Tuesday, September 17, 2024

మంత్ర జపం*

🔔 *మంత్ర జపం* 🔔

* *జపం చేయడం వల్ల అద్భుతమైన అనంతమైన లాభాలు ఉన్నాయి అని శాస్త్రీయ పరిశోధనలు తెలియజేస్తున్నాయి..*

*జపం చేయడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మీ దినచర్యలో జపాన్ని చేర్చుకోవడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి:*

1. *ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గిస్తుంది*: జపము మనస్సును ప్రశాంత పరుస్తుంది, కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తుంది. మీ మనసును ప్రశాంతంగా నిశ్చింతంగా ఉంచుతుంది.

2. *రక్తపోటును తగ్గిస్తుంది*: క్రమం తప్పకుండా మంత్రం జపించడం వల్ల రక్తపోటు తగ్గుతుంది మరియు హృదయనాళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

3. *నిద్రను మెరుగుపరుస్తుంది*: మంత్రం జపించడం వల్ల నిద్ర విధానాలను క్రమబద్ధీకరించడానికి మరియు నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

4. *జపం మనసును ఆనందంగా ఆహ్లాదంగా ఉంచుతుంది*: మంత్ర జపం వల్ల ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తుంది, దీనిని "ఫీల్-గుడ్" హార్మోన్లు అని కూడా పిలుస్తారు, ఇది డిప్రెషన్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది.

5. *ఏకాగ్రత శక్తిని మెరుగుపరుస్తుంది*: జపం ద్వారా మీ మనస్సును ఏకాగ్రత శక్తితో మీ లక్ష్యాన్ని చేరుకునేలా చేస్తుంది మరియు ఏకాగ్రతతో మీ పని చేయడానికి, మనసును నిశ్చింతగా, తేలిగ్గా ఉంచడానికి శిక్షణ ఇస్తుంది.

6. *అవగాహన శక్తిని, నిర్ణయ శక్తిని, సహన శక్తిని ,ఎదుర్కొనే శక్తిని ఓంకార జపం మెరుగుపరుస్తుంది*: జపం చేయడం ద్వారా మెరుగైన జ్ఞాపకశక్తి, శ్రద్ధ మరియు ఏకాగ్రత శక్తి పెరగడం ద్వారా పనులు త్వరగా సకాలంలో పూర్తి చేస్తారు.. మీ పనులు వేగంతో చేస్తారు.

7. *రోగనిరోధక వ్యవస్థను శక్తివంతం చేస్తుంది*: మంత్ర జప వల్ల జీవ కణాలు ఉత్తేజమై శక్తివంతంగా మారడం ద్వారా రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

8. *దీర్ఘకాలిక నొప్పిని తగ్గిస్తుంది*: మంత్ర జపం ఎండార్ఫిన్‌లను విడుదల చేయడం మరియు విశ్రాంతిని ప్రోత్సహించడం ద్వారా దీర్ఘకాలిక నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.

9. *హృదయ స్పందన రేటును మెరుగు పరుస్తుంది*: క్రమం తప్పకుండా జపం చేయడం వల్ల హృదయ స్పందన రేటు మెరుగుపడుతుంది, విశ్రాంతిని ప్రోత్సహిస్తుంది మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది.

10. *కరుణ మరియు సానుభూతి యొక్క భావాలను పెంచుతుంది*: రోజు మంత్రం జపించడం వల్ల తన పట్ల మరియు ఇతరుల పట్ల దయ, కరుణ మరియు సానుభూతి యొక్క భావాలు పెరుగుతాయి.

ఈ ప్రయోజనాలను అనుభవించడానికి, మీ దినచర్యలో జపం చేయడానికి సమయాన్ని కేటాయించండి, అది రోజుకు కొన్ని నిమిషాలు మాత్రమే అయినా కూడా. మీరు సంగీతంతో లేదా నోటితో పలకడం లేదా నిశ్శబ్దంగా జపించవచ్చు మరియు ధ్యానం, యోగా లేదా హాయిగా కూర్చున్నప్పుడు లేదా ఏ సమయంలోనైనా జపం చేయవచ్చు.

*ఆరోగ్యం ఆనందం కోసం రోజూ జపం చేద్దాం.*

కుటుంబ వ్యవస్థ ఇక నిలువబడదు. త్వరలోనే కూలిపోతుందని అధ్యయనాలు చెపుతున్నాయి...*

*కుటుంబ వ్యవస్థ ఇక నిలువబడదు. త్వరలోనే కూలిపోతుందని అధ్యయనాలు చెపుతున్నాయి...*

*అందుకు గల కారణాలు:*

1. *అతి తెలివి, గర్వము, డబ్బులు ఉన్నాయనే అహంకారం.*

2. *చిన్న తప్పులను కూడా భరించలేని అసహనం. ఓర్పు లేకపోవడం.*

3. *పిల్లలు, పెద్దలు కూర్చొని మనస్పూర్తిగా మాట్లాడుకోలేకపోవడం .*

4. *ఎక్కువ సమయం TV, ఫోన్లు, ఇతర net program లలో మునిగిపోవడం. (ఎక్కడో ఉన్న సినిమా హీరో, హీరోయిన్లు ఏం తిన్నారో, ఏం చేస్తున్నారో చెప్పగలరు కానీ, ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదు)*

5. *చిన్న విషయాలకు అలిగి, స్వంత వారితో కూడా దూరంగా ఉండటం.*

6. *ఎవరో ఒకరి నోటి దురుసుతనం వల్ల, కోపం వల్ల కుటుంబం అంతా చెదిరిపోవడం.*

7. *ఆర్థిక విషయాలలో ఇంటి పెద్దల సలహా తీసుకోకపోవడం*

8. *భార్యాభర్తలు, తలితండ్రులు తరుచు గొడవలు పడుతుండడంతో పిల్లలు పెళ్లి అంటే భయం కలుగుతుంది. పెళ్లి వద్దనుకునే స్థితికి వచ్చేశారు...*

9. *మనిషికి మరో మనిషంటే గిట్టనితనం... పెత్తనం కోసం పోరాటం. ఒంటరితనం ఇష్టపడుతున్నారు.*

10. *మధ్యవర్తిత్వం నడిపేవారు లేరు. ఎవరిష్టానికి వారన్నారు. మంచి చెప్పినా నచ్చటం లేదు.*

