Friday, September 29, 2023

డస్ట్ అలర్జీ నివారణ కొరకు అద్బుత యోగం -

డస్ట్ అలర్జీ నివారణ కొరకు అద్బుత యోగం - 

      కొంతమంది కి ఉదయం నిద్రలేవడం తోనే తుమ్ములతోనే దినచర్య ప్రారంభం అవుతుంది. విపరీతంగా తుమ్ములు వస్తుంటాయి. వారికోసం ఈ అద్బుత యోగం .

    తులసి , పుదీనా , రెండు మిరియపు గింజలు నిమ్మరసం కలిపి కషాయం లాగా చేసుకొని ఒక కప్పు కషాయం తీసుకొండి నెలరోజుల్లో మీ సమస్య తీరిపోతుంది. మీ తుమ్ములు కూడా మాయం అయిపోతాయి. ఇవి అందుబాటులో లేనపుడు తుమ్ములు వస్తుంటే కొత్తిమీర వాసన చూస్తూ ఉండండి . తుమ్ములు ఆగుతాయి . ఇది తాత్కాలికంగా పనిచేస్తుంది. పైన చెప్పిన కషాయం మీకు పూర్తి ఉపశమనం ఇస్తుంది. 


మహాలయ పక్షాలు* *పూర్తి వివరణ*

*మహాలయ పక్షాలు* 
             *పూర్తి వివరణ*

*29.9.2023 నుంచి* 
*14.10.2023 వరకు* 
*మహాలయ పక్షాలు.* 

*భాద్రపద బహుళపాడ్యమి నుంచి భాద్రపద అమవాస్య వరకు మధ్యనున్న పదిహేను రోజులు మహాలయ పక్షములు అంటారు.* 

మరణించిన తండ్రి , తాత , ముత్తాతలను తలచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ తర్పణ , పిండప్రదానాది పితృయజ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశించబడిన ఈ పదునైదు రోజులనే మహాలయ పక్షాలు అంటారు. వీటినే పితృపక్షము అనీ అపరపక్షములనీ కూడా అంటారు. మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి , వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షముల ముఖ్యోద్దేశము.

 *పితృదేవతలకు.... ఆకలా...?*

అనే సందేహం కలుగవచ్చు. ఈ కనిపించే సకల చరాచర జగత్తు మొత్తం ఆకలి అనబడే సూత్రం మీదనే నడుస్తోంది.

అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః
యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞఃకర్మ సముద్భవః

అన్నం వలన ప్రాణికోటి జన్మిస్తుంది. వర్షం వలన అన్నం లభిస్తుంది. యజ్ఞం వలన వర్షం కురుస్తుంది. ఆ యజ్ఞం కర్మ వలననే సాధ్యమౌతుంది. అంటే... అన్నం దొరకాలంటే మేఘాలు వర్షించాలి. మేఘాలు వర్షించాలంటే... దేవతలు కరుణించాలి. దేవతలు కరుణించాలంటే వారి ఆకలి తీరాలి. వారి ఆకలి తీరాలంటే యజ్ఞాల ద్వారా వారి వారి హవిర్భాగాలు వారికి అందజేయాలి. ఎందుకు ఇంత తతంగం అని అడగొచ్చు.

మరణించిన ప్రాణి ఆత్మ రూపంలో పితృలోకంలో ఉంటుంది. ఆ ఆత్మ తన పూర్వకర్మానుభవం కోసం తిరిగి ఈ భూమిమీద జీవాత్మగా అవతరించడానికి ... అన్నాన్ని ఆశ్రయించి , తద్వారా పురుష ప్రాణి దేహంలో ప్రవేశించి , శుక్ల కణముగా రూపొంది , స్త్రీ గర్భకోశంలో ప్రవేశించి , శిశువుగా రూపాంతరం చెంది ఈ భూమి మీదకు వస్తుంది.

మరణించిన మన పితరులకు మోక్షం కలగాలంటే కర్మ పరిపక్వం కావాలి. అలా జరగాలంటే...

పితృదేవతలు దేహధారణ చేసి ఈ లోకంలోకి రావాలి. అలా రావాలంటే వారికి అన్నాన్ని అందించాలి. అది రక్తం పంచుకు పుట్టిన పుత్రులే అందించాలి. అప్పుడే వారికి పితృఋణం తీరుతుంది. ఋణం తీరడమే మోక్షం అంటే. ఎవరికైనా ఇంతే..

 *తద్దినాలు పెడుతున్నాం కదా... మహాలయ పక్షాలు పెట్టాలా?* 

అనే సందేహం తిరిగి కలుగవచ్చు. 
మరణించిన తండ్రి తిథినాడు పుత్రుడు తద్దినం పెట్టడం హిందూ సాంప్రదాయంలో అనాది నుంచి వస్తున్న ఆచారం. పితృతిథినాడు పుత్రుడు తన తండ్రి , తాత , ముత్తాతలను తలచుకుని పితృయజ్ఞాన్ని నిర్వహిస్తాడు. 
మరి పుత్రులు లేనివారి సంగతి ఏమి ? వారి గతి అధోగతేనా ? అంటే కాదు. అంటుంది శాస్త్రం. 
మన కుటుంబాలలో ఏ కారణం చేతనో పెళ్ళికాని సోదర , సోదరీలు మరణించి ఉండవచ్చు. లేదా పెళ్ళయినా సంతానం కలుగని దంపతులు మరణించి ఉండవచ్చు. లేదా ప్రమాదాల్లో మరణించిన చిన్న పిల్లలు ఉండవచ్చు. లేదా యుద్ధాలలో కానీ , శిక్షల ద్వారా కానీ , ఆత్మహత్యల ద్వారాకానీ , ప్రకృతి వైపరీత్యాల (భూకంపాలు , వరదలు)ద్వారా కాని గుర్తు తెలియక మరణించి ఉండవచ్చు. అటువంటి వారందరికి కూడా తిలోదకాలిచ్చి వారిని ఊర్ధ్వలోకాలకు పంపడం కోసం ఈ మహాలయ పక్షాలు నిర్దేశించబడ్డాయి. పితృతిథి నాడు మూడు తరాల వారికి (తండ్రి , తాత , ముత్తాత) మాత్రమే తిలోదకాలతో పిండప్రదానం ఇవ్వబడుతుంది. కానీ ఈ మహాలయ పక్షాలు , పదిహేను రోజులు వంశంలో మరణించిన వారందరికీ మాత్రమే కాక , పుత్రులు లేని గురువులకు (గురువు కూడా తండ్రితో సమానం) స్నేహితులకు కూడా తిలోదకాలతో , పిండప్రదానం ఇచ్చే అర్హత , అధికారం ఉంది. దీనినే *సర్వకారుణ్య తర్పణ విధి* 
అంటారు. 
ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి , తద్దినం , పెట్టకపోతే ఆ తద్దినం పెట్టని దోషం మహాలయం పెట్టడం వలన పోతుంది. పితృయజ్ఞం చేసిన వారసునికి సకల ఐశ్వర్యాలు కలగాలనీ .... పిల్లపాపలతో ఆనందంగా ఉండాలనీ దీవిస్తారు.

*మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి?* 

సాధారణంగా తండ్రి చనిపోయిన తిథినాడు మహాలయం పెట్టడం ఉత్తమం. ఏ కారణం చేతనైనా అలా పెట్టడం వీలుకాని పరిస్థితిలో మహాలయ అమావాస్యనాడు పెట్టడం ప్రశస్తం. దీనినే సర్వ పితృ అమావాస్య అంటారు. ఈ రోజునే మరణించిన బంధువులందరికీ... వారి వారి తిథులతో సంబంధం లేకుండా మహాలయం పెట్టాలి.

క్రింది సంవత్సరం చనిపోయిన వారికి భరణి లేక భరణి పంచమి తిథులలో అనగా మహాలయ పక్షాలు మొదలైన 4 లేక 5 రోజున మహాలయం పెట్టాలి.

భార్య మరణించిన వాడు అవిధవ నవమినాడు అనగా తొమ్మిదవ రోజున మహాలయం పెట్టాలి. ఆ రోజున సుమంగళిగా మరణించిన తన భార్యను తలచుకుని ఒక సుమంగళికి భోజనం పెట్టి , పసుపు , కుంకుమ , గాజులు , పూవులు , చీర , పెట్టి సత్కరించి పంపాలి.

చిన్న పిల్లలు చనిపోతే... వారికి పన్నెండవ రోజున మహాలయం పెట్టాలి. చిన్న పిల్లలు అంటే ఉపనయన వయస్సు (పది సంవత్సరములు) దాటనివారు. ఒకవేళ పది సంవత్సరముల వయస్సు లోపే ఉపనయనము జరిగి ఉంటే... ఆ పిల్లవాడు మరణించిన తిథినాడే మహాలయం పెట్టాలి.

ఇక ప్రమాదాలలో కానీ , ఉరిశిక్ష వల్ల కానీ , ఆత్మహత్య చేసుకుని మరణించిన వారికి ఘట చతుర్థినాడు అనగా అమావాస్య ముందురోజున పెట్టాలి.

*పితృకార్యాలు చేయకపోతే, ఏమవుతుంది?*

*స్వకులం పీడయేప్రేతః* 
*పరచ్ఛిద్రేణ పీడయేత్|*
 *జీవన్స దృశ్యతే స్నేహీ మృతో* 
*దుష్టత్వమాప్నుయాత్||* 
- గరుడ పురాణం

ఈ శ్లోకం అర్థం ప్రతి ఒక్కరూ ఒక పలక మీద వ్రాసి నిద్రలేవగానే కనిపించే విధంగా పెట్టుకోవాలి. 
గరుడ పురాణంలో శ్రీమహావిష్ణువు చెప్పిన సత్యం ఇది. 

కడుపులో పెట్టుకొని పెంచి పెద్దచేసి ప్రాణాలు పోయిన తరువాత కూడా ఇంటి చూరట్టుకొని వేళ్ళాడిన పితరులను నిర్లక్ష్యం చేసి వారికి ప్రేత రూపం విడిపించకపోతే ఏం జరుగుతుందో ఇందులో చెబుతున్నాడు.

"ప్రేత రూపం విడిపించని కులాన్ని (కులం = వంశం) పితరులే నాశనం చేస్తారు. అది తామే స్వయంగా చేయవచ్చు. లేదా శత్రువుల చేత చేయించవచ్చు. శరీరం ఉన్నప్పుడు నా వాళ్ళు అనుకొని ప్రేమతో సాకిన పితరులే, ప్రేత రూపం విడిపించకపోతే ఆగర్భశత్రువులుగా మారి పీడిస్తారు."
ప్రేతలు ఎవరెవరిని ఎలా బాధిస్తాయో విష్ణుమూర్తి గరుడునికి చెప్పాడు. ఆయన చెప్పిన దాన్ని బట్టీ మహాలయ పక్షాలు, తిస్రోష్టకాలు, అమావాస్య ప్రాధాన్యత తెలుసుకొని పితరులను అర్చించాలి.

వీలైతే ఈ మహాలయ పక్షాలలో ప్రతి రోజు పితృదేవతా స్తుతి పఠించాలి

*పితృ దోష నివారణ*

పితృ దోషం అంటే ఒక శాపం. గత జన్మ లో ఎవరైనా వృద్దులకు కాని, తల్లితండ్రులకు కాని కష్టం కలిగించి ఉంటె, లేదా వ్యక్తి కి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటె దానికి కారణం ఆ వ్యక్తీ యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి. పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన వారి తర్వాతి తరం వారు కష్టాల పాలవడం పితృ దోషాలకు గురికావడం జరుగుతుంది. జాతక చక్రం లో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు. పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి.

ఉదాహరణకి ముఖ్యమైన పనులు పూర్తీ కాక ముందే ఆటంకాలు , వైఫల్యాలు ఎదురుకోవడం, గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలగడం. కుటుంబం లో స్త్రీ కి చిన్న వయసు లో వైధవ్యం ప్రాప్తించడం, కుటుంబం లోని వ్యక్తికీ మానసిక స్థితి సమతుల్యత లేకుండా ఉండడం, ముఖ్యం గా సంతానా భాగ్యం లేక పోవడం, పుట్టిన సంతానం జీవించకపోవడం, సంతానం వలన తీవ్ర సమస్యలు వంటివి. ప్రతి మనిషీ తన జీవితం లో పితృఋణం తీర్చాలి. దీనివలన పితరులు తృప్తి చెందుతారు. వారికి ముక్తి లభిస్తుంది.

మృత్యువు తరువాత సంతానము వారి తండ్రి గారికి శ్రార్ధము చేయని ఎడల లేదా వారి జీవితావస్తను అనాదారణ చేసిన ఎడల పునర్ జన్మలో వారి కుండలిలో పితృ దోషము కలుగును.సర్ప హత్యా లేదా ఏదైనా నిరపరాదిని హత్య చేసినా కూడా పితృ దోషము కలుగును.

పితృ దోషమును నివారించుటకు నియమించ బడ్డ పితృ కార్యములు చేయవలెను యది మీకు సంభవము కాని ఎడల పితృ పక్షములో శ్రార్దము చేయవలెను. నియమిత కాకులకు మరియు కుక్కలకు బోజనము పెట్టవలెను. వట వృక్షమునకు నీరు పోయవలెను. భ్రాహ్మణులకు బోజనము పెట్టవలెను. గోవును పూజించవలెను. విష్ణువును పూజించుట లాభదాయకము.

*పితృ దేవతా స్తుతి*

శ్రాద్ధాదులలో, మహాలయ పక్షాలలో దీనిని పఠించితే పితరుల కృప లభిస్తుంది. పితృదేవతా విజ్ఞానంతో కూడిన ఈ స్తుతి ఇంట్లో ఉంటే చాలు – పితృకృప చేత ఆ యిల్లు ఆనందైశ్వర్య నిలయమవుతుంది. పుష్టికారకమైన ఈ స్తుతి శ్రాద్ధంలో భోక్తల ముందు చదవడం కూడా శ్రేష్ఠం. ఇది *’గరుడ మహాపురాణం’* లో చెప్పబడుతున్నది. ఇందులో అన్ని పితృగణాలు, వాటి విశేష రహస్యాలు చెప్పబడి ఉన్నాయి. దేవతల చేత కూడా ఆరాధింపబడే మహిమాన్వితులు పితృదేవతలు. వారి అనుగ్రహం వలన వంశవృద్ధి, ఐశ్వర్య క్షేమాలు సమకూరుతాయి.

