Thursday, August 29, 2024

గోమూత్రం గురించి సంపూర్ణ వివరణ - ఉపయోగాలు .

గోమూత్రం గురించి సంపూర్ణ వివరణ - ఉపయోగాలు .

       మానవ శరీరము నందు వాత, పిత్త , కఫాలు ప్రధానపాత్ర వహించుచున్నాయి. కొన్ని కారణాల వలన వీటిలో అసమతుల్యత ఏర్పడినపుడు మానవునకు రోగాలు సంభవించుచున్నాయి. ఇలా సంభవించిన రోగాల నివారణకు గోమూత్రం ఒక గొప్ప ఔషధముగా పనిచేయును . గోమూత్రం విషదోషాన్ని హరించును . గోమూత్రం క్రిమిహరముగా కూడా పనిచేయును . మన శరీరము నందలి రోగ నిరోధకశక్తి తగ్గడం వలన కొన్ని రోగాలు రావటం జరుగును. గోమూత్రం రసాయన గుణములు కలిగి ఉండును. రోగనిరోధక శక్తి తగ్గటం వలన రసరక్తాధి ధాతువులు తగ్గును. అటువంటి సమస్యను కూడా గోమూత్రం నివారించును.

                గోమూత్రం నందు తామ్రము అను థాతువు కలదు. అది గోమూత్ర సేవన వలన మనుష్య శరీరం నందు ప్రవేశించినపుడు స్వర్ణముగా మారును . స్వర్ణం శరీరం నందలి సమస్తదోషములను నివారించును. రోగములలో రెండు రకాలు కలవు అవి మానసికం మరియు శారీరకం . మానసిక రోగం అత్యంత విషాదాన్ని కలిగించును. ఈ మనసిక విషాదం కలిగి ఉండటం వలన శరీరం నందు విషాణువులు ఉత్పత్తి జరుగుతుంది. ఈ విషాణువుల సమూహమే క్యాన్సరు వ్యాధిగా పరిమణించును.

                  గోమూత్రానికి విషాణువులను నివారించు గుణం కలదు. అందువలన క్యాన్సర్ నివారణలో ఈ గోమూత్రం అత్యద్భుతంగా పనిచేయును . అదేవిధంగా గోమూత్రాన్ని రసాయనిక విశ్లేషణ చేసినప్పుడు కొన్ని రకాల ధాతువులు ఆ మూత్రపరీక్ష నందు బయటపడినాయి. అవి వరసగా 

 నత్రజని , గంధకం , అమ్మోనియా , అమ్మోనియా గ్యాస్ , తామ్రము ( రాగి ) , పొటాషియం , మాంగనీస్ , యూరియా , లవణము , ఆరోగ్యాన్ని పెంపొందించే ఆమ్లములు , క్యాల్షియం , జలం , లోహము ( ఐరన్ ) , యూరిక్ ఆసిడ్ , ఫాస్ఫెట్ లు , సోడియం , కార్బానిక్ ఆసిడ్ , A , B , C , D విటమిన్లు , ఇతర ఖనిజములు , ల్యాక్టోజ్ ( ఇది పాలు ఇచ్చు గోవులలో ఉండును.) , ఎంజైములు , హిఫ్యూరిక్ యాసిడ్ , స్వర్ణక్షారము మొదలైనవన్నీ గోమూత్రం నందు కలవు.

             గోవు యొక్క వెన్నుముక లోపల సూర్యకేతు నాడి కలదు. ఎప్పుడైతే సూర్యకిరణములు గోవు యొక్క శరీరాన్ని తాకునో వెంటనే అప్పుడు సూర్యకేతు నాడి సూర్యకిరణాల సహాయముతో స్వర్ణమును తయారుచేయును . మూత్రపిండములు రక్తమును వడపోసినప్పుడు ఈ స్వర్ణక్షారం నిర్మాణం అగును. ఇది సర్వరోగహారం .

       గోమూత్రం సేకరించుటకు కొన్ని ప్రత్యేకమైన నియమాలు కలవు. వాటిని కూడా మీకు నేను వివరిస్తాను. 

  గోమూత్ర సేకరణ నియమాలు -

 * పరిసరముల నందలి అడివిలో లేక బీళ్లలో యథేచ్ఛగా తిరుగుతూ ఏ గోవు గడ్డిమేయునో మరియు నిర్మలమైన నీటిని తాగుచూ ఆరోగ్యముగా ఉండునో అట్టి గోవుయొక్క పాలు మరియు మూత్రం గొప్ప ఔషధగుణములు కలిగి ఉండును.

 * దూడ , పెయ్య , ముసలి ఆవు , ఎటువంటి గోవు యొక్క మూత్రం అయినను ఔషధ ప్రయోగానికి పనికివచ్చును.

 * ఎద్దు మూత్రం తీక్షణముగా ఉండును. కాని ఔషధోపయోగమునకు పనికివచ్చును. ఎందువలన అనగా ఆవు మరియు గోవు రెండూ ఒకే జాతికి చెందినివి .

 * గోమూత్రమును రాగి ,ఇత్తడి పాత్ర యందు ఉంచరాదు. మట్టిపాత్ర , గాజుపాత్ర , పింగాణిపాత్ర లేక స్టీలు పాత్రలో ఉంచవలెను.

 * ఎంతకాలం నిలువ ఉంచినప్పటికీ గోమూత్రం యొక్క గుణము తరగదు. దాని యందలి లోహము లేక తామ్రము కారణంగా దాని రంగు కొద్దిగా నలుపు లేక ఎరుపుగా మారవచ్చు . గోమూత్రం నందు గంగ ఉండునని చెపుతారు. గంగాజలం ఎలాగో గోమూత్రం కూడా ఎంతకాలం యున్నను చెడకుండా ఉండును. క్రిమికీటకాలు ఉత్పన్నం అవ్వవు.

 * పెద్దవారు ఉదయం 25ml ఒక కప్పు నీటితో కలిపి తీసుకోవచ్చు . సాయంత్రం కూడా ఇదే మోతాదులో తీసికొనవచ్చు. దీనివలన మలప్రవృత్తి ఎక్కువ అయ్యి ప్రేగులు శుభ్రపడును .ఎక్కువుగా విరేచనం అవుచున్నచో 10ml మోతాదులో తీసుకొనవచ్చు .

 * గోమూత్రాన్ని మధుమేహరోగం ఉన్నవారు తీసికొనవచ్చు. ఈ మధ్య కొంతమంది గోమూత్రం నందు బెల్లం కలిపి అమ్ముతున్నారు. అది మాత్రం నిషిద్దం. 

       పైన చెప్పిన ఉపయోగాలన్నీ దేశివాళి గోమూత్రాన్ని స్వీకరించినప్పుడే ఉపయోగపడును. జెర్సీ ఆవు మూత్రం వలన ఎటువంటి ఉపయోగాలు లేవు . 

  
      

Tuesday, August 27, 2024

స్త్రీల సౌందర్యానికి చిట్కాలు -

స్త్రీల సౌందర్యానికి చిట్కాలు - 

 నల్లటి మచ్చలు ,మంగు నివారణ -

 * జాపత్రిని మంచినీటితో మెత్తగా నూరి రాత్రిపూట ముఖానికి లేపనం చేసుకొని ఉదయాన్నే గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపర్చుకొనుచున్న అతిత్వరలోనే ముఖము పైన కల మంగు ,నల్లమచ్చలు మాయం అగును . 

