Tuesday, October 1, 2024

కుప్పింటాకు మొక్క యొక్క ఉపయోగాలు..!*

*కుప్పింటాకు మొక్క యొక్క ఉపయోగాలు..!* 

ఎన్నో రకాల మొక్కలను మన చుట్టూ పరిసరాలలో చూస్తూనే ఉంటాము. అయితే అందులో కొన్ని మొక్కలు విషపూరితమైనవి ఉంటాయి. మరి కొన్ని మొక్కలు ఆరోగ్యానికి ఎంతో మేలు రకమైనవి ఉంటాయి. అలాంటి వాటిలో కుప్పింటాకు కూడా ఒకటి. ఇలాంటి మొక్క చాలా అరుదుగా దొరుకుతుంది మనకు. ఇది ఎటువంటి నేల‌లోనైనా సుల‌వుగా పెరుగుతుంది. రోడ్ల‌కు ఇరువైపులా, ఖాళీ ప్ర‌దేశాల్లో, పొలాల ద‌గ్గ‌ర‌, చేల దగ్గ‌ర ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ ఈ మొక్క పెరుగుతుంది. ఈ మొక్క వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం..

1.కుప్పింటాకు మొక్క పంటి నొప్పిని తగ్గిస్తుంది . అందుకే దీనిని పిప్పెంటి ఆకు అని అంటారు. పంటి నొప్పిలన్నిటికీ ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.

2.ఈ మొక్క వేర్లతో పళ్ళను తోమితే దంతాలు తెల్ల పడతాయి. అంతేకాకుండా చిగుళ్ల నుంచి కారే రక్తాన్ని కూడా ఆపుతుంది.

3.ఈ ఆకు రసం రెండు చుక్కలు ముక్కులో వేస్తే ఎటువంటి మొండి తలనొప్పి అయిన తగ్గుతుంది.

4.కుప్పింటాకు ఆకులను మిరియాలతో కలిపి నూరి తేలు కాటుకు, పాము కాటుకి కట్టు కడితే విషాలను విరిచేస్తుంది.

5.కళ్ళు ఉప్పు, పిప్పింటాకు కలిపి నూరి దురద ఉన్న చోట రాస్తే వెంటనే తగ్గుతుంది.

6.రెండు స్పూన్లు పిప్పింటాకు రసాన్ని నిద్ర పోయే ముందు తాగితే మలబద్దకం, నులి పురుగులు అన్ని కొట్టుకు పోతాయి. విరోచనం సాఫిగా అవడమే కాక శరీరం శుభ్రం అవడానికి సహాయపడుతుంది.
కళ్ళు ఎర్రబడటం, జ్వరం, వాంతులు, కఫం లాంటి వ్యాధులకు ఆయుర్వేద ముందుగా పిప్పింటాకు ఉపయోగిస్తారు. గ్లాస్ వాటర్‌లో కొన్ని పిప్పింటాకులు వేసి మరిగించి రాత్రంతా ఉంచాలి. తర్వాతి రోజు ఉదయాన్నే వడకట్టి తాగితే పన్ను నొప్పి తగ్గుతుంది. శ్వాస వ్యవస్థ బాగా పని చేస్తుంది. 

7.కామెర్లకు కుడా ఈ కుప్పింటాకును ఉపయోగిస్తారు.
కురుపులు, మొటిమెలు, అవాంఛిత రోమాలు పోవడానికి కుప్పింట ఆకు, కళ్లు ఉప్పు, పసుపు , నూరి రాస్తే త్వరగా నయం అవుతాయి.


No comments:

Post a Comment