Monday, January 31, 2022

షడ్రసముల గురించి సంపూర్ణ వివరణ - 1

షడ్రసముల గురించి సంపూర్ణ వివరణ - 1

     షడ్రసములు అనగా 6 రకాల రుచులు . ఈ ఆరురకాల రుచులు మన ఆహారములో భాగములై ఉన్నవి . ఇప్పుడు మీకు ఒక్కోరసము యొక్క ప్రాధాన్యత వాటి గుణాలు మరియు అతిసేవనం వలన కలుగు దుష్ప్రభావాల గురించి సంపూర్ణముగా వివరించెదను . 

 *  మధుర రసము గుణము - 

       మానవశరీరమునకు పుట్టుక నుండి మధురరసము కలగలసిపోయినది . ముందుగా తల్లిపాలు మధురంగా ఉండి త్వరగా జీర్ణం అగును . అదియే పుట్టిన బిడ్డకు ప్రాధమిక ఆహారము . ఇది ఓజోవర్ధకము అనగా రోగనిరోధకశక్తిని పెంచునది అని అర్ధము . మధురరసము సర్వ ధాతువృద్ధిని కలిగించును . శరీరముకు బలము మరియు మంచి రంగును ప్రసాదించును .దీర్గాయువుని ఇచ్చును . మనస్సుతో పాటు పంచేంద్రియాలకు ఆనందాన్ని కలిగించును . వాతాన్ని మరియు పిత్తాన్ని హరించును . విషాన్ని హరించును . దప్పికను పోగొట్టును . చర్మమును స్నిగ్ధపరుచును . వెంట్రుకలను పెంచును . కంఠస్వరం బాగు చేయును . అభిఘాతము ( దెబ్బలు ) నందు , శరీరము శుష్కించినప్పుడు ఇది మంచి రసాయనంగా పనిచేయును . 

        దీనిని అతిగా ఉపయోగించిన అతిస్నిగ్థత ( శరీరం జిడ్డు పట్టుట ) , సోమరితనం , శరీరము బరువు పెరుగుట , అతినిద్ర , శ్వాసము , కాసము మొదలైన వాటిని కలిగించి గ్రంథి , బోధ మున్నగు కఫవ్యాధులను కలిగించును . 

 *  ఆమ్ల రసము గుణము - 

      ఆమ్లరసము నాలుకకు తగిలిన వెంటనే నోటివెంట అధికంగా నీరుకారి దంతములు పీకునట్లు అగును . ఇది ఆకలిని వృద్ధిచేయును . ధాతువృద్ది చేసి మనస్సుకు ఉత్సాహం ఇచ్చును . ఇంద్రియాలకు బలమును ఇచ్చును . తృప్తిని కలిగించును . ఆహారమునకు స్నిగ్ధత కలిగించి జీర్ణం అగుటకు సహాయం చేయును . 

         దీనిని మితిమీరి ఉపయోగించిన పిత్తమును వృద్ధిచేసి రక్తమును దోషము చెందించి  విద్రది , వ్రణములను పక్వము చేయును . శరీర అవయవాలను శైధిల్యం చెందించి శోధము , కంఠము నందు మంట , రొమ్ము , హృదయము ల యందు ఇబ్బందులను కలుగచేయును . 

 *  లవణ రసము గుణము - 

      ఇది రుచిని కలుగచేయును . ఆకలిని పుట్టించును . జీర్ణమగును . వాతాన్ని నిరోధిచుటను పోగొట్టును . ఉష్ణతత్వము కలిగి ఉండును . 

        దీనిని అధికంగా సేవించిన పిత్తము ప్రకోపించి దప్పిక , మంట , కన్నీటిని కలిగించుటయే కాక శరీర మాంసం చెడగొట్టి కుష్ఠు వ్యాధి కలిగించును . ఇది శరీరము నందు విషమును వృద్దిచేయును . వ్రణములను పగులునట్లు చేయును . దంతములు కదులున్నట్లు చేయును . పుంసత్వము పోగొట్టును . ఇంద్రియశక్తిని తగ్గించును . శరీరకాంతిని పోగొట్టును . వెంట్రుకలు నెరియుట , బట్టతల , చర్మము నందు ముడతలు , రక్తపిత్తము , చర్మముపైన పొక్కులు వంటి సమస్యలు కలుగచేయును . 

         

Friday, January 28, 2022

రోగములు - ఏకమూలికా ప్రయోగాలు .

రోగములు - ఏకమూలికా ప్రయోగాలు . 

     
      ఆయుర్వేద వైద్యము నందు ఒక రోగమునకు ఎన్నో రకాల వైద్యయోగాలు ఉంటాయి . కొన్నిసార్లు అనేక రకాల మూలికలను ఒక మొతాదులో కలిపి ఆయా రోగాలకు ఔషధాలను తయారుచేయడం జరుగును . కాని కొన్ని ప్రత్యేకమైన మూలికలు ఉంటాయి . అవి ఒక్క మూలికా ఉన్నను చాలు రామబాణం వలే ఆ రోగము మీద ప్రయోగించి ఆ రోగాన్ని నయం చేయవచ్చు . 

     ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ ఏకమూలికా యోగాలు నేను అనేక పురాతన గ్రంథ పఠనం మరియు నా పరిశోధనలో తెలుసుకొనినవి మీకు దాచుకోకుండా అందచేస్తున్నాను . 

  ఏకమూలికా ప్రయోగాలు  - 

 *  తుంగముస్తలు , పర్పాటకం - జ్వరం నందు శ్రేష్టం . 

 *  నీటియందు సన్నని ఇసుక , పెంకులు వేసి కాచి వడబోసి చలార్చి ఇచ్చిన జలం అతిదాహం నివారించును . 

 *  పేలాలు ఛర్ధిరోగము ( వాంతుల ) యందు శ్రేష్టం . 

 *  శిలజిత్ మూత్రసంభంధ రోగముల యందు శ్రేష్టం . 

 *  ఉసిరి , పసుపు ప్రమేహము నందు శ్రేష్టం . 

 *  లోహచూర్ణం పాండురోగము నందు శ్రేష్టం . 

 *  కరక్కాయ వాత, కఫ రోగముల యందు శ్రేష్టం . 

 *  పిప్పలి ప్లీహ ( Spleen ) రోగము నందు శ్రేష్టం  . 

 *  లక్క ఎముకల సంధానము ( అతుక్కొనుట ) నందు శ్రేష్టం . 

 *  దిరిసెన విషము నందు శ్రేష్టం . 

 *  గుగ్గిలము మేడీ ఆమ్రయమయిన వాయవు నందు శ్రేష్టం . 

 *  అడ్డసరం రక్తపిత్తము నందు శ్రేష్టం . 

 *  కోడిశెపాల అతిసారం నందు శ్రేష్టం . 

 *  నల్లజీడి మొలల రోగము నందు శ్రేష్టం . 

 *  స్వర్ణభస్మం పెట్టుడు మందు నివారణకు శ్రేష్టం . 

 *  రసాంజనము శరీర అధికబరువు నివారణలో శ్రేష్టం . 

 *  వాయువిడంగములు క్రిమిరోగము నందు శ్రేష్టం . 

 *  మద్యము , మేకపాలు , మేక మాంసం క్షయరోగము నందు శ్రేష్టం . 

 *  త్రిఫల నేత్రరోగముల యందు శ్రేష్టం  . 

