Friday, May 3, 2024

అధిక రక్తపోటు- బీపీ- హైపర్ టెన్షన్- సమస్య యొక్క పూర్తి వివరణ మరియూ ఆయుర్వేద నివారణ మార్గాలు:*

✍️ *అధిక రక్తపోటు- బీపీ- హైపర్ టెన్షన్- సమస్య యొక్క పూర్తి వివరణ మరియూ ఆయుర్వేద నివారణ మార్గాలు:*

✍️ *బీపీ - రక్తపోటు అంటే ?*

👉ఒక మహాసముద్రం - ఒక మహా ప్రవాహం... ఒక మహానది..... పోటెత్తినప్పుడు కట్టలుదాటి ఎలా ముంచెత్తుతుందో రక్తప్రవాహం కూడా అంతే...

👉 పోటెత్తి... గుండెనీ, మూత్రపిండాల్ని, మెదడునీ, శరీరంలోని అవయవాల్ని విధ్వంసం చేసి వదుల్తుంది. రక్తపోటంటే సూక్ష్మంగా చెప్పాలంటే ఇదే.

👉పక్షవాతం వచ్చిందన్నా, హార్ట్ ఎటాక్ వచ్చిందన్నా రక్తపోటే ప్రధాన కారణంగా కనిపిస్తూ ఉంటుంది!

👉రక్తపోటు ఎంత ఎక్కువగా ఎన్ని ఎక్కువ రోజులుగా వుంటే దాని వలన కలిగే దుష్ఫలితాలు అంత ఎక్కువగా వుంటాయి. 

👉కాబట్టి రక్తపోటుని ఎప్పటి కప్పుడు ఒక కంట కనిపెట్టి అదుపులో పెట్టుకోవటం అవసరం అన్నమాట.

✍️ *బీపీ ఎలా వస్తుంది:*

👉గుండె ముడుచుకుని తెరుచుకొంటూ పంపులా పనిచేస్తుందని అందరికీ తెలుసు కదా...

👉అలా ముడుచుకున్నప్పుడు కొంత ప్రెషరుతో రక్తం గుండెలోకి రక్తనాళంలోకి చేరి అక్కడి నుంచి శరీరం అంతా వ్యాపిస్తుంది! 

👉మళ్ళీ గుండె తెరచుకున్నప్పుడు శరీరంలోంచి ఈ రక్తం రక్త నాళాల ద్వారా గుండెను చేస్తోందన్న సంగతి కూడా మీకు తెలుసు.

👉 ఇక్కడ విషయం అర్థం చేసుకోవాల్సింది ఒకటే! ఒకసారి గుండె ముడుచుకున్నప్పుడు బైటకు వచ్చే ప్రెషర్ తోనే పాదాల దాకా వచ్చి తిరిగి గుండెదాకా పైకిఎక్కుతోంది రక్తం!

👉 వచ్చేప్పుడు రక్తానికి వున్న ప్రెషర్ ని కొలిస్తే 120-140 మి.మీ. పాదరసం కొలతలో సాధారణంగా ఉంటుంది. గుండె రక్తాన్ని బైటకి పంపివేసేప్పుడు ఉండే 120-140 మి.మీ. పాదరసం కొలతని సిస్టోలిక్షర్ అంటారు.

👉 గుండె ముడుచుకుని తెరుచుకొని, మళ్ళీ ముడుచుకొంటుంది గదా... ఒకసారి ముడుచుకోవడానికి, రెండోసారి ముడుచుకోవడానికి మధ్యన ఉండే.. (తెరచుకున్న సమయం) విరామంలో రక్తపోటు 80-90 మి.మీ. పాదరసం కొలతలో ఉంటుందన్నమాట. దీన్ని డయాస్టోలిక్ ప్రెషర్ అంటారు. 

👉ఈ రెండు కొలతల్ని కలిపి 120/80 mmHg అని, 140/90mmHg అనీ రాస్తారు. ఇది ఆరోగ్యవంతుడి బ్లడ్ ప్రెషర్ సంగతి, ఇంతకన్నా ప్రెషర్ తగ్గినా, పెరిగినా అది జబ్బే అవుతుంది. 

👉పెరిగితే, హైపర్టెన్షన్ అనీ, తగ్గితే హైపోటెన్షన్ అనీ అంటారు.

