Tuesday, November 25, 2025

స్త్రీల సౌందర్యానికి చిట్కాలు -

స్త్రీల సౌందర్యానికి చిట్కాలు - 
 
నల్లటి మచ్చలు ,మంగు నివారణ -

 *  జాపత్రిని మంచినీటితో మెత్తగా నూరి రాత్రిపూట ముఖానికి లేపనం చేసుకొని ఉదయాన్నే గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపర్చుకొనుచున్న అతిత్వరలోనే ముఖము పైన కల మంగు ,నల్లమచ్చలు మాయం అగును . 
 
*  మిరియాలు గోరోజనముతో కలిపి నూరి పైకి లేపనం చేయుచున్న మొటిమలు తగ్గును . మచ్చలు పోవును . 
 *  బాదం పప్పును నీటితో నూరి వడకట్టగా వచ్చిన పాలను ముఖంపై మర్దన చేయుచున్న క్రమంగా నల్లమచ్చలు , మంగు , మొటిమలు త్వరలోనే హరించును . 
 
*  ధనియాలు , వస , సుగంధపాల ఈ మూడింటిని సమభాగాలుగా తీసుకుని మెత్తటి చూర్ణముగా చేసి ఈ చూర్ణమును ఒంటికి నలుగు పిండిలా పట్టించుచున్న నల్లటి మచ్చలు , మొటిమలు తగ్గును . 
 
*  నిమ్మరసమును పాలతో కలిపి రాత్రిపూట ముఖానికి మర్దన చేసుకుని తెల్లవారిన తరువాత లేవగానే గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుగుకొనవలెను . సబ్బు వాడరాదు . ఇలా క్రమం తప్పకుండా చేయుచున్న మచ్చలు , మంగు పోయి ముఖం కాంతివంతం అగును . 

 *  తులసి ఆకుల రసములో కొద్దిగా టంకణం ( Borax ) కలిపి పైకి లేపనం చేయుచున్న ముఖం పైన మచ్చలు , మంగు హరించును . 
 
*  మంజిష్ట చూర్ణమును ఆవుపాలతో కలిపి అరగదీసి అందులో కొంచం తేనె కలిపి ముఖమునకు లేపనం చేయుచున్న నల్లమచ్చలు , మంగు హరించును .  


పంచభూతాలు – ఆహారంలో ఉన్న శక్తులు*

.

*పంచభూతాలు – ఆహారంలో ఉన్న శక్తులు*

*ముందుమాట:*  
మన శరీరం పంచభూతాల (భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం) ఆధారంగా పనిచేస్తుంది. తినే ఆహారంలో కూడా ఈ భూతాల సమతుల్యత ఉంటుంది. ఏ భూతం ఎక్కువైనా, తక్కువైనా ఆరోగ్యంలో మార్పులు వస్తాయి. అందుకే పంచభూతాలను అర్థం చేసుకుని ఆహారాన్ని ఎంచుకుంటే శరీరం సమతుల్యం అవుతుంది మరియు రోగ నిరోధకశక్తి పెరుగుతుంది.

1) *భూమి తత్త్వం (Earth Element) – స్థిరత్వం ఇచ్చే ఆహారం*  
ఈ తత్త్వం శరీరానికి బలం, స్థిరత్వం, నిర్మాణం ఇస్తుంది. అన్నం, గోధుమ, రాగి, జొన్న, బంగాళాదుంప, వేరుశనగ వంటి భూభాగంలో పెరిగే ఆహారాలు ఇందులోకి వస్తాయి. వీటివల్ల శరీరానికి శక్తి, బలం, నిండిన అనుభూతి కలుగుతుంది. అధికంగా తీసుకుంటే బరువు పెరుగుతుంది, కాబట్టి పరిమాణం ముఖ్యం.

2) *నీటి తత్త్వం (Water Element) – శరీర ద్రవాల సమతుల్యం*  
శరీరానికి హైడ్రేషన్ ఇచ్చే అన్ని ఆహారాలు ఈ తత్త్వంలో పడతాయి. నీరు, మజ్జిగ, పండ్ల రసాలు, కీరా, పుచ్చకాయ వంటి నీటి శాతం ఎక్కువగా ఉన్న పదార్థాలు శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. ఈ తత్త్వం రక్త ప్రసరణ, చర్మ కాంతి, జీర్ణం కోసం అవసరం. తక్కువైతే డీహైడ్రేషన్ వస్తుంది.

