Thursday, September 30, 2021

సూత్రాలు

మీ యొక్క ఆరోగ్యం కోసం రెండు నిమిషాలు ఈ పోస్ట్ ని పూర్తిగా *చదవండి*
👇👇👇
*కొన్ని ప్రాచీన భారతీయ ఆరోగ్య చిట్కాలు…*

🏵️1. _*అజీర్ణే భోజనమ్ విషమ్:*_
➖➖➖➖➖➖➖
మధ్యాహ్న భోజనం జీర్ణం కాకపోతే, రాత్రి భోజనం చేయడం, విషం తీసుకోవడంతో సమానం అని ఈ సూత్రానికి అర్థం. ఆకలి అనేది మునుపటి ఆహారం జీర్ణం కావడానికి ఒక సంకేతం. కాబట్టి ఆకలి లేకుండా మళ్ళీ ఆహారం తీసుకోకూడదు.

🏵️2. *అర్ధరోగహరి నిద్రాహా:*
➖ ➖ ➖ ➖ ➖ ➖ 
సరైన నిద్ర, మీ వ్యాధులలో సగం నయం చేస్తుంది. మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో, తగినంత నిద్ర కూడా అంతే ముఖ్యం. ఆరోగ్యవంతుడు రోజుకి కనీసం ఆరు గంటలు నిద్రపోవాలి. తిన్న ఆహారం జీర్ణం కావడానికి, శారీరక శ్రమ వల్ల కాళ్ళు, చేతులు, గుండె, మెదడు మొదలైన ముఖ్య అంగాలు అలసట తీరి సక్రమంగా పనిచేయడానికి నిద్ర ఉపకరిస్తుంది. అటువంటి వారికి రోగాలు దరిచేరవు. కనుక మంచి నిద్ర సగం రోగాలను హరించి వేస్తుంది అని ఈ సూక్తికి అర్థం.

🏵️3. _*ముద్గధాలి గధవ్యాలి:*_
➖➖➖➖➖➖➖
అన్ని రకాల పప్పుధాన్యాలలో, పచ్చ *పెసలు* (Greengrams) ఉత్తమమైనవి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇతర పప్పుధాన్యాలు అన్నీ,
 ఒకటి లేదా మరొకటి దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి.

🏵️4. *బాగ్నస్తి సంధనకరో రాసోనాహా:*
➖➖➖➖➖➖➖
వెల్లుల్లి విరిగిన ఎముకలతో కలుస్తుంది. వెల్లుల్లి తరచుగా తినేవారిలో ఎముకలు, వాటి జాయింట్లు గట్టిగా ఉంటాయి.

🏵️5. *అతి సర్వత్రా వర్జయేత్:*
➖➖➖➖➖➖➖
అధికంగా తినేది ఏదైనా, అది మంచి రుచిని కలిగి ఉన్నా, ఆరోగ్యానికి మంచిది కాదు. మితంగా (తక్కువ) తినండి.

🏵️6. *నాస్తిమూలం అనౌషాధం:*
➖➖➖➖➖➖➖
శరీరానికి ఎటువంటి ఔషధ ప్రయోజనం లేని కూరగాయలు అంటూ లేవు.

🏵️7. *నా వైద్యా ప్రభుయుయుషా:*
➖➖➖➖➖➖➖
ఏ డాక్టర్ కూడా మన దీర్ఘాయువుకు ప్రభువు కాదు. వైద్యులకు కొన్ని పరిమితులు ఉన్నాయి.

🏵️8. *చింతా వ్యాధి ప్రకాషయ:*
➖➖➖➖➖➖➖
చింత అనారోగ్యాన్ని తీవ్రతరం చేస్తుంది.

🏵️9. *వ్యాయమాశ్చ సనైహి సనైహి:*
➖➖➖➖➖➖➖
ఏదైనా వ్యాయామం నెమ్మదిగా చేయండి. వేగవంతమైన వ్యాయామం మంచిది కాదు. నడక కూడా ఇందులోకి వస్తుంది.

🏵️10. *అజవత్ చార్వనం కుర్యాత్:*
➖➖➖➖➖➖➖
మీరు తినే ఆహారాన్ని మేక లాగా నమలండి. ఎప్పుడూ ఆత్రుత తో ఆహారాన్ని మింగకూడదు. జీర్ణక్రియలో లాలాజలమే మొదట సహాయపడుతుంది.

🏵️11. *స్నానమ్ నామా మనఃప్రసాధనకరం దుస్వప్న విధ్వంసకం*
➖➖➖➖➖➖➖
స్నానం డిప్రెషన్ ను తొలగిస్తుంది. ఇది చెడ్డ కలలనును దూరం చేస్తుంది.

🏵️12. *న స్నానం ఆచరేత్ భుక్త్వా:*
➖➖➖➖➖➖➖
ఆహారం తీసుకున్న వెంటనే స్నానం చేయకండి. జీర్ణక్రియ ప్రతికూలంగా ప్రభావితమవుతుంది.

🏵️13. *నాస్తి మేఘసమం తోయం:*
➖➖➖➖➖➖➖
స్వచ్ఛతలో వర్షపునీటికి, ఏ నీరు సాటి రాదు. పల్లెటూళ్ళలో ఇప్పటికీ వర్షపు నీటిని పట్టి వడకట్టి త్రాగుతారు. కాని నేరుగా పడిన వర్షపు నీటినే పట్టాలి. ఇంటి చూరుల మీదనుంచి కారిన నీరుకాదు.

🏵️14. *అజీర్నే భేజాజం వారీ:*
➖➖➖➖➖➖➖
మంచినీరు ఎక్కువగా తీసుకోవడం ద్వారా అజీర్ణాన్ని పరిష్కరించవచ్చు.

🏵️15. *సర్వత్ర నూతనం శాస్త్రం సేవకన్న పురాతనం.*
➖➖➖➖➖➖➖
తాజా విషయాలను ఎల్లప్పుడూ ఇష్టపడండి. ఓల్డ్ రైస్ మరియు ఓల్డ్ సర్వెంట్‌ను కొత్తగా మార్చాల్సిన అవసరం ఉంది. (ఇక్కడ సేవకుడి విషయంలో అసలు అర్థం ఏమిటంటే: అతని విధులను మార్చండికానీ, తొలగించవద్దు.)

🏵️16. *నిత్యామ్ సర్వ రసభ్యాసహా:*
➖➖➖➖➖➖➖
ఉప్పు, తీపి, చేదు, పులుపు, (Astringent మరియు pungent) అన్ని రుచులు కలిగి ఉన్న పూర్తి ఆహారాన్ని తీసుకోండి.

🏵️17. *జఠరామ్ పూరైధార్ధమ్ అన్నాహి:*
➖➖➖➖➖➖➖
మీ కడుపు అరవంతు ఘనపదార్థాలతో, పావువంతు నీటితో నింపండి మరియు మిగిలినది ఖాళీగా ఉంచండి.

🏵️18. *భుక్త్వోపా విసస్థాంద్:*
➖➖➖➖➖➖➖
ఆహారాన్ని తీసుకున్న తర్వాత ఎప్పుడూ పనిలేకుండా కూర్చోవద్దు. కనీసం 100 అడుగులు అయినా నడవండి.

🏵️19. *క్షుత్ సాధూతం జనయతి:*
➖➖➖➖➖➖➖
ఆకలి, ఆహార రుచిని పెంచుతుంది. (ఇంకా చెప్పాలంటే, ఆకలితో ఉన్నప్పుడు మాత్రమే తినండి.)

🏵️20. *చింతా జరానామ్ మనుష్యానమ్:*
➖➖➖➖➖➖➖
చింతించడం 😭అనేది వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది. కనుక అనవసరపు చింతలతో ఆరోగ్యాన్ని పాడుచేసుకోకండి.

🏵️21. *సతం విహయ భోక్తవ్యం:*
➖➖➖➖➖➖➖
ఆహారం తీసుకొనే సమయం వచ్చినప్పుడు, ఎంతటి పనినైనా కూడా పక్కన పెట్టండి. నిదానంగా భోజనం చేయండి. వేగంగా తినడం, పని ఉందని అసలు భోజనమే మానివేయడం చాలా అనర్థదాయకం.

🏵️22. *సర్వ ధర్మేశు మధ్యమామ్:*
➖➖➖➖➖➖
ఎల్లప్పుడూ మధ్యే మార్గాన్ని ఎంచుకోండి. దేనిలోనైనా విపరీతంగా వెళ్లడం మానుకోండి. ఈ ఆరోగ్య సూత్రాలు పాటించిన వారికి చిరాయువు, నిత్య ఆరోగ్యం తప్పక లభిస్తాయి.

*స్వస్తి.....🙏*

Wednesday, September 29, 2021

సంస్కృతం దేవభాష.

సంస్కృతం దేవభాష. అత్యంత ప్రాచీన భాష.సంస్కృతం మూలాలే లాటిన్,ఇంగ్లీష్ లలో ఉన్నాయనేది కొన్ని పదాలు చూస్తే తెలుస్తుంది.(వెల్దండ రఘుమారెడ్డి పరిశోధన నుండి).

Sanskrit            English

1.లప్                  lip

2.దంత               dent

3.నాసిక              nose

4.బ్రాత                brother

5.మాత              mother

6.సూనుః            son

7.దుహిత           daughter

8.నక్తం                night

9.లఘు              light

10.వాహక         vehicle
 
11.వహతి         weight

12.తరు             tree

13.హోమ          home

14.మూషి         mouse

15.మృత          mortal

16.గ్రాసము       grass

17.బంధ           bond

18.నవ             new

19.మధ్య         mid

20.ఉపరి          upper

21.అదః           under

22.హోరా         hour

23.పథ్            path

24.క్రూర          cruel

25.ఉక్షా          ox

26.గౌ             cow

27.సర్ప         serpent

28.వమితం   vomit

29.ఇతర       other

30.పరమానంత permanant

31.న             no

32.అ +హం     I am

33.ఇతి         it

34.తత్        that

35.సా          she

36.సః           he

37.వయం    we

38.తే           they

39.అస్        is

40.యూయం    you

41.మానవ        man

42.అంగార        anger

43.జ్ఞా               know

44.అగ్రిమకులచర
      Agriculture

45.దామ           dam

46.స్థాన్             station

47.దానం          donation

48.సంత్           saint

49.దివ్య            divine

50.అగ్ని            ignite

51.వాక్కు         vocal

52.వస్             bus

53.సర             car

54.సర్వేక్షణ      survey

55.షష్టి             sixty

56.శత పర శత  cent per cent

57.ధీక్షపాల    discipline

58.శూర్పనఖ   sharp nails

59.దశ              deci

60.నవ             nona

61.అష్ట             octa

62.సప్త              septa

63.షష్ఠ             hexa, hepta

64.పంచ           penta

65.త్రయం         three, trio

66.ద్వయం,ద్వి   dual, dia

67.అస్థిక             osteo

68.చర్మ                derma

69.పాదచారి         pedestrian

70.కృష్ణ                Christna

71.  గోళం             globe

72.దత్త                  debt

73.విధవ               widow

74.పరిమితి           perimeter   

75.భ్రూ                brow

76.తార              star

77.అంతర          inter

78.అంత్            end

79.స్విస్టం           sweet

80.సీవతి            sewing

81.తిథి               date

82.క్రమేల            camel

83.పురోగం         programme

84.చోష్             juice

85.ప్రచార         preacher

86.మనస్తర్       minister

87.సంపన్న       champion

88.అర్కొదది  arctic ocean

89.అతులాంతకోదది. Atlantic ocean

90.ప్రశంతోదది  Pacific ocean 

91.అస్త్రాలయ్  Australia

92.అంధమానవ ద్వీపం Andaman 

93.హిందూ ఆసియా  Indonesia

94.ఋషీయా  Russia

95.కాశ్యపసముద్రము  Kaspean sea.

96.ఆముస్తారదామ  Amsterdam

97.అగ్నిఖండ్,అంగళ గ్రంధి  England

98.బ్రహ్మాంగ దామ  Bermingham

99.మరీచిక  Mauritius

100.లాస్యంజలి LosAngels.

