Friday, November 19, 2021

శరీర దోషాలు తొలగించి చర్మవ్యాధులు హరించే దివ్యమైన సున్నిపిండి -

శరీర దోషాలు తొలగించి చర్మవ్యాధులు హరించే దివ్యమైన సున్నిపిండి  - 

 కావలసిన పదార్దాలు   - 

  * పచ్చ పెసలు  - 1 కిలొ .

  *  బావంచాలు    - 100 గ్రాములు .

   *  వట్టి వేళ్లు       -  100 గ్రాములు . 

   *  కచ్చురాలు   -  100 గ్రాములు . 

   *  మంజిష్ట         -   100 గ్రాములు .

   *  మంచి పసుపు  - 100 గ్రాములు .

   *  కస్తూరి పసుపు -  100 గ్రాములు .

   *  ఉలవలు          -  100 గ్రాములు .

   *  బత్తాయి తొక్కలు - 100 గ్రాములు .

   *  కరక్కాయ బెరడు  - 100 గ్రాములు .

   *  ఉసిరికాయ బెరడు -  100 గ్రాములు .

   *  తానికాయ బెరడు   -  100 గ్రాములు .

   *  ఎండు ఖర్జూరాలు    -   100 గ్రాములు .

   *  కుంకుడు కాయ పెచ్చులు - 100 గ్రాములు 

    *  సుగంధపాల వ్రేళ్లు  - 100 గ్రాములు .

    *  తుంగ గడ్డలు    -  100 గ్రాములు .

    *  దానిమ్మ పండ్ల బెరడు  -  100 గ్రాములు .

    *  ఎండు గులాబీ రేకులు  - 100 గ్రాములు . 

    *  మరువము -  100 గ్రాములు . 

     *  ధవనము  -  100 గ్రాములు .

     *  జాపత్రి    -   100 గ్రాములు . 

     *  యాలుకలు -  100 గ్రాములు . 

     *  కురువేరు  -  100 గ్రాములు . 

     *  తులసి ఆకులు  - 100 గ్రాములు . 

  తయారీ విధానం  - 

    పచ్చ పెసలు చిన్న మంట పైన కళాయిలో 
పోసి కొద్దిగా నెయ్యివేసి దోరగా వేయించి దించి విసిరి బరక బరకగా పిండి తయారుచేసుకోవాలి . దానిలో పైన చెప్పిన పదార్దాలను శుద్ది చేసుకుని సరైన మోతాదుల్లో విడివిడిగా చూర్ణాలు మెత్తగా చేసుకుని పెసరపిండిలో కలుపుకోవాలి. 

 
  వాడేవిధానం  - 

     స్నానానికి అరగంట ముందు ఈ సున్నిపిండిని తగినంత తీసుకుని పుల్లటి మజ్జిగతో కలిపి మెత్తగా పిసికి శరీరం అంతా రుద్దుకోవాలి . ఆరిన తరువాత ఒక్కో భాగాన్ని రుద్దుతూ స్నానం చేయాలి . ఈ సున్ని పిండి రాసుకోవడానికి అర్ధ గంట ముందు నువ్వులనూనెని శరీరముకి పట్టించి ఈ సున్నిపిండి రుద్దుకొని స్నానం ఆచరించిన అద్బుత ఫలితాలు వస్తాయి. స్నానానికి గోరువెచ్చటి నీటిని వాడిన చాలా మంచిది .

  ఉపయోగాలు  - 

 
 *  ఈ సున్నిపిండి ఉదయం , సాయంత్రం వాడటం వలన శరీరం నందలి 7 పొరలు శుద్ది చెందును . 

 *  శరీరం లోపలి భాగంలోని మలినాలు బహిష్కరించబడతాయి . 

 *  చర్మం పైన మచ్చలు , చారలు , పగుళ్లు , పుండ్లు , దురదలు , దద్దుర్లు , వాపులు హరించును . 

 *  మృత చర్మ  కణాలు నిర్మూలించబడతాయి .

 *  చర్మానికి సహజకాంతి వృద్ది చెందును .

 *  శరీర నల్లధనం , మొటిమల సమస్యలు నివారించబడును. 

 *  శరీరానికి మంచి తేజస్సు కలుగును. 

 *  సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులు కలవారికి అద్బుతంగా పనిచేయును .

  

No comments:

Post a Comment