3) *అగ్ని తత్త్వం (Fire Element) – జీర్ణశక్తి + వేడి*  
ఈ తత్త్వం శరీరంలో జీర్ణశక్తి, శక్తి ఉత్పత్తి మరియు ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. మిరపకాయ, అల్లం, మసాలాలు, తేనె, కుంకుమపువ్వు వంటి పదార్థాలు అగ్ని తత్త్వాన్ని పెంచుతాయి. ఇవి శరీరాన్ని తేలికగా ఉంచుతాయి మరియు జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. ఎక్కువైతే వేడి, యాసిడ్ సమస్యలు వస్తాయి.

4) *గాలి తత్త్వం (Air Element) – కదలిక, ఊపిరితిత్తుల శక్తి*  
ఈ తత్త్వం మనం ఊపిరి పీల్చే విధానం, రక్త ప్రసరణ, శరీర చలనం మీద ప్రభావం చూపుతుంది. ఆకుకూరలు, మొలకలు, తేలికపాటి పండ్లు, వేపిన శెనగలు, కందిపప్పు వంటి పదార్థాలు గాలి తత్త్వాన్ని బలోపేతం చేస్తాయి. శరీరాన్ని తేలికగా, చురుకుగా ఉంచుతాయి. ఎక్కువైతే గ్యాస్, ఊబకాయం, నరాల బలహీనత వస్తాయి.

5) *ఆకాశ తత్త్వం (Space Element) – శరీర ఖాళీల నియంత్రణ*  
శరీరంలో స్థలం, ఖాళీలు, మానసిక స్థిరత్వం ఈ తత్త్వం మీద ఆధారపడి ఉంటాయి. కొబ్బరి నీరు, తేలికపాటి పండ్లు, మిలెట్స్, కీరా, బాదం, వాల్‌నట్స్ ఆకాశ తత్త్వాన్ని సమతుల్యం చేస్తాయి. ఇవి మనసును ప్రశాంతం చేస్తాయి. అధిక ఆకాశ తత్త్వం ఆకలి తగ్గడం, బలహీనతకు దారితీస్తుంది.

6) *పూర్ణాన్నాలు పంచభూతాల సమతుల్యాన్ని ఇస్తాయి*  
బియ్యం, రాగి, జొన్న, క్వినోవా, ఓట్స్ వంటి పూర్ణ ధాన్యాలు ఐదు తత్త్వాల్లో బ్యాలెన్స్ కలిగిస్తాయి. ఇవి రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి మరియు నిద్రమత్తు లేకుండా శక్తినిస్తాయి.

7) *పండ్లు – నీరు + గాలి తత్త్వాల ఆధారం*  
పండ్లలో నీరు అధికం, తేలికగా జీర్ణమయ్యేవి. కాబట్టి ఇవి నీరు, గాలి తత్త్వాల సమతుల్యాన్ని మెరుగుపరుస్తాయి. రోజూ రెండు రకాల పండ్లు శరీరాన్ని చురుకుగా ఉంచుతాయి.

8) *కూరగాయలు – గాలి + భూమి తత్త్వాలు*  
పచ్చి కూరలు గాలి తత్త్వాన్ని పెంచుతాయి, వేరుజన్య కూరగాయలు భూమి తత్త్వాన్ని పెంచుతాయి. రెండు రకాలూ శరీరానికి అవసరం. ఇవి శరీరానికి విటమిన్లు, మినరల్స్ అందిస్తాయి.

9) *పప్పులు – భూమి + అగ్ని తత్త్వాలు*  
పప్పులు బలం, ప్రోటీన్, జీర్ణశక్తి ఇస్తాయి. అధిక అగ్ని తత్త్వం ఉన్నవారికి తక్కువగా తినటం మంచిది. శాకాహారులకి ఇది ప్రధాన ప్రోటీన్ వనరు.