👉రక్తపోటు ఎక్కువ అని ఎలా తెలుస్తుంది అనీ, దాని లక్షణాలు ఏమిటీ అనీ... చాలా మంది అడుగుతుంటారు! కటువుగానూ, కచ్చితంగానూ, కుండబద్దలు కొట్టినట్లుగానూ రక్తపోటు లక్షణాలు ఏమిటో చెప్పాలంటే మూడు మాటలు చాలు...... 1. పక్షవాతం 2. హార్ట్ ఎటాక్ 3. కిడ్నీ ఫెయిల్యూర్... అంతే!

👉దీన్నిబట్టి రక్తపోటు అనేది వేరే ఒక ప్రత్యేకమైన వ్యాధి కాదనీ, రక్తం మరీ ఎక్కువ పీడనంతో ప్రవహించటం వలన అనేక అనర్థాలు కలుగుతాయనీ గమనించాలి.

👉ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. సైకిల్ ట్యూబ్లోనూ, రబ్బర్ బూరలోనూ గాలి ఊదారు. ట్యూబ్ నిండా గాలిని ఎక్కించారు. ఇంకా ఎక్కించారు. ఇంకా ఇంకా ఎక్కించారు... ఏమౌతుంది... పగిలిపోతుంది!

👉 రక్తప్రవాహంలో పెరిగిన ప్రెషర్ వలన రక్తనాళాలు పొంగినంత పొంగుతాయి. ఇంకా పొంగే అవకాశం లేనప్పుడు ఎక్కడో ఒకచోట చిట్లి పెరిగిన ప్రెషర్ బైటకు పోతుంది. అది మెదడులో జరిగినప్పుడు పక్షవాతం వస్తోంది. 

👉అందుకే కిడ్నీలు, గుండె, మెదడు... ఈ మూడింటినీ ఒక కంట కనిపెట్టి, తగిన పరీక్షలు చేయించుకొంటూ జాగ్రత్తగా ఉండటం... రక్తపోటు తరచూ పెరిగేవారి విషయంలో మరీ మరీ అవసరం!!

✍️ *బి.పీ. పెరిగితే ఎలాంటి లక్షణాలు కన్పించవచ్చు:*

👉90 శాతం మంది బీపీ రోగులకు ఇది రావటానికి కారణం ఏమిటో తెలియదు. దీన్ని ఎసెన్షియల్ లేక ప్రైమరీ టెన్షన్ అంటారు.

👉 ఓ పది శాతానికి మాత్రం కిడ్నీలో రక్తనాళం మూసుకు పోవటం, మూత్రపిండాలలో సిస్ట్లు ఉండటం, మూత్రపిండాలకు సంబంధించి అనేక ఇతర వ్యాధులు ఉండటం ఒక కారణం కావచ్చు.

👉 స్టిరాయిడ్స్, హార్మోన్స్ వంటి కొన్ని మందులు కూడా బి.పీ. పెరగడానికి కారణం కావచ్చు.

👉కాబట్టి, వైద్యుడితో సంప్రదించి అవసరమైన చికిత్సని పొంది బి.పీ.ని అదుపులో పెట్టుకోవడం అవసరం! 

👉 బిపీ అనేది వంశపారంపర్య కారణాల వలన రావచ్చు. 

👉మానసిక వత్తిడులు, అనారోగ్యాలు, దిగుళ్ళు, స్థూలకాయం, పొగత్రాగడం ఇవన్నీ రక్తపోటు వ్యాధి పెరగడానికి కారణమయ్యే అంశాలే! 

👉వ్యాయామం చేసే అలవాటులేని వారికి, కుర్చీలో కూర్చుని అజమాయిషీ చేసే వైట్ కాలర్ వృత్తుల్లో ఉన్నవారికీ, పడక కుర్చీ వేదాంతులకీ ఎక్కువగా ఉంటుంది.

👉 కొద్దిగా తల తిరగడం, ఒళ్ళుతూలడం, తరచూ తలనొప్పి, కళ్ళు ఎర్రబడడం, కొద్దిపాటి శ్రమకు కూడా అమితంగా ఆయాసపడిపోవడం... ఇలాంటి కొన్ని లక్షణాలు బి.పీ. పెరిగినప్పుడు కొంతమందిలో కన్పిస్తాయి. 

