Tuesday, November 30, 2021

ఆయుర్వేద వైద్యము నందు ఉపయోగించు భస్మాల ఉపయోగాలు - 4 .

ఆయుర్వేద వైద్యము నందు ఉపయోగించు భస్మాల ఉపయోగాలు - 4 . 

 *  కర్పూర శిలాజిత్ భస్మము - 

        ఈ భస్మమును సేవించిన మూత్రరోగములు,  మేహరోగములు , మందాగ్ని , ధాతునష్టం తగ్గించును . 

 *  ముదారుసింగు భస్మం - 

       ఈ భస్మమును సరైన అనుపానములతో సేవించిన సెగ , సవాయి రోగములు , ఉబ్బసములు పోవును . ధాతువృద్ధి చేయును . 

 *  మైలుతుత్త భస్మం  - 

         ఈ భస్మమును సేవించిన కుష్ఠు , కీళ్లనొప్పులు , పాతసెగలు , మూత్రరోగములు , రణ భాధలు తగ్గును . 

 *  గంధక భస్మం  - 

       ఈ భస్మమును సరైన అనుపానంతో సేవించిన కుష్ఠు , కీళ్లనొప్పులు , చర్మదోషములు , పక్షవాతములు , సవాయి మేహములు , భగందరము , వాతములు హరించును . 

 *  అభ్రక భస్మము - 

       ఈ అభ్రక భస్మమును అనుపానయుతముగా సేవించిన శ్లేష్మ పైత్య రోగములు , పైత్య వాత రోగములు , శ్లేష్మ వాత రోగములు , సమస్త రోగములు హరించును . దీనిని నేను తయారుచేయు అనేక ఔషధాలలో విరివిగా వాడతాను . 

              

ఆయుర్వేద వైద్యము నందు ఉపయోగించు భస్మాల ఉపయోగాలు - 3 .

ఆయుర్వేద వైద్యము నందు ఉపయోగించు భస్మాల ఉపయోగాలు  - 3 . 

 *  రసభస్మము  -  

    ఈ రసభస్మమును పాదరసం పుటంపెట్టి శుద్ది చేసి తయారుచేస్తారు . ఇలా శుద్ది చేసిన రస భస్మమును అనుపానయుక్తముగా ఉపయోగించిన పక్షవాతము , కంపవాతము , మూత్రఘాతము , వాతరక్తము , కుష్ఠు , దోష జ్వరము , కీళ్లనొప్పులు , కాసలు , బాలింతరోగము పోగొట్టును . శరీరము నందలి రక్తమును వృద్ధిపరచును . 

 *  ఇంగిలీక భస్మము - 

    దీనిని అనుపానయుక్తముగా సేవించిన సవాయి మేహము , శుక్ల మేహము , కాసలు , పిల్లల జలుబు , తిమ్మిరి వాతము , కిడ్నీ దోషములు , నొప్పులు , మూత్ర దోషములు తొలగును. 

 *  రసకర్పూర భస్మము - 

    ఈ రసకర్పూరమును అనుపానయుతముగా  సేవించిన సమస్త రోగములు కుదురును . కుష్ఠు , మేహమచ్చలు , తిమ్మిరి , బొల్లి , కంఠమాల , సవాయిరోగములు మాన్పును . 

 * రస సింధూరం  - 

   ఈ భస్మమును అనుపానయుక్తముగా సేవించిన సమస్త మేహములు , కాస , శ్వాస , తిమ్మిరి , శుక్లనష్టములు హరించును . 

 *  తాళక భస్మము - 

    ఈ భస్మమును అనుపానయుక్తముగా సేవించిన కుష్ఠు , కఫరోగము , వాతములు , క్షయ , పక్షవాతము , పడిస ( జలుబు ) బాధ పోవును . 

 *  పగడ భస్మము - 

      ఈ భస్మమును అనుపానయుక్తముగా సేవించుచున్న కాస , శ్వాస , కుసుమ , క్షయ , రుతుశూల , పాండురోగములు నిర్మూలించును . 

 *  ముత్య భస్మము - 

      ఈ భస్మమును సేవించిన కాస , శ్వాస , గుండెరోగము , అతిమూత్రము , కామెర్లు , ఉబ్బసం , మేహములను నయం చేయును , మెదడుకు మంచి బలాన్ని ఇచ్చును . ఇది క్యాల్షియం తక్కువ ఉన్నవారికి ఇవ్వడం వలన క్యాల్షియం లోపం సరిచేయవచ్చు . 

 *  ఆల్చిప్పల భస్మము  - 

      ఈ భస్మమును అనుపానయుక్తముగా సేవించుచున్న దగ్గులు , కడుపునొప్పులు పోవును . కండ్లకు చనుపాలలో కలిపి కాటుకలా రాసిన కండ్లలోని పొరలను కోయును . 

 *  శంఖ భస్మము - 

       ఈ భస్మమును అనుపానయుక్తముగా సేవించుచున్న సర్వ శూలలు , దగ్గులు , కుసుమ రోగములు , అగ్నిమాంద్యము , సర్ఫవిషము పోగొట్టును . 

 *  గవ్వల భస్మము -  

      ఈ భస్మమును అనుపానయుక్తముగా సేవించుచున్న రక్తగ్రహణి , గుండెవ్యాధి , వ్రణములు , పాత సుఖరోగములు , ఉడుకు జ్వరములు నశించును . 

 *  కాసీస భస్మము - 

      ఈ భస్మమును అనుపానయుక్తముగా సేవించుచున్న ఉబ్బులు , అజీర్ణములు , చర్మరోగములు , గ్రహణి రోగములు , మూత్రకృచ్చము , పాండురోగము , గుండెనొప్పులు తప్పక కుదుర్చును . 

 *  హేమాక్షిక భస్మము - 

      ఈ భస్మమును అనుపానయుక్తముగా సేవించిన శూల , హుద్రోగము , అజీర్ణము , కాస , శ్వాస , పైత్యము , పాండువు , కామెర్ల రోగము నయం అగును. 

    

ఆయుర్వేద వైద్యం నందు ఉపయోగించు భస్మాల ఉపయోగాలు - 2 .

ఆయుర్వేద వైద్యం నందు ఉపయోగించు భస్మాల ఉపయోగాలు - 2 . 

 *  సీస భస్మము - 

    ఈ భస్మమును అనుపానయుతముగా సేవించిన వాతము , క్రిమి రోగములు , భ్రమ , పాండు రోగము , శూల ( నొప్పి ) , భగంధరం , అగ్నిమాంద్యము ( ఆకలి లేకపోవడం ) , గ్రహణి , ప్రమేహము నివారించును . ఇది ఏనుగుతో సమానమైన బలమును ఇచ్చును. దీనికి నాగ భస్మం అని మరొక పేరుతో కూడ వ్యవహరిస్తారు . 

 *  తగర భస్మం - 

    శుద్ది చేయబడిన తగర భస్మమును సేవించిన మూత్రకృచ్ఛము ( మూత్రం బొట్లు బొట్లుగా పడే రోగము ) , శ్వాస , కాస , గుల్మము , పీనస ( ముక్కు వెంట నీరు ఆగకుండా రావటం , దుర్వాసన కలిగి ఉండు రోగము ) , ఊర్ద్వక్షత మేహము , ప్రదరము ( తెల్లబట్ట , ఎర్రబట్ట ) , వాంతి . మొదలైన రోగాలను తగ్గించును . కొంతమందికి స్వప్నస్కలన సమస్య ఉండును. అనగా నిద్రలో శుక్రము బయటకు వచ్చు సమస్య ఈ సమస్యను కూడా తగ్గించును . 

 * సత్తు భస్మము - 

     శుద్ది చేయబడిన సత్తు భస్మమును అనుపానయుతముగా లోపలికి తీసుకున్న క్షయ , ప్లీహము , పాండు రోగము , వాపు , మేహము , శ్వాస సమస్యలు హరించును. 

 *  త్రివంగ  భస్మము - 

    తగరము , సీసము , పాదరసము ఈ మూడింటికి త్రివంగములు అని పేరు . వీటిని సరైన పద్ధతిలో శుద్ది చేసి అనుపానయుక్తముగా తీసుకొనుచున్న కుసుమ రోగము , మూత్రకృచ్చము , సుఖరోగము , గ్రహణి , మేహము , దగ్గు , శోష తగ్గును. 

 *  కంచు భస్మము - 

     కంచుభస్మం అనుపానయుక్తముగా సేవించిన కాక , కఫ , పిత్తరోగములు , ఆశక్తిని తగ్గించును . 

 *  ఇత్తడి భస్మము - 

    ఇత్తడి భస్మమును అనుపానయుక్తముగా సేవించిన పాండురోగము , క్రిమిరోగము , శోఫ , వాతము తగ్గించును . శరీరానికి బలమును కలుగచేయును . 


     

Tuesday, November 23, 2021

ఆయుర్వేద వైద్యము నందు ఉపయోగించు భస్మాల ఉపయోగాలు

ఆయుర్వేద వైద్యము నందు ఉపయోగించు భస్మాల ఉపయోగాలు  - 1

   నేను అంతకు మునుపు భస్మాల పైన చాలా సమాచారం ఇవ్వడం జరిగింది. ఎంత గొప్ప సమాచారం మరియు ఉపయోగాల గురించి చెప్పినా కూడా మరెంతో సమాచారం ఇంకా మిగిలే ఉంటుంది. 

