Saturday, February 1, 2025

కుష్టువ్యాధిని నివారించే రహస్య ప్రక్రియ -

వంద సంవత్సరములు దాటిన వేపచెట్టుని ఉపయోగించి 40 రోజులలో కుష్టువ్యాధిని నివారించే రహస్య ప్రక్రియ - 

     నూరు సమత్సరములు కలిగిన వేపచెట్టు కాండంలో 3 నుంచి 4 శేర్లు నీరు పట్టినంత తొర్రని నిలువుగా ఏటవాలుగా తొలచి అందులో సుమారు సేరు బియ్యము అన్నము వండి చల్లారాక మునుపే ఉంచి ఆ వేపచెట్టు పచ్చికర్రతో ఆ తొర్రకి సరిపడు బిరడా తయారుచేసి బిగించి దానిపైన గాలి లొపలికి పోకుండా పైన ఆవుపేడ పూసి ఒక సంవత్సరం ఉంచి ఆఖరు రోజున ఆ బిరడా తెరిచి చూసిన ఆ అన్నం ఎర్రగా ఉండును.దానిని బాగా ఎండించి పూటకి పావులాయెత్తు ( 5 గ్రా ) చొప్పున 40 దినములు పుచ్చుకొనిన కుష్టురోగం నివారణ అగును. 

       ఇది అత్యంత రహస్య యోగంగా గ్రంధాలలో ఉన్నది . 

  గమనిక -

          బాగా ముదిరిన పెద్ద వేపచెట్టు కాండం దానంతట అది పగిలి దానినుంచి కల్లు వెలువడును. అలా ఎక్కడైనా మీకు దొరికితే విడవకుండా వెంటనే త్రాగండి. ఆ కల్లు తాగడం వలన పొట్టకు విపరీతమైన బలం చేయును. జ్వరము , శరీరంలో పైత్యం హరించును. శరీరతత్వం మార్చును. రక్తం శుభ్రం చేయును . కాని ఉదయం పూట మాత్రమే పుచ్చుకొనవలెను.

     
       

స్త్రీల సౌందర్యానికి చిట్కాలు -

స్త్రీల సౌందర్యానికి చిట్కాలు - 

 నల్లటి మచ్చలు ,మంగు నివారణ -

 * జాపత్రిని మంచినీటితో మెత్తగా నూరి రాత్రిపూట ముఖానికి లేపనం చేసుకొని ఉదయాన్నే గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపర్చుకొనుచున్న అతిత్వరలోనే ముఖము పైన కల మంగు ,నల్లమచ్చలు మాయం అగును . 

 * మిరియాలు గోరోజనముతో కలిపి నూరి పైకి లేపనం చేయుచున్న మొటిమలు తగ్గును . మచ్చలు పోవును . 

 * బాదం పప్పును నీటితో నూరి వడకట్టగా వచ్చిన పాలను ముఖంపై మర్దన చేయుచున్న క్రమంగా నల్లమచ్చలు , మంగు , మొటిమలు త్వరలోనే హరించును . 

 * ధనియాలు , వస , సుగంధపాల ఈ మూడింటిని సమభాగాలుగా తీసుకుని మెత్తటి చూర్ణముగా చేసి ఈ చూర్ణమును ఒంటికి నలుగు పిండిలా పట్టించుచున్న నల్లటి మచ్చలు , మొటిమలు తగ్గును . 

 * నిమ్మరసమును పాలతో కలిపి రాత్రిపూట ముఖానికి మర్దన చేసుకుని తెల్లవారిన తరువాత లేవగానే గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుగుకొనవలెను . సబ్బు వాడరాదు . ఇలా క్రమం తప్పకుండా చేయుచున్న మచ్చలు , మంగు పోయి ముఖం కాంతివంతం అగును . 

 * తులసి ఆకుల రసములో కొద్దిగా టంకణం ( Borax ) కలిపి పైకి లేపనం చేయుచున్న ముఖం పైన మచ్చలు , మంగు హరించును . 

 * మంజిష్ట చూర్ణమును ఆవుపాలతో కలిపి అరగదీసి అందులో కొంచం తేనె కలిపి ముఖమునకు లేపనం చేయుచున్న నల్లమచ్చలు , మంగు హరించును . 

   
      

ఉబ్బసం నివారణా యోగాలు -

ఉబ్బసం నివారణా యోగాలు -

 * ఉబ్బసం ఉధృతంగా ఉండి శ్వాస ఆడనప్పుడు వాము గింజలను వేడిచేసి గుడ్డలో కట్టి ఛాతిపైన , గొంతుకకు కాపడం పెడితే నొప్పి శ్వాస సులువుగా ఆడుతుంది.

 * వస కొమ్ము చూర్ణం ఉబ్బసం ఎక్కువుగా ఉన్నప్పుడు ప్రతి మూడు గంటలకి ఒకసారి ఉసిరిగింజంత నీటిలో కలిపి తాగాలి.ఇలా రెండు లేక మూడు మోతాదులలో తేలిక అగును.

 * మారేడు ఆకుల రసం అరచెంచా , తేనె అరచెంచా కలిపి ఉదయం , సాయంత్రం రెండుపూటలా తీసుకోవాలి . 40 రోజులు క్రమం తప్పకుండా వాడుకోవాలి. తగ్గకుంటే మరొక్క 40 రోజులు వాడండి. తప్పక తగ్గును.

 * పూటకొక యాలుక్కాయ తినినచో ఉబ్బసం తగ్గును.

 * ఎండు జిల్లేడు ఆకుల పొగని తరుచూ పీల్చుచుండిన ఉబ్బస రోగం నివారణ అగును.

