Tuesday, May 27, 2025

అన్నము గురించి సంపూర్ణ వివరణ -

అన్నము గురించి సంపూర్ణ వివరణ -

 * అన్నం అగ్నిదీపనం చేయును .

 * మలమూత్ర విసర్జనకారిగా ఉండును.

 * చక్కగా వండి గంజివార్చిన అన్నం శరీరం నందు వేడిని కలిగించును. శరీరముకు హితము చేయును . మంచి పథ్యముగా ఉండును.

 * బియ్యము కడగక గంజివార్చబడని అత్తెసరు అన్నం పైత్యమును చేయును . శుక్రమును వృద్ధిచేయును . కఫానికి కారణంగా ఉండును. 

 * బియ్యమును వేసి పాకము చెయ్యబడిన అన్నం రుచికరంగా ఉండి కఫాన్ని హరించును . తేలికగా ఉండును. 

 * పప్పు , మాంసాదులు వేసి వండిన అన్నము గురుత్వము చేయును . శుక్రమును వృద్ధిపరచును. కఫమును పుట్టించును .

 * బెల్లము మొదలగు మధురరసములతో కలిసి మధురాన్నం గురుత్వం చేయును . శుక్రాన్ని వృద్దిపరచును. వాతజ్వరమును హరించును . 

 * మెంతి,మజ్జిగతో చేర్చిబడిన అన్నం గ్రహణి, మూలరోగం , అలసట పొగొట్టును.మరియు జీర్ణకారి. 

 * అతివేడి అన్నం బలమును పొగొట్టును. సమశీతోష్ణ స్థితిలో ఉన్న అన్నం తినుట మంచిది .

 * రెండుమూడు రోజులు నుంచి ఉన్న అన్నం పాచి అన్నం రోగాలను పుట్టించును .

 * వరి అన్నం రుచి పుట్టించును . సర్వరోగ హరమైనది . నేత్రాలకు హితము చేయును . జఠరాగ్నిని పెంచును. హృదయమునకు మేలుచేయును. శుక్రవృద్ధి , శరీర ధారుడ్యం కలుగచేయును . పథ్యకరం అయినది. దాహాన్ని తగ్గించును . 

 * శరీరానికి కాంతిని ఇచ్చును. మూత్రవృద్ధి చేయును . తేలికగా ఉండును. ముడిబియ్యపు అన్నం అగ్నిదీప్తి కలిగినవారికి మంచి శ్రేష్ఠమైనదిగా 
ఉండును . 

 * సన్నరకం బియ్యపు అన్నం దీపనకారిగా ఉండి దోషములను పోగొట్టును . ప్రశస్తమైనది , రోగములను హరించును .

 * మినపపప్పు గాని నువ్వుల గాని చేర్చి వండిన అన్నమును పులగం అందురు. బలమును కలుగచేయును . మలమును బంధించును . పెసరపప్పు , కందిపప్పు , శనగపప్పు వగైరా బియ్యముతో చేర్చి వండిన అన్నం శుక్రమును మరియు బలమును పెంచును . పుష్టిని కలిగించును. మలమును విసర్జింపచేయును . వాతాన్ని హరించును . పిత్తమును మరియు కఫాన్ని పెంచును.త్వరగా జీర్ణం అవ్వకుండా ఉండును.

 * పాలలో బియ్యం , చెక్కర వగైరా కలిపి వండినదానిని పాయసం అనియు క్షీరాన్నం అనియు పరమాన్నం అని కూడా అంటారు. పాయసం త్వరగా జీర్ణం కాదు. బలమును , ధాతుపుష్టిని చేసి మలమును బంధించును . 

      ఇప్పుడు పప్పుల గుణములు కూడా మీకు వివరిస్తాను. 

      పెసరపప్పు వాతమును , కడుపు ఉబ్బరమును కలిగించును. పొట్టు తీసిన పెసరపప్పు మధురంగా ఉండును. దేహకాంతిని కలుగచేయును . గుల్మము , ప్లీహము,కాస , అరుచి , పిత్తము , ప్రమేహరోగము , గళ రోగమును హరించును .

            కందిపప్పు రుచిగా ఉండి మలబద్దకం, కుష్టు , జ్వరం , అతిసారమును హరించును . శనగపప్పు కడుపుఉబ్బరం కలుగచేయును . ఉలవపప్పు కఫపిత్తరోగములను , గుల్మొదరం , మూలవ్యాధి , వాతం , క్రిమిరోగం , కాసరోగం , ఆమవాతంను హరించును . అలసందపప్పు 
మధురంగా ఉండును. బలమును వృద్దిచేయును.

      కొందరు పొట్టుతీసిన పెసరపప్పు , పొట్టుతీయని కందిపప్పు విషతుల్యం అందురు. కారము మరియు కమ్మదనం కలిగిన పదార్థముల యందు పైత్యమును , పులుసు , వగరు కలిగిన పదార్థముల యందు శ్లేష్మము , తీపు మరియు చప్పదనం కలిగిన పదార్థముల యందు వాతము కలదని ఋషుల యొక్క అభిప్రాయం . కావున శరీరతత్వము మరియు రోగమును గుర్తించి పథ్యం పెట్టవలెను.
 
 
 

అష్ట దిక్కుల గాలులు - లాభ నష్టాలు .

అష్ట దిక్కుల గాలులు - లాభ నష్టాలు . 

  గాలులు లొని రకాలు - 

     బౌగోళిక పరిస్థితులను బట్టి సూర్య చంద్రుల గమనాలని బట్టి భూమి స్వరూపాన్ని ఎనమిది దిక్కులుగా విభజించారు. అన్ని దిక్కుల నుంచి వీచే గాలులు అన్ని ఒకే రకంగా ఉండవు . ఆయా దిక్కుల స్వభావాన్ని బట్టి గాలి స్వభావం మారుతుంది . అయితే అన్నివేళలా అన్ని దిక్కుల నుండి గాలులు వీచవు. ఒక్కో రుతువులో ఒక్కో దిక్కునుండి ఒక్కో రకమైన గాలులు వీస్తాయి. వాటివల్ల మానవులు మానవులకు కొంత ఆరోగ్యము , కొంత అనారోగ్యము కలుగుతాయి. ఏ గాలులు అనారోగ్యమో , ఏ గాలులు ఆరోగ్యమో తెలుసుకోవడం ప్రతి మనిషికి అవసరం. 

