Thursday, October 30, 2025

తెలుసుకుందాం తెలియని విషయాలు

🔔 *తెలుసుకుందాం* 🔔

మనం నిత్యం పూజించే దేవీదేవతల చేతులలో వివిధ ఆయుధాలు చూస్తుంటాం, ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉంటాయి, విశ్వంలో ఓ ఐదు శక్తివంతమైన గద ఆయుధాల గురించి తెలుసుకుందాం,

"ఏకం సత్ విప్ర బహుధా వదంతి" అంటే ఉన్నదీ ఒక్కటే సత్యం, పలువిధాలుగ దర్శనమిస్తూ ఉంటుంది, పరమాత్మ ఒక్కటే బ్రహ్మ గా, విష్ణువు గా, శివుడిగ, మరెన్నో విధాలుగా కనిపిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి. అయితే పరమాత్మ ప్రతి రూపంలో అనేక ఆయుధాలు ధరించారు అందులో గద కూడ ఒకటి, ఆయా రూపాలలో వారు ధరించిన గద కి ఆయాపేరుతో పిలిచారు,

*భగవాన్ శివుడి గద - "ఏక్ష"*

అదేంటి శివుడు త్రిశూల పాణి కదా, గద దరుడు కాదు అంటారేమో, కానీ శివుడికి సర్వాయుధాలు కలవని శివపురాణమే చెబుతుంది,

ఈ గద శివుడి చేతిలో ఉన్నప్పుడు "ఏక్ష" అనుపేరుతో ఉంటుంది, శివుడు అమ్మవారి స్వరూపంలో ఉన్నప్పుడు కూడ ఈ "ఏక్ష" అను గద ను ధరించి ఉంటారు, ఈ "ఏక్ష" ని సృష్టి లయం చేసే సమయంలో స్వామి వాడతారని శాస్త్రాలు చెబుతున్నాయి.

*భగవాన్ విష్ణువు గద - "కౌమోదకి"*

విశువుకు శంక చక్ర ఖడ్గం గద అను ఆయుధాలు కలవు అందులో గద పేరు "కౌమోదకి" స్వామివారు లక్ష్మి స్వరూపంలో కూడా ఈ "కౌమోదకి" ని ధరించి ఉంటారు. స్వామి ఏ అవతారంలో ఉన్న ఈ కౌమోదకిని ధరించి శత్రుసంహారం చేసినారని పురాణవచనం.

*భగవాన్ హనుమ గద - "కౌమోదకి"*

సాక్షాత్తు పరమేశ్వరుడే హనుమగ అవతిరించారని శాస్త్రాలు చెబుతున్నాయి, ఈ శివస్వరూపం ఐన హనుమ గారు శ్రీమద్రామాయణంలో వారు గధ పట్టుకుని యుద్ధం చేసినట్లు ఎక్కడ లేదు కానీ వేరే పురాణ గ్రంధాలలో గద ని ఆయుధంగా కలవారని ఉన్నదీ, ఆ గధ పేరు "కౌమోదకి", ఈయనేమో విష్ణు స్వరూపం ఈయన గద నెమో విష్ణు మూర్తి వారిది, కదా అంటే. స్వరూపం ఏదైన భగవాన్ ఒక్కరే కదా, శివ విష్ణువులు వేరు కాదని చెప్పే ఒక్క ఆధారం ఇది అని అంటారు పెద్దలు.

ఇంక ద్వాపర యుగ కాలం లో ఆదిశేషుడు బలరాముడుగ అవతరించాడని పురాణ గ్రంధాలు మహాభారతం చెబుతున్నాయి.