 *  తిప్పతీగ వాతరక్తం నందు శ్రేష్టం . 

 *  మజ్జిగ గ్రహణి రోగము నందు శ్రేష్టం . 

 *  ఖదిర కుష్ఠు నందు శ్రేష్టం . 

 *  గోమూత్ర శిలజిత్ అనేక రోగముల యందు శ్రేష్టం . 

 *  పురాణ ఘృతం ( పాత నెయ్యి ) ఉన్మాదము నందు శ్రేష్టం . 

 *  మద్యము శోకము నందు శ్రేష్టం . 

 *  బ్రాహ్మి అపస్మారము నందు ప్రశస్తము . 

 *  పాలు నిద్రానాశనము నందు శ్రేష్టం . 

 *  రసాలము ( పెరుగు నుండి తయారు చేయబడును ) ప్రతిశ్యాయము నందు శ్రేష్టం . 

 *  మాంసము కార్శ్యము ( Liver ) నందు శ్రేష్టం . 

 *  వెల్లుల్లి వాతము నందు శ్రేష్టము . 

 *  స్వేదకర్మ స్తంబము ( బిగదీసుకొని పోయిన అవయవాలు ) నందు శ్రేష్టం . 

 *  బూరుగ బంక నశ్యము రూపమున చేతులు , భుజములు , భుజశిరస్సు శూల యందు శ్రేష్టం . 

 *  వెన్న , పంచదార ఆర్ధిత వాతము నందు శ్రేష్టం . 

 *  ఒంటె మూత్రము , ఒంటె పాలు ఉదరరోగము నందు శ్రేష్టం . 

 *  నస్యము శిరోగములకు ప్రశస్తం . 

 *  రక్తమొక్షము నూతనముగా వచ్చిన విద్రది ( కురుపు ) నందు శ్రేష్టం . 

 *  నస్యము , ఔషధద్రవ్యమును పుక్కిలించుట ముఖరోగముల యందు శ్రేష్టం . 

 *  నస్యము ( ఔషధ చూర్ణము ముక్కు ద్వారా లోపలికి పీల్చుట , అంజనం ( ఔషధద్రవ్యమును కాటుకలా కంటికి పెట్టటం ) , తర్పణం ( శుభ్రపరచుట ) నేత్రరోగముల యందు శ్రేష్టం . 

 *  పాలు , నెయ్యి వృద్దాప్యము ఆపుట యందు శ్రేష్టం . 

 *  చల్లనినీరు , చల్లనిగాలి , నీడ మూర్చ యందు ప్రశస్తము . 

 *  మద్యము , స్నానము శ్రమ యందు శ్రేష్టం . 

 *  పల్లేరు మూత్రకృచ్చము నందు ప్రశస్తం . 

 *  వాకుడు కాసరోగము నందు శ్రేష్టం . 

 *  పుష్కరమూలము పార్శ్వశూల ( ఒకవైపు వచ్చు తలనొప్పికి ) శ్రేష్టం . 

 * ఉసిరిక రసాయనముల యందు శ్రేష్టం . 

 *  త్రిఫల , గుగ్గిలం వ్రణముల యందు శ్రేష్టం . 

 *  వస్తి ప్రయోగము వాతరోగముల యందు ప్రశస్తం . 

 *  విరేచనము పిత్తరోగముల యందు ప్రశస్తం . 

 *  వమనము శ్లేష్మరోగముల యందు ప్రశస్తం . 

 *  తేనె కఫరోగముల యందు ప్రశస్తం . 

 *  నెయ్యి పిత్తరోగముల యందు ప్రశస్తం . 

 *  తైలము వాతరోగముల యందు ప్రశస్తం . 

       పైన చెప్పిన వాటిలో కొన్ని దేశ కాల , బలములను అనుసరించి కలపడం కాని తీయటం కాని వైద్యుని విచక్షణ పైన ఆధారపడి ఉండును. 

       

పెరుగు , మజ్జిగ , వెన్న ఉపయోగాలు - వాటిని సేవించువారు పాటించవలసిన నియమాలు .

పెరుగు , మజ్జిగ , వెన్న ఉపయోగాలు - వాటిని సేవించువారు పాటించవలసిన నియమాలు .

   ఆవుపెరుగు మిక్కిలి జిడ్డుగా ఉండును. శ్లేష్మాన్ని కలుగచేయును . రక్తం చెడగొట్టును . గ్రామాల యందు పాడిపంటలు విశేషముగా ఉన్నను మనుష్యులు రోగాలబారిన పడుటకు ముఖ్యకారణం పెరుగు తీసుకొను విషయంలో నియమాలు పాటించకపోవడమే ప్రధాన కారణం. రాత్రి యందు పెరుగు ఉపయోగించుట మంచిది కాదు. 

          పెరుగు ప్రీతికరమైన పదార్థం కావడం మూలాన పిల్లలు , పెద్దలు మితిమీరి సేవించెదరు. అందువలన రక్తం చెడి రక్తపిత్త రోగం , విసర్పి కలుగును. విసర్పి అనగా శరీరం నందు రక్తం చెడి మాంసం , చర్మములతో కలిసి సర్పం పాకే విధముగా తొందరగా శరీరం అంతా గుడ్లగుడ్లగా ఉండును. ఇది తరచుగా చిన్నపిల్లలకు వచ్చును. కుష్టు , పాండురోగం , పచ్చకామెర్లు మొదలగు వ్యాధులు వచ్చును. పెరుగు వేడిచేయును . అదే దానికి కొంచం నీరు కలిపి మజ్జిగలా చేసుకుని తాగితే చలువచేయును . అందుకే వేసవికాలం నందు పెరుగు తీసుకోరాదు . శీతాకాలం , వర్షాకాలం నందు పెరుగు పగలు తీసుకోవచ్చు . 

              మూత్రం బొట్లుబొట్లుగా పడు వ్యాధి నందు , రొంప, చలిజ్వరం , నోటికి రుచి లేకపోవటం , శరీరం కృశించి ఉండు రోగములు కలిగి ఉండువారు పెరుగు వాడటం మంచిది . పెరుగు శుక్రాన్ని పెంచును.

  పెరుగు తీసుకొనువారు పాటించవలసిన నియమాలు - 

 *  పెరుగుతో కోడిమాంసాన్ని భుజించరాదు .

 *  పెరుగుతో నిమ్మపండు భుజించరాదు .

 *  పెరుగుతో అరటిపండు భుజించరాదు . 

 *  పెరుగు వేడివేడి అన్నంతో పాటు తినరాదు.

 *  పెరుగు రాత్రి పూట భుజించరాదు .శరీరంలో కఫం వృద్ధిచెందును. మరియు జీర్ణసంబంధ సమస్యలు వస్తాయి.

    పగలు పెరుగు భుజించువారు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవలెను.

 *  తేనె - పెరుగు = మంచి రుచి కలుగును.

 *  ఉసిరిక పచ్చడి - పెరుగు =  శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాలను పోగొట్టును . 

 *  నెయ్యి - చక్కెర - పెరుగు =   వాతాన్ని తగ్గించును , ఆహారాన్ని జీర్ణం చేయును . 

 *  చక్కెర -  పెరుగు =   దప్పిక, తాపాన్ని హరించును . 

 *  పెసరపప్పు - పెరుగు  =  రక్తంలోని వాతాన్ని హరించును . 

