Monday, June 30, 2025

గాయత్రీ మంత్రమనేది ఒకటి వుందని తెలిసినా, అదేమిటో అసలు ఎలా జపించాలో తెలియదు

గాయత్రీ మంత్రమనేది ఒకటి వుందని తెలిసినా, అదేమిటో అసలు ఎలా జపించాలో తెలియదు

  కొందరికి మంత్రము తెలిసినా కాలంతోపాటు పరిగెడుతూ హడావిడిగా జీవితాలను గడపాల్సిరావటం వల్ల ఈ మంత్రాన్ని గబగబ బట్టీయం పట్టినట్టు మొక్కుబడిగా దేవుని ముందు అప్పగించేసి హమ్మయ్య ఈ రోజుకి చదివేసాను అనుకుంటారు.

 నిజానికి గాయత్రీ మంత్రాన్ని అలా చదవకూడదు. అసలు గాయత్రీ మంత్రమేమిటో అది ఎలా జపించాలో తెలుపవలెనని నాయొక్క చిన్న ప్రయత్నం.

గాయత్రీ మంత్రము అంటే…
“ఓం, భూర్భువస్సువః, తత్ సవితుర్వరేణ్యం, 
భర్గోదేవస్య ధీమహి, ధియో యో నః ప్రచోదయాత్”
ఇది మంత్రము. ఈ మంత్రాన్ని ఏకధాటిగా చదవకుండా మంత్రన్ని నాలుగు చోట్ల ఆపి చదవాలి. అది ఎలాగంటే…

 

ఓం

భూర్భువస్సువః

తత్సవితుర్వరేణ్యం

భర్గోదేవస్య ధీమహి

ధియో యోనః ప్రచోదయాత్

 

ఇలా మంత్రం మద్యలో నాలుగు సార్లు ఆపి చదవాలి.

 ఈ మంత్రములో “ఓం” అనేది “ప్రణవము”, “భూర్భువస్సువః” లోని భూ, భువః, సువః అనేవి “వ్యాహృతులు”. వ్యాహృతులు అనేవి దివ్యశక్తిని కలిగిన పదాలు. ఇవి మూడు లోకాలను సూచిస్తాయి. “తత్” నుంచి మిగిలిన భాగాన్ని “సావిత్రి” అని అంటారు.

 గాయత్రి మంత్రం లో 24 బీజాక్షరాలున్నాయి. వాటిని ఆధారం చేసుకుని నిర్మితమైన కొన్ని గొప్ప ఆలయాలను ఒకసారి అవలోకించుకుందాం.

 1. కంచి కామాక్షి మందిరం లో అమ్మవారు మూలవిరాట్టుగా కూర్చుని ఉన్న మంటపాన్ని గాయత్రి మంటపం అంటారు. ఆ ప్రాక్రారంలో 24 స్తంభాలున్నాయి. అవి 24 బీజాక్షరాలకు ప్రతీకలు.

 2. కోణార్క్ లోని సూర్య దేవాలయ సముదాయం ఒక పెద్ద రధం మీద వున్నట్టు నిర్మించబడి వున్నది. ఆ రధానికి గాయత్రీ మంత్రానికి ప్రతీకగా 24 చక్రాలు వున్నాయి. వాటిని ఆంగ్లేయులు 24 గంటలని చెప్పారు. మనవాళ్ళు దానినే పట్టుకుని వేల్లాడుతున్నారు.

 3. పురాణ కధనం ప్రకారం 24 ఋషులు వారి మంత్రశక్తిని ఈ 24 బీజాక్షరాలలో నిక్షిప్తం చేసారు. ధర్మచక్రం లో వున్నా 24 చువ్వలు (spokes ) వాటికి ప్రతీకలు. దాన్నే మనం సమయచక్రం అని కూడా అంటున్నాము.

 4. జైన సిద్ధాంతంలో 24 తీర్ధంకరులు – ఇది అవైధిక మతమైనా వాటికి మూలం మన వేదమే.

 5. 24 కేశవ నామాలు

6. 24 తత్వాలు : ఐదు జ్ఞానేన్ద్రియాలు, 5 కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, 5 మహాద్భూతాలు, బుద్ధి, ప్రకృతి, అహంకారం, మనస్సు

 7. ఛందస్సులలో ఒకానొక గొప్ప ఛందస్సు గాయత్రి పేరు మీద వున్నది. భగవద్గీతలో శ్రీ కృష్ణుడు ఇలా చెబుతాడు : “ బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ చందసామాహం”

 8. రామాయణం లో 24 సహస్ర శ్లోకాలు.

 9. రామాయణం గాయత్రి మంత్రాన్నే ప్రతిపాదిస్తోంది. కావాలంటే మీరే ఒకసారి తరచి చూడండి. 1, 1001, 2001, 3001, 4001, …..23001 శ్లోకాలను గనుక మీరు చూస్తె మీకు గాయత్రి మంత్రమే కనబడుతుంది. దీన్ని గాయత్రి రామాయణం అని కూడా అంటారు

 10. ఒక వీణలో 24 చిర్రలు వుంటాయి. సంగీత శాస్త్రం తెలిసినవాళ్ళు దీన్నే గాయత్రి ఉపాసన అని అంటారు.

 11. మన వెన్ను బాములో 24 మ్రుదులాస్తులు ( Cartilage )వుంటాయి. వాటికి అధి దేవతలే గాయత్రి మంత్రాక్షరాలు.
12.మనకు గల సమయం 24 గంటలు.. ఒక్కొక్క గంటకు ఒకొక్క అక్షరం మనలలను కాపాడుతూ వుంటుంటుంది ఆ గాయత్రి మాత 
 “న గాయత్రీ త్రాహ్య పరం మంత్రం .. నమాతా: పర దైవతం” అన్నారు పెద్దలు . 24 బీజాక్షరాలతో కూడిన గాయత్రీ మాతను ఒక్కసారి జపిస్తే చాలు, సర్వ పాపాలు హరిస్తాయంటారు. సకల దోషాలు తొలగి పోతాయంటారు. సకల దేవతా స్వరూపం గాయత్రీ. రామాయణ సారం గాయత్రీ . కోర్కెలు తీర్చే మంత్ర రాజం గాయత్రీ. విశ్వశాంతికి పరిష్కారం గాయత్రీ .. సకల కోర్కెలు ఈడేర్చే మహా మంత్రం గాయత్రీ .. 24 బీజాక్షర సంపుటి గాయత్రీ.. అలాంటి గాయత్రి మాతను స్మరణం చేసుకోవడం అంటే నిజంగా పూర్వ జన్మ సుకృతమే అని చెప్పాలి.

 
యిరువది నాలుగు దేవతా మూర్తులు
క్రమ సంఖ్య అక్షరము దేవతా మూర్తి క్రమ సంఖ్య అక్షరము దేవతా మూర్తి
1 తత్ విఘ్నేశ్వరుడు 13 ధీ భూదేవి
2 న నరసింహస్వామి 14 మ సూర్య భగవానుడు
3 వి మహావిష్ణువు 15 హి శ్రీరాముడు
4 తుః శివుడు 16 ధి సీతాదేవి
5 వ శ్రీకృష్ణుడు 17 యో చంద్రుడు
6 రే రాధాదేవి 18 యో యముడు
7 ణ్యం శ్రీ మహాలక్ష్మి 19 నః బ్రహ్మ
8 భ అగ్ని దేవుడు 20 ప్ర వరుణుదు
9 ర్గోః ఇంద్రుడు 21 చో శ్రీమన్నారాయణుడు
10 దే సరస్వతీ దేవి 22 ద హయగ్రీవుడు
11 వ దుర్గాదేవి 23 య హంసదేవత
12 స్య ఆంజనేయస్వామి 24 త్ తులసీమాత
ఈ ఇవరై నాలుగు దేవతా మూర్తులకు మూలాధారమైన ఈ గాయత్రీ మంత్రాన్ని జపిస్తే కీర్తి,దివ్య తేసస్సు, సకల సంపదలు, సమస్త శుభాలు కలుగుతాయి.

!! గాయత్రి రక్ష సర్వ జగద్రక్ష !!

సర్వేజనాః సుఖినో భవంతు" అనే మహాశ్లోకానికి తెలుగు భాషలో వివరణ, అర్థము మరియు జీవన మార్గదర్శనము

😌🙏 *మహా శుభోదయము*

*"ఓం సర్వేజనాః సుఖినో భవంతు" అనే మహాశ్లోకానికి తెలుగు భాషలో వివరణ, అర్థము మరియు జీవన మార్గదర్శనము:*

🕉️ *శ్లోకం:*

😌🙏 
*ఓం సర్వే జనాః సుఖినో భవంతు*
*సర్వే సంతు నిరామయాః।*
*సర్వే భద్రాణి పశ్యంతు।*
*మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్॥*
*ఓం శాంతిః శాంతిః శాంతిః*

✨ *ప్రతిపదార్థము:*
🪷 *ఓం* – *పరబ్రహ్మ స్వరూపమైన శబ్దము. ఇది శుభారంభానికి సంకేతము.*

🪷 *సర్వే జనాః సుఖినో భవంతు* – *ఈ లోకములోని ప్రతిఒక్కరూ సుఖముగా, శాంతితో జీవించాలి.*

🪷 *సర్వే సంతు నిరామయాః* – *అందరూ రోగాలు లేని ఆరోగ్యవంతులై ఉండాలి.*

🪷 *సర్వే భద్రాణి పశ్యంతు* – *అందరూ మంచి విషయాలను మాత్రమే చూసేవారుగా ఉండాలి.*

🪷 *మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్* – *ఎవరికీ దుఃఖం కలగకూడదు.*

🪷 *ఓం శాంతిః శాంతిః శాంతిః* – *త్రివిధ తాపాలు (ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక) నివారించబడి, శాంతిగా జీవించాలని ప్రార్థించడము.*

🌱 *మహోన్నతమైన ఈ మంత్ర సారమును మన జీవితాలల్లో నిరంతరమూ, మనము కలిగివుండాలంటే, మనమేమి చెయ్యాలి?.*

🌹 *1. మన హృదయాలల్లో దయాభావమును కలిగి ఉందాము. అంటే మన వలె ఇతరులను చూసుకుందాము మరియు సేవా దృక్పథముతో జీవితాన్ని గడుపుదాము.*

🌹 *2. చక్కని ఆరోగ్యానికి దారిచూపే జీవనశైలి పాటిద్దాము.*
*ఆరోగ్యవంతమైన ఆహారపు అలవాట్లను పాటిద్దాము మరియు శారీరకంగాను, మానసికంగాను ఆరోగ్యముగా ఉండేందుకు గాను యోగాసనాలు, ప్రాణాయామము, ధ్యానమును ప్రతి రోజూ చేద్దాము.*

🌹 *3. మనచుట్టూ ఉన్నవాళ్ల జీవితాల్లో శాంతిని, ఆనందాన్ని సృష్టింద్దాము. మన సహాయము అవసరమున్న వారికి వీలైతే మాటలతోనైనా లేదా పనులతోనైనా చేద్దాము.*

🌹 *4. సద్బుద్ధిని మరియు శుభదృష్టిని అభివృద్ధి చేసుకుందాము. మంచి విషయాలు అనగా నిత్యమూ శ్రీమద్ భగవద్గీత, శ్రీరామాయణము, శ్రీభాగవతము, శ్రీభారతము మొదలైన ధర్మశాస్త్రాలను అధ్యయనము చేద్దాము లేదా విందాము.*

🌹 *5. మన జ్ఞానేంద్రియాలను మరియు కర్మేంద్రియాలను శుభకార్యములకు వినియోగిద్దాము. అంటే... మంచి భావయుక్తమైన పాటలు వినడము,మంచి దృశ్యాలను చూడడము, శుభ కార్యాలలో పాల్గొనడము మొదలైన పనులను చేద్దాము.*

🌹 *6. మనము ఎప్పటికీని ‘మన స్వార్థము’ కంటే ‘సామూహిక హితానికి ప్రాధాన్యమును ఇద్దాము.*

🌹 *7. "మనందరి సుఖములోనే, మన సుఖమున్నది" అనే తత్వము ఈ శ్లోకములో ఉంది. ఇది కేవలము ఒక ప్రార్థన మాత్రమే కాదు — ఇది సనాతన ధర్మానికి చెందిన జీవన సిద్ధాంతము.*

🌸 *నిత్య జీవితములో ఈ శ్లోకమును ఎలా వాడుకోవచ్చును,* *అంటే...*

✅ *ప్రతి ఉదయము ధ్యానము లేదా ప్రార్థనా సమయములో ఈ శ్లోకాన్ని మంత్రముగా జపిద్దాము.*

✅ *సద్భావనలతో రోజంతా జీవించాలనే సంకల్పమును చేద్దాము.*

🕉️
*"ఓం సర్వే జనాః సుఖినో భవంతు"*
*"ఓ పరమాత్మా! సమస్త ప్రజలు సుఖముగా, ఆరోగ్యముగాను మరియు శాంతియుతముగా జీవించుదురు గాక."*

🌟 *జో శ్రీ అచ్యుతానంద యోగము, "5D" నేటి తరానికి అనుగుణముగా నవీకరించబడిన యోగ శాస్త్రాలు మరియు సాధనలు, శ్రీ భాగ్య నగరము (Hyd), తెలంగాణా.*

😊 *అంతా సరిగానే ఉంది* 👍👌
 🪷🌼🌻🌸🌺🏵️💐🌹

ముత్తయిదువ లక్షణాలు* *ఉపయోగాలు

*🌼ముత్తయిదువ లక్షణాలు* *ఉపయోగాలు 🌺*
*| మొత్తం అయిదు అవి |*  



మొత్తం అయిదు అలంకారాలు ఉన్న స్త్రీని ముత్తైదువ అంటారు. అవి..

1) కాళ్ళకి పట్టీలు, మెట్టెలు
2) చేతులకి గాజులు
3) మెడలో మంగళసూత్రం
4) తలలో పువ్వులు
చివరగా..
5) నొసటన అంటే కనుబొమ్మల మధ్య సింధూరం కానీ కుంకుమ కానీ..