 * మిరియాలు గోరోజనముతో కలిపి నూరి పైకి లేపనం చేయుచున్న మొటిమలు తగ్గును . మచ్చలు పోవును . 

 * బాదం పప్పును నీటితో నూరి వడకట్టగా వచ్చిన పాలను ముఖంపై మర్దన చేయుచున్న క్రమంగా నల్లమచ్చలు , మంగు , మొటిమలు త్వరలోనే హరించును . 

 * ధనియాలు , వస , సుగంధపాల ఈ మూడింటిని సమభాగాలుగా తీసుకుని మెత్తటి చూర్ణముగా చేసి ఈ చూర్ణమును ఒంటికి నలుగు పిండిలా పట్టించుచున్న నల్లటి మచ్చలు , మొటిమలు తగ్గును . 

 * నిమ్మరసమును పాలతో కలిపి రాత్రిపూట ముఖానికి మర్దన చేసుకుని తెల్లవారిన తరువాత లేవగానే గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుగుకొనవలెను . సబ్బు వాడరాదు . ఇలా క్రమం తప్పకుండా చేయుచున్న మచ్చలు , మంగు పోయి ముఖం కాంతివంతం అగును . 

 * తులసి ఆకుల రసములో కొద్దిగా టంకణం ( Borax ) కలిపి పైకి లేపనం చేయుచున్న ముఖం పైన మచ్చలు , మంగు హరించును . 

 * మంజిష్ట చూర్ణమును ఆవుపాలతో కలిపి అరగదీసి అందులో కొంచం తేనె కలిపి ముఖమునకు లేపనం చేయుచున్న నల్లమచ్చలు , మంగు హరించును . 

   
      

Friday, August 23, 2024

జన్మచేత కాదు వర్ణం...

జన్మచేత కాదు వర్ణం...

(సనాతన ధర్మం యొక్క ముఖ్యమైన విషయాలు)

బ్రాహ్మణులుగా పూజించబడి .. ఈరోజుకీ పూజింపబడుతూ .. యజ్ఞయాగాలలో నేటికీ హవిర్భాగములు కూడా అందుకుంటున్న బ్రాహ్మణేతరులు .. 

(వజ్రసూచికోపనిషత్తు ప్రకారం ..) 

1. ఋష్యశృంగుడు .. జింకలు పట్టుకునే జాతులకు పుట్టినవాడు.

2. కౌశికుడు .. గడ్డి కోసుకునే జాతికి చెందినవాడు.

3. జంబూక మహర్షి .. నక్కలు పట్టుకునే జాతివారు ..

4. వాల్మీకి .. ఓ కిరాతకుల జాతికి చెందిన వాడు. ఈతను రచించిన రామాయణం .. హిందువులకు పరమ పవిత్రమైన గ్రంథం. ఈయన్ని ఆదికవిని చేసి పూజిస్తారు.

5. వ్యాసుడు .. ఓ చేపలుపట్టే బెస్తజాతికి చెందినవాడు. హిందువులకు పరమపవిత్రమైన వేదములు .. ఈయన చేత విభజన చేయబడ్డవే. అందుకే ఇతణ్ణి వేదవ్యాసుడు .. అని పూజిస్తారు. 

6. గౌతముడు .. కుందేళ్లు పట్టేజాతికి చెందినవాడు.

7. వశిష్టుడు .. ఓ వేశ్యకు పుట్టినవాడు. కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు. ఈతని భార్య మాదిగ స్త్రీ అయిన అరుంధతీదేవి. ఈరోజుకు కూడా నూతన దంపతులచేత అరుంధతీవశిష్టులకు నమస్కారం చేసే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ప్రతి పూజలోనూ హిందువులచేత .. అరుంధతీవశిష్ఠాభ్యాం నమః .. అని పూజలందుకుంటున్నారు. 

వీరి కుమారుడు శక్తి. ఇతని భార్య ఓ మాదిగ వనిత .. ఛండాలాంగని. వీరికుమారుడే పరాశరుడు. ఈతను ఓ బెస్తవనిత మత్స్యగంధిని వివాహమాడి వ్యాసుణ్ణి కన్నారు. 

8. అగస్త్యుడు .. మట్టి కుండల్లో పుట్టినవాడు.

9. మతంగ మహర్షి.. ఒక మాదిగవాని కుమారుడు. బ్రాహ్మణుడయ్యాడు. ఈతని కూతురే .. మాతంగకన్య .. ఓ శక్తి దేవత. కాళిదాసుతో సహా ఎందరో మహానుభావులు ఈ మాతను ఉపాసించారు. ఉపాసిస్తూ ఉన్నారు. ఈమే శ్యామలాదేవి.

ఇంకా ..

1. ఐతరేయ మహర్షి ఒక దస్యుడి మరియు కిరాతకుడి కుమారుడు .. అంటే నేటి లెక్కల ప్రకారం SC or ST. జన్మ బ్రాహ్మణుడు కాదు. కానీ అత్యున్నతమైన బ్రాహ్మణుడు అయ్యాడు. అతను వ్రాసినవే ఐతరేయ బ్రాహ్మణం మరియు ఐతరేయోపనిషత్తు. ఐతరేయ బ్రాహ్మణం చాలా కష్టమైనది. ఇది ఋగ్వేదాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తారు.

2. ఐలుష ఋషి ఒక దాసీ కుమారుడు. అతను ఋగ్వేదంమీద రిసెర్చ్ చేసి చాలా విషయాలు కనిపెట్టాడు. అతన్ని ఋషులందరూ ఆహ్వానించి తమకు ఆచార్యుణ్ణి చేసుకున్నారు ( ఐతరేయ. బ్రా. 2.19)

3. సత్యకామ జాబాల మహర్షి ఒక వేశ్య కుమారుడు. తండ్రి పేరే కాదు.. కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు. కానీ జ్ఞానం చేత బ్రాహ్మణుడు అయ్యాడు.

ఉన్నతవంశాలలో పుట్టినవారిని కూడా వారిధర్మం నిర్వర్తించకపోతే .. వారిని నిర్మొహమాటంగా బహిష్కరించారు ... వారిలో కొందరు

1. భూదేవి కుమారుడు .. క్షత్రియుడైన నరకుడు .. రాక్షసుడైనాడు.

2. బ్రహ్మవంశజులైన హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణుడు,.. బ్రాహ్మణులైనా .. రాక్షసులయ్యారు ..

3. రఘువంశ మూలపురుషుడైన రఘుమహారాజు కుమారులలో ఒకడు అయిన ప్రవిద్ధుడు .. రాక్షసుడైనాడు. 

4. త్రిశంకుడు క్షత్రియుడు. కానీ చండాలడు అయ్యాడు.

5. విశ్వామిత్రుడు క్షత్రియుడు.. బ్రాహ్మణుడైనాడు .. వీరి వంశస్తులే .. కౌశికస గోత్ర బ్రాహ్మణులయ్యారు. విశ్వామిత్రుని కుమారులు కొందరు శూద్రులయ్యారు.