  మజ్జిగ ఉపయోగాలు - 

  
    పెరుగునకు నాలుగోవ భాగం నీరు కలిపి బాగుగా మజ్జిగ తయారుచేయవలెను. దానిలో వెన్న తీయరాదు. ఇటువంటి మజ్జిగని ఉదయం , మధ్యాహ్న భోజనంలో ఉపయోగించుచున్న ఏ వ్యాధితోను బాధపడరు.  బాగుగా చిక్కగా ఉండి వెన్నతీయని  మజ్జిగ పుష్టిని కలుగచేయును . కఫాన్ని కలిగించును. శ్రమను , దప్పికను పొగొట్టును. బాగుగా చిలికి వెన్నతీసిన మజ్జిగ తేలికగా జీర్ణం అగును.

          శరీరంలో వాతం పెరిగినపుడు మజ్జిగలో శొంటి, సైన్ధవలవణం లేదా ఉప్పు కలిపి లొపలికి తీసికొనవలెను. శరీరంలో పైత్యం పెరిగినపుడు మజ్జిగతో పంచదార కలిపి వాడవలెను. శరీరంలో కఫం ఎక్కువైనప్పుడు శొంటి, పిప్పిళ్లు , మిరియాల చూర్ణం కలిపి మజ్జిగతో కలిపి తాగవలెను . 

                మన శరీరంలో జఠరాగ్ని మందగించి ఆకలి లేనపుడు మరియు వాత వ్యాధుల్లో మజ్జిగ అమృతంగా పనిచేయును . విషం , వాంతులు , నోటి నుండి నీరు కారుట, విషమజ్వరం , పాండువు , రక్తవిరేచనాలు , మేథస్సు, మొలలు , భగన్దరం , అతిసారం , ప్లీహానికి సంబంధించిన వ్యాధులు , ఉదరరోగం , బొల్లి , కుష్టు , క్రిములను మొదలయిన వాటిని మజ్జిగ సేవించుట వలన పోగొట్టుకోవచ్చు. 

          మజ్జిగ భూమిపైన పోసిన అక్కడ ఉన్న గడ్డిపోచలు , పచ్చిక వంటివి మాడిపోయి మరలా మొలవవు. ఇదే సూత్రం మొలలు వ్యాధికి సంక్రమించును. మొలల వ్యాధిలో మొలకలు ఊడిపోవుటకు మజ్జిగ సేవనం తప్పనిసరి . మజ్జిగ తాగుట వలన వాత, శ్లేష్మములచే ధమనుల్లో ఏర్పడిన అడ్డంకులు తొలగిపోయి రక్తప్రసరణ సాఫీగా జరుగును. దీనివలన శరీరపుష్టి పెరుగును . మజ్జిగ తాగుట వలన 80 రకాల వాతరోగాలు నయం అగును.

  మజ్జిగలోని రకాలు  - 

  *  పెరుగును కవ్వముతో చిలికి అందు వెన్నను పూర్తిగా తీసివేసిన మజ్జిగ.

 *  పెరుగును చక్కగా కవ్వముతో చిలికి అందు వెన్నను సగం మాత్రమే తీసివేసిన మజ్జిగ .

 *  పెరుగును చక్కగా కవ్వముతో చిలికి వెన్నను ఎంతమాత్రం తీయకుండా ఉంచిన మజ్జిగ.

     కఫం ఎక్కువ ఉన్నప్పుడు , అగ్ని మందగించినప్పుడు మిక్కిలి బలహీనంగా ఉన్నప్పుడు వెన్నను పూర్తిగా తీసివేసిన మజ్జిగ వాడవలెను.

      పైత్యం ఎక్కువ అయ్యి , అగ్నిమాంద్యం ఉన్నప్పుడు బలం మధ్యమంగా ఉన్నప్పుడు సగం వెన్న తీసిన మజ్జిగను వాడాలి.

     వాతం ఎక్కువుగా ఉన్నప్పుడు వెన్న అసలు తీయని మజ్జిగని వాడవలెను.

 
  వెన్న ఉపయోగాలు - 

    
         ఆవు వెన్న బలం కలిగించును. జఠరాగ్ని పెంచును. వాతం మరియు పిత్తాన్ని పోగొట్టును రక్తదోషాలను, క్షయరోగం, మొలలు , దగ్గు పోగొట్టును . చిన్నపిల్లలకు అమృతం వలే పనిచేయును . బక్కచిక్కి ఉన్నచిన్నపిల్లలకు ఉదయాన్నే తేనె , ఆవు వెన్న , పంచదార కలిపి తినిపించిన బలం కలుగును. క్షయరోగులు బాగా చిక్కి శల్యం అయినపుడు ఈ ప్రయోగం చాలా బాగా పనిచేయును . 

          గేదె పెరుగు బలకరం . మిక్కిలి చమురు కలిగి ఉండును. వాతం , శ్లేష్మం కలుగచేయును . మధురంగా ఉండును. పచ్చిపాలు తీసిన వెన్న సేవించిన కండ్లకు మంచిది . ఎల్లప్పుడూ అప్పటికప్పుడు తీసిన వెన్న మంచిది . నిలువ వెన్న చాలా రోగములను తెచ్చిపెట్టును. కావున విడిచిపెట్టవలెను. 

     
   
               

వ్యాధుల చికిత్సలో ఉపయోగించవలసిన పచ్చి కూరగాయల రసాలు -

వ్యాధుల చికిత్సలో ఉపయోగించవలసిన పచ్చి కూరగాయల రసాలు  - 

 ప్రియమితృలకు నమస్కారం ,

      ఇప్పుడు నేను  చెప్పబోయే    పచ్చికూరగాయలు మరియు ఆకుకూరల పచ్చి రసాలు మీరు వ్యాధి నివారణ కొరకు తీసుకునే ఔషదాలు కు అనుబంధంగా తీసుకుంటూ ఉంటే మరింత తొందరగా మీరు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. 

 *  ఉబ్బసం , తీవ్ర జ్వరాల కొరకు  - 

      పచ్చి క్యారెట్ , తొటకూర , కూరాకు ( endive ) రసాలను కలిపి తీసుకొనిన చాలా బాగా పనిచేస్తుంది .

 *  మొటిమలు మరియు కాలిన బొబ్బలకు - 

        క్యారెట్ మరియు బీట్ రూటు రసాలను కలిపి వాడవలెను. ( పచ్చిరసం మాత్రమే ).

 *  గాస్ట్రిక్ సమస్య కొరకు  - 

        తోటకూర మరియు క్యారెట్ పచ్చిరసాలను రెండు పూటలా రెండు గ్లాసుల 
మోతాదుగా తాగవలెను .

 *  గొంతు మీద వచ్చు కాయ ( goiter) కొరకు 

         క్యారెట్ మరియు వాటర్ క్రెస్ రసములను వాడవలెను .

 *  గుండె సమస్యల కొరకు  - 

         క్యారెట్ మరియు బీట్ రూట్ రసమును వాడవలెను.

 *  మూలవ్యాది కొరకు  - 

         క్యారెట్ మరియు కొత్తిమీర ఆకు కూర రసంని తాగించవలెను . 

 *   అజీర్ణ వ్యాధి కొరకు  - 

         క్యారెట్ మరియు తోటకూర రసం తాగవలెను .

 *  ఎక్కువుగా ఉన్న రక్తపోటు కొరకు  - 

         తోటకూర మరియు బీట్రూట్ మరియు క్యారెట్ రసంని వాడవలెను .