Tuesday, September 28, 2021

భుక్తాయాసం తగ్గాలంటే

👨🏻‍⚕️ మీ ఆరోగ్యం మీ చేతుల్లో (870)
+++++++++++++++++++++++
అరోగ్య మస్తు
***************************
భుక్తాయాసం తగ్గాలంటే
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
 భుక్తాయాసం అంటే.. కడుపు నిండుగా ఫుల్ గా తిని తర్వాత
వచ్చే ఆయాసాన్ని అంటారు.
మనము నడిచితే విపరీతమైన ఆయాసం వస్తుంది. ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు ఫుల్గా లాగిస్తా o. లేదా ఇంట్లో ఏదైనా స్పెషల్ చేసినప్పుడు, ఫుల్ గా తింటాము.... తర్వాత కొద్దిసేపు తర్వాత అసలైన సినిమా స్టార్ట్ అవుతుంది....
వెలితిగా భోజనం చేస్తే సరిపోతుంది కదా! అనిపించవచ్చు కానీ కంచం దగ్గర కూర్చున్నాక అలా మాత్రం లేవలేక పోతున్నా మని చాలా మంది అంటారు. భోజనం నిండుగా తింటూ దానికి తోడు మంచి నీటిని కూడా త్రాగుతారు. దీనితో పొట్ట ఫుల్గా నిండి ఈ బరువంతా వెళ్ళి ఊపిరితిత్తులు చివరి భాగాలపై పడి, వాటిని సుమారుగా 25, 30 శాతంనొక్కి వేస్తుంది. భోజనాన్ని అరిగించడానికి శరీరానికి ఎక్కువగాలి అవసరం. ఉంటుంది. దానికి తోడు ఊపిరితిత్తులు మూసుకుని పోయేసరికి శరీరానికి పూర్తిగా గాలి సరిగ్గా చాలక, భోజనం అయిన దగ్గర్నుండీ భుక్తాయాసం వస్తుంది.

👉చిట్కాలు:- 
1) భోజనాన్ని తినేటప్పుడు టేబుల్పై కాకుండా క్రింద కూర్చుని తింటే మంచిది. క్రింద కూర్చునే సరికి పొట్ట పావు వంతు మూసుకుంటుంది. మీరు పూర్తిగా నిండుగా తిని లేచేసరికి, మీకు తెలియకుండా కొంత ఖాళీ వచ్చి ఆయాసం ఉండదు.
 2) తినేటప్పుడు నీరు త్రాగకుండా, తినడానికి అరగంట ముందువరకు త్రాగి, తిన్న రెండు గంటల తరువాత అప్పుడప్పుడు ఒక్కొక్క గ్లాసు త్రాగుతూ ఉంటే భుక్తాయాసం రాదు. 
3) పొట్టను 80 శాతం కంటే నింపేటట్లు తినకుండా జాగ్రత్త పడటం మంచిది.
4) ఆహారం సేవించిన తర్వాత కనీసం 100 అడుగుల దూరమైనా నడవండి.
5) భోజనం చేయడానికి గంట ముందు గాని  తర్వాత గాని ఎటువంటి పరిస్థితుల్లో స్నానం చేయకూడదు
6) వాము 100 గ్రాములు
మిరియాలు 50 గ్రాములు
దొడ్డు ఉప్పు లేదా నల్ల ఉప్పు 25 గ్రాములు
మూడు కలిపి దోరగా వేయించి పొడిచేసి నిల్వచేసుకోవాలి.
ఆహారం సేవించిన పావుగంట తర్వాత అరచెంచా గోరువెచ్చని నీళ్లతో సేవించాలి. దీనివల్ల మనం తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది గ్యాస్ సమస్య ఉండదు.. కడుపు ఉబ్బరం కడుపు నొప్పి, తగ్గిపోతుంది
7)  వజ్రాసనంలో కూర్చుని వాయు ముద్ర వేయాలి.
8) వాము లేదా సోంపు వేసి కషాయం చేసుకుని తాగితే తగ్గుతుంది.


సూక్తులు

1. మాతా నాస్తి, పితా నాస్తి, 
నాస్తి బంధు సహోదరః| 
అర్థం నాస్తి, గృహం నాస్తి, 
తస్మాత్ జాగ్రత  జాగ్రత|| 

తా:- తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనము, ఇల్లు ఇవి అన్నియు మిధ్యయే. ఇవి ఏవియు నిజముగా లేవు. 
కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 

2. జన్మ దుఃఖం, జరా దుఃఖం, 
జాయా దుఃఖం పునః పునః| 
సంసార సాగరం దుఃఖం 
తస్మాత్ జాగ్రత  జాగ్రత|| 

తా:- ఈ జన్మ, వృద్ధాప్యము, భార్య, సంసారము ఇవన్నియు దుఃఖ భరితములు. తిరిగి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. 

కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 

3. కామః  క్రోధశ్చ, లోభశ్చ 
దేహే తిష్ఠతి తస్కరాః| 
జ్ఞాన రత్నాపహారాయ 
తస్మాత్ జాగ్రత  జాగ్రత|| 

తా :-  కామము, క్రోధము, లోభము మొదలైన అరిషడ్వర్గములు మనలోని జ్ఞానమనెడు  విలువైన రత్నములను దొంగిలించుటకై మన దేహమునందు దాగియున్నదొంగలు. 
కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 

4. ఆశయా బధ్యతే జంతుః 
కర్మణా బహు చింతయా| 
ఆయుక్షీణం న జానాతి 
తస్మాత్ జాగ్రత  జాగ్రత|| 

తా:- ఈ మనుష్యులు ఎల్లప్పుడూ ఏదో ఆశకు, కర్మకు కట్టుబడి ఏవేవో ఆలోచనలతో,  జీవితాలు 
గడుపుతుంటారు. ఆయుర్ధాయం తరిగిపోతుందన్న 
విషయాన్ని గమనించరు. 
కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 

5. సంపదః స్వప్న సంకాశాః 
యౌవనం కుసుమోపమ్| 
విధుఛ్చచంచల ఆయుషం 
తస్మాత్ జాగ్రత  జాగ్రత|| 

తా:- మన సంపదలన్నియు ఒక కలవంటివి, అంటే అశాశ్వతాలు.  యౌవనం పూవుతో సమానం అంటే ఎపుడు వాడి నశిస్తుందో తెలియదు. ఆయుష్షు మెరుపుతీగవలె చంచలమైనది.  
కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 

6. క్షణం విత్తం, క్షణం చిత్తం, 
క్షణం జీవితమావయోః| 
యమస్య కరుణా నాస్తి 
తస్మాత్ జాగ్రత  జాగ్రత|| 

తా:- ధనము, బుద్ధి, జీవితము ఇవన్నియు క్షణభంగురములు. మన ప్రాణములను హరించుటకై వేచియున్న యముడు ఏ మాత్రము దయ జూపడు. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 

7. యావత్ కాలం భవేత్ కర్మ 
తావత్ తిష్ఠతి జంతవః| 
తస్మిన్ క్షీణే వినశ్యంతి 
తత్ర కా పరివేదన|| 

తా:- ప్రపంచంలో తమ కర్మబంధము ఎంతవరకు ఉంటుందో,  అంతవరకే ప్రాణులు జీవిస్తాయి. ఆ కర్మబంధం వీడిపోగానే మరణిస్తారు. జననమరణాలు జీవుని ధర్మము. దానికి బాధపడటం ఎందుకు. 

8. ఋణానుబంధ రూపేణ 
పశుపత్నిసుతాలయః| 
ఋణక్షయే క్షయం యాంతి 
తత్ర కా పరివేదన|| 

తా:- గత జన్మ ఋణానుబంధము ఉన్నంతవరకే భార్య, సంతానం, ఇల్లు, పశువులు ఉంటాయి. ఆ బంధం తీరగానే ఇవన్నీ నశించిపోతాయి. అందుకు వ్యథ చెందడ మెందుకు. 

9. పక్వాని తరుపర్ణాని 
పతంతి క్రమశో యథా| 
తథైవ జంతవః కాలే 
తత్ర కా పరివేదన|| 

తా:-  పండిన ఆకులు చెట్టునుండి ఆకులు ఏ విధముగా రాలిపోవునో అదే విధముగా ఆయువు తీరిన వారు మరణింతురు. దానికై దుఃఖించుట ఎందులకు? 

10. ఏక వృక్ష సమారూఢ 
నానాజాతి విహంగమాః| 
ప్రభతే క్రమశో యాంతి 
తత్ర కా పరివేదన|| 

తా:-  చీకటి పడగానే అనేక జాతులు పక్షులు ఒకే వృక్షం 
ఆశ్రయించి విశ్రమిస్తాయి. తెల్లవారగానే ఆ పక్షులు 
అన్నీ చెట్టును విడచి తమతమ ఆహార సంపాదనకు 
వెళ్ళిపోతాయి. అదే విధంగాబంధువులతో కూడిన 
మానవుడు కాలమాసన్నమైనపుడు తన శరీరాన్ని 
ఇంటిని వదలి వెళ్ళిపోతాడు. అందుకు బాధపడ 
నవసరములేదు.

Monday, September 20, 2021

*మన పండుగల గొప్పతనం తెలుసు కోండి.*◆

◆ *మన పండుగల గొప్పతనం తెలుసు కోండి.*◆

★ *ఉగాది:-* కష్టము, సుఖము, సంతోషము, బాధ ఇలా అన్నింటిని స్వీకరించాలని.
★ *శ్రీరామ నవమి:-* భార్య - భర్తల  అనుబందాన్ని గొప్పగా చెప్పుకోవడానికి.
★ *అక్షయ తృతీయ:-* విలువైన వాటిని  కూడబెట్టుకోమని.
★ *వ్యాస (గురు) పౌర్ణమి :-* జ్ఞానాన్ని అందించిన గురువును మరువొద్దు అని.
★ *నాగుల చవితి;-* ప్రాణాల్ని తీసేదయిన సరే తోటి జీవులను ప్రేమగా అధరించమని.
★ *వరలక్ష్మి వ్రతం :-*  నీకున్న ఐశ్వర్యమును అందరికీ పంచుతూ, అందరితో కలిసి సంతోషంగా ఉండమని.
★ *రాఖీ పౌర్ణమి:-* తోడబుట్టిన బంధం ఎప్పటికి విడరాదు అని.
★ *వినాయక చవితి ( నవరాత్రులు ) :-* ఊరంతా ఒక్కటిగా కలవడానికి.
★ *పితృ అమావాస్య:-* చనిపోయిన వారిని  ఎప్పటికి మరువకు అని చెపుతూ.
★ *దసరా ( ఆయుధ పూజ)  :-* ఎప్పుడు నీకు అండగా  నిలిచి నీ పనులు చేసే దానిని గౌరవించమని తెలిపేది.
★ *దీపావళి :-* పది మందికి వెలుగు చూపే జీవనం నీదవాలని.
★ *కార్తీక పౌర్ణమి :-* చలికాలం చన్నీటి స్నానం చేసి ఇంద్రియములను గెలువమని.
★ *సంక్రాంతి :-*  మనం జీవించే ఉన్నాము అంటే కారణం వ్యవసాయం,  అలాంటి దానిని మరువకుండా సంబరాలు జరుపమని.
★ *మహాశివరాత్రి :-* కాలం మారుతోంది నీ శరీరాన్ని నీ అదుపులో ఉంచుకో అని.
★ *హోలీ :-* వివిధ రంగుల వలెనున్న వివిధ మనుషులు, వివిధ అను భూతులను పిల్లలు,  పెద్ధలు అందరూ కలిసి సంతోషంగా ఆస్వాదించమని.

Friday, September 17, 2021

తెలుగు సామెతలు

209 సామెతలు మీకోసం...

👍మరుగున ( మడుగున) పడుతున్న కొన్ని తెలుగు సామెతలు.

1. అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు.
2. అంబలి తాగే వారికి మీసాలు యెగబట్టేవారు కొందరా.
3. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ.
4. అత్తలేని కోడలుత్తమురాలు కోడల్లేని అత్త గుణవంతురాలు.
5. అనువుగానిచోట అధికులమనరాదు.
6. అభ్యాసం కూసు విద్య.
7. అమ్మబోతే అడివి కొనబోతే కొరివి.
8. అయితే ఆదివారం కాకుంటే సోమవారం.
9. ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం.
10. ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత.
11. ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు.
12. ఇంట గెలిచి రచ్చ గెలువు.
13. ఇల్లు పీకి పందిరేసినట్టు.
14. ఎనుబోతు మీద వాన కురిసినట్టు.
15. చెవిటి వాని ముందు శంఖమూదినట్టు.
16. కందకు లేని దురద కత్తిపీటకెందుకు.
17. కత్తిపోటు తప్పినా కలంపోటు తప్పదు.
18. కుక్క కాటుకు చెప్పుదెబ్బ.
19. కోటి విద్యలూ కూటి కొరకే.
20. నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు.
21. పిచ్చుకపై బ్రహ్మాస్త్రమా.
22. పిట్ట కొంచెం కూత ఘనం.
23. రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు.
24. వాన రాకడ ప్రాణపోకడ ఎవరికెరుక.
25. కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదు
26. మింగమెతుకులేదు. మీసాలకు సంపంగి నూనె.
27. ఆడబోయిన తీర్థము యెదురైనట్లు.
28. ఆడలేక మద్దెల వోడు అన్నట్లు.
29. ఆది లొనే హంస పాదు.
30. ఏమీ లేని యెడారిలో ఆముదము చెట్టే మహా వృక్షము.
31. ఆకలి రుచి యెరుగదు నిద్ర సుఖమెరుగదు.
32. ఆకాశానికి హద్దే లేదు.
33. ఆలస్యం అమృతం విషం.
34. ఆరే దీపానికి వెలుగు యెక్కువ.
35. ఆరోగ్యమే మహాభాగ్యము.
36. ఆవులింతకు అన్న ఉన్నాడు కాని తుమ్ముకు తమ్ముడు లేడంట.
37. ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా?
38. అబద్ధము ఆడినా అతికినట్లు ఉండాలి.
39. అడగందే అమ్మైనా అన్నము పెట్టదు.
40. అడ్డాల నాడు బిడ్డలు కాని గడ్డాల నాడు కాదు.
41. ఏ ఎండకు ఆ గొడుగు.
42. అగ్నికి వాయువు తోడైనట్లు.
43. ఐశ్వర్యమొస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమంటాడు.
44. అందని మామిడిపండ్లకు అర్రులు చాచుట.
45. అందితే జుట్టు అందక పోతే కాళ్ళు.
46. అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో శని ఉన్నట్లు.
47. అన్నపు చొరవే గాని అక్షరపు చొరవ లేదు.
48. అప్పు చేసి పప్పు కూడు.
49. అయ్య వారు వచ్చే వరకు అమావాస్య ఆగుతుందా.
50. అయ్యవారిని చెయ్యబొతే కోతి బొమ్మ అయినట్లు.
51. బతికుంటే బలుసాకు తిని బతకొచ్చు.
52. భక్తి లేని పూజ పత్రి చేటు.
53. బూడిదలో పోసిన పన్నీరు.
54. చాదస్తపు మొగుడు చెబితే వినడు,
గిల్లితే యేడుస్తాడు.
55. చాప కింద నీరులా.
56. చచ్చినవాని కండ్లు చారెడు.
57. చదివేస్తే ఉన్నమతి పోయినట్లు.
58. విద్య లేని వాడు వింత పశువు.
59. చేతకానమ్మకే చేష్టలు ఎక్కువ.
60. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు.
61. చక్కనమ్మ చిక్కినా అందమే.
62. చెడపకురా చెడేవు.
63. చీకటి కొన్నాళ్ళువెలుగు కొన్నాళ్ళు.
64. చెరువుకి నీటి ఆశ నీటికి చెరువు ఆశ.
65. చింత చచ్చినా పులుపు చావ లేదు.
66. చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే, ఆ వంకర టింకరవి యేమి కాయలని అడిగిందట.
67. చిలికి చిలికి గాలివాన అయినట్లు.
68. డబ్బుకు లోకం దాసోహం.
69. దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు.
70. దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన.
71. దాసుని తప్పు దండంతో సరి.
72. దెయ్యాలు వేదాలు పలికినట్లు.
73. దిక్కులేని వాడికి దేవుడే దిక్కు.
74. దొంగకు దొంగ బుద్ధి, దొరకు దొర బుద్ధి.
75. దొంగకు తేలు కుట్టినట్లు.
76. దూరపు కొండలు నునుపు.
77. దున్నపోతు మీద వర్షం పడినట్లు.
78. దురాశ దుఃఖమునకు చేటు.
79. ఈతకు మించిన లోతే లేదు.
80. ఎవరికి వారే యమునా తీరే.
81. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు.
82. గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే, ఒంటె అందానికి గాడిద మూర్ఛ పోయిందంట.
83. గాజుల బేరం భోజనానికి సరి.
84. గంతకు తగ్గ బొంత.
85. గతి లేనమ్మకు గంజే పానకం.
86 గోరుచుట్టు మీద రోకలి పోటు‌.
87. గొంతెమ్మ కోరికలు.
88. గుడ్డి కన్నా మెల్ల మేలు.
89. గుడ్డి యెద్దు చేలో పడినట్లు.
90. గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు.
91. గుడినే మింగే వాడికి లింగమొక లెఖ్ఖా.
92. గుడిని గుడిలో లింగాన్నీ మింగినట్లు.
93. గుడ్ల మీద కోడిపెట్ట వలే.
94. గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నాడట.
95. గుర్రము గుడ్డిదైనా దానాలో తక్కువ లేదు.
96. గురువుకు పంగనామాలు పెట్టినట్లు.
97. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు.
98. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు.
99. ఇంటిపేరు కస్తూరివారు వీధిలో గబ్బిలాల కంపు.
100. ఇంటికన్న గుడి పదిలం.
101. ఇసుక తక్కెడ పేడ తక్కెడ.
102. జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలిందంట.
103. కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు.
104. కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు.
105. కాకి ముక్కుకు దొండ పండు.
106. కాకిపిల్ల కాకికి ముద్దు.
107. కాలం కలిసిరాకపోతే కర్రే పామై కాటువేస్తుంది.
108. కాలు జారితే తీసుకోగలము కాని నోరు జారితే తీసుకోగలమా.
109. కాసుంటే మార్గముంటుంది.
110. కడుపు చించుకుంటే కాళ్ళపైన పడ్డట్లు.
111. కలకాలపు దొంగ ఏదో ఒకనాడు దొరుకును.
112. కలిమి లేములు కావడి కుండలు.
113. కలిసి వచ్చే కాలం వస్తే, నడిచి వచ్చే కొడుకు పుడతాడు.
114. కంచే చేను మేసినట్లు.
115. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా !
116. కందకు కత్తి పీట లోకువ.
117. కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం.
118. కీడెంచి మేలెంచమన్నారు.
119. కొండనాలికకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడినట్లు.
120. కొండల్లే వచ్చిన ఆపద కూడా మంచువలే కరిగినట్లు.
121. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు.
122. కొన్న దగ్గిర కొసరే గాని కోరిన దగ్గర కొసరా.
123. కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిచిందిట.
124. కూటికి పేదైతే కులానికి పేదా.
125. కొరివితో తల గోక్కున్నట్లే.
126. కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లు.
127. కొత్తొక వింత పాతొక రోత.
128. కోటిి విద్యలు కూటి కొరకే.
129. కొత్త అప్పుకు పొతే పాత అప్పు బయటపడ్డదట.
130. కొత్త బిచ్చగాడు పొద్దు యెరగడు.
131. కృషితో నాస్తి దుర్భిక్షం.
132. క్షేత్ర మెరిగి విత్తనము పాత్ర మెరిగి దానము.
133. కుడుము చేతికిస్తే పండగ అనేవాడు.
134. కుక్క వస్తే రాయి దొరకదు రాయి దొరికితే కుక్క రాదు.
135. ఉన్న లోభి కంటే లేని దాత నయం.
136. లోగుట్టు పెరుమాళ్ళకెరుక.
137. మెరిసేదంతా బంగారం కాదు.
138. మంచమున్నంత వరకు కాళ్ళు చాచుకో.
139. నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది.
140. మంది యెక్కువయితే మజ్జిగ పలచన అయినట్లు.
141. మనిషి మర్మము మాను చేవ బయటకు తెలియవు.
142. మనిషి పేద అయితే మాటకు పేదా.
143. మనిషికి మాటే అలంకారం.
144. మనిషికొక మాట పశువుకొక దెబ్బ.
145. మనిషికొక తెగులు మహిలో వేమా అన్నారు.
146. మంత్రాలకు చింతకాయలు రాల్తాయా.
147. మీ బోడి సంపాదనకు ఇద్దరు పెళ్ళాలా.
148. మెత్తగా ఉంటే మొత్తబుద్ధి అయ్యిందట.
149. మొక్కై వంగనిది మానై వంగునా.
150. మొరిగే కుక్క కరవదు కరిసే కుక్క మొరగదు.
151. మొసేవానికి తెలుసు కావడి బరువు.
152. ముల్లును ముల్లుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతొనే కొయ్యాలి.
153. ముందర కాళ్ళకి బంధాలు వేసినట్లు.
154. ముందుకు పోతే గొయ్యి వెనుకకు పోతే నుయ్యి.
155. ముంజేతి కంకణముకు అద్దము యెందుకు.
156. నడమంత్రపు సిరి నరాల మీద పుండు.
157. నేతిబీరకాయలో నెయ్యి ఎంత ఉందో నీ మాటలో నిజం అంతే ఉంది.
158. నక్కకీ నాగలోకానికీ ఉన్నంత తేడా.
159. నవ్వు నాలుగు విధాలా చేటు.
160. నీ చెవులకు రాగి పొగులే అంటే అవీ నీకు లేవే అన్నట్లు.
161. నిదానమే ప్రధానము.
162. నిజం నిప్పు లాంటిది.
163. నిమ్మకు నీరెత్తినట్లు.
164. నిండు కుండ తొణకదు.
165. నిప్పు ముట్టనిదే చేయి కాలదు.
166. నూరు గొడ్లు తిన్న రాబందుకైనా ఒకటే గాలిపెట్టు.
166. నూరు గుర్రాలకు అధికారయినా, భార్యకు యెండు పూరి.
167. ఆరు నెళ్ళు సావాసం చేస్తే వారు వీరు అవుతారు.
168. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు.
169. ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకొని బ్రతకవచ్చు.
170. బతికుంటే బలుసాకు తిని బతుకవచ్చు.
171. ఊరంతా చుట్టాలు ఉత్తికట్ట తావు లేదు.
172. ఊరు మొహం గోడలు చెపుతాయి.
173. పనమ్మాయితొ సరసం కంటే అత్తరు సాయిబుతో కలహం మేలు.
174. పాము కాళ్ళు పామునకెరుక.
175. పానకంలో పుడక  
176. పాపమని పాత చీర ఇస్తే గోడ చాటుకు వెళ్ళి మూర వేసిందట.
177. పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనపడినట్లు.
178. పండిత పుత్రః పరమశుంఠః.
179. పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్లు.
180. పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మేలు.
181. పట్టి పట్టి పంగనామం పెడితే, గోడ చాటుకు వెళ్ళి చెరిపేసుకున్నాడట.
182. పెదవి దాటితే పృథ్వి దాటుతుంది.
183. పెళ్ళంటే నూరేళ్ళ పంట.
184. పెళ్ళికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకు వెళ్ళినట్టు.
185. పేనుకు పెత్తనమిస్తే తలంతా గొరికిందట.
186. పెరుగు తోటకూరలో పెరుగు ఎంత ఉందో, నీ మాటలో అంతే నిజం ఉంది.
187. పిచ్చి కోతికి తేలు కుట్టినట్లు.
188. పిచ్చోడి చేతిలో రాయిలా.
189. పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా.
190. పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణసంకటం.
191. పిండి కొద్దీ రొట్టె.
192. పిట్ట కొంచెం కూత ఘనం.
193. పోరు నష్టము పొందు లాభము.
194. పోరాని చోట్లకు పోతే రారాని మాటలు రాకపోవు.
195. పొర్లించి పొర్లించి కొట్టినా మీసాలకు మన్ను కాలేదన్నదట.
196. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు.
197. పువ్వు పుట్టగానే పరిమళించినట్టు.
198. రాజు గారి దివాణంలో చాకలోడి పెత్తనం.
199. రామాయణంలో పిడకల వేట.
200. రామాయణం అంతా విని రాముడికి సీత ఏమౌతుందని అడిగినట్టుంది.
201. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలనట్టు.
202. రెడ్డి వచ్చే మొదలెట్టు అన్నట్టు.
203. రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు.
204. రౌతు కొద్దీ గుర్రం.
205. ఋణశేషం శత్రుశేషం ఉంచరాదు.
206. చంకలో పిల్లవాడిని ఉంచుకుని ఊరంతా వెతికినట్టు.
207. సంతొషమే సగం బలం.
208. సిగ్గు విడిస్తే శ్రీరంగమే
209. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు.

Wednesday, September 15, 2021

వారాలు దాని చరిత్ర

వారాలను మొదట తయారు చేసిందెవరో తెలుసా🌹🕉

"మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః "  అంటే అర్ధం తెలుసా

SUN'DAY

MO(O)N'DAY

TUESDAY

WEDNESDAY

THURSDAY

FRIDAY

SATUR(N)DAY

అంటే ఏమిటో తెలుసా....? అసలు ఈ వారాలను మొదట తయారు చేసిందెవరో తెలుసా? వీటిని కాపీ కొట్టి, ఇవి మావే అని డబ్బా కొట్టుకుంటున్నది ఎవరో తెలుసా?

సూర్యహోర

చంద్రహోర

కుజహోర

బుధహోర

గురుహోర

శుక్రహోర

శనిహోర - అంటే

ఇవి సంస్కృత గ్రంధాలలో మన ఋషులు చేసిన వారాల విభాగము, ఇవి ఎంతో శాస్త్రీయమైనవి కాబట్టే, బ్రిటిష్ వాళ్లు వీటిని తమ క్యాలెండర్ లో పేర్లు మార్చి, వాటిని వారి విజ్ఞానంగానే ప్రపంచాన్ని నమ్మిస్తున్నారు, 

సరే... ఇప్పుడైనా నిజమేమిటో తెలుసుకుందాం!