*భగవాన్ బలరాముడి గద - "సోలందరు"*

బలరాముడు హలధరుడు అంటే నాగలిని ఆయుధంగ ధరించేవాడని అర్థం, కానీ ఆయనకు తపస్సుద్వార సిద్ధించిన గద ఉన్నదీ దానిపేరు "సోలందరు", ఇది చాల శక్తివంతం ఐనది, ఏదైన సమయం లో ఈ గద గాని భూమికి తగిలితే భయంకరమైన భూకంపం వస్తుందని శాస్త్ర వచనం, ఈ బలరాములవారు గద యుద్ధం లో ఆరితేరి ఉన్నవారిని, వీరే భీమ దుర్యోధనులకు గదా యుద్ధం నిరూపించారని భారత వచనం. బలరాముడు ఒక్కడే పాండవ కౌరవులను నాశనం చేయగలడు కాబట్టి వారు యుద్ధములో పాలు పంచుకోలేదు.

*భీముడి గద - "వర్గోధర్మ"*

భగవాన్ వాయుదేవుడే కుంతికి సద్యో గర్భాన అంటే మైథున సంపర్కం లేకుండ జన్మించడాన్ని సద్యోగర్భం అంటారు, వాయుదేవుడు ఆమాదిరి పిల్లాడిల కుంతి ఒడిలో ప్రత్యక్షం అయ్యాడు, మహాబలశాలి, పాండవులలో రెండవ వాడు, ఈ భీముడి గద పేరు "వర్గోధర్మ", ఈయన గద కూడ తపస్సు ద్వార పొందినదే అంటారు, ఈ గద ధరించడం వలన భీముడి శక్తి రెట్టించినదై ఉంటుందని చెబుతారు, ఈ గద సుమారు 5000ల కేజీల బరువుకు పైమాటే అంటారు, ఈ గద ని వీరు తప్ప ఎవరు ఎత్తలేరని చెబుతారు. ఈ గద తో ఒక్క దెబ్బకే దుశ్యాసనుడు దుర్యోధనుడు చచ్చారని చెబుతారు.

తృప్తి గల జీవితం కోసం మార్గం

తృప్తి గల జీవితం కోసం మార్గం
👇
1) ప్రస్తుతంలో జీవించడం (Living in the Moment):
గతం మీద పశ్చాత్తాపం, భవిష్యత్తుపై భయం — ఇవి మన శాంతిని దోచేస్తాయి. “ఇప్పుడు” అనే క్షణాన్ని ఆస్వాదించగలిగితే మనసు ప్రశాంతంగా ఉంటుంది.
2) కృతజ్ఞత భావం (Gratitude):
మనకు ఉన్నదానికి కృతజ్ఞత చూపడం — ఇది తృప్తికి తొలి మెట్టు.
ప్రతి రోజు కాసేపు “నాకు లభించిన మంచి విషయాలు” గుర్తుచేసుకోవాలి.
 3) సేవ భావం:
మనకంటే ఇతరులకు ఉపయోగపడే పనులు చేస్తే మన లోపలి ఆనందం పెరుగుతుంది.
నిజమైన తృప్తి “స్వార్థరహిత సేవ”లోనే ఉంటుంది.
4) స్వీయ అవగాహన:
మన బలాలు, బలహీనతలు తెలుసుకుని, మనకు సరిపడే దారిలో ముందుకు సాగితే జీవితం సంతృప్తిగా ఉంటుంది.
5) సాధారణత (Simplicity):
ఆడంబరాలు తగ్గించి సాదాసీదాగా జీవించడం — ఇది మనసుకు ప్రశాంతత ఇస్తుంది.
సారాంశం 
“తృప్తి అనేది బాహ్య వస్తువుల వల్ల రాదు; అది మన లోపలి ఆలోచనల వల్ల వస్తుంది.”

Saturday, October 25, 2025

బాదం ఆరోగ్య ప్రయోజనాలు

బాదం ఆరోగ్య ప్రయోజనాలు

బాదం (Almonds) ఆరోగ్యానికి మంచి పళ్ళు. ఇవి శక్తివంతమైన పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు కలిగి ఉంటాయి. అనంతం ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి.

### ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు

- గుండె ఆరోగ్యానికి: బాదం గుండెకు మేలు చేస్తుంది. ఇవి చెడు కొలెస్ట్రాల్ (LDL) పరిమాణాన్ని తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ (HDL) పెంచుతాయి. ఇందులో మోనోసాచురేటెడ్ కొవ్వులు ఉండటం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
- బరువు నియంత్రణ: బాదంలో ఫైబర్, ప్రొటీన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎక్కువసేపు కడుపు నిండిగా భావనను కలిగించి, బరువు నియంత్రించడంలో సహాయపడతాయి.
- జీర్ణవ్యవస్థ ఆరోగ్యం: బాదాల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది, మలబద్ధకం సమస్య నివారిస్తుంది.
- చర్మం, జుట్టు: బాదంలో విటమిన్ E, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మాన్ని మెరిసేలా చేస్తాయి, వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తాయి, జుట్టు వృద్ధికి తగిన పోషణ ఇస్తాయి.
- మెదడు ఆరోగ్యం: విటమిన్ E, మెగ్నీషియం తదితర ఖనిజాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత కోసం పిల్లలు, వారి పెద్దలకు బాదం మేలు చేస్తుంది.
- రోగనిరోధక శక్తి: ఇందులో శక్తినిచ్చే ఖనిజాలు, విటమిన్లు ఉండటంతో ఇన్‌ఫెక్షన్లను నిరోధించడంలో శక్తిని పెంపొందించడంలో కీలకం.
- రక్తపోటు మరియు చక్కెర నియంత్రణ: బాదం పొటాషియం, ఫైబర్ వల్ల రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. క్రమం తప్పకుండా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రితంగా ఉంటాయి.

### బాదం తినడానికి సూచనలు

- రోజుకు సగటున 5-8 బాదం పప్పులు తిన్నా చాలును. ఎక్కువగా తినకూడదు.
- రాత్రి నీళ్ళలో నానబెట్టి ఉదయం తినడం అత్యుత్తమం.
- బాదాన్ని పచ్చిగా, నానబెట్టినట్లుగా, లేకపోతే పేస్ట్ గా తీసుకోవచ్చు.

బాదం ఆరోగ్యానికి మేలు చేసే సహజ super food. రోజూ పరిమితంగా పరీక్షాధికంగా తీసుకోండి, సంపూర్ణ ఆరోగ్యానికి దోహదపడుతుంది.

Friday, October 24, 2025

అయిదు వేళ్ళ స్పర్శ – ఆహారానికి ఆధ్యాత్మిక శక్తి!

