Saturday, February 1, 2025

ఆహారపు రుచులు మరియు వాటివలన మానవ శరీరముకు కలుగు ఉపయోగాలు -

ఆహారపు రుచులు మరియు వాటివలన మానవ శరీరముకు కలుగు ఉపయోగాలు  - 

    రుచులు మొత్తం 6 రకాలు .  అవి 

  తీపి , పులుపు , ఉప్పు , చేదు , కారము , వగరు  అని 6 రకాలుగా ఉంటాయి. మనం తీసుకునే ప్రతి ఆహార పదార్థంలో ఈ ఆరు రుచులు అంతర్లీనంగా ఉంటాయి. మనుష్య శరీరం నందు రోగాలు పుట్టుటకు మరియు రోగాలు తగ్గుటకు మనకి ఈ ఆరు రుచులు సమ్మిళితమైన ఆహారమే ప్రధాన కారణం .

        ప్రథమంగా ముందు మన ప్రాచీన ఆయుర్వేదం లో మానవ శరీరం గురించి మీకు వివరిస్తాను.  మానవశరీరం నందు ఏడు చర్మములు , ఏడు ధాతువులు , ఏడు ఆశయాలు , ఏడు వందల శిరలు , అయిదు వందల పేశిలు , తొమ్మిది వందల స్నాయువులు , మూడు వందల ఎముకలు కాని చరకుడు వివరించిన దానిప్రకారం ఎముకలు మూడువందల ఆరు. పాశ్చాత్త్యా సిద్ధాంతం ప్రకారం రెండువందల పదియే కలవు. రెండు వందల పది సంధులు , నూట ఏడు మర్మస్థానములు , ఇరవైనాలుగు ధమనులు , మూడు దోషములు , మూడు మలములు , తొమ్మిది స్రోతస్సులు , పదహారు కండరములు , పదహారు సన్నని జాలములు అనగా సన్నని నరముల అల్లికలు , ఆరు కూర్చములు అనగా ఎముకల కట్టలు నాలుగు మరియు శిరల కట్టలు రెండు రకాలు . నాలుగు పెద్దతాళ్లు , ఏడు కుట్లు , పదనాలుగు ఎముకల కూటములు , పదనాలుగు సీమంతములు , ఇరువది రెండు శ్రోతస్సులు , రెండు ప్రేవులు , మూడున్నరకోట్ల రోమకూపములు.   ఇంత ఉత్క్రుష్టమైనది మానవశరీరం . నిద్రాహార విహారాలలో మార్పులు మరియు హెచ్చుతగ్గుల వలన శరీరంలో రోగాలు సంభవిస్తాయి.

           కొన్ని రకాల ద్రవ్యములను తినిన యెడల శరీరంలో రోగాలు నశించగలవు. కొన్నిరకాల ఆహారపదార్థాలను తినిన యెడల శరీరం నందు కొత్తకొత్త రోగాలు పుట్టును . అసలు రోగం అంటే ఏంటో మీకు తెలియచేస్తాను .శరీరధారకములు అగు వాత, పిత్త, శ్లేష్మములలో ఉండవలసిన ప్రమాణం కంటే హెచ్చుతగ్గులు ఉండుటయే రోగం . 

          మనం తీసుకునే ప్రతి ఆహారం 6 రకాల రుచులతో సమ్మిళతం అయి ఉంటుంది అని చెప్పాను కదా .  ఇందులో మొదటివగు తీపి , పులుపు , ఉప్పు ఇవి వాత దోషమును పోగొట్టును . చేదు , కారం , వగరు ఇవి కఫాన్ని హరించును . వగరు, చేదు , తీపి రసములు పిత్తదోషమును హరించును . ఆహారం జీర్ణం అయిన తరువాత వేడిచేయుట , చలువచేయుట అను రెండు విధాలుగా మాత్రమే ఉండును.  

     ఇప్పుడు మీకు రుచులు వాటి యొక్క గుణాలు తెలియచేస్తాను .

  మధురరస గుణములు  - 

 *  తీపిగా ఉన్న పదార్థాలను తినటం వలన , పుట్టినప్పటి నుండి అలవాటు పడిన సప్త ధాతువులకు బలం కలుగును.

 *  చిన్నపిల్లలకు , ముసలివారికి , దెబ్బలు తగిలిన వారికి , బలం క్షీణించినవారికి , రక్తమాంసములు క్షీణించినవారికి తీపి పదార్థాలు చాలా హితకరం అయినవి.

 *  శరీరవర్ణం పెరుగుటకు , వెంట్రుకల వృద్ధికి , ఇంద్రియ బలం పెరుగుటకు , ఓజస్సు వృద్ది చెందుటకు ఈ మధుర రసం ఉపయోగపడును.

 *  శరీరంకి మంచి పుష్టిని ఇచ్చును.

 *  కంఠస్వరం పెరుగును .

 *  బాలింతలగు స్త్రీలకు ఎండిపోయిన పాలను వృద్ది పరుచును.

 *  ఆయుష్షుకు కారణం , ప్రాణరక్షణకరమైనది .

 *  వాత, పిత్త, విషాలను హరించును . 

  గమనిక  - 

          ఈ మధుర రసమును అధికంగా వాడిన మేధస్సుతో కూడిన కఫ వ్యాధులను పుట్టించును .శరీరం లావెక్కును . అగ్నిబలం తగ్గును అనగా జఠరాగ్ని తగ్గును. ఇరువది అగు మేహరోగాలు జనించును. అర్బుదం అనగా గడ్డతో కూడిన కేన్సర్ వచ్చును.

 ఆమ్లరసం గుణములు  - 

 *  ఈ ఆమ్లరసం ( పులుపు ) అగ్నిదీప్తి అనగా జఠరాగ్ని పెంచును.

 *  హృదయముకు బలమునిచ్చును.

 *  ఆహారాన్ని అరిగించును.

 *  రుచిని పుట్టించును . 

 *  శరీరం నందు వేడి కలుగచేయును .

 *  మలాన్ని విడిపించును.

