Thursday, August 7, 2025

గోమాత లో 33 కోట్ల దేవతలు ఉన్నారా?

జై గోమాత

 గోమాత లో 33 కోట్ల దేవతలు ఉన్నారా?

 ధర్మ ప్రచారకులు అందరూ గోమాత విషయంలో 33 కోట్ల దేవతలు ఉన్నారని సర్వదేవతా సమాహారం అని వర్ణిస్తూ ఉంటారు. 

 గోమాతను ప్రాణిగా కాకుండా సర్వ దేవత శక్తుల సమ్మేళనమైన జీవశక్తి గా భావించటం ఒక ఆధ్యాత్మికమైన సూత్రం. వేద, పురాణాలు, ఇతిహాసాలు ధర్మశాస్త్రాలు ఈ భావనకు మూలం.

 33 కోట్లు దేవతలు అంటే 330 మిలియన్లు సంఖ్యా కాదు. ఈ పదబంధాన్ని భాషా ఆత్మకంగా అర్థం చేసుకోవాలి.

ప్రాచీన వేదకాలంలో "త్రయస్త్రింశత్" దేవతలు అని చెబుతారు. అంటే 33 దేవతలు: 

 33 మంది దేవతలు ఎవరు

 అష్ట వసువులు ప్రకృతి తత్వాలు( జల అగ్ని వాయు మొదలైనవి) 8

 ఏకాదశ రుద్రులు ప్రాణ తత్వాలు 11

 ద్వాదశ ఆదిత్యులు కాల తత్వాలు 12 

 అశ్వినీ దేవతలు ఆరోగ్య దేవతలు 2

 ఎనిమిది ప్రకృతి తత్వాలు, 11 ప్రాణ తత్వాలు, 12 కాల తత్వాలు, రెండు ఆరోగ్య దేవతలు మొత్తము 33 రకాల శక్తులు కలిగిన స్వరూపమే గోమాత. విశ్వం నడవడానికి కూడా ఈ 33 రకాల శక్తులు అవసరం. అందుకే గోమాత సర్వదేవతా సమాహారం అయింది. భక్తి పరంగా 33 కోట్ల దేవతలు అని సంబోధిస్తారు. విశ్వశక్తిని తనలో వ్యాపింప చేసుకోవటం వల్ల విశ్వ మాతగా అయింది.

అపస్తంభ స్మృతి, ధర్మశాస్త్రాలు, వాసవ దర్శనం, గోపాళ తపనీ ఉపనిషత్తు వంటి గ్రంథాలలో ఈ విషయాలు తేల్చబడ్డాయి.

గరుడ పురాణం, భవిష్య పురాణం మొదలైన గ్రంథాలు కూడా ఈ గోతత్త్వాన్ని వర్ణిస్తాయి.

గోమాత శరీరంలో దేవతా శక్తులు ఉన్నందున ఆమెను పూజించడం వల్ల అనేక అనుగ్రహాలు కలుగుతాయి.

గోమాతకు విశ్వ రూపం ఉంది. ఆవును పూజించడం అంటే:

ప్రకృతిని పూజించడం
సంపూర్ణ జీవవైవిధ్యాన్ని గౌరవించడం
ఆధ్యాత్మికతకు మూలాధారం
 గోమాత రక్ష సర్వ జగద్రక్ష
 ధర్మస్య జయోస్తు

No comments:

Post a Comment