Saturday, December 10, 2022

కొన్ని నిజాలు

#అద్భుత విషయశోదన

#ఏడుగురు అప్సరసల పేర్లు ఏవి ?*
 
1.రంభ. 2. ఉర్వశి. 3.మేనక  4.తిలోత్తమ. 5.సుకేశి. 6. ఘ్రుతాచి 7. మంజుగోష .

 *సప్త సంతానములు అంటే ఏమిటి ?*

  #1చెరువులు తవ్వించడం, 2. బావులు తోడించడం,  3ఉద్యానవనాలు పెంచడం, 4అందరికీ ఉపయోగపడే కల్యాణమండలపాలు కట్టించడం, 5. జలాశయాలు నిర్మించడం, 6 సద్ధర్మాచణ చేయడం, 7. అగ్రహారాలను దత్తత చేసుకోవడం. వీట్టినని సప్త సంతానాలు అంటారు

*#తొమ్మిది రకాల ఆత్మలు  ఏవి ?*

 1. జీవాత్మ. 2. అంతరాత్మ. 3. పరమాత్మ.
 4. నిర్మలాత్మ. 5. శుద్దాత్మ. 6. జ్ఞానత్మ  
7. మహాధాత్మ . 8. భూతాత్మ . 9. సకలాత్మ.

 *పదిరకాల పాలు ఏవి ?*

 1. చనుబాలు. 2. ఆవుపాలు . 3. బర్రెపాలు .
 4. గొర్రె పాలు. 5. మేక పాలు. 6. గుర్రం పాలు.
 7. గాడిద పాలు. 8. ఒంటె పాలు. 9. ఏనుగు పాలు.
 10. లేడి పాలు.

 #యజ్ఞోపవీతం లొ ఎన్నిపోగులు ఉంటాయి?*

 #యజ్ఞోపవీతం లొ 9 పోగులు ఉంటాయి. ఆ తొమ్మిది పోగుల్లో 9 మంది దేవతలు నివసిస్తారు. వారు  
 1. బ్రహ్మ . 2. అగ్ని. 3. అనంతుడు. 4. చంద్రుడు . 5. పితృ దేవతలు . 6. ప్రజాపతి. 7. వాయువు .
 8. సూర్యుడు . 9. సూర్య దేవతలు .

 #అష్టాదశ ఆయుర్వేద సంహితలు ఏవి ?*

 1. చరక సంహిత. 2. శూశ్రుత సంహిత. 3. పరాశర సంహిత. 4. హరిత సంహిత. 5. అగ్నివేశ సంహిత. 6. చ్యవన సంహిత. 7. ఆత్రేయ సంహిత. 8. భోజ సంహిత. 9. బృగు సంహిత. 10. బెడ సంహిత. 
11. అగస్త్య సంహిత. 12. వరాహ సంహిత. 
13. అత్రి సంహిత. 14. నారయణ సంహిత. 
15. చంద్ర సంహిత. 16. నారసింహ సంహిత. 
 17. శివ సంహిత. 18. సూర్య సంహిత.

 #గృహ నిర్మాణం ఏ విధంగా చేపడితే సర్వ సుఖాలు పొందుతారు?*

 1. ఈశాన్యం లొ పూజలు , పవిత్ర కార్యాలును నిర్వర్తించే విధంగా పూజగది ఉండాలి.
 2. ఆగ్నేయం లొ అగ్నికి సంబందించిన వంటావార్పు చేసుకొనే విధంగా వంటగది ఉండాలి.
 3. నైరుతిలో ఆయుధ సామగ్రి మొదలయిన వాటిని పెట్టుకోవడానికి ఒక గది ఉండాలి.
 4. వాయువ్యం లొ స్వతంత్రబిలాష చిహ్నములు .
 5. తూర్పు దిక్కున సూర్యునికి ప్రీతికరమైన పనులు.
 6. యమస్థానం అయిన దక్షిణం వైపు తలపెట్టి నిద్రించుట.
 7. కుభేర స్థానం అయిన ఉత్తరం వైపు చూస్తూ నిద్రలేచుట.
 8. వరుణ స్థానం అయిన పశ్చిమాన పాడిపశువులు పెంచుటకు తగిన స్థలం ఉండవలెను.
 ఈ విధంగా చేయుటవలన ఆయా దిక్కులలోని ఉన్న దేవతలు సంతృప్తి చెంది ఆ గృహములో నివసించేవారికి సర్వసుఖాలు, సర్వ సంపదలు ఇస్తారు.

 #వివిద ఫలాల నైవేద్యం  -  ఫలితాలు*

 #కొబ్బరి కాయ ( పూర్ణ ఫలం ) - భగవంతుడికి కొబ్బరి కాయను నైవేద్యం గా సమర్పిస్తే మొదలు పెట్టిన పనులన్నీ త్వరితగతిన సులభంగా విజయవంతం అవుతాయి.

 #అరటి పండు - భగవంతుడికి అరటిపండు నైవేద్యం గా సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగుతుంది. అరటిపండు గుజ్జుగా చేసి నైవేద్యం గా సమర్పిస్తే అప్పుల బాధనుండి విముక్తి పొందుతారు. చేజారిన సొమ్ము తిరిగి సకాలంలో చేతికి అందుతుంది. చిన్న అరటిపళ్లు నైవేద్యం గా సమర్పిస్తే మద్యలో నిలిచిపోయిన పనులు సక్రమంగా పూర్తి అవుతాయి.

 #నేరెడు పండు. - శనీశ్వరునికి నేరెడు పండు నైవేద్యం గా పెట్టి  ఆ ప్రసాదాన్ని తింటే వెన్నునొప్పి, నడుమునొప్పి, మోకాళ్ల నొప్పి వంటివి తొలిగిపోయి ఆరొగ్య వంతులు అవుతారు.

 #ద్రాక్ష పండు. - భగవంతుడికి నివేదించిన ద్రాక్ష పండ్లు ముందు చిన్నపిల్లలకు, తరవాత పెద్దలకు పంచినట్లైతే ఎల్లవేళలా సుఖసంతోషాలతో వర్దిల్లుతారు. రోగాలు నశిస్తాయి. కార్యజయం లభిస్తుంది.
 
#మామిడి పండు. -  మామిడి పండుని నైవేద్యం గా పెడితే ప్రభుత్వం నుంచి రావలసిన నగదు ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో అందుతుంది. నమ్మి మోసపోయినప్పుడు నైవేద్యం గా పెట్టిన మామిడి పండుని దేవునికి అభిషేకం చేసిన తేనెలో కలిపి నైవేద్యం గా పెట్టి అందరికి పంచి తరువాత తిన్నట్లయితే మోసం చేసిన వారు స్వయంగా మీ నగదును మీకు తిరిగి ఇచ్చేస్తారు.

 #అంజూర  పండు. - భగవంతుడికి నైవేద్యం పెట్టిన అన్జురాపండు ను అందరికి పంచిన తరువాత తిన్నవారికి ఆనారోగ్య భాధలు అన్ని తొలగి ఆరొగ్య వంతులు అవుతారు.
 
#సపోట పండు. - సపోట పండు నైవేద్యం గా సమర్పిస్తే పెళ్లి నిశ్చయ సంభంద విషయాలలో అవాంతరాలు అన్ని తొలగిపోతాయి.
 
#యాపిల్ పండు - భగవంతుడికి యపిల్ పండు ని నైవేద్యంగా పెడితే దారిద్ర్యం తొలగి ధనవంతులు అవుతారు.
 
#కమలా పండు. -  భగవంతుడికి కమలా పండు నివేదించి నట్లయితే నిలిచిపోయన పనులు సజావుగా పూర్తి అవుతాయి.

 #పనసపండు -  పనసపండు ని దేవుడికి నైవేద్యంగా పెడితే శత్రు నాశనము, రోగావిముక్తి కలిగి సుఖంగా ఉంటారు.

 #పంచవిధ సూతకములు అంటే ఏమిటి ?*

 1.జన్మ సూతకము. 2. మృత సుతకము. 3. రజః సూతకం . 4. అంటు (రొగ ) సూతకం . 5. శవదర్శన సూతకం . 

 #దేవాలయాల వద్ద గృహ నిర్మాణం చేయడం దోషమా ?*

 #శివాలయానికి నూరు బారుల దూరం లొపల, #విష్ణువాలయముకు వెనక ఇరవై బారుల దూరం లొపల, శక్తి ఆలయముకు సమీపం లొను గృహనిర్మాణం చేయకూడదు . #దీనికి వ్యతిరేఖంగా గృహ నిర్మాణం జరిగితే సఖల సంపదలు నశించి కష్టాలపాలు అవుతారు. #గుడి దగ్గర ఉన్న ఇళ్ళకు ఏ వైపునైనా , ఏ మాత్రమైనా గుడి నీడ పడిందంటే దరిద్రం, ప్రాణనష్టం వంటి అనేక కష్టనష్టాలు ఎదుర్కోక తప్పదు.*

#తాంబూలం సేవించేప్పుడు తమలపాకు తొడిమ, చివర్లు ఎందుకు తుంచాలి ?*

 #తాంబులం వేసుకునే ముందు తమలపాకుల తొడిమలు, చివరలు తుంచివేయాలి. #ఎందుకంటే తొడిమను తినడం వ్యాదికారకం అవుతుంది. చిగుర్లు పాపానికి ప్రతీకలు అని అంటారు. కనుక తమలపాకు తొడిమలు , చివరలు తుంచిన తర్వాతే తాంబులం వేసుకొవడం ఆరొగ్య ప్రధమం . #అలాగే తమలపాకులో ఉండే ఈనెలు బుద్దిని మందగింప చేస్తాయి. #అందుకే తమలపాకును నమిలి మొదటగా నోటిలో ఊరిన రసాన్ని ఉమ్మివేయాలి. #తొడిమలు, చివరలు తున్చివేసినా ఇంకా అవి తమలపాకులో శేషించి ఉంటాయి కనుక 

 #శ్రీ గోవింద రాజస్వామి వారి సన్నిధిలో కుంచం ఉంటుంది ఎందుకు ?*

 #తిరుపతి శ్రీ గొవింద రాజస్వామి వారి సన్నిదిలో కుంచం ఉండటం నిజమే . #దీనికి కారణం ఈ విధంగా చెబుతారు. తిరుమల స్వామి శ్రీ వెంకటేశ్వరస్వామి  కుబేరుని వద్ద #అప్పు చేసాడట . #దానిని తీర్చుట కొరకు ద్రవ్యాన్ని కుంచం తో కొలిసి ఇచ్చేవారట స్వామివారు. #స్వామివారి పక్షాన గొవింద రాజస్వామి ఈ కార్యమును సాగించారని ఒక కధ ప్రచారం లొ ఉంది. #ఆ కుంచం తన తలక్రింద ఉంచుకున్నాడు అని ప్రతీతి.

 #నవగ్రహాలకు సంభందించిన సమిధలు ఏవి ?*

 1. సూర్యుడు - జిల్లెడు. 2. చంద్రుడు - మొదుగ .
 3. అంగారకుడు - చండ్ర. 4. బుదుడు - ఉత్తరేణి .
 5. బృహస్పతి - రావి . 6. శుక్రుడు - అత్తి .
 7. శని - జమ్మి . 8. రాహువు - దర్భ. 
 9. కేతువు - గరిక .

  *ఎటువంటి స్థలం లొ గృహ నిర్మాణం చేయరాదు?*

 1. గోవుల మందలు ఉండే ప్రదేశాలలోనూ .
 2. స్మశాన భూమికి సమీపం లొను .
 3. మలమూత్రాలు విసర్జించు ప్రదేశాలలోను .
 4. ఉప్పు నేలలోను, చవుడు నేలలయందు .
 5. ఎల్లప్పుడు నీటి వుటలు గల ప్రదేశాలలోను .
 6. రాతి భూముల యందు , మిక్కిలి రక్త వర్ణం గల భూమి యందు 
 7. చెరువులను పూడ్చి గృహ నిర్మాణం చేయరాదు అలా చేయడం వలన అనేకములు అయిన పంది జన్మలు ఎత్తి రౌరవాది నరకములు అనుభవించి కష్టాల పాలవుతారు .

 *పుజాంగాలు  ఎన్ని రకాలు ?*

 పుజాంగాలు  5 రకాలు.
 1.అభిగమనము - దైవాన్ని స్మరిస్తూ దేవాలయానికి వెళ్ళుట.
 2. ఉపాధానము - పూజా సామగ్రిని సంపాదించుట
 3. ఇజ్య - దూప, దీప, నైవేద్యములతో పూజించుట.
 4. స్వాద్యాయము - తనకు తానుగా మంత్రోచ్చారణ తో స్తుతించడం.
 5. యోగము - తదేకమైన నిష్టతో ధ్యానించుట .
  
 *ఏయే గృహాలకి ఎటువంటి శంఖువు ప్రతిష్ట చేయాలి ?*

 రాతితో కట్టే గృహానికి ఆ రాతితోనే శంఖువు తయారు చేసి శంఖుస్థాపన చేయవలెను . ఇటుకలతో కట్టిన గృహమునకు ఇటుకలతోనే శంఖువు చేసి ప్రతిష్ట చేయవలెను .గోడలు పెట్టక కర్రలతో , నిట్రాట లతో వేయు పాకలకు కర్రతో శంఖువు తయారు చేసి ప్రతిష్ట చేయవలెను . శంఖువును నవరత్న, సువర్ణ, తామ్ర , రజిత నాణేలతో , నవధన్యములతో పూజించి , స్థాపించవలెను . అన్ని రకాల గృహములకు కర్ర శంఖువు ప్రతిష్టించరాదు . కాష్ట శంఖువు భుమిలొ ఎంతకాలం ఉండునో అంతకాలం ఆ గృహం శుబప్రధంగా ఉండును. ఆ తరువాత ఆ గృహములలో నివసించువారికి కష్టాలు కలుగును.కావున కర్రతో చేసిన శంఖువు కంటే రాతితో చేసిన శంఖువు ఉత్తమం అని తెలుస్తుంది.

 *గృహ నిర్మాణం లొ ఇంటి కిటికీలు, ద్వారాలు ఏ విధంగా అమర్చాలి ?*

 గృహంలో కిటికీలు, ద్వారములు సమసంఖ్యలో ఉండాలి. వేటికవే విడివిడిగా సమసంఖ్యలొ ఉండాలి. కిటికీలు సరిసంఖ్యలోను , ద్వారాలు సరిసంఖ్యలొను ఉండాలి. అలమారాల గురించి శాస్త్రం లొ ఏమీ చెప్పలేదు. వాటి ఉపయోగాన్ని అనుసరించి సరిసంఖ్యో, బేసి సంఖ్యలొ నో పెట్టుకొవాలి. వాటికి స్థల నిర్ణయం కూడా చెప్పలేదు కిటికీలు , ద్వారాలు సరిసంఖ్యలో ఉన్నా చివరన సున్నా లేకుండా ఉండాలి. అనగా 10,20,30 ఇలా చివరన సున్నా రాకూడదు. అలాగే మొత్తం గృహం లొ ఉన్న ద్వారాలు, కిటికీలు అన్ని లెక్కపెట్టాలి.

 *వివిధ జన్మలు ఏవి ?*

 1. దేవతలు . 2. మనుష్యులు. 3. మృగములు.
 4. పక్షులు . 5. పురుగులు. 6. జలచరములు.
 7. వృక్షములు .

 *శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఏడుకొండల పేర్లు ?*
 
 1. వ్రుషబాద్రి . 2. నీలాద్రి. 3. గరుడాద్రి. 
 4. అంజనాద్రి. 5. శేషాద్రి. 6. వెంకటాద్రి.
 7. నారాయణాద్రి.

 *ఎవరెవరికి యే విధంగా నమస్కరించాలి?*

 1. విష్ణుమూర్తి యెక్క సర్వ అవతారాల విగ్రహాలకు మరియు శివునికి 12 అంగుళాల ఎత్తులొ చేతులు జోడించి శిరస్సు వంచి భక్తి , శ్రద్దలతో వినయంగా నమస్కరించాలి.
 2. ఇతర దేవుళ్ళకు శిరస్సు పై రెండు చేతులు జోడించి నమస్కరించాలి.
 3. గురువుకి నోటితో " నమస్కారం " అని చెప్పకుండా రెండు చేతులు జోడించి వినయవిధేయలతో నమస్కరించాలి.
 4. మహానుభావులకు , యోగులకు రెండు చేతులు వక్షస్థలం పై  జోడించి నమస్కరించాలి.
 5. తండ్రికి , పరిపాలకుడికి రెండు చేతులు నోటి మీదగా జోడించి నమస్కరించాలి.
 6. తల్లికి ఉదరం పై రెండు చేతులు జోడించి నమస్కరించాలి.

  *శ్రీ చక్రం నందు గల దేవతలు ఎవరు?*

 1. వశిని . 2. కామేశ్వరి. 3. మోదిని . 4. విమల.
 5. అరుణి . 6. జయిని . 7. సర్వేశ్వరీ . 8. కాళిని .

 *ధర్మం అంటే ?*
 
  ధృతి, క్షమ , దమము, అస్తేయము, శౌచము, ఇంద్రియ నిగ్రహము, ధీ , విద్య, సత్యము, అక్రోధము. ఈ పది లక్షణములు కలిగినదే "ధర్మము"*సహంపక్తి బోజనాల సమయం లొ అందరూ ఒకేసారి లేవాలి అంటారు ఎందుకు ?*

 సహంపక్తి బోజనానికి కూర్చున్న వారందరి జీవన ప్రమాణం ఒకేవిధంగా ఉండదు. సహంపక్తి బోజనాలలో రకరకాల వారు ఉంటారు. వారిలొ మంచివారు ఉంటారు. అలాగే చెడు అలవాట్లు ఉన్నవారు ఉంటారు. ఎవరి శరీరాల్లోని విద్యుత్ వారి వారి శరీరపు శక్తిని అనుసరించే పనిచేస్తూ ఉంటుంది . కాని సహపంక్తి లొ కూర్చున్నప్పుడు దాదాపు అందరి శరీరాల్లోని విద్యుత్ నియంత్రణ అందరిలో ఒకేలా ఉంటుంది. అటువంటప్పుడు తక్కువ శక్తితో ఉన్న వ్యక్తీ అందరికంటే ముందుగా లేచినచో మిగిలిన వారి శక్తి అతనికి ఎంతోకొంత వెళ్ళిపోతుంది.
          కనుకనే సహపంక్తి బోజనానినికి కుర్చున్నప్పుడు ఎవరు ముందు తిన్నా , ఎవరు వెనక తిన్నా , అందరూ ఒకేసారి లేవాలన్న నియమం పూర్వకాలం నుండి ఆచరణలో ఉంది.

 *దేవతా లక్షణాలు ఏవి ?*

 1. రెప్పపాటు లేకుండుట . 2. భూమి మీద పాదాలు ఆనించ కుండా ఉండుట.3. వ్యసనం లేకుండా ఉండుట.

 *నవ వ్యాకరణాలు అనగా ఏవి ?*

 1. పాణి నీయం . 2. కలాపం. 3. సుపద్మం. 
4. సారస్వతం. 5. ప్రాతిశాఖ్యం ( కుమార వ్యాకరణం ) 6. ఐంద్రం . 7. వ్యాఘ్ర బౌతికం. 
 8. శాఖటా టా యానం . 9.శాకల్యం .

 *శ్రీ రాముని జన్మనక్షత్రం , మాసం ఎప్పుడు ?*

 శ్రీ రాముడు చైత్ర మాసం , నవమి తిధిలో కర్కాటక లగ్నంలో జన్మించాడు. ఆయన జన్మ నక్షత్రం పునర్వసు .