      ఆయుర్వేదం నందు మూలికావైద్యం మాత్రమే కాకుండా భస్మాలను ఉపయోగించి వైద్యం చేయడం కూడా ఉంది. దీన్ని "రసౌషధ విద్య " గా పిలుస్తారు. కాని ఇది రహస్యముగా ఉంచబడినది. ఈ విద్యని ఉపయోగించుటకు అవగాహన మరియు నేర్పరితనం తప్పక ఉండాలి. ముఖ్యముగా అనువంశికముగా వైద్యం చేయువారికి ఈ విద్య పైన సంపూర్ణ అవగాహన ఉంటుంది. ఇప్పుడు మీకు మేము ఈ రసౌషద వైద్యములో ఉపయోగించు భస్మాల ఉపయోగాల గురించి వివరిస్తాను . 

 * స్వర్ణ భస్మం - 

    ఈ భస్మం రారాజు వంటిది. దీనిని వెన్నతోగాని , తేనెతో గాని , నెయ్యితో గాని సేవించిన పిత్తము , వాతము , ప్రమేహము , గ్రహణి , కుష్టు , నపుంసకత్వం , పాండు రోగము , క్షయ , మూలరోగము సమూలంగా పోవును . 

 *  వెండి భస్మము - 

      దీనికి రౌప్య భస్మం అని కూడా పేరు కలదు . దీనిని సరైన అనుపానముతో సేవించిన పైత్యము , గుల్మము , కఫము , విషము , మేహము , శ్వాస , ప్లీహ ( spleen ) రోగములు , వలిఫలితము ( చిన్న వయసులో జుట్టు తెల్లబడుట ) , పాండురోగము , వాపు , దగ్గు , క్షీణత్వం అనగా శరీరం క్షీణించుట , క్షయ రోగము నశించును . 

 *  తామ్ర భస్మం - 

      తామ్రము అనగా రాగి . రాగిని సరైన పద్ధతుల్లో పుటము పెట్టి శుద్ది చేసినది . ఈ భస్మమును వాడుట వలన కుష్టు , ప్లీహము , జ్వరము , కఫము , వాతము , శ్వాస , కాసము , వాపు , శూల , ఉదర రోగములు , క్రిమి రోగములు , పాండు , మొలల రోగము , క్షయ , భ్రమ , మోహము , ఎక్కిళ్ళు వంటివి తగ్గును. 

 * లోహ భస్మము - 

      లోహము అనగా ఇనుము . ఈ ఇనుప భస్మము పుటాలు పెట్టి శుద్ది చేసి వాడవలెను .  దీనిని వాడటం వలన ప్లీహ రోగము ( spleen ), మొలల నొప్పి , పిత్తము , వాతము , కుష్టు , శోభి , కాస , జ్వరము , మేహావాతము , కీళ్ల నొప్పి తగ్గించును. దీర్గాయువు ఇచ్చును . 

 * కాంత భస్మము - 

      కాంతము అనగా అయస్కాంతము . దీన్ని శుద్ది చేసి తయారు చేసిన భస్మము వాడటం వలన మేహ పిటికలు , త్రిదోషములు , శూల , మొలలు , గుల్మము , ప్లీహ రోగము , క్షయ , పాండువు , ఆడవారిలో వచ్చు తెల్లబట్ట , ఎర్రబట్ట మరియు ఉదర బలహీనతను తగ్గించును . దీర్గాయువు ఇచ్చును . 

 *  మండూర భస్మము - 

    చిట్టెపు రాళ్లు తెచ్చి బాగుగా కాల్చి ఆవు పంచితములో 7 పర్యాయాలు ముంచి నీళ్లతో కడిగి , ఎండించి జిల్లేడు పాలతో నూరి పుటం పెట్టిన భస్మం అగును. దీన్ని త్రిఫల కషాయంతో కలిపి మరికొన్ని పుటాలు వేసిన శుద్ధ మండురం అగును. ఇది అత్యంత శక్తివంతం అయినది. 

    

Monday, November 22, 2021

సూర్య నమస్కారాలు ................!!

సూర్య నమస్కారాలు ................!!

సూర్య నమస్కారం అనే పేరు ఒక్కటే అయినా... అందులో 12 రకాల ఆసనాలు ఉంటాయి.

ఆసనానికో ప్రయోజనం :-

సూర్య నమస్కారం అనే పేరు ఒక్కటే అయినా... అందులో 12 రకాల ఆసనాలు ఉంటాయి. ఈ పన్నెండు చేస్తే ఒక వృత్తం పూర్తయినట్లు! వీటిలో ఒకటి నుంచి ఐదు... ఎనిమిది నుంచి పన్నెండు ఆసనాలు ఒకేలా ఉంటాయి. కుడి, ఎడమల తేడా మాత్రమే ఉంటుంది. ఏ ఆసనంతో ఎలాంటి లబ్ధి చేకూరుతుందో చూద్దాం...

ఒకటి, పన్నెండు :- శరీర సమతుల్యత సాధించవచ్చు. శ్వాసకోశ వ్యవస్థ మెరుగుపడుతుంది. వెన్నెముక, మెడ, భుజాల దగ్గర ఉన్న కండరాలు బలోపేతం అవుతాయి.

రెండు, పదకొండు :- జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. వెన్నెముక, పిరుదులు బలోపేతమవుతాయి.

మూడు, పది :- రక్త ప్రసరణ పెంచుతాయి. కాలి కండరాలను బలోపేతం చేస్తాయి. గ్రంధులపై కూడా ప్రభావం చూపుతాయి.

నాలుగు, తొమ్మిది :- వెన్నెముక, చేతి మణికట్టు కండరాలను బలోపేతం చేస్తాయి.
ఐదు, ఎనిమిది: గుండెను బలోపేతం చేస్తాయి. మెడ, భుజాల దగ్గర ఉండే ఒత్తిడిని తగ్గిస్తాయి.

ఆరో ఆసనం :- మెడ, భుజాలలో ఒత్తిడిని తగ్గిస్తుంది.

ఏడో ఆసనం :- జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. వెన్నెముక బలంగా మారడానికి ఉపకరిస్తుంది.

మరెన్నో లాభాలు :-

సూర్య నమస్కారాలతో ఎముకలు, కండరాలు బలోపేతమై ఆరోగ్యంగా ఉండటమే కాదు... మధుమేహం, బీపీ, గుండె జబ్బుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. "సూర్య నమస్కారాలలో 12 రకాల భంగిమలు ఉంటాయి. వీటిలో కొన్నింటిని నెమ్మదిగా చేయాలి. మరి కొన్నింటిని వేగంగా చేయాలి. వేగంగా చేసే భంగిమల్లో కండరాలకు మేలు జరుగుతుంది. ఏరోబిక్స్‌తో సమానమైన ఫలితాలు సాధించవచ్చు. నెమ్మదిగా చేసే సూర్య నమస్కారాలు శ్వాస నియంత్రణకు ఉపయోగపడతాయి.
ఎక్కువ గాలిని పీల్చి, వదలడం ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది'' అని ఆనంద బాలయోగి వివరించారు. అధిక బరువు తగ్గడం, జీర్ణ ప్రక్రియ మెరుగవడంతోపాటు... సూర్య నమస్కారాలతో మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. సూర్య నమస్కారాలు శరీర భాగాలపైనే కాకుండా గ్రంధులపైనా పని చేస్తాయి. థైరాయిడ్, పార్థరాయిడ్, పిట్యూటరీ వంటి గ్రంధులు సాధారణ స్థాయిలో పని చేయడానికి ఇవి ఎంతో ఉపకరిస్తాయి.

1.నమస్కారాసనం ( ఓం మిత్రాయ నమ ):-
సూర్యునికి ఎదురుగా నమస్కారం చేస్తున్నట్లు నిలబడి సూర్యుని నామాన్ని ఉచ్ఛరించాలి.

2.హస్త ఉత్తానాసనం ( ఓం రవయే నమః) :-
కొద్దిగా శ్వాస పీల్చి రెండు చేతులను పైకెత్తి, తలను, నడుమును వెనుకకు వంచాలి. కాళ్ళు వంచకూడదు.

3.పాదహస్తాసనం ( ఓం సూర్యాయ నమః) :-
శ్వాస వదలి రెండు చేతులను కాళ్ళకు దగ్గరగా భూమిమీద ఆనించి, తలను మోకాలుకు ఆనించాలి.

4.ఆంజనేయాసనం ( ఓం భానవే నమ ) :-
ఎడమ మోకాలును వంచి పాదాన్ని నేలపై ఉంచి, కుడి పాదాన్ని వెనుకగా వేళ్ళపై ఆనించి, రెండు చేతులను పైకి చాపి, నడుము పైభాగాన్నంతా వెనుకకు వంచాలి. ఈ స్థితిలో శ్వాసను పీల్చి లోపలే ఆపాలి.

5.పర్వతాసనం ( ఓం ఖగాయ నమః) :-
కాళ్ళు, చేతులు నేలమీద ఆనించి నడుము పైకి ఎత్తి శ్వాస వదలి తిరిగి పీల్చాలి.

6.సాష్టాంగ నమస్కారం ( ఓం పూష్ణే నమః) :-
ఎనిమిది అంగాలు నేలకు ఆనటం వలన దీనికి 'అష్టాంగ నమస్కారం' అని కూడా అంటారు. రెండు కాళ్ళు, రెండు మోకాళ్ళు, రెండు చేతులు, రొమ్ము మరియు గడ్డం - ఈ ఎనిమిది అంగాలు నేలమీద ఉంచి నడుమును కొద్దిగా పైకి లేపాలి. శ్వాసను పూర్తిగా బయటకు వదలి ఆపాలి.

7.సర్పాసనం ( ఓం హిరణ్యగర్భాయ నమః ) :-
శ్వాసను పీల్చి తలను వెనుకకు వంచాలి.