10) *పాలు – భూమి + నీటి తత్త్వాలు*  
పాలు శరీరానికి చల్లదనం, బలం ఇస్తాయి. రాత్రి గోరు వెచ్చని పాలులో తుమ్మెర కలిపితే అగ్ని తత్త్వం కూడా బ్యాలెన్స్ అవుతుంది. ఇది నిద్రను మెరుగుపరుస్తుంది.

11) *మసాలాలు – అగ్ని తత్త్వాన్ని పెంచేవి*  
మసాలాలు శరీరాన్ని వేడిగా ఉంచుతాయి మరియు జీర్ణక్రియను చురుకుగా చేస్తాయి. కానీ ఎక్కువైతే ఆమ్లత్వం వస్తుంది కనుక పరిమాణం ముఖ్యం.

12) *కొబ్బరి – నీరు + ఆకాశ తత్త్వాలు*  
కొబ్బరి నీరు, కొబ్బరి పాలు శరీరానికి చల్లదనం, తేలికనిచ్చే ఆహారం. ఇది శరీర వేడి తగ్గించి నాడీవ్యవస్థను ప్రశాంతం చేస్తుంది.

13) *నూనెలు – భూమి + అగ్ని తత్త్వాలు*  
తక్కువ మోతాదులో నూనె శరీరానికి అవసరం. నూనెలో ఉన్న భూమి + అగ్ని తత్త్వాలు కీళ్ళను లూబ్రికేట్ చేస్తాయి. అధికంగా తీసుకుంటే అగ్ని తత్త్వం పెరిగి acidity, బరువు పెరుగుదలకు దారితీస్తుంది.

14) *ప్రోటీన్ ఫుడ్స్ – భూమి తత్త్వం బలోపేతం*  
పప్పు, పాలు, గుడ్లు, చేపలు వంటి ఆహారం శరీర నిర్మాణానికి అవసరం. ఇవి పెరుగుదల, మరమ్మత్తు, బలం కోసం ముఖ్యమైనవి.

15) *మిలెట్స్ – పంచభూతాల సమతుల్యం*  
జొన్న, రాగి, కొర్ర వంటి మిల్లెట్స్ శరీరానికి బలం, నీరు, శక్తి అన్నిటినీ సమతుల్యం చేస్తాయి. డయాబెటిస్ ఉన్నవారికి చాలా ఉపయోగకరం.

*ముగింపు:*  
పంచభూతాలను అర్థం చేసుకుని ఆహారాన్ని ఎంచుకోవడం ఆరోగ్యం కోసం చాలా కీలకం. శరీరంలో భూతాలు బ్యాలెన్స్‌గా ఉన్నప్పుడు జీర్ణం మెరుగుపడుతుంది, నిద్ర బాగుంటుంది, రోగాలు దూరంగా ఉంటాయి. ప్రతి రోజు భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం తత్త్వాలు ఉన్న ఆహారం తీసుకుంటే జీవితం ఆరోగ్యంగా, చురుకుగా ఉంటుంది.

అయోధ్య..! గుడి నిర్మాణం సంపూర్ణం..! ధర్మధ్వజం విశేషం ఇదీ..!!*

*అయోధ్య..! గుడి నిర్మాణం సంపూర్ణం..! ధర్మధ్వజం విశేషం ఇదీ..!!*

వందల ఏళ్లుగా హిందూ జాతి ఆత్మాభిమానంతో పోరాడుతున్న అయోధ్య భవ్యమందిరం పూర్తయింది… ప్రాణప్రతిష్ఠ సమయానికి కేవలం గ్రౌండ్ ఫ్లోర్, గర్భగుడి మాత్రమే సిద్ధం కాగా… మిగిలిన అన్ని దశల నిర్మాణాలూ పూర్తయినట్టు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది… నిర్మాణ పరిపూర్ణతను చాటిచెప్పే ధర్మధ్వజం ఎగురవేతను మోడీ చేతుల మీదుగా ఈరోజు నిర్వహించారు…

అసలు ఏమిటి ఆ ధర్మధ్వజం..? కాషాయ రంగులో (Saffron) ఉంటుంది, ఇది హిందూ ధర్మంలో పవిత్రత, త్యాగం, ఆధ్యాత్మికతకు చిహ్నం…