 *పర్వ దినాలలో వడపప్పుని ఎందుకు పెడతారు* 

 భగవంతుడికి ప్రతి పండగనాడు వడపప్పుని , చలిమిడిని తప్పకుండా చేసి పెడతారు. అలాగే తల స్నానం చేసి ఆయా దేవుళ్ళకి ఇష్టమైన పిండి వంటలు చేయడం వల్ల వేడి చేసి తిన్న పిండి వంటలు సరిగ్గా అరగవు . తద్వార అనారోగ్యం కలుగుతుంది.
          ఇటువంటి ఉపద్రవాలు తలెత్తకుండా ఉండటానికి కొన్ని ప్రాంతాలలో వడపప్పు, పానకం , చలిమిడి తప్పకుండా చేస్తారు . పెసరపప్పుతో చేసిన వడపప్పు తినడం వలన తిన్న పిండి వంటలు జీర్ణం అయ్యి వేడి చేయకుండా చలువ చేస్తుంది .

 *శ్రీ వారి సుప్రభాతాన్ని ఎవరు ఎప్పుడు రచించారు.?*

 శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రసిద్ధ సుప్రబాతాన్ని రచించిన వారు శ్రీ ప్రతివాది భయంకర అన్నన్ అనే ఆచార్యులు. వీరు అష్టదిగ్గజాలుగా ప్రసిద్ధులైన శ్రీ మనవాల మహామునుల శిష్యులలో ప్రముఖులు వీరు క్రీ .శ . 1361 లొ జన్మించి 1454 వరకు అంటే 93 సంవత్సరాలు జీవించి ఉన్నారని పరిశోధకుల అభిప్రాయం.వీరు తమ జీవిత కాలంలో అనేక కృతులు రచించారు. వీరి రచనలలో శ్రీ స్వామివారి సుప్రబాతం అనన్య సామాన్యమైన ప్రచారం పొందింది.

 *పంచ కోశాలు అంటే ఏమిటి ?*

 1. అన్నమయ కోశం. 2. ప్రాణమయ కోశం .
 3. మనోమయ కోశం . 4. విజ్ఞానమయ కోశం .
 5. ఆనందమయ కోశం .

 *శౌచమంటే ఏమిటి ?*

 శుచి అంటే శుభ్రము , శుద్ధము . ధర్మాది పరీక్షల చేత భాహ్య అంతరములలో పరిశుద్దిని పొందుటయే " శౌచం" అనబడును. శౌచం రెండు విధములు 
 1. బాహ్య శౌచం.
 2. అంతః శౌచం .

 భాహ్య శౌచం - శరీరం పైన ఉండే మలినాలను పోగొట్టుకోవడానికి చేసే స్నానాదులు, శరీరం పరిశుద్ధం గా ఉండేందుకు పూసే సుగంద ద్రవ్యాలు వంటివి. వీటిని భాహ్య శౌచం అంటారు.

 అంతః శౌచం - మనస్సులో ఎటువంటి చెడు భావాలు లేకుండా అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద , వాత్సర్యాలు లేకుండా నిర్మలమైన అంతహకరణను కలిగి ఉండటమే అంతః శౌచం అనబడను. అంతః శౌచం మనస్సుకి సంభందించినది. కాబట్టి దీనికి శాస్త్రాలలో అదిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.

 *ఏయే ప్రదేశాల్లో జపం చేస్తే ఎంతెంత ఫలితం ?*

 ఇంట్లో చేసే జపానికి సత్ఫలితమే ఉంటుంది . కాని ఇంట్లో జపం చేస్తే అంతే ఫలితం ఉంటుంది. అదే జపాన్ని నది పరీవాహక ప్రాంతాల్లో చేస్తే రెట్టింపు ఫలితం ఉంటుంది . గోశాలలో చేసే జపం వల్ల వందరెట్ల ఫలితం ఉంటుంది . యాగశాలలో చేసే జపం వలన వందరెట్ల కంటే అధికమైన ఫలితం వస్తుంది. దేవాలయాలలో , పుణ్య ప్రదేశాలలో చేసే జపం వలన పదివేల రెట్లు ఫలితం కలుగుతుంది. శివాలయాలలో , శివ సాన్నిద్యం నందు చేసే జపం వలన అత్యున్నతమైన ఫలితం దక్కుతుంది.

 *రావణుడు ప్రతిష్టించిన 6 శివ లింగాలు ఏవి ?*

 1. వైద్యనాధ లింగం. 2. వక్రేశ్వర నాద లింగం.
 3. సిద్ధినాద లింగం. 4. తారకేశ్వర లింగం.
 5. ఘటేశ్వర లింగం. 6. కపిలేశ్వర లింగం.

 *పదనాలుగు లోకాలలో ఎవరెవరు ఉంటారు ?*

 పదనాలుగు లోకాలలోని మొదటి మూడు లోకాల్లోను అంటే భూలోకం , భువర్లోకం, స్వర్లోకాలను " కృతక లోకాలు " అంటారు. జీవులు తాము చేసుకొన్న కర్మఫలాన్ని బట్టి ఈ మూడు లొకాల్లొను ఉంటారు.
 
 #నాల్గొవదైన మహర్లోకం కల్పాన్తములో కూడా నశించదు. ఈ లొకం లొ కల్పాంత జీవులు ఉంటారు.

 #అయిదోవది అయిన జనలోకం లొ బ్రహ్మ దేవుని మానస పుత్రులైన సనక సనందన సనత్కుమారాదులు నివసిస్తారు.

 #ఆరొవదైన తపోలోకంలో దోష వర్జితులు , దేహ రహితులు అయిన వైరాజులనే వారు ఉంటదము. 7 మాత్స్చార్యము .
 8 రాగము. 9.ద్వేషము. 10.ఈర్ష్య . 11. అసూయ
 12. దర్పము. 13. దంబము. 14. అహంకార దోషము.

 #భగవంతుడికి నివేదించే సమయం లొ గుర్తు ఉంచుకోవలసినవి ?*భగవంతుడికి నివేధించేప్పుడు ఎటువంటి పొరపాట్లు చేయరాదు . తెలిసి చెసినా,తెలియక చేసినా తప్పు తప్పే అంటారు. కనుక నివేధించేప్పుడు ప్రతివారు తప్పక చేయవలసినవి .

 #1. దేవునికి నైవేద్యం గా పెట్టడానికి చేసిన వంటకాలలో నుంచి కొంత విడిగా తీయరాదు .పాత్ర మొత్తాన్ని దేవుని ఎదుట పెట్టాలి .
 2. పదార్ధాలు వేడిగా ఉన్నప్పుడు నివేదిన్చరాదు . చల్లారాక పెట్టాలి .
 3. నివేదనలో మంచినీటిని కుడా తప్పనిసరిగా పెట్టాలి.
 4. నివేదించే వంటకాలలో పంచదారకు బదులు బెల్లం వాడాలి.

 *ఊర్ధ్వ పుండ్ర ములు ఎందుకు ధరిస్తారు ?*

 ఆర్య మతంలో ముఖధారణం (బొట్టు ) ఒక ఆర్ష సాంప్రదాయంగా ఏర్పడింది. అది త్రి పుండ్రము , ఊర్ధ్వ పుండ్రము. అని రెండు రకాలుగా విభజించబడింది. వైష్ణవులు ఊర్ధ్వ పుండ్రము లు  ధరిస్తారు . స్త్రీలు తిలకధారణ చేస్తారు . 
     తిరుమణిని నిలువునా మూడు రేఖలుగా ధరించడంనే ఊర్ధ్వ పుండ్ర దారణ అంటారు.ఈ మూడు రేఖలు అకార, ఉకార, మకార స్వరూపమైన ప్రనవాన్ని సూచిస్తాయి. అకారం - సత్వ స్వరుపడైన శ్రీ మహావిష్ణువును , ఉకారం - చిత్వ స్వరూపిణి అయిన మహాలక్ష్మిని , మకారం  భగవద్భాక్తులైన భాగవతులను తెలియజేస్తాయని చెబుతారు.  శైవులు భస్మాన్ని మూడు అడ్డరేకులుగా నుదుట ధరిస్తారు .

    తిరుమణి మట్టికి సంభందించినది . కావున అది మట్టి నుండి కలిగిన ఈ శరీరం చివరికి మట్టిలోనే కలిసిపోతుందని సుచిస్తుంది. ఇందువల్ల వైరాగ్యం కలుగుతుంది. ముక్తి కోరేవానికి వైరాగ్యం చాలా ముఖ్యం. విభూతి దారణ కూడా ఈ శరీరం చివరికి బూడిద అయ్యేది అనే తత్వాన్ని నిర్దేశిస్తుంది. ముఖదారణ లేకుండా చేసే సత్కర్మలు నిరర్ధకాలు అని ఆగమాలు పేర్కొన్నాయి.

  ద్వాదశ (12) ఊర్ధ్వ పుండ్రము లు ధరించడం కూడా కద్దు. నాడులు, హృదయం మొదలయిన శరీర భాగములను చల్లబరుచుటకు కూడా ఆయా స్థానములలో ఊర్ధ్వ పుండ్ర దారణ అవసరమయిన వైజ్ఞానికం గా విశ్లేషణ చేసి కొంతమంది వివరిస్తున్నారు . ఉర్ధ్వ పుండ్రం లొ ఉపయొగించే వస్తువులకు చల్లదనం కలిగించే లక్షణం ఉంది.

 *నదులలోను, సముద్రాలలోను పవిత్ర స్నానాలు చేసేప్పుడు పాటించవలసిన నియమాలు ఏవి ?*

 నదీ స్నానం , సముద్ర స్నానం వంటివి చేసే ముందు నదీ స్నానం అయితే నదీమ తల్లిని, సముద్ర స్నానం అయితే సముద్రున్ని, అనంతరం క్షేత్ర దేవతల్ని, మనస్సులొ స్మరించుకొని సంకల్పం చెప్పుకుని స్నానం చేయాలి .
 * రాత్రి పూట నిద్రించే టైములో ఒంటిపై ధరించిన వస్త్రాలతో నదిలో మునగరాదు. ఈ బట్టలను విడిచి శుభ్రమైన వస్త్రములను ధరించాలి.
 * పుణ్య నదులలో పాప పరిహారార్ధం చేసే పవిత్ర స్నానముల సమయం లొ ఖచ్చితమైన నియమాలు పాటించి తీరాలి.
 * స్నాన అనంతరం ఆ బట్టల్ని నదుల్లో పిండ రాదు అలాగే సబ్బులను ఉపయొగించి కూడా బట్టలను ఉతకరాదు . 
 * అభ్యంగ స్నానం అంటే కుంకుళ్ళు , షాంపు లు మొదలయిన వాటిని ఉపయొగించి తలంటు స్నానం చేయరాదు . 
 * పొరబాటున కూడా నదిలోగాని, నదీ తీరాల్లోగాని మలముత్రాలు విసర్జిన్చరాదు . ఈ నియమానికి వ్యతిరేకంగా  చేస్తే పాపం అంటుతుంది.
 * ఆఖరికి నీళ్లను పుక్కిలించి ఉమ్మి వేసినా కూడా మహా దొషం అవుతుంది.
 * పవిత్ర స్నానములు ఆచరించే సమయంలో అ మంగళ కరమైన మాటలు మాట్లడకుడదు. కసురుకోవడం, కోప్పడటం, వంటివి చేయకూడదు.*
 * సముద్ర స్నానం కేవలం పర్వదినములలో  మాత్రమే చే

యాలి .మాములు సమయాలలో సముద్రాన్ని తాకకూడదు .
 *స్నానం చెసే ముందు సంకల్పం చెప్పుకోవాలి.*

సర్వేజనా సుఖినోభవంతు....
లోకా సమస్త సుఖినోభవంతు...

ఓం శాంతి శాంతి శాంతిః....

స్వస్తి....🙏

Tuesday, November 29, 2022

శ్వాస విజ్ఞానము

శ్వాస విజ్ఞానము:-

 శ్వాసతో పుట్టిన మనం, శ్వాస విడిచి వెళ్లిపోయేలోపు అసలా శ్వాసనే గుర్తించకపోవడం, పట్టించుకోకపోవడం ఓ విచిత్రము. అట్టి శ్వాసను మనం గుర్తించకపోయినా, దాని శక్తిని మనం పట్టించుకోకపోయినా -- మనం మనకు తెలియకుండానే దాన్ని మనం ఉపయోగించుకొంటాము.  ఉదాహరణకు, ఏదైనా బరువు ఎత్తేటప్పుడు కానీ, కాలువలు దాటవలసి వచ్చినప్పుడు కానీ అసంకల్పితంగానే మనం శ్వాసను బిగిస్తాము.  కొన్ని సెకన్లు మాత్రమే జీవించే ప్రాణి నుండి బ్రహ్మం వరకు అందరూ శ్వాసిస్తారు. అలాగే శిలలు, పర్వతాలు, కొండలే కాకుండా ఆకాశం కూడా శ్వాసిస్తుంటుంది. సెకనుకు 18 కి.మీ.ల చొప్పున ఆకాశం వ్యాకోచిస్తుందని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు.

❇️ శ్వాస - సోహం:-
మనం శ్వాస తీసుకున్నప్పుడు 'సో' అనే శబ్దం, వదిలేటప్పుడు 'హం' అనే శబ్దం వచ్చును.  'సో'లో 'ఓ' అనే శబ్దం, 'హం'లో 'మ్' అన్న శబ్దం అంతర్లీనంగా ఉన్నది.  ఈ రెండు కలిపి 'ఓం' అవుతుంది. ఓం అనగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర శక్తి అనగా ఆదిపరాశక్తి. ఈ వివరణ మనకు తెలియక పోయినా, ఒక్కసారి మనము శ్వాస తీసుకుని వదిలినచో, ఆ ఆదిపరాశక్తి యొక్క ప్రభావం ఖచ్చితంగా మన మీద ఉండి తీరుతుంది అని ఋషుల వాక్కు.

 శ్వాస ఎంత వరకు లోపలికి తీసుకుంటామో,  అక్కడి నుండే మళ్ళీ వదలిపెడుతున్నాము.  ఈ ఉచ్ఛ్వాసకు నిశ్వాసకు మధ్యన ఉండు బిందువు 'శక్తి' యొక్క స్థానం అని తెలుసుకుని,  ఆ బిందువు మధ్య ఖాళీ జాగాపై దృష్టి ఉంచగలిగితే అదే 'ప్రాణాయామము' అనబడుతుంది.


❇️ శ్వాస - ఆయుష్షు:-
ప్రాణికోటికి భగవంతుడు ఆయుష్షును శ్వాస లెక్కలో ఇవ్వడం జరిగింది. నిమిషానికి ఎక్కువ శ్వాసలు ఖర్చుపెట్టినచో- తక్కువ ఆయుష్షు., మరి నిమిషానికి తక్కువ శ్వాసలు తీసుకున్నచో - ఎక్కువ ఆయుష్షు కలిగి ఉంటారు.  సాధారణ మానవుడు సాధారణ కాలంలో నిమిషానికి 15 సార్లు శ్వాస తీసుకుంటాడు. పరుగెత్తినపుడు, కోపంగా ఉన్నప్పుడు 18-24 సార్లు శ్వాసిస్తాడు.  కామకేళి అనగా మైథున కాలంలో 35 సార్లు అంటే అన్నిటికన్నా ఎక్కువ శ్వాసలు ఖర్చు పెడతాడు. మనిషి సరాసరిన రోజుకు 21,600 సార్లు శ్వాసిస్తాడు.
➡️ కోతి నిమిషానికి 32 సార్లు శ్వాసించి 20 సంవత్సరాలు జీవిస్తుంది.
➡️ కుక్క నిమిషానికి 38 సార్లు శ్వాసించి 13 సంవత్సరాలు జీవిస్తుంది. 
➡️ గుర్రం 19 సార్లు శ్వాసించి 35 సంవత్సరాలు జీవిస్తుంది.
➡️ తాబేలు నిమిషానికి 5 సార్లు శ్వాసించి 200 సంవత్సరాలు జీవిస్తుంది.


❇️ శ్వాస - నాడులు:-
మన శరీరములో 272000 నాడులున్నాయి.  నాడులనగా ప్రాణవాయువు (శ్వాస) యొక్క రాకపోకలకు మార్గములు,  నరములు కావు.  ఈ 272000 నాడులలో 10 నాడులు ప్రధానమైనవి. వీటిని దశ నాడులు అని పిలుస్తారు. అవి..

1. ఇడ నాడి - ఎడమ ముక్కు రంధ్రం నందు
2. పింగళ నాడి - కుడి ముక్కు రంధ్రం నందు
3. సుషుమ్న నాడి - నాసికాగ్రం నందు
4. గాంధారి నాడి - కుడి నేత్రం
5. అస్తిని నాడి - ఎడమ నేత్రం
6. పూష నాడి - కుడి చెవి
7. యశస్విని నాడి - ఎడమ చెవి
8. ఆలంబన నాడి - నోరు
9. లకుహా నాడి - శిశ్నము
10. శంభని నాడి - గుదము

మరణం సంభవించినప్పుడు పైన ఉదహరించిన 10 ద్వారాలలో ఏదో ఒక ద్వారం గుండా ప్రాణం బయటకు  పోవును.

 వీటిల్లో అత్యంత ప్రధానమైనది 3 నాడులు. అవి
1. ఇడ నాడి - ఎడమ ముక్కు రంధ్రం నందు
2. పింగళ నాడి - కుడి ముక్కు రంధ్రం నందు
3. సుషుమ్న నాడి - నాసికాగ్రం నందు
  మనం తీసుకుంటున్న శ్వాస కుడి ముక్కు ద్వారా ఎక్కువగా బయటకి ప్రవేశిస్తే సూర్యనాడి పనిచేస్తుందని, ఎడమ ముక్కు ద్వారా ఎక్కువగా బయటకు వస్తే చంద్ర నాడి పనిచేస్తుందని తెలుసుకోవలెను. సుషుమ్న నాడి యందు శ్వాస ఆడుతున్నప్పుడు రెండు ముక్కు రంధ్రాల గుండా శ్వాస బయటకు వస్తుంటుంది.  ఎడమ నుండి కుడికి, కుడి నుండి ఎడమకు శ్వాస మార్చుకుంటున్నప్పుడు కొన్ని సెకన్లు మాత్రమే సుషుమ్న నాడి యందు శ్వాస నడుస్తుంది. ఈ సమయంలో మనం ఏమి ఆశించిన అవి సిద్దించును.
 సూర్యనాడి ఉష్ణ శక్తికి, చంద్రనాడి శీతల శక్తికి ప్రతీకలు. అందువలన శీతల వ్యాధులకు సూర్యనాడి, ఉష్ణ సంబంధిత వ్యాధులకు చంద్రనాడి ఉపయోగకరము. మరి సూర్యనాడి నడుస్తున్నప్పుడు ఘన పదార్థాలు,  చంద్రనాడి నడుస్తున్నప్పుడు ద్రవపదార్థాలు తీసుకోవడం ఉత్తమం.  కొద్దిసేపు ఎడమ చేతి కింద ఒత్తిడి తెచ్చిన లేదా ఎడమ వైపు తిరిగి పడుకున్నా కుడి శ్వాస ఆడడం ప్రారంభమవుతుంది., అలాగే ఎడమ శ్వాసను నడపాలంటే కుడి చేతి కింద ఒత్తిడి తెచ్చిన లేక కుడి వైపు తిరిగి పడుకున్నా కొద్దిసేపట్లో ఎడమవైపుకు మారుతుంది.
 స్త్రీ, పురుషులిద్దరూ ఒకే నాడి నడుస్తుండగా సంయోగం చేసినా అసలు గర్భధారణ జరుగదు. పురుషుని యొక్క ఎడమ స్వరం, స్త్రీ యొక్క కుడి స్వరం పని చేస్తుండగా సంయోగం జరిగితే పుత్రికా సంతానం కలుగుతుంది.,  అలాకాకుండా పురుషుని యొక్క కుడి స్వరం, స్త్రీ యొక్క ఎడమ స్వరం పనిచేస్తుండగా సంయోగం జరిగితే పుత్ర సంతానం కలుగుతుంది.