ముందుగా ఈ వారాల పేర్లు సంస్కృతం నుండి గ్రీకుకు - అక్కడి నుంచి లాటిన్ దేశాలకు ప్రయాణం చేశాయి! వారము - అంటే 'సారి' అని అర్ధము.

1వ సారి, 2వ సారి... అంటాము కదా దాన్నే సంస్కృతంలో ప్రథమ వారము, ద్వితీయ వారము - అని అంటారు!

కాస్త విపులంగా....

భూగోళము బొంగరం మాదిరి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ కూడా తిరుగుతోందని మన ఋషులు కనుగొన్నారు. భూగోళము తన చుట్టూ తాను ఒకసారి తిరగడాన్ని "ఒక వారం" అని పిలిచారు. ఒకసారి అన్నా - ఒక వారం అన్నా ఒకటే.ఆకాశంలో గ్రహాల వరస ఎలా ఉందో, సూర్య సిద్ధాంత గ్రంధంలో రికార్డు చేయబడి ఉంది.

మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః

అనగా... 

పై నుండి క్రిందికి వరుసగా - శని, గురు, కుజ, రవి, శుక్ర, బుధ, చంద్ర గ్రహాలున్నాయి. 

ఆకాశంలో గ్రహాలు ఈ వరసలో ఉంటే, వారాల్లో సూర్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని అనే వరసలో ఎందుకున్నాయి? 

ఆ గ్రహాల వరసకి, ఈ వారాలకీ అసలు సంబంధం ఏమిటి? దీంట్లో ఏం లాజిక్ ఉంది? ఇది కేవలం మూఢ విశ్వాసమా?

ఈ విషయాలు తెలియాలంటే, భారతీయ ఋషుల విజ్ఞానాన్ని లోతుగా పరిశీలించాలి.

భూమి తనచుట్టూ తాను తిరగడానికి 60 ఘడియలు పడుతుంది. 

ఈ 60 గడియలలో ఈ 7 గ్రహాల ప్రభావాలు ఎలా పడుతున్నాయో మన మహర్షులు గమనించారు.

ఆ ప్రభావాల ప్రకారం లెక్క వేసుకుంటూ వస్తే ఒక "అహః" ప్రమాణంలో 24 భాగాలు కనిపించాయి. 

ఆ భాగాలను వారు "హోర" అన్నారు.

"అహః ప్రమాణం" అన్నా, "అహోరాత్ర ప్రమాణం" అన్నా ఒక్కటే. అహోరాత్ర అనే పదంలో మధ్య రెండక్షరాలు కలిపితే "హోర" అయింది.

దీన్నే సాంకేతిక పదంగా తీసుకొని రోజుకి 24 హోరలు అన్నారు. 

ఈ హోర పదాన్ని అవర్(HOUR) గా మార్చి పాశ్చాత్యులు 24 అవర్స్(HOURS) అన్నారు.

హోర శబ్దానికి అవర్ శబ్దానికి ఉన్న భాషాశాస్త్రపరమైన సామ్యాన్ని(పోలిక) పరిశీలించినప్పుడు కూడా మనం ఆశ్చర్యపోక తప్పదు.

ఒక్కొక్క గ్రహాల ప్రభావం అదే వరుసలో భూమిమీద ప్రసరిస్తూ చక్రభ్రమణం చేస్తూ ఉంటుంది. 

ఈ భ్రమణంలో చిత్రమేమిటంటే, ఇవాళ - ఆదివారం అయితే ఈరోజు మొదటి హోర, సూర్యహోర వస్తుంది. ఇందాక చెప్పుకున్న "మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః" అనే వరుసలో... ఒక్కొక్క హోరనూ పంచుకుంటూ వస్తే మర్నాడు ఉదయానికి సరిగ్గా చంద్ర హోర ఉంటుంది. 

కనుక ఆ రోజు చంద్రవారం లేక సోమవారం.

మళ్లీ వరుసగా హోరలు పంచుకుంటూ వెళితే ఆ మర్నాడు ఉదయానికి మంగళహోర వస్తుంది. కనుక ఆ రోజు - మంగళవారం,

ఆ మరునాడు ఉదయానికి బుధహోర - బుధవారం ఆ మరునాడు ఉదయానికి గురుహోర అది -గురువారం.

ఆ మర్నాడు ఉదయానికి ఈ శుక్రహోర - శుక్రవారం. ఆ తరువాత ఉదయానికి శని హోర - అది శనివారం. ఇలా సూర్యోదయ సమయానికి ఉండే హోర మీద ఏ గ్రహం ప్రభావం ఉంటుందో ఆ గ్రహమే ఆ రోజుకు పేరు అవుతుంది.

అయితే... ఈ విధానం వినడం కొత్త అయిన హేతువాద, నాస్తిక, పచ్చ బాబులకు... మొదటి రోజు సూర్యోదయ సమయానికి సూర్యహోర అవుతుందనుకుంటే కదా ఈ లెక్కలన్నీ...ఇలా వచ్చేది! 

అసలు అలా ఎందుకు అనుకోవాలి అనే ప్రశ్న సహజం. 

వస్తున్నా... అక్కడికే వస్తున్నా...

ఎందుకనుకోవాలంటే - సూర్యుడి(ఆనాటి నిరక్షరాస్యునికి కూడా విపులంగా అర్ధం కావడం కోసం మన ఋషులు సూర్యున్ని గ్రహం గా తీసుకున్నారని గమనించాలి) - ఆధిపత్యంలో... సూర్యుడి ప్రభావం పరిపూర్ణంగా ఉన్న ఘడియలో సృష్టి ప్రారంభం జరిగిందని మన పురాణాలు నిర్ణయించాయి. 

దీన్నే మరోరకంగా చెప్పుకుంటే సృష్టి ప్రారంభంలో ఏ గ్రహం ప్రభావం అమలులో ఉందో ఆగ్రహం పేరే ఆదిత్యుడు. అంటే మొదటివాడు.

అదే మొదటిరోజు. 

అందువల్ల ఆ రోజు ఆదివారం అవుతుంది.

ఆదివారం అన్నా, ఆదిత్యవారం అన్నా ఒకటే. 

అక్కడినుంచి ఒక హోరకు ఒక గ్రహంగా ఇప్పుడు చెప్పుకున్న "మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః" అనే వరుసలో గ్రహాలను పంచుకుంటూ వస్తే, మర్నాడు సూర్యోదయానికి మొదటి గ్రహం నుంచి నాలుగో గ్రహం యొక్క హోర వస్తుంది. ఈ లెక్క ప్రతిరోజు ఇలాగే సాగుతుంది. ఈ లెక్క ప్రకారం, హోరాధిపతుల వరస ఆదిత్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని - ఈ విధంగా వస్తుంది.

అందుకే వారాల పేర్లు ఈ వరసలోనే వచ్చాయి.

ఈ విధంగా ఆకాశంలో ఉండే గ్రహాల వరస వేరుగా, వారాల వరస వేరుగా అయింది. ఈ సత్యాన్ని అన్ని దేశాల్లో ఇలాగే పాటిస్తున్నా, ఇవాల్టి వైజ్ఞానిక లోకానికి కూడా " ఫలానా ఈ వారానికి ఈ పేరే ఎందుకు రావాలి?" అనే విషయం తెలియదు. 

అది భారతీయులైన మహర్షులకే తెలిసిన సత్యం! 

కాబట్టి హేతువాదులని చెప్పుకునే కుహనా మేధావులారా! అన్యమత సంస్కృతులను మూఢాచారాలని నమ్మే కమ్మే వారాల పేర్లు ఇతరమత గ్రంథాల్లో ఇమడవు కదా! 

మరి ఆ మాక్స్ ముల్లరూ, విలియం జోన్సూ, రిస్లే బాస్టెడూ ఎందుకు వీటిని తీసెయ్యలేకపోయారూ? 

పేర్లు మార్చి, కాపీ కొట్టి ఇవి మావేనని ఎందుకు జబ్బలు చరుచుకుంటున్నారు??? ఎందుకంటే ఇవి బైబిల్ చట్రంలో ఇమడలేదు, తీసెయ్యడానికి కుదరలేద!

అదీ...భారతీయ ఋషుల గొప్పదనం! 

నేటికైనా తెలుసుకోండి.. తెలియకపోయినా పాటించండి! సనాతన ధర్మ సంస్కృతిలో ప్రతీదీ మనిషికి పనికొచ్చే సైన్సే తప్ప వేరే కాదు.!!

సేకరణ :
*సనాతన భక్తి మార్గం టెలిగ్రామ్ /వాట్సాప్ గ్రూప్స్ 9666914117*

🙏మన కర్మలకు పద్దెనిమిది మందిసాక్షులు🙏



🕉చుట్టూ ఎవరూ లేనప్పుడు తప్పుడు పనులకు తెగించడం మానవ బలహీనత.  కానీ...

🙏‘నేను ఒక్కడినే కదా ఉన్నాను,  నన్ను ఎవరూ గమనించడం లేదు’  అని మనిషి అనుకోవటం చాలా పొరపాటు.🕉

🕉మనిషి ఏ పని చేస్తున్నా నిశితంగా గమనించేవి మూగసాక్షులు పద్దెనిమిది ఉన్నాయి. అవి నాలుగు వేదాలు, పంచభూతాలు, అంతరాత్మ, ధర్మం, యముడు, ఉభయ సంధ్యలు, సూర్య చంద్రులు, పగలు, రాత్రి.🕉

🙏వీటినే అష్టాదశ మహా పదార్థాలు అంటారు . ఈ మూగసాక్షులు మనిషిని అనుక్షణం నీడలా పర్యవేక్షిస్తుంటాయి.🕉

🕉ఇవి మన లోకంలోని న్యాయస్థానాల్లో సాక్ష్యం చెప్పపో వచ్చును గాని, వీటి గమనిక నుండి మనిషి తప్పించు కోవడం సాధ్యపడదు.🕉

🕉దీన్ని గుర్తించలేని కారణంగానే ఇవన్నీ జడ పదార్థాలేనని, సాక్ష్యం చెప్పడానికి నోరులేనివని మానవుడు భ్రమపడు తుంటాడు🕉

🕉ఈ మహా పదార్థాలు రహస్యయంత్రాల వంటివి.🕉

🕉అవి మనిషి ప్రతి చర్యనూ నమోదు చేస్తాయి.🕉

🕉ఆ నివేదికల్ని విధికి చేరవేస్తాయి. అది వాటిని కర్మలుగా మలుస్తుంది . మనిషి చేసే పనులు మంచి అయితే సత్కర్మలుగా, చెడ్డవి అయితే దుష్కర్మలుగా విధి నిర్ణయిస్తుంది. సత్కర్మలకు సత్కారాలు, దుష్కర్మలకు జరిమానాలు అమలవుతాయి.

🕉అవి ఏవో మరుజన్మకో ఆ తరువాతో ఫలిస్తాయని అనుకోకూడదు, ఈ జన్మలోనే అమలు చేయబడవచ్చు.🕉

🕉ఇది నిరంత రాయంగా సాగిపోయే సృష్టి పరిణామక్రమం.🕉
 
🕉అంతరాత్మ అనేది ఒకటుందని ప్రతి మనిషికీ తెలుసు.🕉

🙏అది మనం చేసే పని మంచిదా ? చెడ్డదా ? అనే విషయాన్ని ఎప్పటికప్పుడే చెప్పేస్తుంది.🕉

🕉కానీ ఆవేశం, కోపం, క్షణికావేశం తో విచక్షణ కోల్పోయిన వ్యక్తి అంతరాత్మ సలహాను కాలరాస్తాడు అది అనర్థాలకు దారితీయటం మనందరికి అనుభవమే.🕉

🕉ఒక్కోసారి అంతరాత్మ నిలదీస్తున్నప్పుడు పశ్చాత్తాపంతో సిగ్గుతో తలదించుకుంటాం. కానీ దీన్ని మనమెవరి తోనూ పంచుకోము. అందువల్ల అంతరాత్మ అనుభవపూర్వకంగా నిజమైనప్పుడు మిగతా పది హేడు కూడా నిజమేనని గ్రహించగలగటం వివేకం.🕉
 
🕉నలుగురికీ తెలిసేలా దానధర్మాలు, క్రతువులు, పూజలు నిర్వహించాలన్న కుతూహలం అవివేకం.🕉

🕉అష్టాదశ సాక్షులు ఎల్లవేళలా గమనిస్తున్నాయంటే, ఎవరు చూడాలో వాళ్ళు చూస్తున్నట్లేగా అర్థం.🕉

🕉ఈ ఎరుక కలిగినప్పుడు ఏ మనిషీ చెడ్డ పనులు చేయటానికి తెగించడు.🕉

🕉ఎవరు చూసినా చూడకపోయినా మంచితనంతో, తోటి వారికి సాధ్యమయినంత సహాయం చేయాలనే సత్‌సంకల్పంతో జీవితాన్ని గడపడం ఉత్తమం . ఈ జ్ఞానం వల్ల మనిషి సాధ్యమైనన్ని మంచిపనులు చేయడానికి పయ్రత్నిస్తూ సుఖశాంతులకు నోచుకుంటాడు.🙏

🙏సర్వేజనా సుఖినోభవంతు🙏

Sunday, September 12, 2021

ఋతువులు - ఆహారనియమలు

ఋతువులు , ఆయా సమయాల్లో పాటించవలసిన ఆహార విహార నియమాలు - 

 *  వసంత ఋతువు  - 

       వసంత ఋతువు నందు కఫము ప్రకోపించి అనేక రోగములను కలుగజేయును . అందువలన  అట్టి కఫముని వాంతి , ముక్కు ద్వారా , విరేచనం ద్వారా కఫాన్ని పోగొట్టి కఫాన్ని తగ్గించవలెను .  