﹌﹌﹌﹌﹌﹌ ॐ ﹌﹌﹌﹌﹌﹌
☀️ *తెలుసుకుందాం* ☀️
﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌
🌿 *అయిదు వేళ్ళ స్పర్శ – ఆహారానికి ఆధ్యాత్మిక శక్తి!* 🌿
﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌﹌
*డైనింగ్ టేబుల్ మీద ఫోర్క్, స్పూన్‌లు రాజ్యం చెలాయిస్తున్న కాలం ఇది.*
*చేతితో భోజనం చేసే వాడిని “అనాగరికుడు”గా చూడటం విచిత్రమే!*
కానీ...
*మన వేళ్ళలో ఉన్న శక్తిని తెలుసుకుంటే, స్పూన్‌లు పక్కన పెట్టేస్తారు.*
🪔 *చేతితో భోజనం చేయడం వల్ల లభించే ప్రయోజనాలు (Science & Ayurveda ప్రకారం):*
1️⃣ *చేతిస్పర్శ వల్ల నాడీ తంత్రం సక్రియమవుతుంది – శరీరానికి బలం చేకూరుతుంది.*
2️⃣ *వేళ్ళ టచ్‌తో మెదడుకు సంకేతాలు వెళ్ళి, జీర్ణరసాలు విడుదలవుతాయి – అజీర్ణం రాదు.*
3️⃣ *మనస్సు ధ్యాసలోకి వస్తుంది – Mindful Eating అలవాటు అవుతుంది.*
4️⃣ *ఆహారం రుచి, వాసన, ఉష్ణం అన్ని ఇంద్రియాలకు చేరి జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది.*
5️⃣ *వేళ్ళు ఆహారాన్ని కలుపుకోవడం రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.*
6️⃣ *వేళ్ళు పెదాలకు తగిలినపుడు లాలాజలం ఊరుతుంది – digestion ప్రారంభమవుతుంది.*
7️⃣ *ఈ విధానం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.*
🖐️ *ఒక్కో వేలు ఒక్కో తత్వానికి ప్రతినిధి:*
*బొటనవేలు – 🔥 అగ్ని తత్వం*
*చూపుడు వేలు – 💨 వాయు తత్వం*
*మధ్యవేలు – ☁️ ఆకాశ తత్వం*
*ఉంగరపు వేలు – 🌍 భూమి తత్వం*
*చిటికిన వేలు – 💧 జల తత్వం*
🍽️ *ఈ అయిదు తత్వాల స్పర్శ ఆహారానికి తగిలినపుడు జీవశక్తి ఉత్తేజితం అవుతుంది.*
*మన శరీరం, మనసు, ఆహారం — ఈ మూడు ఒక త్రివేణిగా కలుస్తాయి.*

🪔 *ధర్మో రక్షతి రక్షిత:*
*భారతీయతను మళ్లీ మన భోజనంలోకి తెద్దాం.*

*చిన్నపిల్లలకు స్పూన్‌ కంటే సంస్కృతి నేర్పండి.*

Wednesday, October 22, 2025

పురుషుడు ఎలా వుండాలి?