❇️ శ్వాస - పంచప్రాణాలు:-
శ్వాస రూపంలో మనం తీసుకున్న  వాయువు నాసికా రంధ్రాల గుండా ప్రవేశించగానే ఐదు భాగాలుగా విడిపోయి--
1. ప్రాణము 2. అపానము 3. వ్యానము 4. ఉదానము 5. సమానము అను ఐదు ప్రాణములుగా మారిపోతుంది.

1.ప్రాణము:-  అనంతాకాశంలో నుంచి ఎవరి శక్తి మేరకు వారు లోనికి తీసుకొని వాయువు.
2. అపాన వాయువు:- బయటికి వస్తున్న వాయువును అపాన వాయువు అని అంటారు. ఈ వాయు సహాయంతోనే మల మూత్ర విసర్జనలే కాక శరీరంలోని సమస్య మాలిన్యాలను బయటకు నెట్టబడుతున్నాయి.
3. వ్యాన వాయువు:- మన శరీరానికి మానవాకృతి నివ్వడానికి సహకరించే వాయువు.  ఈ వాయువు యొక్క దోషం వల్ల అంగవైకల్యం, మానసిక ఎదుగుదల లోపం, శారీరక ఎదుగుదల లోపం (మరుగుజ్జుతనం) ప్రాప్తించును.
4. ఉదాన వాయువు:- దీని సహాయంతో మనం మాట్లాడగలుగుతున్నాము. దీని లోపం వల్ల నత్తి, నంగి, ముద్ద మాటలు, బొంగురు గొంతు సమస్యలు కలుగును.
5. సమాన వాయువు:- దీని సహాయంతోనే మనం తీసుకున్న ఆహారం శక్తిగా మారి ఏ ఏ భాగానికి ఎంతెంత శక్తి పంపిణీ చేయాలో అంతంత పంపి సమతుల్యాన్ని కలుగజేస్తుంది. దీని లోపం వల్ల శరీరం తూలి పడటం సంభవించును.

❇️ శ్వాస - చక్రాలు:-
ఈ శ్వాస ప్రతిరోజు ఉదయము సరిగ్గా 6 గంటలకు మొదలై 
➡️ మూలాధార చక్రము నందు - 600 సార్లు
➡️ స్వాధిష్ఠాన చక్రము నందు - 6000 సార్లు
➡️ మణిపూరక చక్రము నందు - 6000సార్లు
➡️ అనాహత చక్రము నందు - 6000 సార్లు
➡️ విశుద్ధి చక్రము నందు - 1000 సార్లు
➡️ ఆజ్ఞా చక్రము నందు  - 1000 సార్లు
➡️ సహస్రారము నందు - 1000 సార్లు 
అనగా, రోజుకు 21600 సార్లు పయనిస్తోంది.

❇️ శ్వాస - అంగుళాలు:-
సాధారణంగా శ్వాసను సాధకుడు 12 అంగుళాలు వదులుతాడు.  శ్వాసను ఎవరైతే లోతుగా - నిదానంగా - దీర్ఘంగా తీసుకొని దానిపై దృష్టి ఉంచి విడవటం చేస్తుంటే శ్వాస యొక్క అంగుళాలు తగ్గును.
➡️ శ్వాసను 11 అంగుళాలకు కుదిస్తే - ప్రాణం స్థిరమవుతుంది.
➡️ శ్వాసను 10 అంగుళాలకు కుదిస్తే - మహాకవి అవుతాడు.
➡️ శ్వాసను 9 అంగుళాలకు కుదిస్తే -  బ్రహ్మానందం కలుగుతుంది.
➡️ శ్వాసను 8 అంగుళాలకు కుదిస్తే - దూరదృష్టి కలుగును.
➡️ శ్వాసను 6 అంగుళాలకు కుదిస్తే - ఆకాశగమనం చేయగలుగుతాడు.
➡️ శ్వాసను 4 అంగుళాలకు కుదిస్తే - సర్వ సిద్ధులు ప్రాప్తిస్తాయి.
➡️ శ్వాసను 2 అంగుళాలకు కుదిస్తే - కావలసిన రూపం ధరించిగలుగుతాడు.
➡️ శ్వాసను 1 అంగుళానికి కుదిస్తే -  అదృశ్యం అవ్వగలరు.
   మరింత సాధన చేయగా శ్వాస అవసరమే వారికి ఉండదు.  అలాంటి వారు అమరులు అవుతారు.

❇️ శ్వాస - సృష్టి వయస్సు:-
 మనము రోజుకు తీసుకునే శ్వాసలను (21600) రెట్టింపు చేసి ఒక సున్నను చేర్చిన
➡️ కలియుగం - 4,32,000 సంవత్సరాలు.
➡️ రెట్టింపు చేసిన ద్వాపర యుగం - 8,64,000 సంవత్సరాలు.
➡️ మూడు రెట్లు చేసిన త్రేతా యుగము- 12,96,000 సంవత్సరాలు.
➡️ నాలుగు రెట్లు చేసిన కృత యుగము - 17,28,000 సంవత్సరాలు.
➡️ పది రెట్లు చేసిన చతుర్ యుగము ( కలి+ద్వాపర+త్రేతా+ కృతయుగములు) -  43,20,000 సంవత్సరాలు.

❇️ శ్వాస - సాధన:-
సుఖంగా ఉండే పద్ధతిలో కూర్చొని, మృదువుగా కళ్లుమూసుకుని, మన నాశికా రంధ్రాల ద్వారా లోపలికి ప్రవేశించిన శ్వాస తిరిగి అదే నాశికా రంధ్రాల ద్వారా బయటకు వెళ్లడాన్ని గమనిస్తుండాలి. ఇలా చేయగా, చేయగా మనస్సు యొక్క పరుగు క్రమేపీ తగ్గి క్రమక్రమంగా ఆగిపోతుంది. అప్పుడు బ్రహ్మరంధ్రం ద్వారా అనంతమైన విశ్వమయప్రాణశక్తి లభ్యమౌతుంది.
     మరి ఇంతటి శక్తివంతమైన శ్వాసకు సంబంధించిన సాధన చేసుకునేందుకు మనము ఏ హిమాలయాలకు, ఏ అరణ్యాలకు వెళ్ళి పోవాల్సిన అవసరం లేదు.  ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటూ, ఎలా ఉన్న వాళ్ళు అలాగే ఉంటూ, మనం చేసే పనులు ఏవి మానుకోకుండానే, ఖాళీగా ఉన్న సమయంలో ఈ అద్భుత సాధన సులువుగా చేసుకోవచ్చు.  దీనిని చిన్న పిల్లల (5 సం"ల) నుండి ముసలి వారి దాకా ఎవరైనా చేయవచ్చును.
     84 లక్షల జన్మల తరువాత లభ్యమైన ఈ మానవ జీవితమును వృధా చేయకుండా, వివేకవంతులముగా దీనిని సద్వినియోగపరచుకోగలరు.

Thursday, March 17, 2022

ఇంగువ ఉపయోగాలు.

ఇంగువ.

ఇంగువ, హింగు, అసఫోటెడ అని రక రకాలుగా పిలవబడే ఈ వంటింటి దినుసు , తజకిస్తాను, ఆఫ్గనిస్తాన్ మరియు భారతదేశంలో కాశ్మీర్, పంజాబ్ ప్రాంతాలలో పండే ఒక నేల దుంప నుండి వచ్చే సహజ బంక దాన్ని శుభ్రపరచి పొడి,ముద్ద లేదా దాణా రూపంలో మనకి తయారు చేసి మార్కెట్ లో  కోనుగోలు కోసం పెడతారు.ఇది అనేక రుచి తో పాటు అనేక ఆరోగ్య సమస్యలకు వంటింటి వైద్య మూలిక గా చెప్పుకోవచ్చు అందులో కొన్ని ముఖ్యం ఉపయోగాలు తెలుసుకుని మనం దాని ప్రాముఖ్యత తెలుసుకొని వాడి మన కుటుంబ ఆరోగ్యానికి మేలు చేసుకుందాం.

ఇంగువ యొక్క ఉపయోగాలు

1. జీర్ణక్రియను వృద్ధి చేస్తోంది, మల బద్ధకం,అతిసారం, కడుపులో తిమ్మిరి, గ్యాస్ట్రిక్ సమస్యలు తొలగిస్తుంది.

2. శరీరంలో హానికారక బ్యాక్టీరియా నిరోధించే యాంటీ మైక్రో బయాల్ గా పని చేస్తుంది.

3. పచ్చళ్ళు మరియు ఇతర నిలవ పదార్థాలలో ఉపయోగించడం వల్ల అవి జిడ్డు వాసన రాకుండా పాడవకుండా ఉంటాయి.

4. కాలేయంలో హానికారక విష పదార్థాల యొక్క మోతాదు తగ్గించడం లో తోడ్పడుతుంది.

5.హార్ట్ ఎటాక్ మరియు కరోనరీ వంటి గుండె సమస్యలు రాకుండా ఉపయోగ పడుతుంది.

6.మూత్ర విసర్జన శాతం పెంచి శరీరంలో సోడియం పొటాషియం నిలువలు పెరగ కుండా మూత్ర పిండాలకు సాయం చేస్తుంది

7.మెదడు యొక్క పని తీరు మెరుగు పరచి జ్ఞాపక శక్తిని పెంచుతుంది.యాంటీ దిమెన్షియ వంటి మానసిక వైకల్యలను తగ్గించే మందుల్లో ఇంగువ వాడకం ఉంటుంది.

8.కండరాల నొప్పిని నివారిస్తుంది.బిపి లేదా రక్తపోటుని నివారించే ఏజెంట్ గా కొన్ని వైద్య విధానాలలో ఇంగువ వాడతారు.

9.ఇంగువ సుగర్ వ్యాధి ఉన్న వారు ఉపయోగించడం వల్ల వారి రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది.

10.శరీరంలో పెరిగే క్యాన్సర్ కణాలను నిరోధించడంలో

11.అధిక శరీర బరువు ను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
పై భాగము  సేకరణ.
వెల్లుల్లి  అసలు పూర్తిగా  వాడని వారు , ఏవో ఒకటి  రెండు వంటకాలలో  వెల్లుల్లి  వాడినా  ముఖ్యంగా ఇతర వంటకాలు  చేసుకునే వారు,  కొన్ని ప్రాంతాలలోని  కొన్ని సాంప్రదాయకమైన కుటుంబాలలో  వెల్లుల్లి  పూర్తిగా  నిషేధించిన వారు ప్రతి నిత్యం తయారు చేసుకునే వంటకాలలో  తప్పనిసరిగా  ఉపయోగించే  పదార్ధం  ఇంగువ.

ఇంగువ గడ్డ రూపంలో  మరియు మెత్తని పొడి రూపంలో  దొరుకుతుంది.  ఈ ఇంగువను  వంటకాలలో  తగు మోతాదులోనే  ఉపయోగించాలి. మోతాదు మించితే ఇంగువను వేసి తయారుచేసిన పదార్ధం  ఓ విధమైన ఘాటైన వెగటు వాసన వచ్చి వస్తువు రుచి పాడవుతుంది,- అందువల్లనే ఇంగువను  వంటకాలలో  తగు మోతాదులోనే ఉపయోగించుకోవాలి.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

Wednesday, March 16, 2022

తంగేడు చెట్టు ఉపయోగాలు

తంగేడు చెట్టు ఉపయోగాలు  - 

 *  ఈ చెట్టు యొక్క వేరు కషాయం కాచుకొని తాగిన నీళ్ల విరేచనాలు తగ్గును. లేదా 4 గ్రాముల తంగేడు బెరడు నమిలి రసం మింగినా కూడా విరేచనంలో చీము వంటి పదార్థం పొవడం తగ్గుతుంది . 

 *  5ml తంగేడు చెట్టు యొక్క బెరడు రసాన్ని రోజుకి ఒకసారి చొప్పున 3 రోజులపాటు  తాగితే టాన్సిల్స్ సమస్య తొలగిపోవును .

 *  తంగేడు చెట్టు లేత ఆకు నమిలి మింగితే దగ్గు తగ్గును.

 *  తంగేడు చిగుళ్లు దంచి కడితే తేలు విషం విరిగి మంట తగ్గును. 

 *  తంగేడు లేత ఆకుతో పాటు రెండు వెల్లుల్లి రెక్కలు , రెండు మిరియాలు కలిపి మెత్తగా నూరి ముద్దచేసి ఒకే రోజున మూడు మోతాదులు పెరుగు అనుపానంతో కలిపి ఇస్తే చీముతో కూడిన విరేచనాలు తగ్గుతాయి .

 *  తంగేడు ఆకుని నీడలో ఎండించి ఆ చూర్ణాన్ని గొరువెచ్చటి నీటితో రోజు తీసుకోవడం వలన మలబద్దకం తగ్గును. 

 *  రేచీకటి తో భాదపడుతున్న వారు కోడి లేక మేక చేదుకట్టు , లివరు , మసాలా దినుసులు కలిపి మెత్తగా నూరి కోడికూర కాని మేకకూర కాని వొండుకొని తింటూ ఉంటే రేచీకటి బాధ నుంచి విముక్తం అవ్వుదురు .

 *  తంగేడు చిగుళ్లు మెత్తగా నూరి పెరుగులో కలుపుకుని పరగడుపున తాగితే నీళ్ల విరేచనాలు నశించును.

 * తంగేడు చిగుళ్లు మజ్జిగలో నూరి పాదాల మడమలు కు రాస్తే కాలిపగుళ్ళు తగ్గుతాయి. 

 *  తంగేడు చిగుళ్లు నేతితో వెచ్చచేసి కన్నులకు కట్టిన కంటి ఎరుపులు , పోట్లు నివారించును.

 *  మూత్రం బంధించి ఉన్నప్పుడు తంగేడు పువ్వులతో కషాయం పెట్టి దానియందు పంచదార చేర్చి ఇచ్చినచో మూత్రం వెంటనే బయటకి వెడలును.

 *  తంగేడు విత్తనాల చూర్ణం 3 గ్రాములు తీసుకుని దానియందు తేనే కలిపి పుచ్చుకొనిన అతిమూత్రం కట్టను. 

 *  తంగేడు పువ్వులను నీడ యందు ఎండించి చూర్ణం చేసి సమంగా పంచదార కలిపి పూటకు 2 నుంచి 3 గ్రాముల చొప్పున తీసుకున్న యెడల అతిమూత్ర వ్యాధి నివారణ అగును. 40 దినములు పాటించవలెను . 

 *   తంగేడు లేత చిగుళ్లు మాడుమీద వేసి గట్టిగా తలకు బట్ట కట్టిన యెడల తలపోటు , తలనొప్పి నయం అగును. మరియు నేత్రరోగాలు నివారించబడును . 

          

నిమ్మకాయతో చికిత్స -

నిమ్మకాయతో చికిత్స  - 

  అజీర్ణం  ( Dyspepsia ) - 

   గుండెల్లో మంటకు , పులిత్రేపులకు నిమ్మపండు మంచి మందు. కొద్దినీటిలో ఒక చెక్క నిమ్మరసం కలిపి దానిని ఒక మోతాదుగా పుచ్చుకొనవలెను.దీనివలన జీర్ణాశయం గోడలు శుభ్రం అగును. ఉపవాసం ఉన్నప్పుడు కాని , జీర్ణకోశం ఖాళీగా ఉన్నప్పుడు కాని నిమ్మరసం సేవించవలెను. 

  మలాశయం బాధ  ( Bowel Trouble ) - 

    నిమ్మరసం అతిసారం , అతివిరేచనమును కట్టును. నిమ్మపండు నిజరసమును గాని కొంచం నీటితో కాని ఆసన మార్గము ( Enema ) ద్వారా పంపించిన కలరా , ఆమపాతం ( Macocolitis ) , ఆంత్రభ్రంశము ( prolapse of the bowels ) మొదలుగా గల కఠినమగు పేగు బాధలు నివారణ అగును. ఇంతే కాకుండా ఆమపాతంతో కూడిన శీతబేది ( Dysentry with slonghing of the mucous membrens ) అనగా జిగట విరేచనాలు తీవ్రమయిన ఈ జబ్బుతో రోగికి 12 ఔన్సుల మోతాదు ఇవ్వవలెను.

 స్థూలకాయం  ( Obesity ) - 

    నిమ్మనీరు కాని , ఉడికించిన నిమ్మ పండ్లు కాని అతి స్థూలకాయమునకు మంచి మందు. మూడు నాలుగు గ్లాసుల తీపి కలపని నిమ్మనీరు కాని దానికి సరిపోవు పూర్తి పండ్ల పదార్ధం కాని దినదినము పుచ్చుకొనవలెను . దీనితో పాటు మితముగా భుజించుటయు , మధ్యాహ్నం రెండు గంటల తరువాత భోజనం చేయకుండా ఉండుట అభ్యాసం చేయవలెను . మధ్యాహ్నం 2 గంటల తరువాత తినిన ఆహారం అతిగా కొవ్వును పెంచును. అదే విధముగా శరీరం నందు నీరు , అంతర్మలములు     ( Waste Poisons ) కూడా పెంచును. వీటన్నిటిని నిమ్మరసం తొలిగించును.

 ముఖ సౌందర్యం  ( cosmetic ) - 

   సామాన్యంగా ముఖము పైన దీనిని వాడినప్పటి కంటే లొపలికి తీసుకున్నప్పుడు అద్భుతంగా పనిచేయును. నిమ్మకాయ చెక్కని తలపైన రుద్దిన చుండ్రు ( Dandruff ) పోవును . మొటిమలు         ( acne spots ) , శరీర నిగారింపు ( oily skin ) కలవారు నిమ్మరసం వాడుట చాలా మంచిది. ముఖం పైన , చేతుల పైన మచ్చలు , వాపు , గజ్జి వంటివాటిని నిమ్మరసం పోగోట్టును . 

  చలి జ్వరం  - ( Maleria ) 

     నిమ్మరసం పాలు కలపని కాఫీ లో ఇచ్చిన సమర్ధవంతంగా పనిచేయను. కాలిక వ్యాధులు        ( Chronic Disorders ) అన్నింటిలో పండు పదార్థం వాడినంతను అద్భుతంగా పనిచేయను.నిమ్మ తొక్కలో క్రిమిసంహారకం అగు నూనె , నిమ్మ కాయ దూది యందు స్వాభావిక జీర్ణం అగు సారములు ఎన్నొ కలవు. చాలాకాలం నుంచి చలి జ్వరమునకు , రొంపలకు ముందుగా వాడుచున్న సింకోనా క్వయినా తయారగు చెట్టు బెరడును ఉండు గుణములు అన్నియు దీనియందు కలవు. 

   అపస్మారం వల్ల కలిగిన గుండెదడ కి 15 గ్రాములు నిమ్మరసం ఇచ్చిన నిమ్మళించును.