             ఈ సమయంలో పాతవి అయిన గోధుమలు , శొంటి, వేగిసచెక్క , చందనము , తుంగముస్తలు కాచబడిన నీళ్ళనిగాని , తేనె కలిపిన నీళ్ళని గాని పానము చేయవలెను .

       ప్రాతఃకాలం సమయమున శరీరం మర్దించుకొని నలుగుపెట్టుకొని స్నానం చేయవలెను . మధ్యాహ్నమున నీటికాలువుల యందు , చెట్లు ఎక్కువ ఉన్న తీగలు గల చెట్లు ఉన్న ఉద్యాన వనాల యందు గడపవలెను . 

              వసంత ఋతువు యందు చల్లటి పదార్థాలు , మధురపదార్థాలు , సేవించరాదు . పగలు నిద్రించరాదు.

 *  గ్రీష్మ ఋతువు  - 

       ఈ గ్రీష్మ ఋతువు నందు తీక్షణమైన సూర్యప్రకోపం వలన శరీరం నందు కఫం తగ్గిపోయి వాతం పెరుగును . ఈ ఋతువు నందు ఉప్పు , కారం , పులుపు కలిగిన పదార్థాలు , వ్యాయామం , సూర్యకిరణాల యందు కూర్చోవడం నిషేదించవలెను . 

              ఈ కాలం నందు మధురపదార్థాలను మాత్రమే వాడవలెను . పంచదారతో కూడిన పేలాల పిండి మొదలగు పదార్థాలు తినవలెను . రాత్రిసమయంలో వెన్నెలలో ఆరుబయట ఉంచబడిన గేధ పాలలో పంచదార వేసుకొని అవి తాగవలెను .

       మధ్యాహ్న సమయం నందు చెట్లు ఉండి నీడ ఎక్కువ గల ప్రదేశాలలో పైనుంచి నీరు జాలువారే విధంగా జలగృహము నిర్మించుకొని అందు నివసించవలెను . రాత్రి సమయంలో మేడ పై భాగాల్లో వెన్నెల లో లేదా ఆరుబయట ఉండవలెను . 

 *  వర్షఋతువు  - 

         వర్షఋతువు నందు ఆకాశం మేఘాలతో ఆవరించబడి ఉండినప్పుడు జలకణములతో కూడి ఉండునట్టియు , వేసవికాలం తరువాత చల్లాగా అయినట్టి గాలి వలన లోపల ఉండు వాతం దోషం పొందును. భూమి యొక్క ఉష్ణం కాల స్వభావం చేత ఆమ్ల స్వభావం పెరిగినటువంటి జలం తాగుట చేత శరీరం నందలి పిత్తం దోషం పొందును. సాలెపురుగులు మొదలగు విష మూత్రాదులతో కలిసి ఉన్న వర్షపు నీరు సేవించుట చేత కాలస్వభావం చేత మందంగా ఉన్న జఠరాగ్ని వలన కఫం దోషం పొందును. 

                 ఈ విధంగా ఒకే కాలం నందు వాత, పిత్త, కఫాలు మూడు ఒకేసారి దోషం పొందుట వలన వాటిని శమింపచేయునట్టి మరియు జఠరాగ్ని పెంచే ఆహారాలు ఉపయోగించవలెను . 

           ఈ కాలం నందు పాతవైన యావలు , గొధుమలు , నేతితోను , శొంఠితోను చేయబడిన మాంసరసం , పెసరకట్టు , చాలా కాలం నుంచి నిలువ ఉంచబడిన మద్యం , వర్షం నుంచి పడిన నీరు , బావినీరు , కాచిన నీరు వీటిని ఉపయోగించాలి . ఈ ఋతువునందు అధిక శ్రమ చేయక శరీరం నందు గంథం పూసుకొని , సుగంధ ద్రవ్యముల ధూపమును వేసుకొని మేడ యందు నివశించవలెను . 

                    ఈ వర్షాకాలం నందు నదీజలం , కడుపు నిండా తినడం , పగటినిద్ర , శ్రమ ఎక్కువుగా ఉండే పనులు , ఎండ వీటిని చేయరాదు . 

 *  శరదృతువు  - 

         శరదృతువు నందు పిత్త దోషం ప్రకోపించును . ఈ కాలం నందు చేదు , తీపి , వగరు కలిగినటువంటి ఆహారాలు లొపలికి తీసికొనవలెను . ఆకలి అయినప్పుడే పదార్థాలు తీసికొనవలెను . శాలి ధాన్యం , పెసలు, పంచదార, ఉసిరికాయ , చేదుపోట్ల , తేనె , హంసలు తిరిగే తటాకం నందలి నీరు ఉపయోగించవలెను . 

                   చందనం , వట్టివేరు , పచ్చకర్పూరం , ముత్యాల హారం , పుష్పాల దండలు , పట్టుబట్టలు వీటిని వాడవలెను . మేడ  పైభాగం నుండి సూర్యాస్తమయం అయిన సమయం లో వెన్నెలని సేవించవలెను . ఈ ఋతువు నందు మంచు , యావక్షారం వంటి లవణాలు , పెరుగు , నూనె , వస , ఎండ , ఘాటుగా ఉండు మద్యములు, పగటి నిద్ర , తూర్పుగాలి వీటిని వదిలివేయవలెను . 

 *  హేమంత ఋతువు  - 

        హేమంతఋతువు యందు మధురరసం , ఆమ్లరసం , లవణ రసం గల పదార్థాలు భుజించవలెను . ప్రాతఃకాలం నందు ఆకలిగా ఉన్నచో కొంచమే భుజించవలెను . వాతాన్ని 
హరించే  తైలములతో  అభ్యంగనం, శిరస్సు తైలముతోమర్దించుకొనుట, మల్లయుద్ధం , శరీరమునకు మర్దనం చేయించుకొనుట చేయవలెను . స్నానం చేసినతరువాత కుంకుమపువ్వుని , కస్తూరిని  కలిపినూరి శరీరంకి పూసుకుని అగరుచెక్కతో దూపం వేసుకొనవలెను . 

                 ఈ కాలం నందు బలకరమైన మాంసరసం , మాంసములు , బెల్లంతో చేసిన మద్యం , మధుర మద్యం , గోధుమపిండి , మినుములు , చెరుకుపాలు వీనితో చేయబడిన పదార్థాలు , నూతనమైన అన్నం , వస , తైలం వీటిని ఉపయొగించవలెను . స్నానం కొరకు వేడినీటిని మాత్రమే ఉపయొగించవలెను . చలిబాధ లేకుండా ఉండటం కొరకు దుప్పటి, కంబళి , శాలువ వీటిని కప్పుకొనవలెను . కొంతసమయం సూర్యకిరణముల యందు ఉండి చెమట పట్టే విధంగా చూసుకొనవలెను . భూగృహముల యందు నివశించవలెను . 

 *  శిశిరఋతువు  - 

           హేమంత ఋతువు నందు పాటించే నియమాలను ఈ ఋతువు నందూ పాటించవలెను . 

          పైన చెప్పిన విధంగా ఆయా ఋతువుల్లో ఆయా ఆహారపదార్థాలని తీసుకోవడం , ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించడం వలన వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చు . 

              

Thursday, September 9, 2021

విఘ్నేశ్వరుడి పూజకు ఉపయోగించవలసిన పత్రాలు - వాటి ఔషధ గుణాలు .

విఘ్నేశ్వరుడి పూజకు ఉపయోగించవలసిన పత్రాలు  -  వాటి ఔషధ గుణాలు .

   ప్రధమ పూజలు అందుకునేవాడు , పార్వతి తనయుడు అయిన విఘ్నేశ్వరుడికి పూజ చేయుటకు మొత్తం 21 రకాల పత్రాలను ఉపయోగించవలెను . ఇప్పుడు మీకు ఆ పత్రాల పేర్లు వాటి యెక్క ఔషధ గుణాలు గురించి మీకు క్లుప్తంగా వివరిస్తాను.

      మొత్తం 21 రకాల పత్రాలు వరసగా అవి.

 *  మాచిపత్రి  -

         ఇది కుష్టు , వాతరక్తం , జ్వరాన్ని , భూతబాధ , గ్రహ బాధని తొలగించును.

 *   వాకుడు -

         కఫం , వాతం , శ్వాసము , శూలజ్వరం , వాంతుల రోగం , గుండెజబ్బు , ఆకలి లేకపోవటం , ఆమదోషం నివారించును.

 *  మారేడు  - 

         వాతాన్ని తగ్గించును , దీని పండు శూల, జ్వరాన్ని , మూత్రకృచ్చం నశింపచేయును.

 *  గరిక  - 

         ఇది రక్తపైత్యం , కఫం , తాపము , దప్పిక , విసర్పి రోగాలను నయం చేయును .

 *  ఉమ్మెత్త  -

         కుష్టువు , దురద, వ్రణము , అరికాలిబొబ్బలు , విషము వీటిని నశింపచేయును .

 *  రేగు  -

          ఇది పిత్తాన్ని , వాతాన్ని హరించును . ఆమ దోషాన్ని నివారించి ఆకలి బాగుగా కలుగచేయును .

 *  ఉత్తరేణి  -

           కఫము , కుష్టు , మహోదరము , మొలలవ్యాధి , వాపు , దురద, శూల , అరుచి సమస్యలను నివారించును. శీఘ్రవిరేచనం కలుగచేయును.

 *  తులసి  -

           దాహాన్ని కలిగించును. పిత్తాన్ని ఉత్పత్తి చేయును . హృదయానికి బలాన్ని కలిగించును. ఆకలి పుట్టించును . శ్లేష్మం , దగ్గు , శ్వాస , కుష్టు , క్రిమిరోగాలు , వాంతులు , దుర్గoదం  , పార్శ్వపు శూల , విషాన్ని హరించును .

 *  విష్ణుక్రాంత  -

         పిత్తము , కఫాన్ని పోగొట్టును .విషము , కుష్టు , ఆమము , శోఫ , తలనొప్పి , నేత్రరోగాలను నయం చేయును .

 *  దానిమ్మ  -

         చలువచేయును , నీరుని పెంచును , గుండెకి బలము ఇచ్చును. దుష్టరక్తం హరించును , త్రిదోష హరమైనది, ఆకలి పుట్టించును , రక్తగ్రహణి తగ్గించును , కంఠస్వరం బాగుచేయను . దేహపుష్టిని , రక్తపుష్టిని ఇచ్చును , భోజనాంతరం పుచ్చుకునిన అన్నమును జీర్ణం చేయును , వాతము , కఫం , పైత్యాన్ని హరించును . రక్తమును శుభ్రపరచును.

 *  దేవదారు  -

         ఇది శ్లేష్మం , వాతం , ఆమదోషం , మలబంధం , ప్రమేహం , ప్రదరము , జ్వరం , క్రిమిరోగం పోగొట్టును .

 *  మరువం  -

          దీని కషాయం పైత్యం , శ్లేష్మం , విషము , మేహము , మొలలరోగం , క్షయరోగం , పైత్య భ్రమ , దాహము , తాపము తగ్గించును . విరేచనబద్ధము చేయును . ఆకలి పుట్టించును , జీర్ణశక్తిని వృద్దిచేయును , ఇంద్రియపుష్టి చేయును .

 *  వావిలి  - 

          ఇది క్రిమి , కుష్టువు , పిత్తము , శ్లేష్మం , ప్లీహము , గుల్మరోగం , అరుచి , సన్నిపాతం , జ్వరం , పిచ్చి , పీనస వీటిని నశింపచేయును .

 *  జాతిపత్రి  -

         ఇది కారంగా , ఉష్ణంగా , పరిమళంగా ఉండును. కఫం , మూత్రదోషం , అతిసారం , శ్వాస , హుద్రోగం , శూల నశింపచేయును. నోటికి పరిమళం కలిగించును.

 *  శీతాఫలం  -

         ఇది శరీరముకు వేడిచేసి చలువచేయును . రక్తమును , ఇంద్రియమును వృద్దిచేయును , ముంతగుండెకు , మనస్సుకు బలమును ఇచ్చును , జీర్ణశక్తిని ఇచ్చును. క్రిమిని హరించును , మేహవాతం అణుచును , శ్లేష్మము పెంచును .