ఆలయ శిఖరం ఎత్తు 161 అడుగులు ఉంటుంది. శిఖరం పైన ఉన్న ధ్వజస్తంభం దాదాపు 30 అడుగుల ఎత్తు ఉంటుంది. దీని కారణంగా జెండా మొత్తం 191 అడుగుల ఎత్తులో ఎగురుతుంది… జెండా సుమారు 22 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పు ఉంటుంది… ఇది ప్యారాచూట్ గ్రేడ్ నైలాన్, సిల్క్ వంటి మన్నికైన వస్త్రాలతో తయారు చేయబడింది, దీనివల్ల ఇది గాలి, వర్షం, తీవ్రమైన సూర్యకాంతిని తట్టుకోగలదు… దీన్ని చేతితో ఎంబ్రాయిడరీ చేశారు…

జెండాపై ఉన్న చిహ్నాలు, వాటి అర్థాలు

ధర్మధ్వజంపై మూడు ప్రధాన చిహ్నాలు ఉన్నాయి… సూర్యుడు… ఇది శ్రీరాముని సూర్యవంశ (సూర్య రాజవంశం) వంశానికి చిహ్నం… సూర్యుడు శాశ్వత శక్తి, దివ్య తేజస్సు, ధర్మం, జ్ఞానాన్ని సూచిస్తాడు…

‘ఓం’ చిహ్నం… హిందూ ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం ఇది దైవం మొదటి అక్షరం… బీజాక్షరం… ఇది సనాతన ధర్మంలోని శాశ్వత చైతన్యాన్ని, సత్యాన్ని సూచించే పవిత్రమైన ధ్వని… కోవిదార వృక్షం (కల్పవృక్షం) ఇది వాల్మీకి రామాయణం, హరివంశ పురాణంలో ప్రస్తావించబడింది… ఇది అయోధ్య రాజ చిహ్నంగా గౌరవించబడింది… సంక్షేమం, శ్రేయస్సుకు ప్రతీక…

ప్రస్తుతం మొదటి అంతస్తు, ఇతర ముఖ్య నిర్మాణ పనులన్నీ పూర్తి చేశారు… ఇందులో ఆరు అనుబంధ దేవాలయాలు… మహాదేవ్, గణేశ్ జీ, హనుమాన్ జీ, సూర్యదేవ్, మా భగవతి, మా అన్నపూర్ణలకు అంకితం చేయబడ్డాయి…

రామాయణంతో సంబంధం ఉన్న ఏడుగురు ప్రముఖుల పేరిట, భక్తుల సౌకర్యార్థం నిర్మించిన ఏడు మండపాలు కూడా పూర్తయ్యాయి… ఇవి మహర్షి వాల్మీకి, వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్త్య, నిషాదరాజ్, శబరి, అహల్యలకు అంకితం చేయబడ్డాయి…

మిగిలినవి… సంత్ తులసీదాస్ మందిరం… ప్రాంగణంలో జటాయువు, ఉడుత విగ్రహాలను ఏర్పాటు చేశారు… ఆలయం చుట్టూ భక్తుల సౌకర్యార్థం రోడ్ల నిర్మాణం, గ్రానైట్ ఫ్లోరింగ్ పనులు, 10 ఎకరాల పంచవటి ప్రాంతంలో ల్యాండ్‌స్కేపింగ్ (పచ్చదనం) పనులు పూర్తయ్యాయి…

భక్తుల దర్శనానికి సంబంధం లేని కొన్ని పనులు ఇంకా జరుగుతున్నాయి… 3.5 కిలోమీటర్ల పొడవైన ప్రహరీ గోడ (Boundary Wall), ట్రస్ట్ కార్యాలయం, అతిథి గృహం (Guest House), ఆడిటోరియం మొదలైనవి…

గుడి నిర్మాణం ఒకెత్తు.., అయోధ్యను ఓ అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చడానికి తగిన మౌలిక వసతుల నిర్మాణం మరో ఎత్తు… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వసతులను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి…

అంతర్జాతీయ విమానాశ్రయం (మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం, అయోధ్య ధామ్), పునరుద్ధరించబడిన రైల్వే స్టేషన్ (అయోధ్య ధామ్ జంక్షన్) తో పాటు, భక్తులు, పర్యాటకుల కోసం అయోధ్యలో అనేక వేల కోట్ల రూపాయల విలువైన సమగ్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి జరిగింది…