👉చాలా మందిలో ఇలాంటి వార్నింగ్ సిగ్నల్స్ ఏమీ కన్పించకపోవచ్చు కూడా! పైకి తెలియకుండానే బి.పీ. లోలోనే చెయ్యకూడని నష్టాన్ని చేసే అవకాశం ఉంది.

👉 కాబట్టి వయసు 45 దాటిన ప్రతి వ్యక్తీ నేను బాగానే ఉన్నాను. అనుకోకుండా తప్పని సరిగా బి.పి. చెక్ చేయించుకోవడం అవసరమని మళ్ళీ మళ్లీ గుర్తుచేస్తున్నాను.

✍️ *రక్తపోటు వస్తే ఈ జాగ్రత్తలు తీసుకోండి:*

👉బి.పీ. వ్యాధిలో ఎలాంటి ఆహారం తీసుకోవాలనేది, ఈ వ్యాధి ఏఏ అవయవాలను దెబ్బతీస్తోందనే దాని మీద ఆధారపడి ఉంటుంది.

👉మూత్రపిండాలు, గుండె, మెదడు ఈ మూడు అవయవాలకూ సంబంధించిన ప్రత్యేక శ్రద్ధ బి.పి. వ్యాధిలో తప్పకుండా ఉండాలి.

👉పులుపు, పులిసిన వస్తువులు, చింతపండు, గోంగూర, బచ్చలి, చుక్కకూర వీటిని మానేయండి.

👉శనగపిండి వంటి అజీర్తిని కల్గించే ఆహార పదార్థాలు తీసుకోకండి.

👉 వేపుడు కూరలు, నూనె పదార్థాలు పూర్తిగా మానితే రక్తప్రసారం ఫ్రీగా జరిగి ప్రెషర్ తగ్గి గుండె జబ్బు రాకుండా ఆగుతుంది.

👉 ఊరగాయపచ్చళ్ళు, మసాలాలు, నిల్వపెట్టిన ఆహార పదార్థాల్లో ఉప్పు ఎక్కువగా కలుస్తుంది నూనె కూడా ఉంటుంది. కాబట్టి వీటిని తినకుండా ఉండటం అవసరం.

👉బీర, పొట్ల, సొర, తోటకూర, పాలకూర, మెంతికూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, ముల్లంగి, బెండ, దొండ, దోస, టమోటా... వీటిని బాగా తినండి!

👉చేపలు, రొయ్యలు బి.పీ.ని పెంచుతాయని గుర్తించండి.

✍️ *నివారణ మార్గాలు:*

👉 మాచే స్వయంగా తయారుచేబడిన “మహాసూర్యావర్తి” బి.పీ. వ్యాధికి అద్భుత ఆయుర్వేద ఔషధం గా పనిచేస్తుంది.

👉బి.పీ. పెరిగిన వారికి, పెరిగి ఎన్నాళ్ళకూ తగ్గని వారికీ, తగ్గినట్టే తగ్గి అంతలోనే పెరిగేవారికీ బి.పీ. వ్యాధి వచ్చే సూచనలున్న వారికీ, వంశపారంపర్యంగా బి.పీ. వ్యాధితో నతమతమయ్యే కుటుంబంలోని వారికీ ఈ బి.పీ. జాగ్రత్తలన్నీ వర్తిస్తాయి. 

👉ఆయుర్వేదంలో బి.పీ. వ్యాధిని ఒక పేరుతో సూచించలేదు. వాత పిత్త దోషాల వలన బి.పీ. పెరిగే అవకాశం ఉందని ఆయుర్వేద పండితులు చెప్తారు.

👉 దీన్ని “పిత్తరోగం” అని కూడా అంటారు. వాత పిత్త దోషాలను తగ్గించే ఆహార విహారాలు ఔషథాలు బి.పీ. ని కూడా తగ్గిస్తాయి.

👉“మహా సూర్యావర్తి రసం” పిత్త రోగాన్ని తగ్గించటంలో అద్భుతంగా పనిచేస్తుంది!

