Wednesday, January 1, 2025

పిల్లలు పక్క తడపటం


*<>•<>•<>•<>•<>•<>•<>•<>*
*ఆరోగ్యమస్తు*
*+++++++++++++++++*
*పిల్లలు పక్క తడపటం*
*!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!*
*పిల్లలు పక్క తడపటం*
*దీనిని ఆయుర్వేదంలో* *శయ్యామూత్రం” అంటారు* *చిన్నప్పుడు సరే కాని పెద్దపిల్లలు కూడా పక్క తడుపుతుంటారు. టీ*కూల్ డ్రింక్స్, చెరకు రసం, చాక్లెట్లు వంటి వాటిల్లో మూత్రాన్ని అధికం చేసే నైజం ఉంటుంది. కాబట్టి* *అలాంటి ఆహారపదార్థాలు పిల్లలకు ఎక్కువగా ఇవ్వకూడదు. పిల్లలను రాత్రిపడుకో బెట్టే ముందు మూత్ర విసర్జన చేయించాలి. పడుకున్న తరువాత 3, 4 గంటల తరువాత మళ్ళీ ఒకసారి లేపి చేయించాలి కొన్ని రోజులు ఇలా చేస్తే మధ్యరాత్రిలో వాళ్ళంతట వాళ్ళే లేవగలుగుతారు*.

*1.ఎ) బంక మన్ను, తేనె, నెయ్యిల మిశ్రమాన్ని పొత్తి కడుపు ప్రాంతంలో, మూత్రాశయం పై పట్టులాగా వేస్తూ ఉంటే కొన్ని రోజులకు మూత్రాశయపు కండరాలు, నాడీవ్యవస్థ శక్తివంతంగా తయారయి, మూత్ర విసర్జన మీద నియంతణ వస్తుంది*.

*బి) దొండచెట్టు వేర్లను తెచ్చి నలగ గొట్టి రసం తీసి త్రాగిస్తే మార్పు కనిపిస్తుంది. అలాగే ఆవాలను పొడిచేసి రోజుకు అరగ్రాము చొప్పున పాలతో త్రాగించినా లేదా అన్నంతో కలిపి పెట్టినా ఫలితం ఉంటుంది*.

*2. ఎండు కొబ్బరి పొడి100 గ్రా॥లు (మెత్తగా చేయాలి)*

*జొన్న పేలాల పొడి100 గ్రాములు*

*తెలగ పిండి100 గ్రాములు*

*పాత బెల్లం 100 గ్రాములు*

*అన్నింటిని కలిపి రోట్లో వేసి దంచాలి. 10 నుండి 20 గ్రా॥ల మోతాదుగా లడ్డూల్లాగా చేసుకొని తడి తగలకుండా నిలువ చేసుకోవాలి. ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి చొప్పున కొంచెం కొంచెం చప్పరించి తినాలి. దీని వలన నిద్రలో పక్క తడిపే సమస్య పోతుంది. ఇది మంచి పుష్టిదాయకమైనది. బలాన్ని దేహదారుఢ్యాన్ని కలిగిస్తుంది*

*మూత్రంలో మంట* :

*1. దోస గింజలను నీళ్ళతో మెత్తగా నూరి 3 పూటలు త్రాగుతూ ఉంటే మూత్రంలో మంట, ఉడుగు తగ్గుతుంది*
*2అరకప్పు ముల్లంగి రసంలో ఒక చెంచా కండ చక్కెర కలిపి రెండు పూటలు సేవిస్తూ ఉంటే మూత్రంలో చరుకు, మంట, పోటు తగ్గును*


No comments:

Post a Comment