8.పర్వతాసనం ( ఓం మరీచయే నమః) :-
ఐదవ స్థితివలెనే కాళ్ళు చేతులు నేలమీద ఆనించి నడుమును పైకి ఎత్తి శ్వాస వదలి తిరిగి పీల్చాలి.

9.ఆంజనేయాసనం ( ఓం ఆదిత్యాయ నమః) :-
నాలుగవ స్థితివలెనే కుడి పదాన్ని నేలపై ఉంచి, మోకాలును మడచి, ఎడమ పాదాన్ని వెనుకగా వేళ్ళపై ఆనించి, రెండు చేతులను, తలను, నడుమును వెనుకకు వంచాలి

10.పాదహస్తాసనం ( ఓం సవిత్రే నమః) :-
మూడవ స్థితివలెనే రెండు చేతులను కాళ్ళ దగ్గరగా నేలపై ఆనించి తలను మోకాలుకు ఆనించాలి. శ్వాసను బయటకు వదలి ఆపాలి.

11.హస్త ఉత్తానాసనం ( ఓం అర్కాయ నమః) :-
రెండవ స్థితివలెనే రెండు చేతులను పైకెత్తి, తలతోపాటు రెండు చేతులను వెనుకకు వంచాలి.

12.నమస్కారాసనం ( ఓం భాస్కరాయ నమః) :-
నిటారుగా నిలబడి నమస్కారం చేయాలి.

Sunday, November 21, 2021

లవంగం తో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

💐 *లవంగం తో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు:*
------------------------
👉లవంగాలలో ఫైబర్, మాంగనీస్, విటమిన్ C మరియు K ఉన్నాయి. 

👉మాంగనీస్ మెదడు పనితీరును పెంచుతుంది మరియు ఎముకలు గట్టి పడటానికి ఉపయోగపడుతుంది. 

👉విటమిన్ C మరియు K రోగనిరోధకతను పెంచుతాయి మరియు రక్తం గడ్డకట్టడానికి సహాయపడుతాయి. 

👉లవంగాలలో యాంటీమైక్రోబియల్ లక్షణాలు ఉన్నాయి. 

👉ఇవి తిమ్మిర్లు, అలసట, అతిసారము వంటి రుగ్మతలకు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రించడంలో సహాయపడుతుంది. 

👉లవంగాలలో ఉన్న యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు మీ పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. 

👉ఎందుకంటే, అంటువ్యాధులకు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకునే సామర్థ్యం వీటిలో ఉంది. 

👉ఇంతే కాదు, లవంగాల వల్ల మీకు ఎన్నో ప్రయోజనాలున్నాయి.

✍️దగ్గు, జలుబు, ఆస్తమానూ తగ్గించడానికి:

👉లవంగం నూనె బ్రాంకైటిస్, ఆస్తమా, మరియు ఇతర శ్వాసకోశ సమస్యలను, జలుబు మరియు దగ్గు వంటి వాటిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. 

👉ఈ నూనె శ్వాస నాళాన్ని హాయి పరుస్తుంది మరియు యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలను కూడా కలిగి ఉంది.

👉లవంగం నూనెను ఛాతిపై, ముక్కుపై, ముక్కు చుట్టూ నెమ్మదిగా మర్దన చేస్తే చాలా ఉపశమనం కలుగుతుంది.

👉కొన్ని లవంగాలను కొన్ని చుక్కల లవంగం నూనెను వేడి నీటిలో వేసి దాన్ని టీ లా తాగితే కొద్దిగా ఉపశమనం కలుగుతుంది.

👉 ప్రతీరోజూ ఇలా తాగితే నెమ్మదిగా శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయి.

👉ఒక లవంగ మొగ్గను నమలడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది.

✍️నొప్పులు వాపులకు, కీళ్ల నొప్పులకు చక్కని నివారణ:

👉లవంగాలలోని యుజెనాల్ అనే పదార్ధానికి శక్తివంతమైన యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి.

👉ఇవి లవంగం నూనెలో కూడా పుష్కలంగా ఉన్నాయి.

👉లవంగాలు నోటి పూత మరియు గొంతు వాపులతో కూడా పోరాడుతుంది. 

👉 రోజూ లవంగాలు తీసుకున్న వారిలో కేవలం 7 రోజుల్లో సైటోకిన్ స్థాయిలు తగ్గతాయి. 

👉ఈ సైటోకైన్లను తగ్గించడం వలన కీళ్ళనొప్పులు మరియు ఆర్థరైటిస్ గణనీయంగా తగ్గుతాయి.

✍️రక్త ప్రసరణ మెరుగు పడేందుకు:

👉 లవంగం నూనె శరీరం యొక్క జీవక్రియను ప్రభావితం చేసి శరీర ఉష్ణోగ్రత తగ్గిస్తుంది మరియు రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది.

👉 లవంగాలలోని యాంటీఆక్సిడెంట్ లక్షణములు రక్త శుద్ధి సహాయపడవచ్చు.

✍️మధుమేహాన్ని నియంత్రిస్తాయి:

క్రమం తప్పకుండా లవంగాలు తీసుకోవడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. 

👉ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చెప్పబడిన నైజీరిసిన్ అనే మరొక సమ్మేళనం లవంగాలలో ఉంది.

👉 అందువల్ల లవంగాలను ఆహారంలో చేర్చడం ద్వారా మధుమేహాన్ని తగ్గించవచ్చు.

✍️జీర్ణాశయ సమస్యలకు చక్కని పరిష్కారం:

👉లవంగాలలోని కొన్ని సమ్మేళనాలు  కడుపులోని అల్సర్లను తగ్గిస్తాయి. 

👉లవంగాల నుంచి వచ్చే నూనె గ్యాస్ట్రిక్ మ్యూకస్ యొక్క మందం పెంచుతుంది.

👉 ఇది కడుపు లైనింగ్ ను రక్షిస్తుంది మరియు సంబంధించిన అల్సర్లను నిరోధిస్తుంది.

👉లవంగాలలో ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికి సహాయపడుతుంది మరియు మలబద్ధకం నిరోధించడానికి ఉపయోగపడుతుంది.

✍️తలనొప్పులకు:

👉లవంగాలలోని నొప్పి తగ్గించే లక్షణాలు అద్భుతాలు చేయవచ్చు.

👉 మీరు చేయాల్సిందల్లా కొన్ని లవంగాలను నలిపి శుభ్రమైన రుమాలులో పెట్టి మూటకట్టండి.

👉 తలనొప్పి ఉన్నప్పుడు వాసన పీల్చండి. కొంత ఉపశమనం లభిస్తుంది.

👉ఒక టేబుల్ స్పూను కొబ్బరి నూనెకు, రెండు చుక్కల లవంగం నూనెను కలిపి నుదుటిపై మసాజ్ చేసినా మంచి ఫలితం ఉంటుంది.

✍️టెస్టోస్టీరాన్ లెవెల్స్ ను పెంచడానికి:

👉 లవంగాలు టెస్టోస్టీరాన్ స్థాయిలను  పెంచుతాయి.

👉లవంగాలు సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని కూడా పెంచుతుంది. 

✍️వికారం వాంతులకు పరిష్కారంగా:

👉ఏదైనా తిన్నది సరిగ్గా లేక వాంతులు వచ్చినప్పుడు కడుపు లో వికారంగా ఉన్నప్పుడు లవంగాల నూనె ను తీసుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది.

✍️వికారం తగ్గడానికి లవంగంతో మరికొన్ని చిట్కాలు:

👉క్లోవ్ టీ: 
ఒక టీస్పూన్ లవంగం పొడి, లేదా 6 లవంగాలను వేడి నీటిలో వేయండి. త్వరిత ఉపశమనం కోసం రోజులో 2 సార్లు దీన్ని తాగండి.

👉లవంగాలు మరియు తేనే:
 ఒక టీస్పూన్ తేనెలో ఒక చిటికెడు లవంగాల పొడిని కలిపి తీసుకోండి. తేడా మీకే తెలుస్తుంది.

👉లవంగం నూనెను వాసన చూడండి:
 గర్భిణులలో వచ్చే వికారానికి ఇది బాగా పని చేస్తుంది.

✍️చెవి నొప్పికి:

👉 2 టీస్పూన్ల నువ్వుల నూనెను వేడి చేసి 2-3 చుక్కల లవంగం నూనెను వేయండి. 

👉ఈ నూనెను ఇప్పుడు నొప్పి ఉన్న చెవిలో వేయండి. నెమ్మదిగా నొప్పి తగ్గుతుంది.

✍️మొటిమల సమస్యలకు:

👉లవంగాలలోని యాంటీబాక్టీరియల్ మరియు యాంటీఫంగల్ లక్షణాలు చర్మ సమస్యలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. 

👉లవంగం నూనె మొటిమలను తగ్గించడానికి మరియు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికీ బాగా పనిచేస్తుంది.

✍️లవంగం వలన కలుగు మరికొన్నిఉపయోగాలు –

👉తేనె, కొంచెం లవంగాల నూనె ను గోరు వెచ్చని నీటిలో కలిపి రోజుకు మూడు సార్లు తాగితే జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు.
☘🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

గృహవైద్య రహస్యాలు

గృహవైద్య రహస్యాలు  - 

    ప్రియమితృలకు నమస్కారం , 

      ఇంటిలో మరియు ఇంటి చుట్టుపక్కల్లో ఉండే కొన్ని పదార్థాలు మరియు కొన్ని మూలికలతో అద్భుతంగా ఆరోగ్యసమస్యలని పరిష్కరించవచ్చు. వీటిగురించి ప్రతిఒక్కరు తెలుసుకొనవలెను అను సదుద్దేశంతో చాలా కష్టపడి అనేక గ్రంథాలు తిరగవేసి మరియు కొన్ని నేను ప్రయోగించిన మూలికల యొక్క సమాచారాన్ని మీకు వివరిస్తున్నాను. 