1) మొదటగా కాళ్ళకు పట్టిలు మెట్టెలు ఎందుకో చూద్దాం:

కాళ్ళలో ఉండే సయాటికా నెర్వ్ మోకాళ్ళ దగ్గర నుంచి కింది వైపుకి టిబియా లేదా టైబియా అని పిలవబడుతుంది ..

ఇది తిరిగి పాదపు గుత్తి వరకు వచ్చిన తర్వాత రెండు రకాలైనటువంటి బ్రాంచెస్ గా విడిపోతుంది..

ఒక శాఖ వేళ్ళ చివరి వరకు వెళ్లి అక్కడ చిన్న చిన్న శాఖలుగా అంతమైతే మరొక శాఖ వెనకాల మడమ వరకు వెళ్లి అక్కడ అంతమవుతుంది.

అంటే వేళ్ళ చివరలో ఇంకా మడమల చివర్లో టిబియా శాఖ తాలూకు నాడీ అంత్యాలు ఉంటాయి. ఈనాడి నేరుగా కటివలయం దగ్గర ఉన్న గర్భాశయ మరియు మూత్రాశయ నాడులతో సంబంధాన్ని కలిగి ఉంది.

అంటే స్త్రీలలో వారు ధరించేటువంటి పట్టీలు ఇంకా కాలి మెట్టెలు ఇవన్నీ కూడా ఈ టిబియా నాడిని రాపిడి లేదా ఒత్తిడి ద్వారా ప్రేరేపించి తద్వారా మూత్రాశయ నాడులను గర్భాశయ నాడులను కూడా ప్రేరేపిస్తాయి.

ఫలితంగా వారిలో గర్భాశయ మరియు మూత్రాశయ పనితీరు అనేది చురుగ్గా ఉంటుంది.

గర్భాశయం పనితీరు బాగుండటం వల్ల బిడ్డను మోయడానికి సుఖప్రసవానికి కూడా సులువుగా ఉంటుంది.

అలాగే మూత్రాశయ పనితీరు బాగుండటం వల్ల ఎప్పటికప్పుడు దేహంలో నిల్వ ఉండకుండా మూత్రం మొత్తం బయటికి వెళ్లిపోతుంది. దీని గురించి పూర్తి సమాచారం కావాలంటే tibia nerve అని గూగుల్లో వెతికితే మనకు పూర్తి సమాచారం దొరుకుతుంది.

 2) ఇంకా రెండవ అలంకార లక్షణం గాజులు..

గాజులు అంటే కేవలం మట్టి లేదా గాజు లేదా బంగారం గాజులు మాత్రమే ఈరోజుల్లో వేసుకునే ప్లాస్టిక్ గాజులు ఎంతమాత్రం కాదు..

మన చేతి మణికట్టు దగ్గర రేడియల్ నెర్వ అనే నరం నేరుగా గుండె యొక్క నరాల తోటి అంటే గుండె స్పందన కి సంబంధించిన నరాల తోటి సంబంధాన్ని కలిగి ఉంటుంది వైద్యులు నాడీ స్పందన కూడా దీని తోటే గమనిస్తూ ఉంటారు.

ఈ నరం మన శరీరంలో పెరిగే లేదా తగ్గేటటువంటి బ్లడ్ ప్రెజర్ అంటే రక్త పోటుని అదుపులో ఉంచుతుంది అంటే దీనికి మసాజ్ చేయడం ద్వారా రక్తపోటును కూడా అదుపులో ఉంచుకోవచ్చు.అందుకనే స్త్రీలలో గాజులను వేసుకోవడం అనేది ఆనవాయితీగా ఉంటూ వొచ్చింది.

అయితే ఇక్కడ మీకు ఒక అనుమానం కలగాలి,గాజులు అనేవి మరి పురుషులు వేసుకోరు కదా వారికి రక్తపోటు అవి రావా అని.పూర్వకాలం నుంచి కూడా వారు పొలం పనులు లేదా శారీరక శ్రమ అనేది ఎక్కువగా చేయడం వల్ల ఒకరకంగా చెప్పాలంటే తిండికి సరిపడా పని ఉండడంవల్ల వారిలో కొవ్వుశాతం చాలా తక్కువగా ఉండేది దానివల్ల బ్లడ్ ప్రెషర్ కూడా తక్కువగా ఉండేది అందువల్ల వారికి గాజులు అవసరం అనేది లేకుండా పోయింది.

అయితే వారిలో కూడా కొంతమందికి రక్తపోటు సమస్యలు ఉన్నవారికి వెండి లేదా బంగారం లేదా రాగితో చేసినటువంటి కడియం ధరించమని చెప్పడం జరిగింది ఈ లోహాలతో చేసినవి శరీరానికి వేడిని గ్రహించి చల్లగా ఉంచుతాయి.

అందునా పొలం పనులు , కాయకష్టం చేసే వాళ్ళు కాబట్టి గాజులు వేసుకుంటే పగిలిపోతాయి అనే ఉద్దేశంతో వీళ్ళకి కేవలం కడియాలలా ధృఢంగా ఉన్నవాటిని మాత్రమే సిఫార్సు చేయడం జరిగింది.

ఈనరం దాని యొక్క పనితీరు గురించి తెలియాలి అంటే గూగుల్లో Radial nerve అని వెతికితే మనకు పూర్తి సమాచారం దొరుకుతుంది.

3) మూడవది మెడలో మంగళసూత్రం..

దీని చివరున్న బంగారంతో చేసిన లాకెట్స్ రాపిడివల్ల ఆడవాళ్లలో రొమ్ము క్యాన్సర్ అనేది రాకుండా ఉంటుంది.

అయితే మళ్ళా మీకు ఒక అనుమానం రావచ్చు మరి మగవాళ్ళ సంగతి ఏమిటి అని మగవాళ్ళు రొమ్ము క్యాన్సర్ కి సహజంగానే నిరోధక వ్యవస్థను కలిగి ఉంటారు కాబట్టి మగవారిలో రొమ్ము సంబంధిత క్యాన్సర్ అనేది చాలా తక్కువ ఒకరకంగా చెప్పాలంటే అసలు ఉండనే ఉండదు.

ఈ రొమ్ము క్యాన్సర్ రాకుండా బంగారంతో చేసినటువంటి లాకెట్ల తాలూకు రాపిడి అనేదిఉపయోగపడుతుంది.

ఇంకా చెప్పాలంటే స్నానం చేసే సమయంలో దీనిపై నుంచి వచ్చేటటువంటి వేడి నీరు ప్రవహించడం వల్ల చర్మ వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి.క్యాన్సర్ కి ట్రీట్మెంట్గా బంగారం ఉపయోగపడుతుందని ఈమధ్యనే తెలిపిన పరిశోధన కూడా గమనించవచ్చు.

4) ఇక నాల్గవది తలలో పూవులు..

వీటి నుంచి వచ్చే సువాసనల వలన మనసు ప్రశాంతంగా ఉండడమే కాకుండా ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది.కలయసమయంలో కూడా ఇవి ఇద్దరి మధ్య ఆకర్షణకు తోడ్పడుతాయి.

5) ఇక అయిదవది..చివరిది.. నొసటన సింధూరం..

పూర్వపు రోజుల్లో దీనిని సొంతంగా కుంకుమ రాయి నూరుకొని దానికి రేడియం పౌడర్ కలిపి రెండు కనుబొమ్మల మధ్యలో అలంకరించుకునే వారు.

ఆయుర్వేదం ప్రకారం మనిషి శరీరంలో ఉండే ఏడు చక్రాలలో మొదటి చక్రమైన ఆజ్ఞాచక్రం పై ఒత్తిడి కలుగచేయడం ద్వారా మనస్సును అదుపుచేయడం, ప్రశాంతంగా ఉండడం జరిగేది.

ఇవే కాకుండా సైనస్ కు రాకుండా ముక్కపుల్లను, చెవిపోట్లు దరికి చేరకుండా చెవి పోగులనూ ధరించేవారు!అవే పద్ధతులు నేటికీ పాటించడం ద్వారా కొన్ని రకాల వ్యాధులకు సహజంగా నిరోధాన్ని డెవలప్ చేసుకుని సంపూర్ణ ఆరోగ్యంతో చక్కగా జీవనం కొనసాగించు కోవచ్చు........... జై సనాతన ధర్మం..🙏☝️

మన జీవితము 3 అతి విలువైన కరెన్సీలపైన ఆధారపడి ఉంది:*

🌟 *మన జీవితము 3 అతి విలువైన కరెన్సీలపైన ఆధారపడి ఉంది:*

🌹 *1. జ్ఞానము*
శారీరక ఆరోగ్యం, మానసిక స్థిరత, సుఖము, సంతోషము, ఆత్మశాంతి, ఆనందము, సామాజిక గౌరవము, సరైన విద్య, మరియు మన వృత్తి/ప్రవృత్తులను సక్రమంగా నిర్వహించగల నైపుణ్యములు.

🌹 *2. సమయము*
ప్రతి ఒక్కరికీ సమానముగా లభించే అత్యంత అమూల్యమైన వనరు ఇది. దీన్ని మళ్లించలేము, బదిలీ చేయలేము మరియు నిల్వ కూడా చేయలేము. దీనిని వర్తమానములో ఉపయోగించగలిగే వరమును మాత్రమే మనము కలిగివున్నాము.

🌹 *3. డబ్బు*

మన భౌతిక అవసరాలను తీర్చే ఒక సాధనము, కానీ మిగిలిన రెండు కరెన్సీలను దీనితోనే కొలవలేము.

🪔 *జీవనతత్వ సారము:*

మనకు పై మూడు కరెన్సీలలో ఏదైనా ఒకటి పొందాలంటే, మిగిలిన రెండింటిని జాగ్రత్తగా వినియోగించి, మనకు కావలసిన దాన్ని సాధించాలి.

💐 *ఉదాహరణకు:*
🌹 జ్ఞానమును పెంచుకోవాలంటే సమయాన్ని, డబ్బును పెట్టుబడిగా పెట్టాలి.

🌹 డబ్బు సంపాదించాలంటే సమయాన్ని మరియు జ్ఞానాన్ని పెట్టుబడిగా ఉపయోగించాలి.

🌹 మన సమయము విలువైనదిగా మారాలంటే, జ్ఞానమునూ మరియు డబ్బును పెట్టుబడిగా వినియోగించాలి.

🌱 *పైన తెలియపరచిన మూడు కరెన్సీల సమతుల్యతతో జీవించడమే సమగ్రమైన జీవితము యొక్క గమ్యము లేదా సనాతన ధర్మ జీవన విధానము*

    😊 *అంతా సరిగానే ఉంది*
    🪷🌼🌻🌸🌺🏵️💐🌹💐

తేనె ఉపయోగాలు - సంపూర్ణ వివరణ .

తేనె ఉపయోగాలు - సంపూర్ణ వివరణ . 

       తేనె మనిషికి ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన వరంగా చెప్పుకోవచ్చు. తేనెలో తియ్యదనంతో పాటు అనేక పోషక గుణములు , ఔషధగుణములు ఉన్నాయి . తియ్యదనానికి అర్థం చెప్పే పదార్థం కాబట్టి దీనిని మధు అంటారు. 

        ఆయుర్వేదంలో ఆరోగ్య పరిరక్షణకు వ్యాధి నివారణకు కూడా తేనె ప్రాచుర్యం పొందినది. ఆహారమున ఔషధముగా , ఔషధాలకి అనుపానంగా , సౌందర్య సాధనంగా తేనె కీలకపాత్రను పోషిస్తుంది . చలువ చేస్తుంది . ఆకలిని పుట్టిస్తుంది. బలమును కలిగించును. హృదయమునకు మంచిది . నేత్రములకు మంచిది . చర్మానికి కాంతిని కలిగించును . శరీరంలో కొవ్వుని పెరగనివ్వదు. పుండ్లను మాన్పును . ఇలా ఎన్నో గొప్ప ఔషధ గుణాలు తేనెలో కలవు. 

                  స్వచ్చమైన తేనెలో శరీరముకు కావలసిన పోషకపదార్ధాలు ఎన్నో ఉన్నాయి. అదేవిధముగా ఆహారపదార్ధాల కంటే తేనెలో కెలోరిక్ విలువలు ఎక్కువుగా ఉన్నాయి. ఉదాహరణకు ఒక కిలో ( 900ml ) పాలలో 620 క్యాలరీలు , ఆపిల్ పండులో 420 క్యాలరీలు , నారింజలో 230 క్యాలరీలు ఉండగా ఒక కిలో తేనెలో 3 ,150 నుండి 3 , 360 క్యాలరీక్ విలువ ఉండును. తేనె అనేక వ్యాధులలో పనిచేస్తుంది అని ఎన్నో పురాతన ఆయుర్వేద గ్రంథాలలో ఉన్నది. నోటిలో పుండ్లకు , దద్దులకు తేనె అత్యుత్తమంగా పనిచేయును . నోటిపూతకు తేనె రాస్తే నోటిపూత తగ్గును . 

                సాధారణముగా వచ్చే దగ్గులలో తేనె , అల్లంరసం కలిపి ఇస్తే దగ్గులు తగ్గును. వాంతులు తగ్గును. ప్రతిరోజు పొద్దున్నే చల్లటినీటిలో తేనె , నిమ్మరసం కలిపి తాగితే శరీరపు లావు తగ్గును. ఊపిరితిత్తుల వ్యాధులతో ఇబ్బంది పడుతున్నవారు. ప్రతినిత్యం తేనె , నిమ్మరసంతో తీసుకుంటుంటే వ్యాధి తీవ్రత తగ్గుటయే కాక వ్యాధి కూడా తగ్గును . 