 * ప్రతినిత్యం ఒక పచ్చి కాకరకాయని తింటున్న పోతుంది. రోజురోజుకు మార్పు కనిపించును. తగ్గేంత వరకు వాడవలెను.

 * ప్రతి నిత్యం ఉదయం , సాయంత్రం కప్పు పాలలో నాలుగు వెల్లుల్లి రేకలు చితగ్గొట్టి వేసి పొయ్యి పైన మరిగించి ఆ పాలను తాగుచున్న ఉబ్బసం హరించును .

 * ఉబ్బసం ఎక్కువుగా ఉండి కఫం పట్టేసి ఉన్నచో కుప్పింటాకు రసాన్ని మూడు చెంచాలు లొపలికి తీసుకొనుచున్న కఫం కరిగి బయటకి వచ్చును.

 * అల్లం రసం , తేనె సమభాగాలుగా కలిపి మూడు గంటలకి ఒకసారి చెంచా చొప్పున తీసుకొనుచున్న ఉబ్బస ఉధృతి తగ్గును.

 * ఉత్తరేణి చెట్టుకు సమూలంగా తీసుకుని నీడన ఎండించి భస్మం చేయవలెను . ఆ భస్మమును మూడు పూటలా కందిగింజ అంత తేనెతో కలిపి లోపలికి తీసుకొనిన ఉబ్బసం తగ్గును . ఇది తిరుగులేని యోగం . 

శరీరంపైన లేచే వ్రణాలను హరించు యోగాలు -

   శరీరంలోని కొన్ని భాగాలలో ఎత్తుగా , గట్టిగా గడ్డలు ఏర్పడును . ఈ గడ్డల వలన పోటు , విపరీతమైన నొప్పి ఉండును. కొన్ని మెత్తగా ఉండి పోటు , సలుపు కలిగి ఉండును. వ్రణాలు లొపల చీము మరియు నెత్తురుతో కూడుకుని ఉండును. పక్వానికి వచ్చి పగిలిన తరువాత లొపల ఉన్న చెడు బయటకి వెళ్లడం వలన నొప్పి మరియు పోటు ఉపశమించును.

 

ప్రాచీన భారతీయ మహర్షులు రచించిన రహస్య గ్రంథాలు - వాటి గురించి విశేషాలు .

ప్రాచీన భారతీయ మహర్షులు రచించిన రహస్య గ్రంథాలు -  వాటి గురించి విశేషాలు .

     మన ప్రాచీన మహర్షులు మహా తపస్సంపన్నులు మరియు గొప్ప విజ్ఞానులు . వీరు తమయొక్క విజ్ఞానాన్ని గ్రంధరూపంలో భద్రపరిచారు. ప్రస్తుతం ఆయా గ్రంథాలు మనకి దొరకటం లేదు .  నాకున్న పరిఙ్ఞానం మరియు కొన్ని పురాతన గ్రంధాలను పరిశోధించి వారు రాసిన గ్రంథాలు వేటికి సంభంధించినవో వాటిలో ఉన్న కొన్ని విషయాలు మీకు తెలియచేస్తున్నాను . 

 *  బృహద్యంత్ర సర్వస్వము  - 

         ఈ గ్రంథమును భరద్వాజ మహర్షి రచించెను . ఈ గ్రంధము నందు అనేక యంత్రాల గురించి వివరంగా ఇచ్చాడు. ముఖ్యంగా " విమానాధికారణము" అను ఒక అధ్యాయం కలదు. ఇందు అనేక విమానాలు మరియు విచిత్రంగా మెలికలు తిరుగుతూ ప్రయాణించే విమానాల గురించి వివరించారు . ఈ విమానాలు ఆకాశంలో ఎగురునప్పుడు విమానాన్ని నాశనం చేసే వివిధ రకాల సూర్యకిరణాల గురించి , భయంకర వాయుగుండాల గురించి , అమిత విద్యుత్ శక్తి నుండి , అత్యుష్ణము , అతి శీతలం నుండి విమానం మరియు అందులో ప్రయాణించే వారిని రక్షించేందుకు పదమూడు రకాల దర్పణములు ( అద్దములు ) గురించి వివరించారు 

                   ఇందు దుష్టశక్తులను నిరోధించి ఉత్తమ శక్తులను ఆకర్షించు దర్పణములు ఆరున్నూ , సూర్యుని నుండి రకరకాల సూర్యకిరణములు ఆకర్షించి అక్కరలేని వాటిని నిరోధించే దర్పణములు ఆరున్నూ కలవు. పదమూడొవది వివిధరకాల పొగను సృష్టించును. విచిత్రకార్యములకు ఉపయోగపడును.

                 ఇప్పుడు మనం తయారుచేసే అద్దాలలో ప్రధానంగా సోడియమ్ గ్లాసులు , పొటాషియం గ్లాసులు మాత్రమే . కాని మన ప్రాచీనులు అద్దం తయారుచేసేప్పుడు సువర్ణం , పాదరసం , అయస్కాంతం , ముత్యములు మొదలగునవి కలిపెదరు . అంతే కాకుండా కొన్నిరకాల దివ్యోషదాలు కూడా అద్దం తయారీలో కలిపేవారు.  

          అనేక రకాల విచిత్ర వస్తువుల గురించి కూడా ఈ గ్రంథంలో విపులంగా ఉంది.

 *  ఆగతత్వలహరీ  - 

         ఇందు వ్యవసాయం , అనేక వృక్షాల వర్ణనలు , వాటి చికిత్సా పద్దతులు కలవు. ఈ గ్రంథం అశ్వలాయన మహర్షి రచించెను .

 *  అవతత్వ ప్రకరణం  - 

          ఈ గ్రంథాన్ని కూడా అశ్వలాయన మహర్షి రచించారు . దీనిలో స్నానఫలాలు జలాల్లో రకాల గురించి వివరించారు . 