 *  తేలికగా జీర్ణం అగును.

 *  కడుపులో బిగిసి ఉన్న వాయువుని బయటకి వెడలించును.

  గమనిక  - 

        దీనిని అధికంగా వాడినచో కఫమును పెంచును , రక్తపిత్త వ్యాది అనగా నోటివెంట రక్తం పడువ్యాధిని పుట్టించును , శరీర అవయవాల పట్టు సడలించును , తిమ్మిరి , భ్రమ , దురదలు , పాండురోగం , విసర్పవ్యాధి , శరీర భాగాల్లో వాపు , దప్పిక, జ్వరం వంటి వ్యాధులను పుట్టించును . 

 
  లవణ రస గుణాలు  - 

 *  ఈ లవణ రసం శరీరంలో స్తంభించిన దోషాన్ని విడిపించి బయటకి పంపును . 

 *  జఠరాగ్ని పెంచును.

 *  చమురు కలది.

 *  చెమట పుట్టించును . 

 *  తీక్షణమైనది , రుచిని పుట్టించును . 

 *  వ్రణములు అనగా గడ్డలు పగిలేలా చేయును .

 *  శరీరం నందు మలినపదార్థాలు విడగొట్టి బయటకి పంపును 

  గమనిక  - 

           ఈ లవణ రసాన్ని అధికంగా వాడటం వలన వాతారక్త వ్యాధిని కలిగించును . బట్టతలను తగ్గించును .  వెంట్రుకలు నెరిసిపోవును , శరీరం ముడతలు పడును. దప్పికను కలిగించును , కుష్టు రోగము కలుగును. విసర్పి రోగం కలుగును. బలమును  హరించును .

 
  తిక్త ( చేదు ) రస గుణాలు  - 

 *  ఇది అరుచిని హరించును .

 *  శరీరం నందలి క్రిములను , దప్పిక , విషమును , కుష్టు , మూర్ఛని హరించును . 

 *  మూర్చ, జ్వరాలను , శరీరం నందలి మంటలను, వేడిని , కఫాన్ని హరించును .

 *  శరీరం నందలి వ్రణాల నుండి కారు దుష్టజలాన్ని , మాంసం నందలి కొవ్వుని కరిగించును. ఎముకల్లో మూలుగను , శరీరంలో మలమూత్రాలను హరించును .

 *  తేలికగా జీర్ణం అగును.

 *  బుద్దిని పెంచును.

 *  చమురు హరించును .

 *  స్త్రీల పాలు యందు మరియు కంఠం నందలి దోషాలు పొగొట్టును.

  గమనిక  - 

          అధికంగా తీసుకున్న ధాతువులను క్షీణింపచేసి వాత రోగాల్ని పుట్టించును .

 
  కటు ( కారం ) రసం గుణాలు  - 

 *  ఈ కటు రసం కంట రోగం , కుష్టు , వాపు పోగొట్టును .

 *  వ్రణములు తగ్గించును 

 *  శరీరం నందలి దుష్ట జలాన్ని , కొవ్వుని హరించును . 

 *  జఠరాగ్ని పెంచును.

 *  అన్నమును జీర్ణింపచేయును .

 *  రుచిని పుట్టించును .

 *  సన్నని నరములలోని దోషాలు కూడా శోధించి వ్యర్థాలను బయటకి పంపును .

 *  నవరంధ్రాలు ను తెరిపించును.

 *  కఫాన్ని హరించును .

 
 గమనిక  - 

        దీనిని అతిగా తీసుకున్నచో దప్పిక పుట్టించును . శుక్రమును , బలాన్ని నశింపచేయును. మూర్చని కలిగించును. అంగములు ముడుచుకున్నట్లు చేయును . వణుకు పుట్టించును .నడుము , వీపు నందు నొప్పి కలుగచేయును .

  కషాయ ( వగరు ) రస గుణములు  - 

 *  వగరు పదార్థం పిత్తశ్లేష్మాలని హరించును .

 *  రక్తాన్ని శుద్దిచేయును .

 *  నొప్పిని కలిగించును.

 *  వ్రణాలను మాన్చును.

 *  శరీరం నందలి దుష్ట జలాన్ని తీసివేయును .

 *  ఆమమును స్తంభింపచేయును .

 *  మలాన్ని గట్టిపరుచును.

 *  చర్మాన్ని నిర్మలంగా చేయును .

 
  గమనిక  - 

       దీనిని అతిగా సేవించిన మలబద్దకం , కడుపు ఉబ్బరం , గ్యాస్ , గుండెజబ్బులు , దప్పిక, లివరు చిక్కిపోవుట, సంభోగ శక్తిని నశింపచేయును . మలబద్దకం కలిగించును.

       పైన చెప్పిన విధంగా మనం తీసుకునే ఆహార పదార్థం యొక్క రుచిని బట్టి మన ఆరోగ్యం అధారపడి ఉండును.  


  

కాకరకాయ ఉపయోగాలు -

కాకరకాయ ఉపయోగాలు - 

     కాకరకాయలో రెండు రకాలు కలవు. పెద్ద కాకర , పొట్టికాకర అని పిలుస్తారు . పెద్ద కాకర కాయలో రెండురకాలు కలవు. అవి ఆకుపచ్చ కాకర మరియు తెల్లకాకర కాయల రకం ఒకటి . 

           వంకాయలో తెల్ల కాకర కాయలు అపథ్యమై ఉండగా కాకర కాయల్లో తెల్లనివి అత్యంత శ్రేష్టమైనవి. కాకరకాయ స్వస్థకరం అయినది. రసాయనిక గుణం కలది. జీర్ణశక్తిని కలిగిస్తుంది. కాకరకాయలు పైత్యశాంతిని కలిగించును. ఎముకలలో మూలుగుకు బలాన్ని చేకూర్చే గుణం కలదు. 