         ఈ పోస్టులో వివరించిన మూలికల సమాచారాన్ని జాగ్రత్తపరుచుకొని ఉంచుకోగలరు.

 * పిడకల బూడిద  - 

     చేతులు గాని , కాళ్లు గాని వాచినచో ఆ వాపు పైన పిడకల బూడిద మర్దన చేసినచో వాపులు తగ్గిపోవును . ఆవుపిడకల బూడిద చాలా శ్రేష్టం .

 * కట్టెలు కాల్చిన బొగ్గు  - 

     ప్రతినిత్యము బొగ్గు చూర్ణముతో పళ్లు తోముకొనుచుండిన యెడల పళ్లనొప్పులు , చిగుళ్ల వాపులు , చీముకారుట , దంతములు కదులుట మొదలైన దంతవ్యాధులు హరించి పళ్లు తెల్లగా ప్రకాశించును.

 * నిప్పు  - 

     వాతము వలన గాని , శ్లేష్మము వలన గాని తల లేక కడుపు మొదలయిన అవయవములు యందు నొప్పి వచ్చిన యెడల ఔషధ ప్రయోగముల కంటే ముందు నిప్పుసెగ చూపించి కాచినయెడల నొప్పులు వెంటనే శాంతించును.

 * ఇసుక - 

     శరీరములో యే భాగం అయినా వాచిన గాని , నొప్పిగా గాని ఉన్న యెడల ఇసుకని వేయించి గుడ్డలో మూటకట్టి ఆ ఇసుక మూటతో కాపడం పెట్టిన యెడల నొప్పులు వెంటనే శాంతించును. 

 * రాళ్లు  -

     కొత్తగా లేచిన సెగ గడ్డలు అణుగుట కొరకు రాళ్ళని వెచ్చచేసి కాపడం పెట్టవలెను . 

 * కాలిన పొగాకు మసి - 

     చుట్ట కాల్చిన తరువాత మిగిలిన మసితో ప్రతినిత్యం పళ్లు తోముకున్నచున్న యెడల దంతములు నందు క్రిములు హరించి పళ్లు ముత్యముల వలే తెల్లగా ప్రకాశించుచుండును . 

 * మన్ను - 

      తల, చేతులు కడుపు మంటలకు , గోరుచుట్టులకు నీటిలో నుంచి తీసిన ఒండ్రుమట్టి పట్టించిన యెడల మంటలు వెంటనే తగ్గిపోవును . 

 * వండుకొనే పొయ్యిలోని మట్టి - 

      కలరా మొదలయిన విషవ్యాదులు వలన శరీరం అతిగా చెమట బట్టి వళ్ళు చల్లబడుతున్న సమయంలో వండుకునే పొయ్యిలోని మట్టి తీసుకొచ్చి శరీరం పైన మర్దించవలెను . మరియు అదే మట్టిని రెండు చిటికెలు తీసుకుని నీటిలో కలిపి త్రాగించవలెను . 

 * ఆవుపేడ  - 

     నాటు ఆవుపేడ తాజాది తీసుకుని ఒక గుడ్డలో వేసి పిండి ఆ రసముని కండ్లలో వేయుచుండిన పదిరోజుల్లో రెజీకటి మానును 

 *  గోమూత్రము  - 

      నాటు ఆవు యొక్క గోమూత్రము ఉబ్బు వ్యాధి గలవారికి ప్రతినిత్యం 15ml త్రాగించుచూ అదే గోమూత్రంతో శరీరం మర్దన చేయుచుండవలెను . ఈ విధంగా 40 దినములు చేయుచున్నచో శరీరం ఆరోగ్యవంతంగా ఉండును. 

 * పాతపత్తి  - 

     నోటి నుంచి ఎక్కువుగా శ్లేష్మం పడుచూ రొమ్ము నొప్పిగా ఉన్నయెడల పాతదూది వెచ్చచేసి రొమ్ముపైన కట్టిన యెడల రొమ్ము నొప్పి కఫ వ్యాధి తగ్గిపోవును . 

 * గుర్రపు లద్దె  - 

     గుర్రపు లద్దె ఎండించి చూర్ణం కావించి ఆ చూర్ణంని ప్రసవించలేక కష్టపడుతున్న స్త్రీ యొక్క యోనికి ధూపంవేసిన యెడల వెంటనే సుఖంగా ప్రసవించును. 

 * తలవెంట్రుకలు - 

     తలవెంట్రుకలను కాల్చి భస్మం చేసి పన్నీరులో కలిపి ప్రసవించలేక కష్టపడుతున్న స్త్రీకి తలపైన మర్దన చేసిన యెడల ఆ స్త్రీ సుఖముగా ప్రసవించును. ఇంటి యందు ఉన్న ఎలుక కన్నముల యందు తలవెంట్రుకలు ను ఉంచిన ఆ కన్నముల గుండా ఇంట్లోకి పాములు రావు . 

 * నల్ల సిరా - 

      నిప్పుల వలన కాలిన స్థలము పైన నల్ల సిరా రాసినచో బొబ్బలు ఎక్కకుండా మంటలు తగ్గిపోవును . 

 *  ఇనుపముక్క  - 

     ఏ ఉపాయం చేత కూడా అతిదాహం అనగా విపరీతంగా నీరు తాగటం తగ్గనప్పుడు ఎర్రగా కాల్చిన ఇనుపముక్కని మంచినీటిలో మంచి ఆ నీటిని వడకట్టి త్రాగించిన యెడల బాధలేకుండా పండ్లు తొందరగా వచ్చును. 

 * రాగి - 

     సన్నటి రాగికడ్డిని కంటెము వలే చేసి చిన్నపిల్లల మెడలో వేసిన యెడల బాధ లేకుండా పండ్లు తొందరంగా వచ్చును.

 * గవ్వలు - 

    గవ్వలను బాగా కాల్చి నూరి వస్త్రగాలితం చేసి ఆ మెత్తటి చూర్ణంని చీము కారుచున్న చెవిలో కొంచం కొంచం రోజుకి నాలుగైదుసార్లు వేయుచుండిన యెడల మూడురోజుల్లో చీముకారుట తగ్గును .

      
 * ఆముదం - 

     చంటిపిల్లలకు విరేచనం కాక కడుపులో నొప్పి కలిగిన యెడల కడుపు పైన ఆముదం రాసి కాపడం పెట్టిన యెడల వెంటనే బాధ తగ్గి విరేచనం అగును.

        శిరస్సు పైన ఆముదం ని మర్దన చేసుకొన్న యెడల రెండుమూడు వారములలో రేచీకటి వ్యాధి తగ్గును. 

 * తాటాకు విసినికర్ర - 

      నీళ్లు చల్లిన విసినకర్ర తో విసిరిన యెడల మూర్చ వచ్చినవారు త్వరగా లేచి కూర్చుండెదరు . వడదెబ్బ తగిలినవారికి , వేసవితాపం భరించలేనివారికి , నీళ్లు చల్లిన తాటాకు విసినకర్రతో విసురుచుండిన యెడల సుఖకరంగా ఉండును.

 * దర్భలు - 

      దర్భలని నీళ్లతో నూరి వడకట్టి రసమును త్రాగించుచున్న యెడల వాంతులు తగ్గిపోవును .

 * బంగారము -

      నీళ్లతో నిండిన ఒక మట్టికుండ యందు ఏదైనా ఒక బంగారు వస్తువు వేసి రెండు గంటలు నిలువ యుంచి ఆ ఉదకము చేత స్నానము చేయుచున్న యెడల పిల్లలకు మరియు పెద్దలకు వచ్చు ఎండు జబ్బు అనగా బక్కగా అవుతూ కండరాలు క్షీణించే వ్యాధి నివారణ అగును. అదేవిధంగా ఆ నీటిని ప్రతిరోజు కొంచంకొంచం తాగుచుండవలెను.

 * గంగసింధురం -

       గాయములపైన  గంగసింధూరం అద్దిన యెడల రక్తము కారుట మాని గాయములు తొందరగా మానును .

 * మంచి గంధం - 

       సానపైన అరగదీసి మంచిగంధం శిరస్సు పైన పట్టువేసిన యెడల వేడివలన వచ్చు తలనొప్పి వెంటనే తగ్గిపోవును . 

 * దేవదారు చెక్క - 

       15 గ్రాముల దేవదారు చెక్క చూర్ణమును అర్ధసేరు నీళ్లలో వేసి కాచి అర్ధపావు మిగులునట్టు దించి చల్లారిన తరువాత అందు ఒక తులము తేనే కలిపి త్రాగుచుండిన స్త్రీల కుసుమ వ్యాదులు , శుక్లనష్టం , సూతికా జ్వరం హరించును .

 * తేనెమైనం  - 

      50 గ్రాముల తేనెమైనం కరిగించి అందు జేబురుమాలు తడిపి ఉంచవలెను అవసరం అయినపుడు ఆ రుమాలును కొంచం వెచ్చచేసి వాచిన అండకోశములు పైన వేసి కట్టిన బాధ తగ్గును. ఇట్లు కొన్ని దినములు కట్టుచున్న యెడల వరిబీజం నిర్మూలన అగును.

 * తులసి  - 

       జలుబు చేసిన వారికి రోజుకి ముప్పయి నుంచి నలభై తులసి దళములను తినిపించుచున్న యెడల మూడు రోజుల్లో పడిసం తగ్గును. జ్వరం రానియ్యదు. ఏడు మిరియపు గింజలను ,ఏడు తులసి దళములను కలిపి నమిలి మింగుచున్న యెడల మలేరియా జ్వరము మూడు రోజుల్లో తగ్గును.