11. *కుటుంబ నిర్వహణ ఆనేది గొప్ప కళ. అది తెలియక పోవడం మరో కారణం.*

12. *మానవ సంబంధాలు, సున్నితత్వం మరచిపోయి, మొరటు వ్యవహారం వచ్చేసింది. భార్యాభర్తలు కలిసి కుటుంబాన్ని నడపడం మర్చిపోయారు. "నేను", "నేనే", " నేను చెపితే చేయాలి" అనే ధోరణి ప్రబలిపోయింది.*

13. *social media లో జరిగిందే నిజం, ఇంట్లో జరిగేది ఒక డ్రామా అన్నట్లు ప్రవర్తిస్తున్నారు.*

14. *ఎవరైనా మరణిస్తే ఒక ఆకర్షణీయమైన message పెట్టేసి చేతులు దులుపుకుంటున్నారు... ఇండ్లకు వెళ్లి పలకరించడం లేదు. మోయడానికి కూడా నలుగురు వచ్చే పరిస్థితి లేదు.*

*ప్రజలంతా ఎవరికి వారే అన్నట్లు, నిర్లిప్తంగా ఉండిపోతున్నారు... ప్రక్కనే గొడవలు అవుతున్నా చూస్తూ వెళుతున్నారు తప్ప, ఆపే ప్రయత్నం చేయని పరిస్థితి.*

*ఇదే పరిస్థితి కొనసాగితే, అతి త్వరలో కుటుంబ వ్యవస్థే కాదు, అసలు మానవ సంబంధాలు కూడా తెగిపోతాయి అనడం అతిశయోక్తి కాదేమో...*
🤔😊🤔 😊🤔😊 🤔

సేకరణ

పాలు సేవించుట వల్ల ఉపయోగాలు - సేవించువారు తీసుకోవలసిన జాగ్రత్తలు -

పాలు సేవించుట వల్ల ఉపయోగాలు - సేవించువారు తీసుకోవలసిన జాగ్రత్తలు -  

 
  పాలు సేవించుట వల్ల ఉపయోగాలు - 

   పాలు మధురంగా ఉండును. జిడ్డుని కలిగి ఉండును. వాతాన్ని , పిత్తాన్ని హరించును . శీతలం , అన్ని తత్వముల వారికి మంచిది . బలం కలుగజేయును . మేధస్సుకు మంచిది . ఆయువుని వృద్ది చేయును . బాలురు , వృద్ధులు, క్షీణించినవారు, ఆకలిచే కృశించిన వారు పాలు సేవించిన ఆరోగ్యం కలుగును.

              పాలు పితుకుతున్నప్పుడు వేడిగా ఉండు పాలు బలం , అమృత తుల్యంగా ఉండును. అలా కాకుండగా పితికిన తరువాత చల్లబడిన పాలు తాగినచో అనేక రోగాలు తెచ్చి పెట్టును. 

              పంచదార , పటికబెల్లం కలిపిన పాలు తాగినచో శుక్రం పెంచును. బెల్లం కలిపిన పాలు తీసుకున్నచో మూత్రం బొట్లుబొట్లుగా పడు రోగంని నివారించును. పిత్తాన్ని , శ్లేష్మాన్ని పెంచును. రాత్రుల యందు పాలు తాగుచున్న యొడల అనేక దోషాలను పోగొట్టును . అలా పాలు సేవించాలి అనుకునేవారు భోజనం వేళకు , పాలు తాగు సమయానికి 2 గంటల వ్యవధి ఉండవలెను . భోజనం చేయకుండా పాలు తాగవచ్చు . పాలలో అన్నం కలిపి తినకూడదు. అలా తినినచో " అజీర్ణం" కలుగును. రాత్రి నిద్రపట్టదు. 

  ప్రతిదినం పాలు తాగువారు పాటించవలసిన నియమనిబంధనలు - 

 * మంచి రంగు లేకుండా మంచి రుచి కలిగి ఉండని , పుల్లటి మరియు చెడు వాసన , గడ్డలుగా ఉన్న పాలను తాగరాదు.

 * పాలతో ఎల్లపుడూ పంచదార మాత్రమే కలిపి వాడవలెను. లేనిచో పటికబెల్లం చూర్ణం కూడా వాడవచ్చు 

 * పాలల్లో ఉప్పు కలిపి వాడరాదు.

 * చేపల కూర తిని పాలు మరియు పాలపదార్థాలు తీసుకోరాదు . అలా తీసుకున్నచో తప్పక కుష్టువ్యాది కలుగును. 

 * కొన్నిరకాల పుల్లటి వస్తువులు పాలతో చేరినపుడు విరుద్దముగా మారును . కావున పాలు తాగు సమయంలో కాని ఆ తరువాతనైనా పుల్లని వస్తువులను భుజించరాదు . 

 * ఉలవలు , పరిగెలు , కొర్రలు, అనుములు , అడవి పెసలు మొదలైనవి పాలతో విరోధించును. కావున వీనిలో ఏ ఒక్కటి పాలతో కలిపి లోపలికి తీసుకోకూడదు . 

 * అనుములు , మినుములు ముఖ్యంగా పాలతో విరోధించును.ఈ రెండు పదార్థాలకు సంబంధించిన ఆహారాలు తీసుకున్నప్పుడు పాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు . అనారోగ్యం కలుగును.

 * ముల్లంగి సంబంధించిన ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు పాలు వాడరాదు.

 * రాత్రుల యందు వేడివేడి గోధుమ చపాతీలు ఇగురు కూరలతో కాని , తీపి పదార్థాలతో కాని లేక పంచదారతోగాని కలిపి భుజించి కాచిన పాలలో పంచదార కలిపి తాగిన చక్కటి ఆరోగ్యం కలుగును. 

 * పాలయందు వెన్న ఆవులు, గేదెలు తిను ఆహారం నుండి పుట్టును . చిట్టు , పచ్చగడ్డి , పత్తిగింజలు , మినపరొట్ట మెదలైనవి తినిన పశువుల పాలు శ్రేష్టము. పల్లపు ప్రదేశాలలో ఉండు పశువులు ఇచ్చు పాలకన్నా మెట్ట ప్రాంతాలలో ఉండు పశువులు ఇచ్చు పాలు శ్రేష్టం. 

 * ఆవుపాలు గేదెపాలకన్నా శ్రేష్టమైనవి . గేదెపాలల్లో ఆవుపాలు కంటే మందంగా ఉండును. కారణం వెన్నశాతం ఎక్కువుగా ఉండటం అందువలన ఆలస్యముగా జీర్ణం అగును. గేదెపాలు నిద్రను కలుగజేయును. చలవ చేయును . 