                   పుండ్లు , చర్మవ్యాధులు , మొటిమలు , తలనొప్పి , దగ్గు , జ్వరము , రక్తహీనత , న్యుమోనియా , గుండెజబ్బు మొదలగు వ్యాధులకు తేనె దివ్యౌషధముగా పనిచేయును . తులసిరసముతో , తేనె కలిపి తీసుకుంటే శ్వాసకోశ , న్యుమోనియా మొదలగు వ్యాధులు నివారించబడును. తేనె , తులసిరసము , పసుపు కలిపి ఇస్తే ప్లేగు వంటి సాంక్రమిక వ్యాధులు కూడా నివారణ అగును. మధుమేహ వ్యాధి ఉన్నవారు రోజు కొద్దిగా తేనె తాగుట వలన మంచిఫలితాలు కనిపించును. ముఖ్యముగా ఒక్కవిషయం గుర్తించుకోవాలి మార్కెట్లో దొరికే తేనెలో పంచదరపాకం కలిపి ఉంటుంది. అది మధుమేహరోగులు తీసుకోరాదు . దానివల్ల వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం కలదు. కావున స్వచ్చమైన తేనెని ఎంచుకొనవలెను . 

              Low - Bp సమస్యతో బాధపడువారు , నిద్ర సరిగా పట్టనివారు రోజూ తేనెని తీసుకోవడం చాలా మంచిది . ప్రతినిత్యం తేనెని తీసుకోవడం వలన చక్కటినిద్ర రావడమే కాకుండా సుఖవిరేచనం అగును. తేనె వ్రణారోపణం కలిగి ఉంది. వ్రణారోపణం అంటే పుండ్లును త్వరగా మాన్పుగుణం అని అర్థం . కాలిన గాయాలను , పుండ్లను , కురుపులను తేనె వెంటనే మాన్పును . లొపల చెడు ఉన్నటువంటి పుండ్లు కూడా త్వరగా మానును . 

                    సౌందర్య సాధనములలో కూడా తేనె ఎంతో ప్రయోజనకారిగా పేరు పొందినది. తేనెలో ఎన్నో విటమిన్లు , పోషకాలు ఉన్నవి. బంగారుఛాయలో సన్నగా ఉండాలనుకునే స్త్రీలు తప్పకుండా నిత్యం తేనెని తీసుకోవడం చాలా మంచిది . చర్మసౌందర్యానికి , శరీర ఆరోగ్యానికి అవసరం అయిన Riboflavin తేనెలో అధికంగా ఉన్నది. పెదవులను కూడా పగుళ్లు లేకుండా చేస్తుంది . అదేవిధముగా మొటిమల సమస్యతో ఇబ్బంది పడువారు ప్రతిరోజు క్రమంతప్పకుండా ఒక గ్లాసు నీళ్లలో ఒకస్పూను నిమ్మరసం , ఒక స్పూన్ తేనె కలిపి తాగాలి. ఈ విధముగా కొంతకాలంపాటు చేయుచున్న మంచి ఫలితం కనిపించును. అలానే తేనెలో పసుపు కలిపి ఉండలుగా చేసుకుని తినుచున్న మొటిమలు తగ్గును. 

              ఆయుర్వేదంలో తేనె బలాన్ని కలిగిస్తూ లేఖన గుణము కలిగి ఉంటుంది అని వివరించబడినది. లేఖన గుణము అనగా శరీరానికి శక్తిని ఇస్తూ శరీరమును సన్నబడునట్లు చేయునది అని అర్థం . ఈవిధముగా శక్తిని కోల్పోకుండా శరీరపు లావును తగ్గించటంలో తేనె అత్యుత్తమముగా పనిచేయును . ముఖసౌందర్యము కొరకు పాలను తేనెలో కలిపి ముఖంపై రాసుకుని కొద్దిసేపు అయ్యాక కడిగివేసిన ముఖము సౌందర్యముగా కనిపించును. తేనె కలిపిన పాలు ముఖమునకు రాసుకుని కొంచం ఆగి మెత్తటి పెసరపిండితో ముఖమును కడుగుచున్న ముఖం కాంతివంతమగును. 

             ఈవిధముగా ఆహారం , ఔషధముగా , ఔషధాలకు అనుపానంగా , సౌందర్య సాధనంగా తేనె ప్రాముఖ్యత వహించడం వలనే మన ప్రాచీనులు తేనె , ఆవుపాలు , ఆవువెన్న , ఆవునెయ్యి , ఆవుపెరుగులతో పాటు చేర్చి పంచామృతాలుగా చెప్పారు . 

             సంపూర్ణం     

  
        

Saturday, June 28, 2025

చెట్లు నాటడానికి, పచ్చదనాన్ని పెంచడానికి అద్భుతమైన సమయం!*

*భారతీయులారా! వర్షాకాలం సమీపిస్తోంది, ఇది చెట్లు నాటడానికి, పచ్చదనాన్ని పెంచడానికి అద్భుతమైన సమయం!*

*మన ఊరు, వీధి, ఇల్లు, తోటలో ఆరోగ్యానికి మేలు చేసే, సంస్కృతిలో ప్రాముఖ్యత కలిగిన చెట్లు, తీగలు నాటితే మన జీవన విధానం సమతుల్యంగా ఉంటుంది.*

*ఈ చెట్లు, మొక్కలు మనకు ఔషధ గుణాలు, నీడ, పండ్లు, పుష్పాలు, ఆక్సిజన్‌ను అందిస్తాయి.*

*అంతేకాదు, వీటిలో చాలా మొక్కలు మన సంప్రదాయంలో పవిత్రమైనవి. కాబట్టి, ఈ వర్షాకాలంలో మనం అందరం కలిసి ఈ చెట్లను నాటి, మన ఇంటిని, ఊరిని ఆకుపచ్చగా మార్చుదాం!*


*I. మన ఊరిలో ఉండాల్సిన చెట్లు*

*1. రావి చెట్టు (Peepal Tree)*  
- ప్రాముఖ్యత: పవిత్రమైన చెట్టు, రాత్రిపగలు ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది  
- ఆరోగ్య ప్రయోజనాలు: గాలిని శుద్ధి చేస్తుంది, ఉబ్బసం, చర్మవ్యాధుల చికిత్సలో ఉపయోగపడుతుంది  
- ఎక్కడ నాటాలి: గుడి సమీపం, ఊరి చివర, బహిరంగ ప్రదేశాలు


*2. మర్రిచెట్టు (Banyan Tree)*  
- ప్రాముఖ్యత: జాతీయ వృక్షం, సంప్రదాయంలో ప్రాధాన్యం  
- ఆరోగ్య ప్రయోజనాలు: గాలి కాలుష్యాన్ని తగ్గిస్తుంది, మధుమేహం, జీర్ణ సమస్యలకు ఔషధంగా ఉపయోగపడుతుంది  
- ఎక్కడ నాటాలి: ఊరి మధ్యలో, సముదాయ కేంద్రాల వద్ద


*3. అశోక చెట్టు (Ashoka Tree)*  
- ప్రాముఖ్యత: హిందూ-బౌద్ధ సంప్రదాయాల్లో పవిత్రం, పుష్పాల అందం  
- ఆరోగ్య ప్రయోజనాలు: గర్భాశయ సమస్యలు, చర్మ వ్యాధులకు ఔషధంగా ఉపయోగపడుతుంది  
- ఎక్కడ నాటాలి: ఊరి ప్రవేశ ద్వారం వద్ద, బహిరంగ ప్రదేశాల్లో


*II. మన వీధిలో ఉండాల్సిన చెట్లు*

*4. వేప చెట్టు (Neem Tree)*  
- ప్రాముఖ్యత: "సర్వరోగ నివారిణి", ఆయుర్వేదంలో విశిష్ట స్థానం  
- ఆరోగ్య ప్రయోజనాలు: చర్మవ్యాధులు, దంత ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తికి మేలు చేస్తుంది  
- ఎక్కడ నాటాలి: వీధుల ఇరువైపులా, ఇంటి గేట్ దగ్గర


*5. బాదం చెట్టు (దేశీ బాదం)*  
- ప్రాముఖ్యత: ఆకర్షణీయమైన ఆకులు, గింజలతో శోభ  
- ఆరోగ్య ప్రయోజనాలు: గుండె ఆరోగ్యానికి, జీర్ణక్రియకు మేలు చేస్తుంది  
- ఎక్కడ నాటాలి: రోడ్ల పక్కన, పార్కుల్లో


*6. మామిడి చెట్టు (Mango Tree)*  
- ప్రాముఖ్యత: పండ్ల రాజు, సంస్కృతిలో ప్రాధాన్యం  
- ఆరోగ్య ప్రయోజనాలు: విటమిన్ A, C, ఫైబర్‌తో శక్తివంతమైన పండు, దంత ఆరోగ్యానికి మేలు  
- ఎక్కడ నాటాలి: వీధుల ఇరువైపులా, బహిరంగ స్థలాల్లో


*III. మన ఇంట్లో ఉండాల్సిన చెట్లు*

*7. మునగ చెట్టు (Drumstick Tree)*  
- ప్రాముఖ్యత: సూపర్ ఫుడ్‌గా పరిగణించబడే ఆకులు, కాయలు  
- ఆరోగ్య ప్రయోజనాలు: విటమిన్ సి, ఐరన్, క్యాల్షియం అధికంగా ఉండి ఆరోగ్యానికి మేలు చేస్తాయి  
- ఎక్కడ నాటాలి: ఇంటి వెనుక భాగంలో


*8. కరివేపాకు చెట్టు (Curry Leaf Tree)*  
- ప్రాముఖ్యత: వంటల్లో అవసరమైనది  
- ఆరోగ్య ప్రయోజనాలు: జీర్ణక్రియ మెరుగుదల, జుట్టు ఆరోగ్యం  
- ఎక్కడ నాటాలి: ఇంటి ఆవరణలో, కుండీలో


*9. ఉసిరి చెట్టు (Amla Tree)*  
- ప్రాముఖ్యత: అమృత ఫలం, ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానం  
- ఆరోగ్య ప్రయోజనాలు: విటమిన్ సి అధికంగా ఉండి రోగనిరోధక శక్తిని పెంచుతుంది  
- ఎక్కడ నాటాలి: ఇంటి తోటలో లేదా ఖాళీ స్థలంలో


*10. జామ చెట్టు (Guava Tree)*  
- ప్రాముఖ్యత: ఆరోగ్యపరంగా అత్యుత్తమమైన పండు  
- ఆరోగ్య ప్రయోజనాలు: జీర్ణక్రియ మెరుగుపరచడం, రక్తపోటు నియంత్రణ  
- ఎక్కడ నాటాలి: ఇంటి పెరట్లో


*11. నిమ్మ చెట్టు (Lemon Tree)*  
- ప్రాముఖ్యత: విటమిన్ సి మూలం, వంటలలో కీలకం  
- ఆరోగ్య ప్రయోజనాలు: జీర్ణశక్తి, చర్మ ఆరోగ్యం, రోగనిరోధక శక్తి పెంపు  
- ఎక్కడ నాటాలి: ఇంటి ఆవరణలో, కుండీలో


*12. దానిమ్మ చెట్టు (Pomegranate Tree)*  
- ప్రాముఖ్యత: ఆరోగ్యానికి శ్రేష్ఠమైన పండు, సంప్రదాయంగా పవిత్రం  
- ఆరోగ్య ప్రయోజనాలు: రక్త ప్రసరణ, హృదయ ఆరోగ్యం, రక్తహీనత నివారణ  
- ఎక్కడ నాటాలి: ఇంటి తోటలో


*IV. మన తోటలో ఉండాల్సిన మొక్కలు*

*13. తులసి (Holy Basil)*  
- ప్రాముఖ్యత: హిందూ సంప్రదాయంలో పవిత్రమైన మొక్క  
- ఆరోగ్య ప్రయోజనాలు: జలుబు, దగ్గు, రోగనిరోధక శక్తి పెంపు  
- ఎక్కడ నాటాలి: ఇంటి గుమ్మం వద్ద, కుండీలో


*14. అలోవెరా (Aloe Vera)*  
- ప్రాముఖ్యత: చర్మ, జుట్టు ఆరోగ్యానికి ఉత్తమ ఔషధ మొక్క  
- ఆరోగ్య ప్రయోజనాలు: గాయాలకు చికిత్స, జీర్ణక్రియ మెరుగుదల  
- ఎక్కడ నాటాలి: తోటలో లేదా కుండీలో


*15. పుదీన (Mint)*  
- ప్రాముఖ్యత: వంటలో, టీలు, చట్నీలలో ఉపయోగించదగిన మొక్క  
- ఆరోగ్య ప్రయోజనాలు: జీర్ణ సమస్యలు, నోటి దుర్వాసన నివారణ  
- ఎక్కడ నాటాలి: తోటలో లేదా కుండీలో


*16. కొత్తిమీర (Coriander)*  
- ప్రాముఖ్యత: ప్రతి వంటలో ముఖ్యమైన పాత్ర  
- ఆరోగ్య ప్రయోజనాలు: జీర్ణక్రియ, కొలెస్ట్రాల్ నియంత్రణ  
- ఎక్కడ నాటాలి: కుండీలో, తోటలో


*17. ఇన్సులిన్ మొక్క (Costus Igneus)*  
- ప్రాముఖ్యత: మధుమేహ నియంత్రణకు ప్రసిద్ధ ఔషధ మొక్క  
- ఆరోగ్య ప్రయోజనాలు: రక్తంలో చక్కెర స్థాయి తగ్గింపు, శరీర శక్తి పెంపు  
- ఎక్కడ నాటాలి: తోటలో లేదా కుండీలో


*V. మన ఇంటి గోడలపై పాకవలసిన తీగలు*

*18. తిప్పతిగా (Passion Flower)*  
- ప్రాముఖ్యత: అందమైన పుష్పాలు, శాంతి సూచిక  
- ఆరోగ్య ప్రయోజనాలు: ఒత్తిడి, నిద్రలేమికి నివారణ  
- ఎక్కడ నాటాలి: గోడల దగ్గర, కంచెలపై


*19. తమలపాకు (Betel Leaf)*  
- ప్రాముఖ్యత: పూజలలో, సంప్రదాయాలలో ప్రధానంగా ఉపయోగపడే తీగ  
- ఆరోగ్య ప్రయోజనాలు: జీర్ణ సమస్యలు, నోటి ఆరోగ్యం, ఇన్ఫెక్షన్ల నివారణ  
- ఎక్కడ నాటాలి: చెట్ల వద్ద లేదా గోడలపై


*20. బంగారు తీగ (Money Plant)*  
- ప్రాముఖ్యత: వాస్తు ప్రకారం శుభ సూచిక  
- ఆరోగ్య ప్రయోజనాలు: గాలి శుద్ధి, ఇంటి వాతావరణాన్ని మెరుగుపరచడం  
- ఎక్కడ నాటాలి: ఇంటి లోపల లేదా గోడలపై


*వర్షాకాలంలో చెట్లు నాటడం ఎందుకు ముఖ్యం?*

- వాతావరణానికి ఉపయోగకరం  
- ఆరోగ్యానికి ఔషధ ప్రయోజనాలు  
- సంప్రదాయ పరిరక్షణ  
- పర్యావరణ సమతుల్యత


*చెట్లు నాటడం ఎలా?*

- స్థలం ఎంపిక  
- మట్టి సిద్ధం  
- మొక్క నాటకం  
- సంరక్షణ


*మనం చెట్లు నాటాలి ఎందుకంటే:*  
- భవిష్యత్తు తరాలకు ఆక్సిజన్, నీడ  
- కాలుష్య నివారణ  
- ఆరోగ్య రక్షణ  
- సంస్కృతిని నిలుపుకోవడం


*మన ఊరు, మన వీధి, మన ఇల్లు పచ్చగా మారాలంటే ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. ఈ వర్షాకాలాన్ని వృథా చేయకుండా మొక్కలు నాటుదాం, మన జీవితం పచ్చబడేలా చేసుదాం.*

Friday, June 27, 2025

ఆకలి లేనివారికోసం సులభ యోగాలు -

ఆకలి లేనివారికోసం సులభ యోగాలు - 

 * మిరియాలను నూరి తీసిన రసం గాని మిరియాల కషాయం కాని తీసుకొనుచున్న అగ్నిమాంద్యం , ఆకలి లేకపోవటం వంటి సమస్య తొలగి జీర్ణశక్తి వృద్ది అగును.