🙏
నమస్యేహం పితౄన్ భక్త్యా యే వసన్త్యధిదైవతమ్!
దేవైరపి హి తర్ప్యన్తే యే శ్రాద్ధేయు స్వధోత్తరైః!!
నమస్యేహం పితౄన్ స్వర్గే యే తర్ప్యన్తే మహర్షిభిః!
శ్రాద్ధైర్మనోమయైర్భక్త్యా భుక్తిముక్తి మభీప్సుభిః!!
నమస్యేహం పితౄన్ సర్గే సిధాః సంతర్పయన్తియాన్!
శ్రాద్ధేషు దివ్యైః సకలైరుపహారైరనుత్తమైః!!
నమస్యేహం పితౄన్ భక్త్యా యోర్చ్యన్తే గుహ్యకైర్దివి!
తన్మయత్వేన వాంఛద్భి యుద్ధిమాత్యన్తికీం పరామ్!!
నమస్యేహం పితౄన్ మర్త్యై రర్చ్యన్తే భువియే సదా!
శ్రాద్ధేయు శ్రద్ధయాభీష్టలోక పుష్టి ప్రదాయినః!!
నమస్యేహం పితౄన్ యే వై తర్ప్యన్తేరణ్యవాసిభిః!
వన్యైః శ్రాద్ధైర్యతాహారైస్తపో నిర్ధూతకల్మషైః!!
నమస్యేహం పితౄన్ విప్రైర్నైష్ఠికైర్ధర్మచారిభిః!
యే సంయతాత్మభిర్నిత్యం సంతర్పన్తే సమాధిభిః!!
నమస్యేహం పితౄన్ శ్రాద్ధైః రాజన్యాస్తర్చయన్తియాన్!
కవ్యై రశేషైర్విధివల్లోకద్వయ ఫలప్రదమ్!!
నమస్యేహం పితౄన్ వైశ్యైరర్చ్యన్తే భువియే సదా!
స్వకర్మభి రతైర్నిత్యం పుష్పధూపాన్న వారిభిః!!
నమస్యేహం పితౄన్ శ్రాద్ధే శూద్రైరపి చ భక్తితః!
సంతర్ప్యన్తే జగత్కృత్స్నం నామ్నాఖ్యాతాః సుకాలినః!!
నమస్యేహం పితౄన్ శ్రాద్ధే పాతాళే యే మహాసురైః!
సంతర్ప్యన్తే సుధాహారా స్త్యక్త దర్పమదైః సదా!!
నమస్యేహం పితౄన్ శ్రాద్ధైః అర్చ్యన్తే యే రసాతలేః!
భోగైరశేషైర్విధివన్నాగైః కామానభీప్సుభిః!!
నమస్యేహం పితౄన్ శ్రాద్ధైః సర్పైః సంతర్పితాన్ సదా!
తత్రైవ విధివన్మహా భోగ సంపత్సమన్వితైః!!

పితౄన్నమస్యే నివసన్తి సాక్షాద్యే దేవలోకేధమహాతలేవా!
తధాన్తరిక్షేచ సురారి పూజ్యాస్తే వై ప్రతీచ్ఛన్తు మయోపధీతమ్!!
పితౄన్నమస్యే పరమార్థభూతా యే దై విమానే నివసన్త్యమూర్తాః!
యజన్తి యానన్తమలైర్మనోభి ర్యోగీశ్వరాః క్లేశవిముక్తి హేతూన్!!
పితౄన్నమస్యేదివి యే చ మూర్తాః స్వధాభుజః కామ్య ఫలాభినన్దౌ!
ప్రదానశక్తాః సకలేప్సితానాం విముక్తిదా యేనభిసంహితేషు!!
తృప్యన్తు తేస్మిన్పితరః సమస్తా ఇచ్ఛావతాం యే ప్రదిశన్తి కామాన్!
సురత్వమిన్ద్ర త్వ మితోధికం వా గజాశ్వరత్నాని మహాగృహాణి!!

సోమస్య యే రశ్మిషు యోర్కబింబే శుక్లౌ విమానే చ సదావసన్తి!
తృప్యన్తు తేస్మిన్పితరోన్నతోయైర్గన్ధాదినా పుష్టిమతో వ్రజన్తుః!!

యేషాం హుతేగ్నే హవిషాచ తృప్తిర్యే భుంజతే విప్రశరీరసంస్థాః!
యే పిండదానేన ముదం ప్రయాన్తి తృప్యన్తు తేస్మిన్పితరోన్నతోయైః!!
యే ఖడ్గ్మమాం సేన సురైరభీష్టైః కృష్ణైస్తిలైర్దివ్య మనోహరైశ్చ!
కాలేన శాకేన మహర్షివర్యైః సంప్రీణతాస్తే ముదమత్రయాస్తు!!
కన్యాన్య శేషాణి చ యాన్యభీష్టాన్యతీవ తేషాం మమ పూజితానాం!
తేషాం చ సాన్నిధ్య మిహాస్తు పుష్పగంధాంబు భ్యోజ్యేషు మయాకృతేషు!!

దినే దినే యే ప్రతిగృహ్ణతేర్చాం మాసాన్త పూజ్యా భువి యేష్టకాసు!
యే వత్సరాన్తేభ్యుదయే చ పూజ్యాః ప్రయాన్తు తేమే పితరోత్ర తుష్టిమ్!!
పూజ్యాద్విజానాం కుముదేన్దు భాసో యే క్షత్రియాణాం జ్వలనార్కవర్ణాః!|
తథా విశాం యే కనకావదాతా నీల ప్రభాః శూద్రజనస్య యేచ!!
తేస్మిన్సమస్తా మమ పుష్ప గంధధూపాంబు భోజ్యాది నివేదనేన!
తథాగ్ని హోమేన చయాన్తి తృప్తిం సదా పితృభ్యః ప్రణతోస్మి తేభ్యః!!
యే దేవ పూర్వాణ్యభితృప్తి హేతో రశ్నన్తి కవ్యాని శుభాహృతాని!
తృప్తాశ్చ యే భూతిసృజో భవన్తి తృప్యన్తు తేస్మిన్ ప్రణతోస్మి తేభ్యః!!

రక్షాంసి భూతాన్యసురాంస్తథోగ్రాన్ నిర్ణాశయన్తు త్వశివం ప్రజానామ్!
ఆద్యాః సురాణామమరేశ పుజ్యాస్తృప్యన్తు తేస్మిన్ ప్రణతోస్మితేభ్యః!!

అగ్నిష్వాత్తా బర్హిషద ఆజ్యపాః సోమపాస్తథా!
వ్రజన్తు తృప్తిం శ్రాద్ధేస్మిన్పితర స్తర్పితా మయా!!
అగ్నిష్వాత్తాః పితృగణాః ప్రాచీం రక్షన్తు మేదిశం!
తథా బర్హిషదః పాన్తు యామ్యాం మే పితరః సదా!!
ప్రతీచీ మాజ్యపాన్త ద్వదుదీచీమపి సోమపాః!
రక్షో భూతపిశాచే భ్యస్తథైవాసురదోషతః!!
సర్వతః పితరో రక్షాం కుర్వన్తు మమ నిత్యశః!
విశ్వో విశ్వ భుగారాధ్యో ధర్మో ధన్యః శుభాననః!!
భూతిదో భూతికృత్ భూతిః పితౄణాం యే గణానవ!!
కళ్యాణః కల్యదః కర్తా కల్యః కల్యతరాశ్రయః!
కల్యతా హేతురనఘః షడిమే తే గణాః స్మృతాః!!
వరో వరేణ్యో వరదస్తుష్టిదః పుష్టిదస్తథా!
విశ్వపాతా తథా ధాతా సప్తైతే చగణాః స్మృతాః!!
మహాన్మహాత్మా మహితో మహిమావాన్మహాబలః!
గణాః పంచ తథైవైతే పితౄణాం పాపనాశనాః!!

సుఖదో ధనదశ్చాన్యే ధర్మదోన్యశ్చ భూతిదః!
పితౄణాం కథ్యతే చైవ తథా గణ చతుష్టయమ్!!
ఏకత్రింశత్పితృగణా యేర్వ్యాప్త మఖిలం జగత్!
త ఏవాత్ర పితృగణాస్తుష్యన్తు చ మదాహితాత్!!

మార్కండేయ ఉవాచ
ఏవంతు స్తువతస్తస్య తేజసో రాశిర్రుచ్ఛ్రి తః!
ప్రాదుర్బభూవ సహసా గగనవ్యాప్తి కారకః!!
తద్ దృష్ట్వా సుమహత్తేజః సమాచ్ఛాద్య స్థితం జగత్!
జానుభ్యామవనీం గత్వా రుచిః స్తోత్రమిదం జగౌ!!

రుచిరువాచ
అర్చితానామమూర్తానాం పితౄణాం దీప్త తేజసామ్!
నమస్యామి సదా తేషాం ధ్యానినాం దివ్య చక్షుషామ్!!

ఇంద్రాదీనాం చ నేతారో దక్షమారీచ యోస్తథా!
సప్తర్షీణాం తథాన్యేషాం తాన్నమస్యామి కామదాన్!!

మన్వాదీనాం చ నేతారః సూర్యాచన్ద్ర మసోస్తధా!
తాన్నమస్యామ్యహం సర్వాన్ పితౄణప్యుదధావపి!!

నక్షత్రాణాం గ్రహాణాం చ వాయ్వగ్న్యోర్నభసస్తథా!
ద్యావాపృథివ్యోశ్చ తథా నమస్యామి కృతాంజలిః!

ప్రజాపతేః కశ్యపాయ సోమాయ వరుణాయ చ!
యోగేశ్వరేభ్యశ్చ సదా నమస్యామి కృతాంజలిః!!

నమో గణేభ్యః సప్తభ్య స్తథాలోకేషు సప్తషు!
స్వాయంభువే నమస్యామి బ్రహ్మణే యోగ చక్షుషే!!

సోమాధారాన్ పితృగణాన్ యోగిమూర్తిధరాం స్తథా!
నమస్యామి తధా సోమం పితరం జగతా మహమ్!!

అగ్నిరూపాం స్తథైవాన్యాన్నమస్యామి పితౄనహమ్!
అగ్నీషోమమయం విశ్వం యత ఏతదశేషతః!!

యే చ తేజసి యే చైతే సోమసూర్యాగ్ని మూర్తయః!
జగత్స్వరూపిణశ్చైవ తథా బ్రహ్మ స్వరూపిణః!!

తేభ్యోఖిలేభ్యో యోగిభ్యః పితృభ్యో యతమానసః!
నమో నమో నమస్తేస్తు ప్రసీదస్తు స్వధాభుజః!!

మార్కండేయ వువాచ
ఏవం స్తుతాస్తతస్తేన తేజసోమునిసత్తమాః!
నిశ్చక్రముస్తే పితరో భాసయన్తో దిశోదిశ!!

నివేదనం చ యత్తేన పుష్పగంధానులేపనం!
తద్భూషితానథ స తాన్ దదృశే పురతః స్థితాన్!!

ప్రణిపత్య రుచిర్భక్త్యా పునరేవ కృతాంజలిః!
నమస్తుభ్యం నమస్తుభ్యమిత్యాహ పృధగాద్రుతః!!

స్తోత్రేణానేనచ నరో యోస్మాం స్తోష్యతి భక్తితః!
తస్య తుష్టావయం భోగానాత్మజం ధ్యానముత్తమమ్!!

ఆయురారోగ్యమర్ధం చ పుత్ర పౌత్రాదికం తధా!
వాంఛద్భిః సతతం స్తవ్యాః స్తోత్రేణానేన వైయతః!

శ్రాద్ధేషు య ఇమం భక్త్యా త్వస్మత్ప్రీతి కరం స్తవమ్!
పఠిష్యతి ద్విజాన్మానాం భుంజతాం పురతః స్థితః!!

స్తోత్ర శ్రవణ సంప్రీత్యా సన్నిధానే పరే కృతే!
అస్మాభిరక్షయం శ్రాద్ధం తద్భవిష్యత్యసంశయమ్!!
యస్మిన్ గేహే లిఖిత మేతత్తిష్ఠతి నిత్యదా!
సన్నిధానం కృత్యౌ శ్రాద్ధౌత త్రాస్మాకం భవిష్యతి!!
తస్మాదేతత్త్వ యా శ్రాద్ధే విప్రాణాం భుంజతాం పురః!
శ్రవణీయం మహాభాగ అస్మాకం పుష్టికారకమ్!!

*(రుచి ప్రజాపతి చేసిన ఈ స్తోత్రం నిత్యం పఠించవచ్చు).*

*పితృదేవతా నమోస్తుతే*

Thursday, September 28, 2023

మూత్రం బిగించి మృత్యువుకి దగ్గర్లో ఉన్న రోగిని కాపాడే సిద్ద యోగం -


    కొండపిండి మొక్క సమూల చూర్ణం , చిన్న యాలుకల పొడి , శుద్ది చేసిన కర్పూర శిలాజిత్ పొడి , దోరగా వేయించిన పిప్పిళ్ళ పొడి సమభాగాలు గా కలిపి ఉంచి రెండు పూటలా పూటకు అర టీ స్పూన్ పొడి అర గ్లాస్ బియ్యం కడిగిన నీటిలో కలిపి తాగుతూ ఉంటే మూత్రం వెంటనే బయటకు వచ్చి చావుకి దగ్గరగా వెళ్లిన రోగి కూడా జీవించే అవకాశం ఉంది.

     తమలపాకులు కి ఆముదం రాసి మంట దగ్గర కొంచం వేడి చూపించి పొత్తి కడుపు మీద వేస్తే కొంచం సేపట్లో పొత్తికడుపు ఉబ్బు పోయి బంధించిన మూత్రం బయటకి వచ్చి రోగి ప్రాణాపాయం నుంచి బయటపడతాడు. 

 
    

Monday, September 25, 2023

స్పాండిలైటిస్ మరియు సయాటిక గురించి వివరణ -

స్పాండిలైటిస్ మరియు సయాటిక గురించి వివరణ - 

          ఈ రెండు సమస్యలు నేడు సర్వసాధారణం అయినవి . దీనికి ప్రధానకారణం మన ఆహారపు అలవాట్లు మరియు మనం చేయు ఒత్తిడితో కూడుకొనిన పనులు కూడా కారణమే . ఇవి శరీరము నందు పెరుగు వాతదోషము వలన కలుగును. 

       ఈ స్పాండిలైటిస్ లో మెడ వెనుక భాగములో గల C 2 , C 3 , C 4 డిస్క్ ల మధ్య ఖాళి ఏర్పడటం వలన నరం ఒత్తుకుపోయి ఈ సమస్య ప్రారంభం అగును. కొందరు తల పైకి ఎత్తలేరు . కొందరు తలను పక్కలకు సరిగా తిప్పలేరు . దీనికి కారణం వారి మెడ నరాలు , కండరాలు బిగుసుకొని పోతాయి . ఇంతకు ముందు చెప్పిన విధముగా నరము నొక్కుకొని పోయినప్పుడు నొప్పి మెడ నుంచి భుజాలకు మరియు చేతులకు కూడా పాకును . 

          సయాటిక నందు వెన్నుపాము చివర నొప్పి మొదలయ్యి కుడికాలు నందు గాని ఎడమకాలి చివర వరకు గాని నొప్పి ఉండును. ఈ నొప్పి తీవ్రత చాలా అధికంగా ఉండును. కదిలినప్పుడల్లా సూదులతో పొడుస్తున్నట్లు ఉంటుంది. వెన్నపాము నందలి L4 , L5 , S1 డిస్క్ ల మధ్య ఖాళి ఏర్పడి ఆ ఖాళి నందు నరం పడి నలగడం వలన ఈ సమస్య ఏర్పడును . 

