Saturday, February 1, 2025

గుండె జబ్బులు - ఆహార నియమాలు - ఔషధాలు

గుండె జబ్బులు  -  ఆహార నియమాలు - ఔషధాలు 

 గుండెజబ్బు రావడానికి గల కారణాలు -

 *  అతిగా ఆవేశపడటం.
 
 *  ఎక్కువుగా ఉన్న వేడి పదార్దాలు తినడం.
 
 *  పులుసు , వగరు ఉన్న రుచులు ఎక్కువ ఉన్న పదార్దాలు తినడం.

 *  విచ్చలవిడిగా కామకలాపాలు సాగించడం .

 *  అతిసారం 

 *  జీర్ణకోశం లో  వ్రణాలు .
 
 *  విషపదార్దాల సేవనం .
 
 *  మానసిక ఆందోళన .

 *  రక్తపోటు .

 *  కొవ్వు పేరుకొని పోవడం.

 *  అధికంగా గోంగూర వాడటం.

   మొదలైన వాటివల్ల గుండె జబ్బులు వస్తాయి.

   గుండె రోగులు పాటించవలసిన నియమాలు -

 *  ఎప్పుడు పాత బియ్యమే ఆహారంగా ఉపయోగించాలి. దంపుడు బియ్యమే శ్రేష్టం .

 *  మేక మాంసం , అడివి పక్షుల మాంసం , అడివి మృగాల మాంసం తో తయారైన మాంస రసాలు త్రాగవచ్చు. 

 *  అల్లం, ఉప్పు, కొద్ది కారం , కొద్దిగా యాలుక్కాయలు , లవంగాలు , దాల్చిన చెక్క, ఇవన్ని కలిపి నూరి ఆ మిశ్రమాన్ని మాంసం ముక్కలకు రాసి ఎండబెట్టాలి. ఎండిన తరువాత చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఆవునేయ్యిలో వేయించుకొని తినవచ్చు.

 *  పులుపు, వగరు రుచులు బాగా తగ్గించాలి.

 *  కందికట్టు, పెసరు కట్టు, ఉలవ కట్టు వాడవచ్చు.

 *  బీర, కాకర, క్యాబేజీ , టమాటో , లేత ముల్లంగి పొట్లకాయ , లేత అరటికాయ , పొన్నగంటి కూర , పెరుగుతోట కూర , మెంతి కూర , సొరకాయ , దోసకాయ తినాలి .

 *  మామిడి పండ్లు, దానిమ్మ పండ్లు , బత్తాయి రసం ( కలకండ రసం కలిపింది.) నారింజ రసం , ద్రాక్ష రసం వాడవచ్చు.

 *  ఆవుపాలు, ఆవునెయ్యి , ఆవుమజ్జిగ , పాతబెల్లం , తేనె , ద్రాక్షారిష్ట, అర్జునారిష్ట , వెల్లుల్లి , అల్లం వాడవచ్చు. 

   గుండె రోగులు మానుకోవలసినవి   - 

 *  కొత్తబియ్యం అన్నం తినకూడదు .

 *  పెరుగు వాడరాదు . మజ్జిగ వాడవలెను.

 *  పులుపు, వగరు రుచులు బాగా తగ్గించాలి.

 *  ఎప్పుడు దాహం , వాంతి రాకుండా చూసుకోవాలి .

 *  మలమూత్రాలు ఎక్కువసేపు ఆపకుండా వచ్చినవెంటనే విసర్జించాలి.

 *  దగ్గు, తేన్పులు , అపానవాయువు వీటిని ఆపకూడదు .

 *  పుల్లలతో పండ్లు తోముకోకుడదు.

 *  పొగత్రాగటం పూర్తిగా మానుకోవాలి.

 *  మద్యం, గేదపాలు అసలు పనికిరావు.

 *  తాంబూలం వేసుకొకుడదు .

 *  ఆవకాయ తినడం అత్యంత ప్రమాదకరం .

       పైన చెప్పిన ఆకుకూరలు తప్ప మిగిలనవి బాగా తగ్గించడం శ్రేయష్కరం .

గుండె నొప్పి మరియు గుండెబలమునకు సిద్ధఔషధ యోగాలు  - 

 *  తమలపాకు జీర్ణాశయమునకు మరియు హృదయమునకు బలాన్ని కలిగించును. 

 *  మునగచెక్క రసము నందు కొంచం ఇంగువ చేర్చి ఇచ్చిన గుండెనొప్పి తగ్గును. 

 *  గులాబీల నుండి తయారుచేసిన పన్నీరు గుండెదడ , గుండెపోటు , ఆయాసములను తగ్గించును . 

 *  అంజూర పండ్ల రసమును రోజుకు ఒకసారి తీసుకున్నచో గుండెకి , ఊపిరితిత్తులకు బలాన్ని కలుగచేయును . 

 *  ద్రాక్షపండ్ల రసము గుండెకు , మూత్రపిండాలకు బలాన్ని కలుగచేయును . 

 *  ఒక ఔన్స్ సొంపు కషాయంలో రెండు చెంచాల పంచదార కలిపి రోజుకు రెండుసార్లు పుచ్చుకున్న ఛాతినొప్పి , ఉపిరి తీసుకునేప్పుడు నొప్పి , గుండెనొప్పి తగ్గును. 

 *  ఖర్జుర పండు గుండె , ఊపిరితిత్తులు , మూత్రపిండములు , లివర్ మొదలగు శరీరావయములకు మిక్కిలి ఉత్తేజాన్ని కలిగించి బలమును , పుష్టిని ఇచ్చును . 

 * ప్రతినిత్యం ఉదయాన్నే ఒక అంజూరపండు తినుచున్న గుండెదడ , ఆయాసం తగ్గును. 


No comments:

Post a Comment