 రక్తస్రావం  - 

    శ్వాసకోశములు ( Lungs ) , అన్నకోశం , ప్రేగులు మూత్రపిండములు మొదలగు వాటినుండి లోపల భాగాలలో రక్తస్రావం అవుతున్నప్పుడు నిమ్మరసం ఇవ్వవలెను.  ఉప్పు కలిపి రోజుకి ఒక నిమ్మకాయ తినుచున్నచో ప్లీహవృద్ధి అనగా Enlargement of Spleen కడుపులో బల్ల పెరుగుట హరించును. 

    నిమ్మతైలము ని మర్దన కొరకు వాడవచ్చు. 

  దంతశుద్ధి  - 

     దంతములు బలహీనంగా గాని , రంగుమారి కాని ఉన్నచో వాటిబాగుకై పేస్ట్ వాడరాదు. అవి హానిచేయును. అటువంటి సమయాలలో నిమ్మపండ్ల రసంలో తడిపిన కట్టెబొగ్గు లేదా నీళ్లతో పలుచన చేసిన నిమ్మపండ్ల రసం. కాని ఇది వాడిన తరువాత నీటితో నోరు బాగా పుక్కిలించవలెను. చిగుళ్ల వాపుకు , నోటి పూతకు నిమ్మకాయ రసమును నీటిని సమాన భాగాలుగా తీసుకుని పుక్కిటబట్టుట మంచిది.

           

సమస్త జ్వరాలు హరించుట కొరకు పురాతన వైద్య ప్రక్రియ -

సమస్త జ్వరాలు హరించుట కొరకు పురాతన వైద్య ప్రక్రియ  - 

       మొదట ఒక రోగిని నులకమంచం పైన పడుకోబెట్టాలి . మంచానికి నాలుగు వైపులా గాలి దూరకుండా బట్టలు కట్టాలి. తంగేడు అన్ని భాగాలు ( సమూలం ) బాగా నలుగగొట్టి ఒక వెడల్పాటి బేసిన్ లో వేసి నిండా నీరుపోసి బాగా మరిగించి ఆ బేసిన్ ని తీసుకొచ్చి మంచం క్రింద పెట్టాలి. దానిపైన పెట్టిన మూత తీయగానే వేడివేడి నీటిఆవిరి అడుగు నుండి నులకమంచం సందుల నుండి పైన పడుకున్న రోగి శరీరానికి తగులుతూ ఉండాలి. ఆ బేసిన్ ని క్రమంగా పాదాల దగ్గర నుండి కొంచం కొంచం జరుపుతూ తలవెనక వైపు కి లాగుతూ ఉండాలి. రోగిని కొద్దిసేపు వెల్లకిలా , కొద్దిసేపు బోర్లా ఇలా పడుకోబెడుతూ ఇలా మార్చి మార్చి చేస్తూ ఆవిరి రోగి శరీరం మొత్తానికి తగులుతూ ఉంటే తంగేడు ఆవిరికి శరీరం నుండి చెమట కారిపోయి అన్నిరకాల విషజ్వరాలు మటుమాయం అవుతాయి. 

  గమనిక  -  శరీరం బాగా నొప్పులతో కూడి ఉన్నప్పుడు కూడా ఈ పద్ధతిని ఆచరించడం వలన నొప్పుల నుంచి పూర్తి ఉపశమనం లభిస్తుంది.

          

చర్మవ్యాధుల గురించి సంపూర్ణ వివరణ -



 చర్మవ్యాధులు రావడానికి గల కారణాలు  - 

  *  విరుద్ధములగు అన్నపానములు తినటం అనగా పాలతో తయారైన సేమ్యా , కోవా , ఐస్ క్రీం తిని పెరుగన్నం తినటం లేదా చల్లని కూల్ డ్రింక్ ని  వేడిఅన్నం , కూరలు కలిపి తినటం ఇలాంటి ఆహారపు అలవాట్లు పాటించటం . 

 *  మలమూత్రాలను ఆపడం , అదేవిధముగా వాంతి వంటి సహజ వేగాలను బలవంతముగా నిరోధించడం . 

 *  భోజనం చేసిన వెంటనే వ్యాయామం చేయుట , ఎండలో తిరుగుట చేయరాదు . 

 *  ఎండలో తిరిగి వచ్చి చల్లని నీరు తాగరాదు . 

 *  అతిగా శ్రమపడి వచ్చి వెంటనే నీటిని సేవించరాదు . 

 *  అజీర్ణముగా ఉండగా మరలా భుజించరాదు . అనగా ముందు తిన్నది సంపూర్ణముగా అరగక ముందు మరలా భోజనం చేయరాదు . 

 *  కొత్తబియ్యపు అన్నం , పెరుగు మరియు చేపలు కలిపి తినరాదు . 

 *  అధికంగా పులుపు , ఉప్పు తినరాదు . 

 *  మినుములు , ముల్లంగితో చేయబడిన వంటలు , పాలు నువ్వులతో చేసిన వంటలు ఎక్కువుగా తీసుకొనుట 

 *  తినిన ఆహారం జీర్ణం కాకముందే దాంపత్యములో పాల్గొనుట చేయరాదు . 

 *  పగలు నిద్రించరాదు . పగలు నిద్రించుట వలన శరీరం నందు శ్లేష్మము పెరిగి దానివలన రక్తప్రసరణకు అవరోధము కలిగి చర్మమునకు రక్తప్రసరణ సరిగ్గా జరగక చర్మవ్యాధులు సంభవించును . ఎండాకాలం కొంచంసేపు పగలు నిద్రించవచ్చు . 

        పైన చెప్పినవిధముగా విరుద్ధమైన ఆహారం , పనులు చేయుటవలన శరీరంలో చర్మము , రక్తము , మాంసము , లింప్ గ్రంథులు దోషమును పొంది రకరకాల చర్మవ్యాధులు కలుగును. 

  చర్మవ్యాధులు రావడానికి పూర్వము కనిపించు లక్షణములు  - 

 *  స్పర్శజ్ఞానం క్రమేపి తగ్గిపోవుట . 

 *  చెమట ఎక్కువుగా పట్టుట లేదా చర్మవ్యాధి ప్రదేశము నందు అసలు చెమట పట్టకపోవును . 

 *  శరీరవర్ణము మారి నల్లబారిపోవుట . 

 *  దద్దుర్లు . 

 *  పోట్లు . 

 *  అలసట , వడలినట్లు అగుట. 

 *  వ్రణములు లేచి అధికభాధతో కూడి శీఘ్రముగా  
      జనించి త్వరగా మానకుండా ఉండటం. 

 *  తాపము ( చర్మం అంతా మంటలు ) . 

  అసాధ్య చర్మవ్యాధి లక్షణములు  - 

 *  రోగి బలహీనుడుగా ఉండి దప్పిక , మంట ,   అగ్నిమాంద్యములతో కూడి క్రిములు ఏర్పడిన అసాధ్యము . 

 *  చర్మవ్యాధి ఏర్పడి 10 సంవత్సరాలు దాటిన     
      అసాధ్యము . 

  చర్మవ్యాధుల యందు చికిత్సాక్రమము  - 

        శరీరము నందలి వ్యర్ధపదార్ధముల వలన చర్మవ్యాధులు వచ్చును . కాబట్టి వానిని వివిధరకాల పద్ధతుల ద్వారా వాంతి , విరేచనం మొదలగు శోధన పద్ధతులను ఉపయోగించి వ్యర్ధాలను బయటకి పంపుతూ ఔషధాలను ఇయ్యవలెను . 

  చర్మవ్యాధుల యందు పథ్యము  - 

  *  తేలికగా అరిగెడి ఆహారం తీసికొనవలెను . 

  *  త్రిఫలములు - ఉశిరి , కరక్కాయ , తానికాయ 
       విరివిగా వాడవలెను . 
  
  *  త్రిఫలా ఘృతము కూడా వాడవచ్చు . 

  *  పాతధాన్యములు వాడవలెను . 

  *  యవలు , చామలు , కొర్రలు , కందికట్టు , పెసర 
       కట్టు , మేకమాంసం వాడవలెను . 

  *  బీరకాయ , పొట్లకాయ , దోసకాయ , పెరుగు 
      తోటకూర , పొన్నగంటికూర , మెంతికూర , ఆవు 
       నెయ్యి , తెల్ల గలిజేరుకూర , తేనె , నీరుల్లి . 

           పైన చెప్పిన పదార్ధాలు ఆహారంలో తప్పక భాగం చేసుకొనవలెను . 

  చర్మవ్యాధుల యందు అపథ్యము  - 

 *  చింతపండు పులుపు , అతిగా కారం , ఆవాలు , 
      గుమ్మడి , వెల్లుల్లి , పెరుగు , పాలు . 

 *  బెల్లం , కల్లు , సారాయి , నువ్వులు .

 *  మినుములు , చెరుకురసము , పానకము .

 *  చేపలు , నీటిపక్షులు , కోడి మాంసం , పావురం .

 *  అతిగా వ్యాయామం , స్త్రీసంభోగం చేయరాదు .  

          పైన చెప్పినవిధముగా ఆహారపు అలవాట్లు పాటిస్తూ సరైన వైద్యుడి పర్యవేక్షణలో ఔషధాలు సేవించుచున్న చర్మవ్యాధుల నుంచి త్వరగా బయటపడగలరు. ఇక్కడ మనం ముఖ్యముగా గుర్తు ఉంచుకోవాల్సిన విషయము ఏమిటంటే వ్యాధి సంప్రాప్తినిచ్చిన తరువాత ఔషధాలు సేవించుట కంటే వ్యాధి రాకుండా చూసుకోవడమే అత్యంత ప్రధానమైనది. 

    
          

Friday, March 11, 2022

ఆయుర్వేద వైద్యం నందు జలగలు ఉపయోగించే విధానం -

ఆయుర్వేద వైద్యం నందు జలగలు ఉపయోగించే విధానం  -

       జలము ఆయువుగా కలవి కావున జలాయుకములు అనియు , జలము నివాసస్థానం కలవి కావున జలౌకలని మరియు జలగలు అని పిలవబడుతున్నవి.  ఇవి 12 విధములు గా ఆయుర్వేదం విభజించింది. ఇందు విషము కలిగినవి నల్లటి రంగులోని బేధము వలన 6 విధములు .  అందు కృష్ణ అనునది కాటుక రంగు పెద్ద శిరస్సు గలది. కర్బూర  అనునది బొమ్మిడ అను చేప వంటి ఆకృతి కలిగి ఒకచోట చిన్నగా , మరొకచోట పెద్దగా ఉండు పొట్ట కలిగి ఉండును. కలగర్ద అనునది ముడుతలతో కూడి ఉండి పెద్ద పార్శ్వములతో కలిగిన ముఖం 
ఉండును. ఇంద్రాయుధ అనునది ఇంద్రధనస్సులోని నానారంగులు గల నీలపు చారలతో కూడుకుని ఉండును. సాముద్రిక అనునది కొద్దిగా నలుపు , పసుపు రంగులతో ఉండి అనేక ఆకృతులుగల తెల్లని మచ్చలతో కూడుకుని ఉండును. గోచందనం అనునది ఆంబోతు బుడ్డ వలే పొట్ట యందు ఒక గీత కలిగి సన్నని ముఖం కలిగి ఉండును.

           పైనచెప్పిన 6 రకాల జలగలు విషము కలిగి ఉంటాయి. ఇవి కరిచినచో కాటునందు వాపు , మిక్కిలి దురద, మూర్చ, జ్వరం, తాపము , వాంతి  కలుగును. 

        ఇప్పుడు మీకు విషము లేని జలగలు గురించి వివరిస్తాను. విషములేని జలగలు మొత్తం 6 రకాలు .  అందులో కపిల అనునది ప్రక్కల యందు మనశ్శిలతో రంగు వేసినట్లు ఉండి వీపున నిగనిగలాడుచూ పెసలవలే ఆకుపచ్చ రంగు కలిగి ఉండును.  పింగళి అనునది కొంచం ఎరుపు రంగు గుండ్రని శరీరం పచ్చని రంగు ఉండి వేగముగా కదులును. శంఖముఖి అనునది యకృత్ వలే ఎరుపు నలుపు రంగులు కలిగి శీఘ్రముగా రక్తమును తాగే స్వభావం పొడవైన వాడి అయిన ముఖం కలిగి ఉంటుంది. మూషిక అనునది ఎలుక వంటి ఆకారం , రంగు , దుర్వాసన కలిగి ఉంటుంది. పుండరీకం అనునది పెసల వలే పచ్చని రంగు , పద్మముల వలే విశాలమైన ముఖం కలిగి ఉండును.  సావరిక అనునది నిగనిగలాడుచూ తామరాకు వంటి రంగు కలిగి 18 అంగుళముల పొడవు కలిగి ఉండును. ఇది ఏనుగులు, గుఱ్ఱములకు చికిత్స చేయుటలో మాత్రమే వాడవలెను .మనుష్యులకు పనికిరాదు. వీటిని నిర్విష జలగలు అందురు.

             ఈ విషము లేనటువంటి జలగలు లభించు ప్రదేశాలు ముఖ్యంగా ఢిల్లీకి పశ్చిమ దిశలోను , సహ్యాద్రి పర్వతాలు అనగా నర్మదా నది ప్రవహించు పర్వత ప్రాంతాలలోను, మధురా ప్రాంతంలోనూ ఈ విషము లేనటువంటి జలగలు ఉండును. ఈ ప్రదేశాలలో లభించు జలగలు పెద్ద శరీరం కలిగి మంచి బలముతో ఉండి శీఘ్రముగా రక్తమును పీల్చెడి స్వభావం ఎక్కువుగా ఉండి విషము లేకుండా ఉండును.

         విషముతో కూడిన చేపలు , పురుగులు , కప్పలు , మూత్రపురీషములు క్రుళ్ళుట చేత పుట్టిన జలగలు మరియు కలుషిత జలము నందు పుట్టిన జలగలు, నీటిలోని పద్మములు కుళ్లుటచేత పుట్టిన జలగలు విషపూరితంగా ఉండును.  శుద్ధజలము నందు పుట్టిన జలగలు విషం లేకుండా ఉండును.

            ఇప్పుడు జలగలను పట్టే విధానం వాటిని పోషించే విధానం మీకు తెలియచేస్తాను .

     రక్తముతో కూడిన తోలు , జంతుమాంసం , వెన్న , నెయ్యి, పాలు మొదలగు వాటితో  కూడిన అన్నమును జలగలు ఉన్న ప్రదేశంలో వేసినచో అవి పైకి వచ్చును. అప్పుడు వాటిని పట్టుకొని మంచి కుండలో చెరువునీటిని , బురదని పోసి అందులో ఉంచవలెను. వాటికి తిండి కొరకు నాచు, ఎండిన మాంసము , నీటిలో పుట్టే దుంపల చూర్ణం ఇవ్వవలెను. అవి నిద్రించుటకు గడ్డి, నీటి యందు పుట్టే పచ్చి ఆకులను ఆ కుండ నందు వేయవలెను .  రెండు మూడు రోజులకు ఒకసారి ఆ కుండ యందలి నీటిని తీసివేసి కొత్తనీటిని పోసి ఆహారం కూడా కొత్తదానిని వేయవలెను . ప్రతి ఏడు రోజులకు ఒకసారి కుండను మార్చవలెను . ఈ జలగలను శరత్కాలం పట్టుకొనుట మంచిది .

      జలగలను వైద్యంలో ఎలా ఉపయోగించాలో మీకు వివరిస్తాను.

            జలగలచే పోగొట్ట తగిన రోగము కలిగిన వానిని కూర్చుండబెట్టి కాని , పడుకోపెట్టి కాని జలగ పట్టించవలసిన ప్రదేశములో వ్రణము లేనిచో ఆ ప్రదేశంలో ఎండించిన ఆవుపేడ చూర్ణం , మన్ను కలిపి మర్దన చేయవలెను . ఆ తరువాత జలగలను తీసుకుని ఆవాలు , పసుపు కలిపి నూరి కలిపిన నీటిలో ముంచి వేరొక మంచినీటి పాత్రలో ముంచి వాటిని రోగమున్న ప్రదేశములో పట్టించవలెను. ఆ తరువాత ఆ జలగకు మంచి కాటన్ గుడ్డ ముక్కతో  ముఖము విడిచి శరీరం అంతయు కప్పవలెను. అప్పుడు ఆ జలగ రోగ స్థానమును పట్టును . అలా పట్టనిచో ఆ రోగస్థానం పైన పాలచుక్క గాని  రక్తపుచుక్క గాని వేయుట లేక కత్తితో గీయుట చేసినచో జలగ వెంటనే రోగస్థానమును పట్టును . అప్పుడు కూడా జలగ పట్టనిచో దానిని వదిలి వేరొక జలగ పట్టించవలెను .

                   జలగ ఎప్పుడూ తన ముఖమును గుర్రపుడెక్క వలే విస్తరించి స్కంధమును పైకెత్తి రోగస్థానమును తగులుకొనునో అప్పుడు అది రక్తమును పీల్చుతుంది అని అర్ధంచేసుకొనవలెను వెంటనే దానిని తడిగుడ్డతో కప్పి మధ్యమధ్యలో  తడుపుచుండవలెను . అలా చేస్తున్నచో రక్తం బాగుగా పీల్చును. ఆ పీల్చుటలో ముందుగా దుష్టరక్తమునే పీల్చును .

            జలగ రక్తం పీల్చుతూ ఉన్నప్పుడు కొంత సమయం తరువాత పోటు , దురద మొదలగుచున్న అప్పటివరకు అది దుష్టరక్తం పీల్చి ఆ తరువాత మంచిరక్తం పీల్చడం మొదలు అయినది అని అర్థం . ఆ తరువాత వెంటనే జలగను తీసివేయవలెను . రక్తం యొక్క రుచి మరిగి ఆ జలగ రానిచో దాని ముఖము పైన సైన్ధవ లవణము వేసినచో విడిచివేయును .

        చెడు రక్తం పీల్చిన జలగను శుద్దిచేయు విధానం గురించి మీకు తెలియచేస్తాను.

      పైన చెప్పినట్టు రోగస్థానమును విడిచిన జలగకు శరీరం పైన బియ్యపు పిండిని పూసి ముఖం నందు నూనె, ఉప్పు కలిపి రాసి ఎడమచేతితో తోకను పట్టుకొని కుడిచేతితో ముఖము వరకు ఆవుపాలు పితికినట్లు చేయవలెను . ఈ విధంగా చేస్తూ తాగిన రక్తమును బయటకి కక్కునట్టు చేయవలెను . ఆ తరువాత ఆ జలగను శుభ్రపరచి మంచినీటితో కూడిన పాత్ర యందు ఉంచవలెను. అప్పుడు అది ఉత్సాహముగా సంచరించును. అలా సంచరించకుండా కదలక మొద్దుగా ఉన్నచో చెడురక్తం దాని శరీరం నుంచి పూర్తిగా బయటకి పోలేదు అని గ్రహించి మరలా కక్కించు ప్రయత్నం చేయవలెను . కక్కించాక మరలా కుండ నందు భద్రపరచవలెను.

       జలగతో రోగనివారణ క్రియ చేశాక చేయవలసిన విధి గురించి వివరిస్తాను.

          జలగ ద్వారా చెడు రక్తం తీసాక ఆ గాయమునకు ఔషదాలు కలిపిన ఆవునెయ్యి పూయవలేను . కొందరికి తేనె కూడా పూయవచ్చు.

      పైన చెప్పిన జలగతో చెడు రక్తాన్ని తీయు విధానాన్ని రక్తమోక్షణం అంటారు. ఈ క్రియను రోగి యెక్క బలం, రోగం యొక్క బలాన్ని అంచనా వేసుకొని మాత్రమే అంచనా వేసుకొని చేయవలెను .