  దక్షిణ దిక్కు గాలులు - 

    ఏప్రిల్ , మే నెలలలో వచ్చే వసంత మాసంలో దక్షిణ దిక్కు నుంచి గాలులు నెమ్మదిగా వీస్తాయి . ఇవి మలయ పర్వతం మీదగా వీచడం వలన ఆ పర్వతం మీద ఉన్న ఔషధాల సువాసనలు కూడా ఈ గాలులతో కలిసి వస్తాయి. ఈ మలయ పవనాలు తమ చల్లని స్పర్శతో మానవాళిని వేసవితాపం నుంచి కాపాడతాయి. ఈ గాలులని ఆస్వాదించ గలిగితే శరీరంలోని త్రిదోషాలు హరించి చక్కటి ఆరోగ్యం చేకూరుతుంది. ఈ గాలిలో తీపి , చేదు , వగరు రుచులు ఉంటాయి. ఈ కాలంలో అదే స్వభావం కలిగిన ఈశాన్య గాలులు కూడా వీస్తాయి 

  నైరుతి గాలులు - 

      జూన్ , జూలై నెలలలో వచ్చే గ్రీష్మ రుతువు లొ నైరుతి దిక్కు నుండి గాలులు వీస్తాయి . ఈ గాలుల్లో కారం రుచి ఉంటుంది. ఇవి వేడి చేసే స్వభావం కలిగి ఉంటాయి. ఈ గాలులు వాళ్ళ ఉదర రోగాలు , పైత్య రోగాలు , మేహా రోగాలు పుడతాయి. రక్త పిత్త రోగాలు కూడా పుడతాయి. ఈ నైరుతి గాలులు సకల రోగాలుకు నిలయాలు. 

  పడమర గాలులు - 

     ఆగస్ట్ , సెప్టెంబర్ నెలలలో ఉండే వర్ష ఋతువులో పడమర గాలులు వీస్తాయి . ఈ గాలులు వెగటుగా ఉండి వేడి చేసే స్వభావం కలిగి ఉంటాయి. అయినా గ్రీష్మ ఋతువులో నైరుతి గాలుల వలన ఏర్పడిన రక్తపిత్త వ్యాధి హరించి పొతుంది. ఎంతో కాలం నుంచి ఉన్న వివిధ వ్రణాలు మాడిపోతాయి. 

  వాయువ్య దిక్కుల గాలులు - 

   
     అక్టోబర్, నవంబర్ నెలలలో ఉండే శరత్కాలంలో వాయువ్య దిక్కు నుంచి గాలులు వీస్తాయి . ఈ గాలులలో కారం , చేదు గుణాలు ఉంటాయి. తేమ ఉండదు. అందుకే ప్రసన్నంగా ఉంటాయి. అందుకే ప్రసన్నంగా ఉంటాయి. అయితే వాత వ్యాదులు కలిగించడం . వాతవ్యాదులు ఉన్నవారికి ఎక్కువ అవ్వడం ఈ గాలుల స్వభావం . కఫ రోగాలు , పైత్య రోగాలు తగ్గించి వంటిలోని చెడు నీరు తొలగించే గుణం ఈ గాలులలో ఉంది. 

  తూర్పు , ఉత్తర దిక్కుల గాలులు - 

     డిసెంబర్ , జనవరి నెలలలో ఉండే హేమంత ఋతువులో తూర్పు దిక్కున ఉండి ఉత్తర దిక్కుకు ఈ గాలులు వీస్తాయి . తూర్పు గాలులు చలువ చేస్తాయి. కాని వీటివల్ల వాత రోగాలు , కఫ రోగాలు పైత్య రోగాలు పెరుగుతాయి. వంటి నిండా నీరు పట్టే ఉబ్బు వ్యాధి ని కలిగిస్తాయి. ఉత్తరపు గాలులు కూడా చల్లగా ఉంటాయి. ఇవి కఫాన్ని , కొవ్వుని పెంచుతాయి. 

   ఆగ్నేయ గాలులు - 

  
       ఫిబ్రవరి , మార్చి నెలలలో ఉండే శిశిర ఋతువులో ఆగ్నేయ దిక్కు నుండి గాలులు వీస్తాయి . ఇవి కూడా అమిత చల్లగా ఉంటాయి. వాతవ్యాదులని పుట్టిస్తాయి. ఉబ్బు రోగాలు , వ్రణాలు ఉన్నవారిని మరింత పీడిస్తాయి.

కసవింద

కసవింద - 
 
తెలుగు - కసవింద . 
  
 సంస్కృతము - కాసమర్ధ . 
  
 హింది - కసౌందీ . 
 
 లాటిన్ - Cassia occidentalis linn . 
 
 కుటుంబము - Caesalpinaceae . 
  
 రూపలక్షణాలు - 
    
కసవింద చెట్టు క్షుపజాతికి చెందినది . గజము ఎత్తువరకు పెరుగును . ఇది సన్నని , వెడల్పు ఆకుల బేధము కలిగి ఉంటుంది . ఆకులు 3 అంగుళముల పొడవు కలిగి 2 అంగుళముల వెడల్పు కలిగి మిరపకాయలను పోలి ఉండును . దీని కాయలు ఉలవకాయల వలే సన్నముగా 5 నుంచి 6 అంగుళముల పొడవుగా ఉండును. దీని ఆకు కొంచము నలుపురంగుగా పొడవుగా కొనగలిగి ఉండును . పసుపుపచ్చని అందమైన పూతలు పూయును . బీజములు గుండ్రముగా , బల్లపరుపుగా , నునుపుగా ఉండును . ఇది సర్వత్రా జలము గల భూముల యందు ఉండును కొన్ని ప్రదేశాలలో గుబురుగా ఒకేచోట ఎక్కువుగా ఉండును . 
  ఈ కసవిందలో 3 రకాలు కలవు . అవి 
  
    * కసవింద సాధారణమైనది . 
    * కమ్మ కసవింద . 
    * కొండ కసవింద లేదా తీట కసవింద . 
        