 * వేడిగా ఉన్న అన్నం వార్చిన గంజిలో కొంచం పొంగించిన ఇంగువ , సౌవర్చ లవణం కలిపి తాగుచున్న అగ్నిమాంద్యం తొలగును .
 
* యవాక్షారం , శొంఠి సమాన భాగాలుగా తీసుకుని చూర్ణం చేసి పూటకు 5 గ్రాముల చొప్పున ఉదయం , సాయంత్రం తీసుకొనుచున్న మంచి ఆకలి కలుగును.
 
* బెల్లం , జీలకర్ర సమాన భాగాలుగా కలిపి తినుచున్న ఆకలి పెరుగును .
 
* పిప్పళ్లు చూర్ణం చేసి బెల్లముతో కలిపి తీసుకొనుచున్న ఆకలి పెరుగును .
 
* కరక్కాయ , పిప్పళ్లు , సౌవర్చ లవణం సమపాళ్లలో తీసుకుని నూరి చూర్ణం చేసి పెరుగు పైన ఉండే నీటితో కలిపి సేవించుచున్న అగ్నిమాంద్యం తొలగి ఆకలి పెరిగి జీర్ణశక్తి వృద్దిచెందును.
         
. పైన చెప్పిన యోగాలలో మీకు ఏది సులభముగా చేయగలరో చూసుకుని పాటించి అగ్నిమాంద్యం సమస్య నుంచి విముక్తి పొందగలరు. అగ్నిమాంద్యం అనగా ఆకలి లేకపోవడమే.
 
అగ్నిమాంద్య సమస్య ఉన్నవారు పాటించవలసిన ఆహారనియమాలు -
 
•. తినవలసినవి -
 
తేలికైన పాతబియ్యపు అన్నం , పెసలు , పేలాలు , పెసర కట్టు, చిన్న చేపలు , లేత ముల్లంగి , వెల్లుల్లి , లేత అరటికాయలు , లేత మునగకాయలు , పొట్లకాయ , బీరకాయ , వంకాయ , నక్క దోసకాయ , కాకరకాయ , అల్లం , చుక్కకూర, చెంచలికూర , ఉశిరికాయ , దానిమ్మపండు , నారింజపండు , పలచని మజ్జిగ , తాంబూలం , వేడినీళ్లు సేవించవలెను , తేనె , కారం , నూనె , చేదు , వగరు పదార్థాలు , వ్యాయమం .
 
•. తినకూడనవి -
        
. కొత్తబియ్యం , చేపలు , బచ్చలికూర , ఎక్కువుగా నీరు తాగరాదు , కంద , ఆలుగడ్డ మొదలగు దుంప కూరలు , నేరేడు పండ్లు , గోధుమలు , పిండివంటలు , మాంసపదార్దాలు , పాలు , పాలతో వండిన పదార్దాలు , చారపప్పు , ఎక్కువుగా నూనె ఉండు పదార్థాలు , పూర్తిగా ఉడకని పదార్ధాలు మరియు అన్నం , మద్యపానం, ముందు తినిన పదార్దాలు పూర్తిగా అరగకముందే మరలా భుజించటం , అమిత భోజనం , నిద్రపోకుండా మేలుకుని ఉండటం, మలమూత్ర నిరోధం .
        
. పైన చెప్పిన ఆహార నియమాలు పాటిస్తూ ఔషధ యోగాలు వాడుచున్న సమస్య త్వరగా పరిష్కారం అగును.
      

పక్షవాతమును హరించు సిద్ధయోగాలు -

పక్షవాతమును హరించు సిద్ధయోగాలు  -

 *  అక్కలకర్ర , సన్నరాష్ట్రం , శొంఠి మూడింటిని కలిపి పలుచటి కషాయం చేసుకుని ప్రతిరోజు సేవించుచున్న పక్షవాతం హరించును .

 *  కసివింద చెట్టు రసము వెన్నతో కలిపి మర్దన చేయుచున్న పక్షవాతం హరించును .
 
*  కుసుమ విత్తనాలతో చేసిన తైలం మర్దన చేయుచున్న పక్షవాతం హరించును .

 *  పక్షవాత రోగులు ప్రతినిత్యం ఖర్జురాలు తినుచున్న చాలా మేలు చేయును .
 
*  పక్షవాతం వచ్చి కాలు , చెయ్యి పడిపోతున్న సమయంలో వెంటనే గిద్దెడు తేనె తాగించిన పక్షవాత ప్రభావం పోయి మనిషి సాధారణ స్థితికి చేరును .
 
*  కటుకరోహిణి నల్లనిది చూర్ణం చేసి 5 గ్రా చొప్పున తీసుకొనుచున్న పక్షవాతం నివృత్తి అగును.
 
*  అంజీరపండు ఎండినది , పెద్ద జీలకర్రతో కలిపి తినుచున్న మేలు జరుగును.

 * పొంగించిన ఇంగువ అనగా గుంట గంటె లో ఇంగువ వేసి గంటెని వేడిచేసిన ఇంగువ పొంగును . శుద్ది అగును. ఇలా శుద్ధిచేసిన ఇంగువ 5 గ్రాముల చొప్పున తేనెతో కలిపి తీసుకొనుచున్న పక్షవాతం హరించును .

 పక్షవాతపు రోగులు పాటించవలసిన ఆహార నియమాలు  -

• తినవలసినవి  -
      
పాత బియ్యపు అన్నం , గోధుమరొట్టె , గోధుమ జావ , మేక మాంసము , పొట్టేలు మాంసం , కంది పప్పు , కంది కట్టు , బీరకాయ , పొట్లకాయ , లేత వంకాయ ముదురు వంకాయ తినరాదు. లేత మునగకాయ , వెల్లుల్లి , ఉల్లిపాయ , కొయ్య తొటకూర , గలిజేరు కూర , మునగ ఆకు కూర , చిర్రి కూర , కసివిందాకు కూర , ద్రాక్షపండు తియ్యనిది , ఖర్జూరం , ఆవు మజ్జిగ , ఆవునెయ్యి , పటికబెల్లం , పాతబెల్లం , తేనె , ఒంటికి మర్దన చేయించుకోవలెను.

• తినకూడనవి  -
        
కొత్తబియ్యపు అన్నం , చద్దిఅన్నం , జొన్నన్నం , మొక్కజొన్న , అలసంద , పెసలు , మినుములు , శనగలు , బచ్చలికూర , చుక్కకూర , పెరుగు , మీగడ , సామలు , పిండివంటలు , అతిగా నూనె , కల్లు , కలి , కోడిమాంసం , కాకరకాయ , మామిడిపండ్లు , మామిడికాయలు , చేపలు , పులికడుగు , ఫ్రిజ్ నీరు , కూల్ డ్రింక్స్ , నూనెవేపుళ్ళు , పాతపచ్చళ్లు , అతిగా కారం , చేదుగల పదార్థాలు , సంభోగం , చన్నీటి స్నానం చేయరాదు , చింతపండు పులుపు , మొదట తినిన ఆహారం జీర్ణం కాకమునుపే మరలా భుజించటం , మలమూత్ర నిరోధం , ఉపవాసం , అతిగా కష్టపడకూడదు , చల్లటిగాలికి ఉండరాదు , మంచు , తడిప్రదేశాలలో ఉండరాదు.
         
. పైన చెప్పినటువంటి పథ్యములు పాటిస్తూ ఔషధసేవన చేయడం వలన రోగి సమస్య నుంచి తొందరగా బయటకి వస్తాడు. పథ్యం చేయకుండా మీరు ఎంత గొప్ప ఔషధాలు సేవించినను సమస్య తగ్గదు. ఆయుర్వేదం నందు పథ్యం అనేది ఔషధాలు కొరకు కాదు. రోగానికి పథ్యం ఉంటుంది. రోగం తగ్గుటకు ఔషధాలు సేవిస్తూ మరొకవైపు రోగాన్ని పెంచే ఆహారం తీసుకోవడం వలన ఔషధం పనిచేయకపోగా రోగం మరింత పెరుగును .  

Wednesday, June 25, 2025

ఆయుర్వేదం - రస ఔషదాలు .

ఆయుర్వేదం - రస ఔషదాలు .
 
ఇంతకు ముందు నేను ఆయుర్వేదం లొ శల్య తంత్రం గురించి తెలియచేసాను. ఇప్పుడు ఆయుర్వేదం లొ రస ఔషధాల గురించి తెలియజేస్తున్నాను. 
 మూలికలతో చేసినటువంటి ఔషధాలు వెంటనే ఉపయోగించవలెను. వాటికి ఒక నిర్దిష్ట కాలపరిమితి ఉంటుంది. కానీ కొన్ని రకాల లోహములు ను శుద్ధి చేసి ఉపయోగించవచ్చు. అవి ఎప్పుడు ఉపయోగించినా సమర్దవంతం గా పనిచేస్తాయి. మానవుని శరీరం అష్టదాతువులతో నిర్మితమై ఉంటుంది. ఈ దాతువులు లలొ హెచ్చు తగ్గుల వలన మానవునికి రోగాలు ప్రాప్తిస్తున్నాయి. మరలా వాటిని పూరించడం వలన రోగాలు తగ్గు ముఖం పడతాయి. నేటి అల్లోపతి వైద్య విదానం అదే వాటిని ప్రాకృతికం గా తయారు చేయరు . 
ఉదాహరణకు పాండు రొగమునకు ఒక అత్యద్బుతమైన ఔషధం ఉన్నది. పాండు రోగం అనగా శరీరం నందలి రక్తము లేకుండా పాలిపోయినట్టు ఉండుట .ఈ వ్యాధి గ్రస్తులు తెల్లగా మొఖము నందు జీవకళ లేకుండా ఉంటారు. ఏ గ్రామ భూమియందు 100 ఏళ్ళ నుండి ఉన్నట్టి చిట్టేపు రాళ్లను తీసుకుని వచ్చి వాటిని ఎర్రటి నిప్పుల్లో బాగుగా కాల్చి ఆవుపంచకం లొ ముంచి చల్లార్చాలి . ఈ రకం గా 12 సార్లు చేయాలి . ఇలా చేసిన తరువాత చూర్ణం చేయగా అది సిందూరం రంగులొ వస్తుంది. దానిని ఉదయం సాయంత్రం పుచ్చుకోనిన కేవలం 41 రొజులలొ మనిషి ఎర్రగా తయారవుతాడు. పూర్తి ఆరోగ్యవంతుడు అవుతాడు. ఇలా చాలా ఉన్నాయి .
       భావ ప్రకాశిక మొదలయిన ఆయుర్వేద గ్రంథాలలో ఈ రసాయనిక తంత్రాల గురించి ఉన్నది. 3,4 శతాబ్దాల నుంచి వాగ్బట్టాచార్యుని కాలం వరకు ఈ రసయనిక ఔషధాలు చికిత్సకు ఉపయోగించి నట్టు అంతగా లేదు . క్రీ.శ 4 వ శతాబ్దం లొ సంకలనం చేయబడ్డట్టు చెబుతున్న Bowers manicript అంతకు పూర్వం రచించబడిన D .r hernal గారిచే సంపాదించ బడిన వ్రాతపతి గా ఉన్న వైద్య గ్రందం నందు కుడా స్వర్ణ , లొహ ధాతువుల ప్రస్తావన ఉన్నది. కానీ విశేషం గా ఎక్కడా ఉపయోగించినట్టు లేదు .వైదిక కాలం న సోమరస ఉపయోగం అదిక ప్రచారం లొ ఉన్నందున రసవిజ్ఞానం ఋగ్వేద కాలం నుండి ఆదరణ, ప్రచారం లొ ఉనట్టు భావించుచున్నారు. దానిని అనుసరించే చరకాదులు తమ గ్రంధములయందు రసౌషదాలకు స్థానం ఇచ్చారు. భారతీయుల రసప్రక్రియలకు మూలం ప్రాచీనం అని తెలియచున్నది. 
      ఋగ్వేదం న స్వర్ణం, ఇనుము, సీసము, ఇత్తడి, శ్యామ లొహం. ఇలాంటి లోహాల ప్రసక్తి కలదు. రసశాస్త్ర ప్రక్రియ కొన్ని తాంత్రి కముల యందు ప్రాధమిక స్థాయిలో వర్ణించ బడెను. రసాయనిక తాంత్రికం లొ సిద్ధ నాగార్జునుడు ప్రసిద్ధుడు .
 రస తంత్రములో ఉపయోగించబడు ద్రవ్యములను పలువురు తంత్ర కర్తలు పలు విధాలుగా వర్గీకరించారు. అందులొ రత్న సముచ్చయకారుని వర్గీకరణ సామరస్యం గా ఉన్నది. అతడు మహారసములు, ఉపరసములు, సాధారణ రసములు, దాతువులు, ఉపదాతువులు ఇలా వర్గీకరణం చేసారు. 
 మహా రసములు - అబ్రకం, వైక్రాంతం, స్వర్ణ మాక్షిక, తామ్ర మాక్షిక , సస్యకము తుత్తుము , చపలము, రసకము , అని ఎనిమిది మహారసములు గా పేర్కొనబడినవి.
 ఉప రసములు - గంధకం, గైరికము, కాశీసము, స్పటికము, తాలకము , మనశ్హిల , అంజనము, కంకు ఉస్టం అనే ఎనిమిది ఉపరసములగా పేర్కొనబడినవి .
 సాదారణ రసములు - కంపిల్లము, గౌరీ పాషాణము, నవసాగారము, కపర్ధం, అగ్ని జారం, గైరికం, హింగులం, మ్రుద్దారు శృంగి, ఈ ఎనిమిది సాదారణ రసములగా పేర్కొనబడినవి .
  పూర్వాచార్యులు పాదరసం నోక్కదానినే మహారసం గా గ్రహించి తక్కిన వాటిని ఉపరసములుగా పరిగణించారు. రస ఔషద శాస్త్ర ప్రకారం రెండు రకాలు అగు ద్రవ్యాలు కలవు.మొదటి రకం పాదరసం, గంధకం, శంఖ పాషానాది రసొపరసములు. సాదారణ రసములు.రెండొవది సువర్ణం, రజతం, తామ్రము, వంగము, సీసము లోహాది దాతువులు.సుశ్రుతమున వంగం, సీసం , తామ్రము ,రజతము, స్వర్ణం , అయస్కాంతం , మండురం, వైడుర్యం , స్పటికం, ముత్యం , శంఖం ఇవి ఔషద ద్రవ్యాలుగా పేర్కొన్నారు . చరక సంహిత ఎందు రక్తపిత్త వ్యాధి చికిత్సకు , నేత్ర రోగ చికిత్సకు వైడుర్యం, ముత్యములు , మణులు, ప్రవాళం, శంఖం, లోహము, తామ్రము , సౌవీరంజనము ఔషధాలుగా చెప్పినాడు. కుష్టు రొగమునకు పాదరస గంధకములు ఔషదములు గా పేర్కొనెను .ఈ వ్యాధులకు అయస్కాంతం ఉపయోగించడం కూడా సుశ్రుత సంహితలో ఉన్నది.
          సువర్నాధి దాతువులను పలచని రేకులగా చేసి సైంధవ లవనములను ఆ రేకులకు పూసి వానిని కాల్చి నిర్దేశించిన కషాయములలో ముంచి అందునుంచి మెత్తని చుర్ణమును గ్రహించు విదానం వివరించబడెను. ఇట్టి సుక్ష్మ చూర్ణం తయారికి 16 పర్యాయాలు ఆ రేకులను అగ్నిలో కాల్చి ముంచవలసి ఉన్నది. ఈ లొహ రేకులను చండ్రనిప్పుల బొగ్గుల మద్య నుంచి కాల్చి చల్లబడిన తరువాత మెత్తని చుర్ణమును తేనెతో సేవించవలసి ఉన్నది.అని తెలియచేయడం అయినది. అష్టాంగ హృదయం నందు నేత్ర రోగములనుకు పాదరసం తో చేసిన అంజనం ఉపయోగించెడి విదానం తెలియజేసెను.
          