 *  నిద్రసరిగ్గా పట్టనందుకు  - 

          పడుకునే ముందు తోటకూర రసంని తాగవలెను .

 *   మూత్రపిండాల బాధల కొరకు  - 

           క్యారెట్ మరియు parsly అని కొత్తిమీర వంటి ఆకురసం తాగవలెను . జలోదరం అనగా పొట్ట నిండా నీరు చేరు రోగం కు కూడా ఇదే రసాల్ని వాడవలెను .

 *   కాలేయ సమస్యల కొరకు  - 

        క్యారెట్ , బీట్ రూట్ మరియు దోసకాయ   
రసాలని వాడవలెను .గాల్ బ్లాడర్ సమస్యలకు కూడా ఈ రసాలని తాగవలెను .

 *   నరాల బాధల కొరకు  - 

        తోటకూర మరియు లెట్యూస్  పచ్చి రసాలని తాగవలెను .

 *   అధిక బరువు తగ్గించుట కొరకు  - 

        తోటకూర , క్యారెట్ మరియు క్యాబేజ్ రసాలని తాగవలెను .

 *   హృదయంకి నల్ల రక్తం తీసుకుని పోవు సిరలని బాగు చేయుట కొరకు  - 

          క్యారెట్ , బీట్ రూట్ మరియు తోటకూర రసంలని తాగవలెను .

 *   క్షయ వ్యాధి నివారణ కొరకు  - 

          పచ్చి బంగాళా దుంపలు రసం పిండి ఒక గిన్నెలొ పోసి దానిలో పిండిపదార్థాలు అడుగుకు పేరుకొనునట్లు చేసి పైన రసముని ఒక గ్లాసుడు , అంతే పరిమాణంలో మరొక గ్లాసుడు బీట్రూట్ రసంని కలిపి దానిలో ఒక చెంచాడు ( tea spoon ) ఆలివ్ ఆయిల్ చేర్చి నురుగు వచ్చేవరకు చిలికి ఆ రసంని రోజుకి రెండు మూడు సార్లు ఇచ్చుచుండవలెను .

 *   అల్సర్ , పెద్ద పేగుల్లో వాపు ( colitis) సమస్య నివారణ కొరకు  - 

       క్యారెట్ లేదా క్యాబిజి రసం తీసికొనవలెను 

 *   సిరలకు సంబందించిన వ్యాధి కొరకు  - 

        క్యారెట్ , స్పినాచ్ మరియు turnip tops రసమును తీసుకొనుచుండవలెను .

 *  ఎడినోయిడ్స్ , టాన్సిల్స్ వ్యాధుల కొరకు 

         టమోటా మరియు బీట్రూట్ రసాలు లేక క్యారెట్ మరియు బీట్రూట్ రసాలు కలిపి తాగవలెను .

 *  రక్తహీనత కొరకు  - 

          క్యారెట్ మరియు తోటకూర మరియు పాలకూర లేక క్యారెట్ మరియు బీట్రూట్ రసాలని కలిపి తాగవలెను .

 *  సంధివాతం  - 

          తోటకూర మరియు క్యారెట్ రసాలు తాగవలెను . 

 *  ఉబ్బసం , రొమ్ము పడిశం , జలుబు నివారణ  కొరకు  - 

      ఒక ఔన్స్ ముల్లంగి తురుము , ఒక ఔన్సు నిమ్మరసం తో కలిపి రోజుకి రెండు సార్లు అరచెంచా చొప్పున తీసుకుంటూ క్యారెట్ , ముల్లంగి రసాలు తీసుకోవాలి . 

        మీగడ, ఐస్క్రీమ్ , గుడ్లు, పిండిపదార్థాలు చక్కెర బుజించరాదు . 

 *  కాన్సర్ , శరీరం పైన కలిగెడి కాయలు , ఉబ్బు , వాపులు , శరీరంలో నీరు చేరుట , ఉపిరితుత్తులలో సమస్యల కొరకు  - 

      క్యారెట్ , లెట్యుస్ , తోటకూర రసాలను సేవించాలి . 

 *  రక్తప్రవాహంలోని దోషాల కొరకు  - 

      క్యారెట్ , బీట్రూట్ రసాలను కలిపి సేవించాలి . 

 *  మలబద్దకం సమస్య నివారణ కొరకు  - 

        క్యాబేజి , తోటకూర , పాలకూర రసాలు కలిపి కాని లేక తోటకూర రసంని నిమ్మరసం కలిపికాని సేవించవలెను . 

 *  మధుమేహము కొరకు  - 

        తోటకూర , క్యారెట్ , తీగ చిక్కుడు రసాలని సేవించాలి . 

 *  చర్మవ్యాధులు కొరకు  - 

         క్యారెట్ , బీట్రూట్, తోటకూర రసాలని కలిపి సేవించాలి . 

 *  కంటిజబ్బులు  - 

         క్యారెట్ మరియు parsly అనగా కొత్తిమీర వలే ఉండు ఆకుకూర రసాలని సేవించవలెను . 

 *  మూత్రావయవాలలో రాళ్లు , పిత్తాశయంలో రాళ్లు కరుగుట కొరకు  - 

       క్యారెట్ , బీట్రూట్ , దోసకాయ రసాలను సేవించవలెను . 

 గమనిక  - 

           పైన చెప్పిన సమస్యలకు ఔషదాలు వాడుకుంటూ పచ్చి కూరగాయలు , ఆకు కూరల రసాలని సేవించాలి . ఫలితం తొందరగా వస్తుంది.

            మంచి ఫలితాలు పొందవలెను అనుకుంటే రోజుకి కనీసం 180ml రసాన్ని లొపలికి తీసుకోవాలి . శీఘ్రంగా ఫలితం రావాలి అనుకునే వారు రోజుకి రెండు లేదా మూడుసార్లు సేవించవచ్చు . అయితే బీట్రూట్ రసం , parsly రసం మరియు water  kres రసములను మరియు మితముగా తీసికొనవలెను . 6 ఔన్సుల మించి వాడరాదు. పైన చెప్పిన రసాల్లో ఏవైనా ఎక్కువ తీసుకోవాలి అంటే 180 ml వరకు తీసుకోవచ్చు . ఎక్కువ మోతాదులో తీసుకోవలసిన అవసరం వస్తే క్యారెట్ రసం గాని , తొటకూర రసంతో గాని తీసుకోవలెను . 

    

పదార్థాలకు విషం కలిసినప్పుడు ఆయా పదార్థాల సేవన వలన కలుగు విపరీతాలు - పదార్థ లక్షణాలు.

పదార్థాలకు విషం కలిసినప్పుడు ఆయా పదార్థాల           
సేవన వలన కలుగు విపరీతాలు - పదార్థ లక్షణాలు. 

  *  విషము కలిసిన అన్నమును అగ్ని యందు వేసిన ఛటఛటమను ధ్వని కలుగును. నెమలి కంఠము నందలి రంగు వలే పొగ వెలువడును. ఆ పొగని భరించుట చాలా కష్టం అగును. మంటలు కలిసి ఉండక విడివిడిగా వెలువడును. చకోర పక్షి విషము కలిసిన అన్నమును చూసిన వెంటనే ఎర్రగా ఉండు దాని నేత్రములు తెల్లబడును. కోకిలకు స్వరము చెడిపొవును.