. పై మూడింటిలో కొండ కసవిందకు ముండ్లు గల ఆకులు ఉండటం మూలన తీట కసవింద అని కూడా పిలుస్తారు . ఇది మామూలు కసవింద మాదిరి పొదలా పెరగక నేలను పాకి అల్లుకొనును . 
  
. గుణగణములు - 
     
  కసివింద ఎక్కువ చేదు , కొంచం మధురంగా ఉండును . వేడిగా , జీర్ణకారిగా , కంఠమును శుభ్రపరచునదిగా , కఫము , వాతము , అజీర్ణము , దగ్గును , పిత్తమును హరించునదిగా ఉండును . త్రిదోషములను హరించు శక్తి కలిగినది . విషములను పొగొట్టును . గాయములను , చర్మవ్యాధులను , నేత్రరోగములను , గడ్డలను పోగొట్టును . వాతసన్నిపాతములను హరించును . ఉదర రోగములను హరించును . అతిమూత్రవ్యాధి నివారణ అగును . 
           
. కసవిందాకు కూర కొంచము చేదుగా , వెగటుగా ఉండును . వేడిని , పిత్తమును కలిగించును . కఫవాతములను , నులిపురుగులు పడుటను , ఆయాసముతో కూడిన దగ్గులను , చర్మవ్యాధులను పోగుట్టును . ఆకలిని కలిగించును . ఇందులో కమ్మ కసవిందకు కూర తియ్యగా , రుచిగా ఉండును . వాతములను పోగొట్టును . పొత్తికడుపును శుభ్రపరచును . రక్తపిత్తములను , క్రిమిరోగమును పోగొట్టును . మంచి వీర్యవృద్ధిని ఇచ్చును . 
        సాధారణముగా కసవిందకాయలు లేతవి వండుకొని తినినచో కొంచం వేడిచేయును . కాని శ్వాసకాసలు , వాతములు , జ్వరముల యందు పథ్యముగా ఉపయోగించదగినది . కొండకసవింద , కమ్మ కసవింద కాయలు మాత్రం కూరకు ఉపయోగించరాదు . వాతరోగము అత్యంత తీవ్రముగా ఉన్నప్పుడు మాత్రమే తక్కువ మోతాదులో ఇవ్వవచ్చు . 
     
. కమ్మ కసవింద రసము , చూర్ణము సాధరణ కసవింద వలె చేదుగా ఉండక తియ్యగా ఉండును . దీని ఆకును కూరగా కాని లేదా పులుసుకూరగా గాని వండి తినుదురు . ఇది రుచిగా , స్వాదుగా ఉండును . కొండ కసవింద ఆకుల రసముగాని , కషాయము గాని జ్వరములను , సన్నిపాతములను , ఉదరరోగములను నశింపచేయును . వేరుచెక్క విషజ్వరాలను హరించును . ఇది రుచికి కారముగా ఉండి అగ్నిదీపనమును కలిగించును . దీని వ్రేళ్ళు , కాయలు వేసి కాచిన తైలము మర్దించిన వాతపునొప్పులు నెమ్మదించును . నీళ్ల విరేచనములు పోగొట్టు గుణము కలిగినది . దీని రసపు మోతాదు 3 తులముల ఎత్తు , కషాయం మోతాదు 5 తులముల ఎత్తు వరకు ఇవ్వవచ్చును . సాధరణ కసవింద చూర్ణం లోపలికి పుచ్చుకునే మోతాదు 2 నుంచి 4 చిన్నముల ఎత్తు వరకు ఉండవచ్చు . 
  
 ఔషధోపయోగములు - 
  
 * వాతనొప్పుల నివారణ కొరకు - 
       
. కసవిందాకు రసాన్ని నువ్వులనూనెతో కలిపి తైలపక్వము చేసి కీళ్లపై వ్రాసిన వాతనొప్పులు తగ్గును . 
 
 * పక్షవాత నివారణ కొరకు - 
      
. కసవింద ఆకు రసాన్ని వెన్నతో కలిపి మర్దించిన నరాల బలహీనత తగ్గి పక్షవాతం వలన పడిపోయిన అవయవం తిరిగి స్వాధీనంలోకి వచ్చును . 
 
 * గజ్జి నివారణ కొరకు - 
       
. కసవిందాకు రసము ఒంటికి రాసుకున్న గజ్జి తగ్గును . అంతే కాకుండా ఎలర్జీ , దద్దుర్లు తగ్గును . 

  * విరిగిన ఎముకలు అతుక్కునుటకు - 
     
. కసవింద ఆకులను కోడిగుడ్డు సొనతో నూరి పట్టువేసిన విరిగిన ఎముకలు అతుక్కునును . 

  * బోదకాలు నివారణ కొరకు - 
       
. కసవింద వేరుని అవునేతితో కలిపి తాగిన బోదకాలు తగ్గును . 
       కసవింద వేరు పై బెరడును నూరి ఒక చెంచా మోతాదులో రోజుకి రెండుసార్లు సేవించిన బోదకాలు నయం అగును . 
 
 * చుండ్రు , పేలు నివారణ కొరకు - 
      
. కసవింద ఆకు రసాన్ని తలకు పట్టించి మరుసటిరోజు ఉదయాన్నే తలస్నానం చేసిన పేలు , చుండ్రు తగ్గును . 
 
 * దగ్గు , ఆయాసం నివారణ కొరకు - 
     
. కసవింద ఆకు రసాన్ని 1 నుంచి 2 చెంచాలు రోజుకి 2 లేదా 3 సార్లు సేవించిన దగ్గు తగ్గును . కసవింద గింజల చూర్ణాన్ని కాఫీలా కాచుకొని తాగుచున్న ఆయాసము తగ్గును . 
 
 * కండ్లకలక నివారణ కొరకు - 
     
. కసవింద ఆకులను కండ్లపైన వేసి ఉదయం , సాయంత్రం కట్టు కట్టుచున్న కండ్లకలక నివారణ అగును . 
 
 * సోరియాసిస్ , సిబ్బెము నివారణ కొరకు - 
       
. కసవింద వేరును పుల్లని పండ్లరసముతో గాని లేదా పుల్లటి మజ్జిగతో గాని లేదా పులిసిన గంజితో మెత్తగా నూరి పూసిన సోరియాసిస్ , సిబ్బెము , తామర , గజ్జి నయం అగును . 