      ********** సంపూర్ణం ************

  
           

ఆయుర్వేదం - విభాగాలు .

ఆయుర్వేదం - విభాగాలు .

  ఆయుర్వేదం అనగా చాలామంది దృష్టిలో చెట్లు , వాటి చూర్ణాలు అనే దృష్టి ఉంది. కాని చాలామందికి దానిలో అనేక రకాల వైద్యవిధానాలు ఉన్నాయి అనే విషయం తెలియదు. వాటిగురించి మీకు ఈ పోస్టులో వివరిస్తాను. 

       మనకి తెలిసిన ఆయుర్వేద ప్రముఖుల్లో చరకుడు , శుశ్రుతుడు అందరికి తెలుసు. కాని ఇంకో ప్రముఖ వ్యక్తి ఉన్నారు. అతని పేరు వాగ్బాటాచార్యుడు . ఈయన రాసిన " అష్టాంగహృదయం " అనే గ్రంధం చాలా ప్రముఖమైనది. దీనిలో అనేక భాగాలు కలవు. ఒక భాగంలో కేరళ రాష్ట్రంలో ప్రాచుర్యంలో ఉన్న " మర్మకళ" గురించి చాలా వివరంగా ఉన్నది. మనిషి శరీరంలో ఉన్నటువంటి మర్మస్థానాల గురించి , దానిపైన ఒత్తిడి కలిగించినప్పుడు కలిగే సమస్యల గురించి చాలా చక్కగా వివరించారు. ఆయన రాసిన                  "అష్టాంగసంగ్రహం" అను గ్రంథం కూడా ప్రముఖమైనది. 

     వాగ్బాటాచార్యుడు ఆయుర్వేదంని ౮ విభాగాలుగా విభజించాడు.   అవి 

 *  శల్యతంత్రము .

 *  శాలాఖ్య తంత్రము .

 *  కాయచికిత్స . 

 *  భూతవిద్య .

 *  కౌమారభృత్యము .

 *  అగధాతంత్రము .

 *  రసాయన తంత్రము.

 *  వాజీకరణ తంత్రము .

      ఒక్కొక్కదాని గురించి మీకు క్లుప్తంగా వివరిస్తాను.

 * శల్య తంత్రము - 

     మేకులు , రాళ్లు , ధూళి , ఇనుపమేకులు , మట్టిపెళ్లలు , ఎముకలు , గోళ్లు మొదలైనవి శరీర అంతర్భాగమున చొరబడినచో వానిని బయటకి తీయు ఉపాయములు , యంత్రములు, శస్తములు , క్షారములు మరియు అగ్నిని ప్రయోగించు విధానముని తెలియజేయునది శల్యతంత్రము .

 *  శాలాఖ్య తంత్రము  - 

    కంఠమునకు పైభాగమున చెవులు , కన్నులు , కంఠబిలం , నాసిక మొదలగు వాటియందు కలుగు వ్యాధుల నివారణార్ధం ఏర్పడినది శాలాఖ్య తంత్రము. 

 *  కాయచికిత్స - 

     సమస్త అవయములును అనుసరించి జ్వరం , అతిసారం, రక్తపిత్తము , శోష , ఉన్మాదము , అపస్మారము , కుష్ఠము, మేహము మొదలగు వ్యాధులను నివారించుటకు నిర్ణయింపబడిన చికిత్సా విధానమును కాయ చికిత్స అందురు.

 *  కౌమారభృత్యము - 

     శిశువుల పోషణా విధానము , పాలు ఇచ్చే విధానం , పాలల్లో దోషములు శోధించుట , దుష్టపు పాలు త్రాగుట చేత , దుష్ట గ్రహంబులు చేత కలిగిన వ్యాధుల నివర్తి చేయుటకు తగు విధానములు భోధించునది "కౌమారభృత్యము ".

 *  అగధ తంత్రము - 

     పలు రకాల సర్పాలు , కీటకములు , సాలెపురుగులు , తేళ్లు , ఎలుకలు మొదలగు విషజంతువులు కరుచుట చేతను కలిగిన విషమును తెలుసుకొనుటకు , విషముల్లో రకాలు అయిన స్థావర, జంగమ విషములు గురించి వాటి ఉపశమనాల గురించి ఎర్పడినది అగధ తంత్రము.

 *  రసాయన తంత్రము - 

     యవ్వనమును స్థిరముగా చేయుటకు , ఆయువుని , బలమును , బుద్ధిని కలుగచేయుటకు , వ్యాధుల నివర్తించుటకు సమర్ధంబు అయినది రసాయన తంత్రము .

 *  వాజీకరణ తంత్రము - 

      క్షీణించిన రేతస్సును అధికంగా చేయుటకు , దుష్టమగు రేతస్సుని శుభ్రముగా చేయునది , సంభోగము నందు అధిక శక్తిని , కామవాంఛ కలుగ చేయునది వాజీకరణ తంత్రము . 

    
    ఈ విధముగా ఆయుర్వేదము 8 అంగాలుగా విభజించబడినది. ఆయా సమస్యలకు సరియైన చికిత్సా విధానములు అనుసరించి చికిత్సని అందించవలెను . 

     
     

శరీరంలో రసాదిదోషాలు ప్రకోపించిన ఏయే స్థానాలలో ఏయే వ్యాధులు కలుగునో సంపూర్ణ

శరీరంలో రసాదిదోషాలు ప్రకోపించిన ఏయే స్థానాలలో ఏయే వ్యాధులు కలుగునో సంపూర్ణ వివరణ  - 

 *  రసం దోషం పొందిన కలుగు వ్యాధులు - 

    అన్నం మీద ఇష్టం లేకపోవుట, రుచి తెలియకపోవటం, ఆహారం జీర్ణం కాకపోవడం , శరీరం నొప్పులు , జ్వరం, గుండెపీకుట , వాంతి వచ్చునట్లు ఉండటం, ఆహారం తినకపోయినను తినినట్లు ఉండటం , శరీరం బరువు, హృదయ సంబంధ వ్యాధులు , పాండురోగం , శరీరం కృశించటం, అవయవములు కృశించుట, అకాలంలో శరీరం ముడుతలు పడుట, అకాలం నందు జుట్టు నెరియుట వంటి వ్యాధులు కలుగును.

 *  రక్తం దోషం పొందుట వలన కలుగు వ్యాధులు  - 

     కుష్టు , విసర్ప, పిడక ,మశక ,నీలిక , తిలకాలకా, నశ్చ , వ్యంగ అను చర్మవ్యాధులు ,  పేనుకొరుకుడు, ప్లీహ సంబంధ సమాస్యలు , విద్రది అను వ్రణం , గుల్మవాతం, శోణిత, క్యాన్సర్ , రక్తపిత్తం వంటి వ్యాధులు సంభంవించును.

 *  మాంసం దోషం పొందుట వలన కలుగు వ్యాధులు  - 

     ఆసనము , నోరు , నాలిక పుండ్లు పడుట, మాంసం వృద్ధినొందుట, క్యాన్సర్ కణుతులు, మొలలు , కొండనాలుక వాచుట, ఇగుళ్ళు నొప్పులు , గలగండిక ( టాన్సిల్స్ ) , పెదవులు పుండ్లు పడుట, గొంతు చుట్టూ కణుతులు వచ్చుట, గొంతు వాచుట మొదలైన వ్యాధులు సంభంవించును.

 *  మేథస్సు అనగా కొవ్వు దోషం పొందుట వలన కలుగు వ్యాధులు  - 

     శరీరంపై గ్రంథులు లేచుట , అండవృద్ధి, గొంతు వ్రణాలు , క్యాన్సర్ , మధుమేహం , శరీరం లావెక్కుట , అధికమైన చెమట  మొదలయిన రోగాలు సంభంవించును.

 *  ఎముకలు దోషం పొందుట వలన కలుగు వ్యాధులు  - 

      ఎముకపై ఎముక పెరుగుట, దంతముల పై దంతము పెరుగుట, ఎముకలపై సూదులతో పొడిచినట్లు అగుట, పిప్పిగొళ్ళు మొలుచుట మెదలైనవి ఎముకలలో దోషం పొందుట వలన కలుగు వ్యాధులు . 

 *  మజ్జ దోషం పొందుట వలన కలుగు వ్యాధులు  - 

        అజ్ఞానము కలుగుట, మూర్చ వచ్చుట, శరీరం తిరిగినట్లు అనిపించటం, జాయింట్లలో వాపులు , బాధ కలుగుట, కళ్ళకలక మొదలైనవి శరీరంలో మజ్జ దోషం పొందుట వలన కలుగు వ్యాధులు . 

 *  శుక్రం దోషం పొందుట వలన కలుగు వ్యాధులు  - 

       నపుంసకత్వం ,సంతోషం లేకపోవటం , రోగంతో ఉన్న నపుంసకునకు అల్ప ఆయుర్దాయం , వికృత రూపం కలిగిన సంతానం కలుగుట, గర్భస్రావం మెదలైనవి శరీరంలో శుక్రం దోషం పొందుట వలన కలుగును.

 *  మలము దొషం పొందట వలన కలుగు వ్యాధులు  - 

       మలము వెలువరించుటకు అవరోధం కలుగుట, లేదా అధికంగా వెలువడుట, సకాలంలో విరేచనం అవ్వకపోవుట, కడుపులో వికారాలు, చర్మవ్యాదులు సంభవించుట జరుగును.

        పైన చెప్పిన విధముగా ఆయా శరీరంలోని ముఖ్య భాగాలకు దోషాలు సంభవించినప్పుడు అయా వ్యాధులు కలుగును.

    
     

ఆయుర్వేదం నందు ఔషదములు గ్రహించు ప్రాచీన పద్దతులు -

ఆయుర్వేదం నందు ఔషదములు గ్రహించు     ప్రాచీన పద్దతులు  - 

 ఆయుర్వేదం లొ ఔషధసేవన అన్నది 5 పద్ధతులలో తీసుకొవడం జరుగుతుంది. ప్రాచీన గ్రంధాలలో ఈ పద్దతులు వివరించడం జరిగింది. వాటి గురించి మీకు వివరిస్తాను.     అవి 

 1 -  స్నేహన విధి .
 2 -  స్వేద విధి .
 3 -  వమన విధి .
 4 -  విరేచన విధి .
 5 -  నస్య విది.

 * స్నేహన విధి  - 

    తైలాధులను లేపనం చేయుట . చరుముట, రాచుట మొదలయినవి. దీనికి లేపనం అని పేరు కలదు.

 * స్వేద విధి  - 

    బాగా చెమట పట్టునట్లు ఔషధాలను వేడి నీటి యందు వేసి ఆ వేడినీటి యెక్క ఆవిరి పట్టుట. దీనిని కుంభ సేకం అనే పేరు కలదు. దీనిని ఆంగ్లమున "టర్కిష్ బాత్ " అని అంటారు.

 * వమన విధి  - 

    వాంతి అగునట్లు ఔషధాలను పుచ్చుకొనుట . 

 * విరేచన విధి  - 

    భేదికి ( విరేచనం అయ్యే ఔషదం ) పుచ్చుకొని జీర్ణాశయం ని శుద్ది పరచుట.

 * నస్య విధి  - 

    కొన్ని మూలికల రసమును నాసికా రంద్రముల యందు పోయుట.

    పైన చెప్పినవి పంచకర్మములు  ఇంకా కొన్ని పద్ధతుల ద్వారా కూడా ఔషధాలను ఇచ్చే విధానాలు ఉన్నాయి . ఇవి ఎక్కువుగా చరక సంహిత , చక్రదత్త, సారంగధార సంహిత, అష్టాంగా హృదయము మొదలయిన ప్రాచీన గ్రంధాల యందు కలవు. వాటి గురించి మీకు వివరిస్తాను.

 * అంజనము  - 

  కొన్ని వస్తువుల సముదాయం చేత చేసినట్టి మాత్రను గాని , లేక మూలికల రసం గాని , తైలాధులను గాని , నవనీతం గాని నేత్రముల యందు ఉంచుట ఇదే కలికము లేక అంజనము అంటారు.

 * గండుషము  - 

   ఏదేని వస్తువులను వేసి నానబెట్టిన జలముతో పుక్కిలించుట .

 * వస్తి శోధనము  - 

   నాళము ద్వారా జలమును గుదస్థానము నందు ప్రవేశింప చేసి మలశోధనము చేయుట . ఇందువలన మలకోశము శుద్ది అగును. పొత్తి కడుపు పలచన అగును. ఇది హట యోగుల యొక్క షట్కర్మలు లలొ ఒకటై ఉన్నది. ఆంగ్లము నందు దీనిని "ఎనిమా " అందురు.

 * నాళికా శోధనము  - 

   చిమ్మన గ్రోవి ద్వారా జలమును యొనిస్థానము , కర్ణ రంధ్రము వీని యందు ప్రవేశింప చేసి మలినము వెలికి తీసి శుద్ది చేయుట . ఇది వస్తి శొధనము నందు ఒక బేధము . దీనిని వస్తి పీడనము అని చెప్పెదరు.

 *  ముఖ నిక్షిప్తము  - 

   అతిమధురము, కరక్కాయ బెరడు మొదలగు వస్తువులను పుక్కిట యందు ఉంచుకుని ఆరసమును మింగుట .

 * నిబంధనము   - 

   గడ్డలు మొదలగు వానికి బియ్యపు పిండి లేక మూలికలు ఉడకబెట్టి కట్టుట.

 * బంధము   - 

   గాయములు కలిగినప్పుడు లేక అవయవములు  స్థానము దప్పినను , విరిగినను, బద్ధపెట్టి కట్టుట దీనిని అంగ్లము నందు "బ్యాండేజ్ " అంటారు.

 *  మర్దనము  - 

   తైలాధులను వ్యాధిగల స్థలము నందు లేపనము చేసి చేతితో పట్టుట . దీనిని ఆంగ్లము నందు "మసాజ్ " అంటారు.

 *  తాపనము   - 

     వ్యాధి బాధ గల చోట ఇసుక, తవుడు, ఆకులు మొదలగు వానిని వేయించి గుడ్డలో మూటకట్టి కాని లేక వేడి నీళ్ళని గాజు బుడ్డియందు ఉంచి కాని కాపడం పెట్టుట .

 *  లేపనము  - 

       తలనొప్పి, గడ్డ, మొదలయిన వాటికి పట్టు వేయుట . 

 *  అభ్యంగనము   -

        తైలము , మూలికల రసము , జంభిఫల రసము ( నిమ్మకాయ ) , లాంటి కొన్ని స్నేహ వస్తువులను తలకు రాచుకొని స్నానం చేయుట . 

 *  చూర్ణము   -

       పదార్ధాలను చక్కగా దంచి వస్త్రగాలితం చేసుకొనుట ( వస్త్రము నందు జల్లెడ పట్టుట ).

 *  కల్కము  - 

      ఔషద యోగముల యందు చేర్చుట కొరకై కొన్ని వస్తువులు చేర్చిన సముదాయము ఇదే కల్కద్రవ్యము .

 *  ఘటిక  - 

    ఔషద వస్తువులను నూరి చిన్న చిన్న మాత్రలుగా చేసి ఎండలో నుంచి గాని లేక నీడలో ఉంచిగాని ఎండబెట్టుట . దీనినే వటకం , మాత్ర , గుళిక అని చెప్పెదరు.

 *  రక్త మొక్షనము  - 

     శరీరం నందు ఎచ్చట నైనా గడ్డలు మొదలయినవి కలిగినపుడు హస్త , పాదాల యందు రక్తము హెచ్చుగా నుండినప్పుడు మూలికాదులను కట్టి గాని లేక జలగలను కరిపించి గాని లేక సలాకు ( పదునైన వస్తువు ) తో గాని పొడిచి రక్తము తీయుట .

 *  ధూమ పానము  - 

     కొన్ని మూలికలను చేర్చిన చుట్టను గాని లేక మూలికాదుల చూర్ణం ని నిప్పు పైన వేసి ఆ పొగను గాని వేము మొదలగు కొయ్యలను గాని పీల్చుట .

 * ధూప వర్తి  - 

     మూలికాదుల రసమున తడిపి ఎండించిన గుడ్డను వత్తిగా చేసి కాల్చి ముక్కుతో పీల్చుట .

 *  ధూపము  - 

       సాంబ్రాణి లేక మరికొన్ని ఇతర వస్తువులను పొడిచేసి నిప్పు మీద వేసి ఆ పొగను శరీరం పైన సోకించుట .

 *  ఆఘ్రణము   - 

       కొన్ని వస్తువులను వాసన చూడుట .

 *  పోట్టణం   - 

        ఏదేని మూలికలను ఆకుల యందు చుట్టి కుంపటి లొ గాని , కుమ్ములో గాని ఉంచి ఉడికించి తీసుకొనుట . ఇది పుటపాక బేదము .
 
 *  పుట పాకము   - 

       మూలికాదులను ఆకులలో చుట్టి కుమ్ములలో నుంచి తీసి వాని యెక్క రసము పిండు కొనుట.

 *  పిష్టపాకము   - 

      ఏదేని మూలికలను రోటిలో వేసి దంచి ఆవిరి మీద పెట్టి ఉడికించి తినుట.

 *  చిక్కాన పాకము   - 

       లేహ్యాధులను ఉండచేసినప్పుడు అందు పల్లము పడిన యెడల దానిని చిక్కాన పాకము అనబడును . అనగా ఔషధమును చేతితో తీసీ ఉండ చేయునప్పుడే చేతికి అంటుకోను పాకము .

    ఈ విధముగా ఆయుర్వేదంలో ఔషధాలను గ్రహించు పద్దతులు కలవు. ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని మీ ముందుకు తీసుకొచ్చాను.

     

తేళ్ల గురించి సంపూర్ణ వివరణ - చికిత్సలు .

తేళ్ల గురించి సంపూర్ణ వివరణ  -  చికిత్సలు .

   తేళ్లు కీటకముల జాతికి చెందినవి . అన్ని రకముల కీటకాలకు ముఖము నందు ఉండును. తేళ్లకు మాత్రం తోకచివర ఉండు కొండి యందు విషం ఉండును. శుశ్రుతుడు తేళ్ళలో మరొక రెండు రకాల జాతుల గురించి కూడా వివరించాడు. అందులో మొదటిది పత్ర తేలు రెండోవది మండ్రగబ్బ . మండ్రగబ్బ తేలు కంటే రెట్టింపు పరిమాణంలో ఉండును. అయితే తేలు తోక చివర కొండితో కాటువేయును కాని మండ్రగబ్బ నోటితో కరుచుట వలన విషాన్ని వదులును.

              తేళ్ళలో పుట్టిన ప్రదేశం మరియు విషం యొక్క తీవ్రతని బట్టి మన ప్రాచీన వైద్యులు మూడు రకాలుగా విభజించారు . అవి 

  1 - మంద విషము కలిగినవి.

   2 - మధ్యవిషము కలిగినవి.

   3 - తీవ్రవిషము కలిగినవి.

 * మంద విషం కలిగిన తేళ్ల లక్షణాలు  -

        ఈ జాతిలో 12 రకాలు కలవు. ఇవి ఎక్కువుగా ఆవులు , గేదెలు మొదలగువాని మలములు బాగా కుళ్లిపోయిన వాని యందు పుట్టును . ఇవి కుట్టినచో బాధ , వణుకు , శరీరం మొద్దుబారుట , కుట్టిన ప్రదేశములో రక్తస్రావం కలుగును. కుట్టిన ప్రదేశము నుండి విషము పైకి ఎక్కును . మంట , వాపు , జ్వరం కలుగును. చమట పట్టును . వీటి పొట్ట కింద భాగములో పసుపు , నలుపు , నీలం , పొగ రంగు , గోమూత్రపు రంగు , ఆకుపచ్చ రంగు , తెలుపు రంగు కలిగి ఉండును. పొట్ట కింద మెరియుట , రోమములు కలిగి ఉండును. వీని తోక యందు కణుపులు ఎక్కువుగా ఉండును. మూడు కణుపుల కంటే ఎక్కువ కణుపులు కలిగి ఉండును.