              నేను ఈ రెండు సమస్యలకు చికిత్స చేస్తున్నప్పుడు గమనించిన విషయాలు ఏమిటంటే స్పాండిలైటిస్ వచ్చిన వారికి చిన్నగా కొంతకాలానికి సయాటిక కూడా వస్తుంది. సయాటిక వచ్చిన వారికి కొంతకాలానికి స్పాండిలైటిస్ వస్తుంది. సమస్య మొదలైనప్పుడు సరైన చికిత్స తీసుకోకున్న రెండు సమస్యలు చుట్టుముట్టును . మరొక్క ముఖ్యవిషయం ఈ రెండు సమస్యలు మొదలు ఒకవైపు మాత్రమే మొదలై చివరికి రెండోవైపు కూడా సమస్య మొదలగును . ఉదాహరణకు సయాటిక వెన్నుపాము చివర నుంచి మొదలు అయ్యి కుడికాలుకు వచ్చింది అనుకుందాం మనం మన శరీర బరువును ఎడమకాలి మీద వేసి నడవటం కాని నిలబడటం కాని చేస్తాము . ఇలా కొంతకాలానికి ఎడమ కాలికి కూడా నొప్పి ప్రారంభం అగును. ఇది అత్యంత తీవ్రమైన సమస్య . 

       అల్లోపతి వైద్యము నందు వైద్యులు దీనికి సర్జరి పరిష్కారంగా చెప్తారు. కాని కొంతకాలానికి మరలా సమస్య తిరగబెట్టడం నేను గమనించాను . ఆయుర్వేద వైద్య విధానంలో దీనికి అత్యంత అద్బుతమైన చికిత్సలు కలవు. 

     

Saturday, September 23, 2023

మన ప్రాచీన భారతీయ విజ్ఞానులు ఉపయోగించిన పుష్పకవిమానాల గురించి వివరణ -

మన ప్రాచీన భారతీయ విజ్ఞానులు ఉపయోగించిన పుష్పకవిమానాల గురించి వివరణ -

    ఈ ప్రపంచం లో ఎన్నో విచిత్రమైన , రహస్యమైన ప్రదేశాలు ఉన్నాయి. మనిషి ఈ ప్రపంచాన్ని జయించాను అని అనుకుంటున్నాడు. కాని ఇప్పటివరకు తెలుసుకున్నది ఒక్క శాతమే . వాటిలో ముఖ్యమైనది పుష్పకవిమానాలు . ప్రస్తుతం చాలా వీడియోలు మనకి అందుబాటులో ఉన్నాయి . కాని వాటి గురించి పూర్తి సమాచారం ఎవ్వరికి అందుబాటులో లేదు . నా పరిధిని అనుసరించి కొంతసమాచారం నేను సేకరించాను . అది ఇప్పుడు మీకు తెలియచేస్తాను.  

      ఒకనాటి భారతీయ చక్రవర్తి సామ్రాట్ అశోకుడు తొమ్మిది మంది గుర్తుతెలియని వ్యక్తులతో ఒక రహస్య విభాగాన్ని ఏర్పరిచాడు. ఇందులోని వ్యక్తుల అపర మేధావులు వీరి ప్రధాన విధి వివిధ రకాల శాస్త్రాలు శోధించి మధించడం . దీనికి ప్రధాన కారణం అంతకు ముందు జరిగిన యుద్ధాలలో జరిగిన దారుణ మారణహోమం , రక్తపుటేరులు చూసి మనస్సు చలించి బౌద్ధమతం స్వీకరించాడు . ఈ సమయంలో తను అంతకు ముందు నియమించిన రహస్య శాస్త్రవేత్తలు భారతీయ వేదాలు , ప్రాచీన గ్రంధాలు కాచివడబోసి రూపొందించిన ఆధునిక వైజ్ఞానిక సమాచారం బయటకి పొక్కితే దానిని యుద్ధం వంటి దుష్ప్రయోజనాలకి వాడతారేమో అని అశొకుడు భయపడ్డాడు . అందుకే రహస్య విభాగంలోని శాస్త్రవేత్తల కార్యకలాపాల్ని అత్యంత రహస్యముగా ఉంచాడు. 

         అశోకుడు నియమించిన ఈ తొమ్మిది మంది వ్యక్తులు తొమ్మిది వేరువేరు అమూల్యమైన గ్రంథాలు రచించారు. వాటిలో ఒక అద్బుత గ్రంథం " గురుత్వాకర్షణ శక్తి రహస్యాలు " దీని గురించి చరిత్రకారులు కు తెలుసు కాని వారు దాన్ని ఎప్పుడూ చూడలేదు . ఈ పుస్తకం ప్రధానంగా "గురుత్వాకర్షణ శక్తి నియంత్రణ" సమాచారం కలిగి ఉంటుంది. ఈ పుస్తకం ప్రపంచంలో ఎక్కడో ఒక రహస్య గ్రంధాలయంలో ఉంటుంది అని చరిత్రకారులు భావిస్తున్నారు .దీనికోసం చాలామంది రహస్యంగా ప్రయత్నిస్తున్నారు. ఈ గ్రంథం టిబెట్ లేదా భారతదేశంలో ఎక్కడైనా ఉండవచ్చు.  

          కొన్ని సంవత్సరాల క్రితం టిబెట్ లోని లాసాలో కొన్ని ప్రాచీన తాళపత్రాలు చైనీయులకు లభించాయి. అవి ప్రాచీన సంస్కృతంలో ఉన్నాయి . వాటిని అనువాద నిమిత్తం భారతదేశంలోని చండీగఢ్ విశ్వవిద్యాలయానికి పంపించారు. వాటిలో గ్రహాంతర అంతరిక్ష వాహనాల నిర్మాణానికి సంబంధించిన సూత్రాలు ఈ పత్రాలలో ఉన్నాయి అని చండీగఢ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తెలియచేసారు. 

           లాసాలో లభ్యమైన పత్రాలలో అంతరిక్ష వాహనాలను అస్థ్రాలుగా పేర్కొన్నారు . ప్రాచీన భారతీయులు సదరు వాహనాలలో కొందరు యోధులను ఇతర గ్రహాలకు పంపించి ఉండవచ్చు అని ఈ తాళపత్రాలను పరిశీలించిన డాక్టర్ రైనా తెలియజేసారు. అదృశ్య గ్రాహక శక్తికి పరాకాష్టగా చెప్పుకొనే "యాంటిమ" చిన్న వస్తువుని సైతం కొండంత బరువుగా మార్చే "గరిమ" , పెద్ద వస్తువుని సైతం బరువుతక్కువ గా చేయగల "లగిమ" రహస్యాలు కూడా ఈ ప్రాచీన తాళపత్రాలలో నిగూఢంగా ఉన్నాయి.

         చైనా ఈ తాళపత్ర గ్రంథాలు పంపినప్పుడు భారతీయ పరిశోధకులు అంత సీరియస్ గా తీసుకోలేదు . ఈ ప్రతుల్లోని కొంత డేటా తమ అంతరిక్ష పరిశోధనల్లో చేరుస్తున్నాం అని చైనా ప్రకటించడంతో అప్పుడు ఆ పత్రాల విలువ భారతీయ పరిశోధకులకు తెలిసివచ్చింది . యాంటి గ్రావిటీ గురించి పరిశోధిస్తున్నాం అని ఒక ప్రభుత్వం ప్రకటించడం ఇదే తొలిసారి .

          గ్రహాంతర ప్రయాణం అంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా అని ప్రాచీన తాళపత్రాలు లో అంత వివరంగా లేదు . కాని మొత్తంమీద చూస్తే చంద్రుడిపైకి మాత్రం ఒకసారి యాత్ర జరిగినట్టు వివరిస్తున్నాయి . భారతీయ ప్రాచీన కావ్యం అయిన రామాయణంలో ఒక విమానంతో చంద్రుడి పైకి అంతరిక్ష యాత్ర చేసినట్టు ఉంది . రావణుని మరణం తప్పించడం కోసం మండోదరి అమృత బాండాన్ని చంద్రుడి పైకి వెళ్లి సాధించుకొని వచ్చి రావణుడికి కూడా తెలియకుండా విభీషణుని సహాయంతో రావణుని ఉదరభాగంలో ప్రతిష్టించింది . ఇది రామాయణంలో నేను కూడా చదివాను. 

           నిజానికి ఈ పత్రాలు భారతీయులు ఉపయోగించిన యాంటీ గ్రావిటీ , ఏరోస్పేస్ టెక్నాలజీ కి సంబంధించిన ఇటీవల లభ్యమైన చాలా స్వల్పమైన సాక్ష్యాధారాలు మాత్రమే . వారి పూర్తిపరిజ్ఞాన్ని మనం అర్ధం చేసుకోవాలి అంటే మనం కాలచక్రంలో చాలా వెనకకి వెళ్లవలిసిందే . 

            ఉత్తర భారతదేశం ,పాకిస్తాన్ లో ఉండేది అని చెబుతున్న "రామరాజ్యం" పదిహేను వేల సంవత్సరాల క్రితం భారత ఉపఖండంలో వికాసం చెందింది. ఈ రాజ్యంలో చాలా పెద్ద ఆధునిక నగరాలు ఉండేవి. వీటిలో చాలామటుకు నగరాలను పాకిస్తాన్ , ఉత్తరపశ్చిమ భారత ఎడారుల్లో ఇంకా కనుగొనవలసి ఉంది. అట్లాంటిక్ మహాసముద్రం మద్యభాగంలో "అట్లాంటియన్ " నాగరికత విలసిల్లిన సమయంలో ఇక్కడ భరత ఖండంలో రాముడు రాజ్యం చేసాడు .రామరాజ్యంలోని గొప్ప నగరాలు మన పురాణాల్లో "సప్తఋషి" నగరాలుగా ప్రసిద్ది చెందాయి. ఈ నగరాల్లో నివసించే ప్రజలు విమానాలుగా పిలిచే యంత్ర వాహనాలు ఉపయోగించే వారని ప్రాచీన బారతీయ గ్రంథాలలో ఉన్నది . భారతీయ పురాణాలు విమానాన్ని అంతర్గత నిర్మాణంలో రెండు అంతస్తులు , పైభాగాన గుమ్మటం ( డోము ) బయట చుట్టూరా రంధ్రాలు ఉండే వృత్తాకార వాహనంగా తెలియచేశాయి .   

           ఈ విమానం అనేది వాయువేగంతో గగనతలంలోకి దూసుకెళ్తూ ఇంపుగా ఉండే హృద్యమైన శబ్దాన్ని వెలువరించేది అని ఆ గ్రంథాలలో పేర్కొనబడినది. అప్పట్లో కనీసం నాలుగు రకాల విమానాలు ఉండేవి . ఈ విమానాల్ని తయారుచేసిన ప్రాచీన భారతీయులు ఆ విమానాలని ఎలా నడపాలో ఫ్లైట్ మాన్యువల్స్ కూడా రూపొందించారు. ఈ విమానాల్లో కొన్ని సాసర్ ఆకారంలో మరికొన్ని సిగిరెట్ ఆకారం లో నిలువుగా కూడా ఉండేవి . 

        విమాన వాయు ప్రయాణం పైన సంపూర్ణంగా వివరించిన అత్యంత ప్రాచీన గ్రంథం "సమరసూత్రధార" ఈ గ్రంధంలో విమానం తయారి , అది బయలుదేరే తీరు , వేలాది మైళ్ళు ప్రయాణించుటకు కావలిసిన వివరాలు , బలవంతంగా దానిని కిందకి దించే విధానం , ఆఖరికి ప్రయాణ సమయంలో పక్షులతో ఢీకొట్టటానికి ఉన్న అవకాశాలతో సహా ప్రతి విషయాన్ని విశదపరిచే 230 శ్లోకాలు ఈ గ్రంధరాజంలో ఉన్నాయి. 

         క్రీస్తు పూర్వం 4 వ శతాబ్దంలో భరద్వాజ మహర్షి రాసిన అద్బుత గ్రంథం "భరద్వాజ వైమానిక శాస్త్రం" ఈ గ్రంధాన్ని 1875 వ సంవత్సరం లో ఒక ఆలయంలో కనుగొన్నారు. విమానాల పనితీరుపైన ఇందులో చాలా ఆసక్త్తికరమైన ముఖ్యవిషయాలు ఉన్నాయి . విమానాన్ని ఎలా నడపాలి , దూరప్రాంతానికి ప్రయాణించేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి హఠాత్తుగా విరుచుకుపడే పిడుగులు , మెరుపులు నుంచి విమానాన్ని ఎలా రక్షించుకోవాలి వంటి ముఖ్యవిషయాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. 

                  భరద్వాజ మహర్షి రాసిన వైమానిక శాస్త్రం అనే గ్రంథంలో చాలా వివరాలు విపులంగా రాసి ఉన్నాయి . విమానం నడిపేటప్పుడు ఇంధనం ఉపయోగించి మాత్రమే కాకుండా మరోక ఉచిత ఇంధన వనరుని కూడా ఉపయోగించుకోవడం పై విస్కృత సూచనలు ఉన్నాయి . బహుశా ఆ ఉచిత ఇంధనవనరు యాంటి గ్రావిటి కావొచ్చు అని పరిశోధకుల అభిప్రాయం . ఇదే వైమానిక శాస్త్రంలో ఇంధనం నుంచి సౌరశక్తి ఉపయోగించి విమానం నడపడం గురించి కూడా సూచనలు ఉన్నాయి . 

        "వైమానిక శాస్త్ర " లో నిప్పంటుకోని,విరగని సామగ్రి , పరికరాలతో సహా మూడు రకాల విమానాల వర్ణనలు , బొమ్మలతో కూడిన ఎనిమిది అధ్యాయాలు ఉన్నాయి . ఈ వాయువాహనాల్లో ని 31 ప్రధాన భాగాలను , వాటి తయారీకి ఉపయోగించే 16 పదార్థాలు , సామాన్లను కూడా ఈ శాస్త్రం వివరిస్తుంది. ప్రధాన భాగాల తయారికి ఉపకరించే సామాన్లు , పదార్థాలు వేడిమికి , మంటలకు తట్టుకునే కోవకి చెందినవి అని అందుకే విమాన తయారీలో ఈ పదార్థాలు వాడాలి అని స్పష్టంగా సూచించాడు . 

          ఈ విమానాలు ఒక రకమైన యాంటి గ్రావిటీ తో పనిచేస్తాయి అనేందుకు ఎటువంటి సందేహాలు అక్కరలేదు అని చెప్పుకోవచ్చు. విమానాలు నిలువుగా గాలిలో లేచేవి . ప్రాచీన కాలంలో గగనవిహారం పైన దాదాపు 70 మంది సాధికార వ్యక్తులు , 10 మంది నిపుణులను భరద్వాజ మహర్షి తన గ్రంథంలో ప్రస్తావించారు.కాని వారు లిఖించిన గ్రంథాలు ప్రస్తుతం లభించడం లేదు . 