  * అతిమూత్రం నివారణ కొరకు - 
      
. కసవింద గింజల చూర్ణము 1 గ్రాము 1 స్పూన్ తేనెతో కలిపి ఉదయం , సాయంత్రం తీసుకున్న అతిమూత్రం తగ్గును . 
 
 * నులిపురుగుల నివారణ కొరకు - 
     
. కసవింద ఆకులను శుభ్రపరచి నీడన ఎండించి మెత్తని చూర్ణం చేసుకుని ప్రతిరోజూ ఉదయం , సాయంత్రం 2 గ్రాముల మోతాదులో తీసుకొనుచున్న కడుపులో నులిపురుగులు నశించును . ఆయసం , దగ్గు , చర్మరోగాలు కూడా నశించును . 
       

సిరిధాన్యాలు గురించి సంపూర్ణ వివరణ - ఔషధ గుణాలు .

సిరిధాన్యాలు గురించి సంపూర్ణ వివరణ - ఔషధ గుణాలు .

 కొర్రలు యొక్క ఉపయోగాలు -

 * కొర్రలు విరిగిపోయిన అంగములను అత్యంత వేగముగా అతుకొనునట్టు చేయును .

 * శరీరానికి అమితమైన పుష్టిని ఇచ్చును.

 * కొర్రలు నాలుగు రకాలుగా ఉండును. పసుపు, ఎరుపు, తెలుపు, ఎరుపు రంగుల్లో ఉండును. నలుపు , తెలుపు రంగులు శ్రేష్టమైనవి.

 * శరీరం నందు వేడిని కలిగించును.

 * జ్వరమును, కఫమును హరించును .

 * జీర్ణశక్తిని పెంచును.

 * రక్తమును వృద్దిచేయును.

 * నడుముకు మంచి శక్తిని ఇచ్చును.

 * అతిగా తినిన వాతమును పుట్టించును . దీనికి విరుగుళ్లు నెయ్యి, పంచదార.

 * గర్భస్రావం అయిన స్త్రీకి కొర్రగంజి ఇచ్చిన మంచి మేలు చేయును . బలము కలిగించును.

 * కొర్రబియ్యపు అన్నం గేదె పెరుగుతో తినుచున్న ఎప్పటి నుంచొ ఉండి మానని మొండి వ్రణాలు సైతం మానును .

 * కొర్రబియ్యపు అన్నం తినటం వలన రక్తపైత్య రోగం మానును .

 * కొర్రబియ్యముతో పరమాన్నం చేసుకుని తినుచున్న అజీర్ణశూలలు (నొప్పి ) మానును .

 * కొర్ర బియ్యములో 11.2 % తేమ , 12.3 % మాంసకృత్తులు , 4.7% కొవ్వులు , 3.2% సేంద్రియ లవణాలు , 8% పిప్పి పదార్థం , 60.6 % పిండిపదార్ధం ఉండును. ఇందు మాంసకృత్తులు , సేంద్రియ లవణములు, పిప్పి పదార్ధములు , కొవ్వులు ఎక్కువుగా ఉన్నందువల్ల ఆహారవిలువ ఎక్కువుగా ఉన్నది. జిగురు పదార్దాలు అత్యల్పముగా ఉండును.

 * కఫ సంబంధ వ్యాధులు , మధుమేహం కలవారు , ఆరోగ్యవంతులు ఈ ధాన్యముతో వండిన అన్నాన్ని తగినంత కూరలు మరియు మజ్జిగని కలుపుకుని తినవచ్చు.

 * కడుపులో అల్సర్ , జిగట విరేచనాలు , రక్తప్రదరం , శుక్రనష్టం, శ్వేతకుసుమ, కుష్టు , క్షయ మొదలయిన ఉష్ణసంబంధ వ్యాధులతో బాధపడేవారు కొర్రలు ఉపయోగించరాదు.

   సామలు యొక్క ఉపయోగాలు - 

 * సామలు తో చేసిన అన్నం చమురు కలిగి మృదువుగా , తియ్యగా , వగరుగా ఉండును. 

 * చలవ , వాతమును చేయును . 

 * మలమును బంధించును . 

 * శరీరము నందు కఫమును , పైత్యమును హరించును . 

 * ఈ బియ్యముతో పరమాన్నం చేసిన అద్భుతమైన రుచితో ఉండును.

 * గుండెల్లో మంటకు మంచి ఔషదం.

 * కీళ్లనొప్పులు మరియు ఆర్థరైటిస్ సమస్యతో ఇబ్బంది పడేవారికి మంచి ఔషధం . 

  రాగుల యొక్క ఉపయోగాలు - 

 * వీటికి మరొక్క పేరు తవిదెలు , చోళ్ళు అని కూడా పిలుస్తారు . 

 * రాగులను ఆహారముగా తీసుకోవడం వలన వెంట్రుకలకు బలమును ఇచ్చును. 

 * శరీరంలో పైత్యమును పెంచును. ఎక్కువుగా తీసుకోవడం వలన తలతిప్పుట చేయును . 

 * మేధోరోగం అనగా అధిక కొవ్వు సమస్యతో ఇబ్బందిపడేవారు ఆహారంలో రాగులను చేర్చుకోవడం వలన దేహములోని కొవ్వుని బయటకి పంపును . 

 * రాగులను జావలా చేసిన అంబలి అని అంటారు. దీనిని లోపలికి తీసుకోవడం వలన మేహరోగాన్ని అణుచును. 

 * రాగులను లొపలికి తీసుకున్నచో పైత్యమును పెంచును. రాగులను జావలా చేసి తీసుకున్నచో శరీరంలో పైత్యాన్ని హరించును . రాగిజావలో మజ్జిగ కలుపుకుని సేవించినచొ ఎక్కువ ఫలితం ఉండును. 

 * కఫాన్ని పెంచును. చలవ చేయును . 

 * శరీరంలో పైత్యం వలన కలుగు నొప్పులను పొగొట్టును.

 * ఆకలిదప్పికలను అణుచును.

 * విరేచనం చేయును . రక్తంలోవేడిని తీయును. 