 *  అండ కౌస్తభం  - 

           ఇది పరాశర కృతం . బ్రహ్మాండ చరిత్ర 
జీవకోటి విమర్శ మొదలగునవి వివరించబడినవి.

 *  అంశు బోధిని - 

           ఇది భరద్వాజ మహర్షి రాశారు. ఇందు గ్రహములు వేధించు పద్దతులు  , ప్రకాశం ( light ) , ఉష్ణం ( heat ) , ధ్వని ( sound ) , తంత్రీ వార్తావిధి ( టెలిఫోనీ ) , విమాన నిర్మాణ విధి ,విద్యుతశక్తి ప్రయోగాలు కలవు.

 *  ఆకాశ తంత్రం  - 

            ఇది భరద్వాజ మహర్షి రచించారు . ఇందు ఆకాశం యొక్క 7 విధములు , ఆకాశక్షేత్ర విభాగములు , ఆకాశంలోని శక్తి సంయోగ విధములు , ఆకాశం నందలి అగ్ని, కాంతి, గ్రహ కక్ష్యలు , భూములు , నదులు మొదలగు వాటి వివరణలు కలవు.

 *  ఋక్ హృదయ తంత్రం  - 

            ఇది అత్రి మహర్షి కృతం . ఇందు రోగములు , చికిత్సలు విశేషముగా వివరించబడి ఉన్నాయి.

 *   ఔషధీ కల్పం  - 

            ఇది అత్రి మహర్షి కృతం . ఇందు ఔషధముల ప్రభావములు . చిరకాలం జీవించుటకు యోగాలు , గుళికా యోగములు, ఆయుర్వృద్ది మొదలగునవి కలవు.

 *  కరక ప్రకరణము  - 

             ఇది అంగీరస మహాముని రచించెను . ఇందు మేఘములలొని మార్పులు , జీవరాశుల ఉత్పతి విధానం , సూర్యరశ్మిలోని మార్పులు మేఘములకు సంబంధము , నవరత్నములు పుట్టుటకు సంబందించిన సూర్యరశ్మి విభాగాలు కలవు.

 *   కర్మాబ్దిసారము  - 

             ఇది ఆపస్తంబ మహర్షిచే రచించబడెను . ఇందు కర్మలు , చేయవలసిన విధులు , వాటి ప్రాముఖ్యత , వాటి ఫలములు , శారీరక , మానసిక ఫలములు మొదలైనవి కలవు.

 *   కౌముదీ  - 

               ఇది సోమనాథ కృతం ఇందు బ్రహ్మాండం గురించి విపులంగా రాసి ఉన్నది.

 *   ఖేట సర్వస్వము  - 

              ఇది జైమినీ మహర్షి చే రచించబడెను . ఇందు ఆకాశ విభాగములు , అందలి గ్రహకక్షలు మొదలగునవి కలవు.

 *  ధాతు సర్వస్వము  - 

             ఇది బోధాయన మహర్షిచే రచించబడెను . ఇందు ధాతువులు , వాటి ఉత్పత్తులు , గనులు , గనుల నుండి
లోహములు తీయు పద్దతి , విషములు , విషహరణోపాయములు , భస్మములు , గంధకం , పాదరసం మొదలగువాటి వర్ణన కలదు . 

 *  ధూమ ప్రకరణం  - 

           ఇది నారద మహర్షి కృతం . ఇందు వివిద ధూమములు , వాటిని కొన్ని రకాల అద్దములచే పట్టుట వాటిని కొన్నిరకాల ఆమ్లములచే పరిశోధించుట . ఆ ధూమం మంచిదో కాదో తెలుసుకొనుట అనగా ఆయాపదార్థాలలోని విషగుణములను తెలుసుకొనుట తద్వారా శరీరాన్ని , బుద్ధిని పోషించుకొనుట ఈ విషయాలన్నీ కలవు.

 *  నామార్థ కల్పం  - 

           ఇది అత్రి మహర్షిచే రచించబడెను. ఇందు 84 లక్షల శక్తులు వాటి నామాలు , నామార్థాలు కలవు.

 *  ప్రపంచ లహరీ  - 

             ఇది వశిష్ట మహర్షి చే రచించబడెను . ఇందు అణువుల వలన బ్రహ్మండా నిర్మాణమా లేక బ్రహ్మతత్వం వలనా ? అని చర్చ కలదు. అణువు ల విమర్శ కూడా కలదు.

 *  బ్రహ్మాండ సారం  - 

               ఇది వ్యాస మహర్షిచే రచించబడెను . ఇందు బ్రహ్మాండ చరిత్ర కలదు.

 *  మేఘోత్పత్తి ప్రకరణం  - 

              ఇది అంగీరస మహర్షి కృతం . ఇందు మేఘములు , మెరుపులు , పిడుగులు మొదలగు వాటి ఉత్పత్తి వర్ణణలు కలవు.

 *  లోక సంగ్రహము  - 

              ఇది వివరణాచార్య కృతం . ఇందు 1714 భాషలు , జీవజాతులు , వాటి పుట్టుక , ఆహార నియమాలు , మతములు మొదలగు వివరములు కలవు. మొత్తం ప్రపంచం యొక్క సంగ్రహం కలదు.

 *  లోహ తంత్రము  - 

              ఇది శాక్త్యాయన మహార్షి చే రచించబడెను . ఇందులో లోహోత్పత్తి మొదలగు విషయాలు కలవు.