                  కాకరకాయ గురించి ప్రసిద్ధ ఆయుర్వేద గ్రంధం "సర్వఔషధి గుణకల్పం " ఈవిధంగా వివరిస్తుంది. " కాకర కాయ కొంచం కాకచేయును .సర్వరోగాలను పోగొట్టును . నేత్రాలకు మేలు చేయును . లఘువుగా ఉండును. అగ్నిదీప్తిని ఇచ్చును " అని వివరణాత్మకంగా ఇచ్చెను . మరొక ప్రసిద్ద గ్రంథం " ధన్వంతరి నిఘంటువు " నందు కూడా కాకరకాయ విశేషగుణ ధర్మాల గురించి వివరణలు ఉన్నాయి . దానిలో కాకరకాయ శీతవీర్యం , తిక్తరసం కలిగి ఉండును. గట్టిపడిన మలాన్ని బేధించును. లఘువుగా ఉండి వాతాన్ని కలుగచేయకుండా ఉంటుంది. పెద్దకాకర కొంచం వేడిచేయును . రుచిని పుట్టించి సర్వరోగాలను పోగొడుతుంది . నేత్రాలకు మేలుచేయును . అగ్నిదీపనకరమై ఉండును. అని కాకర యొక్క విశేష గుణాల గురించి వివరించెను .  

               కుక్క , నక్క మొదలగు జంతువులు కరిచినప్పుడు పైకి కట్టడానికి , లోపలికి సేవించడానికి కాకర ఆకు , కాయ , పండు మంచి ఉపయోగకరములై ఉండును . కాకరకాయలు సాలెపురుగు విషాన్ని కూడా విరిచేస్తాయి. కాకర చేదుగా ఉండటం వలన రక్తశుద్ధి చేయును . కాకర కాయల కూర వీర్యస్తంభనమైనది. 

        చర్మవ్యాధులు ఉన్నవారు కాకరకాయను తరుచుగా వాడటం వలన రక్తశుద్ధిని కలుగచేయును . పొడుగు కాకరకాయలు అగ్నిదీప్తిని కలిగించును. లేత కాకరకాయల కూర త్రిదోషాలను హరించును . ముదురు కాయల కూర విరేచనకారి. పొట్టి కాకరకాయలు కూడా ఇంచుమించు ఇదే గుణాన్ని కలిగి ఉండును. కాని ఇవి మిక్కిలి చేదుగా ఉండును. ఆకలిని పుట్టిస్తాయి. 

                కాకరకాయలు ముక్కలుగా కోసి ఎండబెట్టి వరుగు చేసి నిలువచేసుకొంటారు . ఈ వరుగు నేతితో వేయించుకొని తింటే చిరుచేదుగా ఉండి త్రిదోషాలను పోగోట్టును కొన్ని ప్రాంతాలలో కాయలనే కాకుండా పండిన కాకరకాయలు ను కూడా కత్తిరించి వరుగు చేసి నిలువచేస్తారు . ఈ వరుగు కఫవాతాన్ని తగ్గించి పిత్తాన్ని పెంచును. జఠరాగ్ని పెంపొందింపచేయును . కాసను తగ్గించును. రుచిని పుట్టించును. 

             కాకరకాయలను శరీరం నందు వేడి కలిగినవారు వాడకుండా ఉంటే మంచిది . శరీర బలానికి మందు తీసుకునేవారు పెద్ద కాకరకాయతో చేసిన వంటకాలు వాడకూడదు. అలా వాడటం వలన బలం పెంచే మందు శరీరానికి పట్టదు. 

    కాకరకాయకు విరుగుడు వస్తువుల్లో ప్రధానం అయినది పులుసు . అందుకే కాకరపులుసు , పులుసుపచ్చడి దోషరహితం అయి ఉంటుంది. కాకరకాయ పులుసుతో పాటు నెయ్యి , ఆవాలు , దోసకాయ కూడా విరుగుడు వస్తువులు . 


  

గుండె జబ్బులు - ఆహార నియమాలు - ఔషధాలు

గుండె జబ్బులు  -  ఆహార నియమాలు - ఔషధాలు 

 గుండెజబ్బు రావడానికి గల కారణాలు -

 *  అతిగా ఆవేశపడటం.
 
 *  ఎక్కువుగా ఉన్న వేడి పదార్దాలు తినడం.
 
 *  పులుసు , వగరు ఉన్న రుచులు ఎక్కువ ఉన్న పదార్దాలు తినడం.

 *  విచ్చలవిడిగా కామకలాపాలు సాగించడం .

 *  అతిసారం 

 *  జీర్ణకోశం లో  వ్రణాలు .
 
 *  విషపదార్దాల సేవనం .
 
 *  మానసిక ఆందోళన .

 *  రక్తపోటు .

 *  కొవ్వు పేరుకొని పోవడం.

 *  అధికంగా గోంగూర వాడటం.

   మొదలైన వాటివల్ల గుండె జబ్బులు వస్తాయి.

   గుండె రోగులు పాటించవలసిన నియమాలు -

 *  ఎప్పుడు పాత బియ్యమే ఆహారంగా ఉపయోగించాలి. దంపుడు బియ్యమే శ్రేష్టం .

 *  మేక మాంసం , అడివి పక్షుల మాంసం , అడివి మృగాల మాంసం తో తయారైన మాంస రసాలు త్రాగవచ్చు. 

 *  అల్లం, ఉప్పు, కొద్ది కారం , కొద్దిగా యాలుక్కాయలు , లవంగాలు , దాల్చిన చెక్క, ఇవన్ని కలిపి నూరి ఆ మిశ్రమాన్ని మాంసం ముక్కలకు రాసి ఎండబెట్టాలి. ఎండిన తరువాత చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఆవునేయ్యిలో వేయించుకొని తినవచ్చు.

 *  పులుపు, వగరు రుచులు బాగా తగ్గించాలి.

 *  కందికట్టు, పెసరు కట్టు, ఉలవ కట్టు వాడవచ్చు.

 *  బీర, కాకర, క్యాబేజీ , టమాటో , లేత ముల్లంగి పొట్లకాయ , లేత అరటికాయ , పొన్నగంటి కూర , పెరుగుతోట కూర , మెంతి కూర , సొరకాయ , దోసకాయ తినాలి .