 మెరుగైన రోడ్లు , కనెక్టివిటీ… 

అయోధ్య పట్టణంలో ప్రయాణాన్ని సులభతరం చేయడానికి, రద్దీని తగ్గించడానికి (Decongest) చారిత్రక మార్గాలను విస్తరించి, కొత్త రోడ్లుగా అభివృద్ధి చేశారు…

రాం పథ్ (Ram Path): ఇది సహదత్‌గంజ్ నుండి కొత్త ఘాట్ వరకు విస్తరించి, పట్టణంలో కీలకమైన కనెక్టివిటీని అందిస్తుంది…
భక్తి మార్గ్ (Bhakti Path): అయోధ్య ప్రధాన రహదారి నుండి హనుమాన్ గర్హి మీదుగా శ్రీరామ జన్మభూమి ఆలయం వరకు భక్తులు సులభంగా చేరుకోవడానికి ఈ మార్గాన్ని అభివృద్ధి చేశారు…
ధర్మ మార్గ్ (Dharma Path): ఇది NH-27 నుండి నయా ఘాట్ వరకు కలుపుతుంది…
అయోధ్య బైపాస్ ప్రాజెక్ట్: 67.57 కి.మీ. పొడవు గల ఈ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టు, లక్నో, బస్తీ, గోండా వంటి ముఖ్య జిల్లాలను కలుపుతూ అయోధ్య నగరంలో సరకు రవాణా రద్దీని తగ్గిస్తుంది…
రవాణా, పార్కింగ్… 

ప్రపంచ స్థాయి బస్ టెర్మినస్: భక్తులు, సందర్శకుల సులభ రాకపోకల కోసం సుమారు ₹400 కోట్ల వ్యయంతో కొత్త బస్ టెర్మినస్‌ నిర్మాణం…
బహుళ అంతస్తుల పార్కింగ్ (MLCP): పర్యాటకుల వాహనాల కోసం మహర్షి అరుంధతి పార్కింగ్, కమర్షియల్ కాంప్లెక్స్‌తో సహా అనేక కొత్త పార్కింగ్ ప్రదేశాలు ప్రారంభించబడ్డాయి…
సరయూ నది, ఘాట్ల అభివృద్ధి…

ఘాట్ల పునరుద్ధరణ: గుప్తార్ ఘాట్, రాజ్‌ఘాట్ మధ్య కొత్త కాంక్రీట్ ఘాట్ల నిర్మాణం, పాత ఘాట్ల పునరభివృద్ధి పనులు జరుగుతున్నాయి…
రామ్ కీ పౌడీ: సరయూ నది ఒడ్డున ఉన్న ‘రామ్ కీ పౌడీ’ ప్రాంతానికి కొత్త రూపు ఇచ్చి, దాన్ని పర్యాటక ఆకర్షణగా మార్చారు…
క్రూయిజ్ కార్యకలాపాలు: సరయూ నదిలో క్రూయిజ్ (Cruise) కార్యకలాపాలు… అనేక ప్రైవేటు హోటళ్లు…

Wednesday, November 12, 2025

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

తాటి బెల్లం శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో ముఖ్యమైన ఖనిజాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ నుంచి రక్తహీనత నివారణ వరకు అనేక ఉపయోగాలు ఉన్నాయి.

### ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు

- తాటి బెల్లంలో ఎక్కువ ఫైబర్ ఉండడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది, మలబద్ధకం, అజీర్ణం సమస్యలు తగ్గుతాయి.
- ఇందులో ఉండే ఐరన్, మెగ్నీషియం రక్తహీనతను నివారించడంలో సహాయపడతాయి; హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతాయి.
- బ్రాహ్మణాలైన యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని విషపదార్థాల నుంచి కాపాడుతాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
- కాల్షియం, పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలు, దంతాలు బలపడతాయి.
- లివర్‌ను, శ్వాసకోశాన్ని, ప్రేగులను డిటాక్సిఫై చేస్తుంది, శరీరం శుద్ధి అవుతుంది.
- ముగాబద్ధకం, నెలసరి సమస్యలు, మైగ్రేన్, శరీరం వేడి వంటి వాటికి ఉపశమనం కలుగుతుంది.
- చిన్నపిల్లల నోటి పూత, గొంతు నొప్పి, దగ్గు, జలుబు వంటి సమస్యలకు కూడా సహాయపడుతుంది.
- శరీరానికి తక్కువ చక్కెరతో శక్తిని అందిస్తుంది, శక్తి స్థాయిలను మెరుగుపరుస్తుంది.
- చర్మానికి ఆరోగ్యం, మొటిమలు, మచ్చలు తగ్గుతాయి.
- నాడీ వ్యవస్థ నియంత్రణ, శరీరిణి వేడి తొలగించడం, శక్తినిచ్చే గుణాలు చాలా ఉన్నాయి.

### వాడకంలో జాగ్రత్తలు

- తాటి బెల్లం ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలు ఉండవచ్చు; అనేక స్టడీస్ మేరకు పరిమిత మోతాదులో ఉపయోగించాలి.

### పొడిపిచ్చిన తాటి బెల్లం ఉపయోగాలు

- టీ, కాఫీ, పండ్ల రసాలు వంటి వాటిలో రెగ్యులర్ షుగర్ బదులుగా వాడుకోవచ్చు.

తాటి బెల్లాన్ని రోజూ పరిమితంగా తీసుకుంటే శరీర ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంతో పాటు తన ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందవచ్చు.

Friday, November 7, 2025

ఆయుర్వేద పితామహుడు సుశ్రుతుడు గురించి విశేషాలు -

ఆయుర్వేద పితామహుడు సుశ్రుతుడు గురించి విశేషాలు -

 
జననం - క్రీ .పూ 1000 సంవత్సరం .
 జన్మస్థలం - వారణాసి .
 తండ్రి - విశ్వామిత్రుడు .
 గురువు - ధన్వంతరి . 
 రచనలు - సుశ్రుత సంహిత .
       
          ప్రాచీన వైద్య శాస్త్రంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మహానుభావుడు , ప్రముఖుడు . ప్రపంచంలో సాటిలేని మేటి శస్త్రచికిత్స నిపుణుడు ముఖ్యంగా ప్లాస్టిక్ సర్జరీ చేయడంలో నిష్ణాతుడు . ఇతని కాలం నాటికే అంటే దాదాపు 3000 సంవత్సరాల క్రితం నాడే వైద్యరంగంలో భారతదేశం నేటి ప్రపంచం కన్నా ఎంతో ముందు ఉన్నది. దీనికై ఎంతోమంది భారతీయ వైద్యశాస్త్రవేత్తలు ఈ వైద్యరంగానికి ఎనలేని సేవలు చేశారు .
               
       ప్రపంచం వైద్యశాస్త్రం గురించి కళ్లు తెరవకముందే వైద్యశాస్త్రాన్ని ప్రకాశింపచేసినది భారతీయులే . శస్త్రచికిత్సా రంగంలో ఉన్నత ప్రమాణాలతో కూడిన పరికరాలు ఉపయోగించడంలో సుశ్రుతుడు ఆద్యుడు అని చెప్పవచ్చు. దాదాపు 101 రకాల శస్త్రచికిత్సా పరికరాలను సుశృతుడు వివిధ సందర్భాలలో ఉపయోగించేవాడు . తెగిపోయిన అవయవాలను తిరిగి వాటి స్థానంలో అతికించడంలో సుశ్రుతుడుని మించినవారు మరొకరు లేరు .
       
         మొట్టమొదట శవపరీక్ష నిర్వహించింది కూడా ఈయనే . శవాన్ని పరిశీలించడం ఆ మరణం ఏ విధముగా సంభవించిందో నిర్ధారించడంలో సుశృతుడు కడు నిష్ణాతుడు . అదేవిధముగా చెడు రక్తాన్ని శరీరం నుండి తొలగించడంలోనూ , ఆరోగ్యవంతమైన రక్తాన్ని శరీరానికి అందించడంలోనూ , మూత్రనాళాల్లో , మూత్రపిండాలలో ఏర్పడిన రాళ్లను తొలగించడంలోనూ మరియు అనేక నిగూడ మరియు భయంకర రోగాలను అనతికాలంలో అతి సునాయాసముగా నయంచేయడంలో సుశ్రుతుడుది అందవేసిన చేయి .
                  