 * రాగుల్లో పిండిపదార్ధాలు 72.7 గ్రా , కొవ్వుపదార్ధాలు 1.3 గ్రా , మాంసకృత్తులు 7 గ్రా , క్యాల్షియం 330 మీ.గ్రా , భాస్వరం 270 మి.గ్రా , ఇనుము 5 .4 మి.గ్రా , పొటాషియం 290 మి.గ్రా , పీచుపదార్థం 3.6 మి.గ్రా . శక్తి 331 కేలరీలు .

 * రాగులలో ఇనుము అధికంగా ఉండటం వలన మలమును సాఫీగా బయటకి వెళ్లేవిధముగా చేయును . 

 * మెరకభూముల్లో పండే రాగులు మంచిరుచిని 
కలిగించును. రాగుల్లో ఎరుపు, నలుపు రంగులు కలవు.

 * రాగులు నానబెట్టి ఎండబెట్టి దోరగా వేయించి మెత్తగా విసిరి ఆ పిండిని పాలల్లో కలుపుకుని తాగడం గాని లేదా జావలా కాచుకొని తాగుచున్న అతిమూత్రవ్యాధి హరించును . 

 * రాగిజావలో మజ్జిగ కలుపుకుని తాగుచున్న శరీరంలో వేడి పోవడమే కాదు మూత్రబంధన విడుచును.
 
 
   

సోరియాసిస్ వ్యాధి గురించి సంపూర్ణ వివరణ -

సోరియాసిస్ వ్యాధి గురించి సంపూర్ణ వివరణ -

      మనుష్యులకు వచ్చు అత్యంత తీవ్రమైన మరియు అంత సులభముగా లొంగని ఒక వ్యాధి గురించి మీకు వివరిస్తాను. దాని పేరు "సిద్మ కుష్టు" దీనిని " సోరియాసిస్ " అంటారు. ఇది ఒక రకమైన కుష్టు వ్యాథిగా ఆయుర్వేదం పరిగణించినది . 18 రకాల కుష్టు వ్యాధులలో ఇది ఒకటి. ముఖ్యంగా దీని లక్షణాలు చర్మం పైన పెద్ద పెద్ద మచ్చలు ఏర్పడి పొట్టు రాలడం . అదే విధముగా కీళ్ల భాగములో సోరియాసిస్ వచ్చినపుడు "సోరియాసిస్ ఆర్థరైటిస్ "
వచ్చును. ఇది అత్యంత మొండి వ్యాధి . 

             ఇది రావడానికి ప్రధానమైన కారణం . విరుద్దమైన ఆహారాలు భుజించటం వలన శరీరం నందలి రక్తం దోషం పొందటం వలన , తీవ్రమైన మానసిక ఒత్తిడి వలన ఈ వ్యాధి సంప్రాప్తించును. దీనికి చికిత్స చేయడం అత్యంత సవాలుతో కూడుకుని ఉన్నది. అల్లోపతి వైద్యవిధానము నందు దీనికి సంపూర్ణమైన చికిత్స లేదు . ఒక్క ఆయుర్వేదం మాత్రమే దీనికి సంపూర్ణ పరిష్కారం చూపించగలదు. 

నేను బతికే ఉన్నాను*

*నేను బతికే ఉన్నాను*

*ఒక పార్టీకి సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఒక వృద్ధుడు కర్ర సహాయంతో వేదికపైకి వచ్చి తన సీట్లో కూర్చున్నారు.*

*హోస్ట్ అడిగారు, "మీరు ఇంకా డాక్టర్‌ దగ్గరకు తరచుగా వెళ్తారా?"*

*వృద్ధుడు అన్నాడు, "అవును, తరచుగా వెళ్తూ ఉంటాను!"*

*హోస్ట్ ప్రశ్నించారు, "ఎందుకు?"*

*వృద్ధుడు నవ్వుతూ అన్నాడు, "రోగులు తరచూ డాక్టర్ దగ్గరికి వెళ్తేనే డాక్టర్ జీవించగలుగుతాడు!"*

*ప్రేక్షకులు ఈయన మాటలకి జోరుగా చప్పట్లు కొట్టారు.*

*తర్వాత హోస్ట్ మళ్లీ అడిగాడు: "మీరు ఫార్మసీకి కూడా వెళ్తారా?"*

*వృద్ధుడు నవ్వుతూ చెప్పాడు, "కచ్చితంగా! ఎందుకంటే, ఫార్మసిస్ట్ కూడా బ్రతకాలి కదా!"*

*దీనికి ప్రేక్షకులు మరింత ఎక్కువగా చప్పట్లు కొట్టారు.*

*హోస్ట్ తర్వాత అడిగాడు, "అయితే, మీరు ఫార్మసిస్ట్ ఇచ్చిన మందులు తాగుతారా?"*

*వృద్ధుడు నవ్వుతూ అన్నాడు, "లేదు! తరచూ వాటిని పారేస్తాను, ఎందుకంటే నాకు కూడా బ్రతకాలి అని ఉంటుందిగా!"*

*దీంతో ప్రేక్షకులు మరింత పెద్దగా నవ్వారు.*

*చివరగా హోస్ట్ అన్నాడు: "మీరు ఈ ఇంటర్వ్యూకు వచ్చినందుకు ధన్యవాదాలు."*

*వృద్ధుడు తల అంగీకారంగా ఊపుతూ అన్నాడు, "మీకు స్వాగతం! ఎందుకంటే, మీరుకూడా బ్రతకాలిగా!"*

*దీంతో ప్రేక్షకుల నవ్వులు ఆగలేదు, సంతోషంతో కేకలు వేయడం కొనసాగించారు.*

*హోస్ట్ మళ్లీ అడిగాడు, "మీరు మీ వాట్సాప్ గ్రూప్‌లో యాక్టివ్‌గా ఉంటారా?"*

*వృద్ధుడు నవ్వుతూ అన్నాడు, "అవును! నేను అప్పుడప్పుడు మెసేజెస్ పంపుతుంటాను, ఎందుకంటే నేను కూడా బ్రతికే ఉన్నానని అందరికీ తెలియాలి! లేదంటే, గ్రూప్ అడ్మిన్ నన్ను తొలగించేస్తాడు!"*