         విమానాలని విమానగృహాలుగా చెప్పబడే వాటిలో భద్రపరచేవారు. విమానాలను కొన్నిసార్లు పసుపుఛాయతో ఉండే తెల్లనిద్రవంతో మరికొన్నిసార్లు ఒకరకమైన పాదరస సమ్మేళనంతో నడిపేవారు అని తెలుస్తుంది . ఈ ఇంధనం విషయంలో చాలమంది పరిశోధకులు సరైన అవగాహనకి రాలేకపోయారు . ఈ విమానాలలో ఈ ప్రత్యేక ఇంధనం ఉపయొగించుటకు పల్స్ జెట్ ఇంజిన్ లను తయారుచేసి ఉంటారు .

          ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నాజీలు తమ V -8 "బజ్ బాంబులు" కోసం మొట్టమొదటిసారిగా పల్స్ జెట్ ఇంజిన్ లను తయారుచేశారు . ప్రాచీన భారతావని , టిబెట్ అంటే నాజీలు , వారి అధినాయకుడైన హిట్లర్ కు పడిచచ్చేంత ఆసక్తి చూపేవారు . ఈ దేశాల్లోని ప్రజలు ప్రాచీన కాలంలోనే మంచి వైమానిక పరిజ్ఞానం సాధించారు అని హిట్లర్ కి నమ్మకం . 

            ప్రాచీన భారతావని మరియు టిబెట్ లోని ప్రాచీనులు మంచి వైమానిక పరిజ్ఞానాన్ని సాధించారు అని హిట్లర్ కి అత్యంత గాఢ విశ్వాసం . ఈ నమ్మకంతోనే అందుకు కావలసిన "రహస్య సాక్ష్యాధారాలు" కోసం వాటిని సేకరించడానికి 30 వ దశకం మొదలుకొని ప్రతి ఏడాది ఈ రెండు దేశాలకు రహస్యంగా ప్రతినిధి బృందాలను పంపేవాడు.

         మహాభారతంలోని ద్రోణ పర్వంలో మరియు రామాయణంలో ఒక విమానాన్ని వర్ణించిన తీరు ఈ విధంగా ఉన్నది. విమానం గుండ్రంగా ఉన్నది. పాదరసం వెలువరించే శక్తితో అది గొప్ప వాయువేగంతో దూసుకెళ్లేది చోధకుడు దానిని అన్నివైపులా తిప్పగలిగేలా ఉండేది . మరో ప్రాచీన గ్రంథం "సమర" లో లో పేర్కొన్న విమానాలు ఇనుముతో చక్కగా చేసినవి . వెనుక భాగంలో మండే అగ్నికీలల్ని వెలువరిస్తూ మండే పాదరసం నుంచి వెలువడే శక్తితో పనిచేసేవి అని రాయబడి ఉన్నది. 

      " సమరాంగణ సూత్రధార " ఈ వాహానాలని ఎలా నిర్మించారో వర్ణించింది. పాదరసానికి విమాన చోదనకు మధ్య ఏదో బలీయమైన సంభంధం ఉన్నది. నేను చదివిన ఒక తాంత్రిక గ్రంథంలో కోడిగుడ్డులో పాదరసం నింపి ఎండలో ఉంచిన అది గాలిలో ఎగురును అని రాసి ఉన్నది.

      సోవియట్ పరిశోధకులు తుర్కుమెనిస్థాన్ మరియు గోబీ ఎడారులలో గల ప్రాచీన గుహల్లో కొన్ని అపూర్వమైన పరికరాలు కనుగొన్నారు . వాటిని పూర్తిగా పరిశీలించినప్పుడు అవి ఎగిరే వాహనాలలో ఉపయోగించేవిగా నిర్ధారణ అయ్యింది . ఈ పరికరాలు గాజు మరియు పోర్సోలిన్ తో తయారుచేసిన అర్ధగోళాలు వీటిచివర్లు మొనదేలి ఉన్నాయి . లోపల కొన్నిచుక్కల పాదరసం లభించింది. 

        రామరాజ్యంలో సప్తఋషి నగరాలలో ఒకటిగా భావిస్తున్న మొహంజదారో కనుగొన్న లిపి వంటిదే ప్రపంచంలో మరో ప్రాంతంలో కూడా లభ్యం అయ్యింది .కాని ఆ లిపి యొక్క అర్థం ఇప్పటివరకు కనుగొనలేకపోయారు. మొహంజదారోలో లిపిని పోలిన లిపి లభించిన ప్రాంతం ఈస్టర్ ఐలాండ్ ఇక్కడ ఈ లిపి ని రాంగో లిపి అంటారు. ఈ రెండు లిపిలకు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి.

   భవభతి రచించిన మహావీర ప్రాచీన పతులు అనే గ్రంథం ఎనిమిదోవ శతాబ్దం నాటిది . ఈ గ్రంథంలో అయోధ్య ప్రాంతంలోని ఒక విమానం గురించి విపులంగా ఉన్నది. అదే విధంగా వేదాలు కూడా ఈ విమానాల గురించి వాటిలో ఉండే రకాలు ఆకారాలు గురించి ఎన్నో విషయాలు తెలియచేశాయి . అట్లాటిస్ మరియు రామరాజ్యం మధ్య జరిగిన ఎన్నో భయంకర యుద్ధాలు గురించి చాలా చక్కగా వివరణ ఉన్నది. 

              భారతీయ వేదాలు అత్యంత ప్రాచీన ప్రతులుగా పేరుగాంచాయి. ఇవి హిందూ ప్రాచీన శ్లోకాల మణిహారాలు . ఇవి వివిధ ఆకారాల్లో , పరిమాణాల్లో ఉన్న విమానాల గురించి పలురకాలుగా వివరించాయి.  

      "అగ్నిహోత్ర విమానం" రెండు ఇంజన్ల తో ఉంటుంది. "గజవిమానం" అనేక ఇంజన్లతో ఉంటుంది. దురదృష్టవశాత్తు ఈ విమానాల్ని యుద్ధాలకొరకు ఉపయోగించారు అట్లాంటిస్ నగర వాసులు ఉపయోగించిన విమానాల కంటే ప్రాచీన భారతీయులు ఉపయోగించిన విమానాలు శక్తివంతం అయినవి. పరిశోధకుల అబిప్రాయం ప్రకారం ఇవి 80,000 హార్స్ పవర్ శక్తితో నడిచేవి . 

        పది నుంచి పన్నెండువేల సంవత్సరాల క్రితం అట్లాంటిస్ మరియు రామరాజ్యం మధ్య జరిగిన భయంకర సంగ్రామం గురించి ప్రాచీన భారతీయ గ్రంథాలలో విపులంగా ఉన్నది. ఆనాటి యుద్ధంలో భయంకరమైన విద్వంసక ఆయుధాలు ఉపయోగించారు . వాటిలో అప్పుడు జరిగిన యుద్దం గురించి ఈ విధంగా వివరణ ఉన్నది. 

      " ప్రయోగించిన ఆయుధం విశ్వమంతటి శక్తిని నింపుకొని ఉన్నది. కొన్ని క్షణాల తరువాత ఎక్కడ చూసినా మేఘాలుని ఆవరించిన పొగ ...ఒక్కసారిగా వేయి సూర్యబింబాలు ఉదయించినట్టుగా జ్వాలవంతమైన వెలుగులతో నిండిన అగ్నికీలలు ...మహోగ్రమైన ఉరుముల గర్జన బ్రహ్మన్దమైన మృత్యుసందేశ వాణి ఇవన్ని కలిసి అంధకుల జాతి సమస్తాన్ని సమూలంగా తుడిచిపెట్టాయి " .

       పంటలు మంటల్లో గుర్తుపట్టలేనంతగా మండిపోయాయి. మట్టివస్తువులు ,ఇళ్లు తునాతునకలు అయ్యాయి మిన్ను మన్ను ఏకమైపోయాయి. పక్షులు తెల్లటి రంగులో మారిపోయాయి. కొన్ని గంటల తరువాత ఆహారపదార్థాలు అన్ని ఆ ప్రళయ బీభత్సానికి గురిఅయ్యాయి. దానిబారి నుంచి రక్షించుకొనుట కొరకు , తమ దేహాలు , ఆయుధాలు, వస్తుసామాగ్రి శుభ్రపరచుకోవడం కొరకు సైనికులు మడుగులు , కాలువల్లోకి దూకారు . ఇది అంతా చూస్తుంటే మహాభారతం అణు యుద్ధాన్ని గురించి వివరిస్తున్నట్టుగా ఉన్నది. 

        గత శతాబ్దంలో పురాతత్వ శాస్త్రవేత్తలు మహేంజదారో నగరంలో తవ్వకాలు జరిపినప్పుడు ఏదో విలయం హఠాత్తుగా విరుచుకుపడి విధ్వంసం సృష్టించింది అన్నట్టుగా ఆ నగరం వీధుల్లో చెల్లాచెదురుగా పడిఉన్న అస్థిపంజరాలు కనిపించాయి. ఆ అస్థిపంజరాలలో కొన్నిటికి చేతులు ముడుచుకొని ఉండటం గమనించారు. వాటిని పరీక్షించినప్పుడు ఈ భూమ్మీద ఇప్పటివరకు కనుగొన్న అత్యంత ఎక్కువ రేడియో ధార్మిక ప్రభావానికి గురి అయ్యినట్టుగా తేల్చారు. ఇటుకలు, గాజు కరిగి ముద్దలా పడివున్నాయి . ఒకరకంగా చెప్పాలి అంటే హిరోషిమా , నాగసాకి నగరాల మీద ప్రయోగించిన అణుబాంబులు కంటే కూడా శక్తివంతమైన అణుబాంబుల ప్రయోగం జరిగింది.ఇలాంటి పరిస్థితుల గల నగరాలు ప్రాన్స్ , టర్కీ , స్కాట్లాండ్ దేశాలలో కూడా కనిపించాయి . 

      మహేంజదారో వీధులలో గాజు గోళాల వంటి నల్లటి పదార్థం పెద్దమొత్తంలో పేరుకొనిపోయింది. వీటిని పరిశీలించగా అత్యంత వేడిమిదగ్గర కరిగిన మట్టికుండలు అని తేలింది . ఇక్కడ ఇంకొ ఆసక్తికరమైన అంశం ఇంకొకటి ఉన్నది . మహాసామ్రాజ్య అధినేత అలెగ్జాండర్ రెండువేల సంవత్సరాల క్రితం భారతదేశం పైన దండయాత్రకు వచ్చినపుడు అలెగ్జాండర్ సైన్యం పైన పళ్లెం వంటి ఆకారాలు కలిగిన వాయువాహనాలు విరుచుకుపడ్డాయి అని కాని ప్రమాదకర ఆయుధాలు ప్రయోగించలేదని గ్రీకు చరిత్రకారుల తమ గ్రంథాలలో రాశారు. 

        ఆధునిక పరిశోదకుల అబిప్రాయం ప్రకారం ఈ ప్రాచీన విమానాలు అంతరించలేదు అని వాటిని కొన్ని ప్రత్యేకమైన రహస్య ప్రదేశాలలో ఉంచి వాటిని కొన్ని రహస్య సంఘాలలో సభ్యులు కాపలాగా ఉంటున్నారు అని భావిస్తున్నారు. పశ్చిమ చైనా దేశంలోని లాపనార్ ఎడారి ఈ విమానాలకు మిస్టరీ ప్రదేశంగా ఉన్నది . బహుశా ఈ ఎడారిలోనే చాలా విమానాలని రహస్యంగా దాచి ఉంచారు అని చెప్పుకుంటారు. 

  
   

భూచక్రగడ్డ విశేషాలు -

భూచక్రగడ్డ విశేషాలు -

       సకల చరాచర సృష్టికి ఆధారభూతమైన ఈ భూమి మీద ఎన్నో వింతలు , విశేషాలు ఉన్నాయి. అవి నిగూఢముగా ఉన్నాయి. వాటిలో వృక్షజాతిలో ఎన్నో విచిత్రాలు కలవు. నేను ఛత్తీస్ గడ్ అడవులలో వెదురుబొంగులు కొట్టిన తరువాత భూమి యందు ఉండు బొంగు ముక్క నుంచి తెల్లటి వెలుగు రావటం గమనించాను. అలా కొన్ని ప్రదేశాలలో మాత్రమే కనిపించింది. సూర్యోదయం అయ్యేప్పుడు పూర్తిగా సూర్యునివైపు తిరిగే చెట్లు ఉన్నాయి అని అక్కడి కొండజాతివారు చెప్పారు . వారి వైద్యవిధానం కూడా బహుచిత్రంగా ఉన్నది. చెయ్యి విరిగినవారికి కేవలం మూడురోజుల్లో చెయ్యి ఎముక అతుక్కునే విధంగా చెయ్యగలరు. వారు ఉపయోగించే మొక్కని మాత్రం నాకు చూపించలేదు. నా కాలుకి దెబ్బతగిలి రక్తం పోతున్నప్పుడు వెంటనే అక్కడ ఉన్న వెదురుబొంగు పైన పచ్చరంగులో ఉన్నది చాకుతో గీకి మెత్తటి చూర్ణం చేసి దానికి సున్నం కలిపి నా గాయం పైన చల్లి అద్దడం జరిగింది.వెంటనే రక్తస్రావం ఆగిపోయింది. ఆ తరువాత ప్రతినిత్యం దానిపైన వేయుటకు మరికొంత చూర్ణం ఇచ్చారు . ప్రతినిత్యం ఉదయం , సాయంత్రం దానిపైన చల్లడం వలన అది ఒక చెక్కు మాదిరి గట్టిగా అయ్యి గాయం నయం అయ్యాక ఊడి వచ్చింది. అక్కడివారు చెప్పినదాని ప్రకారం గాయం అయినపుడు ఎటువంటి ఇంజెక్షన్స్ తీసుకోరు. కేవలం దీనితోనే వారు ఎటువంటి గాయాన్ని అయినా మాన్పుకుంటారు. ఇదంతా మీకు చెప్పడానికి ప్రధాన కారణం ఎమిటంటే ప్రకృతిలోని వృక్షజాతుల్లో అంత గొప్ప ఔషధవిలువలు ఉన్నాయి. 

