* మామిడి -
మంచి పౌష్టిక ఆహారం , కొంచం అరుగుటకు సమయం తీసుకొనును.
* అంజూర -
చాలా మంచి పౌష్టిక ఆహారం. అరుగుటకు సమయం తీసికొనును. వేసవికాలమున ప్రాతఃకాలం నందు ( సూర్యోదయమునకు పూర్వం ) ఈ ఫలమును తినుట శరీరానికి చాలా మంచిది .
* ద్రాక్ష -
మంచి జీర్ణకారి. రక్తమును శుద్ధి చేయును . కొవ్వు మరియు వేడిమిని శరీరం నందు వేగముగా పుట్టించును . గుండెకు మంచి మేలు చేకూర్చి గుండె చుట్టు ఉండే రక్తమునకు మంచి చేయును .
* ఆపిల్ -
త్వరితముగా జీర్ణం అగును. శరీరం నందు శక్తి లేనివారికి , చిన్నపిల్లలకు మేలు చేయును .
* అరటి -
మంచి పౌష్టిక ఆహారం , మలాన్ని శుద్ధిచేయు గుణము అధికం .
* కిత్తిలి -
మంచి జీర్ణకారి , రక్తాన్ని శుద్ధిచేయును .
* సీమ రేగు -
శ్రేష్టమైన ఆహారం , మంచి ఔషధముగా పనిచేయును . శరీరాన్ని పరిశుభ్రపరుచు శక్తి కలదు. రోగపదార్థమును బయటకి వెడలించును. వాతమును , గుండె సరిగ్గా కొట్టుకొనకుండా ఉండు సమస్యని మాన్పును.
భోజనమునకు ముందే వీటి రసము లొపలికి తీసుకొనిన పులితేన్పులు రాకుండా చేయును . నివారణ చేయును . వీటి రసమునకి సూక్ష్మజీవులను సంహరించగల శక్తి కలదు. విష జ్వరాలకు కారణం అయిన శిలింద్రాలను ఇది సహరించగలదు.
* బేరిపండ్లు -
వీటిని చెక్కు తీయకుండా తినినచో విరేచనం కలిగించును. చెక్కు తీసి తినినచో బంక విరేచనాలను నివారించును. పుట్టకొక్కు విషమునకు విరుగుడుగా పనిచేయును .
* అనాస -
భోజనానంతరం ఇది పుచ్చుకొనిన ఇది మిక్కిలి జీర్ణకారిగా ఉండును. గొంతుచుట్టు గ్రంధులు వలే గొలుసు మాదిరిగా ఏర్పడు రోగమును గండమాల అందురు. అలా ఏర్పడిన గ్రంధుల నుంచి రసికారుటను మాన్పుటకు ఈ ఫలము అద్భుతంగా పనిచేయును . ఈ పండ్ల రసమును మొటిమలకు మరియు పులిపిరులకు పూస్తున్న అవి హరించును .
* బాదం -
ఇది మానవులకు సహజ ఆహారం. వీటిని చిరుతిండిగా మధ్య ఆహారంగా ఉపయోగించవచ్చు . ఇవి అధిక బలకారులు కావున మితముగా ఉపయోగించవలెను. ఇది సమశీతోష్ణము అయినది. కొత్త కాయలలోని పప్పు శ్రేష్టమైనది. వేడిచేసి చలువచేయును. వీర్యవృద్ధి , దేహపుష్టి కలుగచేయును . మేహవాతాన్ని అణుచును . రొమ్మునకు బలమును ఇచ్చును.
మూత్రపు సంచిలోని పుండ్లు మాన్పును . శరీరంలోని అని అవయవములను బలమును ఇచ్చును. గొంతుకను , రొమ్మును మృదువుగా చేయును . దగ్గు,లివర్ నొప్పి , క్షయ మొదలగు రోగాలని అణుచును. కిడ్నీలకు బలమును కలుగచేయును . వాతమును అణుచును. పళ్లనొప్పి , దేహము బక్కగా అవ్వు సమస్య , శిరస్సుకు సంబందించు సమస్యలను నివారించును. మాటిమాటికి వచ్చు జ్వరమును నివారించును.
ఈ పప్పులను తినటం మొదలుపెట్టగానే శరీరంలోని వ్యర్థాలు బయటకి వెళ్ళుట ప్రారంభం అగును.
* వేరుశెనగ -
ఈ పప్పు చాలా బలకరం . వీటిని పచ్చిగానే తినినచో మంచి బలాన్ని కలగచేయును . వీటిని తినినచో శరీరంలోని వ్యర్థాలు బయటకి వెళ్ళును.
* టెంకాయ -
కొబ్బరి మరియు కొబ్బరి నీరు లొపలికి తీసుకోవడం వలన మంచి బలం కలిగించును. శరీరం లోని వేడిని తీసివేయును. తక్షణ శక్తిని ఇవ్వడంలో దీనిని మించినది ఏది లేదు . కేవలం టెంకాయ మాత్రమే తిని జీవించవచ్చు అని కొన్ని ఆయుర్వేద గ్రంథాలలో రాసి ఉన్నది.
No comments:
Post a Comment