       కృష్ణ తులసి లేక నల్లతులసి చెట్టు యెక్క వేరు ముక్కను తాంబూలము నందు ఉంచి భక్షించిన యెడల సంభోగం నందు ఆనందం కలుగును.

      తులసిచెట్టు యొక్క వేరు అరగదీసి ఆ గంధం తేలు కరిచినచోట అంటించిన యెడల విషము దిగిపోవును .

* రుద్రాక్ష  - 

   రుద్రాక్షని పాలతో సాన పైన అరగదీసి గంధముని అరగదీసి ఆ గంధముని గర్భిణి స్త్రీ చేత తాగించు చున్న యెడల గర్భస్రావం జరగకుండా కాపాడును. 

* కుంకుడుపప్పు -

    కుంకుడుగింజలోని పప్పును నీళ్లతో నూరి త్రాగించున్న యెడల నీళ్ల విరేచనములు , కలరా విరేచనములు తగ్గును. తమలపాకులో కుంకుడుపప్పు పెట్టి మూడుపూటలా తినిపించిన సర్ఫవిషం హరించును .

 * సున్నము -

     సున్నపు తేట నీరుని 5ml నుంచి 10ml వరకు మోతాదు చొప్పున చిన్నపిల్లలకు ఇచ్చుచుండిన యెడల ఆకుపచ్చరంగు విరేచనాలు , కడుపులో బల్లలు హరించును 

       5 లీటర్ల నీటి యందు ఒక పావు కిలో సున్నముని కలపవలెను రాతి సున్నము మాత్రమే వాడవలెను. 5 గంటల తరువాత పైన తేరుకున్న నీరును, కిందకు దిగిన సున్నము ఏ మాత్రం రాకుండా వంచుకొని సీసాలో భద్రపరచుకొనవలెను. ఇదియే సున్నపు తేట తీయుక్రమము . 

 * కాచు -

   కాచు చిన్న ముక్కని బుగ్గన పెట్టుకొని రసం మ్రింగుచుండిన యెడల మూడురోజుల్లో నోటిపూత తగ్గిపోవును . ప్రతిరోజు రెండున్నర గ్రాములు కాచు చూర్ణముని తినుచుండిన యెడల కొద్దిరోజుల్లొనే రక్తం శుద్ది అగును.

 * తమలపాకులు - 

    మానని మొండి వ్రణముల పైన తమలపాకులు వేసి కట్టుచుండిన యెడల త్వరగా పుళ్లు మానిపోవును. స్త్రీల స్థనముల పైన తమలపాకులు వేసి కట్టుచుండిన యెడల పాలు తగ్గిపోవును .

 * పోకచెక్కలు  - 

    పోకచెక్కలు కాల్చిన భస్మముని తామర పైన అంటించుచుండిన యెడల కొద్దిరోజుల్లో తామర వ్యాధి సమూలంగా పోవును .

 * తేనే  - 

     కాలినచోట తేనే రాసిన యెడల బొబ్బలు లేవకుండా బాధ తగ్గి త్వరగా మానును . కాలిన పుండు మానిన తరువాత మచ్చ గల ప్రదేశములో తేనెలో దూది వేసి తడిపి ఆ పత్తిని వేసి కట్టి దానిపైన మరలా దూది వేసి కట్టుచుండిన యెడల కొన్ని రోజుల్లోనే మచ్చపోయి శరీరం రంగులో కలిసిపోవును.

 *  నెయ్యి - 

      తెగుట వలన కాని , దెబ్బ వలన కాని వాతము వలన ఎదైనా అవయవం బలహీనం అయ్యి ఎండిపోవుచున్న యెడల నెయ్యితో ఆ అవయమును మర్దించుచున్న యెడల ఆ అవయవం బాగుపడును .

    40 గ్రాముల ఆవునెయ్యి లో 30 మిరియపు గింజల చూర్ణముని వేసుకొని కలిపి తినుచుండిన యెడల మెదడు కు బలం కలిగి కండ్లు యెక్క దృష్టి ఎక్కువ అగును.

 గమనిక  -

     నాటు ఆవు యెక్క స్వచ్ఛమైన నెయ్యి వాడినప్పుడు మాత్రమే పైన చెప్పిన ఫలితాలు వస్తాయి.

 * వెన్న  - 

     ప్రతిరోజు ఉదయన్నే ముఖం కడుగుకున్న వెంటనే 40 గ్రాముల వెన్నని తినుచుండిన యెడల తలతిప్పుట , మలబద్దకం , గొంతు ఎండిపోవుట, ముక్కు వెంట రక్తం పడుట , మెదడు యెక్క బలహీనత పోవును . శిరస్సుకు కూడా కొంచం వెన్నని మర్దన చేయవలెను .

 * ఆవుపాలు  -

     ఆవుపాలని రాత్రిపూట ముఖమునకు మర్దన చేసుకొనుచూ ఉండిన యెడల ముఖం కాంతివంతముగా ప్రకాశించును. ప్రతిరోజు రాత్రి నిద్ర పొయే ముందు అరకప్పు ఆవుపాలు ని సేవించుచుండిన మంచి నిద్ర పట్టును . 

 *  ఆవుపెరుగు  - 

       ఆవుపెరుగు ని వంటికి మర్దించుకొని స్నానం చేయుచుండిన యెడల వళ్ళు దురదలు , చర్మం ఎండిపోవుట మొదలయిన చర్మ సమస్యలు హరించి చర్మం నిగనిగలాడును.

      ఆవుపెరుగు పైన ఉండు మీగడని గోరుచుట్టు పైన వేసి కట్టుకట్టుచుండిన యెడల బాధ తగ్గి గోరుచుట్టు పగిలి మానిపోవును . 

   చిన్నపిల్లలకు తిన్నది తిన్నట్టు విరేచనాలు అవుతున్న సమయంలో రోజుకి రెండుసార్లు మజ్జిగ తాగించుచుండిన యెడల జఠరకోశం బాగుపడి వ్యాధి తగ్గిపోవును .

    పెద్దవారికి నీళ్ల విరేచనములు అవుచుండిన యెడల మరియు కడుపునొప్పితో బాధపడుచున్న సమయంలో మజ్జిగలో సైన్ధవ లవణం కలిపి తాగించవలెను .

 * బెల్లం -

     అన్నం అతిగా తినుటవలన అయ్యే దాహంనకు బెల్లం పానకం చేసి ఇచ్చిన యెడల తగ్గిపోవును . ప్రసవించిన స్త్రీలకు మరియు ప్రసవించిన ఆవులకు బెల్లం ముక్కలు ప్రతిదినం పెట్టుట వలన తొందరగా శరీరపుష్టి చేకూరును.

 * నువ్వుల నూనె  - 

     అరికాళ్లకు , అరచేతులకు నువ్వులనూనె రాసుకొనుచుండిన యెడల కాళ్లు , చేతులు మంటలు తగ్గి నిద్రపట్టును. దంతధావనం అనంతరం నువ్వులనూనె ని పండ్లకు చిగుళ్లకు పట్టించుచుండిన యెడల పండ్ల నుంచి చీము కారుట , పండ్ల యందలి క్రిములు హరించి దంతములు గట్టిపడి అందముగా ఉండును.

 *  కొబ్బరినూనె  - 

      వళ్ళంతా విపరీతముగా దురదలు పెట్టుచున్న ప్రతినిత్యము కొబ్బరినూనెని ఒంటికి పట్టించుకొని స్నానం చేయుచున్న యెడల దురదలు తగ్గును. మరియు ఒళ్ళు మంటలు కూడా తగ్గును. 

 *  అన్నం -

      కళ్లు ఎర్రబడి , నొప్పిగా ఉన్నయెడల వేడిఅన్నము గుడ్డలో ఉంచి మూట కట్టి ఆ మూటతో పైన కాపడం పెట్టుచున్న యెడల మూడుపూటలలో తగ్గిపోవును . 

 *  బఠాణీలు - 

       బఠాణీలు పిండితో ముఖమునకు నలుగు పెట్టుకొనుచుండిన యెడల ముఖం మీద మంగు , శోభి మచ్చలు హరించిపోవును .

 *  నువ్వులు -

      నువ్వులను నీళ్లతో నూరి పుండ్లు పైన వేసి కట్టు కట్టుచుండిన యెడల పుండ్లు పరిశుభ్రపడి త్వరగా మానిపోవును .

 * శనగలు - 

     50 గ్రాముల శనగలు సాయంత్ర సమయంలో నీళ్లలో నానవేసి ఉదయం వడకట్టిన నీళ్లలో కొంచం పంచదార కలిపి పిచ్చి వ్యాధి గలవారి కి తాగించుచున్న యెడల 40 రోజుల్లో ఉన్మాద వ్యాధి హరించును . ఉన్మాదవ్యాధి అనగా పిచ్చి పట్టడం .

 *  ఉలవలు  - 

       ప్రసవానంతరం మైల రక్తం జారీ అగుటకు గర్భాశయం లోని పోటు తగ్గుటకు ఉలవలు కషాయం తాగించవలెను. 

      ప్రతినిత్యం ఉలవలు ఉడకబెట్టి ఆ నీరు తాగి గుగ్గిళ్ళు గా చేసుకుని తినుచుండిన శరీరంలో కొవ్వు కరుగును. 

 * జీలకర్ర  - 

      ఒక గుప్పెడు జీలకర్ర ని ప్రతినిత్యము నమిలి రసము మింగుచుండిన యెడల స్త్రీల యెక్క తెల్లబట్ట, ఎర్రబట్ట, బహిష్టు వ్యాదులు యోనిలో నొప్పి , యోనిలో దురద కొన్ని రోజుల్లొ హరించిపోవును . 