 *  మధ్య విషం కలిగిన తేళ్ల లక్షణములు  -

           ఈ జాతిలో 3 రకాల తేళ్లు కలవు. ఇవి ఎక్కువుగా , వాములు , కర్రల గుట్టల యందు ఉండును. విషము కలిగిన ఆయుధములు చే కొట్టబడటం వలన గాని లేక విషజంతువుల చే కరవబడటం వలన గాని చనిపోయిన జంతువుల శరీరముల నుంచి ఇవి పుట్టును . ఇవి కుట్టినచో నాలిక వాయుట , భోజనము చేయలేకపోవుట , మూర్చ కలుగును. కుట్టిన ప్రదేశము నుండి విషము పైకి ఎక్కును. వీటి పొట్ట కింద భాగము నందు పసుపు , నలుపు , ఎరుపు రంగు కలిగి ఉండును. వీని తోక యందు మూడు కణుపులు ఉండును.

 *  తీవ్ర విషము కలిగిన తేళ్ల లక్షణములు -

          ఈ జాతిలో 15 రకాలు ఉండును. ఇవి ఎక్కువుగా చనిపోయిన పాములు మొదలగు విష జంతువుల శరీరములు బాగా కుళ్లిపోయిన తరువాత ఆ శరీర భాగాల నుంచి పుట్టును .

           ఈ తేళ్లు కుట్టిన వెంటనే సర్పవిషము వలనే వేగముగా పైకి ఎక్కును . శరీరము నందు బొబ్బలు , జ్వరం కలుగును. అతి నీరసము వచ్చును. ఇంద్రియాల నుండి నల్లని నెత్తురు స్రవించి ప్రాణములు పోవచ్చును.వీటి పొట్ట కింద ఎరుపు , తెలుపు , పొగ రంగు , నీలము , గులాబీ మొదలగు రంగురంగులు కలిగి ఉండును. దీని తోక యందు ఒక కణుపు గాని , రెండు కణుపులు గాని , లేక అసలు కణుపుల లేకుండా గాని ఉండును.

           పైన చెప్పినవాటితో పాటు శుశృతుడు వివరించిన రెండు రకాల తేళ్ల గురించి కూడా వివరిస్తాను.

 *  పత్ర వృశ్చిక లక్షణాలు  -

          ఇది ఆకువలనే పలచని ఆకారం కలిగి ఉండును. ఇది కుట్టినచో ఆ ప్రదేశము నందు ఎర్రబడి , బొబ్బలు పొక్కి , నిప్పుతో కాల్చినట్లుగా బాధ పెట్టును.

 *  మండ్రగబ్బ లక్షణములు  -

           ఇది చూడటానికి తేలు వలే ఉండును కాని పరిమాణంలో పెద్దదిగా ఉండును. ఇవి నలుపు , ఎరుపు రంగులు కలిగి ఉండును. వీటికి విషము నోటి యందు ఉండును. ఇవి కరిచినచో రోగి రోమములు నిక్కబొడుచుకొని ఉండును. శరీరం చల్లబడును చమటలు కారును . పురుషాంగం స్థంభించును. కరిచిన గాయం నుండి నల్లగా రక్తం కారును .

 *  తేలు యొక్క విషం వ్యాపించు విధం -

         తేలు కుట్టిన వెంటనే సూదితో గుచ్చినట్లు ఉండి కొండి యందలి రంధ్రము ద్వారా విషము శరీరంలోనికి ప్రవేశించి ఆ ప్రాంతము అంతా నిప్పుతో కాల్చినట్లు మంట కలుగును. కాళ్ళు , చేతుల యందు కుట్టినచో విషము గజ్జలు , చంకల వరకు వ్యాపించి కొంతసేపు ఉండి మరలా కాటు ప్రదేశమును చేరును . అచ్చట 24 గంటల కాలము పోటు , నొప్పి , పగలగొట్టుచున్నట్లు బాధ కలుగును. దీని విషము పూర్తిగా రక్తములోకి ప్రవేశించక పోయినప్పటికీ తేలు విషము నందు ఆమ్ల ,తీక్ష , ఉష్ణ గుణములు ఉండుటచేత చర్మము కిందనే ఉండి మంట, పోటు కలిగించును. 

 తేలు కుట్టినప్పుడు చేయవలసిన చికిత్సలు  -

 *  ఎటువంటి తేలు కుట్టినను , మండ్రగబ్బ కరిచినను కుట్టిన ప్రదేశము నందు తడిపి జీలకర్ర , సైన్ధవ లవణం కలిపి నూరి నేతిలో వేయించి దానిని ఒక గుడ్డలో పోసి కుట్టిన ప్రదేశము నందు కాపడం పెట్టి ఆ గుడ్డతోనే కట్టు కట్టవలెను . ఆ తరువాత పసుపు , నీరుల్లిపాయ కలిపి ఆ ప్రదేశము నందు నెమ్మదిగా రుద్దవలెను . ఆ తరువాత తులసి , వెన్న , గోమూత్రము కలిపి నూరి కుట్టినచోట లేపనం చేయవలెను .

 *  కప్పు వేడినీటిలో చెంచాడు ఉప్పు కలిపి తాగితే బాధ త్వరగా తగ్గును.

 *  గచ్చకాయ పగలగొట్టి దానిలోని పప్పును రెండు నీటిచుక్కలు వేసి అరగదీసి ఆ గంధాన్ని కుట్టినచోట రాసి నిప్పు వేడి చూపిస్తే విషాన్ని లాగివేస్తుంది. ఇదేవిధంగా కుంకుడుకాయ పై గుజ్జు గంధాన్ని వ్రాసి సెగ చూపించినా బాధ పోవును .

 *  ఎండిపోయిన గుమ్మడికాయ ముచ్చిక నీటితో అరగదీసి కుట్టినచోట రాయుచున్న బాధ తగ్గును. వసకొమ్మును అరగదీసి రాయుచున్న కూడా పనిచేయును .

 *  గుగ్గిలం పొడి కుట్టినచోట పెట్టి నిప్పువేడి చూపించుతున్న విషాన్ని లాగివేయును.

 *  తేలు కుట్టిన వెంటనే ఉత్తరేణి ఆకులను నలిపి కుట్టిన ప్రదేశములో రుద్దిన విషం విరుగుతుంది.

 *  జీలకర్రను నూరి కుట్టినచోట అంటించి నిప్పు వేడి చూపించుతున్న విషాన్ని బయటకి లాగును .

 *  పసుపును చిక్కగా నీటితో కలిపి కుట్టినచోట పెట్టి సెగ చూపించుతున్న అది ఆరుతున్న కొద్ది బాధ తగ్గును.

 *  రుద్రజడ ఆకులు నలిపి కుట్టినచోట రుద్దితే విషం తగ్గుతుంది . కుట్టిన వెంటనే నిప్పుని కుట్టినచోట నొక్కిపెట్టి వెంటనే తీసివేసిన బాధ వెంటనే తగ్గును. దీనికి కారణం నిప్పు తడిని అతివేగముగా లాక్కుంటుంది. తేలు విషం కూడా అతిస్వల్ప తడి ద్రవం.

 *  నేపాళం గింజలొని పప్పు జిల్లేడు పాలతో కలిపి నూరి కుట్టినచోట అంటించుతున్న విషాన్ని గుంజివేయును . ఈ పద్ధతితో నేను చికిత్స చేశాను . ఇది నా అనుభవయోగం .

          ఇప్పుడు మీకు తేలు కుట్టినప్పుడు ఏయే లక్షణాలు కనిపిస్తే రోగి మరణించునో తెలియచేస్తాను.

         కన్నులు , ముక్కు, నాలుక ఇవి వాని యొక్క సహజ గుణములు పొగొట్టుకొని విపరీత గుణములు అనగా కన్నులు సరిగ్గా చూడలేకపోవుట , ముక్కు వాసనని గుర్తించలేకపోవుట , నాలిక రుచిని గ్రహించకపోవుట , శరీరము నందు కాలినట్లు బొబ్బలు , వాపు కలుగుట , నొప్పి , జ్వరం , వాంతి కలిగి గాయము నందలి మాంసము ఊడిపడిపోవుట వంటి లక్షణాలు తేలు కుట్టిన రోగికి కలిగినచో ఆ రోగికి చికిత్స చేసినను బ్రతకడు . ఈ లక్షణాలు చికిత్స సమయానికి అందకుండా ఆలస్యం అవుతున్నకొలది మొదలై చివరకు ప్రాణాలు హరించును .

 
     

ఆయుర్వేదం నందు నవరత్నాలను ఉపయోగించి చేయు వైద్య ప్రక్రియలు -


     నవరత్నాలు అనగా మాణిక్యం , ముత్యము , పగడము , పచ్చ, పుష్యరాగము , వజ్రము , నీలము , వైడూర్యము , గోమేధికము  ఈ తొమ్మిదింటిని  నవరత్నాలు అని పిలుస్తారు . చాలామందికి ఇవి కేవలం ఆభరణాలలో ఉపయోగించు విలువయిన రాళ్ళగా మాత్రమే పరిచయం . భారతీయ పురాతన ఆయుర్వేద వైద్యులు వీటిలోని ఔషధ గుణాలను తమ పరిశోధనల ద్వారా తెలుసుకుని వాటిని తమ వైద్యములో విరివిగా ఉపయోగించారు. వారు తమ పరిశోధనా ఫలితాలను తమ గ్రంథాలలో సంపూర్ణంగా వివరించారు . ఇవి ఎక్కువుగా సంస్కృత లిపిలో ఉన్నాయి . ఈ మధ్యకాలంలో నేను అటువంటి పురాతన గ్రంథాలను సేకరించి వాటిపైన కొంత పరిశోధన కూడా చేశాను . ఆ విలువైన సమాచారాన్ని ఇప్పుడు మీకు నేను అందించబోవుతున్నాను.

         జ్యోతిష్యశాస్త్ర ప్రకారం మాణిక్యం అనగా కెంపు సూర్యునకు , ముత్యము చంద్రునకు , పగడము అంగారకునకు , మరకతము అనగా పచ్చ బుధునకు , పుష్యరాగము గురువునకు , వజ్రము శుక్రునకు , నీలము శనికి , వైడుర్యము రాహువునకు , గోమేధికము కేతువునకు ప్రీతికరములు మరియు ప్రతిరూపములుగా పేర్కొన్నారు . మరియు ఆయా గ్రహ దోషములకు ఆయా రత్నములను ధరించి గ్రహపీడ నుండి బయటపడవచ్చు.

            ఇప్పుడు ఆయుర్వేదం నందలి నవరత్నాల ఉపయోగాలు మీకు తెలియచేస్తాను .

 *  మాణిక్యం  -

           ఈ మాణిక్యం పద్మరాగము అని ప్రసిద్ధి కలిగినది . తామరరేకు వన్నె కలిగి బరువుతో స్ఫుటంగా ఉండును. మిక్కిలి కాంతివంతముగా ఉండును. స్ఫుటముగా , బరువుగా , గుండ్రముగా ఉండు మాణిక్యం పరిశుద్ధం అయినది.  ఈ మాణిక్యమును సరైన పద్ధతుల్లో శుద్దిచేసి పుటం పెట్టి ఆ భస్మమును ఉపయోగించిన  శరీరము నందలి వాత,పిత్త, శ్లేష్మములను శాంతింపచేసి అగ్నిదీపమును కలిగించును. శరీరముకు దారుఢ్యము కలిగించును. మరియు దీనిని ధరించిన  భూత , బేతాళ పీడలు తొలగును . అతి భయం వంటి మానశిక దోషాలలో ఇది మంచి ప్రభావం చూపించును.

 *  ముత్యము  -

           గుండ్రగా ఉండి తెల్లని కాంతి కలిగి , తేలికైనది , నీటి కాంతి కలిగి , నిర్మలంగా ఉండి అందంగా ఉన్న ముత్యము శుభకరమైనది. వెలవెలపోతూ పైన పొరలుపొరలుగా ఉండి గొగ్గులుగొగ్గులుగా ఉన్నది మంచి ముత్యం కాదుగా గ్రహించాలి.ఇలాంటి ముత్యాలను అసలు వాడకూడదు.

          మంచి ముత్యమును పుఠం పెట్టి భస్మం చేసి ఒక మోతాదులో ప్రతినిత్యం పుచ్చుకొనుచున్న మనుజులకు రక్తపిత్తం, క్షయ వంటి రోగాలు నిర్మూలనం అగును. దేహమునకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చును. ఆయుష్షును వృద్దిచేయును . వీర్యవృద్ధి చేయును , శరీరం నందు జఠరాగ్ని వృద్ధిచెందించి శరీరానికి ఉత్సాహం కలుగచేయును .

 *  పగడం  -

            బాగా పండిన దొండపండు వలే ఎర్రని రంగు కలిగి గుండ్రని నునుపైన బుడిపెలు , వంకరలు , తొర్రలు మొదలగునవి లేకుండా పెద్దగా ఉండు పగడం శ్రేష్టమైనది. శుభప్రదం అయినది. 

          మంచి పగడమును సేకరించి సహదేవి ఆకు రసము నందు నానబెట్టిన శుద్ది అగును. దానిని భస్మము చేసి సేవించిన యెడల క్షయరోగములు , రక్తపిత్తములు , కాసరోగము , నేత్రరోగములు , విషదోషాలు మున్నగు వాటిని శమింపచేయును . అగ్నిదీప్తిని , జీర్ణశక్తిని కలిగించి వార్ధక్యమును పోగొట్టి దేహమునకు కాంతిని , బలమును కలిగించును. దీనిని ముట్టునొప్పికి విశేషముగా వాడుదురు.

 *  గరుడ పచ్చ  -

         మంచి గరుడపచ్చ ఆకుపచ్చని రంగు కలిగి మెరుగులు తేలుతూ బరువుగా , నున్నగా ఉండును. మిక్కిలి కాంతిమంతంగా ఉండును. దీనిని ఔషధముల యందు ఉపయోగించవచ్చు . తెల్లగా , నల్లగా , బుడుపులు కలిగి ఉన్న , పెలుసుగా ఉన్న ఆ పచ్చ మంచిది కాదు అని అర్థం .

            గరుడ పచ్చను ఆవుపాలలో నానబెట్టి శుద్దిచేసి భస్మము చేసి సేవించుతున్న పాండువ్యాధులు , మొలలు , విషదోషాలు , సన్నిపాత జ్వరాలు , సామాన్య జ్వరాలు , వాంతులు , శ్వాస సంబంధ సమస్యలు , కాసరోగం , అగ్నిమాంద్యం వంటి రోగాలను పోగొట్టును . దేహమున మిక్కిలి కాంతిని ఇచ్చి మేలుచేయును .

 *  పుష్యరాగము  -

           పుష్యరాగము శుద్ధముగా , నునుపుగా , లావుగా , బరువుగా , ఎగుడుదిగుడు లేనిదిగా ఉండి గోగుపూవ్వు రంగు కలిగి తళతళ ప్రకాశించుచుండును. ఇట్టి లక్షణాలు కలిగినది అత్యుత్తమం అయినది.ఇలా కాక గోరోచనపు రంగు గాని పచ్చగా కాని మిక్కిలి తెలుపుగా గాని ఉండిన మంచిది కాదు.

             దీని భస్మం సేవించిన తీవ్రమగు దాహమును , వాంతులను , వాతరోగములను , కుష్టు వ్యాధిని , విషదోషములను పోగొట్టి దేహమునకు మిక్కిలి కాంతిని కలుగచేయును .

 *  వజ్రము  - 

            ఈ వజ్రము నందు స్త్రీ, పురుష , నపుంసక అని మూడు రకాల జాతులు కలవు.

       ఎనిమిది అంచులు కలిగి , పక్షములు ఎనిమిది , కోణములు ఆరు కలిగి ఇంద్రధనస్సు వలే ప్రకాశించుతూ నీటివలె నీడదేరునది పురుషవజ్రము అనబడును.

             గుండ్రనైన ఆడుకులు గట్టి ఉండు ఆకారం కలిగి ఉండినది స్త్రీ వజ్రం అనబడును.

        మణిగిపోయిన మూలాలు , అగ్రమును కలిగి ఉండి మిక్కిలి గుండ్రముగా ఉండునది నపుంసక వజ్రం అనబడును. 

           మంచి పురుషజాతి వజ్రమును భస్మం చేసి వాడుతున్న సమస్తరోగములను పోగొట్టి వీర్యాభివృద్ధిని కలిగించి వార్థక్యమును పోగొట్టి బాగుగా ఆకలి పుట్టించును . మానవులకు ఇది అమృతప్రాయమై ఉండును. 

 * నీలము  -

           దీనిలో జలనీలము , ఇంద్రనీలము అను రెండు విభిన్న రకాలు కలవు. ఇందులో ఇంద్రనీలము శ్రేష్టము . జలనీలము తేలికగా ఉండి తెలుపుతో కూడిన వర్ణము కలిగి ఉండును. ఇంద్రనీలము బరువుగా ఉండి నలుపువర్ణము నందు నీలం మిశ్రితము కాక నీలవర్ణం కాంతి కలిగి నునుపుగా మలినం లేకుండా మృదువుగా మద్యభాగము నందు కాంతి కలిగి ఉండును. ఇది అత్యంత శ్రేష్టం అయినది.

             ఈ నీలమును గాడిద మూత్రములో నానబెట్టి మంచి తీవ్రత కలిగిన ఎండలో ఎండించిన శుద్ధం అగును.

        ఈ భస్మాన్ని ఉపయోగించుతున్న శ్వాస , కాస రోగాలు మానును . వీర్యవర్ధకం , త్రిదోషాలను హరించును . అగ్నిదీప్తిని పెంచును. విషమజ్వరం , మూలశంఖ రోగము , పాపసంబంధ రోగాలను హరించును .

 *  వైడుర్యము  -

           నలుపు , తెలుపు కాంతి కలిగి సమానమై , స్వచ్ఛమై , బరువై , స్ఫుటమై , లొపల తెల్లని ఉత్తరీయము వంటి పొర కలిగినది శ్రేష్టమైన వైడుర్యము . నల్లగా కాని తెల్లగా కాని ఉండి పారలుపొరలుగా ఉండి లొపల ఎర్రని ఉత్తరీయము వంటి పొర కలిగినది చెడు వైడుర్యముగా గుర్తించవలెను . మంచిది కాదు.

        దీనిని కొండపిండి రసములో నానబెట్టి ఎండించి బాగా కాల్చి ఆ తరువాత గజపుటము వేయవలెను .

         ఈ భస్మము రక్తపిత్తవ్యాధిని హరించును . బుద్ధిని , శరీర బలాన్ని , ఆయుర్వృద్దిని కలిగించును. పిత్తాన్ని పెంచును , అగ్నిదీప్తిని చేయును . మలములను శరీరం బయటకి వెడలించును.

 *  గోమేధికం  -

            ఇది ఆవుయొక్క మెదడుని పోలి ఉండటం వలన గోమేధికం అని పేరు వచ్చినది . ఇది స్వచ్చమైన గోమూత్రము కాంతి కలిగి నునుపుగా ఉండి హెచ్చుతగ్గులు లేకుండా బరువుగా ఉండి పొరలు లేకుండా దట్టముగా ఉండును. మెరుపు లేకుండా తేలికగా ఉండి కాంతివిహీనం అయి గాజుపెంకు వలే ఉండునది దోషయుక్తము .