          ఇలాంటి వృక్షవిచిత్రాలలో ఒకటైన భూచక్రగడ్డ గురించి మీకు వివరిస్తాను. ఇప్పుడు రహదారుల పక్కన భూచక్రగడ్డ పేరు చెప్పి అడివి లో దొరికే కొన్ని గడ్డలను అమ్ముతున్నారు. అసలైన భూచక్రగడ్డ అనేది పాత ఎద్దులబండి చక్రం అంత వెడల్పుగా ఉంటుంది. ఇది అత్యంత దట్టమైన కీకారణ్యాలలో మాత్రమే లభించును. కొన్ని చోట్ల ఈతచెట్ల కింద అత్యంత అరుదుగా ఉంటుంది. ఇది ఏ వృక్షం కింద అయితే ఉంటుందో ఆ వృక్షం పైన బంగారు రంగులో ఒక తీగ అల్లుకుని ఉంటుంది. భూమిలో ఉన్న గడ్డకు చెట్టు పైన ఉన్న తీగకు మధ్య ఎటువంటి సంబంధం ఉండదు. ఆ రెండు గొప్ప అయస్కాంత శక్తితో సంబంధం ఏర్పరచుకొని ఉంటాయి. 

             భూమిలో గడ్డ ఉన్న ప్రదేశాన్ని సరిగ్గా గుర్తించుటకు ఆ ప్రదేశం మొత్తం రెల్లుగడ్డి పరిచి నిప్పు అంటించండి. కేవలం గడ్డ ఉన్న ప్రదేశంలో రెల్లుగడ్డి ఏ మాత్రం చెక్కుచెదరదు. మిగిలిన గడ్డి కాలిపోవును. కాలని ప్రదేశం ఉన్న భాగం అంతా ఆ గడ్డ ఉన్నది అని నిర్ధారించుకొని ఆ ప్రదేశాన్ని శుభ్రపరచి ఇష్టదైవాన్ని ప్రార్ధించి చాలా జాగ్రత్తగా తవ్వడం ప్రారంభించాలి . ఇది అత్యంత జాగ్రత్తగా చెయ్యవలసిన పని. తవ్వే సమయంలో ఏ మాత్రం భూమి అదిరినను ఆ గడ్డ ఆ ప్రదేశం నుంచి జరిగిపోవును. కావున అత్యంత జాగ్రత్తగా చెయ్యవలసిన పని.

           ఈ గడ్డ లభించడం అంటే అమృతం లభించడంతో సమానం . ఈ గడ్డ మందం 4 అంగుళాల నుండి 20 అంగుళాల వరకు ఉంటుంది. ఇది తీపిగాను మరియు వగరు , చిరుచేదు మిశ్రమముగా ఉండును. దీని మోతాదు 30 గ్రాముల ముక్క తిని స్వదేశీ ఆవుపాలు తాగవలెను. దీనిని జాగ్రత్తగా నిలువచేసికొని మండలం (40 ) రోజులపాటు వాడిన శరీరము నందలి సర్వరోగములు నివారణ అగును. దేహము అత్యంత కాంతివంతం అయ్యి బంగారు రంగులో మారును . నరములు శక్తిమంతం అయ్యి మెదడుకు అమితమైన బలం కలిగి ఏకసంథాగ్రాహి అవుతాడు. ముసలితనాన్ని పోగొట్టగల శక్తి దీనికి ఉన్నది. దీనిని ఆయుర్వేదంలో " కాయసిద్ది " అని పిలుస్తారు . దీర్గాయుష్షును ప్రసాదించును.

        పైన చెప్పినవన్నీ అసలయిన భూచక్రగడ్డని సాధించి వాడినప్పుడు మాత్రమే కలుగుతాయి.

   
   

మలేరియా జ్వరమునకు తులసితో చికిత్స -

మలేరియా జ్వరమునకు తులసితో చికిత్స -

      మలేరియా జ్వరం వర్షాకాలం నందు విపరీతంగా వ్యాప్తి చెందును. ఇది ఇప్పుడు సర్వసాధారణం అయినది. దీనికి ఇతర వైద్యులు "క్యూనైన్ "మందుగా వాడటం జరుగుతుంది. దీనిచే జ్వరం తగ్గును. కానీ తలనొప్పి , చెవులలో హోరుమను శబ్దం , తలతిరుగుట , చెవుడు మొదలుకొని హృదయసంబంధ కాంప్లికేషన్స్ అగుపిస్తున్నాయి. మన ఆయుర్వేద వైద్యం నందు తులసితో ఎటువంటి సైడ్ ఎఫక్ట్స్ లేకుండా ఈ జ్వరాన్ని సులభంగా నివారించవచ్చు. 

  నివారణోపాయాలు - 

 * 7 మిరియాలు , 7 తులసి ఆకులు కలిపి నమిలి మ్రింగుచున్న మలేరియా జ్వరం 3 రోజులలో హరించును . 

 * మానిపసుపు , పిప్పిళ్ళు , వెల్లుల్లి , జీలకర్ర , శొంఠి , తులసి , నారింజ పిందెలు , వావిలి వ్రేళ్ళు , ఆకుపత్రి వీటిని సమాన భాగాలుగా కలిపి చూర్ణించి పూటకు అరతులం వంతున ఇచ్చుచున్న చలిజ్వరములు తగ్గును. 

 * తులసి ఆకులు 60 గ్రా , కొద్దిగా మందార పుష్పదళములు , కొద్దిగా ఉమ్మెత్త పుష్పదళములు , మిరియాలు 10 గ్రా , కొద్దిగా నీరువేసి మర్దించి బఠాణి గింజంత పరిమాణంతో మాత్రలు చేసి చలిజ్వరం వచ్చుటకు గంట ముందుగా రెండు మాత్రలు తీసుకున్న చలిజ్వరం రాకుండానే పోవును.అలాగే రొజు మార్చి రొజు వచ్చు మలేరియా జ్వరం లందు మంచి ఫలితాన్ని ఇచ్చును . 

 * మలేరియా జ్వరం మొండిగా ప్రతిసంవత్సరం వస్తూనే ఉండిన తులసీదళములు , మిరియాలు నీటిలో వేసి ఉడికించిన కషాయములో కొద్దిగా బెల్లం , నిమ్మరసం కలిపి వేడిగా ఉన్నప్పుడే కాఫీ వలే తాగి రగ్గు కప్పుకొని పడుకోవలెను . ఇలా మూడు గంటలకు ఒకమారు చేయుచుండిన మంచి ఫలితం ఉండును. 

 * తులసి వ్రేళ్ళ కాషాయం త్రాపిన బాగుగా చెమటపట్టి చలిజ్వరం వెంటనే తగ్గును. 

 * మలేరియా జ్వరం ప్రతిసంవత్సరం భాదించుచున్న వ్యక్తికీ తులసిరసం , పుదీనా రసం , అల్లం రసం ఒక్కొక్కటి 5 గ్రాముల వంతున కలిపి తాగుచున్న మంచి ఫలితం కనిపించును.

  గమనిక - 

      తులసి చెట్టు వైద్యం కొరకు కుండీలలో ఇంట్లో పెంచుకొనుట చాలా మంచిది.

  నా అనుభవం - 

         ప్రతిరోజు 2 స్పూన్స్ తులసి రసం ఇచ్చి టాబ్లెట్ లేకుండా రక్తపోటు 170 నుంచి 130 కి తీసుకొనివచ్చాను కేవలం 2 వారాలలోనే ఇలా కొంతకాలం తులసిరసం వాడటం వలన రక్తపోటు పూర్తిగా పోతుంది. 

   
         

సటికా వ్రుక్షాయుర్వేధం - ప్రాచీన వృక్ష వైద్య గ్రంధం .

సటికా వ్రుక్షాయుర్వేధం - ప్రాచీన వృక్ష వైద్య గ్రంధం .

 * వృక్ష జాతులు అనగా తిన్త్రిని మామిడి మొదలగు చెట్లు ను తీగలుగా మార్చుట 

  బియ్యపు పొడి 1 భాగము , మినుముల 1 బాగము , నలగ దంచిన వడ్ల పిండి 1 భాగము , నువ్వుల పిండి 1 భాగము, వీటిని మాంసము కడిగిన నీళ్లలో కడిగి పసుపు పొడి పోగవేసి పాటి మట్టి నేలలో నాటితే అవి తీగలుగా మారును.

 * చెట్లు అప్పటికి అప్పుడే పెరిగి చిగుర్చుట - 

 అంకోల తైలము లొ యే చెట్టు యెక్క బీజములు నైనా నూరు మాట్లు తడిపి వడగండ్లతో కలిపి పాటిమట్టి లొ నాటితే అప్పటికప్పుడే చెట్టు మొలిచి పండ్లు, పువ్వులు ఇచ్చును.

 * బీజములు తొందరగా మొలుచుటకు - 

  ఆయా పండ్లు కాచే సమయమున వాటి విత్తనాలు సేకరించి వాటిని బాగుగా ఎండించి పాలలో తడిపి అయిదు దినములు ఎండనించి వాయు లవంగాల కషాయముతో కలిసిన నేతితో పోగవేసి పంచాంగం, బృహతి, నిప్పుల బూడిద ను పాలలొ కలిపి ఆ విత్తనాలను దీనితో పిసికి ఆ ప్రకారము అయిదు రోజులు అయిన పిమ్మట ఆ బీజములు ఆవు పేడతో , ఆవు మూత్రములో ఒక్కో దినము నానబెట్టి విత్తిన మొక్కలు తొందరగా మొలుచును . 
  
 * చెట్లకు విపరీతముగా పువ్వులు , పండ్లు కాచుటకు - 
 
  చేప మాంసమును , ఆవు పేడతో కలిపి చెట్లకు వేసి యావలు, నువ్వులు , మిణుములు, పెసలు, వులవులు ఈ ఐదింటిని సమబాగాలుగా కలిపి నీళ్లు పోసి వుడకపెట్టి ఆ నీళ్లు చల్లార్చి రెండు దినములు వరసగా చెట్లకు చల్లితే చెట్లు విశేషముగా ఫలించును. 

  మామిడి చెట్లకు నక్క మాంసం , ఉడుము మాంసం లేదా లేడి, పంది మాంసం , రావి చిగుల్లు, మర్రి చిగుల్లు , అత్తి చిగుల్లు, మామిడి చిగుల్లు, నేరేడు చిగుల్లు, కషాయం పెట్టి చల్లార్చి పాదులో పొసిన మంచి పండ్లు పండును. 
 
  మామిడి చెట్టు వేరు దగ్గర చుట్టు గొడ్డలితో కొంచం కాటు చేసి కషాయం పొసిన విశేషమైన ఫలములు ఇచ్చును.

   పెసలు , మినుములు ఉడక పెట్టి చల్లార్చి ఆ నీళ్లు తేట వంచి ఆ గుజ్జు కొబ్బరి చెట్టు వేళ్ళకు పట్టించి ఉప్పు నిండా వేసి ఆ నీళ్లు పోస్తే పెద్ద పెద్ద కాయలు కాయును , కాయలు రాలవు.

  పోక చెట్లకు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో పైన ఎండిపోయిన మట్టలు కోసి చెట్ల చుట్టు త్రవ్వి పైన చెప్పిన కషాయము పొస్తే అధికముగా పండును.

  అరటి చెట్టు కు ఏనుగు దంతపు పొట్టు కాల్చిన నిప్పులోగాని, పంది పెంటికలు, గుర్రపు పెంటికలు కాల్చిన నిప్పులో గాని ఇనప సలాకు ఎర్రగా కాల్చి చెట్టు మొదట వేరులో గుచ్చితే చాలా గొప్ప ఫలితాలు ఇచ్చును.

   రేగు చెట్టుకి నువ్వులు , పెసలు సమబాగములు గా చేర్చి దానితో కొంచం అతిమధురం వేసి చెట్టు చుట్టు వేసి మాంసం కడిగిన నీళ్లు పొసిన మరియు నూవుల పిండి , అతిమధురం కలిపి ఎరువు వేసిన తియ్యటి ఫలములు మరియు తియ్యటి ఫలములు ఇచ్చును. 

  పత్తి విత్తనాలను ఆవు పేడలో , ఆవు పంచితములో చాలుమార్లు తడిపి పేడనీళ్ళు చల్లుతూ నాటిన తరువాత పందికొవ్వు, మాంసం కడిగిన నీళ్లు చల్లిన అది తన జాతిని విడిచి నిమ్మ జాతిగా మారును. 

  మామిడి టెంక నాటిన పిదప మొలచిన మొక్క జానెడు వరకు పెరిగిన పిదప చిగురు కత్తిరించిన యెడల నాలుగైదు కొమ్మలు పుట్టి పెరుగును. ఆ కొమ్మలు వ్రేళ్ళు వలె పెరిగిన పిమ్మట నాలుగు కొమ్మలకు నాలుగు జాతుల అంటు మామిడి అంట్లు కట్టిన నాలుగు వైపులా నాలుగు రంగుల కాయలు కాచును. 

   పనస మొక్కకు మామిడి కొమ్మ కట్టి నాటిన మొదటను పనస కాయలును, కొమ్మలకు మామిడి కాయలను కాయును .

   నేరేడు మొక్క యెక్క కొమ్మకు గులాబి, జామ, అంటును కట్టవచ్చు.

   నిమ్మ , దబ్బ , కమలా, నారింజ, ఈ జాతులు ఒక జాతి మొక్కకు అన్ని జాతుల మొక్కలు అంట్లు కట్టవచ్చును.

   పాల మొక్కకు సపోటా, పనస అంటు కట్టవచ్చును.

   పొగాకుకు , గరుడ వాహన , జాజికి చమెలి, గులాభికి పల్ల సంపెంగి , మాలతికి సాంబ్రాణి అంట్లు కట్టవచ్చు. 

   మల్లె చెట్టు దగ్గర నొక యెర్ర బాడిద కొమ్మను పాతి ఆ కొమ్మ చిగిర్చిన పిదప అడ్డగముగా నొక రంధ్రము చేసి ఆ రంధ్రములో నుండి ఒక మల్లె కొమ్మని తీసి పేడ మన్ను ఆ రంధ్రముని గప్పి నీళ్లు పోయుచుండిన కొంతకాలానికి ఆ రంద్రములో గల కొమ్మకి వేర్లు వచ్చును. పిమ్మట ఆ కొమ్మని మొదటకి కోసి నాటిన మంకెన ( బాడిద ) పువ్వులు పూయును. 

   పొగడ చెట్టు కొమ్మకు సంపెంగ మొక్కకు అంటు కట్టిన ఒక పక్క పొగడ పువ్వులు , ఇంకో పక్క సంపెంగ పువ్వులు పూయును.

   సూర్య కాంత ( sunflower ) గింజలు పాలలొ 7 మార్లు నానవేసి ఎండబెట్టి నాటి రోజు పాలతో తడుపు చుండిన తెల్లని పువ్వులు పూయును. 

   ఎర్ర గన్నేరుకు , తెల్ల గన్నేరుకు అంటు కట్టిన రెండు రకాల పువులు పూయును.