6. నవ బ్రహ్మలలో ఒకడైన దక్ష ప్రజాపతి కుమారుడు పృషధుడు. బ్రహ్మ జ్ఞానం లేని కారణాన శూద్రుడిగా మారిపోయాడు ( విష్ణుపురాణం 4.1.14)

7. నేదిష్టుడు అనే మహరాజు కుమారుడు .. నాభుడు. ఇతనికి క్షాత్ర జ్ఞానం లేని కారణాన, వర్తక జ్ఞానం కారణాన వైశ్యుడిగా మారవలసి వచ్చింది ( విష్ణుపురాణం 4.1.13). 

8. క్షత్రియులైన రథోతరుడు, అగ్నివేశ్యుడు, హరితుడు .. బ్రహ్మ జ్ఞానం వలన బ్రాహ్మణులైనారు. హరితుని పేరుమీదే .. ఇతని వంశబ్రాహ్మణులకు హరితస గోత్రం వచ్చింది (విష్ణుపురాణం 4.3.5).

9. శౌనక మహర్షి కుమారులు .. నాలుగు వర్ణాలకు చెందినవారుగా మారారు (విష్ణుపురాణం 4.8.1).

10. అలాగే గృత్సమదుడు, వీతవ్యుడు, వృత్సమతి ... వీరి కుమారులు కూడా నాలుగు వర్ణాలకు చెందినవారు అయ్యారు.

వీరిలో చాలామంది .. వేదమంత్రాలు కూడా రచించినవారు.

హిందూ ధర్మం జ్ఞానం మీద ఆధారపడినది ..జన్మం మీద కాదు. 
 👏🏼👏🏼

Thursday, August 22, 2024

మఱ్ఱిచెట్టు యొక్క ఔషధ గుణాలు మరియు ఉపయోగాలు:*

*మఱ్ఱిచెట్టు యొక్క ఔషధ గుణాలు మరియు ఉపయోగాలు:*

• మఱ్ఱిచెట్టును పూజిస్తే ఆధ్యాత్మికంగా ఎన్నో ప్రయోజనాలని చెబుతారు అవేంటంటే.... వ్యాపారం, ఉద్యోగంలో వచ్చిన కష్టనష్టాల నుంచి బయటపడాలంటే మఱ్ఱిచెట్టు కింద నెయ్యి దీపం వెలిగిస్తే అన్ని అడ్డంకులు తొలగిపోతాయి.
• ఇంట్లో ఎవరైనా చాలా కాలంగా అనారోగ్యంతో ఉంటే, రాత్రిపూట వారి దిండుకింద మఱ్ఱివేరు ఉంచితే ఆరోగ్యం క్రమంగా మెరుగు పడుతుందని విశ్వసిస్తారు.
• మఱ్ఱిచెట్టు కింద కూర్చుని హనుమాన్ చాలీసా పఠించడం వల్ల భయం తొలగిపోయి మానసిక ఒత్తిడి తగ్గుతుందని చెబుతారు.
• ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉంటే, గుడి దగ్గరున్న మఱ్ఱిచెట్టు కొమ్మను తీసుకొచ్చి ఇంట్లో పెడితే పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుందని చెబుతారు.
• మఱ్ఱి చెట్టు ఆకులు ఇంకా విచ్చుకోక ముందు ఎర్రగా మొగ్గల్లా ఉంటాయి. వాటిని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని త్రాగితే తరచు విరేచనాలు, డిసెంట్రీతో బాధపడేవారికి మంచిది.
• మఱ్ఱిపాలు 5 చుక్కల్ని 1 గ్లాసుడు పాలలో కలిపి తీసుకుంటే బ్లీడింగ్ పైల్స్ కి మంచి మందు.
• ఊడల నుంచి జాలువారే లేత వేరులు స్త్రీల సంతాన సాఫల్యత పెంచుతాయి. మఱ్ఱి వేర్లను ఎండించి, దంచి, పొడుమువలె చేసి పాలలో కలిపి ఋతుస్నానం అయిన తర్వాత వరుసగా 3 రాత్రుల పాటు తాగితే సంతానం కలుగుతుందని ఆయుర్వేదం చెబుతుంది. అలాగే మఱ్ఱి స్త్రీల జననాంగ సమస్యలలో కూడా బాగా ఉపకరిస్తుంది. మఱ్ఱి బెరడును కషాయం కాచి దానిని గోరు వెచ్చగా ఉండగా యోని ప్రక్షాళన చేస్తే లుకేరియా తగ్గుతుంది.
• మఱ్ఱి ఊడలతో పళ్ళు తోముకుంటే దంత సమస్యలు రావు.
• మఱ్ఱి పాలు కీళ్ళ నొప్పులున్న చోట రాస్తే నొప్పులు తగ్గుతాయని గిరిజనుల నమ్మకం.
• మఱ్ఱి ఆకులు కోయగా వచ్చిన పాలను పులిపిరులమీద ఉంచితే అవి తగ్గిపోతాయి.
• పాదాలు పగిలిపోతే మఱ్ఱి చెట్టు కాండం నుంచి వచ్చిన రసాన్ని ఆ పగుళ్ళకు రోజూ రాస్తే ఉపయోగం ఉంటుంది.
• మఱ్ఱి వూడలను చిన్న ముక్కలుగా కోసి, గాలికి ఎండబెట్టి దంచి పొడిజేసి జల్లెడ పట్టి నిల్వ జేసుకోవాలి. రోజూ రెండు పూటలా ఒక చెంచా మోతాదుగా ఈ పొడిని తిని మంచినీరు త్రాగుతుంటే రకరకముల యోని స్రావాలు తగ్గిపోతాయి. అధిక వేడి నశించిపోతుంది. శరీరమునకు మంచి రంగు, కాంతి వస్తాయి. అంతకుముందు తరిగిపోయిన బలం మరలా సమకూరుతుంది.
• మఱ్ఱిచెట్టు లేత వూడల రసం 10 గ్రాములు తీసుకొని దానిలో మెత్తగా నూరిన 5 మిరియాల గంధాన్ని కలిపి ప్రతిరోజూ సేవిస్తుంటే కుష్టు రోగాలు, సవాయి మేహరోగములు, చర్మరోగములు హరించిపోతుంది.