 *  వాయుతత్వ ప్రకరణము  - 

              ఇది శాక్త్యాయన మహర్షి కృతం . ఇందులో 84 వేల రకాల వాయువులు , వాటి పొరలు , భూమి మీద  ఆయా వాయువుల యొక్క ప్రభావములు , అవి వృక్ష సంపద పైన ఎట్లు పనిచేయుచున్నవి ? ఈ వాయువులను కనిపెట్టుటకు తగిన యంత్ర సాధనాలు మొదలగునవి కలవు. 

 *  వైశ్వనర తంత్రము - 

              ఇది నారద మహర్షి కృతం . ఇందు 128 రకాల అగ్నులు , వాటి రంగులు , గుణములు , ఉపయోగములు , కొలతలు తరతమ బేధములు కలవు.

 *  శక్తి తంత్రము  - 

            ఇది అగస్త్య మహార్షి చే రచించబడినది. ఇందు విద్యుత్ శక్తి యొక్క సర్వాకర్షణ సామర్ధ్యము , రూపాకర్షని , రసాకర్షిణి , గంధాకర్షిణి , స్పర్శాకర్షిణి , శబ్దాకర్షిణి , ధైర్యాకర్షిణి , శరీరాకర్షిణి , ప్రాణా కర్షిణీ  మొదలగు ముఖ్యమైన పదహారు శక్తుల వర్ణనం , సెకనుకు 1 , 86 ,000 మైళ్ళ వేగముతో ఇప్పుడు టెలివిజన్ , రేడియో ప్రసారాలు ఎలా పోవుచున్నవో అదే విధముగా విధ్యుత్ శక్తి సహాయముతో రసము , గంధకం , స్పర్శము చివరికి శరీరం కూడా అంతే వేగముతో ప్రయాణించగల విధివిధానాలు చెప్పెను . బహుశా వాయువేగంతో మనిషి ఎలా ప్రయాణించాలో తెలియచేశారు అనుకుంటా . 

 *  శుద్ద విద్యాకల్పం  - 

         ఇది అశ్వలాయన మహర్షి కృతం . ఇందు ప్రపంచోత్పత్తి నిర్ణయము కలదు.

 *  సమరాంగణ సూత్రధారము  - 

         ఇది భోజమహారాజుచే రాయబడినది. ఇందు అనేక యంత్రములు కలవు. ఈ యంత్రములు యందు ఉపయోగించు పంచభూత బీజముల విధానములు , విమాన నిర్మాణ విధానములు , ద్వని ( సైరన్ ) యంత్రము చేయు పద్ధతులు , బొమ్మలచే యుద్ధము , నాట్యము , సంగీతము , ద్వార రక్షణము మొదలగు విచిత్రములు కలవు.

           పైన చెప్పినవే కాకుండా భరద్వాజ మహర్షి రచించిన బృహద్విమాన శాస్త్రంలో అశని కల్పం , అంశుమ తంత్రం , ఉద్బిజ్జతత్వ సారాయణము , దర్పణకల్పము , దర్పణశాస్త్రం , దర్పణ ప్రకరణం , ద్రావక ప్రకరణం , మణికల్ప ప్రదీపిక , మణి ప్రకరణము , మణి రత్నాకరం , ముకుర కల్పము , యంత్ర కల్పము ,  యంత్ర కల్పతరువు , లోహతత్వ ప్రకరణం , లోహ ప్రకరణం , లోహ రత్నాకరం , లోహ రహస్యము , లోహ శాస్త్రం , విమాన చంద్రిక , విష నిర్ణయాధికారం , వ్యోమయాన తంత్రం , శక్తి తంత్రము , శక్తి బీజము , శక్తి కౌస్తుభం , సమ్మోహన క్రియాకాండం , సౌదామినీకలా మొదలగు 150 గ్రంథాలు కలవు. అదియే కాక  అగస్త్య, అత్రి , అంగీర, ఆపస్తంబ , ఈశ్వర , కపర్ది , గర్గ, గాలవ,  గోభిల , గౌతమ, నారద , పరాశర, భరద్వాజ , వశిష్ట , వాల్మీకి , వ్యాస , శౌనక , సిద్ధనాధ  మొదలగు 140 మంది గ్రంథకర్తలు కలరు. ఋషులు అంటే ముక్కులు మూసుకుని మూలన  కూర్చుని తపస్సు చేసుకునే వారు కాదు. వీరు గొప్ప వైజ్ఞానికులు .భారతదేశంలో అధికారంలో ఉన్న వారు వీటిపైన సరైన దృష్టి పెట్టకపోవడం వలన ఎంతో విజ్ఞానాన్ని కోల్పోయాము. కాని మన ప్రాచీన విఙ్ఞానం పైన విదేశీయులు అమిత మక్కువ చూపిస్తారు. దీనిపై మీకో ఉదాహరణ చెప్తాను. 1936 వ సంవత్సరం లో  1936 వ సంవత్సరం వరకు ముద్రించబడిన గ్రంథాల జాబితా ని                 "రసరత్న సముచ్ఛయ" అనే పేరుతో ముద్రించారు . ఒక కేటలాగ్ లాగా అది మనదేశంలో దాని విలువ 1 రూపాయి . జర్మనీ దేశంలో మన భారతీయ గ్రంథాల గురించి ఇచ్చిన కేటలాగ్ 5000 రూపాయిల చొప్పున అమ్ముడు అయినది.  ఇది మన భారతీయ వైఙ్ఞానిక విలువ కాని అది మరుగున పడుతుంది. మనం అయినా కాపాడుకొని మన తరవాతి తరాలకు ఆ విజ్ఞానాన్ని అందించాలి.