 *  జమ్మి  -

         ఇది విసర్పిరోగం , వ్రణము , దద్దురులు , ప్రదరరోగం , కేశములను నశింపచేయును .

 *  అత్తిపత్తి  - 

          ఇది మూలవ్యాది , వరిబీజం , భగంధరం , దగ్గులు తగ్గును. కంటిపొరలు , వీర్యవృద్ధి , అతివేడి , పైత్య శాంతి కలుగచేయును.

 *  రావి  -

          చలువచేయును , పిత్తము , శ్లేష్మము , వ్రణము , యోని దోషము , మంట , పిత్తము , కఫము పోగొట్టును . బాగుగా పండిన రావిపండ్లు హృదయానికి ఎక్కువుగా మేలుచేయును . పిత్తరక్తం , విషపీడ , తాపం , వాంతి , అరుచి నశింపచేయును .

 *  మద్ది  -

         హృదయానికి హితమైనది , కఫ , పిత్తములను శమింపచేయును . విషము , రక్తదోషం , మేధోవృద్ధి , ప్రమేహము , వ్రణము అను వ్యాధులను పోగొట్టును .

 *  జిల్లేడు  -

        వాతదోషం , శోఫ , వ్రణము , దురద , కుష్టు , ప్లీహారోగం , క్రిమిదోషం నివారణ చేయును .

 *  మామిడి  -

       ఇది ప్రమేహము , రక్తదోషం , కఫం , పిత్తము, వ్రణము వీటిని హరించును . లేత మామిడికాయ త్రిదోషం , ప్రకోపం , రక్తదోషం హరించును .

 *  వెలగ  -

        ఇది శీతలంగా ఉండును , స్వరం , కఫము నశింపచేయును . దీని ఫలం మధురంగా , పుల్లగా ఉండును. శ్వాస కాస , అరుచి , దప్పిక తగ్గించును . కంఠశుద్ధి  కలుగచేయును . నిద్ర కలుగచేయును . తలనొప్పి తగ్గించును . మూత్రములో పోవు తీపి తగ్గును.

        పైన చెప్పినవన్నీ విఘ్నేశ్వరుడు పూజలో వాడుదురు .

Wednesday, September 8, 2021

దగ్గు తగ్గడానికి cough problem

దగ్గు తగ్గడానికి cough problem

దగ్గులు హరించుటకు సులభ యోగాలు - 

 * దానిమ్మ కాయ పెచ్చులను వేయించి చూర్ణం చేసుకుని పూటకు 5 గ్రాముల చూర్ణం తేనెతో తీసుకొనుచున్న కోరింత దగ్గు తగ్గిపోవును . 

 * శుద్ధిచేసిన కొబ్బరి నూనె పూటకు 10ml చొప్పున తీసుకొనుచున్న కోరింత దగ్గు తగ్గిపోవును . 

 * మర్రిచెట్టు పైన బెరడు తెచ్చి నీడన అరబెట్టి చూర్ణం చేసి ఆ చూర్ణం 20 గ్రాములు పావు లీటర్ నీటిలో వేసి కాచి వడపోసుకొని అందులో పాలు మరియు పంచదార కలుపుకుని తాగుచుండిన యెడల 3 నుంచి 5 దినములలో దగ్గు తగ్గిపోవును .

 * పిప్పిలి గింజను ఆముదపు దీపమున కాల్చి తమలపాకు కు కొంచం తేనె రాసి ఆ తమలపాకులో ఈ కాల్చిన పిప్పిలి గింజని పెట్టి నమిలి మింగుచున్న యెడల దగ్గులు నయం అగును.

 * తులసి పువ్వులను అల్లపు రసంతో మర్దించి శనగల వలే మాత్రలను చేయవలెను పూటకి ఒక మాత్ర చొప్పున మంచినీటితో సేవించిన దగ్గులు తగ్గిపోవును . 

       పైన సూచించిన యోగాలలో మీకు సులభమైన యోగాన్ని ఎంచుకుని సమస్య నివారణ చేసుకోవచ్చు .

Monday, September 6, 2021

ధర్మం dharmam

🙏*”ధర్మం”* అంటే ఏమిటి? 
  
*->* అగ్ని సాక్షిగా పెండ్లాడిన భార్యను వదిలి వేయకుండా వుండటం:
         *వివాహ ధర్మం!* 

*->* తన భర్త అందహీనుడైనా, స్థితిపరుడు కాకున్నా, నమ్మివుండటం:
            *భార్య ధర్మం!* 

*->* నమ్మిన మిత్రునికి అపకారం 
     చేయకుండటం :
           *మిత్ర ధర్మం!* 

 *->* సోమరితనం లేకుండటం:
          *పురుష ధర్మం!* 

*->* విజ్ఞానాన్ని దాచుకోకుండా బోధించటం:
             *గురుధర్మం!* 

*->* భయభక్తులతో విద్యను నేర్చుకోవటం:
             *శిష్యధర్మం!* 

*->* న్యాయమార్గంగా సంపాదించి 
     సంసారాన్ని పోషించటం:
          *యజమాని ధర్మం!* 

*->* భర్త సంపాదనను సక్రమంగా పెట్టి 
     గృహాన్ని నడపటం:
            *ఇల్లాలి ధర్మం!* 

*->* సైనికుడుగా వుండి దేశాన్ని,ప్రజలను 
      కాపాడటం:
            *సైనిక ధర్మం!* 

*->* వృద్ధులైన తల్లిదండ్రుల్ని ఆదరించి 
      పోషించటం:
               *బిడ్డల ధర్మం!* 

*->* తాను జన్మనిచ్చిన బిడ్డల్ని ప్రయోజకుల్ని 
     చేయటం :
              *తండ్రి ధర్మం!* 

 *->* తన ఇంటికీ, తనను కన్నవారికీ పేరు 
     ప్రతిష్ఠలు తేవటం:
          *బిడ్డలందరి ధర్మం!* 

 *->*  తన వృత్తి ఎటువంటిదైనా వృత్తిని 
    గౌరవించటం :
             *వృత్తి  ధర్మం!* 

  *->* తీసుకున్న జీతానికి నమ్మకంగా పని చేయడం  
                *ఉద్యోగి ధర్మం*

*->* తాను సంపాదించిన దాన్ని తనవారితో 
    పంచుకొని తినటం :
             *సంసార ధర్మం!* 

*->* అసహాయులను కాపాడటం:
           *మానవతా ధర్మం!* 

*->* చెప్పిన మాటను నిలుపుకోవటం :
               *సత్య ధర్మం*

Sunday, September 5, 2021

33 కోట్ల దేవతలు ఎవరు?

*33 కోట్ల దేవతలు ఎవరు?*

*హిందువులను విరోధించువారు…           మీ 33 కోటి దేవతల పేర్లు ఏమని ప్రశ్న అడిగి వెక్కిరిస్తారు. హిందువులు కూడ ఈ ప్రశ్న విని విచలితులవుతారు.*

*అసలు ఈ  కోటి అను పదముయొక్క అర్థమును సంపూర్ణముగా మరుగునపరచి మెకాలే, ముల్లర్ వంటివారు తమకు కావలసిన ఒక మత ధర్మమునకు అనుకూలమగునటుల చరిత్ర ను తీర్చి తిద్ది తెలివిమంతులు అనిపించుకొన్నారు.*

*హిందువులు అటువంటి చరిత్రను చదివి బుద్ధి హీనులు వారు అనిపించుకొనిరి.*

 *వేదపురాణములు తెలుపునట్టి త్రయత్రింశతి కోటి(33కోటి) దేవతలు మరియు వారి పేర్లు మరియు హిందూ ధార్మిక సాహిత్య మందు ఉల్లేఖించబడిన 33కోటి దేవతలు ఎవరు వారి పేర్లు ఏమి అని తెలుసా?*

*హిందూ ధర్మ - సంస్క్రుతియందు 33 కోటి దేవతల ఉల్లేఖన ఉంది.  మిక్కిలి జనులు ఇక్కడ 'కోటి' అంటే సంఖ్య అనుకొన్నారు. మరియు 33 కోట్ల పేర్లను చెప్పమని  బలవంతం చేస్తారు.  వాస్తవముగా ఈ 'కోటి' సంఖ్యను సూచించే కోటి కాదు.*

*సంస్క్రుతములో 'కోటి' అనగా 'విధము'  'వర్గము' (type)  అని అర్థమూ ఉంది.*

 *ఉదా: ఉచ్ఛకోటి. దీని అర్థం ఉచ్ఛమైన వర్గమునకు చేరిన వారు అని అర్థం.* 

*అలాగే మరియు ఉదాహరణము: సప్త కోటి బుద్ధులు. దీని అర్థం ఏడు ప్రధాన బుద్ధులు.*

*యజుర్వేద, అథర్వణ వేద, శతపథ బ్రాహ్మణులు మొదలైన ప్రాచీన కృతులందు 33 విధముల దేవతలను ఉల్లేఖించారు. వీరే త్రయత్రింశతి  కోటి (33 కోటి)  దేవతలు.* 

*హిందూ గ్రంధములేకాదు  బౌద్ధ, పార్శీ మొదలైనవి కూడ 33 దేవవర్గముల గురించి తెలుపుతాయి.  బౌద్ధుల దివ్యవాదము మరియు సువర్ణప్రభాస సూత్రములందు వీటి ఉల్లేఖన ఉన్నది.*

 *ఇపుడు దేవతల ఈ 33 వర్గములనూ, అందులో  వచ్చు దేవతల పేర్లనూ చూద్దాము:*

*12 ఆదిత్యులు (ద్వాదశాదిత్యులు) :*      

1. త్వష్ట, 2. పూష. 3.వివస్వాన్  4. మిత్ర  5. ధాతా  6. విష్ణు  7. భగ. 8. వరుణ  9. సవితృ  10. శక్ర   11.అంశ  12. ఆర్యమ.

*11 రుద్రులు (ఏకాదశ రుద్రులు):*

1.మన్యు  2. మను  3. మహినస  4. మహాన్ 5. శివ  6. ఋతధ్వజ 7. ఉగ్రరేతా  8. భవ  9  కాల 10. వామదేవ 11. ధృతవృత.  

*8 వసువులు (అష్టవసువులు):* 

1. ధరా 2. పావక  3  అనిల  4. అప 5. ప్రత్యుష  6. ప్రభాస  7. సోమ  8  ధ్రువ. 

మరి ఇద్ధరు: 1. ఇంద్ర  2. ప్రజాపతి. 

త్రయత్రింశతి (33) కోటి దేవతలు ఎవరని తెలిసినది కదా!  ఈ పేర్లను  కంఠపాఠము చేయునది చాలా సులభము.  ఎవరైననూ ఇపుడు  33 కోటి దేవతల పేర్లను చెప్పమంటే  వెనుక ముందు చూడవలసిన అవసరమే లేదు! కదా?. 

( True translation from kannada version)….సేకరణ

నిర్జల ప్రదేశం నందు చెట్ల ద్వారా జలము కనుగొనుట -

నిర్జల ప్రదేశం నందు చెట్ల ద్వారా జలము కనుగొనుట - 

 * తాటి చెట్టుకి కాని టెంకాయ చెట్టుకి గాని పుట్ట ఆవరించి ఉండిన దానికి పశ్చిమమున 6 మూరల దూరమున నాలుగు మాటల లోతున దక్షిణమున నుంచి వచ్చెడి జలధార ఉండును. 
 
 * టెంకాయ చెట్టుకి దక్షిణమున పుట్ట ఉండిన దానికి ఏడు మూరల దూరమున 5 మట్టుల లోతున సంరుద్ధజాలం కలిగి ఉండును. ఒక నిలువు లోతున నానా వర్ణములు కలిగిన శల్యములు , నల్లని రంగు కలిగిన మ్రుత్తికయు , ఆయుధములతో చేధించ దగిన పాషాణం ( రాయి ) , తెల్లని మన్ను, దాని క్రింద పడమట నుంచి ప్రవహిన్చేడు జలధార యు ఉండును. మరియు పుట్టలు ఉండిన యెడల వాటి సమీపమున జలము ఉండును. 
  
 * మారేడు చెట్టు, కానుగ చెట్టు, జీడి చెట్టు, మద్ది చెట్టు, చిత్తముధపు చెట్టు, వీటి యందు యే చేట్టుకైనా పుట్ట చుట్టుకొని యుండిన దానికి ఉత్తరమున మూడు మూరల దూరము నందు నాలుగున్నర నిలువు లోతున సమృద్ధిగల జలం ఉండును. నీరు లేని నిర్జల ప్రదేశం నందు గంబీరమైన శబ్దం పుట్టిన యెడల అచ్చట 35 పురుష ప్రమాణమున ఉత్తరమునకు ప్రవహించే జలనాది ఉండును. 