• ఎర్రగా ఉండే మెత్తని మఱ్ఱి చిగుళ్లను తెచ్చి నీడలో ఎండించి పొడి చేయాలి. అరచెంచా పొడిచేసి పావులీటరు కషాయం మిగిలే వరకు చిన్నమంటపై కాచి దించి వడపోసి దానిలో తగినంత కలకండ గలిపి వేడిగా ఉదయం సాయంత్రం తాగుతుండాలి. దీనివల్ల మెదడుకు బలం కలుగుతుంది. తలలో పేరుకున్న కఫము హరించిపోయి తుమ్ములు ఆగిపోయి, ప్రశాంతత కలుగుతుంది.
• బాగా ముదిరిన మఱ్ఱి ఆకులను ఎండించి ఒక లీటరు మంచినీటిలో 10 గ్రాముల బరువు ఉన్న మఱ్ఱి ఆకులను వేసి పావులీటరు కషాయము మిగిలేవరకు చిన్న మంటపై మరగపెట్టి దించి వడపోసి అందులో మూడు చిటికెలు ఉప్పు కలిపి ఉదయం, సాయంత్రం తాగుతుండాలి. దీని వల్ల పీడకలలు రావటం, గుండె బరువై వూపిరాడక పోవటం, నిద్రలో పెద్దగా అరవటం భయపడడం తగ్గిపోతాయి.
• లేత మఱ్ఱి ఆకులు 10 గ్రాములు తీసుకొని మంచినీరు 150 గ్రాములు కలిపి మెత్తగా నూరి పల్చని గుడ్డతో వడకట్టాలి. అందులో కొంచెం కలకండ కలిపి రెండుపూటలా త్రాగుతుంటే గుండెదడ పూర్తిగా తగ్గిపోతుంది.
• మఱ్ఱి ఆకులు 20 గ్రాములు, 7 లవంగాలు ఈ రెండింటినీ కలిపి మెత్తగా నూరి ఆ ముద్దను బట్టలో వేసి రసం పిండి దానిలో కొంచెం కలకండ కలిపి త్రాగితే వాంతులు వెంటనే తగ్గిపోతాయి.
• లేత మఱ్ఱి మొగ్గలు 10 గ్రాములు గ్రహించి తగినంత నీరు కలిపి మెత్తగా నూరి బట్టలో వడపోసి కండ చక్కెర కలిపి రెండు పూటలా త్రాగుతుంటే విరేచనాలు, నీళ్ల విరేచనాలు కట్టుకుంటాయి.
• లేత మఱ్ఱి ఆకులు 25 గ్రాములు తీసుకొని పావు లీటరు మంచి నీటిలో కలిపి మెత్తగా నూరి గుడ్డలో వడపోసుకుని రోజూ త్రాగుతుంటే రక్తమొలలు పూర్తిగా తగ్గిపోతాయి. రక్తస్రావం వెంటనే ఆగిపోతుంది.
• లేత మఱ్ఱి మొగ్గలు 10 గ్రాములు గ్రహంచి దానితో పాటు బాగా లేతగా ఉన్న దేశవాళీ వంకాయ ఒకటి కలిపి, ఆ రెండింటినీ కలుపుకుని తింటుంటే నడుము నొప్పి తగ్గుతుంది.
• మఱ్ఱి ఆకులను నీటిలో వేసి చిన్నమంటపైన మరగబెడుతూ కషాయం చిక్కబడే వరకు మరిగించి దించి ఆ కషాయంలో తగినంత కలకండ కలిపి సేవిస్తుంటే అపరిమితమైన వీర్యవృద్ధి వృద్థి కలుగుతుంది.
• మఱ్ఱి ఆకులను నీడలో ఎండబెట్టి దంచి పొడిచేసి సమానముగా చక్కెర కలిపి నిలువ చేసుకోవాలి. ఉదయం సాయంత్రం సగము చెంచా మోతాదుగా ఈ పొడిని మంచి నీటితో సేవిస్తుంటే స్త్రీల బట్టంటు రోగాలు పూర్తిగా తగ్గిపోతాయి.
• మఱ్ఱి ఆకుల చూర్ణమును చేసుకొని రెండు పూటలా పావు చెంచా మోతాదుగా ఈ పొడిని మంచినీటితో సేవిస్తుంటే కీళ్ళనొప్పులకు అద్భుతంగా పనిచేస్తాయి.
• మఱ్ఱి ఆకులు 20 గ్రాములు తీసుకొని కొంచెం నలగ గొట్టి అరలీటరు మంచినీటిలో వేసి పావు లీటరు కషాయము మిగిలే వరకు చిన్నమంటపై మరగబెట్టి దించి వడపోసి గోరువెచ్చగా అయిన తరువాత దానిలో ఒక చెంచా మంచి తేనె ఒక చెంచా కలకండ కలిపి రెండుపూటలా సేవిస్తుంటే రక్తములోని మాలిన్యాలు తొలగిపోయి రక్తము శుభ్రపడి చర్మవ్యాధులు తగ్గిపోతాయి.


లక్షణాలని బట్టి మన శరీరతత్వం తెలుసుకునే ప్రాచీన వైద్య విధానం

లక్షణాలని బట్టి మన శరీరతత్వం తెలుసుకునే ప్రాచీన వైద్య విధానం -

 * శరీరపు లక్షణం -

      వాతరోగి శరీరం నల్లగా ఉండును. పైత్యరోగి శరీరం పచ్చగా కాని , ఎర్రగాకాని ఉండును. శ్లేష్మరోగి శరీరం తెల్లగా ఉండును. ఏవైనా రెండురకాల తత్వాలు కలిగినటువంటి వారియొక్క శరీరం మిశ్రమ వర్ణంగా ఉండును.సన్నిపాత రోగి ( Typhoid ) శరీరం పాలిపోయినట్లు ఉండును.

 * శబ్ద లక్షణం - (నాడి లక్షణం ).

       వాత నాడి కలిగినవాడు నెమ్మదిగా మాట్లాడును . పైత్యనాడి కలిగినవాడు నవ్వుచూ 
తుళ్ళుతూ ఉండును. శ్లేష్మ నాడి కలిగినవాడు సన్నటి , వినివినపడనట్టు గా మాట్లాడును . 

 * నేత్ర లక్షణం -

        వాతరోగి కనులు నల్లగా కాని మబ్బుగా ఉండి నీరు కారుచుండును. పైత్యరోగి కన్నులు పచ్చగా కాని ఎర్రగా కాని ఉండును. శ్లేష్మరోగి కనులు పుసిగట్టి తెల్లగా ఉండును. సన్నిపాత రోగి కనులు పచ్చగా కాని ఎర్రగా కాని ఉండును. కామెర్ల రోగి కనులు పచ్చగా ఉండును.

 * మల లక్షణం - 

       వాతరోగి మలము నల్లగా గట్టిగా మేక పెంటికలు వలే ఉండును. పైత్య రోగి మలము పచ్చగా కాని , ఎర్రగా కాని ఉండును. శ్లేష్మరోగి మలము తెల్లగా , బంకగా నురుగు కట్టి ఉండును. రెండురకాల తత్వాలు కలిసి ఉన్న రోగి మలము మిశ్రమ వర్ణంగా ఉండును.

 * ముత్ర లక్షణం -

         వాతరోగి మూత్రం తెల్లగా ఉండును. పైత్యరోగి మూత్రం కొంచం ఎరుపుగా ఉండును. కామెర్ల రోగి మూత్రం పచ్చగా ఉండును. శ్లేష్మరోగి 
మూత్రం తెల్లగా నురుగు కట్టి ఉండును. రెండురకాల తత్వాలు పెరుగుట వలన రోగం కలిగిన రోగి మూత్రం మిశ్రమంగా ఉండును.