 *  విషము కలిసిన ఆహారము నుండి వెలువడు ఆవిరి తగిలినచో హృదయము నందు బాధ , కనులు తిరుగుట, తలనొప్పి తగ్గును. ఇటువంటి సమయంలో చెంగల్వకోష్టు , ఇంగువ, వట్టివేర్లు , తేనె చేర్చి నశ్యము చేయించవలెను . 

 *  విషము జీర్ణాశయం నందు చేరినపుడు ఒళ్లంతా మంటలు , అతిసారం, కడుపులో గూడ గూడ మనుట , శరీరం తెల్లబడుట జరుగును.

 *  మద్యము నందు , జలము విషము కలిసిన ద్రవం నందు గీతలు , నురుగు, బుడగలు కలుగును. విషము కలిసిన ద్రవము నందు మన శరీరఛాయ కనపడదు. ఒక వేళ కనిపించిన జంట నీడలుగా , రంధ్రములతో కూడినట్టుగా , పలుచగా , వికృతాకారముగా కనపడును.

 *  కూరలు , పప్పులు , అన్నము, మాంసము అను వాటి యందు విషము కలిసిన చితచితలాడుచూ రుచిని కోల్పోయి చద్దివానివలే దుర్గన్ధమును కలిగి ఉండును. అన్ని పండ్ల యందు కూడా విషపూరితం అయినపుడు వాటికి ఉండు సహజసిద్ధ రుచి , సువాసన కోల్పోవును. పచ్చికాయలకు విషము తగిలిన వెంటనే పండును. పండిన వానికి విషము తగిలిన వెంటనే కుళ్లిపోవును.

 *  దంతములకు తగిలిన దంతములు విరిగిపోవును. నాలుక , పండ్లచిగుళ్ళు , పెదవులు వాచును .

 *  తలకు పూయు నూనె యందు విషము కలిసిన ఆ నూనె జిగటలుగా సాగును. నూనె చిక్కబడి రంగు మారును . అది శరీరముకు తగిలిన పొక్కులు పుట్టి బాధ కలుగును. పొక్కుల నుంచి స్రావం కలుగును. చర్మం పుండు అగును. చెమటలు పుట్టును . జ్వరం కలుగును. మాంసం విడిపోవును.  నలుగుపిండి , స్నానం చేయు జలము , తలస్నానం చేయు కుంకుడు రసం నందు కూడా విషం కలిసిన పైన చెప్పిన లక్షణాలు కలుగును.

 *  విషము కలిసిన లేపము తలకు పూసిన జుట్టు ఊడిపోవును. తలయంతయు బాధ కలుగును. కన్ను , ముక్కు, చెవి మొదలగు రంధ్రముల నుంచి రక్తం కారును . శిరస్సు నందు గడ్డలు లేచును .

 *  ముఖమునకు పూసుకోను ముఖలేపనం నందు విషము కలిసిన ముఖం కమిలినట్లు అగును. తామర కాడపైన ఉండే విధంగా సన్నని ముళ్ళు వంటివి ముఖంపైన లేచును .

 *  ముక్కుతో పీల్చే వాటి యందు విషము కలిసిన శరీర రంధ్రముల నుంచి రక్తం బయటకి వచ్చును. శిరోభాధ , కఫం బయటకి కారుట జరుగును.

 *  పువ్వులకు విషము తగిలినచో వాటి సువాసన కోల్పోవును . వర్ణం మారును , వాడిపోవును . విషము సోకిన పువ్వుల వాసన చూసిన శిరోభాధ కలిగి నేత్రముల యందు నీరు చేరును .

 *  చెవిలో వేసుకోను తైలం నందు విషము కలిసిన వికృతి కలిగి ధ్వని గ్రహించు శక్తి తగ్గును. చెవి యందు వాపు , పోట్లు , రసి కారుట కలుగును.

 *  కంటికి పెట్టుకొను కాటుక యందు విషము కలిసినచో కన్నీరు జిగురుగా మారును , కనులు మండును . గుడ్డితనం కూడా కలుగును.

 *  పాదుకలు యందు విషం ఉన్నచో పాదముల యందు వాపు , రసికారుట, పాదములు మొద్దుబారుట, పొక్కులు కలుగుట అను లక్షణములు సంభంవించును.

 *  నగల యందు విషము కలిసిన అవి మాములుగా ప్రకాశించవు . కాంతి తగ్గి ఉండును. ధరించిన శరీరభాగాలను హింసించును. వొళ్ళంతా మంటలు కలుగచేయును . చర్మం, మాంసం ఊడిపడును.  

            

కరక్కాయ గురించి సంపూర్ణ వివరణ -

కరక్కాయ గురించి సంపూర్ణ వివరణ - 

 తెలుగు  - కరక్కాయ . 

 సంస్కృతం  -  హరీతకి . 

 హింది - హరడ్ . 

 లాటిన్  - TERMINALIA CHIBULA . 

 కుటుంబము  - COMBRETACEAE . 

 గుణగణాలు  - 

     కరక్కాయ లవణరస వర్జితముగా , అయిదు రసములు గలదిగా , రూక్షముగా , వేడిగా , జఠరదీపనముగా , బుద్ధిబలమును ఇచ్చునదిగా , మధురపక్వముగా , ఆయురారోగ్యాలను ఇచ్చునదిగా , నేత్రములకు హితవుగా , తేలికగా , ఆయువును పెంపొందించునదిగా , ధాతువృద్ధిగా , వాయువును కిందకి వెడలించునదిగా ఉండును. మరియు శ్వాసను , దగ్గును , ప్రమేహమును , మొలలను , కుష్టును , నంజును , ఉదరమును , క్రిమిని , స్వరభంగమును , గ్రహిణిని , మలబద్ధకమును , విషజ్వరమును , గుల్మమును , కడుపుబ్బరం , దాహము , వాంతిని , ఎక్కిళ్ళను , దురదను , హృదయరోగమును , కామెర్లను , శూలను , ప్లీహారోగమును , అనాహమును , కాలేయవ్యాధిని , శిలామేహమును , మూత్రకృచ్చ రోగమును , మూత్రఘాత రోగమును నాశనం చేయును . 

           కరక్కాయ పులుసు రసం కలిగి ఉండుటచే వాతాన్ని హరించును . తీపి , చేదురసం కలిగి ఉండటం చేత పిత్తాన్ని హరించును . రూక్షత్వం ,వగరు రసం కలదగుట చేత కఫాన్ని హరించును . ఈ విధముగా కరక్కాయ త్రిదోషహరమైనది. 

        కరక్కాయను వర్షఋతువు నందు సైన్ధవ లవణము చేర్చి , శరదృతువు యందు పంచదార చేర్చి  , హేమంత ఋతువు నందు శొంఠిని చేర్చి శిశిర ఋతువు నందు పిప్పలిని చేర్చి , వసంత ఋతువు నందు తేనెని చేర్చి , గ్రీష్మఋతువు నందు బెల్లమును చేర్చి భక్షించవలెను. కరక్కాయను భోజనానంతరం భక్షించినను పథ్యకరమైనది . మరియు భోజనం జీర్ణం అయిన తరువాతను , అజీర్ణసమస్య ఉన్నప్పుడును పుచ్చుకోవచ్చు. 

  రూప లక్షణాలు  - 

     కరక్కాయ మొత్తం 7 రకాలుగా కలదు. అవి 

             *  విజయా . 

             *  రోహిణీ . 

             *  పూతన . 

             *  అమృతా . 

             *  అభయా . 