Tuesday, June 24, 2025

సత్సంగం

*సత్సంగం.....* 

*🧘‍♂️ మౌనంగా ఉండాల్సిన 10 సందర్భాలు:*

*1️⃣ నీ కోపాన్ని సరైన మాటల్లోకి మార్చలేకపోతే – మౌనంగా ఉండు.*

*2️⃣ బాగా కోపం వచ్చిన వేళ కూడా – మౌనంగా ఉండు.*

*3️⃣ నీ మాటలు ఎవరినైనా బాధించే పరిస్థితి ఉంటే – మౌనంగా ఉండు.*

*4️⃣ నీ మాటలు స్నేహాన్ని చెడగొట్టే పరిస్థితిలో – మౌనంగా ఉండు.*

*5️⃣ నీ మౌనం ఒక బంధాన్ని కాపాడగలిగితే – మౌనంగా ఉండు.*

*6️⃣ నీకు పూర్తిగా సంగతులు తెలియనప్పుడు – మౌనంగా ఉండు.*

*7️⃣ మాట్లాడటం కేవలం నీ స్వార్థం కోసం, గర్వాన్ని చూపించటానికి అయితే – మౌనంగా ఉండు.*

*8️⃣ నీ మాటలు ఎవరైనా నమ్మకాన్ని దెబ్బతీస్తే – మౌనంగా ఉండు.*

*9️⃣ ఆ విషయం మీద సరైన అవగాహన లేనప్పుడు – మౌనంగా ఉండు.*

*🔟 ఎవరైనా వారి వ్యక్తిగత సమస్యలు లేదా బాధలు చెప్పుతున్నప్పుడు – మౌనంగా ఉండు.*

*📌 ఎప్పుడు మాట్లాడాలి అన్నదాని కన్నా , ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలుసుకోవడం* *నిజమైన జ్ఞానం.*

*┈┉┅━••❀꧁మౌనం꧂❀••━┅┉┈*
         *SPIRITUAL SEEKERS*
🍁🪷🍁 🙏🙇‍♂️🙏 🍁🪷🍁

Sunday, June 22, 2025

సంస్కృతంలో ప్రాచీన భారతీయ ఆరోగ్య చిట్కాలు ఆంగ్లంలోకి అనువదించబడ్డాయి*

*సంస్కృతంలో ప్రాచీన భారతీయ ఆరోగ్య చిట్కాలు ఆంగ్లంలోకి అనువదించబడ్డాయి*

*తప్పక చదవాలి*

*1. అజీర్ణే భోజనం విషం.*

గతంలో తీసుకున్న భోజనం జీర్ణం కాకపోతే.. రాత్రి భోజనం తీసుకోవడం విషం తీసుకున్నట్లు అవుతుంది. ఆకలి అనేది మునుపటి ఆహారం జీర్ణమైందని సూచించే ఒక సంకేతం

*2. అర్ధరోగహరీ నిద్రా.*

సరైన నిద్ర సగం వ్యాధులను నయం చేస్తుంది..

*3 ముద్గదాలి గదవ్యాలి.*

అన్ని పప్పుధాన్యాలలో, పచ్చ పెసర్లు ఉత్తమమైనవి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇతర పప్పుధాన్యాలు అన్నీ ఒకటి లేదా మరొక దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి. 

*4. భగ్నాస్థి-సంధానకరో లశునః.*
 వెల్లుల్లి విరిగిన ఎముకలను కూడా కలుపుతుంది.. 

 *5. అతి సర్వత్ర వర్జయేత్.*
 రుచిగా ఉన్నంత మాత్రాన ఏదైనా అతిగా తీసుకుంటే అది ఆరోగ్యానికి మంచిది కాదు. మితంగా ఉండండి. 

 *6. నాస్తి మూలమనౌషధం.*
 శరీరానికి ఔషధ ప్రయోజనం లేని కూరగాయలు లేవు. 

 *7. న వైద్యః ప్రభురాయుషః ।*
 ఏ వైద్యుడూ దీర్ఘాయువు ఇవ్వలేడు. (వైద్యులకు పరిమితులు ఉన్నాయి.) 

 *8. చింతా వ్యాధి ప్రకాశాయ ।*
 ఆందోళన అనారోగ్యాన్ని తీవ్రతరం చేస్తుంది.. 

 *9. వ్యామశ్చ శనైః శనైః.*
 ఏదైనా వ్యాయామం నెమ్మదిగా చేయండి.
 (వేగవంతమైన వ్యాయామం మంచిది కాదు.) 

 *10. అజవత్ చర్వణం కుర్యాత్.*
 మీ ఆహారాన్ని మేక లాగా నిదానంగా నమలండి.
 (ఎప్పుడూ తొందరపడి ఆహారాన్ని మింగకండి. 
 లాలాజలం జీర్ణక్రియలో మొదట సహాయపడుతుంది.) 

 *11. స్నానం నామం మనఃప్రసాధనకరందుః స్వప్న-విధ్వంసనం ।*
  స్నానం కుంగుబాటు(డిప్రెషన్‌) ను దూరం చేస్తుంది.
  చెడు కలలను దూరం చేస్తుంది.. 

 *12. న స్నానమాచరేద్ భుక్త్వా.*
 ఆహారం తీసుకున్న వెంటనే స్నానం చేయ కూడదు. (జీర్ణక్రియ ప్రభావితమవుతుంది). 

 *13. నాస్తి మేఘసమం తోయం.*
 స్వచ్ఛతలో వర్షపు నీటికి ఏ నీరు సరిపోదు.. 

 *14. అజీర్ణే భేషజం వారి.*
 అజీర్ణం ఉన్నప్పుడు సాధారణ నీటిని తీసుకోవడం వల్ల ఔషధంలా పనిచేస్తుంది.

 *15. సర్వత్ర నూతనం షష్టం, సేవకాన్నే పురాతనే ।*
 ఎప్పుడూ తాజాగా ఉండేవాటికే ప్రాధాన్యత ఇవ్వండి.. అయితే అన్నం మరియు సేవకుడు మాత్రం పెద్ద వయస్సులో ఉన్నప్పుడు మాత్రమే మంచివి.

 *16. నిత్యం సర్వ రస భక్ష్యః ।।*
 మొత్తం షడ్రుచులు (ఆరు) రుచులు ఉన్న ఆహారాన్ని తీసుకోండి. (అనగా: ఉప్పు, తీపి, చేదు, పులుపు, వగరు (ఆస్ట్రింజెంట్) మరియు ఘాటు (పంజెంట్). 

 *17. జఠరం పూరయేదర్ధమన్నాత్, భాగం జలేన చ ।*
 *వాయోః సంచరణార్థాయ చతర్థమవశేషయేత్ ।।*
 మీ కడుపులో సగభాగాన్ని ఘనపదార్థాలతో నింపండి, పావు వంతు నీరు మరియు మిగిలిన దానిని ఖాళీగా ఉంచండి.

 *18. భుక్త్వా శతపథం గచ్ఛేత్ యదిచ్ఛేత్ చిరజీవితమ్ ।*
 ఆహారం తీసుకున్న తర్వాత ఎప్పుడూ ఖాళీగా కూర్చోవద్దు. కనీసం అరగంట పాటు నడవండి. 

 *19. క్షుత్సాధుతాం జనయతి ।*
 ఆకలి ఆహారం యొక్క రుచిని పెంచుతుంది..
 ఇంకా చెప్పాలంటే, ఆకలిగా ఉన్నప్పుడే తినండి.. 

 *20. చింతా జరా నామం మనుష్యాణాం* 
 ఆందోళన వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది.. 

 *21. శతం విహాయ భోక్తవ్యం, సహస్రం స్నానమాచరేత్ ।*
 ఆహారం కోసం సమయం వచ్చినప్పుడు, 100 పనులను కూడా పక్కన పెట్టండి (ఫోనుతో సహా). 

 *22. సర్వధర్మేషు మధ్యమామ్.*
 ఎల్లప్పుడూ మధ్య మార్గాన్ని ఎంచుకోండి. ఏదైనా విషయంలో అతిగా వెళ్లడం మానుకోండి

*సేకరణ రవిందర్ రెడ్డి బుసిరెడ్డి*

 *ఇవి మన ఋషులచే సంస్కృతంలో చెప్పబడిన సువర్ణ జ్ఞాన పదాలు.*

విషములు రకములు - వాటి గురించి వివరణ.

విషములు రకములు - వాటి గురించి వివరణ.
 
విషము రెండు రకాలుగా ఉండును. అవి 
    
. 1 - స్థావర విషము .
     2 - జంగమ విషము .
  
స్థావర విషము అనగా చెట్లు వాటికి సంభంధించినవియు , గనులలో దొరుకు పాషాణములు మొదలగు ధాతువులు . ఇవి స్థిరముగా ఉండుటచేత వీటికి స్థావర విషములు అని పేరు వచ్చింది. జంగమ విషము అనగా ఒకచోట స్థిరముగా ఉండక సంచరించుచుండు జంతువుల మరియు జలచరములకు సంబంధించినది.
     
. స్థావర విషమునకు సంబంధించి 10 రకాల ఆశ్రయములు కలవు. అవి 

 1 - వ్రేళ్ళు , 2 - ఆకులు , 3 - పండ్లు , 4 - పూలు , 5 - పట్టలు , 6 - పాలు , 7 - చేప , 8 - జిగురు , 9 - ధాతువులు , 10 - దుంపలు .
    
స్థావరవిషము పైన చెప్పిన 10 రకాల వస్తువులలో ఉండును. ఇప్పుడు మీకు ఒక్కొక్క దాని గురించి సంపూర్ణముగా వివరిస్తాను .
 
* వేళ్ళ యందు విషము కలిగినవి - 
   నల్లని అతిమధురపు వేళ్లు , తెల్ల గన్నేరు వేరు , గురివింద వేరు , ఈశ్వరీ వేరు , గర్గ వేరు , మంగ చెట్టు వేరు , విద్యుచ్చిఖ వేరు , గంజాయి వేరు . ఈ చెట్లలో వేళ్లు మాత్రమే విషపూరితముగా ఉండును.
 
* ఆకుల యందు విషము కలిగినవి - 
     విషపత్రిక , చేదువెదురాకు , టేకుఆకు , ప్రేంఖణపు ఆకు , అందుగ చెట్టు ఆకు ఈ చెట్ల ఆకులలో మాత్రమే విషము ఉండును. 
 
