ఇంగువ.
ఇంగువ, హింగు, అసఫోటెడ అని రక రకాలుగా పిలవబడే ఈ వంటింటి దినుసు , తజకిస్తాను, ఆఫ్గనిస్తాన్ మరియు భారతదేశంలో కాశ్మీర్, పంజాబ్ ప్రాంతాలలో పండే ఒక నేల దుంప నుండి వచ్చే సహజ బంక దాన్ని శుభ్రపరచి పొడి,ముద్ద లేదా దాణా రూపంలో మనకి తయారు చేసి మార్కెట్ లో కోనుగోలు కోసం పెడతారు.ఇది అనేక రుచి తో పాటు అనేక ఆరోగ్య సమస్యలకు వంటింటి వైద్య మూలిక గా చెప్పుకోవచ్చు అందులో కొన్ని ముఖ్యం ఉపయోగాలు తెలుసుకుని మనం దాని ప్రాముఖ్యత తెలుసుకొని వాడి మన కుటుంబ ఆరోగ్యానికి మేలు చేసుకుందాం.
ఇంగువ యొక్క ఉపయోగాలు
1. జీర్ణక్రియను వృద్ధి చేస్తోంది, మల బద్ధకం,అతిసారం, కడుపులో తిమ్మిరి, గ్యాస్ట్రిక్ సమస్యలు తొలగిస్తుంది.
2. శరీరంలో హానికారక బ్యాక్టీరియా నిరోధించే యాంటీ మైక్రో బయాల్ గా పని చేస్తుంది.
3. పచ్చళ్ళు మరియు ఇతర నిలవ పదార్థాలలో ఉపయోగించడం వల్ల అవి జిడ్డు వాసన రాకుండా పాడవకుండా ఉంటాయి.
4. కాలేయంలో హానికారక విష పదార్థాల యొక్క మోతాదు తగ్గించడం లో తోడ్పడుతుంది.
5.హార్ట్ ఎటాక్ మరియు కరోనరీ వంటి గుండె సమస్యలు రాకుండా ఉపయోగ పడుతుంది.
6.మూత్ర విసర్జన శాతం పెంచి శరీరంలో సోడియం పొటాషియం నిలువలు పెరగ కుండా మూత్ర పిండాలకు సాయం చేస్తుంది
7.మెదడు యొక్క పని తీరు మెరుగు పరచి జ్ఞాపక శక్తిని పెంచుతుంది.యాంటీ దిమెన్షియ వంటి మానసిక వైకల్యలను తగ్గించే మందుల్లో ఇంగువ వాడకం ఉంటుంది.
8.కండరాల నొప్పిని నివారిస్తుంది.బిపి లేదా రక్తపోటుని నివారించే ఏజెంట్ గా కొన్ని వైద్య విధానాలలో ఇంగువ వాడతారు.
9.ఇంగువ సుగర్ వ్యాధి ఉన్న వారు ఉపయోగించడం వల్ల వారి రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది.
10.శరీరంలో పెరిగే క్యాన్సర్ కణాలను నిరోధించడంలో
11.అధిక శరీర బరువు ను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
పై భాగము సేకరణ.
వెల్లుల్లి అసలు పూర్తిగా వాడని వారు , ఏవో ఒకటి రెండు వంటకాలలో వెల్లుల్లి వాడినా ముఖ్యంగా ఇతర వంటకాలు చేసుకునే వారు, కొన్ని ప్రాంతాలలోని కొన్ని సాంప్రదాయకమైన కుటుంబాలలో వెల్లుల్లి పూర్తిగా నిషేధించిన వారు ప్రతి నిత్యం తయారు చేసుకునే వంటకాలలో తప్పనిసరిగా ఉపయోగించే పదార్ధం ఇంగువ.
ఇంగువ గడ్డ రూపంలో మరియు మెత్తని పొడి రూపంలో దొరుకుతుంది. ఈ ఇంగువను వంటకాలలో తగు మోతాదులోనే ఉపయోగించాలి. మోతాదు మించితే ఇంగువను వేసి తయారుచేసిన పదార్ధం ఓ విధమైన ఘాటైన వెగటు వాసన వచ్చి వస్తువు రుచి పాడవుతుంది,- అందువల్లనే ఇంగువను వంటకాలలో తగు మోతాదులోనే ఉపయోగించుకోవాలి.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
No comments:
Post a Comment