             *  జీవంతి . 

             *  చేతకీ . 

      అని మొత్తం 7 జాతులుగా ఉండును. ఇప్పుడు మీకు వీటి గురించి సంపూర్ణముగ వివరిస్తాను. 

        విజయా కరక్కాయ వింధ్య పర్వతం పైన పుడుతుంది. చేతకీ కరక్కాయ హిమాలయ పర్వతాలపైన పుట్టుచున్నది. పూతన కరక్కాయ సింధూనది ప్రాంతము నందు పుట్టుచున్నది . అమృత కరక్కాయ , అభయ కరక్కాయ చంపారణ్యం నందు పుట్టుచున్నది. రోహిణీ కరక్కాయ అన్ని స్థలముల యందు పుట్టుచున్నది. జీవంతి కరక్కాయ సౌరాష్ట్ర దేశము నందు పుట్టుచున్నది. 

                  సొరకాయ వలే పొడవుగా , గుండ్రముగా ఉండునది విజయా కరక్కాయ , కేవలం గుండ్రముగా ఉండునది రోహిణి కరక్కాయ , బీజము పెద్దదిగా ఉండి పై చర్మము పలుచగా ఉండునది పూతన కరక్కాయ , బీజములు చిన్నవిగా ఉండి పేడు మందముగా ఉండునది అమృత కరక్కాయ , అయిదు రేఖలు కలిగినది అభయ కరక్కాయ. బంగారు రంగుతో ఉండునది జీవంతి కరక్కాయ , మూడు రేఖలు కలిగినది చేతకీ కరక్కాయ . 

     విజయ కరక్కాయను సర్వరోగముల యందు ఉపయోగించదగినది. రోహిణి కరక్కాయను వ్రణము హరించుటకు ఉపయోగించదగినది . పూతన కరక్కాయ లేపనమందును , పైన పట్టు వేయుటకు ఉపయోగించతగినది. అమృత కరక్కాయ శోధనార్థం , విరేచనములు మొదలగు వానికి ఉపయోగించతగినది. అభయ కరక్కాయ నేత్రరోగములకు ఉపయోగించతగినది. , జీవంతి కరక్కాయ సర్వరోగములను హరించును . చేతకీ కరక్కాయ చూర్ణములకు ప్రశస్తమైనది. 

                కరక్కాయ మనుష్యులకు తల్లివలె హితము చేయును . తల్లికి ఒకప్పుడైనను కోపము కలిగి దండించును. కాని కడుపులో ప్రవేశించిన కరక్కాయ ( తినిన ) ఎప్పటికి హానిచేయదు . ఎల్లప్పుడూ మంచిచేయు గుణము కలిగినది . 

     చేతకీ కరక్కాయ తెలుపు రంగు , నలుపు రంగు బేధము వలన రెండు విధములుగా ఉండును. తెల్ల చేతకీ కరక్కాయ 6 అంగుళముల పొడవుగాను , నల్ల చేతకీ కరక్కాయ ఒక అంగుళము పొడవుగా ఉండును.  

           ఒక జాతి కరక్కాయ తినుట చేతను , ఇంకో జాతి కరక్కాయ వాసన చూసిన మాత్రం చేతను , మరొక జాతి కరక్కాయ ముట్టుకొనిన మాత్రమున , వేరొక జాతి కరక్కాయ చూచిన మాత్రమునే విరేచనం కలిగించును. ఈ ప్రకారం నాలుగు బేధముల విరేచన గుణములు కరక్కాయల యందు కలవు. 

              చేతకీ కరక్కాయ చెట్టు కింద ఏ మనుష్యులు కాని లేక పశు , పక్షి , మృగాదులు కాని తిరిగిన తక్షణం విరేచనములు అగును. చేతకీ కరక్కాయను హస్తము నందు ఎంతసేపు ఉంచుకొనునో అంతవరకు ఆ కరక్కాయ ప్రభావం వలన నిశ్చయముగా విరేచనములు అగుచుండును. చేతకీ కరక్కాయను సుకుమారులు , బలహీనులు , ఔషధము నందు ద్వేషము కలిగినవారు చేతిలో పట్టకూడదు. చేతకీ కరక్కాయ అత్యంత ప్రశస్తమైనది. సుఖవిరేచనం కలిగించుటకు హితకరం అయినది. 

             పైన చెప్పిన 7 జాతులలో విజయ కరక్కాయ ప్రధానం అయినది. ప్రయోగము నందు సుఖవిరేచనం ఇచ్చునది. సర్వరోగముల యందు ఉపయోగించతగినది. ఏ కరక్కాయ నూతనమైనది , జిగట కలిగినది . గొప్పది , గుండ్రనిది , బరువు కలిగినది . నీటిలో మునుగునదిగా ఉండునో ఆ కరక్కాయ ప్రశస్తమైనది. తూనిక నందు 2 తులములు తూగినది ప్రశస్తమైన కరక్కాయ . 

 ఔషధోపయొగాలు  - 

 *  కామెర్ల నివారణ కొరకు  - 

        కరక్కాయ , తేనె , బెల్లం కలిపి తినిన కామెర్లు తగ్గును. 

 *  కీళ్ళవాతము నివారణ కొరకు - 

        కరక్కాయ చూర్ణమును , ఆముదముతో కలిపి ప్రతినిత్యం వాడిన కీళ్లవాతం , గృదసీవాతం ( సయాటికా ) తగ్గును. 

 *  క్రిమిరోగముల నివారణ కొరకు  - 

         కరక్కాయ చూర్ణాన్ని వేడినీటితో కలిపి వాడిన క్రిమిరోగాలు తొలగును . ఇది చక్కని విరేచనాన్ని కలుగచేయును . అర్శమొలల సమస్యతో ఇబ్బంది పడువారికి ఇది చాలా మంచిది . 

 *  కడుపునొప్పి నివారణ కొరకు 

         కరక్కాయ చూర్ణము నందు బెబులిన్ కలదు. ఇది కడుపునొప్పిని తగ్గించును . 

 *  చర్మరోగముల నివారణ కొరకు  - 

         కరక్కాయ చూర్ణమును , గోమూత్రము నందు కలిపి తాగిన పామా , దద్రు మొదలగు చర్మరోగాలు తగ్గును. కరక్కాయను కాల్చి చూర్ణము చేసి ఆ చూర్ణముకు నువ్వులనూనె కలిపి రాసిన పురాణ వ్రణములు తగ్గును. 

 *  విషమ జ్వరాల నివారణ కొరకు  - 

         కరక్కాయను తేనెతో కలిపి వాడిన విషమ జ్వరాలు తొందరగా నయం అగును. 

 *  ఆమ్ల పిత్తము నివారణ కొరకు  - 

         కరక్కాయను ద్రాక్షతో కలిపి సేవించిన ఆమ్లపిత్తము నయం అగును. 

 *  అర్శమొలల నివారణ కొరకు  - 

          కరక్కాయ చూర్ణమును బెల్లముతో కలిపి ప్రతిరోజు సేవించిన అర్శమొలలు , మలబద్ధకం , వాత్తరక్తం శమించును . 

 *  బరువు తగ్గుట కొరకు - 

         కరక్కాయ ప్రతినిత్యం వాడుచున్న బరువు తగ్గును. 

 *  గోరుచుట్టు నివారణ కొరకు  - 

        పసుపు రసమునకి కరక్కాయలను చేర్చి వాటిని బాగా దంచి మెత్తగా నూరి పైపూతగా రాయుచున్న గోరుచుట్టు తగ్గును. 