 *  మామిడి పండ్లు, దానిమ్మ పండ్లు , బత్తాయి రసం ( కలకండ రసం కలిపింది.) నారింజ రసం , ద్రాక్ష రసం వాడవచ్చు.

 *  ఆవుపాలు, ఆవునెయ్యి , ఆవుమజ్జిగ , పాతబెల్లం , తేనె , ద్రాక్షారిష్ట, అర్జునారిష్ట , వెల్లుల్లి , అల్లం వాడవచ్చు. 

   గుండె రోగులు మానుకోవలసినవి   - 

 *  కొత్తబియ్యం అన్నం తినకూడదు .

 *  పెరుగు వాడరాదు . మజ్జిగ వాడవలెను.

 *  పులుపు, వగరు రుచులు బాగా తగ్గించాలి.

 *  ఎప్పుడు దాహం , వాంతి రాకుండా చూసుకోవాలి .

 *  మలమూత్రాలు ఎక్కువసేపు ఆపకుండా వచ్చినవెంటనే విసర్జించాలి.

 *  దగ్గు, తేన్పులు , అపానవాయువు వీటిని ఆపకూడదు .

 *  పుల్లలతో పండ్లు తోముకోకుడదు.

 *  పొగత్రాగటం పూర్తిగా మానుకోవాలి.

 *  మద్యం, గేదపాలు అసలు పనికిరావు.

 *  తాంబూలం వేసుకొకుడదు .

 *  ఆవకాయ తినడం అత్యంత ప్రమాదకరం .

       పైన చెప్పిన ఆకుకూరలు తప్ప మిగిలనవి బాగా తగ్గించడం శ్రేయష్కరం .

గుండె నొప్పి మరియు గుండెబలమునకు సిద్ధఔషధ యోగాలు  - 

 *  తమలపాకు జీర్ణాశయమునకు మరియు హృదయమునకు బలాన్ని కలిగించును. 

 *  మునగచెక్క రసము నందు కొంచం ఇంగువ చేర్చి ఇచ్చిన గుండెనొప్పి తగ్గును. 

 *  గులాబీల నుండి తయారుచేసిన పన్నీరు గుండెదడ , గుండెపోటు , ఆయాసములను తగ్గించును . 

 *  అంజూర పండ్ల రసమును రోజుకు ఒకసారి తీసుకున్నచో గుండెకి , ఊపిరితిత్తులకు బలాన్ని కలుగచేయును . 

 *  ద్రాక్షపండ్ల రసము గుండెకు , మూత్రపిండాలకు బలాన్ని కలుగచేయును . 

 *  ఒక ఔన్స్ సొంపు కషాయంలో రెండు చెంచాల పంచదార కలిపి రోజుకు రెండుసార్లు పుచ్చుకున్న ఛాతినొప్పి , ఉపిరి తీసుకునేప్పుడు నొప్పి , గుండెనొప్పి తగ్గును. 

 *  ఖర్జుర పండు గుండె , ఊపిరితిత్తులు , మూత్రపిండములు , లివర్ మొదలగు శరీరావయములకు మిక్కిలి ఉత్తేజాన్ని కలిగించి బలమును , పుష్టిని ఇచ్చును . 

 * ప్రతినిత్యం ఉదయాన్నే ఒక అంజూరపండు తినుచున్న గుండెదడ , ఆయాసం తగ్గును. 


పశుసంబంధమైన ధర్మసూత్రములు -

పశుసంబంధమైన ధర్మసూత్రములు  -

 *  పశువుల కాపరికి యజమాని కూలి ఇవ్వనిచో యజమానికి పది ఆవుల పాలు పిండి ఇచ్చి తానొక్క ఆవుపాలు కూలికింద తీసుకొనవచ్చు . జీతము లేనప్పడుదియే కూలి .

 *  కంటికి కనపడనిది , పురుగులచే , కుక్కలచే తినబడినది , పల్లపు గుంటలు మొదలగు వానిలో పడి చచ్చినది , కాపరి లేనప్పుడు పారిపోయినది అయిన పశువులకు పశుకాపరిదే భాద్యత. కాపరి తెచ్చి ఇవ్వవలెను.

 *  దొంగలు దొమ్మిచేసి పశువులను అపహరించుకు పోయిన విషయము కాపరి వెంటనే యజమానికి దగ్గరలో ఉన్నప్పుడే చెప్పినచో కాపరి యజమానికి పశువులను ఇచ్చుకోవాల్సిన బాధ్యత లేదు .

 *  చచ్చిన పశువు చెవులు , చర్మం , తోక , వెంట్రుకలు , గోరోచనము వీటిని యజమానికి ఇవ్వవలెను. తక్కిన గిట్టలు , కొమ్ములు మున్నగునవి అన్నియు యజమానికి చూపించి మరలా తాను తీసికొనవలెను.

 *  దారిలోను , బూడిదలోను , గోవుల మందలోను మలమూత్రాలను విసర్జించరాదు . గోవుకి ఎదురుగా మలమూత్రాలను విసర్జించరాదు.

 *  నీరు తాగుచున్న ఆవును గాని , పాలు తాగుచున్న దూడను గాని నివారించరాదు. పాలు తీయునప్పుడు మూత్రం పోయుటను నివారించవచ్చు. ఇతరుల దూడలు పాలు తాగుచున్నప్పుడు వారికి చెప్పకూడదు. ఇంద్రధనుస్సును ఆకాశమున చూచి ఆ దోషమును ఎరిగిన వాడై ఉండి ఇతరులకు చూపరాదు.

 *  తుంటరివి , ఆకలిరోగములు గలవి , కొమ్ములు లేనివి , గుడ్డివి , గిట్టలు లేనివి , తోకలేనివి అగు వృషభములను కట్టిన బండ్లలో ప్రయాణం చేయరాదు .