     సుశృతుడు రాసిన సుశ్రుత సంహిత నందు శల్యతంత్రం ( శస్త్రచికిత్స , సర్జరి ) గురించి మరియు అష్టాంగ వైద్యవిధానం గురించియు మరింకెన్నో విషయాలకు సంబంధించిన పలువివరాలను క్షుణ్ణంగా ఈ గ్రంథంలో సుశృతుడు వివరించిన కారణంగా ఈ గ్రంథం ప్రమాణ గ్రంధంగా గ్రహింపబడుతుంది. సుప్రసిద్ధ రససిద్ధుడు ఆచార్య నాగార్జునుడు ఈ గ్రంథం ప్రశస్తమైనది అని ప్రస్తుతించాడు . ఈ గ్రంథాన్ని క్రీ . పూ 800 వ సంవత్సరం నందు అరబ్ భాషలోకి అనువదించుకొని వెళ్లి వారివారి ప్రాంతాలలో వైద్యశాస్త్ర అభివృద్ది చేసుకున్నారు . రోమన్లు కూడా భారతీయ మౌళిక ఔషధవిధానాన్ని అనుసరించారు. 
        
     ఇప్పుడు మీకు ముక్కు తెగినప్పుడు సుశ్రుతాచార్యుడు సర్జరీ చేసే విధానం గురించి మీకు వివరిస్తాను.
 
    ముక్కు తెగినప్పుడు సుశ్రుతాచార్యుడు శస్త్రచికిత్స చేసిన విధానం - 
      
    చెట్టుయొక్క ఆకుని తీసి తెగియున్న ముక్కుభాగమును సరిగ్గా కొలతపెట్టి అంతప్రమాణం గల చర్మమాంసములు తో కూడిన పోరని దగ్గరగా ఉండు చెక్కిలి భాగం క్రిందనుండి మీదకి కోసి మీదభాగం పట్టు ఉండునట్లు ఉంచి ఆ పొరని ముక్కు యొక్క మొదలు వరకు పదునైన అంచుతో శస్త్రం తో గీచి రక్తం స్రవించునట్లు చేసి దానితో అంచులని అతికించి నాసారంధ్రములకు రెండింటికి తేలికైన గలగడ్డితో చేసిన గొట్టములని దూర్చి పైన ముక్కుయొక్క ఆకారంనకు సరిగ్గా ఆ కండపోరని సర్ది అప్రమత్తముగా , శీఘ్రముగా మీదకి ఎత్తి సూత్రాదులతో ( దారాలతో ) చక్కగా బంధనం చేసి దానిపైన రక్తచందనం , యష్టిమధూకం , రసాంజనం వీని చూర్ణంని చల్లి ఆ పైన తెల్ల దూదిపింజతో కప్పి నువ్వులనూనెని మాటిమాటికి వేసి తడుపుచుండవలెను . మరియు ఆ రోగికి జీర్ణం అయ్యేంత తగినంత నెయ్యిని త్రాగించి కొంచం స్థిమితపడిన తరువాత శాస్త్రానుసారం విరేచనం చేయించవలెను. 
         
        ఇలా చేయుచూ చక్కగా ఆ పోర అతుకుకున్న తరువాత అంతకు ముందు కొంచం పట్టు ఉంచిన కండ భాగాన్ని ఛేదించవలెను . ఇలా చక్కగా అతుకుకొనిన తరువాత కొంచం కృశించి ఉన్నచో ఆ భాగం నకు వెనక చెప్పిన తైలాది చికిత్సలను అనుసరించి ఆ భాగం పెరుగునట్లు చేయవలెను . ఒకవేళ అక్కడ మాంసం ఎక్కువుగా వృద్ధిచెంది యున్నచో సమముగా ఉండునట్టి ఉపాయం జూచి తగ్గించి సరిచేయవలెను . ఒక్కోసారి లలాటభాగం నందలి మాంసపుపొర కూడా కోసి అతకవలసి యుండును.
       