* ఫలముల యందు విషము కలిగినవి -
     కుముద్వతి , కనుము , ప్రేంఖణము , అందుగ , కర్కోటకము ( దీని కాయలు పాములు వలే ఉండును.) రేణుక , ఖద్యోతకము , దేవదారు , ఇభగందు , ఈశ్వరి , నందనము , సారపాకము అనే చెట్ల యొక్క ఫలముల యందు విషము ఉండును.
 
* పూల యందు విషము కలిగినవి -
      పేము , అడివికడిమి , వాయువిడంగములు , ప్రేంఖణము , అందుగ చెట్ల యొక్క పువ్వుల యందు విషము ఉండును.
 
* పట్ట, చేవ, జిగురు యందు విషము కలిగినవి -
      ఆంత్రపాచకం , కర్తరి , సౌరీయకం , మంగ , ప్రేంఖణము , నందనము , పరాటకము అను చెట్ల యొక్క బెరడు , చేవ , జిగురు యందు విషము ఉండును.
 
* పాల యందు విషము కలిగినవి -
       కుముదగ్ని ( ఒక రకపు జెముడు ) , జాలక్షరి వంటి చెట్ల పాల యందు విషము ఉండును.
 
* ధాతువుల యందు విషము కలిగినవి -
      పాషాణం , హరితాళం అను ధాతువుల యందు విషము ఉండును.
 
* దుంపల యందు విషము కలిగినవి -
      కాలకూటం, నాభి , సర్షపము , పాలకము , కర్దిమము , వైరాటము , ముస్తకము , శృంగి విషము , పుండరీక విషము , మూలకం , హాలాహలం , మహావిషము , కర్కటకము అను చెట్ల యొక్క దుంపల యందు విషము ఉండును.
 స్థావర విషములను తినినచో కలుగు లక్షణములు -
  
* విషము కలిగింది వేర్లను తినినచో మనిషి మెలికలు తిరిగిపోయి అర్ధం పర్థం లేని మాట్లాడుచూ మైకం పొందును.
 * విషము కలిగిన ఆకులను తినినచో వళ్ళు విరుచుకొనుట, ఆవలింతలు , శరీరం ముడుచుకొనిపోవుట, ఆయాసం వచ్చును.
 
* విషము గల ఫలములను తినినచో వృషణములు వాచుట , వళ్ళు మంటలు , అన్నము నందు ద్వేషము కలుగును.
 
* విషపు పుష్పములను తినినచో వాంతులు , కడుపుబ్బరం , మైకం కలుగును.
 
* విషపు బెరడు , చేవలు , జిగురలను తినినచో నోరు దుర్వాసనగాను , శరీరం గరగరలాడుచుండును. తలనొప్పి, నోటివెంట కఫము వెడలుచుండును.
 
* విషము కలిగిన పాలను తాగినచో నోటివెంట నురగలు వచ్చును. విరేచనములు అగును. నాలుక వంకరపోవును .
 
* ధాతు సంబంధ విషములను తినినచో గుండె యందు బాధ , మూర్చ, దవడల యందు మంట కలుగును.
 
* విషపు దుంపలలో కాలకూట విషము తినినచో స్పర్శజ్ఞానం పోవును . శరీరం వణుకుట , గట్టిగా బిగదీసుకుపోవుట కలుగును.
 
* నాభిని తినినచో మెడ బిగుసుకుపోయి మలమూత్రాలు పచ్చగా వెడలును. కండ్లు పచ్చగా ఉండును.
 
* సర్షప విషము తినినచో వాతము చెడి కడుపుబ్బును. శరీరం అంతటా కణుతులు లేచును . పాలకము అను విషమును తినినచో మెడ వాలిపోయి మాట పడిపోవును .
 
* కర్దము అను విషము తినినచో నోటివెంట నీరు కారును . నీళ్ల విరేచనములు అగును. కండ్లు పచ్చబడును.
 
* వైరాటం అను విషమును తినినచో ఒళ్ళు నొప్పులు , తలనొప్పి కలుగును.
 
* ముస్తక విషము తినినచో శరీరం బిగుసుకుపొయి శరీరబలం తగ్గును. శరీరం మంటలు , కడుపుబ్బరం ఉండును.
 
* పుండరీక విషము తినినచో కండ్లు ఎర్రగా ఉండి కడుపుబ్బు కలుగును.
 
* మూలక విషము తినినచో శరీరం రంగు మారును . వాంతులు , ఎక్కిళ్లు , వాపు , మైకం కలుగును.
 
* హాలాహల విషము తినినచో శరీరపు రంగు నల్లగా మారును . ఊపిరి ఆగిఆగి పీల్చుచుండును.
 
* మహావిషము తినినచో హృదయము నందు కణితి బయలుదేరును . విపరీతమైన గుండెనొప్పి వచ్చును.
 
* కర్కట విషము తినినచో మనిషి ఎగిరెగిరి పడుచుండెను . పండ్లు పటపట కోరుకుచుండెను. నవ్వుచుండెను . 


Thursday, June 19, 2025

ప్రాచీన జ్యోతిష్య గ్రంధాలలో వివరించిన వ్యవసాయ ముహుర్తాలు -

ప్రాచీన జ్యోతిష్య గ్రంధాలలో వివరించిన వ్యవసాయ ముహుర్తాలు - 

 * శ్రవణ , ధనిష్ట, శతభిష , చిత్త, స్వాతి , విశాఖ , అనూరాధ , రేవతి , అశ్వని , పునర్వసు, మృగశిర, పుష్యమి నక్షత్రముల యందు తారాబలం చూసి డబ్బులు చెల్లించవలెను.

 * మూల, అనూరాధ , రేవతి , స్వాతి , ఉత్తర, ఉత్తరాషాఢ , ఉత్తరాభాద్ర, పుష్యమి, శ్రవణం , విశాఖ ఈ నక్షత్రముల యందు విత్తనాలు విత్తుకొనవలెను.

 * బుధవారం 3 భాగములు , మంగళవారం 8 భాగములు , అదివారం 10 భాగములు, సోమవారం 16 భాగములు , శనివారం 20 భాగములు ఆయా వారాలలో గింజల రాసిని కొలిచిన నశించును. కావున గురు, శుక్రవారములలో గింజల రాసిని కొలవవలెను.
 
* స్వాతి , పుష్యమి, అశ్విని, విశాఖ, శ్రవణము, ధనిష్ట , శతభిషము, పునర్వసు ఈ నక్షత్రముల యందు ఆది, సోమ , గురు, శుక్ర, శనివారముల యందు 5 , 8 , 9 ఈ స్థానములలో పాపగ్రహములు లేని లగ్నముల యందు వ్యవసాయ ఋణము చేసిన త్వరగా తీరిపోవును.

 * నంద పూర్ణ తిధులు గల, గురుశుక్ర వారములు , మూల , మృగశిర, పుబ్బ, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర , ఆశ్రేష , మఖ, రేవతి , విశాఖ , అనూరాధ , పునర్వసు నక్షత్రముల యందు భూములు కొనుగోలుచేయుట , అమ్ముట శుభకరం.

 * రేవతి , ఉత్తర, ఉత్తరాషాడ, ఉత్తరాబాద్ర, రోహిణి , హస్త, పుష్యమి, మూల, మృగశిర, స్వాతి , జ్యేష్ఠ, అశ్విని నక్షత్రముల యందు , గురు,శుక్ర, సోమ , బుధవారముల యందు , కన్య , కర్కాటక , మిథున, మీన , మకర లగ్నముల యందు ఏరువాక , వృక్షచేధన , బీజాలను నాటుట కార్యక్రమాలు శుభప్రదం .

 * నంద, భద్ర తిథుల యందు , సింహ, ధనుర్లగ్నముల యందు , భరణి, హస్త, చిత్త, స్వాతి , విశాఖ , అనూరాధ , మఖ, ఆశ్రేష , ఆర్ధ , అశ్విని , పూర్వత్రయ నక్షత్రముల యందు పశువులు పశుశాలలో ప్రవేశించుట శుభకరం.

 * ఆది , సోమ , గురువారముల యందు ఆర్ద్ర , మృగశిర , మూల, పూర్వాభాద్ర, కృత్తికా నక్షత్రముల యందు పశువులును కట్టుట శుభకరం.

 * భరణి, ఆశ్రేష , శ్రవణము, చిత్తా నక్షత్రముల యందు , శనివారం నాడు, అమావాస్య , అష్టమి,
 షష్టి తిథుల యందు ఎద్దులు కట్టవలెను.

 * భరణి, ఆరుద్ర, కృతిక, అనూరాధ , మూల, మఖ, పునర్వసు , చిత్త, మృగశిర ఈ నక్షత్రముల యందు , మంగళ , ఆది , శనివారముల యందు పశువులను కొనుటకు వెళ్లవలెను.

 * స్వాతి , మూల, విశాఖ, రేవతి , శ్రవణము, జ్యేష్ట, ధనిష్ట ఈ నక్షత్రముల యందు పశువులను కొనుట శుభకరం.

 * ధనిష్ట, జ్యేష్ట, మృగశిర, రేవతి , విశాఖ , ఆశ్రేష , మఖ, అశ్విని , పూర్వత్రయ ఈ నక్షత్రముల యందు పశువులను అమ్మినవారికి మరియు కొన్నవారికి శుభప్రదం.

 * గురువారంతో కూడిన పుష్యమి నక్షత్రము నందు వృషభ లగ్నము నందైనను , వృషభాoశం యందైనను పశుశాల నిర్మించినచో మృగ, చోర బాధలు లేకుండా ఆ పశుశాల యందు ఉండు పశువులు సుఖంగా ఉంటాయి.

 * అశ్విని, భరణి, రోహిణి , పునర్వసు , హస్త, విశాఖ , జ్యేష్ట, శతభిష , రేవతి ఈ నక్షత్రముల యందు , ఆది , గురువారముల యందు గిత్తలచే కొత్తగా దున్నించవచ్చు .

 * 8 , 4 , 9 , 14 ఈ తిథుల యందు , శనివారం నందును, భరణి, రోహిణి , చిత్త, శ్రవణము , ఉత్తర, ఉత్తరాభాద్ర, ఉత్తరాషాడ, ఆశ్లేష ఈ నక్షత్రముల యందు దున్నపోతులచే దుక్కి దున్నించడం మంచిది .

 * అశ్విని, రోహిణి , మఖ, ఉత్తరాత్రయ , హస్త, చిత్త , స్వాతి , అనూరాధ , మూల, ధనిష్ట, రేవతి ఈ నక్షత్రముల యందు ఆది , మంగళ , బుధ , శుక్ర వారముల యందు 2 , 3 , 5 , 7 , 10 , 11 తిథుల యందు కొత్తభూమిలో వ్యవసాయ పని ప్రారంభించుటకు శుభకరం.
 
* విత్తనములు చల్లుట ఆరంభించిన మేషలగ్నము నందు పశునాశనం , కర్కాటకం నందు, బహుఫలం , తుల యందు ప్రాణహాని, మకరం నందు సస్యహాని, సింహ లగ్నం అందు చోరభయం , కుంభం నందు అధిక భయం , కన్య , వృషభ , మీన , మిథున , వృశ్చిక , ధనుర్లగ్నముల యందు ధాన్యసమృద్ధి , శుభప్రదం కలుగును.

 * ఆదివారము సింహ లగ్నం నందు సర్వబీజములు చల్లవచ్చు . సోమవారం మిథున లగ్నం నందు రాజనపు ధాన్యం విత్తనాలు చల్లవచ్చు. మంగళవారము మేష , వృశ్చిక లగ్నముల యందు కొర్ర ధాన్యములను , బుధవారం మిధున, కన్య లగ్నముల యందు పోక చెట్లు తోట స్థాపించవలెను.

 * గురవారం , ధనుర్మాసముల యందు మామిడి మొదలగు ఫలవృక్షములు నాటవలెను. శుక్రవారమున , తుల , వృషభముల యందు మల్లె మొదలగు పూలచెట్లు నాటవలెను.

 * శనివారమున మకర , కుంభముల యందు నువ్వులు మొదలగునవి చల్లవలెను.
  
 * మూల, శ్రవణము, మృగశిర, పునర్వసు , ధనిష్ట , రేవతి , రోహిణి , అనూరాధ , స్వాతి , ఉత్తరత్రయ ఈ నక్షత్రముల యందును, కర్కాటక, ధనుస్సు, తుల, వృషభము, సింహము, వృశ్చికం, కుంభం ఈ లగ్నముల యందు , బుధ , గురు, శుక్రవారముల యందు సెనగ, గోధుమ, కంది విత్తనములు చల్లుట ఫలప్రదము.
 
* శుభతిథుల యందు బుధ , గురు, సోమవారముల యందు , రోహిణి , అశ్విని, పుష్యమి, పునర్వసు , హస్త, మూల, స్వాతి, శతభిషము , ఉత్తరాత్రయము , రేవతి నక్షత్రముల యందు , కన్య, కర్కాటక, వృషభ, మిథున, మీన , మకర లగ్నముల యందు సమస్త ఫల వృక్షములు నాటవచ్చు. వివిధ విత్తనములు నాటవచ్చు , పొలము దున్నవచ్చు, భూమి సంపూర్ణ ఫలప్రదం అగును.

 * హస్త, చిత్త, విశాఖ , మూల, శతబిషం , స్వాతి , ఉత్తరాబాద్ర, ఉత్తరాషాడ, రోహిణి , జ్యేష్ట, అశ్విని, పునర్వసు , పుష్యమి, అనూరాధ , కృత్తిక , పుబ్బ, పూర్వాషాఢ , పూర్వాభాద్ర ఈ నక్షత్రముల యందు గురు, సోమ , బుధ , శుక్రవారముల యందు సమస్తమైన తోటలు వేయవచ్చు.

 * పుష్యమి, అశ్విని, హస్త, మృగశిర, అనూరాధ , మూల ఈ నక్షత్రముల యందు చెరుకు తోటలు వేసిన ఫలవంతములు అగును.