 * మేకపాలు కారం, చేదు రుచులు కలిగి ఉండును. ఆకులను తినుట చేతను కొద్దిగా నీరు తాగుటచేతను , ఎక్కువ దూరం నడుచుట వలన మేకపాలు అన్ని వ్యాధులను పొగొట్టును. ముఖ్యంగా రక్తపిత్తవ్యాధి అనగా నోటి నుండి రక్తం బయటకి వెలువడు వ్యాధి తగ్గును. క్షయరోగం , దగ్గు , జ్వరములను తగ్గించును . చంటిబిడ్డలకు తల్లిపాల తరువాత మేకపాలు శ్రేష్టమైనవి . 

      
      

Sunday, September 15, 2024

మంచి ప్రశ్నలు

ఎవరికి వారుగా ఉద్ధరించుకోవటానికి పూర్తిగా #చదవండి.
700 శ్లోకముల భగవధ్గీతను చదవడానికి సమయం సహనం రెండు ఉండవు కనీసం రెండు నిమిషాల ఈ పోస్ట్ లో పరిచయం తెలుసుకోండి.
 
భగవద్గీతాశ్లోకం-ప్రశ్నోత్తరములు

పార్దాయ ప్రతిబోదితాం భగవతా నారాయణేవస్వయం
వ్యాసేవ గ్రధితాం పురాణ మువివామ్ మధ్యే మహాభారతమ్
అద్వైతామృత వర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీమ్
ఆంబ త్వా మమవందధామి భగవద్గీతే భవద్వేషిణీమ్

1. భగవద్గీత ఏ పవిత్ర గ్రంధంలోనిది ?

జ. మహా భారతమునందలి భీష్మ పర్వంలో గీత వివరింప బడినది.

2. గీతలో ఎన్ని శ్లోకములు గలవు?

జ. గీతలో 700 శ్లోకములు కలవు.

3. గీతలో ఎన్ని అధ్యాయములు కలవు ?

జ. గీతలో 18 అధ్యాయములు కలవు.

4. ప్రతి అధ్యాయమునకు యివ్వబడిన ప్రత్యేక నామము ఏది?

జ. ప్రతి అధ్యాయమును యోగము అందురు.

5. గీత ఎక్కడ, ఎప్పుడు , ఎవరికి చెప్పబడినది?

జ. గీత కురుక్షేత్రంలో కౌరవ, పాండవుల యుద్దారంభంలో అర్జునునికి శ్రీ కృష్ణపరమాత్మచే చెప్పబడినది. 

6. గీత ఎందుకు చెప్పబడినది?

జ. నావారు అనే మమకారం, నాచే చంపబడుతున్నారనే మోహం అర్జునుని ఆవరించి విషాదాన్ని కలుగచేయగా విషాదయోగాన్ని పోగొట్టి జ్ఞానాన్ని కలుగచేయడానికి శ్రీ కృష్ణునిచే గీతాబోధ చేయబడినది.

7. గీత దీనుడైన అర్జునుని ఏవిధంగా మార్చినది?

జ. గీత దీనుడైన అర్జునుని ధీరునిగా మార్చింది.

8. గీత శ్లోకాలు మానవునిలోని దేనిని దూరం చేస్తాయి?

జ. గీత శ్లోకాలు మానవునిలోని శోకాన్నిదూరం చేస్తాయి.

9. గీత ధృతరాష్ట్రునికి ఎవరు చెప్పారు?

జ. గీతను ధృతరాష్ట్రునికి సంజయుడు వివరించెను.

10. గీతను ఆసమయంలో ఎందరు విన్నారు?

జ. అర్జునుడు, సంజయుడు, ధృతరాష్ట్రుడు మరియు ఆంజనేయస్వామి.

11. గీతలో గల అధ్యాయముల పేర్లేమి?

జ. 1) అర్జున విషాద యోగము 2) సాంఖ్య యోగము 3) కర్మ యోగము 4) జ్ఞాన యోగము 5) కర్మసన్యాస యోగము 6) ఆత్మ సంయమ యోగము 7) విజ్ఞాన యోగము 8) అక్షర పరబ్రహ్మ యోగము 9. రాజ విద్యారాజగుహ్య యోగము 10) విభూతి యోగము 11) విశ్వరూప సందర్శన యోగము 12) భక్తి యోగము 13) క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము 14) గుణత్రయ విభాగ యోగము 15) పురుషోత్తమ ప్రాప్తి యోగము 16) దైవాసుర సంపద్విభాగ యోగము 17) శ్రద్దాత్రయ విభాగ యోగము 18) మోక్ష సన్యాస యోగము  

12. గీత ధర్మరాజుకిగాని, భీష్మునికిగాని బోధింపక అర్జునునికే ఏల బోధించెను? 

జ. శ్రీ కృష్ణుడు అర్జునునికే గీతాబోధ చేసెను. భీష్మునికి చేయక పోవటానికి కారణం ఏమిటంటే న్యాయం, ధర్మం, పాండవుల పక్షాన ఉందని చెప్తూ అధర్మపరులైన కౌరవుల పక్షాన యుద్దం చేసారు. అలోచనకు, చెప్పేమాటకి, చేసే క్రియకి భేదం ఉన్నది. అనగా త్రికరణశుద్ది లేదు. అట్టివారు జ్ఞానబోధకు అర్హులు కారు. ధర్మరాజు ధర్మవర్తనుడే కాని అతని పశ్చాత్తాపమేకాని పూర్వతాపం లేదు. ఒక పనిచేసే ముందుగానే దాని మంచి చెడ్డలు విచారించేవాడు పూర్వతాపం కలవాడు. జూదం ఆడి ఓడిపోయి అడవులు పాలయ్యాక జరిగిన దానికి పశ్చాత్తాపపడి ప్రాయశ్చిత్తం చేసుకోవడం ప్రారంభించాడు. ముందుగా దాని పర్యావసానం ఏమిటో ఆలోచించలేదు. పూర్వతాపం లేనివారు గీతాబోధకు అర్హులు కారు. అర్జునుడు యుద్దభూమిలోకి ప్రవేశించి, తనవారినందరిని చూచి యింతమందిని చంపి ఈ రాజ్యాన్ని అనుభవించే కంటే భిక్షాటన మేలు. అందరూ చనిపోయాక ఈ రాజ్యాన్ని పాలించి ఏమి ఆనందం అనుభవించగలము? త్రిలోకాధిపత్యం యిచ్చినా నేను యుద్ధం చెయ్యలేను అని ముందుగానే విచారించాడు. తనను శిష్యునిగా చేసుకుని కర్తవ్యం బోధించమని శ్రీ కృష్ణ భగవానుని ప్రార్థించాడు. అందువలన అర్జునునికే గీతా బోధ చేయబడింది. పూర్వతాపం పరిశుద్ద హృదయమున్న వారికే కలుగును. పరిశుద్ద హృదయుడే జ్ఞానబోధకు అర్హుడు.   

