Thursday, August 7, 2025

నిమ్మకాయతో చికిత్స - * అజీర్ణం ( Dyspepsia ) -

నిమ్మకాయతో చికిత్స - 

 * అజీర్ణం ( Dyspepsia ) - 
  
. గుండెల్లో మంటకు , పులిత్రేపులకు నిమ్మపండు మంచి మందు. కొద్దినీటిలో ఒక చెక్క నిమ్మరసం కలిపి దానిని ఒక మోతాదుగా పుచ్చుకొనవలెను.దీనివలన జీర్ణాశయం గోడలు శుభ్రం అగును. ఉపవాసం ఉన్నప్పుడు కాని , జీర్ణకోశం ఖాళీగా ఉన్నప్పుడు కాని నిమ్మరసం సేవించవలెను. 
 
* మలాశయం బాధ ( Bowel Trouble ) - 
       నిమ్మరసం అతిసారం , అతివిరేచనమును కట్టును. నిమ్మపండు నిజరసమును గాని కొంచం నీటితో కాని ఆసన మార్గము ( Enema ) ద్వారా పంపించిన కలరా , ఆమపాతం ( Macocolitis ) , ఆంత్రభ్రంశము ( prolapse of the bowels ) మొదలుగా గల కఠినమగు పేగు బాధలు నివారణ అగును. ఇంతే కాకుండా ఆమపాతంతో కూడిన శీతబేది ( Dysentry with slonghing of the mucous membrens ) అనగా జిగట విరేచనాలు తీవ్రమయిన ఈ జబ్బుతో రోగికి 12 ఔన్సుల మోతాదు ఇవ్వవలెను.

* స్థూలకాయం ( Obesity ) - 
    
. నిమ్మనీరు కాని , ఉడికించిన నిమ్మ పండ్లు కాని అతి స్థూలకాయమునకు మంచి మందు. మూడు నాలుగు గ్లాసుల తీపి కలపని నిమ్మనీరు కాని దానికి సరిపోవు పూర్తి పండ్ల పదార్ధం కాని దినదినము పుచ్చుకొనవలెను . దీనితో పాటు మితముగా భుజించుటయు , మధ్యాహ్నం రెండు గంటల తరువాత భోజనం చేయకుండా ఉండుట అభ్యాసం చేయవలెను . మధ్యాహ్నం 2 గంటల తరువాత తినిన ఆహారం అతిగా కొవ్వును పెంచును. అదే విధముగా శరీరం నందు నీరు , అంతర్మలములు ( Waste Poisons ) కూడా పెంచును. వీటన్నిటిని నిమ్మరసం తొలిగించును.
 
*. ముఖ సౌందర్యం ( cosmetic ) - 
  
. సామాన్యంగా ముఖము పైన దీనిని వాడినప్పటి కంటే లొపలికి తీసుకున్నప్పుడు అద్భుతంగా పనిచేయును. నిమ్మకాయ చెక్కని తలపైన రుద్దిన చుండ్రు ( Dandruff ) పోవును . మొటిమలు ( acne spots ) , శరీర నిగారింపు ( oily skin ) కలవారు నిమ్మరసం వాడుట చాలా మంచిది. ముఖం పైన , చేతుల పైన మచ్చలు , వాపు , గజ్జి వంటివాటిని నిమ్మరసం పోగోట్టును . 
 
*. చలి జ్వరం - ( Maleria ) 
     
. నిమ్మరసం పాలు కలపని కాఫీ లో ఇచ్చిన సమర్ధవంతంగా పనిచేయను. కాలిక వ్యాధులు ( Chronic Disorders ) అన్నింటిలో పండు పదార్థం వాడినంతను అద్భుతంగా పనిచేయను.నిమ్మ తొక్కలో క్రిమిసంహారకం అగు నూనె , నిమ్మ కాయ దూది యందు స్వాభావిక జీర్ణం అగు సారములు ఎన్నొ కలవు. చాలాకాలం నుంచి చలి జ్వరమునకు , రొంపలకు ముందుగా వాడుచున్న సింకోనా క్వయినా తయారగు చెట్టు బెరడును ఉండు గుణములు అన్నియు దీనియందు కలవు. 
   
. అపస్మారం వల్ల కలిగిన గుండెదడ కి 15 గ్రాములు నిమ్మరసం ఇచ్చిన నిమ్మళించును.
 
*. రక్తస్రావం - 
    
. శ్వాసకోశములు ( Lungs ) , అన్నకోశం , ప్రేగులు మూత్రపిండములు మొదలగు వాటినుండి లోపల భాగాలలో రక్తస్రావం అవుతున్నప్పుడు నిమ్మరసం ఇవ్వవలెను. ఉప్పు కలిపి రోజుకి ఒక నిమ్మకాయ తినుచున్నచో ప్లీహవృద్ధి అనగా Enlargement of Spleen 

*. కడుపులో బల్ల పెరుగుట హరించును. 
    
. నిమ్మతైలము ని మర్దన కొరకు వాడవచ్చు. 
  
*. దంతశుద్ధి - 
     
. దంతములు బలహీనంగా గాని , రంగుమారి కాని ఉన్నచో వాటిబాగుకై పేస్ట్ వాడరాదు. అవి హానిచేయును. అటువంటి సమయాలలో నిమ్మపండ్ల రసంలో తడిపిన కట్టెబొగ్గు లేదా నీళ్లతో పలుచన చేసిన నిమ్మపండ్ల రసం. కాని ఇది వాడిన తరువాత నీటితో నోరు బాగా పుక్కిలించవలెను. చిగుళ్ల వాపుకు , నోటి పూతకు నిమ్మకాయ రసమును నీటిని సమాన భాగాలుగా తీసుకుని పుక్కిటబట్టుట మంచిది. 

No comments:

Post a Comment