  * పెద్ద మాను చెట్టు కొమ్మలు అన్ని సరీగా ఉండి వాటిలో ఒక కొమ్మ నేలకు వంగి గాని , తెలుపు వర్ణం కలిగి కాని యున్దినట్లితే అచ్చట మూడు మట్ల లోతున జలం ఉండును. 

  * యే వృక్షం అయినా వాటి వాటి స్వభావం మారి  చిగుళ్ళు, పువ్వులు, కాయలు మొదలగు వాటి వరనములు బెధముగా ఉండిన యెడల దానికి తూర్పున మూడు మూరల దూరమున నాలుగు మట్టుల లోతున జలం ఉండును. దాని యందు తెల్లని మన్ను రాళ్ళు ఉండును. 
 
 * రెండు తలల ఖర్జూరం చెట్లు ఉండిన యెడల దానికి పడమర మూడు మూరల దూరం నందు మూడు మట్టుల లోతులో స్వచ్చ జలం ఉండును. 
 
 * తెల్ల మోదుగ చెట్టు ఉండిన దానికి దక్శినమున మూడు మూరల దూరము నందు మూడు మట్టుల లోతున జలము ఉండును. 
 
 * యే ప్రదేశమున వేడి పొగలు ఉండునో అచ్చట రెండు నిలువుల లోతు అదిక ప్రవాహము గల జలదార ఉండును.

 * యే ప్రదేశము నందు పైరులు నలుపక్కల కోమలముగా నుండి మద్య యందు మాడిపోయి ఉండిన , తెలుపు వర్ణం కలిగి యుండినను మికకిలి కొమలముగా నుండినను అచ్చట అదిక ప్రమాణం గల జలదార నిలువు లోతు ఉండును. 
 
 * మరుభూమి అనగా నిర్జలమైన కొండల యందు ఉండు అరణ్యభుమి ములు మొదుగ చెట్టు కు పడమర పుట్ట యుండిన దానికి దక్షిణమున మూడు మూరల దూరము నందు 12 నిలువుల లోతున పడమటి నుండి ప్రవహించే జలనాడి ఉండును. 

 * దురద గొండి చెట్టుకి ఉత్తరమున పుట్ట యుండిన దానికి మూడు మూరల దూరము నందు 10 మట్టుల లోతున దక్షిణమున నుండి ప్రవహించే జలనాడి ఉండును. మరియు నిలువు లోతున పచ్చని వర్ణం గల కప్ప ఉండును . 
 
 * మరియు మద్ది చెట్టుకి ఉత్తరమున పుట్ట యుండిన యెడల దానికి దక్షిణమున రెండు మూరల దూరమున 15 పురుషుల ప్రమాణమున దక్షిణము నుంచి ప్రవహించే ఉప్పు నీటి జలదార ఉండును. 
 
బావి తవ్వునప్పుడు రాళ్లు పడినప్పుడు వాటిని బెధించుటకు ఉపాయం  - 
 
 
 * బావి తవ్వునప్పుడు శిలలు కనిపించినప్పుడు వానిని పగలగోట్టుటకు మోదుగు కట్టెలను , దూబర కట్టెలను కాల్చి ఆ బూడిదను సున్నపు నీళ్ళలో కలిపి రాతిని తడిపి పగలగొట్టిన రాయి పగులును.

  * పూర్వము చెప్పినట్టుగా మోదుగ , తుబుర కట్టెలను కాల్చిన బూడిదను , దర్భల బస్మము , మొక్కలపు చెట్టు చెక్కలను, కాల్చిన బూడిద నీళ్లలో కలిపి ఆ నీళ్లు చక్కగా కాచి కాల్చిన బండ మీద 7 పర్యాయములు పోసి తడపగా రాళ్లు పగులును. 
 
 * ఉత్తరేను, తిప్పతీగా, వేపచెక్క, ఆకు, తుభర కట్టెలు, నువవు కట్టెలు, వీని బూడిద ను ఆవు ముత్రములో కలిపి కాచి 6 దినములు రాళ్ళ మీద పోసి నానబెట్టిన యెడల శిలలు పగులును. 
 
 * అరటి  పట్టలను కాల్చి ఆ బూడిదను మజ్జిగ యందు కలిపి చక్కగా కాచిన తరువాత అందులొ రాతిని పగలగొట్టడానికి ఉపయొగించే ఆయుధములు ఒక దినమంతయు అందులొ నానబెట్టి రాతిపై ప్రయోగించగా ఆ ఆయుధములు చెడకుండా ఉండును. అలాగే ఆ ఆయుధముల చేత రాళ్లు , ఇనుము మొదలగు వాటిని పగలగొట్టిన ఆ ఆయుధములు మెరుపు , పదును పోకుండా  ఉండును. 

 

Friday, September 3, 2021

ఉత్తర , పడమర దిక్కులకు తల ఉంచి నిద్రించకూడదు అన్నవిషయానికి సంపూర్ణ వివరణ  -

        రాత్రి సమయంలో పడుకునేప్పుడు శిరస్సు తూర్పుదిశగా ఉంచవలెను అనియు మరియు దక్షిణ దిశకు ఒక మాదిరిగా కొంచం మంచిది అని పెద్దవారు చెప్తారు అదేవిధంగా మనపురాణాలలో కూడా వ్రాయబడి ఉన్నది. తూర్పుదిశకు శిరస్సు ఉంచి శయనించువాడు ఆరోగ్యవంతుడు అనియు మార్కండేయ పురాణమున చెప్పబడి ఉంది.  దీనికి సంబంధించిన కొన్ని విషయాలను సంపూర్ణంగా వివరిస్తాను.

            భూమి ఒక పెద్ద అయస్కాంతం . మాములు అయస్కాంతం చుట్టూ అయస్కాంతక్షేత్రం ఎలా ఉండునో భూమికి కూడా చుట్టూ అయస్కాంతక్షేత్రం 66,000 మైళ్ళ వరకు వ్యాపించి ఉండును. ఈ విశ్వం అండాండం అనియు మనశరీరంను పిండాండం అని జ్ఞానులు  పిలుస్తారు . విశ్వములోని అన్నింటి ప్రభావం , శక్తి మన శరీరంలో కూడా ఉన్నది. అందుకనే ఈ రెండింటి మధ్య "లయ" తప్పకుండా కాపాడగలుగు శక్తి ఉన్న చాలా మానసిక రుగ్మతులకు ఔషధం దొరుకును .

            ఉత్తరదిక్కుకు ఆకర్షణ ( అయస్కాంత) శక్తి ఉన్నది. దిక్సూచిని ఏ దిక్కుకి తిప్పినను దాని ముల్లు ఉత్తరదిక్కుకు తిరుగును. ఈ ఆకర్షణ శక్తి మానవుని శిరస్సు మూలకంగా శరీరంపైన తన ప్రభావమును చూపించును. అయస్కాంతపు ఉత్తర ధ్రువమునకు రోగనిరోధక శక్తి అనగా క్రిమిరోగాల వంటి వానిని నాశనం చేసి కాపాడగల శక్తి ఉన్నదని దక్షిణధ్రువమునకు శక్తిని ప్రసాదించగల గుణమున్నది మన పురాణాలలో ఉన్నది.  మానవుని శరీరం ఒక విద్యుచ్ఛక్తి కేంద్రం . శరీరముకు కావలసినంత విద్యుత్తు మాత్రమే శరీరంలో ఎల్లప్పుడూ ఉండును. శరీరం తనకి కావలసిన ఎలెక్ట్రిసిటీని ఎల్లప్పుడూ ఉత్పన్నం చేసుకొనుచూ బయటకి విసర్జించుచూ ఉండును.

         వాత్సాయన మహర్షి ప్రకారం శరీరం నందలి 24 కేంద్రాలలో ఈ పని జరుగును. ఈ 24 కేంద్రాలలో బ్రహ్మాండం అతిముఖ్యమైన కేంద్రం . బ్రహ్మాండం అనగా శిరస్సు నందలి పైభాగం . దీనినే పుణికి అని బ్రహ్మకపాలం అని అందురు. ఇది శరీరంలో విద్యుచ్చక్తి ఉత్పత్తికి మరియు బయటకి విసర్జనకు రెండింటికి కేంద్రమై ఉన్నది. మానవ శరీరంలో ఉత్పత్తి అయిన విద్యుత్ వెంట్రుకల చివరనుంచి చేతి గోళ్ల చివర నుంచి చర్మరంధ్రాల ద్వారా అత్యంత సూక్ష్మంగా బయటకి విసర్జించబడును.

       దాదాపు 1300 గ్రాముల బరువుగల మనవుని మెదడు దాదాపు 20 వాట్స్ విద్యుత్ శక్తిని వెలువరించును. మానవ హృదయము నుండి వెలువడు విద్యుత్ శక్తిని " వెక్టార్ " ద్వారా కొలుస్తారు. ఈ విద్యుత్ శక్తిని ఊపిరిని తమ ఆధీనంలో ఉంచగలుగుట ద్వారా ఆయుర్వృద్దిని పొందవచ్చును. యోగులు ఈవిధంగా ఉచ్చ్వాస , నిచ్చ్వాసాలను తమ అదుపులో ఉంచి జీవశక్తిని దాని పరిమాణాన్ని ప్రభావితం చేయగలిగేవారు.

            శిరస్సును ఉత్తరదిక్కుకు ఉంచి నిద్రించిన ఉత్తరదిక్కు నందు ఉన్న ఆకర్షణశక్తి వలన శరీరం నందలి విద్యుత్ శక్తి కొంత కోల్పోవును . ప్రతిదినం ఇట్లు జరుగుచుండడం వలన క్రమేణా శరీరం తన శక్తిని వర్ఛస్సును కోల్పోవును . విద్యుత్ కిరణములు మన పాదముల నుండి ప్రవహించి శిరస్సు నుండి వెలువడును. విద్యుత్ శక్తి ప్రవహించుచోట చల్లదనమును , వెలువడుచోట ఉష్ణం కలుగునని శాస్త్రవేత్తలు నిర్ధారించెను . కావున శిరస్సు నుండి విద్యుత్ శక్తి వెలువడుటచే శిరస్సు అత్యుష్ణమ్ చెంది తలభారం , బాధ , అలసట , నిస్సారం మొదలగునవి కలుగును. కొన్ని శరీరభాగాలు తమ క్రియను కోల్పోయి పక్షవాతం , తిమ్మిరి , నడుమునొప్పి మొదలగు వాతవ్యాధులు కలుగును. నరముల సంబంధ వ్యాధులు జనియించుటకు వీలు కలుగును. కావున దక్షిణదిశకు శిరము ఉంచి శయనించిన యెడల విద్యుత్ శక్తి పాదముల గుండా వెలువడుట వలన నష్టమేమి సంభవించదు. పార్థివ విద్యుత్ దక్షిణము నుండి ఉత్తరమునకు ప్రవహించును.

        ఇదేవిధముగా పడమట దిక్కు కూడా . ఇక్కడ సూర్యుడు అస్తమించుట చేత అతని ఆకర్షణశక్తి , మనుష్యుని నందలి విద్యుత్ శక్తిని ఆకర్షించును. సూర్యుడు ప్రపంచానికి కన్నువంటి వాడు. సర్వప్రాణులకు ఆధారభూతము , జగత్తును పోషించువాడు . సూర్యుని నుండి ప్రసరించు కిరణములు మనుష్యుని పై మంచి ప్రభావం చూపి దానితో శరీరం నందలి విద్యుత్ ని తన అధీనంలో ఉంచుకొనును. అందువలనే ఉత్తర దిశకు తల ఉంచి నిదురించిన ఎటువంటి పరిణామాలు కలుగునొ అటువంటి పరిణామాలే పడమర దిక్కుకి తల ఉంచి నిదురించిన కలుగును.

                        సమాప్తం 

           

ఆనెల సమస్య

ఆనెకాయలు , పులిపిరులు , కాలిపగుళ్ళు హరించుటకు సులభ చిట్కాలు  - 

 *  ఉత్తరేణి చెట్టు సమూలం తెచ్చి ఎండబెట్టి దానిని భస్మం చేసి దానికి సమానంగా హరిదళం కలిపి నూనెతో నూరి లేపనం చేయుచుండిన  యొడల ఆనెకాయలు , కాళ్ళు , చేతులు పగుళ్లు హరించును. కలిపేప్పుడు ఏ నూనెని అయినను వాడవచ్చు.

 *  దాల్చినచెక్క బూడిద , సున్నం సమానంగా నూనెతో కలిపి నూరి రాయుచుండిన యొడల ఆనెలు , కాళ్లు , చేతులు పగుళ్లు హరించును.

 *  గుగ్గిలముని వెన్నపూసతో  కలిపి మర్దించి లేపనం చేసిన యెడల కాళ్లు , చేతుల పగుళ్లు హరించును. 