          దీనిని గోమూత్రము నందు నానబెట్టి ఎండించి ఆ తరువాత నేలగుమ్ముడు సమూల రసము నందు నానబెట్టి ఆ తరువాత ఎండించిన శుద్ది అగును. ఆ తరువాత నల్ల ఉమ్మెత్తకు రసము నందు నానబెట్టి ఎండించి పుఠం పెట్టిన భస్మం అగును.

        ఈ గోమేధిక భస్మమును శ్లేష్మ, పైత్య రోగాలు , క్షయ , పాండువు వంటి రోగాల నివారణలో వాడతారు. అగ్నిదీప్తిని కలిగించి ఆహారాన్ని జీర్ణం చేయును . రుచికరంగా ఉండును. ఇంద్రియాలకు బుద్దిని , బలాన్ని ఇచ్చును.

         పైన చెప్పినటువంటి రత్నభస్మాలను అనుభవవైద్యుల పర్యవేక్షణలోనే తగినమోతాదులో వాడవలెను. స్వంత నిర్ణయాలు మంచివి కాదు.

   

మూత్రపిండములలో రాళ్లు కరిగించు గొప్ప ఔషధ యోగములు -



 *  కానుగ గింజలలోని పప్పు మూడు గ్రాములు తీసుకుని పొడిచేసి 60 మిల్లీలీటర్ల ఆవుపాలలో కలిపి లోపలికి తీసుకొనుచుండిన మూత్రపిండాలలోని రాళ్లు పడిపోవును .

 *  యవాక్షరం , బెల్లం సమాన భాగాలుగా కలిపి రెండు గ్రాముల చొప్పున రోజుకొకసారి ఒక వారం నుంచి పదిరోజులపాటు తినిన రాళ్లు కరిగి పడిపోవును . దీనితో పాటు బూడిదగుమ్మడికాయ రసం కూడా వాడిన ఫలితం తొందరగా కనిపించును.

 *  వేపాకు నీడలో ఎండించి కాల్చి భస్మం చేసి పూటకు ఒకటిన్నర గ్రాము చొప్పున ఒకరోజు నిలువ ఉంచిన నీళ్లతో కలిపి తీసుకొనుచున్న మూత్రపిండాలలో రాయి కరిగిపోవును . రెండుపూటలా తీసికొనవలెను .

 *  రణపాల ఆకు రసము 6 గ్రాములు కాచిన వెన్న 13 గ్రాములు కలిపి ప్రతినిత్యము తాగుచున్న రాళ్లు కరుగును.

 *  పల్లేరు చూర్ణం ఒక స్పూన్ , కొండపిండి చూర్ణం ఒక స్పూన్ ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించి ఉదయం మరియు సాయంత్రం తీసుకొనుచున్న మూత్రపిండాలలో రాళ్లు నివారణ అగును.

 *  పొద్దుతిరుగుడు పువ్వు చెట్టు వేర్లు పొడి 25 గ్రాములు తీసుకుని ఒక లీటర్ తియ్యటి మజ్జిగతో కలిపి తీసుకొనుచున్న రాళ్లు కరుగును.

 *  పూటకు రెండు వెల్లుల్లి రేకల గుజ్జు తినుచున్న మూత్రాశయపు రాళ్లు కరుగును. అలా అప్పుడప్పుడు తినుచున్న రాళ్లు పుట్టవు .

  మూత్రపిండాలలో రాళ్లు ఉన్నవారు పాటించవలసిన ఆహారనియమాలు  -

 తినవలసిన ఆహారపదార్దాలు  -

  పాతబియ్యపు అన్నం , యవలు , గోధుమలు , ఉలవలు , పెసలు , మజ్జిగ , ఆవునెయ్యి , ఆవుపాలు , పెసరకట్టు , ఉలవకట్టు , అల్లం , తియ్యని కల్లు , చక్కెర , ముదురు గుమ్మడికాయ , బూడిద గుమ్మడికాయ , పొట్లకాయ , కొండపిండికూర , పల్లేరుకూర , చిర్రికూర , పెరుగుతోటకూర , ఖర్జురము , వెదురుమొలకలు , కొబ్బరికాయ , తాటిముంజలు , నక్కదోసకాయ , మేకమాంసం .

 తినకూడని ఆహార పదార్ధాలు  -

    మలబద్ధకర ఆహారాలు , చద్ది అన్నం , బిరుసుఅన్నం , తాంబూలం , ఎక్కువ ఉప్పు గల ఆహారపదార్థాలు , ఎక్కువ నూనె , పిండివంటలు , నువ్వులపిండి , పులుసు , ఇంగువ , నువ్వులు , ఆవాలు , మినుములు , మామిడికాయ , వెల్లుల్లి మొదలగు వేడివస్తువులు , మలబద్దకాన్ని కలిగించు వస్తువులు , కోడిమాంసం , పందిమాంసం , చేపలు , మద్యం , మైథునం , అతిశ్రమ , మూత్రము , వీర్యము నిరోధము చేయరాదు . 

         పైన చెప్పిన ఆహారపదార్ధాలు పాటిస్తూ ఔషధాలను వాడగలరు .

           

Wednesday, March 2, 2022

ఆయుర్వేదం - విభాగాలు .

ఆయుర్వేదం - విభాగాలు .

  ఆయుర్వేదం అనగా చాలామంది దృష్టిలో చెట్లు , వాటి చూర్ణాలు అనే దృష్టి ఉంది. కాని చాలామందికి దానిలో అనేక రకాల వైద్యవిధానాలు ఉన్నాయి అనే విషయం తెలియదు. వాటిగురించి మీకు ఈ పోస్టులో వివరిస్తాను. 

       మనకి తెలిసిన ఆయుర్వేద ప్రముఖుల్లో చరకుడు , శుశ్రుతుడు అందరికి తెలుసు. కాని ఇంకో ప్రముఖ వ్యక్తి ఉన్నారు. అతని పేరు వాగ్బాటాచార్యుడు . ఈయన రాసిన " అష్టాంగహృదయం " అనే గ్రంధం చాలా ప్రముఖమైనది. దీనిలో అనేక భాగాలు కలవు. ఒక భాగంలో కేరళ రాష్ట్రంలో ప్రాచుర్యంలో ఉన్న " మర్మకళ" గురించి చాలా వివరంగా ఉన్నది. మనిషి శరీరంలో ఉన్నటువంటి మర్మస్థానాల గురించి , దానిపైన ఒత్తిడి కలిగించినప్పుడు కలిగే సమస్యల గురించి చాలా చక్కగా వివరించారు. ఆయన రాసిన                  "అష్టాంగసంగ్రహం" అను గ్రంథం కూడా ప్రముఖమైనది. 

     వాగ్బాటాచార్యుడు ఆయుర్వేదంని ౮ విభాగాలుగా విభజించాడు.   అవి 

 *  శల్యతంత్రము .

 *  శాలాఖ్య తంత్రము .

 *  కాయచికిత్స . 

 *  భూతవిద్య .

 *  కౌమారభృత్యము .

 *  అగధాతంత్రము .

 *  రసాయన తంత్రము.

 *  వాజీకరణ తంత్రము .

      ఒక్కొక్కదాని గురించి మీకు క్లుప్తంగా వివరిస్తాను.

 * శల్య తంత్రము - 

     మేకులు , రాళ్లు , ధూళి , ఇనుపమేకులు , మట్టిపెళ్లలు , ఎముకలు , గోళ్లు మొదలైనవి శరీర అంతర్భాగమున చొరబడినచో వానిని బయటకి తీయు ఉపాయములు , యంత్రములు, శస్తములు , క్షారములు మరియు అగ్నిని ప్రయోగించు విధానముని తెలియజేయునది శల్యతంత్రము .

 *  శాలాఖ్య తంత్రము  - 

    కంఠమునకు పైభాగమున చెవులు , కన్నులు , కంఠబిలం , నాసిక మొదలగు వాటియందు కలుగు వ్యాధుల నివారణార్ధం ఏర్పడినది శాలాఖ్య తంత్రము. 

 *  కాయచికిత్స - 

     సమస్త అవయములును అనుసరించి జ్వరం , అతిసారం, రక్తపిత్తము , శోష , ఉన్మాదము , అపస్మారము , కుష్ఠము, మేహము మొదలగు వ్యాధులను నివారించుటకు నిర్ణయింపబడిన చికిత్సా విధానమును కాయ చికిత్స అందురు.

 *  కౌమారభృత్యము - 

     శిశువుల పోషణా విధానము , పాలు ఇచ్చే విధానం , పాలల్లో దోషములు శోధించుట , దుష్టపు పాలు త్రాగుట చేత , దుష్ట గ్రహంబులు చేత కలిగిన వ్యాధుల నివర్తి చేయుటకు తగు విధానములు భోధించునది "కౌమారభృత్యము ".

 *  అగధ తంత్రము - 

     పలు రకాల సర్పాలు , కీటకములు , సాలెపురుగులు , తేళ్లు , ఎలుకలు మొదలగు విషజంతువులు కరుచుట చేతను కలిగిన విషమును తెలుసుకొనుటకు , విషముల్లో రకాలు అయిన స్థావర, జంగమ విషములు గురించి వాటి ఉపశమనాల గురించి ఎర్పడినది అగధ తంత్రము.

 *  రసాయన తంత్రము - 

     యవ్వనమును స్థిరముగా చేయుటకు , ఆయువుని , బలమును , బుద్ధిని కలుగచేయుటకు , వ్యాధుల నివర్తించుటకు సమర్ధంబు అయినది రసాయన తంత్రము .

 *  వాజీకరణ తంత్రము - 

      క్షీణించిన రేతస్సును అధికంగా చేయుటకు , దుష్టమగు రేతస్సుని శుభ్రముగా చేయునది , సంభోగము నందు అధిక శక్తిని , కామవాంఛ కలుగ చేయునది వాజీకరణ తంత్రము . 

    
    ఈ విధముగా ఆయుర్వేదము 8 అంగాలుగా విభజించబడినది. ఆయా సమస్యలకు సరియైన చికిత్సా విధానములు అనుసరించి చికిత్సని అందించవలెను . 

     
     

Tuesday, March 1, 2022

శరీరంలో అతివేడిని తగ్గించుటకు నేను ప్రయోగించిన సులభ యోగం -

శరీరంలో అతివేడిని తగ్గించుటకు నేను ప్రయోగించిన సులభ యోగం - 

      రాత్రిసమయంలో ఒక మూడు కప్పుల అన్నమును ఒక గిన్నెలో వేసి ఆ అన్నము మునిగే విధముగా వేడిపాలు పోసి గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచం పెరుగు వేసి తోడుపెట్టాలి.ఉదయాన్నే తోడుకున్న ఆ అన్నము పెరుగుల మిశ్రమానికి కొంచం ఉప్పు కలిపి ఎర్ర ఉల్లిగడ్డ చిన్నటి ముక్కలుగా కోసి కలుపుకుని తినవలెను . 

              ఇది తీసుకున్న గంటన్నర తరువాత 40ml అలోవెరా జ్యూస్ కి 120 ml నీరు కలిపి లొపలికి తీసికొనవలెను . మరలా సాయంత్రం 6 గంటల సమయంలో మరొకసారి తీసికొనవలెను. పైన చెప్పిన పెరుగుతో కూడిన అన్నం ఉదయం పూట మాత్రమే చాలు 

 గమనిక  - 

    మసాలా పదార్థాలు , కారం , పులుపు , వంకాయ , గొంగూర , టీ , కాఫీ , మద్యం , సిగిరెట్ నిషేధం . 

     

Monday, February 28, 2022

మర్మకళ - శరీరం నందు ఉండు మర్మస్థానములు

మర్మకళ  - శరీరం నందు ఉండు మర్మస్థానములు  

        మర్మ కళ అనే యుద్ధవిద్య భారతీయ ప్రాచీన రహస్య యుద్ధవిద్యలలో ఒకటి. ఈ యుద్దవిద్య ఎక్కువుగా కేరళలో అక్కడక్కడ కనిపిస్తుంది. ఈ విద్యకు మూలపురుషుడు పరమశివుడు . దీనికి వర్మ కళ అని మరొక పేరుతో కూడా వ్యవహరిస్తున్నారు.

            మనిషియొక్క శరీరంలో ప్రాణశక్తి అనేది శరీరములో గల పది మార్గాలనుంచి పైనుంచి క్రిందకి , క్రింద నుంచి పైకి ప్రయాణిస్తూ ఉంటుంది. ఈ మార్గాలను "దశ నాడులు " అని పిలుస్తారు . ఈ ప్రాణశక్తి ప్రవహించే మార్గాలలో ఎటువంటి అడ్డు ఏర్పడినపుడు మనుష్యునికి రోగాలు సంభవిస్తాయి. శరీరములో రక్తం ప్రవహించుటకు రక్తనాళాలు ఎలా ఉన్నాయో అదేవిధముగా వాయువు శరీరం అంతా పరిభ్రమించుటకు కొన్ని ప్రత్యేక మార్గాలు కలవు. ఈ మార్గాలనే నాడులు అని పిలుస్తారు . ఈ నాడులు లో వాయవు ఉంటుంది. పైన చెప్పిన ప్రాణశక్తి అనేది వాయవు రూపంలో ఉంటుంది.

            మర్మస్థానం గురించి వివరించాలి అంటే అదొక ట్రాఫిక్ జంక్షన్ లాంటిది. జంక్షన్ లో సమస్య లేనంతవరకు వాహనాలు ఎటు వెళ్ళేవి అటు ప్రశాంతముగా వెళ్తాయి. ఏదన్నా సమస్య వస్తే ఒకదానివెంట ఒకటి ఆగి సమస్య ఎలా వస్తుందో అదేవిధముగా మర్మస్థానము పైన దెబ్బ తగిలిన వెంటనే శరీరం నందు ఒక్కసారిగా మార్పు వస్తుంది . అవయవాలు చచ్చుబడుట , కోమాలోకి వెళ్లడం , మరణించడం ఈ మూడు రకాల సమస్యలు సంభంవించును. ఏ సమస్య అనేది మర్మస్థానం మరియు మర్మస్థానం పైన దెబ్బ ఎంత బలంగా తగిలింది అనేదానిని బట్టి ఉంటుంది.

         మనుష్య శరీరములోని సిరలు గురించి చెప్పాలంటే వాత , పిత్త , కఫ , రక్త వాహకాలు అని నాలుగు రకాలుగా ఉంటాయి.ఇవి మొత్తం 700 సిరలు శరీరం నందు ఉండును. ఈ సిరలును ఆశ్రయించి మర్మస్థానాలు ఉంటాయి. ఈ మర్మ స్థానముల యందు దెబ్బ తగిలినప్పుడు లేదా గాయం అయినపుడు ప్రాణానికి ముఖ్యమైన రక్తం అధికంగా స్రవించును . రక్తము వలనే మిగిలిన ధాతువులు అన్నియు వృద్ధిచెందుతూ ఉండును. గాయం వలన రక్తం అధికంగా పోయినచో శరీరం నందలి మిగిలిన ధాతువులు క్షీణించును. ఎప్పుడైతే ధాతుక్షయం జరిగినదో వాతం ఒక్కసారిగా వృద్దిచెంది తేజోరూపమైన పిత్తమును ప్రేరణ చెందించును. దీనివల్ల దెబ్బ లేదా గాయం అయిన మర్మస్థానం నందు మిక్కిలి తీవ్రమైన మంట, పోటు మున్నగు బాధలు కలుగును. తీవ్రమైన దప్పిక , శోష , భ్రమ కలుగును. ఆ తరువాత శరీరం పైన తీవ్రంగా చెమట పట్టి అవయవాలు చచ్చుబడుతూ నరకాన్ని అనుభవిస్తూ మరణిస్తాడు. పైన చెప్పిన లక్షణాలన్నీ మర్మస్థానం పైన దెబ్బ తగిలినప్పుడు సంభంవించును. ఈ అత్యంత ప్రాచీన రహస్యమైన మర్మకళ ని సంపూర్ణంగా అభ్యసించిన వ్యక్తికి మాత్రమే మనుష్య శరీరంలో మర్మ స్థానాలు ఎక్కడ ఉంటాయో చక్కగా తెలుస్తుంది. ఈ మర్మస్థానాలనే మన తెలుగుభాషలో ఆయువుపట్లు అంటాము.

                          ఇప్పుడు మీకు మర్మస్థానముల గురించి  వివరిస్తాను. మనుష్య శరీరం మొత్తం మీద 107 మర్మస్థానాలు ఉండును. నాకున్న పరిధినిబట్టి కొంత సమాచారం మాత్రం మీకు వివరిస్తాను. తొడలు ,చేతులు ఈ నాలుగు అంగముల యందు ఒక్కోదానియందు 11 మొత్తము 44 . ఉదర భాగము నందు 3 , రొమ్ము భాగము నందు 9 , వీపున 14 , కంఠము పై భాగము నందు 37 ఉండును. ఇవ్వన్ని కలిపి మొత్తం 107 మర్మములు ఉండును.

          ఆయా భాగములలోని మర్మస్థానాలలో దెబ్బలు గాని గాయాలు గాని సంభవించినపుడు కలుగు విపరీత పరిస్థితుల గురించి మీకు వివరిస్తాను. కాలు యందు ఉండు పదకొండు మర్మస్థానములలో ఒకటి నడిమివేలికి అభిముఖంగా , పాదమధ్య భాగము నందు తల హృదయమును మర్మస్థానం ఉండును. ఈ స్థానము నందు దెబ్బ తగిలినచో తీవ్రమైన నొప్పి కలిగి వెంటనే మరణం సంభంవించును. బొటనవేలికి మరియు మిగిలిన వేళ్ళకి మధ్య క్షిప్రం అను మర్మస్థానం ఉండును. ఈ ప్రదేశము నందు దెబ్బ తగిలినచో అవయవాలు చచ్చుబడి మరణం సంభంవించును. క్షిప్ర మర్మస్థానము నకు రెండు అంగుళాల పైభాగము నందు కూర్చమ్ అను మర్మస్థానం ఉండును. దీనిపైన దెబ్బ తగిలినచో పాదము నందు వణుకు పుట్టును .

           కీలు భాగము నందు ఉండు మర్మలో దెబ్బ తగిలినచో నొప్పి కలిగి కీలు యొక్క గమనం మందగించును. పిక్క మధ్యభాగము నందలి దెబ్బ తగిలి రక్తం వెడలి ఎక్కువ మోతాదులో బయటకి పొయినచో ఆ వ్యక్తికి మరణం తప్పదు. కావున గాయం అయిన వెంటనే రక్తం బయటకి పోకుండా జాగ్రత్త పడవలెను. పిక్కకి మరియు తొడ మధ్యభాగము నందు ఉండు కీలు నందు జాను అను మర్మస్థానం ఉండును. అక్కడ దెబ్బ తగిలినచో మరణించును. ఒకవేళ చికిత్స ద్వారా కాపాడబడినను కుంటితనం సంప్రాప్తిస్తుంది.

