Sunday, September 6, 2026

పొందాలి" అంటే ముందు "ఇవ్వాలి" - అంతా ఈ జన్మలోనే...

💰💸 సంపద విజయ రహస్యాలు 💸💰

*రహస్యం*

 అంశం: దానం - ప్రధానం


"పొందాలి" అంటే ముందు "ఇవ్వాలి" - అంతా ఈ జన్మలోనే...

మీరు మనస్ఫూర్తిగా ఆశించినంత సంపదను, మీరు హృదయ పూర్వంగా కోరుకున్న సంపదను, మీరు భౌతికంగా అనుభవించాలి అనుకున్న సంపదను, ఖచ్చితంగా పొందాలి అనుకుంటే, మీరు ఇతరులకు ఏదైన దానం చేయడం అనే "అవకాశం" ద్వారా అనంత విశ్వం ఆశీస్సులతో అనంత సంపదని పొందడానికి మార్గం సుగమం అవుతుంది.
ఇది సంపద విజయ రహస్యాలు...
 దానం చేస్తే పుణ్యం రాదు - దానం చేస్తే సంపద పొందుతారు. ఇది నిరూపించబడిన నిజం
(పుణ్యం అనేది విశ్వంలో లేదు)

 విద్య దానం - జ్ఞాన దానం - మహా దానం

బహిరంగ దానం, గుప్త దానం అని ముఖ్యంగా రెండు రకాల దానాలు ఉన్నాయి.

★ దానం(Donation) ఏదైనా ఇతరులకు అడిగినా, అడగకపోయినా, ఎవరికైనా వారి అవసరాలకోసం ఇవ్వడం.
★ దానం చేసిన వ్యక్తిని దాత(Donor) అంటారు. 
★ దానం తీసుకునే వారిని
గ్రహీతలు అంటారు.
★ దానం ఇమ్మని అర్ధించేవారిని యాచకులు అంటారు.

★ దానం ఇచ్చేవి ధనం, వస్తువు, ఆభరణాలు, భూమి, రూపంలో గాని సేవా రూపంలో గాని ఉంటుంది. దుస్తులు, పుస్తకాలు, బొమ్మలు, ఆహార పదార్ధాలు, వాహనాలు, పశువులు, మొదలైన వస్తువులు దానం చేస్తారు.

★ ఆపత్కాల దానం
 భూకంపం, వరదలు వంటి కొన్ని అత్యవసర పరిస్థితులలో మానవతాదృష్ట్యా వారి జీవనానికి అవసరమైన వాటన్నింటినీ కొందరు వ్యక్తులు, సంస్థలు బాధితులకు దానం అందిస్తాయి.

★ రక్త దానం(Blood Donation) అనేది ప్రాణ దానం తో సమానం. రోగ నివారణ గమ్యంగా పెట్టుకుని లేదా అత్యవసర పరిస్థితుల్లో ఒకరి రక్తం, మరొకరికి ఇచ్చే పద్ధతిని రక్త దానం అంటారు. ప్రపంచంలో చాల మంది తమ రక్తాన్ని దానం చేస్తారు.

★ అవయవ దానం  
 వైద్యంలో ఒక వ్యక్తికి అవసరమైన రక్తం, వివిధ అవయవాలను కొందరు దానం ఇచ్చే అవసరం ఉంది. 'అమ్మకం' అనకుండా 'దానం' అని ఎందుకు అన్నారంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నైతిక విలువల ప్రకారం ఒకరి శరీరంలో ఉన్న అవయవాలని కంటి పొర (Cornea), చర్మం (Skin), గుండె (Heart), మూత్రపిండం (Kidney), రక్తం, వగైరాలు మరొకరి అవసరానికి వాడ దలుచుకున్నప్పుడు వాటిని దాత స్వచ్ఛందంగా ఇవ్వాలే తప్ప వ్యాపార దృష్టితో అమ్మకూడదు.
 కళ్ళు, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు కూడా దానమిస్తున్నారు. దీనిని *అవయవ దానం (Organ Donation)* అంటారు. 

★ అన్న దానం
ఆకలితో ఉన్న వ్యక్తికి పిడికెడు అన్నాన్ని దానం చేసిన వ్యక్తి ధన్యుడు. ముఖ్యంగా కరువు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఇవి ఇంకా అవసరం. అలాంటి క్లిష్ట సమయాలలో అన్నదానం చేసిన వ్యక్తిని ప్రజలంతా దేవునితో సమానంగా పూజిస్తారు.