 *  మచ్చికపడినవి , వడిగా నడుచునవి , శుభలక్షణాలు కలిగినవి , వన్నెయు , ఆకారం కలిగి ఉండునవి అగు ఎద్దులను గట్టిన బండ్లలో మునికోలతో పొడవవలెను.

 *  చతుష్పాద జంతువు విషయమై అపద్ధం చెప్పినవాడు అయిదుగురు బంధువులను , గోవు విషయమై అపద్ధం చెప్పినవాడు పదిమందిని, గుఱ్ఱముల విషయమై అపద్ధం చెప్పినవాడు వంద మందిని , మానవుల విషయమై అపద్ధం చెప్పినవాడు వెయ్యిమంది బంధువులకు చంపిన పాపమును పొంది నరకమునకు పోవును .

 *  ఈని పది దినములు గూడ గడవని గోవులను , చక్రము , శూలము మొదలగు గుర్తులు వేసి విడిచిన ఎద్దులను , హరిహరాదుల ముద్రలు వేసి ఉన్న ఎద్దులను , కాపరులతో ఉన్నను లేక పొలము నందు ప్రవేశించి నస్యములను తినుచున్నను వానిని దండింపరాదు.

 *  గోవుల పైన కూర్చుని స్వారి చేయరాదు . కాని బండికి కట్టవచ్చు.

 *  ఎవడు జంతువులను కట్టుట, చంపుట, వంచుట చేయుటకు ఇష్టపడడో అతడు సకల భూతములకు హితము గోరువాడు ఎల్లప్పుడూ తరగని మోక్షరూపం అగు ఆనందమును పొందును.

 *  బ్రాహ్మణుల గోవులను అపహరించినప్పుడు , గొడ్డుటావులతో బరువులు మోయించుటకై ముక్కుత్రాడు వేసినప్పుడు , యాగముల కొరకు పశువులను అపహరించినప్పుడు వెంటనే అపహరించినవాని కాలు సగము నరికివేయవలెను .

 *  మార్గములో గ్రామ సమీపేతర ప్రదేశమునందలి పొలములలో గోవులు మేసినచో  కాపరి కి జరిమానా వేయవలెను . తరువాత గోవులు తినిన మేతఫలమును కాపరి గాని , యజమానిగాని పొలము యజమాని కి ఇవ్వవలెను.

 *  వెంటనే ఊడ్చుట, గోమయముతో అలుకుట , గోమూత్రము మున్నగునవి చల్లుట , పైమట్టి ఎత్తి తవ్వి ఎత్తిపోయుట , గోవుని ఒక రాత్రి , ఒక పగలు కట్టివేయుట  ఈ అయిదింటిచేత భూమి పరిశుద్ధతనొందును.

 *  వర్షం కురియుట వలన నేలను చేరునవి , పశువుల తాగగానే దప్పిక తీరునవి , గంధము , రసము , రంగు వానితో కూడిన ఉదకములు అనగా నీళ్లు పరిశుద్ధములు.

 *  సకల జంతువుల ప్రాణ సంరక్షణార్థమై రాత్రిగాని , పగలుగాని ఎల్లప్పుడూ తన శరీరముకు కష్టం కలిగినను భూమిని చూచుచు  నడవవలెను .

 *  ఒక గ్రామము చుట్టును నూరు ధనువులంతా ( ధనువు అనగా నాలుగు మూరలు ) ప్రదేశము పశువుల మేతకును , గాలి మొదలగు వీచుటకు భూమి బీడుగా వదలవలెను. పట్టణం అయినచో దీనికి మూడురెట్లు ప్రదేశం బీడుగా వదలవలెను .

 *  పైన చెప్పిన బీడు భూమి చుట్టూ ఆవరణ లేక పైరు సరిగ్గా లేని స్థలము నందు గోవు మేసిన యెడల ఆ కాపరిని గాని , యజమానిని గాని దండించరాదు.

 *  పశువుల మేయు బీడు భూమి చుట్టు నుండు ఆవరణ ఒంటెలు తలయెత్తి చూచిన లోపలి ప్రదేశము కనపడని యంతఎత్తున చుట్టూ రక్షణ ఏర్పరచవలెను . కుక్కలు , పందులు లోపల దూరకుండా కిందవైపు సందులను మూయవలెను .

 *  గ్రామసమీపాన దారికి దగ్గరగా ఉండు చుట్టూ వేసిన ఆవరణలో గోవులు దూరి మేసినచో ఆ గోవుని దండింపక గోపాలకునికి జరిమానా విధించవలెను .

 *  ఎండకాయుచున్నను , వర్షం కురియుచున్నను , ముందుగా శక్తికొలది గోవులను సంరక్షించిన తరువాతయే తన్ను రక్షించుకొనవలెను .

 *  గోవును దర్భ తాళ్లతో , రెల్లు తాళ్లతో దక్షిణాభిముఖముగా కట్టివేయవలెను . ఈ తాళ్లకు నిప్పు అంటుకొని కాలిపోయినను గోవు చిన్న గాయాలతో బయటపడును . కట్టివేసినప్పుడు గోవు అగ్నిచేత దగ్ధం అయినపుడు ప్రాయశ్చిత్తం ఏమియును లేదు .

 *  రాజ్యము నందు గోవులు దీనంగా ఉన్నయెడల రాజులకు అశుభం. కాళ్లతో భూమిని గోకిన రోగములు సంభవించును . కనుల నుంచి నీరు కార్చుచున్న మృత్యువు కలుగును. యజమాని చూచి భయపడి అరిచినచో దొంగలు వస్తారు.

 *  కారణం లేకుండా గోవు అరుచుచున్న అనర్థం కలుగును. రాత్రివేళ అయినచో భయం కొరకగును. ఎద్దు అరిచినచొ శుభం కలుగును. ఈగలచే గాని , కుక్కలచేగాని మిక్కిలి విరుద్ధమై అరిచినచో వెంటనే వర్షం కురియును.