13. అర్జునుని శ్రీ కృష్ణుడు అనేక నామాలతో గీతలో సంబోదించాడు. అవి ఏవి? వాని భావమేమి? 

జ. 1) అర్జున: - పవిత్రమైన, నిర్మలమైన మనసు గలవాడు.
    2) పార్థ: - పృధివి (భూమి యొక్క) పుత్రుడు. పృధి అను పేరు కుంతీదేవికి కలదు. అంతే కాక భూమి
        యొక్క పుత్రుడు అంటే ప్రపంచ మానవులందరికీ ప్రతినిధి పార్ధుడు.  
    3) కౌంతేయ - సావధానంగా దైవబోధను వినగలిగేవాడు.
    4) అనసూయ - అసూయ లేనివాడు.
    5) కురునందన - కార్యమును చేయుటలో ఆనందమును అనుభవించువాడు.
    6) పరంతప - యుద్దములో శత్రువులను తపింప చేయువాడు.
    7) విజయ - ఎల్లప్పుడూ జయమునే పొందువాడు.
    8) గుడాకేశ - యింద్రియ నిగ్రహం గలవాడు.
    9) ధనంజయ - జ్ఞాన ధనమును పొందినవాడు.
    10) పాండవ - పాండవరాజు కుమారుడు (తెల్లదనము) సాత్వికగుణము , నిర్మలతత్వం గలిగి పరిశుద్దమైనవాడు . 

14. భోజనానికి ముందుగా రెండు శ్లోకాలు పఠించి భుజించాలని స్వామి చెప్పారు. ఆ శ్లోకాలేవి? ఎందుకు అవి పఠించాలి?

     బ్రహ్మార్పణం బ్రహ్మహవి: బ్రహ్మగ్నౌ బ్రహ్మణాహుతమ్
            బ్రహ్మైవ తేన గన్తవ్యం బ్రహ్మకర్మ సమాధిన

    అహం వైశ్వానరో భూత్వా ప్రాణినామ్ దేహమాశ్రిత:
   ప్రాణాపాన సమాయుక్త: పచామ్యన్నం చతుర్విదమ్ 

ఈ శ్లోకాలు రెండు చదివి భోజనం చేస్తే అది ప్రసాదంగా మారిపోతుంది. ఆహారానికి పాత్రశుద్ది, పాకశుద్ది, పదార్థశుద్ది ఉండాలని స్వామి చెప్పారు. పాత్రశుద్ది మనంచేయగలం. పాకశుద్ది అంటే ఎలాంటి తలపులతో వంట చేస్తున్నారో, పదార్థశుద్ది అనగా మనం తెచ్చుకున్న పదార్ధములు మోసము చేసి తెచ్చినవో, దొంగిలించినవో మనకు తెలియదు. అన్యాయార్జన పదార్ధము అనారోగ్యాన్ని, దుర్భుద్దులను పెంచుతాయి. అందువలన ఆహారం భుజించేముందు ఆహారాన్ని దైవానికి సమర్పించి భుజిస్తే అది ప్రసాదంగా మారి దోషరహితం అయిపోతుంది. ఎట్టి తిండియో అట్టి త్రేపు. ఆహారాన్ని బట్టి ఆలోచనలు వుంటాయి. అందువలన రజో, తమో గుణ సంబంధమైన ఆహారాన్ని త్యజించి సాత్వికాహారము దైవానికి అర్పించి భుజిస్తే సత్ప్రవర్తన, సద్బుద్ది, సదాలోచనలు కలుగుతాయి. అన్ని యింద్రియాలకు సాత్వికాహారం యివ్వాలని స్వామి చెప్పారు.    

15. గీత నిత్య జీవితంలో ఏవిధంగా మనకు ఉపకరిస్తుంది?

జ. స్వామి ముఖ్యంగా 'శ్రద్దావాన్ లభతే జ్ఞానం' - 'సంశయాత్మ వినశ్యతి ' అని గీతలోని రెండు శ్లోకాల గురించి చెప్ప్తూ ఉంటారు. శ్రద్దగలవాడు తప్పక జ్ఞానాన్ని పొందుతాడు. అధ్యాత్మిక జ్ఞానానికైనా , లౌకిక జ్ఞానానికైనా శ్రద్ద చాలా అవసరం. అందువలన శ్రద్దతో ఏదైనా సాధించవచ్చని గీత బోధిస్తుంది. శ్రద్దతో నచికేతుడు ఆత్మ జ్ఞానాన్ని , ఏకలవ్యుడు ధనుర్విద్యను సాధించగలిగారు. 'సంశయాత్మా వినశ్యతి ' సందేహాలు కలవారు ఎప్పటికీ అభివృద్ది సాధించలేడు. గురువాక్యంపైన, దైవం పైన నమ్మకం, శ్రద్ద గలవాడే ఏదైనా సాధించగలడు. అందువలన సంశయాలు, సందేహాలు వదిలిపెట్టాలి. యింతేకాక 'అద్వైష్టా సర్వభూతానాం' ఏ ప్రాణినీ ద్వేషించవద్దు. 'అనుద్వేగకరం వాక్యం' ఎవరినీ మాటలతో హింసించవద్దు. సంతుష్టస్పతతం' ఎల్లప్పుడు సంతృప్తిగా ఉండాలి. సమశ్చత్రౌ చ మిత్రేచ, శత్రువులను, మిత్రులను ఒకేవిధంగా చూడాలి. గౌరవా గౌరవాలకు, సుఖదు:ఖాలకు పొంగిపోక, కుంగిపోక ఉండాలి. యిలాంటి లక్షణాలు కలవాడు నాకు ప్రియమైన భక్తుడు అని శ్రీ కృష్ణ భగవానుడు బోధించాడు. అంటే మానవులంతా తమ నిత్య జీవితంలో ఈ లక్షణాలు అలవర్చుకుంటే భగవంతుని అనుగ్రహానికి పాత్రులవుతారు. వంట చెయ్యటానికి ఒక్క అగ్గిపుల్ల చాలు. అలాగే ఒక్క గీతా శ్లోకాన్ని మనం ఆచరించడానికి ప్రారంభించినా క్రమేపి అన్ని సద్గుణాలు మనలో ప్రవేశించి భగవంతునికి ప్రియమైన భక్తులం కాగలము.    

16. స్వామి గీతా సారాంశాన్ని రెండు పదాల్లో వివరించారు? అవి ఏవి?వాని వివరణ ఏమి?