ఆయుర్వేద వైద్యం నందు జలగలు ఉపయోగించే విధానం -

ఆయుర్వేద వైద్యం నందు జలగలు ఉపయోగించే విధానం -

       జలము ఆయువుగా కలవి కావున జలాయుకములు అనియు , జలము నివాసస్థానం కలవి కావున జలౌకలని మరియు జలగలు అని పిలవబడుతున్నవి. ఇవి 12 విధములు గా ఆయుర్వేదం విభజించింది. ఇందు విషము కలిగినవి నల్లటి రంగులోని బేధము వలన 6 విధములు . అందు కృష్ణ అనునది కాటుక రంగు పెద్ద శిరస్సు గలది. కర్బూర అనునది బొమ్మిడ అను చేప వంటి ఆకృతి కలిగి ఒకచోట చిన్నగా , మరొకచోట పెద్దగా ఉండు పొట్ట కలిగి ఉండును. కలగర్ద అనునది ముడుతలతో కూడి ఉండి పెద్ద పార్శ్వములతో కలిగిన ముఖం 
ఉండును. ఇంద్రాయుధ అనునది ఇంద్రధనస్సులోని నానారంగులు గల నీలపు చారలతో కూడుకుని ఉండును. సాముద్రిక అనునది కొద్దిగా నలుపు , పసుపు రంగులతో ఉండి అనేక ఆకృతులుగల తెల్లని మచ్చలతో కూడుకుని ఉండును. గోచందనం అనునది ఆంబోతు బుడ్డ వలే పొట్ట యందు ఒక గీత కలిగి సన్నని ముఖం కలిగి ఉండును.

           పైనచెప్పిన 6 రకాల జలగలు విషము కలిగి ఉంటాయి. ఇవి కరిచినచో కాటునందు వాపు , మిక్కిలి దురద, మూర్చ, జ్వరం, తాపము , వాంతి కలుగును. 

        ఇప్పుడు మీకు విషము లేని జలగలు గురించి వివరిస్తాను. విషములేని జలగలు మొత్తం 6 రకాలు . అందులో కపిల అనునది ప్రక్కల యందు మనశ్శిలతో రంగు వేసినట్లు ఉండి వీపున నిగనిగలాడుచూ పెసలవలే ఆకుపచ్చ రంగు కలిగి ఉండును. పింగళి అనునది కొంచం ఎరుపు రంగు గుండ్రని శరీరం పచ్చని రంగు ఉండి వేగముగా కదులును. శంఖముఖి అనునది యకృత్ వలే ఎరుపు నలుపు రంగులు కలిగి శీఘ్రముగా రక్తమును తాగే స్వభావం పొడవైన వాడి అయిన ముఖం కలిగి ఉంటుంది. మూషిక అనునది ఎలుక వంటి ఆకారం , రంగు , దుర్వాసన కలిగి ఉంటుంది. పుండరీకం అనునది పెసల వలే పచ్చని రంగు , పద్మముల వలే విశాలమైన ముఖం కలిగి ఉండును. సావరిక అనునది నిగనిగలాడుచూ తామరాకు వంటి రంగు కలిగి 18 అంగుళముల పొడవు కలిగి ఉండును. ఇది ఏనుగులు, గుఱ్ఱములకు చికిత్స చేయుటలో మాత్రమే వాడవలెను .మనుష్యులకు పనికిరాదు. వీటిని నిర్విష జలగలు అందురు.

             ఈ విషము లేనటువంటి జలగలు లభించు ప్రదేశాలు ముఖ్యంగా ఢిల్లీకి పశ్చిమ దిశలోను , సహ్యాద్రి పర్వతాలు అనగా నర్మదా నది ప్రవహించు పర్వత ప్రాంతాలలోను, మధురా ప్రాంతంలోనూ ఈ విషము లేనటువంటి జలగలు ఉండును. ఈ ప్రదేశాలలో లభించు జలగలు పెద్ద శరీరం కలిగి మంచి బలముతో ఉండి శీఘ్రముగా రక్తమును పీల్చెడి స్వభావం ఎక్కువుగా ఉండి విషము లేకుండా ఉండును.

         విషముతో కూడిన చేపలు , పురుగులు , కప్పలు , మూత్రపురీషములు క్రుళ్ళుట చేత పుట్టిన జలగలు మరియు కలుషిత జలము నందు పుట్టిన జలగలు, నీటిలోని పద్మములు కుళ్లుటచేత పుట్టిన జలగలు విషపూరితంగా ఉండును. శుద్ధజలము నందు పుట్టిన జలగలు విషం లేకుండా ఉండును.

            ఇప్పుడు జలగలను పట్టే విధానం వాటిని పోషించే విధానం మీకు తెలియచేస్తాను .

     రక్తముతో కూడిన తోలు , జంతుమాంసం , వెన్న , నెయ్యి, పాలు మొదలగు వాటితో కూడిన అన్నమును జలగలు ఉన్న ప్రదేశంలో వేసినచో అవి పైకి వచ్చును. అప్పుడు వాటిని పట్టుకొని మంచి కుండలో చెరువునీటిని , బురదని పోసి అందులో ఉంచవలెను. వాటికి తిండి కొరకు నాచు, ఎండిన మాంసము , నీటిలో పుట్టే దుంపల చూర్ణం ఇవ్వవలెను. అవి నిద్రించుటకు గడ్డి, నీటి యందు పుట్టే పచ్చి ఆకులను ఆ కుండ నందు వేయవలెను . రెండు మూడు రోజులకు ఒకసారి ఆ కుండ యందలి నీటిని తీసివేసి కొత్తనీటిని పోసి ఆహారం కూడా కొత్తదానిని వేయవలెను . ప్రతి ఏడు రోజులకు ఒకసారి కుండను మార్చవలెను . ఈ జలగలను శరత్కాలం పట్టుకొనుట మంచిది .

      జలగలను వైద్యంలో ఎలా ఉపయోగించాలో మీకు వివరిస్తాను.

            జలగలచే పోగొట్ట తగిన రోగము కలిగిన వానిని కూర్చుండబెట్టి కాని , పడుకోపెట్టి కాని జలగ పట్టించవలసిన ప్రదేశములో వ్రణము లేనిచో ఆ ప్రదేశంలో ఎండించిన ఆవుపేడ చూర్ణం , మన్ను కలిపి మర్దన చేయవలెను . ఆ తరువాత జలగలను తీసుకుని ఆవాలు , పసుపు కలిపి నూరి కలిపిన నీటిలో ముంచి వేరొక మంచినీటి పాత్రలో ముంచి వాటిని రోగమున్న ప్రదేశములో పట్టించవలెను. ఆ తరువాత ఆ జలగకు మంచి కాటన్ గుడ్డ ముక్కతో ముఖము విడిచి శరీరం అంతయు కప్పవలెను. అప్పుడు ఆ జలగ రోగ స్థానమును పట్టును . అలా పట్టనిచో ఆ రోగస్థానం పైన పాలచుక్క గాని రక్తపుచుక్క గాని వేయుట లేక కత్తితో గీయుట చేసినచో జలగ వెంటనే రోగస్థానమును పట్టును . అప్పుడు కూడా జలగ పట్టనిచో దానిని వదిలి వేరొక జలగ పట్టించవలెను .

                   జలగ ఎప్పుడూ తన ముఖమును గుర్రపుడెక్క వలే విస్తరించి స్కంధమును పైకెత్తి రోగస్థానమును తగులుకొనునో అప్పుడు అది రక్తమును పీల్చుతుంది అని అర్ధంచేసుకొనవలెను వెంటనే దానిని తడిగుడ్డతో కప్పి మధ్యమధ్యలో తడుపుచుండవలెను . అలా చేస్తున్నచో రక్తం బాగుగా పీల్చును. ఆ పీల్చుటలో ముందుగా దుష్టరక్తమునే పీల్చును .

            జలగ రక్తం పీల్చుతూ ఉన్నప్పుడు కొంత సమయం తరువాత పోటు , దురద మొదలగుచున్న అప్పటివరకు అది దుష్టరక్తం పీల్చి ఆ తరువాత మంచిరక్తం పీల్చడం మొదలు అయినది అని అర్థం . ఆ తరువాత వెంటనే జలగను తీసివేయవలెను . రక్తం యొక్క రుచి మరిగి ఆ జలగ రానిచో దాని ముఖము పైన సైన్ధవ లవణము వేసినచో విడిచివేయును .

        చెడు రక్తం పీల్చిన జలగను శుద్దిచేయు విధానం గురించి మీకు తెలియచేస్తాను.

      పైన చెప్పినట్టు రోగస్థానమును విడిచిన జలగకు శరీరం పైన బియ్యపు పిండిని పూసి ముఖం నందు నూనె, ఉప్పు కలిపి రాసి ఎడమచేతితో తోకను పట్టుకొని కుడిచేతితో ముఖము వరకు ఆవుపాలు పితికినట్లు చేయవలెను . ఈ విధంగా చేస్తూ తాగిన రక్తమును బయటకి కక్కునట్టు చేయవలెను . ఆ తరువాత ఆ జలగను శుభ్రపరచి మంచినీటితో కూడిన పాత్ర యందు ఉంచవలెను. అప్పుడు అది ఉత్సాహముగా సంచరించును. అలా సంచరించకుండా కదలక మొద్దుగా ఉన్నచో చెడురక్తం దాని శరీరం నుంచి పూర్తిగా బయటకి పోలేదు అని గ్రహించి మరలా కక్కించు ప్రయత్నం చేయవలెను . కక్కించాక మరలా కుండ నందు భద్రపరచవలెను.

       జలగతో రోగనివారణ క్రియ చేశాక చేయవలసిన విధి గురించి వివరిస్తాను.

          జలగ ద్వారా చెడు రక్తం తీసాక ఆ గాయమునకు ఔషదాలు కలిపిన ఆవునెయ్యి పూయవలేను . కొందరికి తేనె కూడా పూయవచ్చు.

      పైన చెప్పిన జలగతో చెడు రక్తాన్ని తీయు విధానాన్ని రక్తమోక్షణం అంటారు. ఈ క్రియను రోగి యెక్క బలం, రోగం యొక్క బలాన్ని అంచనా వేసుకొని మాత్రమే అంచనా వేసుకొని చేయవలెను .

      ********** సంపూర్ణం ************

  
           

సమస్త జ్వరాలు హరించుట కొరకు పురాతన వైద్య ప్రక్రియ -

సమస్త జ్వరాలు హరించుట కొరకు పురాతన వైద్య ప్రక్రియ - 

       మొదట ఒక రోగిని నులకమంచం పైన పడుకోబెట్టాలి . మంచానికి నాలుగు వైపులా గాలి దూరకుండా బట్టలు కట్టాలి. తంగేడు అన్ని భాగాలు ( సమూలం ) బాగా నలుగగొట్టి ఒక వెడల్పాటి బేసిన్ లో వేసి నిండా నీరుపోసి బాగా మరిగించి ఆ బేసిన్ ని తీసుకొచ్చి మంచం క్రింద పెట్టాలి. దానిపైన పెట్టిన మూత తీయగానే వేడివేడి నీటిఆవిరి అడుగు నుండి నులకమంచం సందుల నుండి పైన పడుకున్న రోగి శరీరానికి తగులుతూ ఉండాలి. ఆ బేసిన్ ని క్రమంగా పాదాల దగ్గర నుండి కొంచం కొంచం జరుపుతూ తలవెనక వైపు కి లాగుతూ ఉండాలి. రోగిని కొద్దిసేపు వెల్లకిలా , కొద్దిసేపు బోర్లా ఇలా పడుకోబెడుతూ ఇలా మార్చి మార్చి చేస్తూ ఆవిరి రోగి శరీరం మొత్తానికి తగులుతూ ఉంటే తంగేడు ఆవిరికి శరీరం నుండి చెమట కారిపోయి అన్నిరకాల విషజ్వరాలు మటుమాయం అవుతాయి. 

  గమనిక - శరీరం బాగా నొప్పులతో కూడి ఉన్నప్పుడు కూడా ఈ పద్ధతిని ఆచరించడం వలన నొప్పుల నుంచి పూర్తి ఉపశమనం లభిస్తుంది.

 
         

కొన్నిరకాల ఫలముల గుణధర్మములు

కొన్నిరకాల ఫలముల గుణధర్మములు -

 * మామిడి - 

         మంచి పౌష్టిక ఆహారం , కొంచం అరుగుటకు సమయం తీసుకొనును.

 * అంజూర -

         చాలా మంచి పౌష్టిక ఆహారం. అరుగుటకు సమయం తీసికొనును. వేసవికాలమున ప్రాతఃకాలం నందు ( సూర్యోదయమునకు పూర్వం ) ఈ ఫలమును తినుట శరీరానికి చాలా మంచిది .

 * ద్రాక్ష -

         మంచి జీర్ణకారి. రక్తమును శుద్ధి చేయును . కొవ్వు మరియు వేడిమిని శరీరం నందు వేగముగా పుట్టించును . గుండెకు మంచి మేలు చేకూర్చి గుండె చుట్టు ఉండే రక్తమునకు మంచి చేయును .

 * ఆపిల్ -

         త్వరితముగా జీర్ణం అగును. శరీరం నందు శక్తి లేనివారికి , చిన్నపిల్లలకు మేలు చేయును .

 * అరటి -

         మంచి పౌష్టిక ఆహారం , మలాన్ని శుద్ధిచేయు గుణము అధికం .

 * కిత్తిలి -

         మంచి జీర్ణకారి , రక్తాన్ని శుద్ధిచేయును .

 * సీమ రేగు -

         శ్రేష్టమైన ఆహారం , మంచి ఔషధముగా పనిచేయును . శరీరాన్ని పరిశుభ్రపరుచు శక్తి కలదు. రోగపదార్థమును బయటకి వెడలించును. వాతమును , గుండె సరిగ్గా కొట్టుకొనకుండా ఉండు సమస్యని మాన్పును.

                భోజనమునకు ముందే వీటి రసము లొపలికి తీసుకొనిన పులితేన్పులు రాకుండా చేయును . నివారణ చేయును . వీటి రసమునకి సూక్ష్మజీవులను సంహరించగల శక్తి కలదు. విష జ్వరాలకు కారణం అయిన శిలింద్రాలను ఇది సహరించగలదు.

 * బేరిపండ్లు -

        వీటిని చెక్కు తీయకుండా తినినచో విరేచనం కలిగించును. చెక్కు తీసి తినినచో బంక విరేచనాలను నివారించును. పుట్టకొక్కు విషమునకు విరుగుడుగా పనిచేయును .

 * అనాస - 

         భోజనానంతరం ఇది పుచ్చుకొనిన ఇది మిక్కిలి జీర్ణకారిగా ఉండును. గొంతుచుట్టు గ్రంధులు వలే గొలుసు మాదిరిగా ఏర్పడు రోగమును గండమాల అందురు. అలా ఏర్పడిన గ్రంధుల నుంచి రసికారుటను మాన్పుటకు ఈ ఫలము అద్భుతంగా పనిచేయును . ఈ పండ్ల రసమును మొటిమలకు మరియు పులిపిరులకు పూస్తున్న అవి హరించును .

 * బాదం -

         ఇది మానవులకు సహజ ఆహారం. వీటిని చిరుతిండిగా మధ్య ఆహారంగా ఉపయోగించవచ్చు . ఇవి అధిక బలకారులు కావున మితముగా ఉపయోగించవలెను. ఇది సమశీతోష్ణము అయినది. కొత్త కాయలలోని పప్పు శ్రేష్టమైనది. వేడిచేసి చలువచేయును. వీర్యవృద్ధి , దేహపుష్టి కలుగచేయును . మేహవాతాన్ని అణుచును . రొమ్మునకు బలమును ఇచ్చును.