 *  నీళ్ల విరేచనాల నివారణ కొరకు  - 

         కరక్కాయ చూర్ణాన్ని వేడినీటితో తాగుచున్న నీళ్ళవిరేచనాలు తగ్గును. 

 *  రక్తస్రావ నివారణ కొరకు  - 

        కరక్కాయ చూర్ణాన్ని అడ్డసరం రసంతో భావన చేసి ఎండబెట్టి ఆ చూర్ణమునకు పిప్పళ్లు , తేనె చేర్చి సేవించిన ఎంతపెద్ద రక్తస్రావం అయినను తగ్గును. 

 *  శరీర బలం పెరుగుట కొరకు  - 

         కరక్కాయలను నేతిలో వేయించుకుని తినుచున్న శరీరానికి మంచి బలం కలుగును. 

 *  పాండురోగం నివారణ కొరకు  - 

        కరక్కాయలను గోమూత్రము నందు వేసి మరిగించి తీసి పైపెచ్చు పొడిని చేసి దానిని 5 గ్రాముల మోతాదులో కొంచం ఆముదం కలిపి ప్రతినిత్యం ఉదయం సమయంలో పరగడుపున సేవించవలెను . దీనిని గోమూత్ర హరీతకీ అని అంటారు.  దీనిని వాడటం వలన పాండురోగం , అధిక బరువు , వరిబీజం తగ్గును. 

 *  చర్మ దళ కుష్టు నివారణ కొరకు  - 

       20ml గోమూత్రము నందు 3 గ్రాముల కరక్కాయ చూర్ణము కలిపి తాగితే చర్మ దళ కుష్ఠు , కిటిభకుష్టు  తగ్గును . ఇతర చర్మవ్యాధుల యందు కరక్కాయ పొడికి సమానం వేపాకు చూర్ణం కలిపి 1 స్పూన్ చొప్పున రెండుపూటలా తాగవలెను . 

 *  గొంతు బొంగురు నివారణ కొరకు  - 

       కరక్కాయ చూర్ణమునునకు పిప్పలి చూర్ణం లేదా శొంఠిచూర్ణం మరియు తేనె కలిపి లేహ్యముగా చేసి అరస్పూన్ చప్పరించి మింగుచున్న బొంగురుగొంతు , గొంతులో నస తగ్గును. 

 *  దగ్గు నివారణ కొరకు  - 

        కరక్కాయ పెచ్చును నోటిలో ఉంచుకుని రసము మింగుచున్న కొండనాలుక , దగ్గు , గొంతు వొరుచుకొనుట , పొడిదగ్గు తగ్గును. 

 *  తలనొప్పి నివారణ కొరకు  - 

        కరక్కాయ గింజలతో నుదుటి పైన పట్టువేసిన తలనొప్పి తగ్గును. 

 * కండ్ల ఎరుపు నివారణ కొరకు  - 

         కరక్కాయ , కాచు సమాన భాగాలుగా తీసుకుని నీటితో నూరి కండ్లపైన గుడ్డ వేయవలెను . కండ్ల ఎరుపులు తగ్గును. 

 *  ఎక్కిళ్లు నివారణ కొరకు  - 

       గోరువెచ్చని నీళ్లతో కరక్కాయ చూర్ణం కలిపి ఇచ్చిన ఎక్కిళ్ళు కట్టును . 

 *  ఉదరరోగ నివారణ కొరకు  - 

       ఉదయం మరియు సాయంత్రం ఒక్కొక్క కరక్కాయ చొప్పున 2 నెలలపాటు తినుచుండిన ఎటువంటి ఉదరరోగం అయినను తగ్గిపోవును. 

 *  ఆహారం జీర్ణం అగుటకు  - 

       వేడినీటితో కరక్కాయ చూర్ణం కలిపి తాగిన తినిన ఆహారం సరిగ్గా అరగకుండా ఉన్న సమస్యని తొలగించి ఆహారాన్ని జీర్ణం చేయును . 

 *  కఫజ్వర నివారణ కొరకు  - 

       గోమూత్రంలో కరక్కాయలు భావన చేసి తినిన కఫసంబంధ దోషం వలన వచ్చు జ్వరం నివారణ అగును. 

 *  వాంతుల నివారణ కొరకు  - 

        కరక చూర్ణం తేనెతో సేవించిన వాంతులు తగ్గును. 

 *  కఫ సంబంధ బోదకాలు నివారణ కొరకు  - 

       కరక్కాయ ముద్దను గోమూత్రముతో కలిపి తాగిన బోదకాలు నివారణ అగును. 

 *  గుల్మ నివారణ కొరకు  -  

        కరక్కాయ చూర్ణం బెల్లముతో కలిపి తినుచున్న గుల్మరోగం నివారణ అగును. 

 *  రక్తపిత్త రోగ నివారణ కొరకు  - 

        అడ్డసరం రసములో 7 సార్లు భావన చేసిన కరక్కాయను నీడన ఎండించి మెత్తటి చూర్ణం చేసుకుని కొంచం పిప్పలి చూర్ణం కలిపి తేనెతో సేవించిన అసాధ్యమగు రక్తపిత్తం తగ్గును. 

 *  ఉబ్బురోగం నివారణ కొరకు - 

     బెల్లం మరియు కరక్కాయ సమానంగా కలిపి తీసుకొనుచున్న ఉబ్బురోగములు తగ్గును. 

 *  వాతరక్త వ్యాధి నివారణ కొరకు  - 

     5 కరక్కాయలు బాగుగా నమిలి మింగి తిప్పతీగ కషాయం తాగిన వాతరక్తం తగ్గును.

 *  అండవృద్ధి నివారణ కొరకు  - 

        గోమూత్రము నందు భావన చేసిన కరక్కాయను ఆముదము నందు వేయించి వేడినీటి అనుపానంగా సేవించిన అండవృద్ధి హరించును . 

 *  నేత్రరోగ నివారణ కొరకు  - 

        కరక్కాయ ఆవునేతితో ఉడికించి అది కంటిపైన వేసి కట్టు కట్టుచున్న నేత్ర దోషాలు నివారణ అగును. 

 *  పిల్లల కోరింత దగ్గు నివారణ కొరకు  - 

       కరకపువ్వు 1 భాగము , వేయించిన పిప్పళ్లు 1/2 భాగము , ఎండిన ఉస్తిపండ్లు 1/4 భాగము తీసుకుని వీటన్నింటిని మెత్తగా చూర్ణం చేసి మూడు గురిగింజలంత చూర్ణము 2 గంటలకి ఒక పర్యాయము తేనెతో నాకించుచుండిన కోరింత దగ్గులు తగ్గును. కరకపువ్వు చూర్ణం కూడా వాడవచ్చును  . 

 

దేవతార్చన కొరకు ఉపయోగించదగు పుష్ఫాలు - వాటి ఫలితాలు .

దేవతార్చన కొరకు ఉపయోగించదగు పుష్ఫాలు - వాటి ఫలితాలు . 

 *  జాజిపువ్వుతో అర్చించిన భుక్తి , ముఖ్తి ఇచ్చును . చంపకము స్తంభనము , మొగిలి , మొల్ల , తెల్ల కలువ ఉచ్చాటన పద్దతిలో ఆయుధముగా పనిచేయును . 

