Tuesday, September 17, 2024

పాలు సేవించుట వల్ల ఉపయోగాలు - సేవించువారు తీసుకోవలసిన జాగ్రత్తలు -

పాలు సేవించుట వల్ల ఉపయోగాలు - సేవించువారు తీసుకోవలసిన జాగ్రత్తలు -  

 
  పాలు సేవించుట వల్ల ఉపయోగాలు - 

   పాలు మధురంగా ఉండును. జిడ్డుని కలిగి ఉండును. వాతాన్ని , పిత్తాన్ని హరించును . శీతలం , అన్ని తత్వముల వారికి మంచిది . బలం కలుగజేయును . మేధస్సుకు మంచిది . ఆయువుని వృద్ది చేయును . బాలురు , వృద్ధులు, క్షీణించినవారు, ఆకలిచే కృశించిన వారు పాలు సేవించిన ఆరోగ్యం కలుగును.

              పాలు పితుకుతున్నప్పుడు వేడిగా ఉండు పాలు బలం , అమృత తుల్యంగా ఉండును. అలా కాకుండగా పితికిన తరువాత చల్లబడిన పాలు తాగినచో అనేక రోగాలు తెచ్చి పెట్టును. 

              పంచదార , పటికబెల్లం కలిపిన పాలు తాగినచో శుక్రం పెంచును. బెల్లం కలిపిన పాలు తీసుకున్నచో మూత్రం బొట్లుబొట్లుగా పడు రోగంని నివారించును. పిత్తాన్ని , శ్లేష్మాన్ని పెంచును. రాత్రుల యందు పాలు తాగుచున్న యొడల అనేక దోషాలను పోగొట్టును . అలా పాలు సేవించాలి అనుకునేవారు భోజనం వేళకు , పాలు తాగు సమయానికి 2 గంటల వ్యవధి ఉండవలెను . భోజనం చేయకుండా పాలు తాగవచ్చు . పాలలో అన్నం కలిపి తినకూడదు. అలా తినినచో " అజీర్ణం" కలుగును. రాత్రి నిద్రపట్టదు. 

  ప్రతిదినం పాలు తాగువారు పాటించవలసిన నియమనిబంధనలు - 

 * మంచి రంగు లేకుండా మంచి రుచి కలిగి ఉండని , పుల్లటి మరియు చెడు వాసన , గడ్డలుగా ఉన్న పాలను తాగరాదు.

 * పాలతో ఎల్లపుడూ పంచదార మాత్రమే కలిపి వాడవలెను. లేనిచో పటికబెల్లం చూర్ణం కూడా వాడవచ్చు 

 * పాలల్లో ఉప్పు కలిపి వాడరాదు.

 * చేపల కూర తిని పాలు మరియు పాలపదార్థాలు తీసుకోరాదు . అలా తీసుకున్నచో తప్పక కుష్టువ్యాది కలుగును. 

 * కొన్నిరకాల పుల్లటి వస్తువులు పాలతో చేరినపుడు విరుద్దముగా మారును . కావున పాలు తాగు సమయంలో కాని ఆ తరువాతనైనా పుల్లని వస్తువులను భుజించరాదు . 

 * ఉలవలు , పరిగెలు , కొర్రలు, అనుములు , అడవి పెసలు మొదలైనవి పాలతో విరోధించును. కావున వీనిలో ఏ ఒక్కటి పాలతో కలిపి లోపలికి తీసుకోకూడదు . 

 * అనుములు , మినుములు ముఖ్యంగా పాలతో విరోధించును.ఈ రెండు పదార్థాలకు సంబంధించిన ఆహారాలు తీసుకున్నప్పుడు పాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు . అనారోగ్యం కలుగును.

 * ముల్లంగి సంబంధించిన ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు పాలు వాడరాదు.

 * రాత్రుల యందు వేడివేడి గోధుమ చపాతీలు ఇగురు కూరలతో కాని , తీపి పదార్థాలతో కాని లేక పంచదారతోగాని కలిపి భుజించి కాచిన పాలలో పంచదార కలిపి తాగిన చక్కటి ఆరోగ్యం కలుగును. 

 * పాలయందు వెన్న ఆవులు, గేదెలు తిను ఆహారం నుండి పుట్టును . చిట్టు , పచ్చగడ్డి , పత్తిగింజలు , మినపరొట్ట మెదలైనవి తినిన పశువుల పాలు శ్రేష్టము. పల్లపు ప్రదేశాలలో ఉండు పశువులు ఇచ్చు పాలకన్నా మెట్ట ప్రాంతాలలో ఉండు పశువులు ఇచ్చు పాలు శ్రేష్టం. 

 * ఆవుపాలు గేదెపాలకన్నా శ్రేష్టమైనవి . గేదెపాలల్లో ఆవుపాలు కంటే మందంగా ఉండును. కారణం వెన్నశాతం ఎక్కువుగా ఉండటం అందువలన ఆలస్యముగా జీర్ణం అగును. గేదెపాలు నిద్రను కలుగజేయును. చలవ చేయును . 

 * మేకపాలు కారం, చేదు రుచులు కలిగి ఉండును. ఆకులను తినుట చేతను కొద్దిగా నీరు తాగుటచేతను , ఎక్కువ దూరం నడుచుట వలన మేకపాలు అన్ని వ్యాధులను పొగొట్టును. ముఖ్యంగా రక్తపిత్తవ్యాధి అనగా నోటి నుండి రక్తం బయటకి వెలువడు వ్యాధి తగ్గును. క్షయరోగం , దగ్గు , జ్వరములను తగ్గించును . చంటిబిడ్డలకు తల్లిపాల తరువాత మేకపాలు శ్రేష్టమైనవి . 

      
      

No comments:

Post a Comment