 *  గోవులు అంబా అనుచూ ఇంటికి వచ్చిన గోశాల వృద్ది అగును. గోవులను సేవించుచూ వచ్చిననను గోశాల వృద్ది అగును. తడిసిన అవయవములతో గాని , నిక్కబొడిచిన వెంట్రుకలతో గాని సంతసించుచూ వచ్చిన గోవులు మంచివి. ఈ రీతినే గేదెలు కూడా ఉండును .

 *  చూలుతో ఉన్నట్టియు, తగిన వెలకు దొరికినట్టియు , దానము వలన దొరికినట్టియు , కూలి సొమ్ముల వలన దొరికినట్టియు , యుద్ధాదులలో గెలిచి తెచ్చినవియు , ఇంటబుట్టినవియు , ఏదేని వ్యాధిచే యజమాని వలన విడకాబడినవియు , తానుపోషించునవియగు గోవులు మిక్కిలి మంచివి.

 *  దూడలేని ఆవుపాలు , గర్భముతో ఉన్న గోవుని పితకరాదు. ఈనిన పది దినముల వరకు పాలు పితికినవాడు నరకమునకు పోవును .

 *  బలం లేనిదియు , వ్యాధిగ్రస్తం అయినదియు , పొర్లినదియు , కవల దూడలు పెట్టినదియు అగు గోవు పాలు పితకరాదు .

 *  పుట్టిన రెండు నెలల వరకు దూడను తీయకుండానే పాలు పితకవలెను . మూడొవ నెలలో రెండు చన్నులు దూడకు వదిలి రెండు చన్నులు పితకవలెను. నాలుగొవ నెలలో మూఁడు భాగములు యజమాని తీసుకుని ఒక భాగము దూడకు విడిచిపెట్టవలెను . అటు తరువాత పశువు యొక్క బలాబలాలను బట్టి పాలు తీసుకొనుట మంచిది .

 *  ఆషాడ పౌర్ణమి, ఆశ్వయుజ పౌర్ణమి, పుష్యపౌర్ణమి , మాఘపౌర్ణముల యందు పాలు పితకక దూడలకు వదలవలెను .

                            సమాప్తం 



Thursday, January 30, 2025

శ్రీహరి పంచ తులసి డ్రాప్స్ – ఆరోగ్యానికి ప్రకృతి ప్రసాదం------------

శ్రీహరి పంచ తులసి డ్రాప్స్ – ఆరోగ్యానికి ప్రకృతి ప్రసాదం
-------------
శ్రీహరి పంచ తులసి డ్రాప్స్ ఐదు రకాల పవిత్ర తులసి రసాయనాలను కలిగి ఉండి, శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి, శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ప్రాకృతిక ఔషధంగా పనిచేస్తుంది.

వాడుక విధానం:
----------
1. నీటిలో కలపడం:

1 లీటర్ నీటికి: ఒక లీటర్ గోరువెచ్చని లేదా సాధారణ త్రాగునీటిలో 8-10 చుక్కలు వేసి బాగా కలపాలి.

హాట్ వాటర్ లేదా నార్మల్ వాటర్? గోరువెచ్చని నీటిలో కలిపి త్రాగితే శరీరంలో వేగంగా శోషణం జరుగుతుంది, కానీ సాధారణ నీటిలో కూడా వాడవచ్చు.

మినరల్ వాటర్ లేదా డ్రింకింగ్ వాటర్? మినరల్ వాటర్, ఫిల్టర్ వాటర్, లేదా ట్యాప్ వాటర్‌లో 1 లీటర్‌కు 8-10 చుక్కలు వేసుకోవచ్చు.

2. డైలీ యూజ్ (రోజువారీ వాడకం):

బాగా మిక్స్ చేసి రోజంతా త్రాగితే మెరుగైన ఫలితాలు కనబడతాయి.

వేడి కాలంలో ఫ్రిజ్ నీటిలో కూడా వేసుకోవచ్చు కానీ మితంగా మాత్రమే వాడాలి.

సీజనల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కోసం రోజుకు 2-3 సార్లు త్రాగితే మంచిది.
వన్ లీటర్ బాటల్లో వన్ డ్రాప్ లేదా టు డ్రాప్స్ వెయ్యండి.

ప్రయోజనాలు (Benefits):

1. రోగనిరోధక శక్తిని పెంచుతుంది (Boosts Immunity):

శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థను శక్తివంతం చేస్తుంది.

వైరస్‌లు, బ్యాక్టీరియా, ఫంగస్‌లను అడ్డుకోవడంలో సహాయపడుతుంది.

2. శ్వాస సంబంధిత ఆరోగ్యం (Respiratory Health):

దగ్గు, జలుబు, శ్వాస నాళాల ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తుంది.

ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచి ఆస్తమా, బ్రాంకైటిస్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

3. జీర్ణ వ్యవస్థకు మేలు (Digestive Health):

అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది.

లివర్ డిటాక్సిఫికేషన్‌ను మెరుగుపరిచి జీర్ణాశయాన్ని శుభ్రం చేస్తుంది.

4. డయాబెటిస్ మరియు బీపీ నియంత్రణ (Diabetes & Blood Pressure Control):

రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.

హై బీపీ ఉన్నవారికి రక్తపోటును సమతుల్యం చేస్తుంది.

5. చర్మ ఆరోగ్యం (Skin Health):

చర్మం మీద ఉండే బ్యాక్టీరియా, ఫంగస్‌ను తగ్గించి సహజ మెరుపు అందిస్తుంది.

ముక్కుపచ్చలు, అలెర్జీలు, పొడి చర్మం వంటి సమస్యలకు సహాయపడుతుంది.

6. మానసిక ఆరోగ్యం (Mental Health):

ఒత్తిడి, మానసిక ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది.

మెదడు శక్తిని పెంచి మానసిక శాంతిని కలిగిస్తుంది.

సాధ్యమైన దుష్ప్రభావాలు (Side Effects):

సాధారణంగా ఎలాంటి సమస్యలు రావు.

అయితే అధిక మోతాదులో తీసుకుంటే తలనొప్పి, మలబద్ధకం రావచ్చు.

గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు వైద్య సలహా తీసుకుని వాడాలి.