*ఈ జోక్ ప్రపంచంలోనే ప్రథమ స్థానం పొందిందని చెబుతారు, ఎందుకంటే అందరూ బ్రతకాలి!*

*కాబట్టి, నా ప్రియమైన మిత్రులారా, చిరునవ్వుతో ఉండండి, మీకు నచ్చినవారికి సందేశాలు పంపుతూ, స్పందిస్తూ ఉండండి!*

*సంప్రదింపులో ఉండండి!*
*మీరు ఆరోగ్యంగా, ఆనందంగా, మానసికంగా ప్రశాంతంగా ఉన్నారని అందరికీ తెలియజేయండి!*😁

శ్రీ హనుమాన్ జన్మదినం

🕉🌷🌷🌷🌷🙏🌷🌷🌷🌷🕉
      *🌷ॐ ఓం నమః శివాయ ॐ🌷*

_*రేపు శ్రీ హనుమాన్ జన్మదినం , వైశాఖమాసం దశమి తిథి , పూర్వాభాద్రనక్షత్రము*_

హనుమంతుని జీవితం గురించి వివిధ గాథలు ప్రచారంలో ఉన్నాయి. ప్రధానంగా రామాయణంలో హనుమంతుడు శ్రీరాముని బంటుగానే ప్రస్తావింపబడింది. కొన్ని పురాణాలు , ఉపనిషత్తులు , సంప్రదాయ గాథలలో మరికొన్ని విషయాలు , కథలు ఉన్నాయి. ఇక జానపద సాహిత్యంలోనూ , వివిధ స్థలపురాణాలలోనూ కొల్లలుగా గాథలున్నాయి. ఈ వ్యాసంలో ప్రధానంగా వాల్మీకి రామాయణ ఇతివృత్తమైన గాథ క్లుప్తంగా ఇవ్వబడింది.

*జననం*

పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను. అతని తల్లి అంజన కథతో సంబంధం కలిగి ఉన్నది. అంజన అనే ఆడ వానరం మరియు కేసరి అనే పురుష వానరం యొక్క కుమారునిగా జన్మించాడు. గతంలో అంజన బ్రహ్మ న్యాయస్థానంలో ఒక అప్సరసలా ఉండేది. ఆమె బాల్యంలో ఒక ముని తపోభంగం కలిగించినందుకు శపించబడింది. ఆమె బాల్యంలో , కాళ్ళు ముడుచుకుని ధ్యానంచేసుకుంటున్న వానరాన్నిని చూసి , ఆశ్చర్యంతో ఉత్సాహభరితంగా , చిన్నపిల్ల అయిన అంజన వానరం పైన పండ్లు విసిరింది. 

హఠాత్తుగా ధ్యానానికి భంగం కలిగిన వానరం రూపంలో ఉన్న ముని నిజరూపం పొంది , కోపంతో అంజనను , ఆమె ఎవరితోనైన ప్రేమలో పడిన్నప్పుడు వానరంగా మారమని శాపం ఇచ్చాడు. అంజన చేసిన తప్పు తెలుసుకుని ఆ మునిని క్షమాభిక్ష పెట్టమని యాచించింది మరియు ఆ ముని శాంతపడి ఆమె వానర రూపంలో ఉన్నా , ఆమెను ఎవరైతే ఇష్టపడతారో మరియు శివుని అవతారమైన శిశువుకు ఆమె జన్మ ఇచ్చినప్పుడు ఆమె శాపం నుండి విడుదల అవుతుందని వరమిచ్చాడు. 

అందువలన శాపవిమోచనానికి అంజన భూమిపైన జన్మించింది. అడవిలో నివాసం ఏర్పరచుకున్న అంజన ఒక రోజు ఒక పురుషుడిని చూసింది మరియు ఆమె అతనితో ప్రేమలో పడింది. ఆమె ప్రేమలో పడిన క్షణం నుండి , వెంటనే ఆమె వానర రూపంలోకి మారింది. ఆ మనిషి అంజన వద్దకు వచ్చి తన నామధేయం *'కేసరి'* అని , వానారములకు రాజును అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. అంజన వానర ముఖం కలిగి ఉన్నా అతనిని చూసి ఆశ్చర్యపోయింది మరియు ఇచ్ఛానుసారం వానరం మరియు మానవరూపాలను మార్చుకోగలిగిన శక్తి గల అతనిని చూసి అబ్బురపడింది. 

అతను తనను వివాహమాడమని అంజనను కోరాడు. అంజన మరియు కేసరి ఆ అడవిలోనే వివాహం చేసుకున్నారు. అంజన శివుడికి పూజలు జరిపి తపస్సు చేసింది. సంతోషించిన శివుడు ఆమెను కోరిక కోరుకోమన్నాడు. అంజన , ముని శాపవిమోచనం కోసం శివుడిని తన కుమారుడిగా జన్మించమని కోరుకున్నది. శివ ఆమె అభ్యర్థనను ఆమోదించాడు.

ఇంకో వైపు దశరధుడు , అయోధ్య రాజు సంతానం కోసం పుత్రకామేష్టి యజ్ఞం నిర్వర్తిస్తున్నాడు. తృప్తిచెందిన అగ్నిదేవుడు రాజుకు పవిత్రమైన పాయసం ఇచ్చాడు మరియు దైవాంశసంభూతులైన సంతానం కోసం ఆ పాయసాన్ని అతని భార్యలకు పంచిపెట్టమని చెప్పాడు. రాజు , అతని పెద్ద భార్య అయిన కౌసల్యకు ఒక భాగం ఇచ్చాడు. ఆ పవిత్ర పాయస భాగాన్ని ఒక గాలిపటం దూరంగా తీసుకెళ్ళింది. 

ఆ గాలిపటం ఆ పాయసభాగాన్ని(తీపి ఆహారము) అంజన తపస్య స్థలంలో పడవేసింది. మహాదేవుడు , అంజనా చేతుల్లో ఆ పాయసాన్ని ఉంచమని వాయు , గాలి దేవుడిని ఆజ్ఞాపించాడు. పాయసాన్ని చూసిన అంజన అది శివుని దీవేనలుగా భావించి సంతోషంగా ఆమె దానిని త్రాగింది.