          

Thursday, September 2, 2021

నడుంనొప్పి

👨🏻‍⚕️ మీ ఆరోగ్యం మీ చేతుల్లో (888)
+++++++++++++++++++++++
ఆరోగ్య మస్తు
*****************************
నడుము నొప్పి తగ్గాలంటే
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
మెడ దగ్గర నుండి నడుము  భాగం వరకువెన్నుపూసలు ఒకదానిపై ఒకటి పేర్చి ఉంటాయి. ఇటుకకు ఇటుకను ము సిమెంట్ పొర ఉన్నట్లే పూసకు పూసకు మధ్య ఒక మెత్తటి దిండులాంటి ఉంటుంది. దానినే డిస్క్ అంటారు. మనం బరువును పట్టుకున్నపుడు - లేదా మోస్తున్నప్పుడు ఆ బరువు పూసలమీద పడకుండా పూసకు పూను మధ్య డిస్క్లలు స్ప్రింగ్ లాగా వత్తిడి తెలియకుండా మెత్తదనాన్నిస్తాయి. కారు గోతులలో వెళ్ళినా లోపలున్న వారికి కుదుపుడు తెలియకుండా కాపాడినట్లే డిస్క్లు మన వెన్నెముకను కాపాడుతూ ఉంటాయి. ఎప్పుడు ముందుకే వంగి కూర్చొని ఆఫీసుల్లో పని చేసుకునేవారికి, వంకరటింకరగా కూర్చునేవారికి, మెత్తటి పరుపుల మీద పడుకునే వారికి, స్కూటర్ల, బైకులు మీద ఎక్కువ ప్రయాణాలు చేసేవారికి, మార్కెటింగ్ చేసే మార్కెటింగ్ వాళ్లకు ఈ డిస్క్ లు వత్తిడికి గురి అవుతాయి. దీని కారణంగా నడుము నొప్పి,
మన రోడ్లు గుంతలు స్పీడ్ బ్రేకర్లు కాలుజాలు మొదలైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అలాగే. ఎక్కువ శ్రమ చేసినపుడు నడుము కండరాలు కూడా వత్తిడికి గురి అవుతాయి. దీనివల్ల నడుము మధ్యభాగంలో నొప్పి వస్తూ ఉంటుంది. ముందుకు వంశ ఎక్కువ అవుతూ ఉంటుంది. విశ్రాంతిలో బాగుంటుంది.

👉చిట్కాలు:- 
1) స్పాంజి పరుపులు మాని పలుచని బొంతలాంటి వాటిపై పడుకోవడం మంచిది. 
2) నడుము భాగానికి నూనె రాసి రబ్బరు బ్యాగ్ వేడినీరు పోసి రెండు పూటలా కాపడం పెట్టుకుంటే కండరాలకు ఉపశమనం. కలుగుతుంది.
 3) నడుమును ముందుకు వంచే పనులు మాని ఎక్కడ కూర్చున్నా నిటారుగా కూర్చుంటే మంచిది
. 4) ప్రతిరోజూ కూడా నడుమును ముందుకు వంచే వ్యాయామాలు పూర్తిగా మాని, కేవలం వెనక్కివంచే ఆసనాలను మాత్రమే. చేస్తే మంచిది. అవి భుజంగాసనము, ధనురాసనము, ఉష్ట్రాసనము మొలి అవకాశముంటే రెండు పూటలా వీటిని చేస్తే త్వరగా తగ్గుతుంది.
5). ఆముదం గింజలను పొట్టుతీసి రాత్రి పడుకునే ముందు పాలల్లో మరిగించి కొని తాగాలి. ఏ విధంగా తాగాలి చూద్దాం.
1వ రొజు. - 02
2వ రోజు -  04
3 వ రోజు - 06
4వ రోజు. -08
5 వ రొజు -10
6వ రొజు -12
7వ రోజు -14
8వరోజు -14
9వరోజు-12
10వ రొజు-10
11వ రొజు -08
12వ రొజు-06
13వ రోజు-04
14వ రోజు,-02
పై విధముగా ఆముదము గింజలు పొట్టు తీసివేసి పప్పు చేతులతో నలిపి పాలల్లో మరిగించి 14 రోజులు త్రాగండి. కచ్చితంగా నడుమునొప్పి వెన్నునొప్పి
L1,L2,L3,L4 S1,S2, లాంటి సమస్యలు తగ్గును. తగ్గకపోతే ఒక వారం గ్యాప్ ఇచ్చి మళ్లీ మొదలు పెట్టండి...
గమనిక::--శరీరతత్వం బట్టి కొందరికి విరేచనాలు కావచ్చు కంగారు పడకండి... శరీరంలో పేరుకుపోయిన వాయు మొత్తం బయటికి వెళ్లిపోతాయి
అమవాతం వల్ల వచ్చే ఇలాంటి నొప్పులు అన్ని తగ్గిపోతాయి
👉  పెరుగు బదులుగా మజ్జిగ వాడాలి. మినపప్పు క్యాబేజి క్యాలీఫ్లవర్ తినకూడదు


Wednesday, September 1, 2021

ఆవు (గో సంబంధిత ఉత్పత్తులు)

👨🏻‍⚕️ మీ ఆరోగ్యం మీ చేతుల్లో (887)
+++++++++++++++++++++++
ఆరోగ్య మస్తు
*****************************
ఆవు (గో సంబంధిత ఉత్పత్తులు)
(Cow - related products)
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!;
1.ఆవుపాలు (Cow Milk) : వేడి, చలువ సమాన పాళ్ళలో ఉన్నందువలన అందదు. తీసుకోదగినవి. వీర్యపుష్టి, బలం కలుగజేస్తాయి, ఉబ్బ, వాతం, క్షయ, రక్తకృత్యం, తపైత్యం, అజీర్ణ సంబంధిత జ్వరాన్ని నివారిస్తాయి. ఆకలిని పెంచి, శరీ ప్రాణశక్తిని అందించి, ఆయుష్షును వృద్ధిచేస్తుంది.

గాయాలు త్వరగా మానుటకు ఉపకరిస్తాయి. స్త్రీలఅండాశయానికి బలo కలిగిస్తాయి. ఎక్కువగా తీసుకున్న శ్లేష్మం, పైత్యం, భారముగా అనిపిస్తుంది. దీనికి విరుగుళ్ళు తేనె, పంచదార, మజ్జిగ, నిమ్మరసం,

ఆవు ఈనిన 40 రోజుల తర్వాత నుండి వచ్చేపాలు అమృతంతో సమానం. ఉష్ణతత్త్వ శరీరం కలవారు పాలు ఎక్కువగా పుచ్చుకుంటే జ్వరం, గడ్డలు, ఉబ్బు, చర్మరోగాలు బయటపడతాయి. కాబట్టి మితంగా తీసుకోవడం మంచిది.

2.ఆవుపెరుగు (Curds/Yogurt): ప్రాణశక్తి కలది, మేహశాంతి, పైత్యశాంతి చేస్తుంది. కొంచెం వేడి చేసినా పుష్టి, బలం, కాంతి కలుగజేసి ఆకలిని పెంచుతుంది. కొంచెం కఫం పెంచినా వాత పైత్యాలను తగ్గిస్తుంది.

3.ఆవు మజ్జిగ (Buttermilk) : చలువచేసి మేహ, పైత్యాలను శాంతింపజేస్తుంది.
రుచి పుట్టించి, జీర్ణక్రియను పెంపుచేస్తుంది. అనేక రోగాలకు పథ్యముగాతీసుకొనదగినది. సర్వకాలాలయందు తీసుకోదగిన త్రిదోషరహితమైన ద్రవ ఆహారము.
ఉదయం పరగడుపున ఒక లీటర్ మజ్జిగ తాగితే, శరీరములో అధిక వేడి తగ్గుతుంది మరియు అర్షమొలలు గ్యాస్ తగ్గుతాయి
నోటిలోని పుండ్లు మౌత్ అల్సర్ తగ్గుతుంది.
4 ఆవు వెన్న (Butter) : ఆయుర్ వృద్ధిని, వీర్యవృద్ధిని, ధాతుపుష్టిని కలుగజేస్తుంది. చలువ చేస్తుంది. కఫ, వాత, పిత్తముల నుపశమింప జేస్తుంది. మేహపైత్యాలను అణుస్తుంది, కళ్ళకు మేలుచేస్తుంది. శరీరానికి కాంతినిస్తుంది. ఆకలిని పెంచుతుంది. మూత్రం సాఫీగా రానివారు నిమ్మకాయంత వెన్నముద్దను పెద్దగ్లాసు నీళ్ళలో మరిగించి. పుచ్చుకొంటే, సాఫీగా జారీ అవుతుంది.
చిన్న పిల్లలకు ఆవు వెన్న తినిపిస్తే మేధస్సుపెరుగుతుంది తెలివితేటలు పెరుగుతాయి
శ్రీ కృష్ణుని కథ చూసినప్పుడు చిన్నప్పుడు అధికంగా వెన్న తినేది 
అర్థము పిల్లలకు చాలా ఉపయోగం అని అర్థం చేసుకోవాలి.
5.ఆవు నెయ్యి (Ghee) : ఆవుద్వారా ప్రకృతి ప్రసాదించిన అద్భుత వస్తువు నేయి. దీని గురించి ప్రత్యేకంగా ఒక అధ్యాయమే వ్రాయవచ్చు. ప్రాణశక్తి అధికస్థాయిలో కలిగిన వస్తువు. శరీరంలోకి తీసుకున్నా, యజ్ఞంలో ఉపయోగించినా ప్రాణవాయువును విడుదల చేసి ప్రాణికోటికి ఎంతో మేలు చేస్తుంది.  ఒక గ్రాము ఆవు నెయ్యి, అగ్నిహోత్రంలో వేస్తే 1664 కేజీల ఆక్సిజన్ విడుదల ప్రతి ఒక్కరూ ఆవు పిడకలతో ఆవు నెయ్యి వేసి అగ్నిహోత్రం చేయుటవలన పర్యావరణాన్ని కాపాడిన వారవుతారు ఆవునెయ్యిలోని కొవ్వు పదార్థం మిగతా కొవ్వుల మాదిరి రక్తంలో కొలెస్టరాల్ను పెంచదు. కనుక అనుదినం మనం వాడదగినది. కొంచెం వేడిచేస్తే ఇది ద్రవరూపంలోకి మారుతుంది. ఇందులో విశేషతత్త్వం వలన ఆయుర్వేదంలో దీనిని విస్తృతంగా ఉపయోగిస్తారు. ఇది 'పంచగవ్యములలో ఒకటి.
ఆవుని గోరువెచ్చగా చేసుకుని రోజు రాత్రి నిద్రించే ముందు, రెండు ముక్కల్లో రెండు చుక్కలు వేయడం వలన, గురక రెండు మూడు రోజుల్లోనే తగ్గుతుంది . నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉన్న వారికి హాయిగా నిద్ర వస్తుంది.
చాతి పైభాగం నుండి శిరస్సు వరకు వచ్చే దాదాపు నూట పది రకాల జబ్బులు నయం చేస్తుంది.
ఆక్సిజన్ లెవల్స్ ను పెంచుతుంది
ఆవు నెయ్యి 'త్రిదోషములు' లేనిది. రక్తపుష్టి, వీర్యవృద్ధి, ధాతుపుష్టి కల్గిస్తుంది. పిల్లలు మొదలు వృద్ధుల వరకు అన్ని వయసులవారికి హితమయినది. ఈ నేయి. రెండుమూడు చుక్కలు రాత్రి పడుకోబోయేముందు ముక్కులో వేసుకొని, పీల్చకుండా. దానికదే లోనికి జారేలా వదలాలి. ఒక చుక్కను వ్రేలితో తీసుకుని బొడ్డుకు నెమ్మదిగా మర్దన చేసుకోవాలి. నిద్రరానివారికి ఇది పరమ అద్భుతంగా పనిచేస్తుంది. ఆహారంలోను, ఔషధంగానూ ఇన్ని విశిష్టతలు కలిగిన గోసంబంధిత ఉత్పత్తులను అనుదినం ఉపయోగించడం వలన సకుటుంబంగా దాని లాభాలు పొందవచ్చు.

ఆవుపాలు తెచ్చుకుని, కాచి, తోడువేసి మజ్జిగ చిలుకగా వచ్చిన నేయిని మాత్రం ఆహారంగానూ, ఔషధంగానూ వాడడం మంచిది. వ్యాపారాత్మకంగా తయారు చేయబడి బజారులో దొరికే ఆవు నేయిలో కొన్ని ప్రకృతి సహజమైన శక్తులు (Natural Vital forces) ఉండనందువలన, దానిని వాడితే అంతగా విశేషమైన ప్రయోజనం. పొందలేం.
👉. గోవు ఉత్పత్తులు వాడండి,
గోశాల వారికి తగిన ఆర్థిక సహాయము గ్రాసము, సహాయం చేయండి. జెర్సీ ఆవు పాలు తాగడం ఆనారోగ్యాని కోని తెచ్చుకోవద్దు.
పంచగవ్య బంధువులు వాడండి ఆరోగ్యంగా జీవించండి