     జీలకర్ర ఒక స్పూన్ + వాము ఒక స్పూన్ కలిపి బుగ్గన పెట్టుకుని నములుతూ రసం మింగుతూ చివరికి ఆ పిప్పిని మింగివేసి నీరు తాగవలెను . ఉదయం మరియు సాయంత్రం చేయవలెను . దీనివలన యోనిసమస్యలు తీరును . ఈ సిద్ద యోగాన్ని నేను చాలమంది పెషెంట్స్ కి చెప్పాను . చాలా తక్కువ సమయంలో అద్బుత ఫలితాలు వచ్చాయి. 

 * పసుపు - 

      రెండున్నర గ్రాముల పసుపును ప్రతినిత్యం ప్రాతఃకాలం నందు తేనెతో కలిపి తినుచుండిన యెడల కొన్ని రోజులలోనే మేహవ్యాథులు, రక్తదోషాలు నివారణ అగును. ఉప్పు ఎక్కువుగా తినటం వలన నోరు ఎండిపోయి అతిదాహాం వలన కలిగిన యెడల పసుపు కలిపిన నీళ్లను తాగించవలెను .

 * అల్లం  - 

      వాతవ్యాధుల వలన , మూర్చ వ్యాధుల వలన , సృహతప్పి పడిపోయి నోరు బిగదీసుకొని పోయిన యెడల 6 చుక్కలు అల్లం రసముని ముక్కు రంధ్రములలో వేసి తెలివి వచ్చి నోరు తెరుచుకొనును .అప్పుడు తులమున్నర గొరువెచ్చని అల్లపురసముని లొపలికి తాగించిన యెడల రోగి చక్కగా మాట్లాడును.

 * పెద్ద యాలక్కాయలు  - 

     రెండున్నర గ్రాములు యాలుక్కాయల గింజల చూర్ణమును వెన్నతో తినుచుండిన యెడల కడుపులో నొప్పి , మాటిమాటికి విరేచనం అగుట , జిగట విరేచనములు తగ్గిపోవును .

 * మెంతులు - 

      నిప్పు వలన కాలినచోట మెంతులు నూరి ముద్ద వలే చేసి ఆ ముద్దని కాలినచోట వేసి కట్టిన యెడల బాధ శాంతించి బొబ్బలెక్కకుండా మానిపోవును . 

 * ఆకుపత్రి ( బిర్యాని ఆకు ) - 

      ఆకుపత్రిని నీళ్లతో నూరి ఆ పేస్ట్ ని తలకి పట్టువేసిన అన్నిరకాల తలనొప్పులు హరించును . 

 * ధనియాలు -

      ధనియాల కషాయం ప్రతినిత్యం సేవించుచున్న ముక్కువెంట , నోటివెంట , మూత్రద్వారం నుంచి మరియు మలద్వారం నుంచి పడు రక్తం కట్టును . అతిగా దాహం అయ్యే వ్యాధి తగ్గును.

 *  ఇంగువ - 

      గోరువెచ్చని నీటితో బఠాణి గింజ అంత ఇంగువ మింగిన యెడల కడుపునొప్పి,నీళ్ళవిరేచనములు, ఎక్కిళ్లు , వాంతులు తగ్గిపోవును .

 * వాము  - 

     వాముని ఆవనూనెలో వేసి తైలమును తీసి శరీరముకి పట్టించి మర్దన చేసిన యెడల వళ్లునొప్పులు , దురదలు, వళ్ళు చల్లబడుట తగ్గి ఆరోగ్యముగా ఉండును.

 * సోంపు - 

     పది గ్రాములు పచ్చి సోంపు గింజలు , పది గ్రాములు వేయించిన సోంపు గింజలు ఈ రెండింటిని కలిపి చూర్ణం చేసి ఆ చూర్ణమును ఉదయం , సాయంత్రం మంచినీటితో కలిపి తాగవలెను. ఈ విధముగా సేవించుట వలన జిగట, రక్త విరేచనాలు కడుపుబ్బరం హరించిపోయి ఆరోగ్యముగా ఉండును. 

 * జాపత్రి  - 

     వేయించిన జాపత్రి చూర్ణము రెండున్నర గ్రాముల మోతాదుగా గొరువెచ్చటి నీటితో కలిపి గంటగంటకు లొపలికి ఇచ్చుచున్న కలరా వ్యాది హరించును .

 * లవంగములు  - 

     లవంగాల చూర్ణమును పిప్పిపన్ను పైన ఉంచిన యెడల పురుగులు పడిపోయి భాధ తగ్గును. నాలుగు లవంగాలు వేయించి మరియు నాలుగు పచ్చి లవంగాలు కలిపి నములుచూ రసం మింగుతున్న తీవ్రమైన దగ్గు , కంఠము నందు అడ్డుపడుచున్న శ్లేష్మము హరించిపోవును .

 * దాల్చిన చెక్క - 

     దాల్చిన చెక్క చూర్ణముని 5 గ్రాములు మంచినీటితొ కలుపుకుని తాగుచున్న యెడల జిగట విరేచనాలు , ప్రేగులయందలి క్రిములు , కడుపునొప్పులు హరించును . 

 గమనిక - 

    ఈ యోగాన్ని రాత్రిపూట మాత్రమే ఆచరించవలెను .

 * చింతకాయ  - 

     పండిన చింతకాయలు ను నీళ్లతో నూరి అందు పంచదార కలిపి త్రాగించుచున్న యెడల వడదెబ్బ తగిలిన వారి ప్రాణం నిలబడును. ఎండాకాలం చింతకాయ పానకం తాగుచున్న వారికి ఆరోగ్యం చెడకుండా ఉండును. 

 * బూడిద గుమ్మడి  - 

     బూడిద గుమ్మడికాయ రసము నందు పంచదార కలిపి తాగుచుండిన యెడల రక్తపైత్యము హరించును . బూడిద గుమ్మడికాయ గుజ్జుని తలకు పట్టించుచున్న శిరస్సులో వేడితగ్గి , ముక్కువెంట రక్తం పడుట తగ్గిపోవును .

 * కర్బూజ  - 

     కర్బూజ కాయ పై చెక్కులు ఎండబెట్టి కాల్చి ఆ భస్మముని పావు స్పూన్ తేనెతో కలిపి తినుచుండిన యెడల కడుపులో పెరిగే బల్ల ( spleen enlargement) వ్యాధులు ,నొప్పులు , కడుపునొప్పులు హరించిపోవును .

 * ముల్లంగి  - 

     ముల్లంగి దుంపల రసము నందు కొంచము ఉప్పు కలిపి తాగించుచుండిన  యెడల కడుపుబ్బరం, మూత్రబంధం అనగా మూత్రం బయటకి రాకుండా bladder ఉబ్బి నొప్పి రావటం తగ్గి తేపులు వచ్చును. 

         ముల్లంగి దుంపలను సన్నగా తరిగి ఎండించి కాల్చి ఆ భస్మమును పావుస్పూన్ ఒక చిన్న గ్లాసు నీటితో కలిపి తీసుకున్న బల్ల వ్యాదులు, కడుపునొప్పులు , కిడ్నీ లలో రాళ్లు హరించిపోవును . 

 * బెండచెట్టు - 

     పచ్ఛిబెండ కాయ తినుచుండిన గాని , బెండచెట్టు వేరు పైన బెరడుచూర్ణముని రెండున్నర గ్రాముల మోతాదుగా ప్రాతఃకాలం నందు మంచినీటి అనుపానంతో సేవించుచున్న యెడల స్త్రీలలో కలిగే ఎర్రబట్ట, తెల్లబట్ట వ్యాధులు హరించును . 

 * చిక్కుడు  - 

     చిక్కుడు తీగ, ఆకుల రసమును ముఖమునకు మర్దన చేయుచున్న యెడల ముఖం పైన ఉండు అన్నిరకాల మచ్చలు హరించిపోవును . 

       చిక్కుడు కూర తినుటవలన శరీరంలో జీవశక్తి అధికం అయ్యి ఒంటికి పుష్టి చేకూరును .

 * తెల్ల గలిజేరు  - 

     తెల్ల గలిజేరు కూరను వండుకుని తినుచుండిన యెడల ఉబ్బువ్యాధి తగ్గిపోవును . 

      ఈ గలిజేరు ఆకు గ్రామాల్లో పొలాల వెంట విపరీతంగా పెరుగును . గ్రామస్తులందరికి దీనిపైన అవగాహన ఉంటుంది. 

 * వేప  - 

      5 నుంచి 10 చుక్కల వరకు పరిశుద్ధమైన వేపనూనె ను తాంబూలంలో ఉంచి భక్షించుచున్న యెడల ఉబ్బసం మూడు వారాలలో హరించును .

 * రావిచెట్టు  - 

      రావిచెట్టు పైన బెరడు ఎండించి చూర్ణం చేసి ఆ చూర్ణం గాయాల పైన వేస్తూ ఉన్నచో ఆ గాయాలు మానిపోవును .

 * మర్రిచెట్టు  - 

      మర్రి ఊడలతో ప్రతినిత్యం పండ్లు తోముకున్నచో బుద్ది వృద్ది చెందును. ఆయుర్దాయం ఎక్కువ అగును.

 * పనస - 

       పనస ఆకులను ముద్దగా నూరి సెగగడ్డల పై కట్టుచున్న యెడల త్వరగా పగిలి మానిపోవును . పనస చెట్టు వేరు తొక్క కషాయం కాచి ఆ కషాయం 5 నుంచి 6 చుక్కలు ముక్కు రంధ్రములలో వేయుచున్న యెడల భయంకరమైన తలపోటు తగ్గిపోవును .