ఆమె వానర ముఖంగల శివుని అవతారమైన శిశువుకి జన్మ ఇచ్చింది మరియు ఈ బాలుడు అంజనాదేవికి జన్మించటం వలన ఆంజనేయుడని , కేసరినందనుడని , వాయుపుత్ర లేదా పవనపుత్ర అంటే వాయువు యొక్క కుమారుడని వివిధ పేర్లతో ప్రసిద్ధి చెందాడు. తన బాల్యదశలో కూడా హనుమాన్ చాలా శక్తివంతమైనవాడు. అతను , తన తండ్రిఅయిన కేసరి , తల్లి , అప్సర అంజన యొక్క శక్తి , వాయువేగం గలవాడు. హనుమాన్ జననం వలన అంజన శాపవిమోచనం పొందింది మరియు స్వర్గం తిరిగివెళ్ళింది.

భక్తులెందరో హనుమంతుణ్ణి ఆదర్శనీయ దైవంగా ఆరాధిస్తారు. అతణ్ణి మహాహలుడు , బుద్ధిశాలి , కపిశ్రేష్టుడు , సర్వశాస్త్ర పారంగతుడు , స్వామిభక్తి పరాయణుడు , రామదూత అంటూ ఎన్నోవిధాలుగా ప్రస్తుతిస్తారు. తల్లి అంజనాదేవి కనుక అతణ్ని ఆంజనేయుడంటారు. అతని తండ్రి ఎవరనే విషయంలో శివమహాపురాణం , రామాయణం , పరాశరసంహిత మొదలైన గ్రంథాల్లోని వైవిధ్యగాథలతో అతడి దివ్యజననం ముడిపడి ఉంది. 

హనుమాన్ , ఏడుగురు చిరంజీవులలో ఒకడు మరియు శ్రీరాముడికి ప్రచండమైన భక్తుడు. అతను లంక రాజు , రావణుడి బారి నుండి సీతను కాపాడి తిరిగి శ్రీ రాముడికి అప్పగించాడు. హనుమాన్ కథ , మన జన్మ యొక్క రహస్యం , శక్తి గురించి తెలుసుకోవటంలో మనకు సహాయపడుతుంది.

జన్మతః బలసంపన్నుడు అయిన ఆంజనేయుడు ఒకమారు ఉదయించుచున్న సూర్యబింబమును చూచి పండు అనుకొని తినుటకు ఆకాశమునకెగిరెను. అప్పుడు జరిగిన ఘటనలలో ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆ బాలుని దవడ (హనుమ) పై కొట్టెను. అలా కొట్టడం వల్ల ఆ బాలుని దవడకు చొట్ట పడినది. చొట్ట పడిన దవడ కలిగిన వాడవడం చేత హనుమంతుడనే పేరు వచ్చింది. తన కొడుకు దెబ్బ తిన్నందుకు ఆగ్రహించి , వాయుదేవుడు వీచటం మానివేశాడు. అపుడు బ్రహ్మాది దేవతలు హనుమంతున కనేక వరాలిచ్చి వాయుదేవుని శాంతింప జేశారు.    
                                     *ఆంజనేయస్వామి అవతారాలు తొమ్మిది:*

హనుమంతుడు కూడా దుష్టశిక్షణ , శిష్టరక్షణ కోసం అవతారాలు ఎత్తాడు. అవి తొమ్మిది. హనుమన్నవావతారాలంటారు. పరాశర సంహితలో పరాశర మహర్షి వాటిని వివరించడం జరిగింది.

1. ప్రసన్నాంజనేయస్వామి.
2. వీరాంజనేయస్వామి.
3. వింశతిభుజాంజనేయ స్వామి.
4. పంచముఖాంజనేయ స్వామి.
5. అష్టాదశ భుజాంజనేయస్వామి.
6. సువర్చలాంజనేయ స్వామి.
7. చతుర్భుజాంజనేయ స్వామి.
8. ద్వాత్రింశాద్భుజాంజనేయస్వామి.
9. వానరాకార ఆంజనేయస్వామి
తంత్రశాస్త్రంలో హనుమంతుణ్ణి ఆరాధిస్తే సమస్త క్షుద్రపీడలు పటాపంచలై పోతాయి.....!!!

దశమహావిద్యలతో సమానమైన శక్తి కలవాడు ఆంజనేయుడు. హనుమంతుడు తంత్రదేవతలందరిలోకి అధికుడు. ఆంజనేయునికి అష్టసిద్ధులు ఉన్న కారణంగా ఆయనను ఉపాసించిన వారికి మానవాతీత శక్తులు లభిస్తాయి.

*ఆయన అష్టసిద్ధులు*

1. అణిమాసిద్ధి : శరీర పరిమాణం ఆవగింజంత చిన్నదిగా చేసుకోగల శక్తి.

2. మహిమాసిద్ధి : శరీర పరిమాణం పర్వతమంత పెంచుకోగల శక్తి.

3. లఘిమాసిద్ధి : శరీరం బరువును నువ్వుగింజ కన్నా తక్కువ బరువుగా చేసే శక్తి.

4. గరిమ : శరీరం బరువును పర్వతమంత బరువు పెరిగేలా చేసే శక్తి.

5. ప్రాప్తిసిద్ధి : ఎక్కడికైనా ప్రయాణించగల శక్తి.. దేనినైనా పొందగలిగే శక్తి.

6. పరకామ్యసిద్ధి : ఎవరూ తగ్గించలేని ఆత్మబలాన్ని కలిగిఉండే శక్తి.

7. వశిత్వసిద్ధి : అన్ని జీవులపైనా ఆధిపత్యాన్ని కలిగిఉండే శక్తి.

8. ఈశిత్వసిద్ధి : దేనినైనా సృష్టించగల మరియు దేనినైనా నాశనం చేయగల శక్తి.