  

మనుష్య శరీర అవయవాల పైన ఉండు గ్రహాల ప్రభావం -

మనుష్య శరీర అవయవాల పైన ఉండు గ్రహాల ప్రభావం -

      మన యొక్క శరీరంలో అయస్కాంత క్షేత్రాలు ఉన్న విషయం ఇటు భారతదేశంలోనే కాక పాశ్చాత్య శాస్త్రవేత్తల పరిశోధనలో కూడా తేలింది. మనిషి మెదడులో మాగ్నటిక్ శక్తి విడుదల అవుతుంది అని లండన్ లొని డాక్టర్లు పరిశోధించి తేల్చారు. మనదేశంలో కూడా పూనాలోని డాక్టర్ ఖరే గారి పరిశోధన గురించి దూరదర్శన్ లో కూడా చూపించారు. డాక్టర్ ఖరే గారు పరిశోధించి మనిషి మెదడు, గుండె, కాలేయం మొదలయిన అవయవాలన్నిటికి అయస్కాంత క్షేత్రాలు ఉన్నాయి అని నిరూపించడమే కాకుండా వాటిని కొలిచే పరికరం కూడా తయారుచేశారు.

                 యోగశాస్త్రం వివరించే మూలాధారం వంటి చక్రాలు కూడా మనిషి శరీరంలో ఇమిడి ఉన్న అయస్కాంత శక్తి కేంద్రాలు మాత్రమే .ఈ విధంగా అయస్కాంత శక్తి నిలయం అయిన మానవ శరీరం వివిధ గ్రహాల నుంచి వస్తున్న విద్యుతయస్కాంతాల తరంగాల వైబ్రేషన్లకు అనుగుణంగా మార్పుచెందును. 

             ఇప్పుడు మీకు కొన్ని ఉదాహరణలు వివరిస్తాను. జ్యోతిష్య శాస్త్రంలో తెలిపినట్లు చంద్ర కుజుల వలన స్త్రీల ఋతుధర్మం , గురుని వలన కాలేయం , రవి వలన హృదయము , బుధుని వలన నరములు , శుక్రుని వలన మూత్రపిండములు ప్రభావితం అవ్వడం గురించి మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు . పైత్యరసం పసుపు రంగులో ఉండటం కూడా గురుని ప్రభావం అని ఎప్పుడో నిరూపితం అయింది. చంద్రుని యొక్క ప్రభావం గర్భాశయం పైన , ప్రసవం పైన ఉంటుంది అని నిరూపితం అయిన విషయమే. అక్కడివరకు ఎందుకు మనపెద్దవారు పౌర్ణమి నాడు పిచ్చి ఎక్కువ అవుతుందని అమావాస్యకు తగ్గుతుంది అని ఎప్పుడో చెప్పారు . ఆ తరువాత అమెరికా వారు ఎన్నో రోజులు పరిశోధించి అది నిజమే అని ఒప్పుకున్నారు. శరీరంలోని సంపూర్ణ ద్రవ మరియు పార్షిక ద్రవ పదార్ధాలు ఏవైతే ఇనుమును కలిగి ఉన్నాయో అవన్ని చంద్రుని ఆకర్షణ శక్తికి లోనవుతున్నాయి అని అట్టి చర్యల వలన మానసిక భావోద్రేక సమస్యలకు మనుష్యుడు లోనవుతున్నాడు అని శాస్త్రవేత్తలు కనుగొన్నారు .

         బృహజ్జాతకం వంటి పురాతన జ్యోతిష్య గ్రంథాలను పరిశీలిస్తే గర్భస్థ శిశువు పిండం దశ నుండి ప్రసవం వరకు ఏ గ్రహం వలన ఏయే అవయవాలు ఏర్పడుచున్నవో కూడా వివరణ ఇవ్వబడుచున్నది. పాతకాలంలో చాలా మంది వైద్యులకు జ్యోతిషం తెలిసి ఉండేది. రోగము కనపడిన రోజు నక్షత్రమును బట్టి ఆ రోగం ఎన్ని రోజులకు పోతుందనే లెక్కలు ఆయుర్వేద గ్రంథాలలో కనిపిస్తాయి.

       ఇప్పుడు మీకు మనిషి శరీరంలోని ఏయే అవయవాల పైన ఏయే గ్రహాల ప్రభావం ఉంటుందో ఇప్పుడు మీకు తెలియచేస్తాను.

 రవి -

   రక్తం, గుండె , పురుషుల కుడికన్ను , స్త్రీల ఎడమకన్ను.

 చంద్రుడు -

   స్తనములు, పాలు , గర్భాశయం, ప్రసవం, లింఫ్ గ్రంథులు, పురుషుల ఎడమ కన్ను, స్త్రీలకు కుడికన్ను , అండములు , కడుపు, ఆహారనాళం .

 కుజుడు -

    ఎముకలలోని మజ్జ, కండరములు, బాహ్య జననేంద్రియములు, మూత్రకృచ్చం .

 బుధుడు -

    మెదడు, శరీరంలోని నరాలు అన్ని బుధుడుకి సంబంధించినవి . చర్మము, నాలుక , వోకల్ కార్డు నరాలు , స్వరపేటిక, మాటలు , తెలివితేటలు .

 గురుడు -

     కాలేయం, గాల్ బ్లాడర్ , సంతానం దాని ఉత్పత్తికి సంబంధించిన భాగాలు , శరీరంలోని కొవ్వు, కఫం, తొడలు, మూత్రపిండాలు.

  శుక్రుడు -

     వీర్యము, లోపలి జననేంద్రియాలు , కామమునకు సంబంధించిన అన్ని అవయవములు, మూత్రపిండములు, శరీరంలోని గ్లూకోజ్ , పాంక్రీయాస్ , శరీరంలోని నీరు , రతిక్రియ , యోని లొపలి భాగములు .