 * పుష్యమి, ఉత్తరాబాద్ర, మఖ, అశ్విని, రేవతి , అనూరాధ , ఉత్తర ఈ నక్షత్రముల యందు మేష, వృశ్చిక, వృషభ , కన్యా లగ్నముల యందు 3 , 5 , 7 , 15 తిథుల యందు , బుధ , గురు, శుక్ర వారముల యందు రేగు , అరటి, పనస , మామిడి తోటలు వేయవలెను .

 * భరణి, శ్రవణము, స్వాతి , మఖ, మూల, రేవతి , ధనిష్ట, అశ్విని, ఈ నక్షత్రముల యందు వంగ నారు నాటినచో మంచిఫలితం కలుగును.

 * హస్త, అశ్విని, పుష్య, ఉత్తర, ఉత్తరాషాడ , ఉత్తరాబాద్ర, రోహిణి , చిత్త, అనూరాధ , మృగశిర, రేవతి , స్వాతి , ధనిష్ట, మఖ, మూల ఈ నక్షత్రముల యందు అంట్లు కట్టినచో బాగుగా ఫలించును.
 
* స్వాతి , పుష్యమి, అశ్విని, శతబిషం , మూల, విశాఖ ఈ నక్షత్రముల యందు సమస్తమైన తీగలు పాదులు పెట్టిన బాగుగా కాయును .

 * రేవతి , ఉత్తర, రోహిణి , పుష్య, హస్త, పునర్వసు, మూల, స్వాతి , శతబిషం , అశ్విని ఈ నక్షత్రముల యందు , సోమ , బుధ , గురు, శుక్రవారముల యందు , కన్య, కర్కాటక, మిథున,మీన , ధనస్సు , వృషభ లగ్నముల యందు , శుభ తిథుల యందు సమస్తమైన చెట్లు నాటవచ్చు. సమస్త బీజములు చల్లుటకు , పొలం దున్నుట ప్రారంభించుటకు శుభప్రదం .
 
* మృగశిర, పుష్యమి, ఆరుద్ర, అశ్విని, భరణి, స్వాతి ఈ నక్షత్రముల యందు , శుభతిథుల యందు , ఆది , మంగళ , గురువారం ల యందు పొగాకు తోటలు వేసిన చక్కగా ఫలించును.
 
* రేవతి , అశ్విని , అనూరాధ , స్వాతి , శతబిషం, పునర్వసు, జ్యేష్ట, శ్రవణం , పుష్యమి, మూల, హస్త, ఉత్తర, మృగశిర నక్షత్రముల యందు , ఆది , సోమ , బుధ , గురు , శుక్రవారముల యందు , సూర్యోదయ కాలం నందు , ఉల్లితోట, కంది తోటలు పైరు పెట్టుటకు మంచిది .

 * పునర్వసు , భరణి, హస్త, పుష్యమి, స్వాతి , అశ్విని, రేవతి , మూల ఈ నక్షత్రముల యందు , 2 , 3 , 5 , 7 , 10 , 13 తిథుల యందు , సోమ , బుధ , గురు, శుక్రవారముల యందు , గురు, బుధులు కేంద్రముల యందు ఉండగా ప్రత్తిపైరు పెట్టుట మేలు .
 
* పుష్యమి, అశ్విని, హస్త, మృగశిర, అనూరాధ , మూల నక్షత్రముల యందు , బుధ , గురు, శుక్రవారముల యందు , స్థిరలగ్నముల యందు , శుభతిథుల యందు ఖర్జూర,పోక , కొబ్బరితోటలు వేసినచో ఫలప్రదం అగును.
 
* మూల, ఉత్తర, ఉత్తరాషాడ , ఉత్తరాబాద్ర, శ్రవణము,మృగశిర, పునర్వసు, ధనిష్ట, రేవతి , రోహిణి , అనూరాధ , స్వాతి ఈ నక్షత్రముల యందు , స్థిర లగ్నముల యందు బుధ , గురు, శుక్ర వారముల యందు చేనుకోసి కోసిన సస్యములను కుప్పలు వేయవచ్చు .
 
* కృత్తిక , మృగశిర, ఆరుద్ర, పుష్యమి, మఖ, హస్త, మూల , శ్రవణము , ధనిష్ట ఈ నక్షత్రముల యందు కుప్పలు నూర్చుట మంచిది .

 * చిత్త, రేవతి , మృగశిర, అనూరాధ , అశ్విని, పుష్యమి, హస్త ఈ నక్షత్రముల యందు , సోమ , గురు, శుక్రవారముల యందు , పూర్ణ తిథుల యందు , చంద్రతారాబల యుక్తమును చూచి కొత్తగింజలు ఇంటికి తెచ్చుకొనుట మంచిది .

 * మఖ, పుబ్బ, అనూరాధ , జ్యేష్ట, మూల, రేవతి ఈ నక్షత్రముల యందు సింహ లగ్నము నందును ధాన్యము దంచుట ఫలప్రదము .
 
* రోహిణి , ధనిష్ట, శతబిషం, ఉత్తర, ఉత్తరాషాడ,ఉత్తరాభాద్ర ఈ నక్షత్రముల యందు ధాన్యం అమ్ముట మంచిది .
 
* మంగళ , శుక్రవారములు, పూర్ణిమ, అమావాస్య , నవమి, చవితి తిథులు , గ్రహాదినములు పనికిరావు . ఈ దినములలో కాయలు కోసిన పాదులు చెడిపోవును.
 
* అశ్విని, రేవతి , అనూరాధ , హస్త, పుష్యమి, మృగశిర ఈ నక్షత్రముల యందు గానుగ మొదలుపెట్టవచ్చును.
 
* 2 , 3 , 5 , 7 , 8 , 10 , 12 , 13 , 15 ఈ తిథుల యందు , గురు, శుక్రవారముల యందు, ఉత్తరత్రయ , పూర్వత్రయ, రోహిణి , మృగశిర, పుష్యమి, హస్త, చిత్త, అనూరాధ , రేవతి , అశ్విని నక్షత్రముల యందు , వృషభ, మిథున, సింహ, కన్య,ధనస్సు , కుంభ , మీన లగ్నముల యందు కొత్తగింజల రాశి కొలుచుటకు మంచిది .
 
* గురువారం , శుక్ర వారం నందు రాశి కొలుచుట మంచిది . 

 

Sunday, June 15, 2025

జపము - జపమాల గురించి సంపూర్ణ వివరణ

జపము - జపమాల గురించి సంపూర్ణ వివరణ - 
       
ఒక మంత్రాన్ని జపించుటకు జపమాల ముఖ్యము . జపమాల ఉపయోగించటం వలన మనం చేయు జపసంఖ్య తెలియును . జపసంఖ్య తెలియకుండా చేయు జపము వ్యర్ధము . దాని ఫలితము రాక్షసులకు పోవును . జపమాలను హృదయమాల అని అంటారు. జపమాల రక్షణకు , సిద్ధికి ముఖ్యము . జపమాల లేకుండా ఎన్నికోట్ల సార్లు జపం చేసినను వ్యర్థము . 108 లెక్కకు వచ్చు మాల పూర్ణమాల , 54 లెక్కకు వచ్చునది అర్ధమాల , 27 లెక్కకు వచ్చునది అధమ మాల . 
                
. జపమాల చేయు విధానం గురించి ఇప్పుడు మీకు వివరిస్తాను . మధ్యన ముల్లులేని దారంతో మూడు మడతలతో పేని యజ్ఞోపవీతమునకు పురివేసినట్లు మూడు పేటలలో వేసిన ధారమునకే పూసలు గుచ్చవలెను . దీనిని ముత్తైదువులు చేసి ఇచ్చిన మంచిది లేదా స్వయంగా చేసుకొనవచ్చును. మాలకు మణులను గుచ్చునప్పుడు తాను యే మంత్రము జపించవలెను అనుకొనుచున్నాడో దానినే పలుకుతూ ఆ మణులను బంధించవలెను . మేరువుకు సరిగ్గా రెండుకోనలను దూర్చి మద్యన గ్రుచ్చవలెను . దీనిని శ్రీచక్రం పైనగాని లేక గాయత్రి వద్ద ఉంచిగాని , ప్రాణప్రతిష్ట 108 సార్లు చేసి గురువుగారికి ఇచ్చి 108 సార్లు వారు జపం చేసి ఇచ్చిన తరువాత తాను వాడవలెను . దీనివలన సర్వసిద్ధి కలుగును. జపమాలను దేహము నందు ధరించక , క్రింద ఉంచక దేవత వద్దనే ఉంచవలెను . దీనిని జపము చేయునపుడు " గోముఖము " వంటి సంచిలో ఉంచుకుని చేతికి తగిలించుకొని హృదయమునకు ఆనించుకుని మాల లోపలికి చుట్టి వచ్చునట్లుగా జపించవలెను . జపించు సమయము నందు మాలను చూచువారికి జపఫలితము దక్కును. కనుక జపము చేయి సందర్భము నందు మాలపైన గోముఖము లేదా వస్త్రమును గాని కప్పవలెను . జపమల లొపల తిరిగినచో జపఫలితము తనకే వచ్చును. బయట తిరిగినచో ఆ మాలను చూసినవారికి ఫలితము దక్కును. 
                 
. ఇప్పుడు మీకు ఏ వస్తువులు కల మాలలతో జపము చేసిన ఎటువంటి ఫలితాన్ని ఇచ్చునో మీకు తెలియచేస్తాను . రుద్రాక్షమాల ధర్మార్ధ , కామ , మోక్షములను ఇచ్చును. పద్మమాలిక సర్వబీష్ట సిద్ది , పగడమాల విద్య , వశీకరణము . పద్మరాగ మాల సమ్మోహనము , పుత్రజీవి మాలతో ( దీనికి ఎరుపు దారం ఉండాలి ) సంతానం , ఉశిరిక గింజల మాల జ్వరశాంతి , పసుపుకొమ్ముల మాలతో " బగళా మంత్రము , నవదుర్గ " ఇత్యాది జపించిన స్తంభన అగును. ఔదుంబర మూలికామాల సర్వసిద్ది , తాని మాలతో దారిద్ర్యనివారణ శత్రువులు పారిపోవుటకు 10 వేలు జపం చేయవలెను . హృదయమాల శీఘ్ర మంత్రసిద్ది , మణులతో చేసిన మాల సామ్రాజ్యము , స్పటికమాల సర్వకోరికలు నెరవేరుట , పద్మబీజములు మాల లక్ష్మీకరం , కీర్తికరం , రక్తచందన మాలతో వశీకరణం , భోగము కలిగించును. 
               
. జపము చేయనప్పుడు ఏ వ్రేళ్లకు ఏమి ఫలమో ఆ విధముగా చేయవలెను . ఉంగరపు వ్రేలు బొటనవ్రేలితో కలిపి మాలను పుచ్చుకొని జపించవలెను . మరి ఇతరవ్రేళ్ళకు సంబంధం ఉండరాదు. ఉత్తమకర్మ సిద్ది అగును. బ్రొటనవేలు , మధ్యవేలు మంత్రసిద్ది . చూపుడువేలు ఉచ్చారణ కొరకు , కనిష్ఠఅంగుష్ఠములు మరణము , చూపుడు వ్రేలు శత్రునాశనము , మధ్యవ్రేలు రోగహరి , ఉంగరపు వ్రేలు పుష్టి , కనిష్టము రక్షణ , అంగుష్ఠము మోక్షమును ఇచ్చును. 
     
  
. జపము చేయుటకు సూర్యోదయము నుంచి తిరిగి సూర్యోదయము అగు ఆహోరాత్రమును 6 భాగములు చేయవలెను . 24 గంటల సమయము నందు ఒక భాగము 4 గంటలు అగును. వీటిని ఋతువులు అందురు. ఏ కర్మ చేయాలనుకున్నచో ఆ కర్మకి సంబంధించిన ఋతువు నందే జపము చేయవలెను . మంచి విషయములకు సదా జపము చేయవచ్చును . 
            

Wednesday, June 11, 2025

ఆయుర్వేదము నందలి పంచకర్మ చికిత్స గురించి వివరణ -

ఆయుర్వేదము నందలి పంచకర్మ చికిత్స గురించి వివరణ - 

   ఆయుర్వేద చికిత్స పద్దతిలో ఔషధాలను 5 రకాలుగా ప్రయోగిస్తారు . దీనికే "పంచకర్మ " అని పిలుస్తారు . వాటి గురించి మీకు వివరిస్తాను . 

    పంచకర్మములు 5 రకాలు అవి 

  స్నేహన విధి , స్వేదన విధి , వమన విధి , విరేచన విధి , నస్య విధి . 

 * స్నేహన విధి - 

       తైలాదులను లేపనం చేయుట , చరుముట , రాయుట మొదలైనవి దీనికి లేపనవిధి అని మరొక పేరు కలదు . 

 * స్వేద విధి - 

       బాగా చెమట పట్టునట్లు వేడినీళ్ల యొక్క ఆవిరి పట్టుట . దీనికి కుంభాసేకమనియు పేరుతో కూడా పిలుస్తారు . తరువాత కాలంలో " టర్కిష్ బాత్ " అని వ్యవహరిస్తున్నారు . 

 * వమన విధి - 

     వాంతి అగునట్లు ఔషధములను పుచ్చుకొనుట .

 * విరేచన విధి - 

     జీర్ణాశయమును , ప్రేవులను శుద్ది చేసుకొనుట కొరకు , లోపలి పేరుకొని పోయిన దుష్టపదార్ధమును బయటకి వెడలగొట్టుటకు విరేచనాలు అయ్యే ఔషధాలను సేవించి జీర్ణవ్యవస్థను శుభ్రం చేసుకొనుట . 

 * నస్య విధి - 

      కొన్ని రకాల మూలికల యొక్క రసములను నాసికా రంధ్రముల యందు పోయుట . లేక నాసికా రంధ్రముల నుండి లోపలికి పీల్చు విధానం . 

      

మణిపూరక చక్రం.

మణిపూరక చక్రం.
 