జ. "ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవ:
        మామకాకి పాండవాశ్చైవ కీమ కుర్వత సంజయ: "
 శ్లోకములోని మొదటి పదము ధర్మ, గీతలోని చివరి శ్లోకము
       "యత్ర యోగీశ్వర: కృష్ణా యత్ర పార్థ ధనుర్థర:
        శ్రీ ర్విజయో భూతి: ధ్రువా నీతిర్మతిర్మమ "
 చివరి శ్లోకములోని చివరి పదము మమ. మొదటి ధర్మ, చివరిది మమ. ఈ రెండూ చేరిస్తే 'మమధర్మ' అని గీత బోదించింది. ఎవరి కర్తవ్యాన్ని, ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తించమని గీత ముఖ్యంగా బోధిస్తుంది. విద్యార్దులు వారికర్తవ్యాన్ని, బ్రహ్మచారులు వారికర్తవ్యాన్ని, గృహష్దులు వారి కర్తవ్యాన్ని, నవ్యానులు వారికర్తవ్యాన్ని నిర్వర్తించాలి. ఎవరిమార్గాన్నివారికి బోధించేదే గీత.

17. భగవత్గీతలో పేర్కొనబడిన నాలుగు విధములైన భక్తులెవరు?

జ. ఆర్తి, అర్దార్ది, జిజ్ఞాసు, జ్ఞాని 
        1. ఆర్తభక్తుడు బాధలు కలిగినపుడు తనను ఆదుకొని రక్షించమని ఆర్తితో భగవంతుని ప్రార్దిస్తాడు.  
        2. ధన కనక వస్తు వాహనముల కోరకు, పదవి పేరు ప్రతిష్టల కోరకు, పుత్ర పౌత్రాభివృద్ది కొరకు పరితపించుచూ
            ప్రార్దించువారు అర్దార్దులు.
        3. జిజ్ఞాసువు: ఆత్మస్వరూపమైన పరమాత్మమ తెలుసుకోనగోరి అనేక సద్ర్గంధములతో, సదాలోచనలతో,    
            సద్బావములతో విచారణ నల్పుచూ సాన్నిధ్యప్రాప్తిని పొందగోరును.       
        4. జ్ఞాని: నిరంతరం బ్రహ్మతత్త్వమున మునిగియుండును. 

18. గీత దైవ లక్షణాలను, అసుర లక్షణాలను ఏ విధంగా వివరించింది?

జ. దైవ లక్షణాలు: 1. అభయము 2. చిత్తశుద్ది 3. జ్ఞానయోగమునందుందుట 4. దానము 5. ఇంద్రియనిగ్రహం
    6. యజ్ఞము 7. అధ్యయనము 8. తపస్సు 9. కపటములేకుండుట 10. అహింస 11. సత్యము  
   12. క్రోధములేకుండుట 13. త్యాగము 14. శాంతి 15. కౌండెములుచెప్పకుండుట 16. సమస్తప్రాణులయడల కరుణ 
   17.విషయములపై మనస్సు పోనీయకుండుట 18. తేజస్సు 19. క్షమ 20. ఆపత్కాలమందు దైర్యమును  
   వీడకుండుట 21. శుచి, శుభ్రతలు కల్గియుండుట 22. పరులకు ద్రోహముచేయకుండుట 23. మృదుస్వభావము 
   24. ధర్మవిరుద్ద కార్యములలో ప్రవేశింపకుండుట 25. తననుతాను పొగడుకోనకుండుట      
   26.తంతుల స్వభావము లేకుండుట    
   అసుర లక్షణాలు : డంభము, గర్వము, దురభిమానము,కోపము,పరులను పిడించునట్లు మాట్లాడుట, వివేక 
   జ్ఞానహినత, తాను గొప్ప అను అహంకారము, హింస. 
              ప్రతి మానవుడు తనలోని అసుర లక్షణాలు గుర్తించి వానిని ప్రయత్నపూర్వకంగా దూరంచేసుకొని దైవ లక్షణాలు అలవర్చుకొని భగవంతునిచే ప్రేమించబడే భక్తులుగా తమను తాము తీర్చిదిద్దుకొనవలెను. 

19. యోగమనగా నేమి?

జ. యోగమనగా జీవాత్మ పరమాత్మలో లీనమగుట 
                  యోగమనగా దైవాన్ని చేర్చుమార్గము 
                  యోగమనగా ఆనందం 
                  సమత్వమే యోగము 
                  చిత్త వృత్తిని విరోధించునదే యోగము 

20. యింద్రియాలకు వైరాగ్యమును అలవరచాలని స్వామి చెప్పారు. కారణం ఏమిటి?

జ. గీతలో శరీరమునుండి జీవాత్మ మరొక శరీరములోనికి ప్రవేశించినపుడు తన సత్కర్మ, దుష్కర్మలను తప్ప మరేమి తీసుకొని వెళ్ళలేదు. వాయువు ఏవిధంగా ఒక ప్రదేశంలోని దుర్గంధాన్ని, సుగంధాన్ని తీసుకొని వేరొక ప్రదేశానికి వెళ్తుందో అదే విధంగా ఆత్మ కర్మఫలమునుతప్ప మరేదీ ఈ ప్రపంచం నుండిగాని, తన గృహము నుండిగాని తీసుకొని వెళ్ళలేదు. అందువలన ధన కనక వస్తువులయందు, భోగ భాగ్యముల నుండి మనసును సత్కర్మలవైపు, దైవముపైన మరల్చి ప్రాపంచిక భోగములపై వైరాగ్యమును అలవర్చుకొనవలెను. దీని ఉదాహరణకు స్వామి చిన్న కథ చెప్తారు.ఒక గృహస్దునకు ముగ్గురు మిత్రులు ఉంటారు. కోర్టులో అతనిపై కేసు విచారణ జరుగబోతుంది. తన మిత్రులను తనతో కోర్టుకువచ్చి తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పమని కోరతాడు. మొదటి మిత్రుడు నేను ఇంట్లో నీకేమైనా సహాయం చేస్తాగాని ఇల్లుదాటి బయటకురాను అన్నాడు. రెండవ మిత్రుడు కోర్టువరకు నీకు తోడు వస్తానుగాని లోనికి మాత్రం రాను అన్నాడు. మూడవ మిత్రుడు నేను నీతో కోర్టులోనికి వచ్చి సాక్ష్యం చెప్తాను అన్నాడు. మొదటి మిత్రుడు ధనధాన్యాది సంపదలు. రెండవ మిత్రుడు భార్య,బంధు మిత్రులు. మూడవ మిత్రుడు మనం చేసిన సత్కర్మలు.

