Tuesday, January 20, 2026

సర్వరోగ నివారిణి.శొంఠి...

సర్వరోగ నివారిణి.
శొంఠి..._*
*_అల్లం పై పొట్టు ని తీసేసి సున్నపుతేటలో ముంచి ఎండబెడితే సొంఠిగా మారుతుంది._*

*_శొంఠిని సంస్కృతంలో ‘మహా ఓషది’ ‘విశ్వభేషజ’ అని కూడా అంటారు._*

*_ఈ భూమి మీద అతి విలువైన, అనేక రోగాలను ధ్వంసం చేయగల మహా మహా మూలికలలో ఈ శొంఠి అనేది ఒకటి._*

*_దీనిలోని అపూర్వమైన గుణాలను తెలుసుకున్న మన మహర్షులు దీని శక్తికి ఆశ్చర్యపోయి దీనికి‘మహా ఓషది’ అని అర్థం వచ్చేటట్లుగా ‘విశ్వభేషజ’ అని నామకరణం చేశారు._*

*_ప్రతి గృహిణీ శొంఠి ప్రయోజనాలని తెలుసుకుని ఉంటే తన కుటుంబ సభ్యులకు వచ్చే అనేక చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు తానే పరిష్కరించగలుగుతుంది._*

*_దీనిని లోనికి వాడిన తర్వాత ఇది శరీరం అంతా వ్యాపించి ప్రతి అవయవాన్ని మృదువుగా, లోపరహితంగా చేయడానికి తోడ్పడుతుంది._*

*_మానవునిలో జీవనశక్తిని (వ్యాధినిరోధక శక్తి) వృద్ధి చేస్తుంది._*

*_కడుపు ఉబ్బరాన్ని, గ్యాస్ ని తగ్గిస్తుంది._*

*_మూత్రపిండ రోగాలను తగ్గిస్తుంది._*

*_పురుషులకు వీర్యవృద్ధి చేస్తుంది._*

*_శ్వాశ రోగాలను, ఉదరశూలాలను, దగ్గులను, హృదయ రోగములను, బోదకాలను, వాత రోగములను తగ్గిస్తుంది._*

*_ఉదరములో గ్యాస్ ఎక్కువైనపుడు గుండెలో నొప్పి వస్తుంది. ఈ సమస్య కోసం పావు చెంచా శొంఠిపొడిని ఒక చెంచా తేనెతో కలిపి సేవిస్తూ ఉంటే గ్యాస్ తగ్గిపోయి గుండెనొప్పి కూడా తగ్గుతుంది._*

*_దోరగా వేయించిన శొంఠి పొడిని మేక పాలతో కలిపి సేవిస్తే విష జ్వరాలు తగ్గిపోతాయి._*

*_ఒకవైపు తలనొప్పి వచ్చేవారు శొంఠిని నీటితో కలిపి మెత్తగా నూరి నుదుటిపైన పట్టు వేస్తే ఆ నొప్పి తగ్గుతుంది._*

*_జాయింట్లలో వాపు (ఆమవాతము) వచ్చి విపరీతమైన నొప్పి తో బాధపడే వారు దోరగా వేయించిన శొంఠి పొడి అరచెంచా మోతాదుగా చెరకు రసంలో కలిపి సేవిస్తూ ఉంటే ఈ సమస్య తొందరగా తగ్గుతుంది._*

*_అదేవిధంగా శొంఠి పొడిని తిప్పతీగ సమూల రసం పావుకప్పులో కలిపి సేవిస్తూ ఉంటే దీర్ఘకాలిక ఆమవాత సమస్య తగ్గిపోతుంది._*

*_కొంతమందికి పొట్ట మందగించి ఆకలి కాకుండా ఉంటుంది. అలాంటి వారు దోరగా వేయించిన శొంఠి 50గ్రా, పాతబెల్లం 100గ్రా కలిపి మెత్తగా దంచి నిలువ ఉంచుకుని రోజూ రెండుపూటలా 5గ్రా మోతాదుతో సేవిస్తూ వస్తే మందాగ్ని హరించిపోయి మంచి ఆకలి పుడుతుంది._*

*_ఎక్కిళ్ళు ఎక్కువగా వచ్చే వాళ్ళు పావుచెంచా శొంఠిపొడి, పావు చెంచా కరక్కాయ పొడి రెండింటిని కలిపి ఒక కప్పు వేడినీటిలో వేసి రెండుపూటలా సేవిస్తూ ఉంటే దగ్గు,దమ్ము, ఎక్కిళ్ళు అన్ని తగ్గిపోతాయి._*

*_రక్తక్షీణత వల్ల వచ్చే పాండు రోగాలకు శొంఠిని నున్నని రాతి మీద అరగదీసిన గంధము 10గ్రా తీసుకుని దానిని 50గ్రా ఆవు నెయ్యిలో వేసి నెయ్యిని కరగబెట్టి దించి ఆ నెయ్యిని రోజు ఆహారంలో వాడుతూ ఉంటే పాండురోగము తగ్గి రక్తము వృద్ధి చెందును._*

*_పక్షవాతం ఉన్నవారు దోరగా వేయించిన శొంఠిపొడి, సైన్ధవ లవణం పొడి రోజూ మూడుపూటలా గోరు వెచ్చని నీటిలో గాని, తేనెతో గానీ కలిపి ఆహారం తర్వాత తీసుకుంటూ ఉంటే క్రమంగా పక్షవాతం తగ్గుముఖం పడుతుంది._*

*_మూత్రం కష్టంగా వచ్చేవారికి శొంఠి పొడి, సైన్ధవ లవణం కలిపి తీసుకుని పల్లెరుకాయలతో కాచిన ఒక కప్పు కషాయంలో కలిపి రోజూ రెండుపూటలా సేవిస్తూ ఉంటే మూత్రం ధారాళంగా వస్తుంది._*

*_నడుం నొప్పి ఉన్నవాళ్లు రోజు రాత్రిపూట నిద్రపోయేముందు చిటికెడు శొంఠి ని ఒక చెంచా వంటాముదంతో కలిపి తాగుతూవుంటే నడుము నొప్పి, పక్కటెముకల నొప్పి, ఉదరశూల తగ్గిపోతాయి._

No comments:

Post a Comment