                  ఉదయాన్నే నిదుర లేచిన వెంటనే వెడల్పాటి తెల్లని పాత్రలో రోగి మూత్రమును పట్టి అందు నూనెచుక్క వేసిన అది వేగముగా మూత్రం అంతా పాకిన వాతరోగం అనియు , మూత్రం రక్తవర్ణంతో ఉండి మూత్రం వేచిన కదలక ఉండిన పైత్యరోగం అనియు , నూనెవేసిన వెంటనే ఆ నూనె చుక్క యందు బుడగలు లేచి మూత్రం పచ్చగా ఉండిన శ్లేష్మరోగం అనియు , మూత్రంలో వేసిన నూనె చుక్క తెల్లటి నురుగు కట్టిన సన్నిపాతరోగి అనియు , నూనె చుక్క వేసిన వెంటనే ఆ నూనె చుక్క ఏనుగు ఆకారంలో రావడం లేదా మనిషి ఆకారం వలేగాని తమలపాకు ఆకారం రావటం కాని లేక వేసిన వెంటనే మునిగిపోవడం గాని జరగడం లేదా మూత్రం నల్లగానో , ఎర్రగానో , పచ్చగానో ఉండిన ఆ రోగి యొక్క రోగం నయంచేయుట అసాధ్యం .

                నూనెబొట్టు పద్మాకారం గాని , శంఖచక్రాకారం గాని , వీణ ఆకారంగాని , సింహాసన ఆకారం కాని మల్లెమొగ్గ వలే ఉండిన ఆ రోగి యొక్క రోగం నయం చేయుటకు సాధ్యం అగును.

 * నాలిక యొక్క లక్షణం -

          నాలిక పగిలి పైన పోర పచ్చగా ఉండిన వాతరోగం అనియు నాలిక పైన ద్రవం కలిగి తెల్లగా ఉండిన శ్లేష్మరోగి అనియు నాలిక పైపొర రేగి నల్లగా ఉండి అసలు తడి లేకుండా ఉన్నచో సన్నిపాత రోగి అనియు మిశ్రమవర్ణం కలిగి ఉన్న రెండురకాల తత్వాలు ప్రకోపించుట వలన కలిగిన లక్షణం అని తెలుసుకొని చికిత్స చేయవలెను .

             పైన చెప్పిన లక్షణములు అన్నియు గమనించవలెను. ఒక్క నాడిని పట్టుకొని మాత్రమే రోగ నిర్థారణ చేయడమే కాకుండా రోగి యొక్క లక్షణాన్ని బట్టి వైద్యం చేయడం ప్రతి వైద్యుడు నేర్చుకోవలసిన ప్రధమ లక్షణం . నేను మీకు వివరించిన ప్రతిలక్షణాన్ని జాగ్రత్తగా పరిశీలించి గుర్తుపెట్టుకొన్న యెడల సమస్య ఉత్పన్నం కాకుండా మునుపే తగినజాగ్రత్తలు తీసుకొనచ్చు.

 
      

పురుషాంగము పెరుగుటకు


🌹 పురుషాంగము పెరుగుటకు🌹

 పంది కొవ్వు, స్వచ్ఛమైన ఆవు నెయ్యి, రెండు సమభాగములుగా కలిపి నూరి లింగముపై లేపనము చేయుచుండినా ఎడల, నపుంసకత్వము హరించి లింగము స్థూలంగా పొడవుగా పెరుగును ఇలా 80 రోజులు చేయాలి, గమనిక :కేవలం 10 రోజులకొకసారి మాత్రమే స్త్రీ సంగమం చేయాలి,,లేదా స్త్రీ పత్యం కడితే ఇంకా మేలుగా ఉండును.

రెండవ ప్రయోగం:- 
 దూలగొండి, పౌడర్, 50 గ్రాములు, శతవారి, 50,గ్రాములు, నేల తాడి 50,గ్రాములు, 150,గ్రాముల మిశ్రీ, కలుపుకొని డబ్బాలో వేసుకొని, ప్రతిరోజు ఉదయం, రెండు వేళ్ల కు వచ్చినంత పౌడర్, పాలలో గాని లేదా నీళ్లలో గాని కలుపుకొని త్రాగవలెను, దాదాపుగా ఈ ఔషధము 60 రోజులు సేవించితే, మంచి గుణం కనిపించును

Saturday, August 10, 2024

హిందుధర్మము నుంచి సైన్స్ పుట్టింది అనటానికి ఎన్నో ఉదాహరణలు

🕉️DR RAMESH POTENT FAMILY ACE TO MEF SHAMBALA🕉️ *హిందుధర్మము నుంచి సైన్స్ పుట్టింది అనటానికి ఎన్నో ఉదాహరణలు...!!!*
*1.కేవలం నీటి నుంచి సంతాన ఉత్పత్తి : భీష్ముడు జననం*. 
*2.నేతి కుండలలో పిండాల అభివృద్ధి = ఇప్పటి టెస్ట్ ట్యూబ్ బేబీ ల జననాలు = 100 మంది కౌరవులు ఏక కాల సంవత్సరంలో జననం*.
*3. పంచ భూతాలు నుంచి, అంటే గాలి, నేల, నీరు, నిప్పు, ఆకాశం నుంచి జననం :*
*పంచ భూతాలు+కుంతి= పాండవుల జననం..*
*4. ఆచార్య ద్రోణుడు, భరద్వాజ మహర్షి : టెస్ట్ ట్యూబ్ బేబీలు, కృపాచార్యుడు, కృపి అనే అన్నా చెల్లెళ్ళు కూడా టెస్ట్ ట్యూబ్ బేబీలే.. కానీ ఈ ఇద్దరి టెస్ట్ ట్యూబ్ పిల్లలకి పెళ్లి చేసి తద్వారా మామూలు కలయిక,ద్వారా పిల్లలను కనవచ్చా లేదా అన్నది ప్రాక్టికల్ గా ప్రయోగం చేశారు..తద్వారా అశ్వత్థామ జననం..*
*5. 🌞🌝ఒక మనిషి , సూర్యునిలో ఉన్న తేజస్సుని గ్రహించి *సూపర్ నాచురల్ ప్రొటెక్షన్* తో బిడ్డకు జన్మించటం : సూర్యుడు + కుంతి = కర్ణుని జననం*
 *6. 🌞🌞. అగ్ని నుంచి వచ్చే *తేజస్సు* *తో పిల్లలను కనటం : ద్రౌపది, దుష్టద్యుమ్నుల జననం..*
*7. సాధారణ మానవునికి, ఒక అసాధారణ వనితకి వివాహం : భీముడు + హిడింబి = ఘటోత్కచుడు..*
*8. ఆడదాన్ని మగ వాడిగా మార్చటం = శిఖండి* 
*👉🏻gender transformation.*
 *9. మగ వాడిని ఆడదానిగా మార్చటం = చిత్ర రధుడు.*.
*10. చేప కడుపున ఆడపిల్ల పుట్టటం : సత్యవతి..*
*👉🏻ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి..కేవలం ఒక్క మహా భారత గ్రంథంలోనే ఇన్ని ఉంటే, మన రామాయణ, భాగవతాలు, అష్టా దశ పురాణాలు, వేదాలు ఉపనిషత్తులలో ఇంకెన్ని రహస్యాలను, ఇంకెంత విజ్ఞానం దాగి ఉందో?*
*👉🏻ఇవేమి,నేటి సైన్స్ కి అర్థం కాని ప్రశ్నలు..కానీ ఇలాంటి ప్రయోగాలు ఇప్పుడు సాధ్యం కాకపోయినా *లక్షల సంవత్సరాల క్రితమే* *మన భారతీయ ఋషులు ఈ ప్రయోగాలు ఎలా చేయ గలిగి విజయం సాధించ గలిగారు?*
*👉🏻ఇప్పటి మిడి మిడి జ్ఞానం ఉన్న మనలో కొంత మంది ఫేక్ అని కొట్టి పడేస్తారు,.కానీ లక్షల సంవత్సరాల క్రితం ఆ ఊహ గొప్పదే కదా?*      
*ఈ సనాతన హైందవ ధర్మం ఒక అంతులేని సైన్స్.. అందులో పరిశోధన చేసే కొద్దీ అద్భుతాలు ఎన్నో బైటికి వస్తాయిఅని,స్వామి వివేకానంద ఎప్పుడో చెప్పారు..*
      