 * ములగ - 

      ములగవేరు చెక్క రసమును నాలుగు నుంచి అయిదు చుక్కల రసం ముక్కులో వేయుచుండిన మూర్చవ్యాధి హరించును .

          ములగచెట్టు ఆకులు కూరగా వండుకుని తినుచుండిన యెడల అగ్నిమాంద్యం హరించి అధికంగా ఆకలి అగును.

 * మారేడు  - 

      ఏ ఔషదాలు ఉపయోగించినను పుండ్లు మానకుండా ఉన్న యెడల మారెడు ఆకు కషాయం నందు తేనె కలిపి ఇస్తూ పుండ్ల పైన లేత మారేడు ఆకులను నూరి ముద్ద కట్టుచుండవలెను.

 * దానిమ్మ  - 

        దానిమ్మ చెట్టు బెరడు చూర్ణమును గాని , దానిమ్మ కాయ పై పెచ్చుల చూర్ణం కాని తీసుకుని అందు రెండు తులముల సైన్ధవ లవణం చూర్ణం కలిపి పూటకు రెండున్నర తులముల చూర్ణమును గోరువెచ్చటి నీటి అనుపానముగా తీసుకొన్న యెడల అన్నిరకములు అయిన దగ్గులు , నీళ్ల విరేచనములు హరించును .

 * నిమ్మచెట్టు -

      నిమ్మచెట్టు బెరడు చూర్ణమును ఇంట్లో ధూపం వేసిన యెడల ఆ ఇంట్లో ఉన్నవారికి కలరా వ్యాధి సోకదు. 

 * పెద్ద ఉసిరికాయలు - 

      15 గ్రాముల ఉసిరికాయలు యొక్క రసం నందు కొంచం తేనె కలిపి ప్రతినిత్యం సేవించుచున్న యెడల వాతగుల్మములు,  నీరసం , అతిదాహం , ముక్కు నుంచి నోటినుంచి రక్తం పడుట తగ్గును .

 * అరటిచెట్టు  - 

       అరటిచెట్టు వ్రేళ్ళు కషాయము తాగుచుండిన యెడల ప్రేగుల్లో క్రిములు హరించును . అరటిచెట్టు రసమును తాగుచుండిన యెడల ఆగిపోయిన బహిష్టు మరలా వచ్చును.

          మరికొన్ని అమూల్యమైన మూలికల యొక్క ఉపయోగాలను తరవాతి పోస్టులో వివరిస్తాను.

గృహవైద్య రహస్యాలు  - 7.

 * సంపెంగ చెట్టు - 

     సంపెంగచెట్టు పై బెరడు కషాయమును 30ml చొప్పున తాగించుచున్న యెడల పిల్లలు పక్కలో మూత్రము పోవు వ్యాధి తగ్గును. 

         సంపెంగచెట్టు బెరడు, మిరియాలు కలిపినూరి శనగల వలే మాత్రలు చేసి పూటకొక మాత్ర చొప్పున ఇచ్చుచుండిన యెడల మలేరియా జ్వరం మూడుపూటల్లో హరించును .

 * అవిసె చెట్టు -
 
     అవిశె పువ్వుల కూర కాని , అవిశె కాయల కూర కాని తినుచుండిన యెడల రేజీకటివ్యాధి మూడువారాలలో కుదురును.

 * బంతిచెట్టు  - 

     బంతి ఆకులను రసము పిండి కొంచం వెచ్చచేసి చెవులలో పోయుచున్న యెడల చెవిపోటు , చెవిలొ నుంచి చీము కారుట , చెవిలోని కురుపులు హరించిపోవును . 

        శరీరం తెగి రక్తము కారుచున్న యెడల గాయము పైన బంతిచెట్టు ఆకు రసమును పూసిన యెడల రక్తము కారుట వెంటనే నిలిచిపోవును. 

 * సన్నజాజి  - 

     సన్నజాజి ఆకులు ని నూరి ముద్ద చేసి తేనె కలిపి నాలుకకు పట్టించుచున్న యెడల నోటిపూత మూడురోజుల్లొ పోవును .

 * గులాబి - 

      గులాబి పువ్వుల కషాయంలో తేనె కలిపి తాగుచున్న మలబద్దకం హరించును . 

         ఈ కషాయాన్ని సేవించుట వలన కండ్లమంటలు , గొంతు , ముక్కు ఎండిపొవుట తగ్గును.

 * గానుగ చెట్టు  - 

      గానుగ గింజలలో పప్పు, మిరియాలు సమభాగాలుగా కలిపి నూరి మాత్రలుగా చేసి పూటకు ఒక మాత్ర చొప్పున ఇచ్చుచున్న యెడల మలేరియా జ్వరం హరించును . 

        గానుగ గింజల పప్పు నీళ్లతో నూరి తలకు రుద్దుకొనిన యెడల తలయందలి మురికి , తలలో పేలు , కురుపులు పోవును .

 * ఖర్జురము - 

      ఖర్జురపు గింజను పోకచెక్క మాదిరి బుగ్గన పెట్టుకుని నములుతూ రసం మింగుచున్న కడుపు ఉబ్బరం , కడుపులో బంధించిన వాయువు హరించును .

 * మేడిచెట్టు - 

     మేడిపాలు గాయము పైన నాలుగైదు చుక్కలు వేసిన యెడల గాయములు మానిపోవును . 

       మేడిపండ్లు ఎండబెట్టి చూర్ణము గావించి ప్రతినిత్యం ప్రాతఃకాలం నందు అరతులం చూర్ణం ను తిని అరకప్పు మంచినీరు తాగుచున్న యెడల స్తీలకు కలుగు తెల్లబట్ట వ్యాధి మరియు యోని దోషాలు నివారణ అగును.

 * మోదుగచెట్టు - 

      నీళ్ల విరేచనాలు , జ్వరముతో వచ్చిన విరేచనాలు కట్టుటకు మోదుగాకుల రసం 15ml తాగించుచున్న యెడల మూడు రోజుల్లో పైన చెప్పిన సమస్యలు నివారణ అగును. 

 * బూరుగచెట్టు  - 

       బూరుగు పువ్వుల రసం 40ml , ఆవుపాలు లేక మేకపాలు 40ml , పంచదార 20 గ్రాములు కలుపుకుని ప్రతినిత్యం తాగుచున్న స్త్రీలయొక్క తెల్లబట్ట , ఎర్రబట్ట వ్యాధులు హరించును .

 * తిప్పతీగ - 

       తిప్పతీగ రసము , నువ్వులనూనె సమాన బాగాలుగా తీసుకుని కాచి ఆ తైలమును వెంట్రుకలకు పట్టిస్తున్న యెడల తెల్లవెంట్రుకలు నల్లబడును. 

         శిరస్సుకి చలువచేయును .ఈ నూనెని వొళ్ళంతా మర్దించుకున్న యెడల వొంటి దురదలు తగ్గును. 

 * కుసుమచెట్టు - 

      కుసుమచెట్టు పువ్వులను చూర్ణం గావించి పూటకు రెండున్నర గ్రాముల చూర్ణము చొప్పున మంచినీటి అనుపానంతో ఇచ్చుచుండిన యెడల కామెర్ల వ్యాధి మూడువారాల్లో కుదురును .

Friday, November 19, 2021

శరీర దోషాలు తొలగించి చర్మవ్యాధులు హరించే దివ్యమైన సున్నిపిండి -

శరీర దోషాలు తొలగించి చర్మవ్యాధులు హరించే దివ్యమైన సున్నిపిండి  - 

 కావలసిన పదార్దాలు   - 

  * పచ్చ పెసలు  - 1 కిలొ .

  *  బావంచాలు    - 100 గ్రాములు .

   *  వట్టి వేళ్లు       -  100 గ్రాములు . 

   *  కచ్చురాలు   -  100 గ్రాములు . 

   *  మంజిష్ట         -   100 గ్రాములు .

   *  మంచి పసుపు  - 100 గ్రాములు .

   *  కస్తూరి పసుపు -  100 గ్రాములు .

   *  ఉలవలు          -  100 గ్రాములు .

   *  బత్తాయి తొక్కలు - 100 గ్రాములు .

   *  కరక్కాయ బెరడు  - 100 గ్రాములు .

   *  ఉసిరికాయ బెరడు -  100 గ్రాములు .

   *  తానికాయ బెరడు   -  100 గ్రాములు .

   *  ఎండు ఖర్జూరాలు    -   100 గ్రాములు .

   *  కుంకుడు కాయ పెచ్చులు - 100 గ్రాములు 

    *  సుగంధపాల వ్రేళ్లు  - 100 గ్రాములు .

    *  తుంగ గడ్డలు    -  100 గ్రాములు .

    *  దానిమ్మ పండ్ల బెరడు  -  100 గ్రాములు .

    *  ఎండు గులాబీ రేకులు  - 100 గ్రాములు . 

    *  మరువము -  100 గ్రాములు . 

     *  ధవనము  -  100 గ్రాములు .

     *  జాపత్రి    -   100 గ్రాములు . 

     *  యాలుకలు -  100 గ్రాములు . 

     *  కురువేరు  -  100 గ్రాములు . 

     *  తులసి ఆకులు  - 100 గ్రాములు . 

  తయారీ విధానం  - 

    పచ్చ పెసలు చిన్న మంట పైన కళాయిలో 
పోసి కొద్దిగా నెయ్యివేసి దోరగా వేయించి దించి విసిరి బరక బరకగా పిండి తయారుచేసుకోవాలి . దానిలో పైన చెప్పిన పదార్దాలను శుద్ది చేసుకుని సరైన మోతాదుల్లో విడివిడిగా చూర్ణాలు మెత్తగా చేసుకుని పెసరపిండిలో కలుపుకోవాలి. 