మనవ శరీరం లొ ఇది చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. ఇది నాభి కి కుడివైపు ఒక అంగుళం దూరం లొ వెన్నుని ఆనుకొని ఉంటుంది. ఇది గతి తప్పినా అనగా సరిగ్గా శక్తి సంచాలనం చేయక పోయినా లేక స్థితి తప్పినా అనగా ఉండాల్సిన చోట ఉండకుండా కొంచెం కదిలినా శక్తి హీనం అయినా మనిషి చాలా రోగాలుకి గురి అవుతాడు.

మణిపూరక చక్రం పరీక్ష - 
 
 మణిపూరక చక్రం సరిగ్గా ఉందో లేదో తెలుసుకోవడానికి 2 పరిక్షలు ఉన్నాయి .
 
* పరగడుపున అనగా ఏమీ తిననప్పుడు వెల్లికిలా పడుకొని నాభిలో వేలుపెట్టి కొద్ది గా అదిమితే గుండె చప్పుడు లాంటిది వినపడుతుంది.అలా వినపడితే మణిపూరక చక్రం సరిగ్గా ఉన్నట్టు.

 * నాభి స్థానం నుండి కుడి ఎడమ స్థనగ్రముల వరకు దూరాలు కొలవండి. ఈ రెండు దూరములు సమానం గా ఉంటే మణిపూరక చక్రం సరిగ్గా ఉన్నట్టు.
 
మణిపూరక చక్రం కదలడానికి గల కారణాలు - 
 
     మూలాధారం నుండి ప్రారంబించి ఆ చక్రాలు ఒక నిర్ణిత స్థానం లొ ఉంటాయి. ఈ చక్రాలు ఒక నిర్ణీత స్థానం లొ వెన్నుని ఆనుకుని ఉంటాయి.వీటి సంభందం శరిరం లొని నాడీ కేంద్రాలతో అన్నిటితో ఉంటుంది . ఈ నాడి కేంద్రాలలో ని అయస్కాంత శక్తి తగ్గినప్పుడు వాటికి అనుగుణం గా చక్రాల స్థితులలో మార్పు రావోచ్చును కారణం ఇవన్ని జివయస్కాంత శక్తి కేంద్రాలు.కనుక 

 శరీరం లొ జీవయస్కాంత శక్తి తగ్గడానికి గల కారణాలు - 

 * చాలా ఎక్కువ సమయం ఇనప వస్తువులపై కూర్చోవడం.

 * ఎక్కువుగా ఇనప గ్రిల్ల్స్ మొదలయినవి ఉండే ఇంట్లో నివసించడం.

 * అత్యధిక ఉష్ణం కలిగించె ఆహరం తరుచుగా తినడం.

 * అయస్కాంత శక్తి తగ్గిపోయిన స్త్రీ తొ కాని పురుషుడు తో కాని సంభందం పెట్టుకొవడం.

 * ఉప్పు, కారం లు అదికం గా తినడం

 * మాంసాహారం హద్దు దాటి తినడం .
 
* ఎక్కువ సమయం స్కూటరు, కార్ మొదలయిన వాహనాలు గాని లేక రోడ్ రోలర్ , ప్రొక్లియన్ వంటి వాహనాలు నడపడం.

 * అయస్కాంత విదుతయస్కాంత యంత్రాలకు సంభందించిన ఉద్యోగాలు.

 * చాలా శక్తి వంతమైన విధ్యుత్ తో నడిచే యంత్రాల వద్ద పని చేయడం .
 
మణిపూరక స్థానభ్రంశం వలన కలుగు రోగాలు - 

 " ఉదార విథానం " ( Diaphram ) అనేది కడుపుని పై భాగాన్ని వేరు చేస్తూంది .ఈ ఉదార వితానం క్రింది భాగం లొ ముఖ్యం గా నాభి నుండి క్రిందికి గల భాగం లొ ఏ రోగమైన రావొచ్చు. 
 
* జీర్ణకోశ వ్యాదులు , అల్సర్, apendisitees , డయారియా , డిసెంత్రీ , లైంగిక సమస్యలు, నడుంనొప్పి, పైల్స్ , phiistula , కడుపు నొప్పి ఇటువంటివి రావొచ్చు.
 
 మణిపూరక చక్రం శక్తి హీనం అయ్యి స్థానబ్రంశం పొందినా కాలేయం పాంక్రియాస్ పాడు అయ్యి మదుమేహం రావొచ్చు .పెద్ద ప్రేవులలో, పురీష నాళం కాన్సర్ రావొచ్చు .
 
మణిపూరక చక్రాన్ని సరి చేయు విధానం -

. వెల్లికిలా పడుకోండి . నాభి పైన ఒక రూపాయి బిళ్ళ ఉంచండి.దానిపైన ఒక కొవ్వొత్తి ఉంచండి.దానిపై ఒక స్టీల్ గ్లాస్ బోర్లించి పట్టుకోండి.వేడి వలన గ్లాస్ లొ ప్రాణ వాయువు
 ఖర్చు అయిపోయి శూన్యం ఏర్పడుతుంది.లేదా వాయువు వ్యాకోచించి ఒత్తిడి ఎర్పడుతుంది. ఆ వత్తిడి వలన మణిపూరక చక్రం సరి అయిన స్థానం లొ కి వస్తుంది. ఈ ప్రక్రియను నాలుగు , అయిదు సార్లు చేసి మణి పూరకానికి పైన చెప్పిన పరీక్షలు నిర్వహించాలి. అది సరి అయిన స్థానానికి వచ్చినపుడు గుండె చప్పుడు వినిపిస్తుంది.

 * అరచేతి కేంద్ర స్థానాన్ని గాని అరకాలి కేంద్ర స్థానాన్ని బొటన వ్రేలితో నొక్కండి.(sound వినపడే వరకు ) .

 * వెల్లికిలా పడుకొని గాలి పీల్చి కడుపుని ఉబ్బించి పెట్టండి అలా మణిపూరక చక్రం తన స్థానం వచ్చె వరకు చేయండి .

 * సూర్య యంత్రం మెడలో ధరించండి.
 
* సూర్య నమస్కారాలు చేయండి .

 * కుడి చేతి మద్య వేలికి మాణిక్యం ధరించండి. 
  
            

Sunday, June 8, 2025

కులముతో పనిలేకుండా హిందూ ధర్మం జ్ఞానం మీద ఆధారపడి నడిచింది. జన్మం మీద కాదు.

కులముతో పనిలేకుండా హిందూ ధర్మం జ్ఞానం మీద ఆధారపడి నడిచింది. జన్మం మీద కాదు. 
(వజ్రసూచికోపనిషత్తు ప్రకారం ..) 
~~~~~~~~
1. ఋష్యశృంగుడు .. జింకలు పట్టుకునే జాతులకు పుట్టినవాడు.
2. కౌశికుడు .. గడ్డి కోసుకునే జాతికి చెందినవాడు.
3. జంబూక మహర్షి .. నక్కలు పట్టుకునే జాతివారు ..
4. వాల్మీకి .. ఓ కిరాతకుల జాతికి చెందిన వాడు. ఈతను రచించిన రామాయణం .. హిందువులకు పరమ పవిత్రమైన గ్రంథం. ఈయన్ని ఆదికవిని చేసి పూజిస్తారు.
5. వ్యాసుడు .. ఓ చేపలుపట్టే బెస్తజాతికి చెందినవాడు. హిందువులకు పరమపవిత్రమైన వేదములు .. ఈయన చేత విభజన చేయబడ్డవే. అందుకే ఇతణ్ణి వేదవ్యాసుడు .. అని పూజిస్తారు. 
6. గౌతముడు .. కుందేళ్లు పట్టేజాతికి చెందినవాడు.
7. వశిష్టుడు .. ఓ వేశ్యకు పుట్టినవాడు. కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు. ఈతని భార్య మాదిగ స్త్రీ అయిన అరుంధతీదేవి. ఈరోజుకు కూడా నూతన దంపతులచేత అరుంధతీవశిష్టులకు నమస్కారం చేసే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ప్రతి పూజలోనూ హిందువులచేత .. అరుంధతీవశిష్ఠాభ్యాం నమః .. అని పూజలందుకుంటున్నారు. 
వీరి కుమారుడు శక్తి. ఇతని భార్య ఓ మాదిగ వనిత .. ఛండాలాంగని. వీరికుమారుడే పరాశరుడు. ఈతను ఓ బెస్తవనిత మత్స్యగంధిని వివాహమాడి వ్యాసుణ్ణి కన్నారు. 
8. అగస్త్యుడు .. మట్టి కుండల్లో పుట్టినవాడు.
9. మతంగ మహర్షి.. ఒక మాదిగవాని కుమారుడు. బ్రాహ్మణుడయ్యాడు. ఈతని కూతురే .. మాతంగకన్య .. ఓ శక్తి దేవత. కాళిదాసుతో సహా ఎందరో మహానుభావులు ఈ మాతను ఉపాసించారు. ఉపాసిస్తూ ఉన్నారు. ఈమే శ్యామలాదేవి.
ఇంకా 
1.ఐతరేయ మహర్షి ఒక దస్యుడి మరియు కిరాతకుడి కుమారుడు .. అంటే నేటి లెక్కల ప్రకారం SC or ST. జన్మ బ్రాహ్మణుడు కాదు. కానీ అత్యున్నతమైన బ్రాహ్మణుడు అయ్యాడు. అతను వ్రాసినవే ఐతరేయ బ్రాహ్మణం మరియు ఐతరేయోపనిషత్తు. ఐతరేయ బ్రాహ్మణం చాలా కష్టమైనది. ఇది ఋగ్వేదాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తారు.
2.ఐలుష ఋషి ఒక దాసీ కుమారుడు. అతను ఋగ్వేదంమీద రిసెర్చ్ చేసి చాలా విషయాలు కనిపెట్టాడు. అతన్ని ఋషులందరూ ఆహ్వానించి తమకు ఆచార్యుణ్ణి చేసుకున్నారు ( ఐతరేయ. బ్రా. 2.19)
3. సత్యకామ జాబాల మహర్షి ఒక వేశ్య కుమారుడు. తండ్రి పేరే కాదు.. కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు. కానీ జ్ఞానం చేత బ్రాహ్మణుడు అయ్యాడు.
ఉన్నతవంశాలలో పుట్టినవారిని కూడా వారిధర్మం నిర్వర్తించకపోతే .. వారిని నిర్మొహమాటంగా బహిష్కరించారు ... వారిలో కొందరు
1. భూదేవి కుమారుడు .. క్షత్రియుడైన నరకుడు .. రాక్షసుడైనాడు.
2. బ్రహ్మవంశజులైన హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణుడు,.. బ్రాహ్మణులైనా .. రాక్షసులయ్యారు ..
3. రఘువంశ మూలపురుషుడైన రఘుమహారాజు కుమారులలో ఒకడు అయిన ప్రవిద్ధుడు .. రాక్షసుడైనాడు. 
4. త్రిశంకుడు క్షత్రియుడు. కానీ చండాలడు అయ్యాడు.
5. విశ్వామిత్రుడు క్షత్రియుడు.. బ్రాహ్మణుడైనాడు .. వీరి వంశస్తులే .. కౌశికస గోత్ర బ్రాహ్మణులయ్యారు. విశ్వామిత్రుని కుమారులు కొందరు శూద్రులయ్యారు.
6. నవ బ్రహ్మలలో ఒకడైన దక్ష ప్రజాపతి కుమారుడు పృషధుడు. బ్రహ్మ జ్ఞానం లేని కారణాన శూద్రుడిగా మారిపోయాడు ( విష్ణుపురాణం 4.1.14)
7. నేదిష్టుడు అనే మహరాజు కుమారుడు .. నాభుడు. ఇతనికి క్షాత్ర జ్ఞానం లేని కారణాన, వర్తక జ్ఞానం కారణాన వైశ్యుడిగా మారవలసి వచ్చింది  ( విష్ణుపురాణం 4.1.13). 
8. క్షత్రియులైన రథోతరుడు, అగ్నివేశ్యుడు, హరితుడు .. బ్రహ్మ జ్ఞానం వలన బ్రాహ్మణులైనారు. హరితుని పేరుమీదే .. ఇతని వంశబ్రాహ్మణులకు హరితస గోత్రం వచ్చింది (విష్ణుపురాణం 4.3.5).
9. శౌనక మహర్షి కుమారులు .. నాలుగు వర్ణాలకు చెందినవారుగా మారారు (విష్ణుపురాణం 4.8.1).
10. అలాగే గృత్సమదుడు, వీతవ్యుడు, వృత్సమతి ... వీరి కుమారులు కూడా నాలుగు వర్ణాలకు చెందినవారు అయ్యారు.
మీరు షేర్ చేసే ప్రతి సందేశం తో పాటు ఈ సందేశాన్ని కూడా మీ బంధువులకు స్నేహితులకు సన్నిహితులకు షేర్ చేయండి*
తెలియని విషయాలు తెలుసుకునే అదృష్టాన్ని వారికి అందించటంలో సహాయపడండి
ఇదే మన సనాతన ధర్మం యెుక్క గొప్పతనం.

శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
.

Monday, June 2, 2025

వరసగా వచ్చు ఎక్కిళ్లు హరించుటకొరకు అద్భుత యోగాలు

వరసగా వచ్చు ఎక్కిళ్లు హరించుటకొరకు అద్భుత యోగాలు - 

 * నల్లేరు కాడలు తెచ్చి కుమ్ములో ఉడకబెట్టి రసముపిండి ఆ రసము 5ml తేనే 5ml కలిపి పూటకొక సారి రోజూ రెండుసార్లు తీసుకున్న యెడల ఎక్కిళ్లు హరించును 

 * నెమలిపింఛం కాల్చి మసిచేసి ఆ మసి , తేనె , తమలపాకులరసం సమభాగములుగా కలిపి పూటకు 5 గ్రాములు చొప్పున రోజుకి మూడుపూటలా ఇచ్చుచుండిన యొడల ఎక్కిళ్లు హరించును . 

• శోంఠి , తేనె కలిపి ఒక చిన్న ఉసిరి కాయ అంత ఉండ చేసి బుగ్గన పెట్టుకొని రసం మింగుతూ ఉండాలి. ఇలా రెండు నుంచి మూడు సార్లు చేయుచున్న ఎక్కిళ్ళు తగ్గును.