*కాబట్టి మనం పూజించే ప్రతి దైవం సైన్స్ కి ప్రతి రూపము*. *సైన్స్ ఉంది అంటే, ఖచ్చితంగా దాని *existency ఉండి తీరుతుంది..*
     
*ఎన్నో లక్షల సంవత్సరాల తర్వాత పుణ్య ఫలితంగా ఈ మానవ జన్మ, అందులోనూ, భారత దేశంలో అందులోనూ హిందువుగా పుట్టటం, *అందులోనూ, దైవం అంటే నమ్మకం ఉన్న వాడిగా పుట్టటం*, *అందులోనూ త్రికరణ శుద్ధిగా సనాతన ధర్మాన్ని జీవితాంతం పాటించటం ఒక వరం..మనకి మాత్రమే దక్కిన అరుదైన వరం*..
*👉🏻*భారతీయులారా మిత్రులారా మీకు ఇవి తెలుసా*?*
      
"*👉🏻భూమి గోళాకారంలో ఉందని మొదట చెప్పింది మనమే (ఆర్యబట్ట)**

*👉🏻భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని మొదట చెప్పింది మనమే (భాస్కరాచార్య)*

*👉🏻ప్రపంచంలో మొట్టమొదటి శస్త్ర చికిత్స చేసింది మనమే (సుశ్రుతుడు)*

*👉🏻విద్యుత్* *మొట్టమొదట కనిపెట్టింది మనమే (అగస్త్యుడు)*

*👉🏻విమాన శాస్త్రాన్ని అందించింది మనమే (భరద్వాజమహర్షి)*

*👉🏻*భూకంపాలను ముందుగా ఊహించే శాస్త్రమును రాసిన వరాహమిహిరుడు మనవాడే*

*👉🏻గణితం, భౌతికం, ఖనిజం శాస్త్రాల ఎన్ సైక్లోపీడియా అక్షరలక్ష రాసిన*

*వాల్మీకి మహర్షి మనవాడే*

*👉🏻రసాయన శాస్త్రం అందించిన నాగార్జునుడు*

*👉🏻కాస్మోలజీ చెప్పిన కపిలుడు*

*👉🏻అణువులు గురించి వివరించిన కణాదుడు*

*👉🏻DNA గురించి చెప్పిన బోధిధర్మ*
*👉🏻మేఘ శాస్త్రాన్ని చెప్పిన అత్రి మహర్షి*

*👉🏻మొదటిగా పత్తి నుండి దారాన్ని తీసి వస్త్రాలను తయారుచేసిన ఉత్సమధుడు*

*👉🏻సంగీతాన్ని (స.రి.గ. మ. ప) ప్రపంచానికి అందించిన స్వాతి ముని*

*ఇలా ప్రపంచం కళ్లు తెరవకముందే మన ఋషులు ప్రపంచానికి ఎంత విలువైన విజ్ఞానాన్ని అందించారు...!!!* *🔯DR K హరి హర నాథ రాజు. 9177445591🔯.*