  శని -

     ఎముకలు, చర్మం, విసర్జన కార్యము , మలము , గుదము , రెక్టమ్ , చెమట , గోళ్లు , శరీరం పైన గల వెంట్రుకలు , పెద్దప్రేగులు , వాతం .

         పైన చెప్పిన విధంగా ఆయా అవయవాల పైన ఆయా గ్రహాల ప్రభావం ఉంటుంది.  


  

నిద్ర - నియమాలు -

నిద్ర - నియమాలు -

      మానవుడు ఆరోగ్యముగా ఉండవలెను అనిన ఆహారం మరియు నిద్ర ఇవి రెండు ముఖ్యమైనవి . నిద్ర వలన శ్రమ , అలసట తొలగిపోవును . నిద్ర సరిగ్గా పోనిచో శరీరం అశక్తతో నీరసంగా తయారగును. ముఖ్యంగా చిన్నపిల్లలకు , వృద్దులకు నిద్ర అత్యంత ముఖ్యం అయినది. ప్రతిమనిషి 5 గంటల నుంచి 8 గంటలపాటు తప్పకుండా నిద్రించవలెను. నిద్రను రెండురకాలుగా విభజించవచ్చు. అవి  

              1 . గాఢనిద్ర.

              2 . కలతనిద్ర .

 గాడనిద్ర - 

       మైమరచి , బాహ్య విషయాలు తెలియకుండా రెండు నుంచి మూడు గంటల పాటు నిద్రించుట . దీనివల్ల మానసికపరమైన ఉల్లాసం , విశ్రాంతి లభించి మానవుడు దైనందిక కార్యక్రమాలు చురుకుగా నిర్వర్తించగలడు.

 కలతనిద్ర -

        మనుష్యుడు నిద్రించునప్పుడు కొంతవరకు బాహ్యవిషయాలు తెలియుచుండును. ఎవరైనా బిగ్గరగా మాట్లాడటం , శబ్దము చేసిన వెంటనే మెలుకువ వచ్చును. ఈ నిద్ర వలన పూర్తి విశ్రాంతి కలుగదు. కొంతవరకు శారీరక విశ్రాంతి మాత్రం లభించును.

 నిద్ర నియమాలు -

 * కొన్నాళ్ళు జబ్బు పడి లేచినవారు , జ్వరముతో బాధపడువారు , నిద్రవచ్చినప్పుడు కునికిపాట్లు పడవచ్చు కాని పూర్తిగా నిద్రపోగూడదు అని ఆయుర్వేదం స్పష్టంగా చెప్పినది.

 * జ్వరంతో ఉన్నప్పుడు ఆహారం తీసుకుని మరలా నిద్రించినచో జ్వరం వెంటనే తిరగబెట్టును. కావున వైద్యుడు చెప్పిన నియమాల ప్రకారమే నిద్రించవలెను.

 * ఎదైనా పరిస్థితులలో రాత్రి జాగరణ చేసినచో రాత్రి ఎంతకాలం నిద్ర తగ్గినదో అంత సమయంలో సగభాగం ఉదయాన్నే ఆహారం తీసుకొకుండా నిద్రించవలెను.

 * ఏప్రిల్ మరియు మే నెలలలో అనగా గ్రీష్మఋతువు నందు ఎండలు అధికంగా పగలు నిద్రించుట పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఆరోగ్యం కలిగించును.

 * సాయంత్రం సమయంలో టీ మరియు కాఫీని తాగడం ఆపినచో రాత్రి సమయం నందు చక్కటి నిద్రపట్టును .

 * ఎక్కువుగా పొగ తాగేవారికి నిద్రపట్టదు. పొగలోని నికోటిన్ అంటూ విషపదార్థం శరీరంలోని నరములకు ఉత్తేజం కలిగించి నిద్రను రానివ్వదు.

 * నిద్రించుటకు ముందు ఆలోచనలను దూరం పెట్టి ప్రశాంతంగా ఉండి వెలికిలిగా పడుకొని ధ్యానం చేయుట ద్వారా మంచి నిద్రపట్టును . మధ్యలో మెలకువ వచ్చిన ఎడమ చేతి వైపు తిరిగి పడుకోవలెను .

 * పొలం పనిచేయువారు మరియు ఫ్యాక్టరీ పనిచేయువారు సాయం సమయాన గోరువెచ్చని నీటితో స్నానం చేసి 10 గంటల లోపు నిద్రకు ఉపక్రమించవలెను.

 * శారీరక శ్రమ లేనివారు చన్నీటి స్నానము చేయవచ్చు . గదిలో తక్కువకాంతి ఇచ్చే బల్బ్ లను ఉంచరాదు.

 * ఉదయం నిద్రలేచే ముందు మంచం పైన అటూఇటూ నాలుగు నుంచి అయిదు సార్లూ పొర్లి చేతులు , కాళ్లు విదల్చవలెను.

 * నిద్ర లేచించిన వెంటనే కాళ్లు , చేతులు వేళ్లు మెటికలు విరవడం వలన శరీర అవయవాలు శక్తిని పుంజుకోనును.

  
  

భారతదేశపు పురాతన విద్య - రసవాద విద్య .

భారతదేశపు పురాతన విద్య - రసవాద విద్య .

   మన ప్రాచీన భారతీయుల విఙ్ఞానం అమోఘమైనది . వారు పరిశోధించి కనుగొనిన అనేక అంశాలు అత్యంత రహస్యంగా నిక్షిప్తం చేసి ఉంచారు . మన భారతీయ వేదాలలో ఎంతో విజ్ఞానం నిక్షిప్తం అయ్యి ఉంది. కాని మనం దానిని పట్టించుకోకుండా పాశ్చాత్త్యా సంప్రదాయాల మోజులో పడిపోయి మన పూర్వీకుల విజ్ఞానాన్ని మనం పట్టించుకోవడం లేదు . తాళపత్రాలలో మరియు మన పురాతన గ్రంథాలలో నిక్షిప్తం అయిన అద్బుత విజ్ఞానాన్ని వారు తమ తమ పరిశోధనలలో ఉపయోగించుకుంటున్నారు. మనం పోగొట్టుకున్న ఒక అద్భుత రహస్య విద్య గురించి ఇప్పుడు మీకు వివరిస్తాను.