21. స్వధర్మమంటే ఏమిటి? పర ధర్మమంటే ఏమిటి?

జ. ఆత్మ సంబంధమైన ధర్మం స్వధర్మం, పర ధర్మమంటే దేహ సంబంధమైన ధర్మం.

22. అర్జునుడి పేర్లు వల్ల వ్యక్తమయ్యే విలక్షణ వ్యక్తిత్వం ఏమిటి?

జ. గురువు వద్ద నుండి విద్యకు శిష్యుడు ఏవిధంగా ఆదర్శంగా వుండాలో అర్జునుని పై పేర్ల ద్వారా తెలుసుకోగలము.

23. "యోగం" అంటే అర్థం ఏమిటి?

జ. భగవంతునితో సం యోగము చెందుటే యోగం. అంతేకాకుండా భగవంతుని చేరే మార్గము (గమ్యము) .

24. భగవద్గీతలో యోగం ఏవిధంగా నిర్వచింపబడినది?

జ. "కర్మను కాశలమ్ యోగ:" అన్నది గీత. అంటే నిర్దేశించిన పనిని హృదయపూర్వకంగా , శక్తి వంచన లేకుండా చేయడమే యోగం. "యోగ: చిత్త వృత్తి నిరోద:" అంటే బాహ్య అంతర ఇంద్రియములను నిగ్రహించి - బుద్దిని,మనస్సును నిలిపి వుంచేదే యోగం. 'సమత్వం యోగముచ్యతే" - అనగా అన్ని సమయాలలోనూ సమత్వ భావనను కలిగియుండటం యోగం.   

25. భగవద్గీతలో ప్రధానమైన యోగములు ఏవి?

జ. కర్మ యోగము, భక్తి యోగము, జ్ఞాన యోగము , రాజ యోగము.

26. కర్మ యోగము అంటే ఏమిటి?

జ. కర్మ యోగము అంటే ప్రతి వ్యక్తీ తనకు నిర్దేశించిన పనిని నిస్వార్థముగా, ప్రతి ఫలాపేక్ష లేకుండా త్రికరణ శుద్దిగా చేయుట.  

27. కర్మ, వికర్మ , అకర్మలను స్వామి ఏవిదంగా విశదీకరించారు?

జ. స్వామి కర్మ, వికర్మ, అకర్మల గూర్చి చెపుతూ " దీపం వుంది. అది నిలకడగా వెలుగుతుంది - ఇది కర్మ. వికర్మ అంటే - ఆ దీపం నిలకడగా వుండక పరిసర ప్రభావాలకు లోనై వూగిసలడటం. ఇకపోతే అకర్మ - నిలకడగా వున్నా, లేక పోయినా జ్యోతి నుండి మనం పొందే వెలుగే అకర్మ. ఇదే ఆత్మ లక్షణం .

28. "కర్మణ్యే వ్యాధి కారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ: మాతే సంగోస్త్వ కర్మణి" శ్లోకార్థాన్ని తెలుపుము?

జ. "కర్మలాచరించుటకు మాత్రమే స్వాతంత్ర్యము కలదు. కానీ ఆ కర్మలవల్ల లభించే ఫలములందు నీకేమియూ జోక్యము లేదు. అట్లాగని నీ కర్మలాచరించుటకు మానరాదు. పనిచేయుట యే నీధర్మం. ఫలము ఈశ్వరాధీనము ఫలాపేక్ష లేని వాడ వై కర్తవ్యమును ఆచరింపుము. 

29. భక్తియోగము అంటే ఏమిటి?

జ. భక్తి యోగము అంటే "భగవంతునితో తనను తాను నిశ్చల, అనన్య భక్తితో అనుసంధానం చేసుకోవడమే. స్వలాభాపేక్షతో భగవంతుని ప్రార్థించకుండా నిశ్చల, నిర్మల మనస్సుతో భగవంతుని సేవిస్తూ మనసా, వాచా, కర్మణా భగవంతునికి తనను తాను అర్పణ చేసుకోవడమే భక్తి యోగము. 

30. నిజమైన భక్తునికి వుండవలసిన లక్షణములు ఏమిటి?

జ. నిజమైన భక్తుడు సర్వప్రాణులయందు సమత్వం కలిగివుండటం మిత్రత్వము, దయార్ద్రహృదయము, అహంకార రహితము, సుఖ దుఖాలు యందు ఒకే విధంగా ప్రవర్తించడం అనే లక్షణాలను కలిగి వుంటాడు. అంతే కాకుండా సహనశీలత్వం సర్వదా అసంతృప్తి లేకుండా తృప్తుడై వుండటం కూడా నిజమైన భక్తుని గుణాలు. అనేకత్వంలోంచి ఏకత్వాన్ని దర్శించి దివ్యత్వాన్ని తెలుసుకొనువాడై నిజమైన భక్తుడు.

31. ఎట్టివాడు భగవత్ప్రేమకు పాత్రుడు కాగలడు ?

జ. అనా పేక్ష: శుచి: దక్ష: ఉదాసీనోగతవ్యధ:
సర్వా రమ్న పరిత్యాగి యోమద్భక్త: సమేప్రియ:
ఎట్టి ఆపేక్షలు (కోరికలు) లేనివాడు. అంతర్ , బహిర్ శుద్ది (పవిత్రత) కలవాడు. ఫలాపేక్ష రహితుడై కర్మల నాచరించేవాడు, గతమును గురించి కానీ, భవిష్యత్తు గురించి కానీ ఏమాత్రమూ విచారించనివాడు, ఆడంబరమైన కర్మలన్నింటినీ విడిచి పెట్టినవాడు నాకు యిష్టుడైన భక్తుడు" అని గీతాచార్యుడు పలికాడు.  

32. జ్ఞానయోగము అంటే ఏమిటి?

జ. జ్ఞానయోగమంటే "నేనెవరిని? నేనెక్కడ నుండి వచ్చాను? నేను ఎక్కడికి పోతాను? " అని విచారణ సలిపి తనను తాను తెలుసుకోవడమే ప్రతీదీ వ్యతిరేకముగా కనబడినా చూడగానే తెలుసుకునే నేర్పు ఆత్మ సంబంధమైన వాస్తవం. 

33. జ్ఞానము ఎన్ని రకములు?

 జ. జ్ఞానము - లౌకికము (భౌతికము) , ఆధ్యాత్మికము (దైవిక సంబంధమైన) అని రెండు రకములు.

34. జ్ఞానము ఏవిధంగా పొందగలము?