               మూత్రపు సంచిలోని పుండ్లు మాన్పును . శరీరంలోని అని అవయవములను బలమును ఇచ్చును. గొంతుకను , రొమ్మును మృదువుగా చేయును . దగ్గు,లివర్ నొప్పి , క్షయ మొదలగు రోగాలని అణుచును. కిడ్నీలకు బలమును కలుగచేయును . వాతమును అణుచును. పళ్లనొప్పి , దేహము బక్కగా అవ్వు సమస్య , శిరస్సుకు సంబందించు సమస్యలను నివారించును. మాటిమాటికి వచ్చు జ్వరమును నివారించును.

          ఈ పప్పులను తినటం మొదలుపెట్టగానే శరీరంలోని వ్యర్థాలు బయటకి వెళ్ళుట ప్రారంభం అగును.

 * వేరుశెనగ -

         ఈ పప్పు చాలా బలకరం . వీటిని పచ్చిగానే తినినచో మంచి బలాన్ని కలగచేయును . వీటిని తినినచో శరీరంలోని వ్యర్థాలు బయటకి వెళ్ళును.

 * టెంకాయ -

         కొబ్బరి మరియు కొబ్బరి నీరు లొపలికి తీసుకోవడం వలన మంచి బలం కలిగించును. శరీరం లోని వేడిని తీసివేయును. తక్షణ శక్తిని ఇవ్వడంలో దీనిని మించినది ఏది లేదు . కేవలం టెంకాయ మాత్రమే తిని జీవించవచ్చు అని కొన్ని ఆయుర్వేద గ్రంథాలలో రాసి ఉన్నది.

      

Sunday, September 10, 2023

మజ్జిగ లాభాలు

#మజ్జిగ
ఈనాడు దాదాపు నూటికి 90% మంది ప్రజలు తమ ఆహారంలో మజ్జిగను పూర్తిగా మానేశారు. రెండు పూటలా పెరుగును మాత్రమే వాడుతున్నారు.

పెరుగు ఆయుక్షీణం. రాత్రి సమయంలో అసలు తినకూడదు.

మజ్జిగ 5 రకాలు

1. మధితము:
పెరుగులో నీరు కలపకుండా చిలికి చేసిన మజ్జిగ చిక్కగా ఉంటుంది. ఈ మజ్జిగను ఆహారంలో తీసుకుంటే నీరసం, ఉదర రోగాలు, పైత్యము, వాతము, రుచి తెలియక పోవడం, నీళ్ళ విరోచనాలు మొదలైనవి పోయి శరీరానికి బలం కలుగుతుంది.

2. మిళితము:
పెరుగు ఒక వంతులో నీళ్లు మూడు వంతులు పోసి చిలికి తయారు చేసిన మజ్జిగ అరుచిని, అతిసార విరోచనాన్ని, రక్తంలో చేరిన వాతాన్ని ఇంకా అనేక రోగాలను పోగొడుతుంది.

3. గోళము:
ఒక వంతు పెరుగు, ఒకటిన్నర వంతు నీళ్లు కలిపి తయారు చేసిన మజ్జిగ శరీరానికి మంచి కాంతి వస్తుంది. కంటికి మేలు చేస్తుంది. ఉదరములో మందాగ్ని, విష దోషాలు, కఫము, ఆమరోగములను పోగొడుతుంది.

4. షాడభము:
ఒక వంతు పెరుగు, అయిదు వంతుల నీళ్ళు కలిపి తయారు చేసిన మజ్జిగ శ్లేష్మరోగాలను, రక్తమూల వ్యాధిని
పోగొడుతుంది. ఈ మజ్జిగ తేలికగా ఉండి ఉదరములో జఠరాగ్నిని పెంచి శరీరానికి కాంతినిస్తుంది.

5. కాలశేయము:
ఒకవంతు పెరుగు, రెండు వంతుల నీళ్ళు కలిపి తయారు చేసిన ఈ మజ్జిగ బంక విరోచనాలు, విషములను, ఉబ్బులను, మంటను, వాతమును, మూలవ్యాధిని పోగొట్టి శరీరం త్వరగా ముడతలు పడకుండా కాపాడుతుంది. పడిన ముడతలను కూడా తీసి వేస్తుంది.

మజ్జిగ ఆహారంలో తీసుకోవటం అన్ని కాలాలలో, అన్ని వయసుల వారికి మంచిది
            🚩సర్వేజనాః సుఖినోభవంతు🚩

Tuesday, September 5, 2023

ఉపవాసం చేయడం వలన వివిధ అవయవాలలో కలుగు మార్పులు -


 * జీర్ణక్రియ - 

      జీర్ణావయవాలకు మంచి విశ్రాంతి లభించును . అజీర్ణము తొలగించి ఆకలి వృద్ది అగును. 

 * మలాశయం - 

       మలాశయంలోని మురికి బహిష్కరించబడి అజీర్ణం తొలగును . క్రిములను , బ్యాక్టీరియాలను నాశనం చేయును . 

 * మూత్రపిండములు - 

       మూత్రపిండములలోని విషపదార్ధములు , రాళ్లు బయటకి వెడలును . 

 * ఊపిరితిత్తులు - 

        ఉపిరితిత్తులోని నంజు , నీరు బహిష్కరించబడి ఆయాసము నివారించును . శ్వాసక్రియ చక్కగా జరుగును . 

 * గుండె - 

       గుండె చుట్టు , లోపల చేరిన కొవ్వు , నీరు తగ్గి గుండె చక్కగా కొట్టుకొనును . అధికంగా తినడం వలన రక్తంలో కొలెస్టరాల్ ఎక్కువ అయ్యి గుండెజబ్బులు వచ్చును . 

  * లివర్ , స్ప్లీన్ - 

        ఆహారం జీర్ణం అగుటకు ఇవి ముఖ్యముగా పనిచేయవలెను . ఉపవాసం చేయుట వలన వీటికి విశ్రాంతి దొరుకును . వాటిలో మాలిన్యాలు తొలగించబడి జీర్ణక్రియ వృద్ధిచెందును . 

 * రక్తప్రసరణ - 

       రక్తదోషములు నివారణ జరుగును. ఉపవాసం వలన రక్తప్రసారం చురుకుగా జరుగును. కావున తిమ్మిర్లు , మంటలు , నొప్పులు నివారణ అగును. 

 * కీళ్లు - 

        కీళ్లలో పేరుకుపోయిన కొవ్వు , నీరు , మాంసం , ఇతర మాలిన్యాలు తొలగించబడి వ్యాధి నివారణ అగును. 

 * నాడి మండలము - 

        ఉపవాసం వలన నాడీ మండలం శుద్ది జరిగి వ్యాధి నివారణ జరుగును. 

 * జ్ఞానేంద్రియములు - 

        జ్ఞానేంద్రియాలలోని మాలిన్యములు కూడా నివారణ అగును. 

 * చర్మము -  

        చర్మము కాంతివంతం అగును. చర్మవ్యాధులు హరించును . శరీరానికి చక్కని రంగు వచ్చును . 

 * మనస్సు - 

        మనస్సు నిర్మలం అగును. కోపతాపములు నివారించును . ఆధ్యాత్మిక చింతనకు పునాదులు ఏర్పడును . 

        పైన చెప్పినవే కాకుండా మరెన్నో ఉపయోగాలు ఉన్నాయి . దురభ్యాసాలను విడుచుటకు ఉపవాసం మిక్కిలి ఉపయోగపడును. ఉపవాసం అనగా ఆహారం తీసుకోకపోవడం ఉపవాసం కాదు. ఉపవాసానికి కూడా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. 

Saturday, September 2, 2023

శరీరం నందు రక్తం వృద్ది చెందుటకు సులభయోగాలు -

శరీరం నందు రక్తం వృద్ది చెందుటకు సులభయోగాలు - 

 * ఉల్లిపాయ , ఉసిరికాయలను సమభాగాలుగా నూరి రసము తీసి ఆ రసము సేవించిన శరీరం నందు రక్తం వృద్ది చెందును. 

 * టమాటో రసం నందు తేనే కలిపి త్రాగిన రక్తశుద్ధి జరుగును మరియు రక్తం వృద్ది చెందును 

 * ప్రతిరోజు పడుకునే ముందు వేడిపాలు పావుసేరు తాగుతున్న రక్తంవృద్ది అగును . 

 * పటికబెల్లం , లొహాభస్మం , పిప్పిల్లు వీటిని సమపాళ్లలో తీసుకుని పొడిచేసి పూటకు పావుతులము పొడిని నేతిలో కలుపుకుని తినుచున్న రక్తం వృద్ది అగును.

  నా అనుభవ యోగం - 

   ప్రతిరోజూ ఉదయము మరియు సాయంత్రం సమయాలలో ఆహారానికి గంటన్నర ముందు ఒక గ్లాస్ తియ్యటి దానిమ్మ రసములో ఒక స్పూన్ గోధుమ గడ్డి చూర్ణం కలిపి ఇవ్వడం జరిగింది. బెల్లంతో తయారుచేసిన పల్లీపట్టీ కొంత ఆహారంలో భాగముగా ఇచ్చాను . 40 రోజులలోనే రక్తవృద్ది జరిగి రోగి కోలుకున్నారు . ప్రతినిత్యం ఆపిల్ కూడా ఆహారములో భాగం చేశాను . 

 శరీరము నందు రక్తాన్ని వృద్ధి చేయు మరికొన్ని ఔషధులు - 

   అంజీర పండు , అభ్రక భస్మము , అమృత ఫలము , ఆవునెయ్యి , ఓమము , కొర్రలు , కోడిగుడ్లు , జాజికాయ , దానిమ్మపండు తియ్యనిది . ద్రాక్షపండు తియ్యనివి , నువ్వులు , బత్తాయి పండ్లు , సపోటా ఆహరంలో తీసికొనవలెను 

    పళ్ళ రసాలు ఎప్పుడూ కూడా ఆహరం తరువాత తీసుకోవద్దు . ఆహారానికి గంటన్నర ముందు తీసుకోవడం మంచిది . 

  
   

మహిళలను_భాదిస్తున్న_అన్నిరకాల_ఋతుసమస్యలకు_అద్భుతమైన_ఆయుర్వేద_పరిష్కారాలు

#మహిళలను_భాదిస్తున్న_అన్నిరకాల_ఋతుసమస్యలకు_అద్భుతమైన_ఆయుర్వేద_పరిష్కారాలు.

విజ్ఞప్తి: అందరూ బాగుండాలని, పోస్టు ఎక్కువగా వున్నా... మిత్రులు ఓపికతో చదివి అర్థం చేసుకుంటారాని భావించి అందరికీ అర్థం అయ్యేలా పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది. దయచేసి ఓపికతో మొత్తం చదివి అర్థం చేసుకుని , ఈ చిట్కాలను పాటించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆశిస్తున్నాము. 

🤷ఆడపిల్లలు సకాలంలో రజస్వల అవడానికి ఆయుర్వేద ఔషధాలు:

⭐ఆయుర్వేద ఔషధం -1
 
 సిద్ధం చేసుకోవాల్సిన పదార్ధాలు:-

👉పల్లేరు కాయల చూర్ణం అర టీస్పూన్,
👉నల్లనువ్వుల చూర్ణం అరటీస్పూన్,
👉 బెల్లం అర టీస్పూన్,
👉ఎండు కొబ్బరి తురుము అరటీస్పూన్.

✍️వాడాల్సిన పద్ధతి:-

👉ఒక గిన్నెలో పైవాటిని తీసుకోండి. వీటిని బాగా కలపి నిమ్మకాయ సైజు వుండ చేసి తినిపించండి. ఇలాకొంత కాలం చేస్తే ఆడపిల్లలు సకాలంలో రజస్వల అవుతారు.

⭐ఆయుర్వేద ఔషధం- 2

సిద్ధం చేసుకోవాల్సిన పదార్థాలు:-

👉మందార పువ్వుల ముద్ద 1 టీస్పూన్
👉బెల్లం తురుము 1 టీస్పూన్,
👉నల్లనువ్వుల ముద్ద 1 టీస్పూన్.

✍️వాడాల్సిన పద్ధతి:-

👉ఒక గిన్నెలో వీటిని తీసుకోని, బాగా కలిపి, నిమ్మకాయ సైజు వుండ చేయండి. బియ్యం కడుగు నీళ్లతో ఇవ్వండి.
ఇలా కొంత కాలం చేస్తే ఆడపిల్లలు సకాలంలో రజస్వల అవుతారు.

⭐ఆయుర్వేద ఔషధం - 3

సిద్ధం చేసుకోవాల్సిన పదార్థాలు:-

👉మోదుగ గింజల చూర్ణం అరటీస్పూన్,
👉బెల్లం టీస్పూన్.

✍️వాడాల్సిన పద్ధతి:-

👉ఒక చిన్న రోలులో 1 టీస్పూన్ బెల్లాన్ని, అర టీస్పూన్ మోదుగ గింజల చూర్ణాన్ని కలిపి నూరండి.
వుండగా చేసి మింగండి..

👉దీనిని క్రమం తప్పకుండా కొంతకాలం తీసుకుంటే అడపిల్లలు త్వరలోనే రుతుముతి అవుతారు.

🤷బహిష్టులో అపక్రమం, బహిష్టు ఆలస్యం కావటం:

✍️బహిష్టులో అపక్రమంకు కారణాలు:

👉ఒత్తిడి
👉శారీరక బరువు తక్కువగా ఉండటం.
👉మరీ ఎక్కువగా వ్యాయామం చేయటం
👉pcod
👉థైరాయిడ్ గ్రంథి పనితీరులో తేడాలు.
👉 త్వరగా రజోనివృత్తి (మెనోపాజ్) జరగటం.
👉గర్భాశయంలో నిర్మాణపరమైన లోపాలు.
👉కుటుంబ ఇతివృత్తం.
👉ఎథ్లెటిక్స్ ట్రయినింగ్.
👉ఆహార సేవనకు సంబంధించిన వ్యాధులు (ఎవరెక్సియా) ఉండటం.

⭐ఆయుర్వేద ఔషధం - 1

సిద్ధం చేసుకోవాల్సిన పదార్థాలు:-

👉మందార పువ్వుల ముద్ద ఒక టేబుల్ స్పూన్ (4-5 తాజా మందార పువ్వులను తెచ్చి, కడిగి, ముద్దగా నూరాలి)
👉అరగ్లాసు నీళ్లు (అనుపానానికి),

✍️వాడాల్సిన పద్ధతి:-

👉1 టేబుల్ స్పూన్ మందార పువ్వుల ముద్దను ఖాళీ కడుపుతో, నీళ్లతో తీసుకోండి.
👉బహిష్టు వస్తుందనుకున్న తేదికి 5-7 రోజుల ముందునుంచి వాడటం మొదలెట్టండి.
👉మందారలో యాంటి ఈస్ట్రోజన్ అంశాలుంటాయి. ఇవి ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరోన్ మధ్య సమతుల్యతను కాపాడుతాయి.
👉దీంతో బహిష్టుక్రమం గాడిలో పడుతుంది.