        పైన చెప్పిన విధముగా అనేక మర్మస్థానములు మన యొక్క శరీరం నందు ఉండును. వాటిలో కొన్నిస్థానాల పైన దెబ్బలు తగిలితే వెంటనే మరణం సంభంవించును. మరికొన్ని స్థానాలలో దెబ్బలు తగిలితే కొన్నిరోజుల సమయంలో హఠాత్తుగా మరణించటం జరుగును. మరికొన్నిసార్లు శాశ్వత అంగవైకల్యం లేదా తాత్కాలిక అంగవైకల్యం సంప్రాప్తినిచ్చును . ఈ మర్మస్థానం ల యందు దెబ్బలు తగలడం వలన వచ్చు జబ్బులకు 
అత్యంత కష్టసాధ్యముతో నయం చేసినప్పటికీ దానిప్రభావం మాత్రం పోదు .

            మర్మకళ ని నేర్చుకోవాలి అనుకునే వ్యక్తికి చాలా అత్యంత కఠిన నియమ నిబంధనలు ఉంటాయి. ఈ విద్య అందరికి లభించదు. మనస్సుపైన , తన యొక్క భావావేశాలును అదుపులో ఉంచుకోగలిగిన వ్యక్తి మాత్రమే ఈ విద్య నేర్చుకోగలుగుతాడు .

      చివరగా చిన్న విషయం చిన్నపిల్లల తలపైన మొట్టికాయలు వేయడం ప్రమాదకరం ఆ స్థలములో కూడా మర్మస్థానాలు ఉంటాయి. ఒక్కోసారి ఆ స్థానాల్లో దెబ్బ తగలడం వలన విపరీత ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది.

     

పెరుగు , మజ్జిగ , వెన్న ఉపయోగాలు - వాటిని సేవించువారు పాటించవలసిన నియమాలు .

పెరుగు , మజ్జిగ , వెన్న ఉపయోగాలు - వాటిని సేవించువారు పాటించవలసిన నియమాలు .

   ఆవుపెరుగు మిక్కిలి జిడ్డుగా ఉండును. శ్లేష్మాన్ని కలుగచేయును . రక్తం చెడగొట్టును . గ్రామాల యందు పాడిపంటలు విశేషముగా ఉన్నను మనుష్యులు రోగాలబారిన పడుటకు ముఖ్యకారణం పెరుగు తీసుకొను విషయంలో నియమాలు పాటించకపోవడమే ప్రధాన కారణం. రాత్రి యందు పెరుగు ఉపయోగించుట మంచిది కాదు. 

          పెరుగు ప్రీతికరమైన పదార్థం కావడం మూలాన పిల్లలు , పెద్దలు మితిమీరి సేవించెదరు. అందువలన రక్తం చెడి రక్తపిత్త రోగం , విసర్పి కలుగును. విసర్పి అనగా శరీరం నందు రక్తం చెడి మాంసం , చర్మములతో కలిసి సర్పం పాకే విధముగా తొందరగా శరీరం అంతా గుడ్లగుడ్లగా ఉండును. ఇది తరచుగా చిన్నపిల్లలకు వచ్చును. కుష్టు , పాండురోగం , పచ్చకామెర్లు మొదలగు వ్యాధులు వచ్చును. పెరుగు వేడిచేయును . అదే దానికి కొంచం నీరు కలిపి మజ్జిగలా చేసుకుని తాగితే చలువచేయును . అందుకే వేసవికాలం నందు పెరుగు తీసుకోరాదు . శీతాకాలం , వర్షాకాలం నందు పెరుగు పగలు తీసుకోవచ్చు . 

              మూత్రం బొట్లుబొట్లుగా పడు వ్యాధి నందు , రొంప, చలిజ్వరం , నోటికి రుచి లేకపోవటం , శరీరం కృశించి ఉండు రోగములు కలిగి ఉండువారు పెరుగు వాడటం మంచిది . పెరుగు శుక్రాన్ని పెంచును.

  పెరుగు తీసుకొనువారు పాటించవలసిన నియమాలు - 

 *  పెరుగుతో కోడిమాంసాన్ని భుజించరాదు .

 *  పెరుగుతో నిమ్మపండు భుజించరాదు .

 *  పెరుగుతో అరటిపండు భుజించరాదు . 

 *  పెరుగు వేడివేడి అన్నంతో పాటు తినరాదు.

 *  పెరుగు రాత్రి పూట భుజించరాదు .శరీరంలో కఫం వృద్ధిచెందును. మరియు జీర్ణసంబంధ సమస్యలు వస్తాయి.

    పగలు పెరుగు భుజించువారు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవలెను.

 *  తేనె - పెరుగు = మంచి రుచి కలుగును.

 *  ఉసిరిక పచ్చడి - పెరుగు =  శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాలను పోగొట్టును . 

 *  నెయ్యి - చక్కెర - పెరుగు =   వాతాన్ని తగ్గించును , ఆహారాన్ని జీర్ణం చేయును . 

 *  చక్కెర -  పెరుగు =   దప్పిక, తాపాన్ని హరించును . 

 *  పెసరపప్పు - పెరుగు  =  రక్తంలోని వాతాన్ని హరించును . 

  మజ్జిగ ఉపయోగాలు - 

  
    పెరుగునకు నాలుగోవ భాగం నీరు కలిపి బాగుగా మజ్జిగ తయారుచేయవలెను. దానిలో వెన్న తీయరాదు. ఇటువంటి మజ్జిగని ఉదయం , మధ్యాహ్న భోజనంలో ఉపయోగించుచున్న ఏ వ్యాధితోను బాధపడరు.  బాగుగా చిక్కగా ఉండి వెన్నతీయని  మజ్జిగ పుష్టిని కలుగచేయును . కఫాన్ని కలిగించును. శ్రమను , దప్పికను పొగొట్టును. బాగుగా చిలికి వెన్నతీసిన మజ్జిగ తేలికగా జీర్ణం అగును.

          శరీరంలో వాతం పెరిగినపుడు మజ్జిగలో శొంటి, సైన్ధవలవణం లేదా ఉప్పు కలిపి లొపలికి తీసికొనవలెను. శరీరంలో పైత్యం పెరిగినపుడు మజ్జిగతో పంచదార కలిపి వాడవలెను. శరీరంలో కఫం ఎక్కువైనప్పుడు శొంటి, పిప్పిళ్లు , మిరియాల చూర్ణం కలిపి మజ్జిగతో కలిపి తాగవలెను . 

                మన శరీరంలో జఠరాగ్ని మందగించి ఆకలి లేనపుడు మరియు వాత వ్యాధుల్లో మజ్జిగ అమృతంగా పనిచేయును . విషం , వాంతులు , నోటి నుండి నీరు కారుట, విషమజ్వరం , పాండువు , రక్తవిరేచనాలు , మేథస్సు, మొలలు , భగన్దరం , అతిసారం , ప్లీహానికి సంబంధించిన వ్యాధులు , ఉదరరోగం , బొల్లి , కుష్టు , క్రిములను మొదలయిన వాటిని మజ్జిగ సేవించుట వలన పోగొట్టుకోవచ్చు. 

          మజ్జిగ భూమిపైన పోసిన అక్కడ ఉన్న గడ్డిపోచలు , పచ్చిక వంటివి మాడిపోయి మరలా మొలవవు. ఇదే సూత్రం మొలలు వ్యాధికి సంక్రమించును. మొలల వ్యాధిలో మొలకలు ఊడిపోవుటకు మజ్జిగ సేవనం తప్పనిసరి . మజ్జిగ తాగుట వలన వాత, శ్లేష్మములచే ధమనుల్లో ఏర్పడిన అడ్డంకులు తొలగిపోయి రక్తప్రసరణ సాఫీగా జరుగును. దీనివలన శరీరపుష్టి పెరుగును . మజ్జిగ తాగుట వలన 80 రకాల వాతరోగాలు నయం అగును.

  మజ్జిగలోని రకాలు  - 

  *  పెరుగును కవ్వముతో చిలికి అందు వెన్నను పూర్తిగా తీసివేసిన మజ్జిగ.

 *  పెరుగును చక్కగా కవ్వముతో చిలికి అందు వెన్నను సగం మాత్రమే తీసివేసిన మజ్జిగ .

 *  పెరుగును చక్కగా కవ్వముతో చిలికి వెన్నను ఎంతమాత్రం తీయకుండా ఉంచిన మజ్జిగ.

     కఫం ఎక్కువ ఉన్నప్పుడు , అగ్ని మందగించినప్పుడు మిక్కిలి బలహీనంగా ఉన్నప్పుడు వెన్నను పూర్తిగా తీసివేసిన మజ్జిగ వాడవలెను.

      పైత్యం ఎక్కువ అయ్యి , అగ్నిమాంద్యం ఉన్నప్పుడు బలం మధ్యమంగా ఉన్నప్పుడు సగం వెన్న తీసిన మజ్జిగను వాడాలి.

     వాతం ఎక్కువుగా ఉన్నప్పుడు వెన్న అసలు తీయని మజ్జిగని వాడవలెను.

 
  వెన్న ఉపయోగాలు - 

    
         ఆవు వెన్న బలం కలిగించును. జఠరాగ్ని పెంచును. వాతం మరియు పిత్తాన్ని పోగొట్టును రక్తదోషాలను, క్షయరోగం, మొలలు , దగ్గు పోగొట్టును . చిన్నపిల్లలకు అమృతం వలే పనిచేయును . బక్కచిక్కి ఉన్నచిన్నపిల్లలకు ఉదయాన్నే తేనె , ఆవు వెన్న , పంచదార కలిపి తినిపించిన బలం కలుగును. క్షయరోగులు బాగా చిక్కి శల్యం అయినపుడు ఈ ప్రయోగం చాలా బాగా పనిచేయును . 

          గేదె పెరుగు బలకరం . మిక్కిలి చమురు కలిగి ఉండును. వాతం , శ్లేష్మం కలుగచేయును . మధురంగా ఉండును. పచ్చిపాలు తీసిన వెన్న సేవించిన కండ్లకు మంచిది . ఎల్లప్పుడూ అప్పటికప్పుడు తీసిన వెన్న మంచిది . నిలువ వెన్న చాలా రోగములను తెచ్చిపెట్టును. కావున విడిచిపెట్టవలెను. 

     

త్రిఫలా చూర్ణం - ఉపయోగాలు .

త్రిఫలా చూర్ణం  -  ఉపయోగాలు .

 *  శిరోవ్యాధులకు  - 

        త్రిఫలా చూర్ణం 30 గ్రా , పటికబెల్లం చూర్ణం 30 గ్రా కలిపి బధ్రపరచుకోవాలి. రొజూ 2 పూటలా పూటకు 10 గ్రా చొప్పున మోతాదుగా సేవిస్తూ ఉంటే తలలో పుట్టే వంద రకాల శిరోవ్యాదులు హరించి పోతాయి.

 *  మూర్చ  -  అపస్మారం  -

      త్రిఫల చూర్ణం అర టీ స్పూన్ మోతాదుగా ఒక టీ స్పూన్ తేనే కలుపుకుని రోజు సాయంత్ర సమయాలలో సేవిస్తూ ఉంటే క్రమంగా మూర్ఛ వ్యాధులు నయం అవుతాయి.

 *  కామెర్లు  -  ఉబ్బస రోగం . -

      
       ఉదయం పూట త్రిఫలా చూర్ణం కషాయం పెట్టి ఒక ఔన్స్ కషాయంలో ఒక టీ స్పూన్ అల్లంరసం , రెండున్నర గ్రాముల బెల్లం కలిపి సేవించాలి . రాత్రిపూట త్రిఫలా చూర్ణం , అతిమధురం సమంగా  కలిపి ఆ చూర్ణాన్ని 5 గ్రా మోతాదుగా మంచినీళ్ళతో వేసుకోవాలి. ఈ విధంగా రెండు వారాలపాటు ఈ ఔషధాన్ని సేవిస్తే మూర్చలు, దగ్గులు , కామెర్లు, ఉబ్బసం హరించి పొతాయి.

 *  కడుపు నొప్పుల కోరకు  - 

       త్రిఫలా చూర్ణం , అతిమధుర చూర్ణం , ఇప్పచెక్క చూర్ణం సమంగా కలుపుకుని పూటకు అర టీ స్పూన్ మోతాదుగా రెండు పూటలా నెయ్యి కలుపుకుని సేవిస్తూ ఉంటే కడుపులో వచ్చే అన్ని రకాల నొప్పులు అదృశ్యం అవుతాయి.

 *  విరేచనాలు కొరకు  - 

       త్రిఫలా చూర్ణం , కాచు చూర్ణం సమభాగాలు గా కలిపి పూటకు 1 టీ స్పూన్ మోతాదుగా మజ్జిగతో గాని , తేనెతో కాని రెండు పూటలా సేవిస్తూ ఉంటే రక్తం , జిగట, అజీర్ణ , నీళ్ల విరేచనాలు అన్ని కట్టుకుంటాయి. కాచు అనేది పచారి షాపుల్లో దొరుకును.

 *  అతిమూత్ర వ్యాదికి   - 

      త్రిఫలా చూర్ణం అర టీ స్పూన్ మోతాదుగా పావు గ్లాస్ మంచి నీళ్లలో కలిపి రొజూ పడుకునే ముందు తాగుతూ ఉంటే మూత్రంలో చక్కర తగ్గిపోయి అతిమూత్రం అరికట్టబడును.

 *  శరీరం ఉబ్బు  - 

       50 గ్రా త్రిఫలా కషాయంలో రెండు గ్రా గో మూత్ర శిలాజిత్ భస్మం కలిపి పూటకు ఒక మోతాదుగా రెండు పూటలా తాగుతూ ఉంటే ఇంత అసాధ్యం ఐన ఉబ్బురోగం హరించి పొతుంది.

 *  కామెర్ల వ్యాధి  నివారణ  - 

        10 గ్రా త్రిఫల రసంలో కొంచం తేనే కలిపి రెండుపూటలా ఇస్తూ ఉంటే కామెర్ల వ్యాధి హరించును.

 *  పైత్య రోగాలు   - 

       ప్రతిరోజూ 2 పూటలా అర టీ స్పూన్  త్రిఫలా చూర్ణం లో ఒక టీ స్పూన్ తేనే కలిపి సకల పైత్య రోగాలు హరించి పొతాయి.

 *  యోని దుర్వాసన  కొరకు  - 

       త్రిఫల కషాయంలో ప్రతిరోజు మూడు పూటలా స్త్రీలు తమ యోనిని కడుగుతూ ఉంటే భోజనంలో తీపి పదార్దాలు కొంచం ఎక్కువుగా తింటూ ఉంటే యోని దుర్గంధం హరించిపొయి భర్తకు ఇష్టులవుతారు.

 *  దగ్గుల కొరకు   - 

       త్రిఫలా చూర్ణం , శోంటి , పిప్పిళ్ళు , మిరియాలు కలిపిన దానిని త్రికటుక చూర్ణం అంటారు. ఈ రెండు  చుర్ణాలని కలిపి పూటకు అర టీ స్పూన్ మోతాదుగా తేనెతో కలిపి  సేవిస్తూ ఉంటే పొడిదగ్గు , నసదగ్గు, కళ్ళే దగ్గు, కళ్లెలో రక్తం పడే దగ్గు ఇలా అన్ని రకాల దగ్గులు అంతం అయిపోతాయి. 

            పైన చెప్పిన శొంటి , పిప్పిళ్ళు , మిరియాలు త్రిఫలా చూర్ణం తో కలిపే ముందు విడివిడిగా దొరగా వేయించుకొని చూర్ణం చేసుకొవాలి .

  కంటి మసకలకు  - 

   
     త్రిఫల చూర్ణం 30 గ్రా , మూడు లీటర్ల మంచి నీళ్లతో కలిపి ఒక లీటరు నీరు మిగిలేవరకు సన్నని సెగ మీద మరిగించి వడపోసి ఆ లీటరు కషాయంలో అర లీటరు పాలు , పావు కిలొ నెయ్యి కలిపి పొయ్యి మీద పెట్టి నెయ్యి మాత్రం మిగిలేవరకు మరిగించాలి. ఈ నెయ్యిని ప్రతిరోజు రెండు పూటలా పూటకు ఉసిరికాయంత మోతాదుగా తింటూ ఉంటే కంటి మసకలు తగ్గిపొయి దృష్టి పెరుగుతుంది.

  *  సిగిరెట్లు తాగడం వలన వచ్చే నోటి దుర్వాసన -

       త్రిఫలా చూర్ణం , సన్నజాజి ఆకులు సమంగా కలిపి మంచినీళ్ళలో వేసి సగానికి మరిగించి కషాయం కాచి ఆ కషాయం తో రోజుకీ రెండు మూడు సార్లు పుక్కిలిస్తూ ఉంటే పొగ త్రాగటం వలన వచ్చే నోటి దుర్వాసన పొతుంది.

  
     

శరీరం నందు రక్తం వృద్ది అవుటకు సులభ యోగాలు

శరీరం నందు రక్తం వృద్ది అవుటకు  సులభ యోగాలు  - 

 
 *  బూడిద గుమ్మడికాయ శరీర ఆరోగ్యానికి చాలా మంచిది . రోజుకు ఒక కప్పు బూడిద గుమ్మడి కాయ రసాన్ని తాగుతూ ఉంటే శరీరంలో మంచిరక్తం వృద్ది అగును. బూడిద గుమ్మడి కాయలోని గుజ్జుని గట్టి గుడ్డలో వేసి బాగా పిండితే రసం కారుతుంది. దానిని కప్పులో వేసుకొని తాగవచ్చు .

 *  కిసీమిస్ లేదా ద్రాక్షా పండ్లు బాగా తింటూ ఉంటే రక్తం వృద్ది అవుతుంది. పచ్చివి దొరకనప్పుడు ఎండువి తినవచ్చు.

 *  రాత్రులు గుప్పెడు ఎండు ద్రాక్ష కాయలు గ్లాసెడు నీటిలో నానవేసి ఉదయం వాటిని బాగా పిసికి పిండి ఆ పిప్పి పారవేసి ఆ గ్లాసు నీటిని తాగవలెను .అలా రోజూ తాగుతుంటే ఒక నెలలోనే మంచిరక్తం వృద్ది అవుతుంది.

 *  ఎండు ఖర్జూరాలని కూడా పైన చెప్పిన విధముగా చేసి ఆ నీటిని తాగుచున్న రక్తం వృద్ది అగును. 

 *  శనగలు గుప్పెడు రాత్రి సమయంలో నీటిలో నానవేసి ఉదయం తింటూ ఉంటే రక్తం వృద్ది అయ్యి శరీరం పుష్టి అగును.  వ్యాయమం చేసేవారికి ఈ విధానం చాలా మంచిది . 

              పైవిధంగా  నానబెట్టిన గింజలు మొలకెత్తిన తరువాత తింటూ ఉంటే ఇంకా అద్బుత ఫలితాలు వస్తాయి . 

 *  కుంకుమపువ్వు ప్రతినిత్యం తీసుకుంటున్నా కూడా రక్తం వృద్ది అగును. 

 *  అంజీర్ పండ్లు అత్తి పండ్లతో కలిపి తింటున్నా రక్తం వృద్ది అగును. 

 *  లేత కొబ్బరి నీరు మరియు లేత కొబ్బరి తింటూ ఉంటే శరీరంలో మంచి రక్తం వృద్ది అగును.

 
 రక్తవృద్ది కొరకు నేను ప్రయోగించిన అద్బుత యోగం  - 

          ప్రతి రోజు రెండు పూటలా ఒక గ్లాసు దానిమ్మ రసం నందు ఒక స్పూన్ గోధుమగడ్డి చూర్ణం కలిపి లొపలికి తాగించాను . అదే విధంగా మధ్యాహ్నం ఒక యాపిల్ పండు భోజనానికి గంటన్నర ముందు తినిపించాను .

             కేవలం నెలరోజుల్లో రక్తం యొక్క శాతం పెరిగింది.