జ. జ్ఞాన సంపాదనకు ముఖ్యంగా కావలిసింది శ్రద్ధ మరియు అచంచల ఆత్మ విశ్వాసము.
అసక్తి, స్థిరత్వము , నిశ్చయము కలిసి రూపుదిద్దుకున్నదే శ్రద్ధ అంటే.

35. "రాజ యోగ" మనగా ఏమిటి?

జ. ధ్యానం వలన అనగా ప్రత్యక్షానుభూతి వలన దివ్యత్వానుభూతి పొందుటకు సంబంధించినది రాజయోగము.

36. కర్మ, భక్తి , జ్ఞాన యోగముల సందేశముల మధ్యనున్న అవినాభావ సంబంధములను స్వామి ఏవిధంగా విశదీకరించారు?

జ. కర్మ అనేది చెట్టుకు పూచే పూవు వంటిదనీ, భక్తి ఆ పూవు నుండి ఉద్భవించే కాయవంటిదనీ , జ్ఞానము పండిన పండు వంటిదనీ స్వామి వర్ణించారు. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి క్రమముగా జరుగుతాయి.

37. కర్మ, భక్తి, జ్ఞాన యోగముల ద్వారా దివ్యత్వాన్ని సాధించాలనుకునే వారికి ఏది అడ్డుపడుతూ వుంటుంది?

జ. కర్మ, భక్తి, జ్ఞాన యోగముల ద్వారా దివ్యత్వాన్ని సాధించు కోవాలనుకునే వారికి సర్వదా మనస్సు అడ్డంకులు కలిగిస్తూ వుంటుంది. 

38. మనస్సు అనగా ఏమిటి?

జ. సంకల్ప వికల్పములతో , కోరికలతో కూడినది మనస్సు.
39. మనస్సును ఎందుకు అదుపులో నుంచుకోవాలి?

జ. మనస్సు మానవుని బంధమునకు ముక్తికి మూలం కాబట్టి దీనిని అదుపులో వుంచుకోవలెను. 

40. మనస్సును ఎలా నియంత్రించగలం?

జ. ఇంద్రియాలకు సేవకుడు కాకుండా ఇంద్రియాలకు అధిపతిగా బుద్ది ఉండాలి. బుద్దిని అనుసరించాలి మనస్సు.

సేకరణ పోస్టు...

Monday, September 9, 2024

కుటుంబ వ్యవస్థ ఇక నిలువబడదు. త్వరలోనే కూలిపోతుందని అధ్యయనా

*కుటుంబ వ్యవస్థ ఇక నిలువబడదు. త్వరలోనే కూలిపోతుందని అధ్యయనాలు చెపుతున్నాయి...*
************************
*కుటంబ సభ్యుడిగా పూర్తిగా చదవండి*
*************************

*అందుకు గల కారణాలు:*

1. *అతి తెలివి, గర్వము, డబ్బులు ఉన్నాయనే అహంకారం.*

2. *చిన్న తప్పులను కూడా భరించలేని అసహనం. ఓర్పు లేకపోవడం.*

3. *పిల్లలు, పెద్దలు కూర్చొని మనస్పూర్తిగా మాట్లాడుకోలేకపోవడం .*

4. *ఎక్కువ సమయం TV, ఫోన్లు, ఇతర net program లలో మునిగిపోవడం. (ఎక్కడో ఉన్న సినిమా హీరో, హీరోయిన్లు ఏం తిన్నారో, ఏం చేస్తున్నారో చెప్పగలరు కానీ, ఇంట్లో అమ్మ నాన్న ఏం తిన్నారో వాళ్ళు ఏమి చేస్తున్నారో తెలియదు)*

5. *చిన్న విషయాలకు అలిగి, స్వంత వారితో కూడా దూరంగా ఉండటం.*

6. *ఎవరో ఒకరి నోటి దురుసుతనం, కోపం వల్ల కుటుంబం అంతా చెదిరిపోవడం.*

7. *ఆర్థిక విషయాలలో ఇంటి పెద్దల సలహా తీసుకోకపోవడం*

8. *భార్యాభర్తలు, తలితండ్రులు తరుచు గొడవలు పడుతుండడంతో పిల్లలు పెళ్లి అంటే భయం కలుగుతుంది. పెళ్లి వద్దనుకునే స్థితికి వచ్చేశారు...*

9. *మనిషికి మరో మనిషంటే గిట్టనితనం... పెత్తనం కోసం పోరాటం. ఒంటరితనం ఇష్టపడుతున్నారు.*

10. *మధ్యవర్తిత్వం నడిపేవారు లేరు. ఎవరిష్టానికి వారన్నారు. మంచి చెప్పినా నచ్చటం లేదు.*

11. *కుటుంబ నిర్వహణ ఆనేది గొప్ప కళ. అది తెలియక పోవడం మరో కారణం.*

12. *మానవ సంబంధాలు, సున్నితత్వం మరచిపోయి, మొరటు వ్యవహారం వచ్చేసింది. భార్యాభర్తలు కలిసి కుటుంబాన్ని నడపడం మర్చిపోయారు. "నేను", "నేనే", " నేను చెపితే చేయాలి" అనే ధోరణి ప్రబలిపోయింది.*

13. *social media లో జరిగిందే నిజం, ఇంట్లో జరిగేది ఒక డ్రామా అన్నట్లు ప్రవర్తిస్తున్నారు.*

14. *ఎవరైనా మరణిస్తే ఒక ఆకర్షణీయమైన message పెట్టేసి చేతులు దులుపుకుంటున్నారు... ఇండ్లకు వెళ్లి పలకరించడం లేదు. మోయడానికి కూడా నలుగురు వచ్చే పరిస్థితి లేదు.*

15. *ప్రజలంతా ఎవరికి వారే అన్నట్లు, నిర్లిప్తంగా ఉండిపోతున్నారు... ప్రక్కనే గొడవలు అవుతున్నా చూస్తూ వెళుతున్నారు తప్ప, ఆపే ప్రయత్నం చేయని పరిస్థితి.*
16. *ఆధిపత్యం పోరులో కుటుంబం,సమాజం విచిన్నం అవుతుంది*
17. *ఎవరి సినిమాకు వారే హీరో అన్న చందంగా తయారు అయ్యింది*
18. *యి మధ్య కాలంలో ఎక్కువగా విడాకులువే సమస్యలు ఎక్కువ తెలంగాణ ఆంద్రప్రదేశ్ లో అధ్యయనం లో తేలింది.తస్మాత్ జాగ్రత్త*
19. *తల్లిదండ్రులు, పిల్లలు ఎక్కువ శాతం సెల్ ఫోన్లు ద్వారా మాట్లాడడం వలన ,భారీగా నష్టం వాటిల్లుతుంది.ముక్యంగా విడాకులు కేసులు ఎక్కువ శాతం వివిధంగా విచిన్నం అవుతున్నాయి.గమనించవలెను*
20.*అక్కచెల్లిలు,అన్నదమ్ములు ఆప్యాతలు పెంచుకోండి*
21.*తల్లిదండ్రులు ను విస్మరించకండి,ఎందుకు అంటే దైవంతో సామానులు*