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

 *పురుషుడు ఎలా వుండాలి?*
            ➖➖➖✍️

```
స్త్రీఎలా ఉండాలో అనే కాదు, పురుషుడు కూడా ఎలా ఉండాలో ధర్మశాస్త్రం చెప్పింది. ఎందుచేతో ఈ పద్యం జన బాహుళ్యం లోకి రాలేదు!```

*కార్యేషు యోగీ, కరణేషు దక్షః, రూపేచ కృష్ణః , క్షమయాతు రామః, భోజ్యేషు తృప్తః, సుఖదుఃఖ మిత్రం, షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః* *(కామందక నీతిశాస్త్రం)*

*1. కార్యేషు యోగీ :*```
పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి!```

*2. కరణేషు దక్షః :*```
కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనం తో వ్యవహరించాలి. సమర్ధుడైఉండాలి.```

*3. రూపేచ కృష్ణః:*```
రూపంలో కృష్ణుని వలె ఉండాలి. అంటే ఎల్లప్పుడూ ఉత్సాహంగా, సంతోషంగా ఉండాలి.```

*4. క్షమయా తు రామః:*```
ఓర్పులో శ్రీ రామునిలాగా ఉండాలి. పితృ వాక్య పరిపాలకుడైన శ్రీరాముని వలె క్షమించేగుణాన్ని కలిగిఉండాలి.```

*5. భోజ్యేషు తృప్తః:*```
భార్య/తల్లి వండినదాన్ని సంతృప్తిగా (వంకలు పెట్టకుండా) భుజించాలి.```

*6. సుఖ దుఃఖ మిత్రం:*```
సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగాఉండాలి.మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి.

ఈ షట్కర్మలు - ఈ ఆరు పనులు సక్రమంగా చేసే పురుషుడు ఉత్తమ పురుషునిగా, ధర్మనాథునిగా కొనియాడ బడతాడు.✍️️```                                               

🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

Tuesday, October 21, 2025

కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం" అని వర్ణించారు.

ఓంకారాన్ని సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం అన్నారు ఒక గీతంలో. ఓంకారము కన్నుల కొలనులో ప్రతిబింబించటమేమిటి?
జవాబు
ఓంకారాన్ని "కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం" అని వర్ణించారు.
దీని అర్థం ఏమిటంటే:
1. చైతన్యమే ప్రధానం: మనం దేనినైనా కళ్లతో కాకుండా, కళ్ల వెనుక ఉన్న ప్రాణ చైతన్యంతో చూడాలి. ఈ చైతన్యమే నాదం (ఓంకారం).
2. హృదయంతో చూడాలి: కళ్లకు కనిపించని, చెవులకు వినిపించని ఆ దివ్యమైన నాదం యొక్క ఉనికిని అర్థం చేసుకోవడానికి, ఆ నాదాన్ని అనుభవించగలిగే హృదయం కావాలి. అలాంటి హృదయం ఉంటే, సృష్టిలోని ప్రతి అణువులోనూ ఆ నాదం కనిపిస్తుంది, వినిపిస్తుంది.
3. ప్రకృతిలో నాదం: ఉదాహరణకు, తెల్లవారుజామున తూర్పు దిక్కు వీణపై (ప్రాగ్దిశ వీణియపైన), సూర్యుడి కిరణాలు తీగలుగా (దినకర మయూఖ తంత్రులపైన) పక్షులు తమ రెక్కల సవ్వడులతో చేసే కిలకిలారావాలే ఆ వేకువ నాదం. ఇది నిద్రలో ఉన్న లోకాన్ని మేలుకొలిపే తొలి చైతన్య నాదం.
4. జీవన వేదమే ఓంకారం: ఈ సృష్టి అంతటికీ కారణమైన విరించి (బ్రహ్మ) మనసులో పుట్టిన "అనాది జీవన వేదం" (తెలుసుకోవలసిన చైతన్యం) ఈ ఓంకారం.
5. ప్రతి జీవిలోనూ నాదం: అప్పుడే పుట్టిన బిడ్డ ఏడ్చే కేక కూడా "ఏడుపు" కాదు. ఈ నాదమయ జగత్తులో కొత్తగా పుట్టిన ప్రాణం యొక్క తొలి జీవన నాదం. ఇదే ఆ "అనాది రాగం".
6. విశ్వాసమే గానం: ఈ సృష్టి విలాసాన్ని గమనించగలిగే చైతన్యం ఉన్న మనిషి యొక్క శ్వాస (ఉచ్ఛ్వాసం, నిశ్వాసం) కూడా సాధారణ నిట్టూర్పుగా కాక, ఈ విశ్వ రహస్యాన్ని పీల్చుకుని పలికే గానం (పాట) లా మారుతుంది.
: ఓంకారం అనేది కళ్లతో చూసే రూపం కాదు, హృదయంతో అనుభవించే సృష్టి యొక్క మూల చైతన్యం (నాదం). మన కనులలో, మనసులో ఆ చైతన్యం ప్రతిబింబించినప్పుడే ఈ సృష్టిలోని ప్రతి కదలికలోనూ ఆ ఓంకార విన్యాసాన్ని చూడగలం.
======================================
పాట ఇది-
విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం ఓం... ప్రాణనాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవనాదం ఓం... కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం
సరస స్వర సుర ఝరీ గమనమౌ సామవేద సారమిది నేపాడిన జీవన గీతం ఈ గీతం
ఆమె:
విరించినై విరచించితిని ఈ కవనం విపంచినై వినిపించితిని ఈ గీతం
ఆమె
: ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రులపైన జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదికపైన పలికిన కిలకిల స్వరముల స్వరజతి జగతికి శ్రీకారము కాగా విశ్వకావ్యమునకిది భాష్యముగా....
విరించినై
జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవననాద తరంగం చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా సాగిన సృష్టి విలాసములే....
విరించినై

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే..... ❤️

❤️గుండె ఆరోగ్యంగా ఉండాలంటే..... ❤️

  మనిషికి గుండె చాలా ముఖ్యమైనది. రక్తాన్ని పంపిణీ చేసే కీలకమైన వ్యవస్ధ గుండె. నిరంతరాయంగా పనిచేస్తూ ఉంటుంది. అలాంటి ముఖ్యమైన గుండె అనారోగ్యాల బారిన పడకుండా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కానీ.. ఈ రోజుల్లో చిన్న పెద్దా అని తేడా లేకుండా.. గుండె సమస్యలు వస్తున్నాయి. దానికి కారణం.. తినే ఆహారం, జీవనశైలి. అయితే ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా..?

వాస్తవానికి.. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఆరోగ్యకరమైన శరీరానికి చాలా ముఖ్యమైన పోషకాలు. అయితే వాటిని ఆహారంలో తినడం జనాలు తగ్గిస్తున్నారు. దీంతో గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే.. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే గుండెపోటు వంటి సమస్యల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లను ఏ ఆహారాలు అందిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.


👉సోయాబీన్: గుండె ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలన్నింటిలో సోయాబీన్స్, సోయాకు సంబంధించిన పలు ఉత్పత్తులు ఉత్తమం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు కావాల్సిన అన్ని రకాల ప్రోటీన్లు, మినరల్స్, మైక్రోన్యూట్రియంట్స్ ఇందులో ఉంటాయి. సోయాబీన్స్​లో గుండెకు కావాల్సిన ప్రోటీన్లతో పాటు అన్ని రకాల ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. అలాగే మైక్రోన్యూట్రియంట్స్ అయిన విటమిన్లు కూడా సోయాబీన్స్ వల్ల శరీరానికి అందుతాయి.

👉అవిసె గింజలు: అవిసె గింజలు బరువు తగ్గించడంలో చాలా మేలు చేస్తాయి. అంతేకాకుండా.. ఇది ఒమేగా -3 కొవ్వు ఆమ్లాల గొప్ప మూలంగా పరిగణించబడుతుంది. మీరు దీన్ని తినాలనుకుంటే.. ఈ గింజలను గ్రైండ్ చేసి పొడిని తయారు చేసుకుని తినవచ్చు.. లేదంటే విత్తనాల సహాయంతో లడ్డూలుగా తయారు చేసి తినవచ్చు.

👉అవకాడో: అవకాడో మోనోశాచురేటెడ్ కొవ్వుకు అద్భుతమైన మూలం. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.. దీంతో గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వారానికి కనీసం 2 అవకాడోలు తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 16% తక్కువగా ఉన్నాయని ఓ అధ్యయనంలో తేలింది.

👉గుడ్డు: గుడ్లు తినడం వల్ల శరీరానికి కాల్షియం అందుతుంది. అంతేకాకుండా.. శరీరానికి బలాన్ని చేకూరుస్తుంది. ఉదయం అల్పాహారంలో గుడ్లు తినడం వల్ల రోజంతా శక్తిగా ఉంచడానికి సహాయపడుతుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.

👉చేపలు: సాల్మన్, మాకేరెల్, సార్డిన్ మరియు ట్యూనా వంటి చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. చేపల నుండి లభించే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

👉వాల్‌నట్: డ్రై ఫ్రూట్స్ గురించి మాట్లాడితే.. వాల్‌నట్ ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. ఇవి తినడం వల్ల మీ శరీరంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లోపం ఉండదు. అయితే వాల్‌నట్‌లు ఎక్కువగా వేసవికాలంలో తినొద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

👉ఆవు పాలు: పాలు తాగడం వల్ల మన ఎముకలు దృఢంగా ఉండటమే కాకుండా దానితో పాటు మన శరీరానికి అనేక పోషకాలు అందుతాయి. మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆవు పాలను వీలైనంత ఎక్కువగా తాగండి. ఎందుకంటే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఇందులో కూడా ఉంటాయి.