*శ్రీ హనుమంతుని ప్రదక్షిణాలు ఎలా చేయాలి ?*

హనుమంతునకు ప్రదక్షిణములు ఇష్టం. ఏ దేవాలయానికి వెళ్ళినా మూడు ప్రదక్షిణాలు చెస్తాం. కాని హనుమంతుని ఆలయానికి వెళ్లినప్పుడు ఐదు ప్రదక్షిణాలు చేయాలి. *'ప్రదక్షిణన మస్కారాన్ సాష్టాంగాన్ పంచ సంఖ్యాయా'* అని ఆర్ష వాక్యం. మామూలుగా ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ప్రదక్షిణ శ్లోకాలు చదువు కోవాలి. సకల రోగ , భూతప్రేత పిశాచాది భాధలు తొలగుటకు , అభిష్టకి ప్రదక్షిణాలు సుప్రసిద్దాలు. ప్రదక్షిణాలు చేసి సంతానం పొందిన వారెందరో ఉన్నారు. కాబట్టి భక్తులను ఏ బాధలో ఉన్నా ప్రదక్షిణాలకు ప్రోత్సహించండి. నియమాలు పాటించటం ముఖ్యం. రోజు ఒకే మారు 108 లేదా 54 అదీ చేయలేనివారు 27 పర్యాయాలు చేయాలి. పుష్పములు. వక్కలు , పసుపుకొమ్మలు వంటి వాటిని లెక్కించడానికి వాడటం మంచిది. ప్రదక్షిణాలు చేస్తూ చదవాల్సిన ధ్యానం.

*'శ్రీహనుమన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్'*

శ్లో|| ఆంజనేయం మహావీరం - బ్రహ్మవిష్ణు శివాత్మకం
తరుణార్క ప్రభంశాంతం - రామదూతం నమామ్యహం

శ్లో|| మర్కటే శ మహొ త్సాహ - సర్వశోక వినాశన
శత్రూన్సంహర మాం రక్ష - శ్రియం దాపయ మే ప్రభో||

అని చదువు కొంటూ ప్రదక్షిణాలు చేయాలి. కోరిక మేరకు మండలం , అర్ధ మండలం కాని ప్రదక్షిణాలు చేసి చివరిలో స్వామికి విశేషార్చన జరిపించి

''యాకృత్తె రేభి: ప్రదక్షిణ ణై| శ్రీ సువర్చలా సమేత హనుమాన్ సుప్రిత స్సుప్రసంనో వరదో భూత్వా మామాభిష్ట సిద్దం దదాతు''

అని జలాన్ని అక్షతలతో వదలిపెట్టాలి. ప్రదక్షిణ కాలంలో బ్రహ్మచర్యం , శిర స్స్నానం , నేలపడక , సత్త్వికాహారం వంటి నియమాలు పాటించాలి.

*ఆచరణ:* భక్తులకు ఏ బాధలు కలిగినా నియమాలు చెప్పివారు ప్రదక్షిణాలు చేయునట్లు ప్రోత్సహించి వారి బాధలు స్వామిద్వారా తోలగునట్లు చేయాలి. హనుమత్ప్ర దక్షిణ ధ్యానం శీలాఫలకంపై చెక్కించి ఆలయాన అతికించాలి. మామూలుగా ఐదు ప్రదక్షిణాలు చేయమని భక్తులకు తెలపాలి.

*అభిషేకం*

పరమ వైష్ణవ శిఖామణి అయిన హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు కాబట్టి ఆయనకు అభిషేకం ఇష్టం. అందులోనూ మన్యు సూక్త అభిషేకిస్తే పరమానంద భరితుడు అవుతాడు , కోరికల్ని తీరుస్తాడు. స్వామి పుట్టిన నక్షత్రం పూర్వభాద్ర రోజు తప్పకుండా చేయాలి. వారం వారం , నిత్యమూ చేయగలగటం మరీ మంచిది.

*ఆచరణ :* మన్యుసూక్తం నేర్చుకొని భక్తులకు దాని విలువ తెలిపి ప్రతి పర్వదినానా దాతల ద్వారా అభిషేకం జరిపింపజేయాలి

*మంగళ వార సేవ*

మంగళవారంనాడు హనుమంతునకు శరీరంపై సింధూరం పూయటం చాల ఇష్టం. అంతా కుదురనివారు మూతికయినా తప్పక పూయాలి. సింధూరార్చన చేయటం , అరటి పండ్లు నివెదించటం చేయాలి. అందుకు కారణమైన విశేషగాధ ఉంది.

*శనివార సేవ*

హనుమంతుడు శనివారం జన్మించాడు. కాబట్టి ఆయనకు శనివారం ఇష్టమైనది. నాడు యథాశక్తి విశేషార్చన , సహస్రనామాదికం చేయాలి. భక్తులచే అప్పాలు , వడ మాల వంటి విప్రోత్సహించి చే యించి స్వామికి సంతృప్తి కలిగించాలి.

*పంచ సంఖ్య*

హనుమంతుడు పంచ (ఐదు) సంఖ్య ఇష్టం కాబట్టి చెసే ప్రదక్షిణాలు , నమస్కారాలు ఐదు చేయాలి. అరటి పండ్లు వంటి ఏవయినా ఐదు సంఖ్యలలో సమర్పించుట స్వామికి ప్రీతికరం.

*హనుమాన్ జన్మదినం*

హనుమంతుడు వైశాఖ మాసంలో , కృష్ణ పక్షంలో , దశమితిథి పూర్వభాద్రా నక్షత్రం , శనివారం , కర్కాటక లగ్నంలో , వైదృతి యోగంలో జన్మిచాడు. ఇవి ఖగోళాది సకల ప్రమాణాలతో ఏ , కల్పంతర గాధలను బట్టి ఎవరో చేప్పారని భిన్న భిన్న తిథులలో హనుమంతుని జన్మదినం కొందరు జరుపుతున్నారు. సాధారణంగా మే నెలలో వచ్చే వైశాఖ బహుళ దశమినాడు తప్పక జయంతి జరపాలి. వీటిని పంచాహ్మికంగా ఐదు రోజులు ఇలా శక్తి కొలది జరుపవచ్చు.

*విశేషార్చనలు సామూహిక కార్యక్రమాలు నిర్వహించాలి.*

*ఆచరణ :* సంవత్సరంలో ఈ ఒక్క జన్మదినం నాడైనా భక్తులను మారేడుదళం , సింధూరం మల్లెపూలు లేదా తములపాకులు , తులసిదళం , ప్రోత్సహించి లక్షార్చన వంటి వాటితో జరిపించాలి.

🕉🌷🌷🌷🌷🙏🌷🌷🌷🌷🕉
      *🌷ॐ ఓం నమః శివాయ ॐ🌷*