*ఇదే పరిస్థితి కొనసాగితే, అతి త్వరలో కుటుంబ వ్యవస్థే కాదు, అసలు మానవ సంబంధాలు కూడా తెగిపోతాయి అనడం అతిశయోక్తి కాదేమో...*
🤔😊🤔 😊🤔😊 🤔😊🤔

✍🏻🚩 సర్వే జనాః సుఖినోభవంతు. 🚩

Tuesday, September 3, 2024

అష్ట దిక్కుల గాలులు - లాభ నష్టాలు .

అష్ట దిక్కుల గాలులు - లాభ నష్టాలు . 

  గాలులు లొని రకాలు - 

     బౌగోళిక పరిస్థితులను బట్టి సూర్య చంద్రుల గమనాలని బట్టి భూమి స్వరూపాన్ని ఎనమిది దిక్కులుగా విభజించారు. అన్ని దిక్కుల నుంచి వీచే గాలులు అన్ని ఒకే రకంగా ఉండవు . ఆయా దిక్కుల స్వభావాన్ని బట్టి గాలి స్వభావం మారుతుంది . అయితే అన్నివేళలా అన్ని దిక్కుల నుండి గాలులు వీచవు. ఒక్కో రుతువులో ఒక్కో దిక్కునుండి ఒక్కో రకమైన గాలులు వీస్తాయి. వాటివల్ల మానవులు మానవులకు కొంత ఆరోగ్యము , కొంత అనారోగ్యము కలుగుతాయి. ఏ గాలులు అనారోగ్యమో , ఏ గాలులు ఆరోగ్యమో తెలుసుకోవడం ప్రతి మనిషికి అవసరం. 

  దక్షిణ దిక్కు గాలులు - 

    ఏప్రిల్ , మే నెలలలో వచ్చే వసంత మాసంలో దక్షిణ దిక్కు నుంచి గాలులు నెమ్మదిగా వీస్తాయి . ఇవి మలయ పర్వతం మీదగా వీచడం వలన ఆ పర్వతం మీద ఉన్న ఔషధాల సువాసనలు కూడా ఈ గాలులతో కలిసి వస్తాయి. ఈ మలయ పవనాలు తమ చల్లని స్పర్శతో మానవాళిని వేసవితాపం నుంచి కాపాడతాయి. ఈ గాలులని ఆస్వాదించ గలిగితే శరీరంలోని త్రిదోషాలు హరించి చక్కటి ఆరోగ్యం చేకూరుతుంది. ఈ గాలిలో తీపి , చేదు , వగరు రుచులు ఉంటాయి. ఈ కాలంలో అదే స్వభావం కలిగిన ఈశాన్య గాలులు కూడా వీస్తాయి 

  నైరుతి గాలులు - 

      జూన్ , జూలై నెలలలో వచ్చే గ్రీష్మ రుతువు లొ నైరుతి దిక్కు నుండి గాలులు వీస్తాయి . ఈ గాలుల్లో కారం రుచి ఉంటుంది. ఇవి వేడి చేసే స్వభావం కలిగి ఉంటాయి. ఈ గాలులు వాళ్ళ ఉదర రోగాలు , పైత్య రోగాలు , మేహా రోగాలు పుడతాయి. రక్త పిత్త రోగాలు కూడా పుడతాయి. ఈ నైరుతి గాలులు సకల రోగాలుకు నిలయాలు. 

  పడమర గాలులు - 

     ఆగస్ట్ , సెప్టెంబర్ నెలలలో ఉండే వర్ష ఋతువులో పడమర గాలులు వీస్తాయి . ఈ గాలులు వెగటుగా ఉండి వేడి చేసే స్వభావం కలిగి ఉంటాయి. అయినా గ్రీష్మ ఋతువులో నైరుతి గాలుల వలన ఏర్పడిన రక్తపిత్త వ్యాధి హరించి పొతుంది. ఎంతో కాలం నుంచి ఉన్న వివిధ వ్రణాలు మాడిపోతాయి. 

  వాయువ్య దిక్కుల గాలులు - 

   
     అక్టోబర్, నవంబర్ నెలలలో ఉండే శరత్కాలంలో వాయువ్య దిక్కు నుంచి గాలులు వీస్తాయి . ఈ గాలులలో కారం , చేదు గుణాలు ఉంటాయి. తేమ ఉండదు. అందుకే ప్రసన్నంగా ఉంటాయి. అందుకే ప్రసన్నంగా ఉంటాయి. అయితే వాత వ్యాదులు కలిగించడం . వాతవ్యాదులు ఉన్నవారికి ఎక్కువ అవ్వడం ఈ గాలుల స్వభావం . కఫ రోగాలు , పైత్య రోగాలు తగ్గించి వంటిలోని చెడు నీరు తొలగించే గుణం ఈ గాలులలో ఉంది. 

  తూర్పు , ఉత్తర దిక్కుల గాలులు - 

     డిసెంబర్ , జనవరి నెలలలో ఉండే హేమంత ఋతువులో తూర్పు దిక్కున ఉండి ఉత్తర దిక్కుకు ఈ గాలులు వీస్తాయి . తూర్పు గాలులు చలువ చేస్తాయి. కాని వీటివల్ల వాత రోగాలు , కఫ రోగాలు పైత్య రోగాలు పెరుగుతాయి. వంటి నిండా నీరు పట్టే ఉబ్బు వ్యాధి ని కలిగిస్తాయి. ఉత్తరపు గాలులు కూడా చల్లగా ఉంటాయి. ఇవి కఫాన్ని , కొవ్వుని పెంచుతాయి. 

   ఆగ్నేయ గాలులు - 

  
       ఫిబ్రవరి , మార్చి నెలలలో ఉండే శిశిర ఋతువులో ఆగ్నేయ దిక్కు నుండి గాలులు వీస్తాయి . ఇవి కూడా అమిత చల్లగా ఉంటాయి. వాతవ్యాదులని పుట్టిస్తాయి. ఉబ్బు రోగాలు , వ్రణాలు ఉన్నవారిని మరింత పీడిస్తాయి.