⭐ఆయుర్వేద ఔషధం - 2

సిద్ధం చేసుకోవాల్సిన పదార్థాలు:-

👉ఉడకబెట్టిన కలబంద గుజ్జు 1 టీస్పూన్
 (కలబంద ఆకు మీద తోలు తొలగించి, గుజ్జును గోధుమ రంగులోకి మారేంత వరకూ ఉడికించి చల్లార్చి పేస్టుగా చేయండి.)
👉యాపిల్ జ్యూస్ లేదా నీళ్లు 1 కప్పు, (అనుపానానికి)

✍️వాడాల్సిన పద్ధతి:-

👉ఉడికించిన 1 టీస్పూన్ కలబంద గుజ్జును ఖాళీ కడుపుతో అరగ్లాసు నీళ్లకు కలిపిగాని లేదా యాపిల్ జ్యూసికి కలిపిగాని తాగండి.
ఇది కాస్త చేదుగా ఉంటుంది..దీనికి విరేచనాలను కలిగించే లక్షణం ఉంటుంది. అందుకే డోస్ ని అవసరాన్ని బట్టి. మార్చుకోండి.
👉దీనిని బహిష్టు వస్తుందనుకున్న తేదీకి 5-7 రోజుల ముందునుంచి మొదలెట్టి తీసుకోండి.!

⭐ఆయుర్వేద ఔషధం - 3 

సిద్ధం చేసుకోవాల్సిన పదార్ధాలు:-

👉తులసి ఆకుల రసం 1 టీస్పూన్
👉తేనె 1 టీస్పూన్
👉మిరియాలు 1 చిటికెడు.

✍️వాడాల్సిన పద్ధతి:-

👉ఒక టీస్పూన్ తులసి ఆకుల రసానికి ఒక టీస్పూన్ తేనెను కలపండి. దీనికే ఒక చిటికెడు మిరియాల పొడిని కలపి తీసుకోవాలి.
👉 ఇలా రెండు పూటలా తయారుచేసి తీసుకోండి.
👉ఈ ఔషధాన్ని ఒకటి రెండు నెలలు వరుసగా తీసుకోండి...దీంతో బహిష్టు క్రమం గాడిలో పడుతుంది.

✍️జాగ్రత్తలు:

👉ఒత్తిడిని తగ్గించుకోండి.
👉 పనిని ప్రణాళిక వేసుకొని చేసుకోండి. 
👉అర్ధశక్తిగా వ్యాయామం చేయండి.
👉మంచి ఆహారం తీసుకోండి.
👉 తేలికగా జీర్ణమయ్యే ఆహారాలు తీసుకోండి.
👉మలబద్దకం లేకుండా చూసుకోండి.
👉ఆలస్యంగా జీర్ణమయ్యే ఆహారాలు మానండి.

🤷బహిష్టు స్రావాధిక్యత:

✍️లక్షణాలు:-

👉ప్రతి గంటకూ ఒక శానిటరీ ప్యాడ్ ని మార్చాల్సి రావటం.
👉రాత్రిపూట నిద్ర మేల్కొని ప్యాడ్ ని మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడటం.
👉ఒక వారానికి మించి బ్లీడింగ్ జరగటం.
👉బహిష్టు రక్తంలో రక్తపు గడ్డలు పడటం
👉రక్తహీనత లక్షణాలు కనిపించటం.
👉రోజువారీ పనులకు ఆటంకం ఏర్పడటం.

✍️కారణాలు:-

👉హార్మోన్ తేడాలు,
👉అండాశయాల పనితీరులో మార్పులు,
👉గర్భాశయంలో కంతులు పెరగటం,
👉గర్భాశయంలో పిలకలు పెరగటం,
👉ఎడినోమయోసిస్ (గర్భాశయం లోపలి పొర గోడల్లోకి పెరగటం),
👉సంతాననిరోధక సాధనం అమర్చటం,
👉గర్భధారణలో ఇక్కట్లు,
👉మందుల వాడకం.
👉థైరాయిడ్ సమస్యలు,
👉ఎండోమెట్రోయోసిస్.

⭐ఆయుర్వేద ఔషధం - 1

సిద్ధం చేసుకోవాల్సిన పదార్ధాలు:-

👉అత్తిపత్తి (టచ్మీనాట్) మొక్క ఆకుల రసం 2 టేబుల్ స్పూన్లు (ఆకులను కడిగి, ముద్దగా దంచి, గుడ్డలో వేసి రసం పిండండి)
👉తేనె 1 టేబుల్ స్పూన్

✍️వాడాల్సిన పద్ధతి:-

👉2 టేబుల్ స్పూన్ల తాజా అత్తపత్తి ఆకుల రసానికి అవసరాన్ని బట్టి ఒక టేబుల్ స్పూన్ తేనెను కలిపి తీసుకోండి.
👉దీనిని రోజుకు 3 సార్లుగా 3 - 4 రోజులపాటు తీసుకోండి.
👉దీంతో అధిక బహిష్టుస్రావం ఆగుతుంది.

⭐ఆయుర్వేద ఔషధం - 2

సిద్ధం చేసుకోవాల్సిన పదార్థాలు:-

👉బాదం గింజల పేస్టు ఒక టీస్పూన్ (రాత్రంతా చన్నీళ్లలో నానబెట్టి, పై తోలు తీసి గ్రైండ్ చేయండి.)
👉మారేడు ఆకుల ముద్ద ఒక టీస్పూన్.
👉 తగినంత తేనె (అనుపానానికి).

✍️వాడాల్సిన పద్ధతి:-

👉ఒక చిన్న బొవెల్లో టీస్పూన్ బాదం గింజల పేస్టును, టీస్పూన్ మారేడు ఆకుల పేస్టును, ఒక టీస్పూన్ తేనెనూ కలిపి తీసుకోండి.
👉తరువాత ఒక కప్పు వేడి పాలు తాగండి.
👉ఇలా ప్రతి రోజూ ఉదయం తీసుకోండి.!

⭐ఆయుర్వేద ఔషధం - 3

సిద్ధం చేసుకోవాల్సిన పదార్థాలు:-

👉నాగకేసరాలు చూ. 10గ్రా.
👉ఉసిరి వలుపు చూ. 10 గ్రా,
👉తుమ్మచెక్క చూ. 10 గ్రా
👉రావిచెక్క చూ. 10 గ్రా.
👉మిశ్రీ 80గ్రా.
👉బియ్యం కడుగు నీళ్లు.

✍️వాడాల్సిన పద్ధతి:-

👉ఒక పాత్రలో వీటిని వరుసగా తీసుకొని బాగా కలపండి.
👉దీనిని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోండి.
👉దీని మోతాదు 3 గ్రా.
👉అనుపానం బియ్యం కడుగు నీళ్లు.
👉అరటీస్పూన్ చూర్ణాన్ని అరకప్పు బియ్యం కడుగు నీళ్లతో కలిపి తీసుకోండి.
👉ఇలా మూడు వారాలపాటు తీసుకోండి.

✍️జాగ్రత్తలు:-

👉బాగా విశ్రాంతి తీసుకోండి.
👉యాస్ప్రిన్ వంటి మందులు మానేయండి.
👉 కాళ్లవైపు ఎత్తులో పెట్టి పడుకోండి.
👉అరటి పువ్వును కూరగా వండుకొని తినండి.
👉ధనియాల కషాయం తాగండి.

🤷రొమ్ముల్లో అసౌకర్యం, నొప్పి:-

✍️కారణాలు:-

👉హార్మోన్లలో తేడాలు
👉శరీరంలో నీరు చేరటం
👉రొమ్ములకు దెబ్బ తగలటం
👉గర్భధారణ
👉స్తన్యం గడ్డకట్టడం
👉రొమ్ములకు ఇన్ఫెక్షన్ సోకటం
👉 బరువులు ఎత్తటం
👉క్యాన్సర్

⭐ఆయుర్వేద ఔషధం - 1

సిద్ధం చేసుకోవాల్సిన పదార్థాలు:-

👉శొంఠి కొమ్ముల గంధం, టీస్పూన్ .
👉వస కొమ్ముల గంధం టీస్పూన్
👉 సున్నం టీస్పూన్
👉బెల్లం టీస్పూన్

✍️వాడాల్సిన పద్ధతి:-

👉శొంఠి గంధాన్ని, వస గంధాన్ని, సున్నాన్ని, బెల్లాన్ని ఒక్కోటి ఒకో టీస్పూన్ తీసుకోండి.
👉 పేస్టుగా కలపండి.
👉దీనిని అరచేయి వెడల్పు కలిగిన ఒక గుడ్డమీద లేపనం చేయండి.
👉 మరో గుడ్డతో మూసి పేపర్ టేప్తో రొమ్ముమీద ప్లాస్టర్గా వేయండి.
👉దీనిని రెండు మూడు రోజులు రొమ్ముల్లో నొప్పి, అసౌకర్యం తగ్గేవరకూ ప్లాస్టర్గా వేయవచ్చు. (లేపనాన్ని నేరుగా పూస్తే చర్మం కమిలే రిస్కు వుంటుంది).

⭐ఆయుర్వేద ఔషధం - 2

సిద్ధం చేసుకోవాల్సిన పదార్ధాలు:-

👉ఆవాలు చూర్ణం ఒక టీస్పూన్
👉గసగసాల చూర్ణం ఒక టీస్పూన్
👉కర్పూరం పొడి ఒక టీస్పూన్
👉పెరుగు తగినంత

✍️వాడాల్సిన పద్దతి:-

👉ఒక పాత్రలో ఒక టీస్పూన్ ఆవాల పొడిని, ఒక టీస్పూన్ గసగసాల పొడిని, ఒక టీస్పూన్ కర్పూరం పొడినీ కలపండి.
👉ఈ మిశ్రమానికి కొద్ది కొద్దిగా పెరుగు కలుపుతూ పేస్టు మాదిరిగా తయారుచేయండి.
👉దీనిని అరచేయి వెడల్పు కలిగిన బ్యాండేజీ గుడ్డమీద పూయండి.
👉ఇదే సైజు కలిగిన మరో గుడ్డతో కప్పి స్యాండ్విచ్ లాగా తయారుచేయండి.
👉దీనిని రొమ్ములమీద పేపర్ టేప్తో అతికించండి. ఇలా 2-3 రోజులు చేయండి.

⭐ఆయుర్వేద ఔషధం - 3

సిద్ధం చేసుకోవాల్సిన పదార్థాలు:-

👉కర్పూరం 1 టీస్పూన్
👉వెల్లిపాయ పేస్టు 1 టీస్పూన్
👉రాతి ఉప్పు (కాపడం పెట్టుకోవడానికి)

✍️వాడాల్సిన పద్ధతి:-

👉ఒక టీస్పూన్ కర్పూరాన్ని, ఒక టీస్పూన్ వెల్లిపాయ ముద్దను కలిపి మెత్తగా నూరండి.
👉దీనిని ఒక గాజు గుడ్డమీద పరిచి పట్టి వేసుకోండి.
👉తరువాత ఉప్పుతో కాపడం పెట్టుకోండి.

✍️జాగ్రత్తలు:-

👉కాఫీ మానేయండి.
👉కెఫీన్ ఉత్పత్తులను మానేయండి.
👉ఉప్పును తగ్గించండి.
👉శ్రమను తగ్గించుకోండి.
👉మూత్రాన్ని జారీ చేసే ఆహారాలు తీసుకోండి (బార్లి, పల్చని టీ, ధనియాలు, కొబ్బరి నీళ్లు, సబ్జాగింజలు, చెరకురసం, పండ్ల రసాలు).

🤷నీరసం, బలహీనత, నిస్త్రాణ:

✍️కారణాలు:

👉క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్, 
👉కిడ్నీ వ్యాధులు,
👉 గుండె జబ్బులు, 
👉థైరాయిడ్ వ్యాధులు,
👉 స్థూలకాయం, 
👉మధుమేహం, 
👉ఆల్కహాల్ తీసుకోవటం, 
👉కెఫీన్ వాడకం, 
👉ఎక్కువగా శ్రమ చేయటం, 
👉ఆందోళన, కుంగుబాటు, భయం.

⭐ఆయుర్వేద ఔషధం -1

సిద్ధం చేసుకోవాల్సిన పదార్థాలు:-

 👉ఎండు ఖర్జూరాలు 4
👉తేనె 1 టేబుల్ స్పూన్
👉1 గ్లాసు వేడి నీళ్లు (ఖర్జూరాలను నానబెట్టడానికి)

✍️వాడాల్సిన పద్ధతి:-

👉4 ఎండు ఖర్జూరాలను పరిశుభ్రంగా కడగండి.
👉ఒక గ్లాసు వేడి నీళ్లలో వేయండి.
👉రాత్రంతా నానబెట్టండి.
👉ఉదయం నానిన ఖర్జూరాలను తినండి. మిగిలిన నీళ్లకు 1 టేబుల్ స్పూన్ తేనె కలిపి తాగండి.
👉దీంతో మీ నీరసం తగ్గుతుంది. బలహీనత దూరమవుతుంది.!

⭐ఆయుర్వేద ఔషధం - 2

సిద్ధం చేసుకోవాల్సిన పదార్థాలు:-

👉 అశ్వగంధ వేరు చూర్ణం 20 గ్రా
👉చిల్లగింజల చూర్ణం 20 గ్రా 
👉శతావరి వేరు చూర్ణం 20 గ్రా.
👉బాదం పలుకులు 20 గ్రా.
👉కలకండ పొడి 80 గ్రా.

✍️వాడాల్సిన పద్ధతి:-

👉 ఒక పాత్రలో వీటిని వరుసగా తీసుకోండి.
👉అన్నిటినీ బాగా కలపండి. 
👉ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోండి.
👉దీనిని పూటకు 1 టీస్పూన్ మోతాదుగా గోరు వెచ్చని పాలలో కలిపి తాగండి.
👉ఈ ఔషధాన్ని ఉదయం, సాయం కాలం రెండు పూటలా టానిక్ లాగా తీసుకోండి.
👉దీంతో ధాతునష్టం వల్ల కలిగిన నీరసం తగ్గుతుంది.

✍️జాగ్రత్తలు:-

👉బాగా నిద్రపోండి 
👉ఒత్తిడిని తగ్గించుకోండి.
👉మంచి ఆహారం తీసుకోండి.
👉పనులను ప్రణాళికా బద్ధంగా చేసుకోండి.
👉రోజువారీగా మర్రిపండ్లు, రావిపండ్లు, చక్రకేళి, అరటిపండ్లు, ఎండు ఖర్జూరాలు, ద్రాక్షపండ్లు, పెరుగు, పాలు, నెయ్యి తేనె వీటిని తీసుకోండి.