Friday, August 9, 2024

యజ్ఞోపవీత మహిమ

యజ్ఞోపవీత మహిమ
వైదిక సంస్కారాలతో పరిచయం ఉన్న ప్రతివారికీ సుపరిచితమైంది ‘యజ్ఞోపవీతం’. దీనినే తెలుగులో ‘జంధ్యం ’ అంటాం. ఇది చాలామంది మెడలో వేలాడుతూ ఉంటుంది కానీ, ఇది అలా ఎందుకు వేలాడుతుందో చాలామందికి తెలియదు. ఇలా మెడలో ఈ యజ్ఞోపవీతాలను వేసుకున్న వారు నిష్టతోనూ, కొందరు ఆచారం మీద మక్కువతోనూ, కొందరు ఇతరుల ముందు ప్రదర్శన కోసం, మరికొందరు అవసరార్థం ఉపయోగించేవారుగా కనపడతారు.
యజ్ఞోపవీతాన్ని ‘బ్రహ్మసూత్రం’ అని కూడా అంటారు. దీన్ని ఎందుకోసం ధరించాలో ధర్మశాస్త్రాలు ఈ విధంగా చెబుతున్నాయి.
’సూచనాత్ బ్రహ్మతత్త్వస్య వేదతత్త్వస్య సూచనాత్
తత్సూత్రముపవీతత్వాత్ బ్రహ్మసూత్రమితి స్మృతమ్’
బ్రహ్మతత్త్వాన్ని సూచించడానికి, వేదతత్త్వాన్ని సూచించడానికి బ్రహ్మసూత్రాన్ని (యజ్ఞోపవీతాన్ని) ధరించాలి. అదే ఉపవీతం. అంటే రక్షణ వస్త్రం. 
యజ్ఞోపవీతాన్ని, శిఖనూ తప్పనిసరిగా ధరించాలని స్మృతులు పేర్కొంటున్నాయి. యజ్ఞోపవీతం పరమ్ పవిత్రమైనది. అది ప్రజాపతి అయిన బ్రహ్మతో కలిసి పుట్టిందని ‘యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్...’ అనే మంత్రం చెబుతోంది. 
యజ్ఞోపవీతాన్ని నవతంతువులతో (తొమ్మిది దారపుపోగులతో) నిర్మించాలి. ఒక్కొక్క తంతువునకు ఒక్కొక్క దేవత ఉంటాడని స్మృతుల కథనం -
‘ఓంకారో హోగ్నిశ్చ నాగశ్చ సోమః పితృప్రజాపతీ 
వాయుః సూర్యశ్చ సర్వశ్చ తన్తుదేవా అమీ నవ 
ఓంకారః ప్రథమే తంతౌ ద్వితీయేహోగ్నిస్థథైవ చ
తృతీయ నాగదైవత్యం చతుర్థే సోమదేవతా 
పంచమే పితృదైవత్యం షష్ఠేచైవ ప్రజాపతిః
సప్తమే మారుతశ్చైవ అష్టమే సూర్య ఏవ చ 
సర్వేదేవాస్తు నవమే ఇత్యేతాస్తంతు దేవతాః’
మొదటి తంతువులో ఓంకారం, రెండవ తంతువులో అగ్నిదేవుడు, మూడవ తంతులో నాగదేవత, నాలుగవ తంతువులో సోమదేవుత, ఐదవ తంతువులో పితృదేవతలు, ఆరవ తంతువులో బ్రహ్మదేవుడు, ఏడవ తంతువులో వాయుదేవుడు, ఎనిమిదవ తంతువులో సూర్యుడు, తొమ్మిదవ తంతువులో మిగిలిన దేవతలందరూ ఉంటారని ఈ శ్లోకాల్లోని పరమార్థం.
‘యజ్ఞోపవీతం’ కేవలం తంతు సముదాయం మాత్రమే కాదని అదొ తొంభైయారు విషయాలకు ప్రతీక అని సామవేదఛాందోగ్య పరిశిష్టం చెబుతోంది.
’తిథివారం చ నక్షత్రం తత్త్వవేదగుణాన్వితమ్
కాలత్రయం చ మాసాశ్చ బ్రహ్మసూత్రం హి షణ్ణవమ్’
ఈ శ్లోకంలో తాతపర్యం ఇది. తిథులు 15, వారాలు 7, నక్షత్రాలు 27, తత్త్వాలు 25, వేదాలు 4, గుణాలు 3, కాలాలు 3, మాసాలు 12 మొత్తం 96. అంటే యజ్ఞోపవీతాన్ని ధరించిన వారికి తిథులలోనూ, వారాలలోనూ, నక్షత్రాలలోనూ, తత్త్వాలలోనూ, వేదాలలోనూ, గుణాలలోనూ, కాలాలలోనూ, మాసాలలోను పవిత్రత ఏర్పడి అవన్నీ ధరించిన వారికి శుభఫలాలను కలిగిస్తాయని అర్థం. ‘యజ్ఞోపవీతం’ తొంభైయారు కొలతలతో కూడి ఉండాలని ‘వశిష్ఠస్మృతి’ చెబుతోంది.
’చతుర్వేదేషు గాయత్రీ చతిర్వింశతికాక్షరీ
తస్మాచ్చతుర్గుణం కృత్వా బ్రహ్మతంతుముదీరయేత్’
నాలుగు వేదాల్లోనూ గాయత్రీ మంత్రం 24 అక్షరాలుగానే ఉపదేశించబడింది. అందువల్ల ఆ మంత్రంలోని అక్షరాల సంఖ్యకు నాలుగింతలుగా అంటే (24X4=96) తొంభైయారు తంతువులుగా యజ్ఞోపవీతాన్ని నిర్మించుకుని ధరించాలని ఉపదేశం. గాయత్రీ మంత్రాన్ని స్వీకరించే సమయంలో ధరించేది యజ్ఞోపవీతం. కనుక, గాయత్రీ మంత్రాక్షరాలకు నాలుగింతల సంఖ్యతో కూడిన తంతువులు ఉండాలని తాత్పర్యం.
యజ్ఞోపవీతాన్ని ఏ పరిమాణంలో తయారు చేసుకోవాలో సాముద్రిక శాస్త్రం చక్కగా ప్రబోధిస్తోంది.
’పృష్ఠదేశే చ నాభ్యాం చ ధృతం యద్విందతే కటిమ్
తద్ధార్యముపవీతం స్యాత్ నాతిలంబం నచోచ్చ్రితమ్
ఆయుర్హ రత్యతిహ్రస్వం అతిదీర్ఘం తపోహరమ్
యశో హరత్యతి స్థూలం అతి సూక్ష్మం ధనాపహమ్’
అంటే యజ్ఞోపవీతం నడుము వరకు మాత్రమే వేలాడుతుండాలి. దానికంటే పైన గానీ, క్రిందుగాగానీ ఉండడం మంచిది కాదు. మరీ చిన్నగా ఉంటే ఆయుష్యం తగ్గిపోతుంది. మరీ పొడవుగా ఉంటే చేసిన తపస్సు నశిస్తుంది. లావుగా ఉంటే కీర్తి అంతరిస్తుంది. మరీ సన్నగా ఉంటే ధనం నష్టమౌతుంది.
బ్రహ్మచారి ఒక యజ్ఞోపవీతాన్నీ, గృహస్థుడు రెండు యజ్ఞోపవీతాలను ధరించాలి. వీళ్ళిద్దరూ ఉత్తరీయానికి ప్రత్యామ్నాయంగా అదనంగా మరో యజ్ఞోపవీతాన్ని ధరించాలి. ఆరు నెలలు కాగానే యజ్ఞోపవీతం జీర్ణమైపోతుంది. కనుక ప్రతి ఆరు నెలలకు ఒకసారి యజ్ఞోపవీతాన్ని ధరించి, పాతబడిన దానిని తొలగించాలి.
యజ్ఞోపవీతాన్ని ధరించే సమయంలోనూ, తొలగించే సమయంలో నిర్ధిష్ట మంత్రాలను తప్పక పఠించాలి. మంత్ర పఠనం కాకుండా యజ్ఞోపవీతధారణ, విసర్జనలు పనికిరావు. అశౌచాలవల్ల (ఆప్తుల జనన, మరణ సమయాలలో) ఇతర అమంగళాలు కలిగిన సంధర్భాలలో విధిగా యజ్ఞోపవీతాలను మార్చుకోవాలి. యజ్ఞోపవీతాన్ని పరిహాసం కోసం వాడడం, ఇతర వస్తువులను కట్టి అపవిత్రం చెయ్యడం ఎంతమాత్రం పనికిరాదు. అలాచేస్తే సమస్తపాపాలు చుట్టుకుంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే యజ్ఞోపవీతంలోని మన శరీరంలోని ప్రాణనాడులే! వాటిని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో, యజ్ఞోపవీత తంతువులను కూడా అంతే జాగ్రత్తతో సంరక్షించుకోవాలి. యజ్ఞోపవీతం మనిషి శ్రేయస్సుకోసం ఉపయోగపడాలే కానీ ప్రదర్శనకోసం కాదు. ప్రదర్శన కోసం వేసుకోనక్కరలేదు. ధర్మాలను ఆచరిస్తూ ధరించాలి. ఇదే యజ్ఞోపవీత మహిమ!
మీ~ ఆనంద్ అర్వపెల్లి.

Monday, August 5, 2024

జపం ఎలా చేయాలి!

*🌳జపం ఎలా చేయాలి!*
మన ఇష్టదైవం యొక్క నామాన్ని కానీ., మంత్రాన్ని కానీ., ఒక క్రమపద్ధతిలో భక్తిగా జపించే విధానాన్నే జపం అంటారు. రోజుకు ఇన్నిసార్లు జపం చెయ్యాలనే సంఖ్యానియమం కూడా ఉంటుంది. ఒకవేళ అనుకోని ఇబ్బందులవల్ల ఆ రోజు జప సంఖ్య పూర్తి చేయలేని పక్షంలో., మరునాడు ఈరోజు మిగిలిన జపసంఖ్యను చేర్చి చేయవలసి ఉంటుంది.

జపాన్ని ఏదో మొక్కుబడిగా చెయ్యకూడదు. సంఖ్య పూర్తిచెయ్యడమే ప్రధాన లక్ష్యంగా జపం చెయ్యకూడదు. భక్తి చాలా ప్రధానం. జపం చెయ్యడానికి ఒక పద్ధతి ఉంది.

వాచికశ్చ ఉపాంశుశ్చ మానసస్త్రివిధః స్మృతః
త్రయాణాం జపయఙ్ఞానాం శ్రేయాన్ స్యాదుత్తరోత్తరమ్

జపం.. వాచికము, ఉపాంశువు, మానసికము అని మూడు విధాలుగా ఉంటుంది.

