✍️ *ముఖ్యమైన వ్యాధులు మరియు ఆయుర్వేద గృహ చిట్కాలతో అద్భుతమైన నివారణోపాయాలు:*
*విన్నపం: మిత్రులు అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని మీ శ్రేయష్షుని దృష్టిలో పెట్టుకొని ఎంతో సమయాన్ని కేటాయించి ఎలాంటి లాభాపేక్ష ఆశించకుండా ఈ గృహ చిట్కాలను మీకు అందిస్తున్నాము. ఈ నియమాలను అందరూ పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోగలరని ఆశిస్తూ... అలాగే ఈ సమాచారాన్ని అందరికి షేర్ చేస్తారని భావిస్తున్నాము.*
✍️ *షుగర్ వ్యాధికి గృహచిట్కా:*
👉నేరేడుగింజలు షుగర్ వ్యాధికి అద్భుతంగా పరిచేస్తాయి. గింజల్ని మెత్తగా దంచి అన్నంలో కలుపుకొని తినవచ్చు. లేదా మజ్జిగలో కలుపుకుని త్రాగవచ్చు.
👉మెంతుల్ని మొలకలు కట్టించి, ఎండబెట్టి, దోరగా వేయించి, కారప్పొడిలా తయారుచేసుకొని, షుగర్ తగ్గించుకోవడానికి వాడుకోవచ్చు. అయితే కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకుంటే బాగా పనిచేస్తుంది.
👉గింజతీసివేసిన ఉసిరికాయలను, పసుపుకొమ్ములను సమానభాగాలుగా తీసుకొని, మెత్తగా దంచి చూర్ణంలా చేసుకోవాలి. దీనిని రోజూ అరచెంచానుండి ఒక చెంచావరకు రెండుపూలటా గ్లాసు మజ్జిగలో కలిపిత్రాగితే, షుగర్ వ్యాధి, అదుపులో ఉంటుంది. షుగర్ కంట్రోలులోకి వచ్చేవరకు దీనితో పాటు మీరు అంతకు ముందుముందులువాడుతూ ఉండండి. తర్వాత నెమ్మదిగా మందులు తగ్గించుకోవచ్చు.
👉పొడపత్రి ఆకుకూడా షుగర్ వ్యాధిని అదుపులో ఉంచడానికి అద్భుతంగా పనిచేస్తుంది. పొడపత్రి ఆకులు, మారేడు లేత చిగుళ్ళు, నేరుడు గింజలు లోపలి పప్పును సమాన భాగాలుగా తీసుకుని బాగా ఎండిన తర్వాత మెత్తగా దంచుకోవాలి. ఒక చెంచా చూర్ణాన్ని మజ్జిగలో కలుపుకొని త్రాగితే షుగర్ ని కంట్రోలు చేయవచ్చు. వ్యాధి తీవ్రతను బట్టి, రెండు మూడు పూటలు తీసుకుంటే తీసుకుంటే మంచిది.
✍️ *మూత్రవ్యాధులు:*
👉మూత్రవ్యాధులకు పల్లేరు చాలా బాగా పనిచేస్తుంది. పెద్దపల్లేరు (గోక్చురా) కాయలతో సహా మొక్కని పెకలించి, శుభ్రపరిచి, ఎండబెట్టుకోవాలి. దీనిని మెత్తగా దంచి, రెండు చెంచాల పొడిని రెండు గ్లాసుల నీళ్ళలోపోసి, అరగ్లాసునీళ్ళు మిగిలేలా మరిగించాలి. ఇలా మిగిలిన నీరుకు పంచదార కలుపుకొని త్రాగితే, మూత్రంలో రాళ్ళు, మూత్రాశయం నుంచి రక్తస్రావం, చీమ కారటం, మూత్రంలో మంట, షుగర్ వ్యాధులు తగ్గుతాయి.