         మనం పోగుట్టుకున్న , మరిచిపోయిన ఆ రహస్య విద్య పేరే "రసవాద విద్య" ఈ విద్య గురించి వివరించాలంటే చాలా పెద్ద చరిత్ర ఉంది. ఈ విద్యలో ముఖ్యంగా చెట్ల రసాలు , పాదరసం వంటి లోహాలు ఉపయోగించి "బంగారం " తయారుచేయుట . రహస్యంగా ఉండిపోయిన ఈ విద్య గురించి కొంత సమాచారమును నేను సేకరించాను . కొన్ని పురాతన గ్రంథాలను కూడా నేను ఈ విద్య గురించి తెలుసుకోవడానికి చదవడం జరిగింది. ఇప్పుడు మీకు ఆ విశేషాలు తెలియచేస్తాను.

          అగస్త్య మహర్షులవారు అగస్త్యప్రోక్తం అను రసాయనిక గ్రంధమును రచించి అందులో పాషాణ , రససమ్మేళణాదులు ఉపయోగించు విధానం పేర్కొనెను. నీచలోహాలను స్వర్ణముగా మార్చు విధానములు సవివరముగా తెలియచేస్తూ రసవాదులకు మార్గదర్శకుడు అయ్యెను . ఈ రసవాదం సంపూర్ణంగా సిద్ధించుటకు అత్యంత ప్రజ్ఞ కలవాడై ఉండవలెను . పురాతన సిద్ధులు మాత్రమే కాకుండా కొంతమంది ఆధునిక రసవాద పరిశోధకులు కూడా స్వర్ణాన్ని తయారుచేశారు. వారిలో కాశీ నివాసి "పండిత్ కృష్ణపాల్ " 1943 సంవత్సరంలో హృషికేష్ లోని ప్రముఖుల సమక్షాన రసవాద విద్య ద్వారా స్వర్ణాన్ని తయారుచేశారు. ఆ బంగారం ఆ కాలంలో 72000 రూపాయలకు విక్రయించబడినది. ఆ మొత్తం పంజాబ్ లోని సనాతన ధర్మ ప్రతినిధి సభకు విరాళంగా ఇవ్వబడినది. బనారస్ హిందూ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో విశ్వనాధ మందిరం పై అంతస్తులో రసవాద విద్యలో ప్రముఖ ఆచార్యుడు అయిన నాగార్జుని చిత్రంతో పాటు పాలరాతిపై ఈ వివరాలు కూడా చెక్కబడి ఉన్నాయి . 11 వ శతాబ్దంలో "ఆల్బెరుని " అనే విదేశీ యాత్రికుడు మనదేశం సందర్శించి ఇక్కడి సిద్దులు బంగారం తయారుచేసేవారు అని పేర్కొన్నాడు. దేశంలో కరువుకాటకాలు ఏర్పడినపుడు రసాయనాచార్యులు కృత్రిమంగా స్వర్ణాన్ని తయారుచేసెవారు అని అనేక గ్రంథాలలో వివరించబడి ఉంది.

          ఈ రసవాద విద్యను "స్వర్ణకరణి" పగారవిద్య అని అంటారు. ఈ విద్యను ఉర్దూలో కీమియా అని ఇంగ్లిష్ భాషలో ఆల్కెమీ అని పిలుస్తారు . ఈ రసవాదవిద్యలో నీచ వస్తువుని స్వర్ణంగా మార్చడానికి ఉపయోగించు ఒక వస్తువును "పరుసవేది " అని పిలుస్తారు . ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను ఈ రసవాద విద్య సిద్దించక భ్రష్టుడు , పిచ్చివాడు కావొచ్చేమోకాని ఒక గొప్ప వైద్యుడు మాత్రం తప్పక అవుతాడు. అందుకనే మన పూర్వీకులు " వాదభ్రష్టో వైద్య శ్రేష్ఠ" అని అన్నారు. ఆధునిక శాస్త్రవేత్తలు స్వర్ణం తయారుచేయడాన్ని ఒక పిచ్చిపనిగా , చెప్పినవాడ్ని పిచ్చివానిగా చూస్తారు. వారు చెప్పినట్లు స్వర్ణం ఒక ఎలిమెంట్ అణుసంఖ్య పట్టికలో దీని సంఖ్య 79 . AU కాంతి లోహ సంబంధమైనది . ప్రకృతిసిద్ధంగా లభించే బంగారుస్పటికముల అవయవ రూపత్వం ఇసొమెట్రిక్ భూమి యొక్క ఉష్ణోగ్రతకు కరిగి కిందికి దిగి పేరుకుని పొందే అవయవాకృతిని "నగ్గెట్స్" అంటారు. బంగారం యొక్క కాఠిన్యం 2 .5 to 3 .రష్యా వంటి దేశాలలో ప్రయోగశాలలలో కృత్రిమంగా తయారుచేశారు. బయట ఉన్న బంగారం ఖరీదు కంటే తయారు చేయుటకు అయ్యే వ్యయం ఎక్కువ ఆగుతుంది. అందువల్ల పరిశోధనలు ఆగిపోయాయి.