      ఈ విధముగా సుశ్రుతాచార్యుడు శస్త్రచికిత్సలు కడు ఉపాయంతో సులభముగా చెసెడివారు .  

       

Tuesday, November 4, 2025

పంచ ఇది ప్రపంచం యొక్క సమతుల్యతను సూచించే సంఖ్య.

జై గోమాత

పంచ” (అంటే ఐదు) అనే భావన భారతీయ తత్త్వశాస్త్రం, సంస్కృతి, వైద్యం, యోగం, వేదం, భౌతిక శాస్త్రం అన్ని రంగాలలో మూలసిద్ధాంతంగా ఉంది.

ఇది ప్రపంచం యొక్క సమతుల్యతను సూచించే సంఖ్య.



పంచభూతాలు....భూమి (Prithvi), జలం (Ap), అగ్ని (Tejas), వాయు (Vayu), ఆకాశం (Akasha). — ఇవి సృష్టి యొక్క భౌతిక ఆధారాలు.



పంచప్రాణా......లు........ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన — ఇవి శరీరంలోని శక్తి ప్రవాహాన్ని నియంత్రిస్తాయి



పంచఇంద్రియాలు (జ్ఞానేంద్రియాలు).......చెవి (శ్రవణం), చర్మం (స్పర్శం), కళ్ళు (దర్శనం), నాలుక (రుచి), ముక్కు (గంధం).



పంచకర్మేంద్రియాలు.........వాక్కు (మాట్లాడటం), పాణి (చేయి), పాదం (కాళ్లు), ఉపస్థం (ప్రజన), పాయువు (విసర్జన).



పంచతన్మాత్రాలు........శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం — ఇవి భూతాల సూత్రరూప మూలాలు.



పంచకోశాలు.......అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు.



పంచయజ్ఞాలు........దేవయజ్ఞం, పితృయజ్ఞం, భూతయజ్ఞం, మనుష్యయజ్ఞం, బ్రహ్మయజ్ఞం.



పంచపాతకాలు.......బ్రహ్మహత్య, సురాపానం, స్తేనం, గురుపత్నీగమనం, స్వర్ణస్థేయం.



పంచామృతం.........పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర.



పంచాంగం........తిథి, వార, నక్షత్ర, యోగ, కరణం.



పంచభక్ష్యాలు.......అన్నం, పాలు, కూరలు, పప్పు, నూనె — శారీరక సమతుల్యతకు అవసరం.



పంచనదులు.........గంగా, యమునా, గోదావరి, సరస్వతి, నర్మదా.



పంచరత్నాలు......మాణిక్యం, వజ్రం, పచ్చ, ముత్యం, నీలం.



పంచప్రాణధారాలు (యోగం)......ఐదు వాయువుల సమతుల్యత = ఆరోగ్య స్థితి.



పంచతంత్రం.......జీవన బోధనలతో కూడిన జ్ఞానసూత్రాలు.



పంచశీలాలు......అహింస, సత్యం, చోరీ చేయకపోవడం, వ్యభిచారం చేయకపోవడం, మద్యపానం మానడం



పంచమహాభూత సూత్రం (ఆయుర్వేదం)........శరీరం, వాత, పిత్త, కఫ సమతుల్యత.



పంచగవ్య........ ఆవు పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రము, గోమయము

“పంచ” అన్నది సమతుల్యతకు సంకేతం.



భౌతికంగా — భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం సమన్వయం.

ఆధ్యాత్మికంగా — మనస్సు, ప్రాణం, చైతన్యం, బుద్ధి, ఆనందం సమన్వయం.

పంచకులం అంటే సాధారణంగా “ఐదు వంశాలు / ఐదు ప్రధాన వృత్తులు / ఐదు దేవతల సమూహం” అని అర్థం.
దాని అర్థం సందర్భానుసారంగా మారుతుంది:
వేద కాలం → ఐదు వర్ణాలు
పురాణం → ఐదు వంశాలు
గో సంస్కృతి → ఐదు గో జాతులు
గ్రామ వ్యవస్థ → ఐదు వృత్తులు

ఇది ప్రపంచం యొక్క సమతుల్యతను సూచించే సంఖ్య.