Note: షుగర్ ఉన్నవాళ్లు చక్కెర లేకుండా తీసుకోవాలి.
✍️ *సుఖవిరోచనానికి గృహచిట్కాలు:*
👉పావుకిలో సునాముఖి ఆకు ఎండినది తీసుకొండి. (పచారీ కొట్టులో కూడా దొరుకుతుంది).
👉మెత్తగా దంచి కలకండకాని, పాలబెల్లంకాని పావుకిలో తీసుకుని బాగా కలిసేలా దంచాలి.
👉 ఇందులో గింజతీసిన కరక్కాయలను ఐదారింటిని దంచి ఆ పొడిని కూడా కలుపుకోవాలి.
👉 రేలచెట్టు జిగురు కూడా దొరికితే సమపాళ్ళలో కలుపుకోవచ్చు.
👉ఈ మొత్తం చూర్ణాన్ని నీళ్ళలో ఉడికించి, బెల్లంతీగ పాకానికి వచ్చిన తర్వాత దించి, చల్లార్చి ఓ సీసాలో భద్రపరచుకోండి.
👉 రాత్రిపూట భోజనం తర్వాత పడుకునేముందు ఒకటి లేదా రెండు చెంచాలు తినండి.
👉 ఎంతతింటే ఉదయం ఫ్రీ విరోచనం అవుతుందో చూసుకుని దానినిబట్టి మోతాదు నిర్ణయించుకోండి.
👉షుగర్ వ్యాధి వారయితే బెల్లం తీసేసి మిగిలిన ద్రవ్యాలను మెత్తగా నూరి ఎండుద్రాక్షతో మాత్రలుగా చేసుకోవచ్చు.
✍️ *కీళ్ళనొప్పులకు చిట్కాలు:*
👉వంద గ్రాముల వెల్లుల్లిపాయల్ని దంచి చిక్కటి రసం పిండాలి.
👉మరో వంద గ్రాముల వెల్లుల్లిని మెత్తగా దంచి ఈ రసంలో కలుపుకోవాలి.
👉 దీంట్లో నెయ్యిగాని, నూనెగాని 100గ్రాములు కలిపి తడి పూర్తిగా పోయేవరకు మరిగించాలి.
👉తర్వాత మరోసారి వెల్లుల్లి గుజ్జును నూరి సీసాలో భద్రం చేసుకోండి.
👉 దీన్ని అన్నంలో కలుపుకొని తింటే కీళ్ళవాతం, పక్షవాతం వ్యాధుల్లో గొప్ప మేలు చేస్తుంది.
👉పిప్పిలి, మోడి, శొంఠి,సమానపాళ్ళలో తీసుకుని విడివిడిగా నేతిలో వేయించి మెత్తగా దంచి, జల్లించండి.
👉 ఒక్కొక్క చూర్ణం 50 గ్రా॥ల చొప్పున ఉన్నట్లయితే 400 గ్రా॥ పెరుగు, 400 గ్రా॥ నువ్వుల నూనె కలిపి పొయ్యిమీద పెట్టి మరగ పెట్టుకోవాలి.
👉 దీనిని గుడ్డలో వడకట్టుకోవాలి.
👉ఈ నూనెను నడుంనెప్పి ఉన్నచోట మర్దన చేస్తే ఉపశమనం ఉంటుంది. కాళ్ళు పట్టుకుపోవడం, తొడలు బిగుసుకుపోవడం తగ్గుతుంది.
👉ఒక గ్లాసునిండా చిక్కటి గంజి తీసుకుని దానిలో ఒక చెంచా శొంఠి పొడిని కలిపి తగినంత ఉప్పుగాని, పంచదార కాని వేసుకుని త్రాగితే కీళ్ళనొప్పులు తగ్గుతాయి. మలబద్ధకం లేనివారికి ఇది బాగా పనిచేస్తుంది.