       భారతీయ పురాణాల్లో చెప్పినదాని ప్రకారం ఈ రసవాద విద్యలో ప్రముఖులు ఆదిమ చంద్రసేనుడు , లంకేశ్వరుడు, మత్తమాండవ్య ఇంద్రదత్త , కలంబి, నాగార్జునుడు, ఋషిశృంగ, రసేంద్రాతిలక , భాలుకి , మైధిలి , హరీశ్వర మొదలగు 27 మహామహులు చేత సింహగుప్తుని కుమారుడు అయిన వాగ్భాటాచార్యుడు , వేమనయోగి వంటి ఎందరో మహాత్ములు , సిద్దులు మొదలయిన వారు ఎందరొ ఉన్నారు.

       మనకు తెలిసిన వేమన గొప్ప రసవాది ఆయన ఒక చోట ఇలా చెప్పాడు . " వెన్నెల నిలుచుండి , వేపాకు పడవేసి అడ్డసరం రసమందు నదియు పిండి రాగి కరుగవేయ రమణ బంగారమౌ విశ్వదాభిరామ " అని చెప్పాడు . మరియొక చోట " పుట్టమీద కాయ , పుట్టమీద మన్ను పుట్టలోనివాని పుట్టుతుదను గట్టియవచనము కాంచనాంబగయ" అని చెప్పాడు. నేపాల్ దేశంలో పరుశువేది లింగం ఉన్నట్టు శ్రీశైల క్షేత్రంలో కూడా శివలింగానికి కింద ఉన్న సప్తమ లింగం కూడా పరశువేది లింగం అంటూ కొన్ని ప్రాచీన రహస్య గ్రంధాలలో ఉన్నది.

  రసవాద విద్య గురించి సంపూర్ణంగా వివరించే అత్యంత ప్రాచీన గ్రంథాలు -

 గ్రంధాల పేర్లు -

 * అగస్త్య రసాయనిక తంత్రం.
 * కక్షపూట తంత్రం.
 * కూపిపక్వ రస నిర్మాణ్ విజ్ఞాన్.
 * ద్వాదశ లోహ భస్మ విధానము.
 * పారద విజ్ఞానం.
 * పారద సంహిత.    
 * రస చింతామణి.
 * రసరత్నాకరము .
 * రసాయన ఖండం.
 * రసార్ణవము.
 * రసేంద్ర చూడామణి.
 * రసేంద్ర కల్పద్రుమ.
 * సనారి విశ్వేశ్వర సంవాదం.
 * రస కంకాలియ.
 * రస కౌముది.
 * రస పారిజాత.
 * రసరత్న మణిమాల.
 * రస ప్రదీప.
 * రసేంద్ర మంగళం .
 * సూత ప్రదీపిక.
 * రస సాగరః.
 * రస రాజలక్ష్మి.
 * రస ముక్తావళి.
 * రసరాజ శిరోమణి.
 * రస సంగ్రహ సిద్ధాంత .
 * రస కిన్నెర .
 * స్వర్ణ తంత్రం.
 * కనకమంజరి.
 * కళాయి శాస్త్రం.

          పైన చెప్పిన గ్రంథాలు అత్యంత ప్రాచీనం అయినవి . ఇంకా కొన్నిచోట్ల అరుదుగా లభ్యం అగుచున్నవి.

  రసవాదం నందు వివరించిన కొన్ని ప్రయోగాలు -

 * తెల్ల వాకుడు రసం తో పాదరసాన్ని నూరిన మైనం . ఆ మైనంలో ఆ పిప్పిలో పొదిగి , ఆరబెట్టి చిన్న పుటం పుట్టిన భస్మం అగును. రాగిని కరిగించి అందులో ఈ భస్మం వేసిన హేమించును 

 * ఒక శేరు ఇంగిలీకమును 5 శేరుల పచ్చిపసుపు రసమున 4 జాములు చురకా ఇచ్చి తరువాత 15 శేరుల తంగేడుపువ్వుల రసముతో చురకా ఇచ్చిన కట్టును . ఇది నిశ్చయం. అది వెండి మీద పదోవంతు వేసిన బంగారం అగును.

 * అడవి మెంతి ఆకు పాదరసమున వేసి నూరి శుద్ద రాగి బిళ్లకు పట్టించి గజపుటం వేసిన వెండి అగును ఇది నిశ్చయం .

 * శంఖు పాషాణం వంకాయలో పెట్టి మట్టిరాసి ఆరబెట్టి 21 పుటములు పెట్టవలెను . 10 పుటముల వరకు 4 నుంచి 5 వేసినను కట్టును . తరువాత 4 కి 1 పిడక చొప్పున పుటములు పెట్టవలెను. దీనిని రసంలో వేసి రాగికి జోడించి కరిగించిన స్వర్ణం అగును.

 * నల్ల ఉమ్మెత్త సమూలం నూరి శుద్ద రాగి బిళ్లకు పట్టించి గజపుటం పెట్టిన భస్మం అగును. ఆ భస్మమును రాగి కరుగుచుండగా వేసిన స్వర్ణం అగును. శుద్ధ రాగి కొరకు నైజామ్ అర్ధరూపాయి వెడల్పాటిది శ్రేష్టం.

 * రెండు నేరేడు పండ్లు తెచ్చి ఒక్కోటి సగం వరకు కోసి కొంచం గుజ్జు తీసి రెండు తులముల రాగి రజను అందులో పోసి తీసిన గుజ్జు మీద వేసి రెండు డిప్పలు కలిపి గుడ్డ చుట్టి 7 సార్లు శీలమన్ను ఇవ్వవలెను . పిమ్మట ఏరు పిడకలతో పుఠం పెట్టి సాంగశీతలమున బలి ఇచ్చి తీసి చూచిన 6 వన్నె బంగారం అగును .కరిగించి దూచిన సరిపోవును .