రక్తం పలుచగా చేయగల గుణం ఉన్నందున, రక్తసంబంధ చికిత్సలు తీసుకునేవారు జాగ్రత్తగా వాడాలి.

ఫలితాలు ఎప్పుడు కనిపిస్తాయి?

1-2 వారాల్లో స్వల్ప మార్పులు గమనించవచ్చు.

4-6 వారాల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి.

కొంతమందికి 3 నెలల తర్వాత పూర్తి ప్రయోజనం లభిస్తుంది.

ల్యాబ్ రిపోర్ట్స్ & శాస్త్రీయ పరిశోధనలు (Lab Reports & Scientific Studies):

1. తులసి యొక్క యాంటీ-వైరల్ గుణాలు – ఒక పరిశోధనలో తులసి విరల్ ఇన్ఫెక్షన్లను నిరోధించగలదని వెల్లడైంది.

2. తులసి & రోగనిరోధక వ్యవస్థ – తులసి శరీరంలోని రోగనిరోధక కణాలను బలోపేతం చేస్తుందని అధ్యయనాలు పేర్కొన్నాయి.

3. తులసి & మధుమేహం నియంత్రణ – తులసి రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది.

4. తులసి & మానసిక ఆరోగ్యం – తులసి మానసిక ఆందోళనను తగ్గించి మెదడు పనితీరును మెరుగుపరిచే లక్షణాలను కలిగి ఉంది.

(ఈ రిపోర్టులను మీరు ఆయుర్వేద పరిశోధనా సంస్థల అధికారిక వెబ్‌సైట్‌లలో చూడవచ్చు.)

ముగింపు (Conclusion):

శ్రీహరి పంచ తులసి డ్రాప్స్ అనేది ప్రకృతి శక్తితో నిండి ఉన్న ఆరోగ్య టానిక్. ఇది వ్యాధులను నిరోధించడంలో మాత్రమే కాకుండా, శరీరానికి బలం, శక్తిని అందించి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే గొప్ప ఆయుర్వేద ఔషధం.

వన్ డ్రాప్ టు డ్రా – ఒక లీటర్ బాటిల్‌లో వేసుకుని వాడితే ఉత్తమ ఫలితాలు.

ప్రతిరోజు తులసి నీటిని త్రాగడం శరీరాన్ని బలంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.

సీజనల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ పొందటానికి, శక్తిని పెంచుకోవడానికి దీన్ని మీ రోజువారీ జీవనశైలిలో చేర్చండి.

"సహజ ఆరోగ్య రహస్యం – శ్రీహరి పంచ తులసి డ్రాప్స్ తో మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోండి!"

కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి?

*దత్త మాట*

కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి?
కర్మ సిద్ధాంతం అనేది ప్రాచీన భారతీయ తత్వశాస్త్రం, మతపరమైన సూత్రాల్లోని ఒక ముఖ్యమైన భావన. ఇది మానవ క్రియలు (కర్మలు) మరియు వారి ఫలితాల మధ్య ఉండే సంబంధాన్ని వివరిస్తుంది. కర్మ సిద్ధాంతం అనేది హిందూతత్వశాస్త్రాల్లో అత్యంత ప్రాముఖ్యం కలిగి ఉంది.

కర్మ సిద్ధాంతం యొక్క అర్థం:

"కర్మ" అనే పదం సంస్కృతంలో "చర్య" లేదా "క్రియ" అనే అర్థాన్ని ఇస్తుంది. ఇది ఒక వ్యక్తి చేసిన పనులు, ఆలోచనలు, లేదా శీలాలను సూచిస్తుంది.

1. సూత్రం:

"జేసిన పనులు అనుగుణంగా ఫలితాలు పొందుతాం." ఇది "క్రియ - ఫల సిద్ధాంతం" గా కూడా పిలుస్తారు.

2. భాగాలు:

సంచిత కర్మ: గత జన్మల నుండి కూడిన కర్మల సేకరణ.

ప్రారబ్ధ కర్మ: ఈ జన్మలో అనుభవించాల్సిన కర్మల ఫలితాలు.

క్రియమాణ కర్మ: ఈ జన్మలో మనం చేస్తోన్న తాజా కర్మలు.

ప్రామాణిక గ్రంథాల ఆధారంగా కర్మ సిద్ధాంతం:

1. భగవద్గీత:

"కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన।"

(భగవద్గీత 2.47)

మనకు కర్మ చేయడం పైన హక్కు ఉంది కానీ ఫలితాలపై హక్కు ఉండదు.

2. ఉపనిషత్తులు:

"యథా కర్మ, తథా ఫలం"

మన పనులు ఎంత ఉత్తమంగా ఉంటాయో, ఫలితాలు కూడా అంతే స్థాయిలో ఉంటాయి.

3. మహాభారతం:

ధర్మరాజు ద్వారా కర్మ సిద్ధాంతం బలంగా వివరించబడింది. "అధర్మం చేసిన వారికి దాని ఫలితాలు తక్షణం లేకపోయినా ఒకనాడు తప్పకుండా వస్తాయి."

కర్మ సిద్ధాంతం యొక్క ముఖ్య అంశాలు:

1. పునర్జన్మ: కర్మ సిద్ధాంతం పునర్జన్మ సిద్ధాంతానికి ముడిపడి ఉంటుంది. మన కర్మల ఫలితాలు ఈ జన్మలో కానీ, తరువాత జన్మలో కానీ అనుభవించాలి.

2. స్వేచ్ఛ మరియు బాధ్యత: మనం చేసే ప్రతి పనికి ఫలితం ఉంటుంది. అందువల్ల మనం బాధ్యతతో జీవించాలి.

3. సాధన (పరిపూర్ణత): మంచిని ఆచరించడం, ధర్మబద్ధంగా జీవించడం ద్వారా కర్మను తగ్గించుకోవచ్చు.

తాత్త్వికమైన దృక్కోణం:

అద్వైత తత్వం: కర్మలు మాయలో భాగం, కానీ జ్ఞానంతో దాటవచ్చు.