★ కన్యాదానం
కన్యాదానం వివాహంలో పెళ్ళికూతురు తండ్రి, కన్యగా తన కూతుర్ని ఇచ్చే దానం. వరకట్న ప్రభావం వల్ల ఇది కన్యతో పాటు ధన వస్తు కనక వాహన దానం గా కూడా పేరుగాంచింది.

★ భూదానం - గోదానం - సువర్ణ దానం
 వేదకాలంలో వందలలో, వేలల్లో ఆవులను దానం చేసేవారు. వందల ఎకరాలు భూమిని దానం చేసేవారు...
 తరువాతి కాలంలో చక్రవర్తులు, రాజులు, ప్రభువులు ప్రజలకు పశువులను, జీవాలను (గొఱ్ఱెలు, మేకలు మొ౹౹) దానం చేసేవారు. 
మొన్నటి వరకు కూడా భాగ్యవంతులు బంగారము, వెండి, రత్నాలు, ముత్యాలు కూడా దానం ఇచ్చారు. వేల రెట్లు సంపద పొదారు...

క్రైస్తవ, ముస్లీం, బౌద్ధ, హిందూ, యూదా, జైన మొదలగు అన్ని మతలలో, దానం గురించి చాలా చోట్ల ప్రస్తావన వస్తుంది...

 పురాణాలలో దానం 
◆ వైశాఖమాసము దానాలు ఇవ్వడానికి ప్రశస్తమైన మాసంగా పురాణాలు పేర్కొన్నాయి. 
◆ బలి చక్రవర్తి మూడడుగులు విష్ణుమూర్తికి దానం చేసి చిరస్మరణీయుడైనాడు.
◆ శిబి చక్రవర్తి పావురం రూపంలో వచ్చిన దేవతలకు తన శరీరాన్ని కోసి దానం ఇచ్చిన ఉత్తముడు.
◆ కర్ణుడు తనకు సహజంగా ఉన్నకవచకుండలాలను రక్షకకవచాన్ని దానం చేసి "దాన కర్ణుడి"గా నిలిచాడు.
◆ ఏకలవ్యుడు తన బొటనవేలును కోసి ఇచ్చాడు.

★ అపాత్రదానం
 మానవునికి ఉన్న సుగుణాలలో ఒకటి దానం చేయడం.
 దానం చేసే వ్యక్తి దానం స్వీకరించే వ్యక్తి దానం స్వీకరించడానికి తగిన పాత్రుడా కాదా అని ఆలోచించి లేదా రుజువు చేసుకొని అతను దాన స్వీకరణకు అర్హుడు అయినట్లయితే అతనికి దానం ఇవ్వాలి.
 దానం స్వీకరించే వ్యక్తి దాన స్వీకరణకు తగిన పాత్రుడు కానప్పటికి అతనికి దానం ఇచ్చినట్లయితే అటువంటి దానాన్ని అపాత్రదానం అంటారు.

★ దాతృత్వం:
 మానవులు దాన గుణం కలిగి వుండడం.
ప్రపంచంలో మాల్టా లైబీరియా ప్రజలకు దాన గుణం ఎక్కువట.
 వరల్డ్ గివింగ్ ఇండెక్స్ సంస్థ 153 దేశాల్లో నిర్వహించిన సర్వేలో శ్రీలంక, ఐర్లాండ్, కెనడా, గయానా, సియర్రా లియానే వాసుల్లో దానం చేసే లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది.

నేటి యుగంలో, నేటి సామాజిక పరిస్థితులో అన్నిటి కన్నా గొప్ప దానం:
 "విద్య దానం" - "ఉన్నత దానం"
 "జ్ఞాన దానం" - "మహోన్నత దానం"
మీ తోటి వారికి, మీకు తెలిసిన వారికి విద్యా దానం జ్ఞానదానం ఇవ్వండి, ఇప్పించండి. ఎన్నో రెట్ల సంపదను పొందండి. 

"పొందాలి" అంటే ముందు "ఇవ్వాలి" - అంతా ఈ జన్మలోనే...


No comments:

Post a Comment