👉 బి.పీ వ్యాధిలో తల తిరుగుడు తగ్గడానికి మహాసూర్యావర్తి రసం ఉపయోగపడ్తుంది. కూర్చున్నా పడుకున్నా ఇల్లూ, గదీ, మంచం అన్నీ తిరిగి పోతున్నట్లుండటం... వంటి లక్షణాల్ని vertigo అంటారు. 

👉బండిమీద గానీ, రంగుల రాట్నం మీద గానీ, జెయింట్ వీల్ మీద గానీ కూర్చుని గిర్రున తిరిగినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది కాబట్టి ఈ లక్షణాన్ని “భ్రమ” అని పిలిచారు ఆయుర్వేద శాస్త్రంలో భ్రమించడం అంటే తిరగడమేకదా! మహాసూర్యావర్తి రసం ఈ భ్రమని పోగొడ్తుంది. ఇదే పిత్తరోగంలో ముఖ్యలక్షం.

👉బి.పీ. వ్యాధికి మూత్ర పిండాలు కూడా లోనయినప్పుడు శరీరానికి నీరు వస్తుంది. దీన్ని "ఎడిమా” అంటారు. ఈ లక్షణానికి "మహాసూర్యావర్తి" మంచి ఔషథంగా పనిచేస్తుంది!

👉ఈ ఔషథంలో “నాగకేసరం” అనే మూలిక ఉంది. ఇది ఇతర ఔషథాలు కల్గించే చెడు లక్షణాల్ని Side effects పోగొడ్తుంది. హృదయానికి బలాన్నిస్తుంది. విషదోషాల్ని తొలగిస్తుంది. బి.పీ. పెరగడానికి కారణమయ్యే ఆహార విహారాలలోని దోషాలను సరిచేస్తుంది. 

👉 స్టిరాయిడ్సు, హార్మోన్లు, ఎలర్జీని కల్గించే రకరకాల ఆహార పదార్థాలు, ఆహారంలో కల్తీలు కలిపిన రకరకాల విషరసాయన పదార్థాల వలన చాలా మందికి బి.పీ. పెరుగుతోంది. అందుకని "మహా సూర్యావర్తి" ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా ఎంతో మేలు చేస్తుంది.

👉వాంతి, వికారం, కడుపులో తిప్పటం, అజీర్తి... వాటిని పోగొట్టటంలో కూడా మహా సూర్యావర్తి మంచి ఉపకారి!

👉తలనొప్పి, కళ్ళు ఎర్రబడటం, తలబరువుగా ఉండటం, తలనరాలు పగిలి పోతాయేమో నన్నంత బాధ... ఇలాంటి వ్యాధి లక్షణాల్లో 'మహా సూర్యావర్తి" గొప్ప మేలు చేస్తుంది.

👉ఇందులో ఉన్న ఇంకో గొప్ప ఔషధం స్వర్ణభస్మం... ఆయా మూలికలు స్వర్ణభస్మం కలయిక వలన ఇంకా మరింత శక్తివంతంగా పనిచేస్తాయి. అదీ ఇందులో ముఖ్యమైన అనుకూల అంశం!

✍️ *ఈ "మహాసూర్యావర్తి"ని అందరూ వాడవచ్చు* :

👉‘మహా సూర్యావర్తి రసం' బి.పీ. రోగులు ఎవ్వరైనా నిరభ్యంతరంగా వాడవచ్చు.

👉గుండె, మూత్రపిండాలు, లివర్, ఊపిరితిత్తులు, మెదడు వ్యాధి లక్షణాలకు ఏ చికిత్స తీసుకొంటున్న వారైనా సరే దీన్ని ఆయా చికిత్సలకు అదనంగా వాడుకోవచ్చు.

👉షుగర్ వ్యాధి వాతం (వాయువు) వలన వస్తుంది. బి.పీ. వ్యాధి అంటే అగ్ని! అగ్నీ, వాయువూ తోడైతే ఏమౌతుంది ? కొంపలంటుకుంటాయి. కాబట్టి, షుగర్ వ్యాధి, బి.పీ. వ్యాధి రెండూ రావడం మరింత ప్రమాదకరం అని గుర్తించండి! ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉన్నవారు తప్పనిసరిగా మహాసూర్యావర్తిని వాడటం అవసరం.


No comments:

Post a Comment