బౌద్ధం: కర్మ సిద్ధాంతం ద్వారా సాంసారిక బంధాలను అర్థం చేసుకోవడం, వాటిని దాటడం ముఖ్యం.

జైన తత్వం: కర్మ రేణువుల రూపంలో మన ఆత్మపై స్థిరపడుతుంది. యోగం, తపస్సు ద్వారా దీన్ని తొలగించవచ్చు.

కర్మ సిద్ధాంతం యొక్క జీవన ఆచరణ:

మనం మంచిగా ఆలోచించడం, మంచిగా పని చేయడం, మరియు ఇతరులకు సహాయం చేయడం ద్వారా మంచి ఫలితాలను సృష్టించుకోవచ్చు. పునర్జన్మ సంకలనం లేదా కర్మల వల్ల వచ్చే ఆత్మ సఫలం సాధించవచ్చు.

కర్మ సిద్ధాంతం ప్రకారం మన జీవితంలోని ప్రతి సంఘటన, అనుభవం మన కర్మల ఫలితం. అది మన చర్యలకు సమతుల్యంగా ఉంటాయి, మంచి చేసే వ్యక్తి మంచి ఫలితాలు పొందుతాడు, చెడు చేసే వ్యక్తి చెడు ఫలితాలు అనుభవిస్తాడు.

Monday, January 27, 2025

గర్భధారణ

గర్భధారణ: సురక్షిత ఆరోగ్యం కోసం మీకు అవసరమైన మార్గదర్శకాలు.
-------------
గర్భధారణ అనేది ప్రతి మహిళ జీవితంలో అద్భుతమైన ప్రయాణం. పిరియడ్స్ తర్వాత గర్భం కలగడానికి సరైన సమయం, గర్భధారణలో నెలవారీ ఎదురయ్యే సమస్యలు, డెలివరీ పీరియడ్‌ల గురించి సరిగ్గా తెలుసుకోవడం ఎంతో అవసరం. గర్భిణీ స్త్రీ ఆరోగ్యం, పిల్లల ఆరోగ్యం సురక్షితంగా ఉండేందుకు ఈ మార్గదర్శకాలు చాలా ప్రాముఖ్యతగలవి. ప్రతి దశలో సరైన ఆహారం, విశ్రాంతి, మరియు వైద్యసలహాలు పాటించడం అనివార్యం.

1. మెన్సెస్ తర్వాత గర్భధారణకు సరిగ్గా ఎన్ని దినాలు?
-----------
మెన్సెస్ (పిరియడ్స్) పూర్తయ్యాక గర్భధారణకు అనుకూలమైన కాలాన్ని "ఓవ్యూలేషన్ పీరియడ్" అంటారు. సాధారణంగా, 28 రోజుల సైకిల్ ఉన్న మహిళలకు 11వ నుండి 21వ రోజు మధ్య ఈ పీరియడ్ ఉంటుంది. అంటే, పిరియడ్స్ మొదలైన తేదీ నుండి సుమారు 11వ నుండి 14వ రోజు మధ్య ఓవ్యూలేషన్ జరుగుతుంది. ఈ సమయంలో మహిళలు గర్భవతులు కావడానికి అవకాశం ఉంటుంది.
----------
2. గర్భం ఏకాభిప్రాయం: అబ్బాయి లేదా అమ్మాయి?
గర్భం వచ్చిన తర్వాత అబ్బాయి అయినా అమ్మాయి అయినా, సాధారణంగా 9 నెలలు లేదా 40 వారాలకు డెలివరీ జరుగుతుంది. అబ్బాయి అయినా అమ్మాయి అయినా, గర్భధారణ కాలం ఒక్కటే ఉంటుంది.
----------
3. ఏడు నెలల్లోనే డెలివరీ ఎందుకు జరుగుతుంది?
కొంతమంది మహిళల్లో గర్భధారణ పూర్తయ్యే ముందు (7 నెలలు లేదా 28 వారాల తర్వాత) పిల్లలు పుట్టడానికి కొన్ని కారణాలు ఉండవచ్చు.
గర్భం సంబంధిత సమస్యలు (ప్రీక్లాంప్సియా వంటి)

తల్లికి ఉన్న ఆరోగ్య సమస్యలు

ఇంట్రాయుటరైన్ గ్రోత్ రెస్ట్రిక్షన్ (IUGR)

బహుళ గర్భం (ట్విన్స్ లేదా ట్రిప్లెట్స్)

ఈ పరిస్థితిని ప్రీటర్మ్ లేబర్ అంటారు, దీనికి ప్రత్యేక వైద్యచర్యలు అవసరం అవుతాయి.
---------
4. గర్భధారణ సమయంలో నెలవారీ సమస్యలు:
ప్రతీ నెలలో గర్భిణీలకు కొన్ని ముఖ్యమైన మార్పులు మరియు సమస్యలు ఎదురవుతాయి:
---------
1 నుండి 3 నెలలు: ప్రాథమిక లక్షణాలు—వాంతులు, ఒళ్లు నొప్పులు, అలసట.
----------
4 నుండి 6 నెలలు: జీర్ణశక్తి సమస్యలు, కడుపులో నొప్పులు, బరువు పెరుగుదల.
-----------
7 నుండి 9 నెలలు: వెన్నునొప్పి, కాళ్ళు వాపు, ఉబ్బసం, డెలివరీకి సంబంధించిన ఆందోళన.
-----------
ముగింపు:
ప్రతి గర్భిణీ మహిళకు నెలవారీ అభివృద్ధి విభిన్నంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం, తగినంత విశ్రాంతి, మరియు వైద్య సూచనలు పాటించడం ద్వారా సకాలంలో డెలివరీ జరగడమే కాదు, తల్లి మరియు శిశువు ఆరోగ్యానికి రక్షణ ఉంటుంది. ఈ సమాచారాన్ని పాటించడం ద్వారా గర్భిణీలు సురక్షిత గర్భధారణను పొందగలుగుతారు.