👉త్రయోదశాంగ గగ్గులు, మహాయోగ రాజగగ్గులు వాతగజాంకుశం వంటి మందులు వ్యాధి తీవ్రత్రను బట్టి వాడుకోవచ్చు. ఇది ఆయుర్వేద మందులషాపుల్లో దొరుకుతాయి.
👉శొంఠి, పిప్పిళ్ళు, మిరియాలు మూడింటిని త్రికటుచూర్ణం పేరుతో ఆయుర్వేద మందుల షాపులో అమ్ముతారు. దీనిని ఒక అరచెంచా నుండి చెంచా వరకు తీసుకుని తగినంత ఉప్పు వేసి, పెరుగులో కలుపుకుని తినాలి. వాతం నెప్పులు, మెకాళ్ళ నెప్పి, నడుం నెప్పికి ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది.
👉మహాతైలం, శ్రీరజలాతైలం, విషముష్టితైలం, ధన్వంతరి తైలం వంటివి నొప్పులు ఉన్నచోట మర్దన చేస్తే నొప్పి వాపు తగ్గుతాయి.
✍️ *మొలలు:*
👉వ్యోషాది చూర్ణం, బృహత్ సూరడీవటి, గుడహరీతకి, సుదాక్షాసవం, అభయారిష్ట, క్రారిష్ట, కాంకాయనవంటి ఆయుర్వేద మందుల మొలలకు చక్కగా పనిచేస్తాయి. వైద్యుల సలహా మేరకు వాడుకుంటే మంచిది.
👉ఉత్తరేణి మొక్కని వేళ్ళు, ఆకులు, గింజలతో సహా సేకరించి మెత్తగా దంచి రసం తీసుకోవాలి. దీనికి తేనె, పంచదారతో కలిపి పూటకు రెండు చెంచాల రసం చొప్పున రెండుపూటలా తాగితే రక్తమొలలు తగ్గుతాయి.
👉కరివేప మొలలకు అద్భుతంగా పనిచేస్తుంది. దీని ఆకు, కాయ, వేరు, పై బెరడును సమాన పాళ్ళలో తీసుకుని ఎండబెట్టుకుని పొడి చేసుకోవాలి. రెండు చెంచాల పొడికి రెండు గ్లాసులనీరు కలిపి అరగ్లాసు అయ్యేలా మరగించుకోవాలి. దీనిని వడకట్టి తీపి కలుపుకుని తాగితే మొలల వ్యాధి తగ్గుతుంది.
👉రక్తమొలలో బాధపడేవారు రోజు 5,6 యాలకులు తినడం మంచిది.
👉నల్ల ఉలవలు వేయించి, పొడి కొట్టుకుని వాడుకోవచ్చు.
👉 ఉలవకషాయం, అలాగే మొలకలు వచ్చిన ఉలవలను ఎండబెట్టి చేసుకున్న చూర్ణాన్ని గాని రోజూ వాడుకుంటే మూలవ్యాధి తగ్గుతుంది.
👉 ఉలవలు వేడి చేస్తాయి. కాబట్టి వ్యాధి తీవ్రతనుబట్టి మోతాదు నిర్ణయించుకోవడం మంచిది.
👉పల్లేరుకాడల్ని ఎండబెట్టి మెత్తగా దంచి, రోజూ 1/2 నుండి 1 చెంచా వరకు పొడిని రెండుపూటలా తేనెతో కలిపి తీసుకుంటే మొలలబాధ తగ్గుతుంది.
👉 దర్భమొక్క వేళ్ళను ఎండబెట్టి పొడిచేసుకోవాలి. ఈ చెంచాలపొడిలో 2 గ్లాసుల నీళ్ళుపోసి, 1/2గ్లాసు మిగిలేలా మరిగించి వడకట్టి తీపి కలుపుకుని రెండుపూటలా తాగాలి.
