Tuesday, October 1, 2024

మందార తైలం.....*

*మందార తైలం.....*
 *కేవలం 30 నిమిషాల్లో మందార తైలం తయారు!!*
 అద్భుతమైన మందార తైలాన్ని ఇంట్లోనే... అది కూడా ఎలాంటి ఖర్చు లేకుండా అద్భుతమైన నేచురల్ మందార తైలాన్ని తయారు చేసుకునే విధానం....
*కావాల్సిన పదార్ధాలు...*
1. తాజా ఒక్క రెక్క మందార పూలు 500gms.
2. పచ్చి పెద్ద ఉసిరికాయలు 100gms
3. తాజా మందార ఆకులు 100gms
4. వేప ఆకులు లేదా ఎండిన పండ్లు 50gms
5. గోరింటాకు ఆకులు 50gms
6. తొక్క తీసిన అలోవెరా గుజ్జు 100gms
7. రాత్రి నానబెట్టిన మెంతులు 50gms
*తయారు చేసుకునే విధానం.....*
 పైన చెప్పిన వీటన్నిoటిని తీసుకొని, ఒక్కొక్క పదార్థాన్ని రోట్లో వేసుకొని బాగా మెత్తగా నూరుకోవాలి. అలా నూరుకున్న పేస్టును ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
 స్టవ్ పైన గిన్నెపెట్టి, గానుగలో పట్టించిన అర కేజీ స్వచ్ఛమైన తెల్ల నువ్వుల నూనెను పోసుకొని వేడి చేయాలి. ఆయిల్ కొద్దిగా వేడి అయిన తర్వాత ముందుగా నూరి పెట్టుకున్న ఆయిల్లో వేసి మెల్లగా కలపాలి.
 స్టవ్ స్లిమ్ లో పెట్టి..... వేసిన పేస్టు మొత్తం నూనెలో ఇంకిపోయే వరకు మరుగనివ్వాలి. నూనెలో నీటి శాతం మొత్తం ఆవిరి అవ్వాలి. తరువాత స్టవ్ ఆర్పే.. నూనె చల్లారిన తర్వాత ఒక డబ్బాలోకి తీసుకోవాలి.

*వాడే విధానం....*
 ఆడవాళ్ల అయితే వారానికి 2,3 సార్లు జుట్టుకు బాగా పట్టించాలి. మగవాళ్లు పిల్లలు రెగ్యులర్ గావాడాలి.
 *ఆయిల్ యొక్క రిజల్ట్స్.......*
1.హెయిర్ ఫాల్ వెంటనే తగ్గుతుంది.
2.జుట్టు నల్లగా బలంగా పెరుగుతుంది.
3. డాండ్రఫ్ తగ్గుతుంది.
4. హెయిర్ గ్రోత్ వెంటనే ఫలితం వస్తుంది.
5. జుట్టు బలంగా దృఢంగా పెరుగుతుంది.
6. జుట్టుకు కావాల్సిన ఎన్నో పోషకాలు ఇందులో లభిస్తాయి.
 ఈ అద్భుతమైన మందార తైలాన్ని ఇంట్లో చేసుకోగలిగిన వాళ్లు హ్యాపీగా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు తయారు చేసుకోలేని పరిస్థితి ఉన్నట్లయితే మేము తయారు చేసి కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది. మరొక విషయం ఇది కేవలం ఆరోగ్య ప్రయోజనాల కోసమే తప్ప వ్యాపార ప్రయోజనాల కోసం కాదు. వ్యాపారమే చేయదలుచుకుంటే మీకు ఎలా తయారు చేయాలో అని మీకు తెలియజేసే వాళ్ళం కాదు దయచేసి గమనించగలరు........
 

No comments:

Post a Comment