవారుగా ఉండాలి.*

🪷 *మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్* – *ఎవరికీ దుఃఖం కలగకూడదు.*

🪷 *ఓం శాంతిః శాంతిః శాంతిః* – *త్రివిధ తాపాలు (ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక) నివారించబడి, శాంతిగా జీవించాలని ప్రార్థించడము.*

🌱 *మహోన్నతమైన ఈ మంత్ర సారమును మన జీవితాలల్లో నిరంతరమూ, మనము కలిగివుండాలంటే, మనమేమి చెయ్యాలి?.*

🌹 *1. మన హృదయాలల్లో దయాభావమును కలిగి ఉందాము. అంటే మన వలె ఇతరులను చూసుకుందాము మరియు సేవా దృక్పథముతో జీవితాన్ని గడుపుదాము.*

🌹 *2. చక్కని ఆరోగ్యానికి దారిచూపే జీవనశైలి పాటిద్దాము.*
*ఆరోగ్యవంతమైన ఆహారపు అలవాట్లను పాటిద్దాము మరియు శారీరకంగాను, మానసికంగాను ఆరోగ్యముగా ఉండేందుకు గాను యోగాసనాలు, ప్రాణాయామము, ధ్యానమును ప్రతి రోజూ చేద్దాము.*

🌹 *3. మనచుట్టూ ఉన్నవాళ్ల జీవితాల్లో శాంతిని, ఆనందాన్ని సృష్టింద్దాము. మన సహాయము అవసరమున్న వారికి వీలైతే మాటలతోనైనా లేదా పనులతోనైనా చేద్దాము.*

🌹 *4. సద్బుద్ధిని మరియు శుభదృష్టిని అభివృద్ధి చేసుకుందాము. మంచి విషయాలు అనగా నిత్యమూ శ్రీమద్ భగవద్గీత, శ్రీరామాయణము, శ్రీభాగవతము, శ్రీభారతము మొదలైన ధర్మశాస్త్రాలను అధ్యయనము చేద్దాము లేదా విందాము.*

🌹 *5. మన జ్ఞానేంద్రియాలను మరియు కర్మేంద్రియాలను శుభకార్యములకు వినియోగిద్దాము. అంటే... మంచి భావయుక్తమైన పాటలు వినడము,మంచి దృశ్యాలను చూడడము, శుభ కార్యాలలో పాల్గొనడము మొదలైన పనులను చేద్దాము.*

🌹 *6. మనము ఎప్పటికీని ‘మన స్వార్థము’ కంటే ‘సామూహిక హితానికి ప్రాధాన్యమును ఇద్దాము.*

🌹 *7. "మనందరి సుఖములోనే, మన సుఖమున్నది" అనే తత్వము ఈ శ్లోకములో ఉంది. ఇది కేవలము ఒక ప్రార్థన మాత్రమే కాదు — ఇది సనాతన ధర్మానికి చెందిన జీవన సిద్ధాంతము.*

🌸 *నిత్య జీవితములో ఈ శ్లోకమును ఎలా వాడుకోవచ్చును,* *అంటే...*

✅ *ప్రతి ఉదయము ధ్యానము లేదా ప్రార్థనా సమయములో ఈ శ్లోకాన్ని మంత్రముగా జపిద్దాము.*

✅ *సద్భావనలతో రోజంతా జీవించాలనే సంకల్పమును చేద్దాము.*

🕉️
*"ఓం సర్వే జనాః సుఖినో భవంతు"*
*"ఓ పరమాత్మా! సమస్త ప్రజలు సుఖముగా, ఆరోగ్యముగాను మరియు శాంతియుతముగా జీవించుదురు గాక."*

🌟 *జో శ్రీ అచ్యుతానంద యోగము, "5D" నేటి తరానికి అనుగుణముగా నవీకరించబడిన యోగ శాస్త్రాలు మరియు సాధనలు, శ్రీ భాగ్య నగరము (Hyd), తెలంగాణా.*

😊 *అంతా సరిగానే ఉంది* 👍👌
 🪷🌼🌻🌸🌺🏵️💐🌹

No comments:

Post a Comment