👉బూడిదగుమ్మడి అద్భుతంగా పనిచేస్తుంది. ముదురు బూడిదగుమ్మడిని చిన్న ముక్కలుగా తరిగి, నీరు, పిండి, నేతిలో వేయించుకోవాలి. పిండిన నీరులో పంచదార కలిపి, పాకంపట్టి, గుమ్మడిగుజ్జును హల్వాలా చేసుకుని తింటే మంచిది. కూష్మాండ లేహ్యం పేరుతో ఇది ఆయుర్వేద మందులషాషులో దొరుకుతుంది.
👉చామంతి పువ్వులను ఎండబెట్టి పొడిచేసుకుని 2,3 చెంచాల పొడిని చెంబునీళ్ళలో మరిగించి చల్లారిన నీటితో మొలల్ని కడిగితే బాధ తగ్గుతుంది.
👉సుగందిపాల వేళ్ళు సన్ననివి అయితే నేరుగా వాడుకోవచ్చు. లావువేళ్ళయితే పై బెరడు వలిచి, పచ్చిదిగాని, ఎండబెట్టినదిగాని చూర్ణం చేసుకుని 1 చెంచా నీళ్ళు లేదా పాలలో కలుపుకుని రెండుపూటలా తీసుకుంటే బాగా పనిచేస్తుంది.
👉మొలలు ఏ స్థాయిలో బాధపెడ్తున్నా కందతో తయారుచేసుకునే ఈ మందును వాడి చూడండి. మంచి ఫలితాలు పొందవచ్చు.
👉నేతిలో వేయించి మిరియాలు పొడి ఒక కప్పు, అలాగే నేతిలో వేయించిన శొంఠిపొడి రెండు కప్పులు తీసుకొండి. పెద్ద పచారీ కొట్లలో చిత్రమూలం అనే మూలిక దొరుకుతుంది దొరకకపోతే మిగిలిన వాటితోనే తయారుచేసుకొండి. ఈ చిత్ర మూలాన్ని మెత్తగా దంచి, నాలుగు కప్పులు తీసుకోండి. దొరికితే అడవికంద లేకపోతే మామూలు కందను దంచి ఎనిమిది కప్పులు తీసుకోవాలి. ఈ మొత్తానికి సమానంగా 15 కప్పుల బెల్లం పొడిని కలిపి మళ్ళీ నూరండి. కుంకుడుకాయంతో మాత్రలు కట్టి, అరబెట్టుకుని, ఓ సీసాలో భద్రపరుచుకోండి. ఉదయం ఒకటి, రాత్రి ఒకటి మజ్జిగతో తీసుకుంటే, మొలలు త్వరగా తగ్గుతాయి.
✍️ *తామర వ్యాధిక చిట్కాలు:*
👉తామరకు మామిడి జిగురు చక్కటి ఉపశమనమిస్తుంది. చర్మం బెరడుగా కట్టినట్లుగా ఉన్నచోట్ల రాస్తే మెత్తబడి పొలుసులు రాలిపోతాయి.
👉బొప్పాయి పాలు తామరని తగ్గిస్తాయి.
👉గోరింటాకు పొడిని తడవకుండా చర్మానికి పట్టిస్తే ఫంగస్ తగ్గుతుంది.
👉బాదంపాలు తామరపైన, శోభిపైన కూడా పనిచేస్తాయి.
👉తులసి, వేప, దర్భ, సునాముఖి ఆకుల పొడిని పట్టించినా తామర తగ్గుతుంది.
👉ఆముదం, ఆవాలు, కరక్కాయ, ఆకుకరకాయ, ఉసిరిక కూడా తామరమీద పనిచేస్తాయి.
👉ఆముదం గింజలు పప్పు నూరి తామరమీద లేపనం వేయడం, ఆముదాన్ని పట్టించడం వల్ల చర్మం మెత్తబడి నొప్పి, దురద తగ్గుతుంది.
👉తామర నివారణకు పరిశుభ్రత ముఖ్యం.