 
  వాడేవిధానం  - 

     స్నానానికి అరగంట ముందు ఈ సున్నిపిండిని తగినంత తీసుకుని పుల్లటి మజ్జిగతో కలిపి మెత్తగా పిసికి శరీరం అంతా రుద్దుకోవాలి . ఆరిన తరువాత ఒక్కో భాగాన్ని రుద్దుతూ స్నానం చేయాలి . ఈ సున్ని పిండి రాసుకోవడానికి అర్ధ గంట ముందు నువ్వులనూనెని శరీరముకి పట్టించి ఈ సున్నిపిండి రుద్దుకొని స్నానం ఆచరించిన అద్బుత ఫలితాలు వస్తాయి. స్నానానికి గోరువెచ్చటి నీటిని వాడిన చాలా మంచిది .

  ఉపయోగాలు  - 

 
 *  ఈ సున్నిపిండి ఉదయం , సాయంత్రం వాడటం వలన శరీరం నందలి 7 పొరలు శుద్ది చెందును . 

 *  శరీరం లోపలి భాగంలోని మలినాలు బహిష్కరించబడతాయి . 

 *  చర్మం పైన మచ్చలు , చారలు , పగుళ్లు , పుండ్లు , దురదలు , దద్దుర్లు , వాపులు హరించును . 

 *  మృత చర్మ  కణాలు నిర్మూలించబడతాయి .

 *  చర్మానికి సహజకాంతి వృద్ది చెందును .

 *  శరీర నల్లధనం , మొటిమల సమస్యలు నివారించబడును. 

 *  శరీరానికి మంచి తేజస్సు కలుగును. 

 *  సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులు కలవారికి అద్బుతంగా పనిచేయును .

  

Wednesday, November 3, 2021

మొలలనొప్పిని వెంటనే హరించు సిద్దయోగం -

మొలలనొప్పిని వెంటనే హరించు సిద్దయోగం - 

    మొలలవ్యాధి అనేది శరీరము నందు వేడి విపరీతముగా పెరిగినప్పుడు సంప్రాప్తిస్తుంది. మలద్వారం నందు మొలకలు జనియించి తీవ్రమైన నొప్పి వచ్చును. మలబద్ధక సమస్య కూడా ఉత్పన్నం అగును. బలంగా మలమును బయటకి పంపుటకు ప్రయత్నించినప్పుడు మొలకలు తెగి తీవ్ర రక్తస్రావం జరుగును. ఒక్కోసారి రక్తస్రావం ఆగకపోవడం వలన ప్రాణాలకు ప్రమాదం సంభవించవచ్చు. వ్యాధి ముదరక ముందే సరైన చికిత్స తీసుకోవలెను . 

            ఇప్పుడు నేను చెప్పబోయే సిద్దయోగం మొలల నొప్పిని వెంటనే హరించును . 

      ఒక గుప్పెడు మునగ ఆకును తీసుకుని మరుగుతున్న నీటి యందు వేసి వచ్చు ఆవిరిని మొలల స్థానమునకు పట్టించిన వెంటనే నొప్పి తగ్గిపోవును . 

   
             

Monday, November 1, 2021

తెలుగు గొప్పదనం

ఒక తమిళ వ్యక్తి రాసిన వ్యాసాన్ని యధాతధంగా.....

నా మాతృ భాష తమిళ భాష. దాని అర్థం ఇతర భాషల ను గురించి తెలియదని కాదు. తెలుగు భాష గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో పంచుకోవాలని భావిస్తున్నాను.
    తెలుగు మాతృ భాష గా ఎవరికి వున్నదో, తెలుగు భాష ను ఎవరు ప్రేమిస్తున్నారొ, తెలుగు గురించి ఎవరు తెలుసుకుందాము అనుకుంటున్నారో వారి కోసం కొన్ని విషయాలు.

1. తెలుగు భాష సుమారు క్రీ. పూ. 400 క్రితం నుండి  వుంది.

2. 2012 లో తెలుగు లిపి ప్రపంచం లోనే రెండవ గొప్ప లిపిగా "International Alphabet Association" ద్వారా ఎన్నుకోబడినది.
మొదటి లిపిగ కొరియన్ భాష.

3. తెలుగు భాష మాట్లాడడం వల్ల మన శరీరం లో గల 72000 నాడులు వుత్తేజితమౌతాయని శాస్త్రం ద్వారా నిరూపితమైంది. మిగిలన భాష ల కన్న ఇది చాలా చాలా ఎక్కువ.

4. శ్రీలంక లో గల జిప్సీ తెగ ప్రజలు ఎక్కువగా తెలుగు మాట్లాడతారు.

5. మయన్మార్ లో చాలా మంది తెలుగు మాట్లాడతారు.

6.  ఇటాలియన్ భాష లాగానే   తెలుగు భాష లో కూడా  పదాలు హల్లు శబ్దం తో అంతమౌతాయని 16 వ శతాబ్దంలో ఇటలీ కి  చెందిన  నికోలో డీ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. అందుకే  తెలుగు భాషను " ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్". అని అంటారు .

7. భారత దేశంలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య సుమారు 75 మిలియన్లు.
ఇది మన దేశంలో మూడవ స్థానాన్ని, ప్రపంచం లో 15 వ స్థానం ను పొందింది.

8. తెలుగు అనే పదం త్రిలింగ అనే పదం నుండి వచ్చినట్లు చెపుతారు. హిందూ పురాణాల ప్రకారం  త్రిలింగక్షేత్రాలు నైజం ప్రాంతం లోని కాళేశ్వరం, రాయలసీమ లోని శ్రీశైలం, కోస్తా లోని భీమేశ్వరమ్ ల మధ్యలో వుండడం వలన ఈ పేరు వచ్చిందని అంటారు.

9. ప్రపంచ ఉత్తర ప్రాంతంలో తెలుగు భాష లో మాత్రమే ప్రతి పదం హల్లు శబ్దం తో పూర్తి అవుతుంది.

10. తెలుగు భాష లో వున్న అన్ని సామెతలు, నుడికారాలు ఇంకా ఏ భాష లోన లేవు.

11. తెలుగు భాష ను పూర్వం తెనుంగు, తెలుంగు అని వ్యవహరించేవారు.

12. భారతీయ భాషలలో తెలుగు అంత తీయనైన భాష మరి ఏదీ లేదని విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ అన్నారు.

13. 200 సం. ల క్రితం మొక్కలు నాటే పని కోసం సుమారు 400 మంది తెలుగు వారు మారిషస్ వెళ్ళారు. ప్రస్తుత మారిషస్ ప్రధాని వారి సంతతే.

14. రామాయణ మహభారతాలు లో దాదాపు 40 శ్లోకాలు కచిక పదాలతో కూడిన పద్యాలు వున్నాయి. ఈ విధంగా మరి ఏ భాష సాహిత్యం లో కూడా లేదు.
కచిక (palindrome words)పదాలు అనగా ఎటునుండి చదివిన వోకే రకంగా పలికేవి. ఉదాహరణకు వికటకవి, కిటికి, మందారదామం, మడమ వంటివి.

15. శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్త మాల్యద అనే గ్రంథాన్ని తెలుగలో వ్రాసి, "దేశభాషలందు తెలుగు లెస్స" అని చెప్పి తెలుగు ను  తన సామ్రాజ్యం లో అధికార భాష గా చేసాడు.

16. ఏకాక్షర పద్యాలు గల భాష తెలుగు మాత్రమే. 
తెలుగు భాష ఔత్సాహికులకు కావలసినంత ఉత్సాహాన్ని, సృజనాత్మకత ను అందిస్తుంది ఆనడం లో ఏమాత్రం సందేహం లేదు.
 
పై విషయాలు అన్నీ వొక తమిళ వ్యక్తి  ఆంగ్లం లో  తెలియజేసిన విషయాల ను అనువదించారు. కానీ ఇది నిజం. ఇంత గొప్ప మన భాషను మన భవి తరాలవారికి సగర్వంగా అందించే బాధ్యత మన తరం పై వుంది. తెలుగు భాష ను చంపేసే తరం గా మనం వుండకూడదని నా భావన. 
ఏ భాష ప్రజలైన వారి మాతృ భాషలోనే మాట్లాడతారు. అందుకు వారు గర్వపడతారు. కానీ అది ఏమి దౌర్భాగ్యం, ఎక్కడినుండి వచ్చిన దరిద్రమో గానీ మనం మాత్రం ఆంగ్ల భాష లో మాట్లాడడానికి ప్రాధాన్యత ఇస్తాం. అమ్మ, నాన్న, అత్త, మామ, అన్నయ్య, అక్క, తాత, మామ్మ, వంటి పదాలు పలకడానికి సిగ్గు పడుతున్నాం. కొన్నాళ్ళకు ఆపదాలు అంతరించిపోయే విధంగా మనం ప్రవర్తిస్తున్నాం. ఇకనుంచి అయినా తెలుగు భాష పై స్వాభిమానం పెంచుకుందాం. తెలుగు లో మాట్లాడుదాం. 
 ఆంగ్లభాష బతుకుతెరువు కోసం నేర్చుకోవాలి. అందుకోసం మన తెలుగు భాష ను బలిచేయనవసరం లేదు. 

తెలుగు వాడిగా పుట్టడం గర్వంగా అనుభూతి పొందుదాం. 
🙏🏻🤝🏻🙏🏻🤝🏻🙏🏻🤝🏻🙏🏻🤝🏻🙏🏻🤝🏻🙏🏻🤝🏻🙏🏻🤝🏻