*వాచికము:* బయటకు వినిపించే విధంగా జపం చేసే పద్ధతిని ‘వాచికము’ అంటారు.

*ఉపాంశువు:* బయటకు వినిపించకుండా, కేవలం పెదవులు కదుపుతూ నాలుకతో జపం చేసే విధానాన్ని ‘ఉపాంశువు’ అంటారు.

*మానసికము:* నాలుక, పెదవులు కదలకుండా మౌనంగా మనస్సు లోలోపలే జపం చేసే విధానాన్ని ‘మానసికము’ అంటారు.

ఈ మూడింటిలో వాచికము కంటే ఉపాంశువు., ఉపాంశువు కంటే మానసికము మరింత శ్రేష్ఠము అని శాస్త్ర ప్రమాణము.

అతిమూత్ర వ్యాధి హరించుటకు సులభ యోగాలు

అతిమూత్ర వ్యాధి హరించుటకు సులభ యోగాలు - 

 * గులకంద పూటకు రెండున్నర గ్రాములు చొప్పున పూటకు ఉదయం , సాయంత్రం తీసుకొనుచున్న యొడల అతిమూత్ర వ్యాధి నివారణ అగును.

 * మామిడాకులు నీడన ఎండించి చూర్ణం చేసి ఆచూర్ణం పూటకు 5 గ్రాముల చొప్పున రోజూ ఉదయం , సాయంత్రం రెండుపూటలా 125 ml నీటిలో కలుపుకుని త్రాగుచుండిన యొడల అతిమూత్రం హరించును . 

 * చింతపండును కొంచం ఆముదంతో నూరి దానిని బొడ్డుకింద పొత్తికడుపు పైన ప్రతినిత్యం లేపనం చేయుచుండిన 21 రోజుల్లో అతిమూత్ర వ్యాధి నివారణ అగును. 

 * నీడలో ఎండించిన తంగేడు పువ్వులు 10 గ్రాములు ఒక గ్లాస్ నీటిలో వేసి మరిగించి సగం వచ్చేవరకు ఉంచి దానిని లొపలికి తీసుకొనుచున్న మధుమేహరోగులకు వచ్చు అతిమూత్ర వ్యాధి సమూలంగా హరించును 

 గమనిక - 

    గుల్కన్దు గులాబీ పువ్వులను చక్కర పాకం నందు వేసి తయారుచేస్తారు.బయట దొరుకును . మధుమేహ రోగులు ఇది వాడరాదు. మిగిలిన యోగాలు వాడుకోవచ్చు 

   
         

Sunday, August 4, 2024

శరీరంలో వాతపిత్తకఫాలను వృద్ధిచేసే ఆహారాలు

శరీరంలో వాతపిత్తకఫాలను వృద్ధిచేసే ఆహారాలు     

          మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మన యొక్క ఆరోగ్యం అనేది ఆధారపడి ఉంటుంది. ఆయా ఆహారాలు మనశరీరతత్వానికి అనుగుణంగా ఉన్నాయో లేవో చూసుకొని తీసుకున్నచో మనకి అనారోగ్య సమస్యలు దరిచేరవు . రోగం వచ్చినప్పుడు చికిత్స తీసుకోవడం కన్నా ఆ రోగం రావడానికి గల కారణాలు గుర్తించి సరైన జాగ్రత్తలు పాటించడం 
చాలా మంచిది .

           ఇప్పుడు నేను మీకు వివరించబోయే ఆహార విషయాలు ఆయా శరీరతత్వాల వారు పాటించి పడని ఆహారపదార్థాలుకు దూరంగా అయినా ఉండటం లేదా అతితక్కువ మోతాదులో ఎప్పుడో ఒకసారి తీసుకోవడం వలన ఆనారోగ్యానికి గురికాకుండా ఉంటారు.

 * శరీరంలో వాతాన్ని కలిగించు ఆహారాలు -

      అతిగా వ్యాయామం చేయడం , అతిగా ఉపవాసాలు , ఎత్తు నుంచి దూకుట , కాళ్లు చేతులు విరుగుట, ధాతుక్షయం, రాత్రిజాగారం, మలమూత్రాలు బంధించుట లేదా బలవంతంగా విసర్జించుట, అతిగా వాంతులు మరియు విరేచనాల వలన, కషాయాలు మరియు చేదు వస్తువులను అతిగా వాడుట, అతిగా భాధపడుట, భయం , అతిగా ఏడవటం వంటివాటివలన సంధ్యాసమయాలలో, వర్షాకాలంలోనూ, భోజన ముందు సమయాలలోను వాతం వృద్ధిచెందును.

 * శరీరంలో పిత్తాన్ని కలిగించు పదార్థాలు -

        అతి పులుపు , అతికారం , ఉప్పు వంటి తీక్షణ పదార్థాలు తీసుకోవడం , అతిగా కోపగించుకొనుట, ఎండలో ఎక్కువ తిరుగుట, నువ్వులు , పెరుగు , తరవాణి వంటివాటిని అతిగా సేవించుట వలన , మద్యసేవన వలన , అన్నం జీర్ణం అయ్యే సమయంలోను ,శరత్,గ్రీష్మ ఋతువుల్లోనూ , మధ్యాన్న , మధ్యరాత్రి సమయాల్లోనూ శరీరంలో పిత్తం వృద్ది చెందును .

 * శరీరంలో కఫం వృద్ధి కలిగించు పదార్దాలు -

          చిక్కని మధుర పదార్దాలు అతిగా సేవించుట , పెరుగు , బెల్లం, వెన్న, నెయ్యితో చేయబడిన మధురపదార్ధాల వలన , పగటినిద్ర వలన, హేమంత, వసంత ఋతువులలోను , భోజనం అయినవెంటనే పగలు , రాత్రుల ప్రారంభ సమయాలలో కఫవృద్ధి జరుగును.

     ఇప్పుడు శరీరంలో వాత,పిత్త,కఫాన్ని తగ్గించు ఆహారవిహారాల గురించి తెలియచేస్తాను .

 * శరీరంలో వాతాన్ని తగ్గించు ఆహారవిహారాలు -

        తియ్యని,పుల్లని , లవణ రసాలు కలిగిన మృదువు కలిగి ఉండి కొంచం ఉష్ణం కలిగించు ఆహారపదార్థాలు .

 * శరీరంలో పిత్తాన్ని తగ్గించు ఆహారవిహారాలు -

         కషాయ , చేదు రుచులు కలిగిన చల్లని మధురమైన మృదువు, సాంద్రత కలిగిన ఆహారవిహారాలు .

 * శరీరంలో కఫాన్ని తగ్గించు ఆహారవిహారాలు -

          వగరు,కారం,చేదు కలిగిన ఆహార పానీయాలు , తీక్షణత, వేడి కలిగిన ఆహారవిహారాలు కఫాన్ని నాశనం చేస్తాయి.

         కావున పైన చెప్పినవిధంగా ఆయా దోషాలు కలిగినవారు వాటికి తగ్గ ఆహారపదార్థాలు సేవించడం , విడిచిపెట్టడం ద్వారా మీయొక్క ఆరోగ్యాలు కాపాడుకొనవలెను .