✍️ *సోరియాసిస్:*
👉వేపచిగుళ్ళులో కొద్దిగా మిరియాలు కలిపి కొద్దిగా మెత్తగా నూరండి. ఆ గుజ్జుని కాసేపు నీడని ఆరబెట్టి కుంకుడు గింజంత మాత్రలు కట్టుకొని, రోజూ ఉదయం, సాయంత్రం ఒకటి రెండు మాత్రలు విడువకుండా కొన్ని నెలలు పుచ్చుకోండి.
👉వేప పూలను నేతిలోవేయించి, దంచి తగిన ఉప్పు కారం కలుపుకొని అన్నంలో తింటే మంచిది.
👉నేతిలో వేయించిన వాముపొడిని విడిగాకాని, వేపపూల పొడిలోకాని కలుపుకొని రోజూ తింటే సోరియాసిస్ వ్యాధి, వాత లక్షణాలు తగ్గుతాయి.
👉ఆకారకాయ మొక్క ఆకుల్ని కూరగా వండుకు తింటే చర్మవ్యాధులకు చాలా మేలుచేస్తుంది. ఈ మొక్క పువుల్ని నేతిలో వేయించి మెత్తగా దంచి తగినంత ఉప్పు కలుపుకొని అన్నంలో తింటే ఎలర్జీలు తగ్గుతాయి.
👉అరటికాయలు లేత పిందెలుగా ఉన్నప్పుడు కూరగా తరచూ వండుకు తింటే ఈ వ్యాధికి మంచిది. అరటిపూలను కూడా కూరగాను, పప్పుగాను వండి వాడుకోవచ్చు.
👉పసుపు కొమ్ముల్ని దంచి, ఆపొడిని నీళ్ళతో తడిపి ఒంటికి రాసుకుని అరగంట ఆరనిచ్చి స్నానం చేస్తే సోరియాసిస్ పొలుసులు మెత్తబడతాయి.
👉చిన్న దురదగొండి వేరును ఎండబెట్టి చూర్ణంగా చేసుకోవాలి. రెండు చెంచాల పొడిలో రెండు గ్లాసుల నీళ్ళుపోసి అరగ్లాసు మిగిలేలా మరిగించి, వడగట్టి తేనె లేదా పంచదార కలుపుకొని తాగితే శరీరతత్వం మారుతుంది.
👉టేకు మొక్కల ఆకులను నీడన ఆరబెట్టి పొడిచేసుకోవాలి. రెండు చెంచాల పొడిని 2 గ్లాసుల నీటితో కలిపి అరగ్లాసు అయ్యేలా మరిగించి వడగట్టి తాగితే వ్యాధి నెమ్మదిస్తుంది.
✍️ *కఫాన్ని హరించే చిట్కాలు:*
👉పిప్పళ్ళు, పిప్పలిమూలం, చవ్యం, చిత్రమూలం, శొంఠి (పచారీ కొట్లలో దొరుకుతాయి) అయిదింటిని ఎండబెట్టి మెత్తగా పొడికొట్టి జల్లించుకోవాలి. ఒకచెంచా పొడిని పెద్దగ్లాసులో నీళ్ళు కలిపి, నీరు పావు గ్లాసు మిగిలేలా మరగించుకోవాలి. దీనిని వడకట్టి తీసుకుంటే కఫం తగ్గుతుంది. కావాలంటే తీపి కలుపుకోవచ్చు.
👉కఫం ఎక్కువగా ఉన్నప్పుడు పిప్పిళ్ళను తీసుకుని నేతిలో వేయించి, పొడి కొట్టుకుని తేనెలో కలిపి ఒక అరచెంచా తీసుకుంటే సరిపోతుంది.
👉చిత్రమూలం, కరక్కాయలపై బెరడు, ఉసిరికాయల బెరడు, పిప్పిళ్ళను మెత్తగా దంచి పొడిచేసుకుని తీసుకుంటే కఫం తగ్గుతుంది.
✍️ *కామెర్లు:*
👉నేల ఉసిరి ఖాళీ ప్రదేశాలలో ఎక్కడయినా దొరుకుతుంది. ఇది లివర్ వ్యాధులకే కాక స్త్రీల గర్భాశయ వ్యాధులమీద పనిచేస్తుంది. వేళ్ళతో సహా ఈ మొక్కలను తీసుకుని ఎండబెట్టి, దంచి ఆపొడిని ఓ సీసాలో భద్రపచుకోండి. కామెర్లు కలిగినపుడు ఈ పొడిని తేనెతో కలిపి తీసుకుంటే బాగా పనిచేస్తుంది. దీనిని తీసుకున్న తర్వాత బియ్యాన్ని కడిగిన నీటిని త్రాగితే తెల్లబట్ట అవుతున్న వారికి బాగా ఉపయోగపడుతుంది.
✍️ *తెల్లబట్ట white discharge:*
👉కుక్కపుగాకు పొలాల్లో దొరుకుతుంది. దీనిలో ఔషధగుణాలు చాలా ఉన్నాయి. ఈ మొక్కల్ని వేళ్ళతో సహా తెచ్చుకుని, శుభ్రం చేసి ఎండబెట్టుకుని పౌడర్ చేసుకోండి. దీనిని ఓ సీసాలో భద్రపరచుకొని, పావుచెంచా లేదా అరచెంచా మోతాదులో కషాయం కాచుకుని తీసుకుంటే తెల్లబట్ట తగ్గుతుంది. నేల ఉసిరికను కూడా కలిపి వాడుకుంటే ఇంకా బాగా పనిచేస్తుంది. అతిగా తీసుకోవద్దు వేడి చేస్తుంది.
👉తోటకూరని వేళ్ళతో సహా తీసుకుని శుభ్రంచేసి, చిన్నచిన్న ముక్కలుగా తరిగి నీళ్ళలో వేసి బాగా మరిగించండి. నాలుగోవంతు నీరు మిగిలేలా మరిగిం చాలి. తర్వాత వడకట్టి, దీనికి తీపిగాని, ఉప్పుగాని కలిపి త్రాగండి. రెండుపూటలా తోటకూర రసం త్రాగితే, ఇన్ఫక్షన్ వల్ల కలిగే తెల్లబట్ట వ్యాధిని తగ్గిస్తుంది. బుతుకాలంలో అధిక రక్తస్రావం కాకుండా నివారిస్తుంది.
✍️ *బరువు, బలము పెరగాలంటే:*
👉రాత్రి నానబెట్టిన వేరుశనగ ఉదయం తింటే ఎంతో బలం.
👉 కండపట్టాలి అనుకునేవారు పచ్చికొబ్బరి ఎక్కువగా తినాలి. మొలకలతో పాటు ఉదయం తినొచ్చు. వీటితో పాటు 12 గంటలు నాబెట్టిన జీడిపప్పు, బాదాం పప్పు తినాలి.
👉పాలిష్ పట్టని ముడి బియ్యం అన్నం మద్యాహ్నం తినాలి.
👉కండపట్టాలి అనుకునేవారు సోయాచిక్కుడు గింజలను 15గంటలు నానబెట్టి అన్ని కూరలలో వేసుకోవచ్చు. లేదా అన్నంలో కూడా వేయవచ్చు. సోయాచిక్కుడు వలన గ్యాస్ ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. కావున సోయా రాత్రికి తినవద్దు. గ్యాస్ ప్రాబ్లం ఉన్నవారు అది తగ్గించుకొని సోయ వాడాలి.
👉సోయా గింజలలో 35 నుండి 40 శాతం ప్రోటీన్స్ ఉంటాయి. అన్ని గింజలలో కంటే ఎక్కువ ప్రోటీన్స్ కలిగిన గింజ సోయ.