 *  బంగారు మల్లె లాభము , నల్ల గోరింట పువ్వుల అర్చన బలవర్ధనము , తెల్ల కలిగొట్టు గొప్ప కీర్తిని ఇచ్చును . 

 *  పద్మము శాంతి , పుష్టిని ఇచ్చును . కమలము సుపుత్రులను , దాసాని మరియు రక్తగన్నేరు వశీకరణము ఇచ్చును . 

 *  శాలి ( వరివెన్ను ) సౌభాగ్యమును , కడిమి , పొగడ , మొల్ల , వస , కుందము అను పుష్పములతో అర్చించిన పాపనాశనం చేయును . 

 *  కుసుమ వశీకరణము , మోదుగ ఆకర్షణము , పొన్న , నాగకేసరములు మహాలక్ష్మీప్రదములు . 

 *  ఎర్ర కలువ వశీకరణము , నీలము మరియు నల్ల కలువలు మారణ ప్రయోగము నందు , మందార పుష్పము శత్రువుకు భయము కలిగించుటకు ఉపయోగించదగినది . 

 *  వైశాఖము నందు పొగడ పువ్వులు , జైష్టమున నాగకేసర పుష్పములు , ఆషాడమున గన్నేరు పుష్పములు విరివిగా దొరకును కావున దేవతార్చనకు ఈ మాసములలో వీటిని వాడుట శ్రేష్టం . 

 *  శ్రావణమాసము నందు పద్మముల కన్నా సంపెంగలకు ప్రాముఖ్యం , భాద్రపదమున లొద్దుగ , అశ్వజమున దాసాని , కార్తీకము నందు అగిసే , మార్గశిరమున బిల్వములు , పుష్యమాసము నందు గరికె , మాఘ మాసము నందు కుంద పుష్పములు , ఫాల్గుణమున పూల గురివిందతో పూజించుట సర్వసిద్ధి ప్రదాయకము   చైత్రమాసమున అశోక మొగ్గలతో పూజించుట అత్యంత శ్రేష్టదాయకం . 

 *  తెల్లని సన్నజాజి ,అడవి గోరింట  , దవనం , రేల , పచ్చపూల గోరింట , ఎర్ర గోరింట , కలిగొట్టు , విరజాజి , జిల్లేడు , మాధవి , గొరింటా ఈ 11 రకాల పుష్పములతో జగదాంబకు అర్చన కొరకు సమర్పించవలెను . 

 *  సన్నజాజి పుష్పములతో పూజించిన వాక్శుద్ధి కలుగును . 

 *  చమేలీ పుష్పములతో అర్చించిన రాజవశీకరణము కలుగును . మరియు అధిక మేధాశక్తి లభించును . నాగకేసరములు రాజత్వమును ప్రసాదించును . 

 *  పూల గురువింద భూలాభము , సంపెంగ బంగారము , బండి గురువెంద బుద్ధివృద్ధి , మల్లె ధనాధిక్యతను కలిగించును . 

 *  మొల్ల పువ్వు కీర్తిని , దాసాని పువ్వులతో అర్చించిన శత్రువులు సంశయావస్థలో పడెదరు . 

 *  పద్మము వలన ఆయుర్వృద్ధి కలుగును . కలువ వలన కవిత్వము అబ్బును , కడిమి పుష్పములతో అర్చన ద్వారా వ్యాధి నాశనము , బ్రహ్మదండి వలన బుద్ధిశాలిత్వము సంభంవించును . 

 *  మరువము వలన విజయప్రాప్తి , పచ్చ గోరింట వలన గజలాభము , అపరాజితా పుష్పముల వలన సర్వాంగ సుందరత్వము అబ్బును . 

 *  వావిలి వలన పుత్రలాభము , అశోకము వలన దుఃఖరాహిత్యము , పొగడ వలన వంశ గౌరవము కలుగును . 

 *  గరిక వలన ధన ధాన్య సంపద , బూరుగు పువ్వుల వలన శత్రుక్షయము , తుమ్మి పువ్వుల వలన అన్నప్రాప్తి , పొగడ వలన ధనాధిక్యత లభించును . 

 *  పొన్న వలన రాజ్యలాభము , రేల వలన అధికోన్నతి , పోట్లపువ్వుల వలన దీర్గాయువు , గ్రంథితగరము వలన సర్వమాన్యత ప్రాప్తించును . 

 *  మోదుగపువ్వుల వలన అనేక గోవులు ,మేకలు లభ్యమగును . దిరిసెన పువ్వులతో సుందర యువతి , దేవకాంచనం వలన జయము , శ్రేయము లభ్యమగును . 

 *  గన్నేరు పువ్వుల వలన మంత్రసిద్ధి , మారేడు దళముల వలన పరమపదము ప్రాప్తించును . సాత్వికమైన కోరికలకు తెల్లని పువ్వులు ప్రశస్తమైనవి . 

 *  ఉచ్చాటనము , వశీకరణము , ప్రేమ , శత్రుజయము వంటి వాటికొరకు అర్చనలు చేయువారు పరిమళము గల ఎర్రని పుష్పములు వాడవలెను . 

 *  మోహనము , వశీకరణము నందు పసుపుపచ్చని పుష్పములు శ్రేష్టమైనవి , అభిచారము , చేతబడి , పగ , మరణ ప్రయోగాల యందు రెండు విధములైన నల్లని పువ్వులు వాడవలెను . 

 *  దాసాని పువ్వులను దానం ఇచ్చిన దివ్యవస్త్రదాన  ఫలము కలుగును . మరియు బ్రహ్మ హత్యాది పాపములు క్షణములో నశించును . 

 *  దింటెన పుష్పముల యందు తెల్లదాని కంటే నల్ల దింటెన పుష్పములు దానం ఇచ్చిన రెండింతల పుణ్యము వచ్చును . 

 *  అపరాజితా , కుందముల నడుమ మనోహరమైన స్థానం కలదు . గన్నేరు పుష్పముల యందు సాక్షత్తు సదాశివుడే ఉండును . 

 *  దేవిని మంకెన పుష్పములతో పూజించిన యెడల మేకను బలి ఇచ్చినంత తృప్తి చెందును . దేవికి నిత్యపూజ యందు అర్ఘ్యం ఇయ్యవలెను . 

    
     
  
    

ఆయుర్వేదం నందలి పంచకర్మ పద్ధతి - సంపూర్ణ వివరణ .

ఆయుర్వేదం నందలి పంచకర్మ పద్ధతి - సంపూర్ణ వివరణ . 

     ఆయుర్వేదము నందు పంచకర్మ చికిత్సకు విశిష్ట స్థానం కలదు . ఈ పంచకర్మ చికిత్సను మొట్టమొదటగా తెలియచేసినవారు చరక మహర్షి . ముందుగా అసలు ఆయుర్వేదము నందు కర్మ అను పదానికి అర్థం తెలుసుకుందాం . 

       విషమదోషములను హరింపచేసి , ధాతువులను పరిశుద్ధముగా చేయు ఒక ప్రత్యేక వ్యాపారం ( Special operation ) నకే కర్మయని పేరు . ఈ కర్మలు 5 విధములుగా శాస్త్రము నందు గ్రహింపబడెను . వీటిలో నస్యకర్మ , వమనకర్మ , విరేచనకర్మ , నిరూహ వస్తి అను 4 కర్మలు శోధనములు (Eliminations ) . అందుచేతనే ఇవి లంకణ చికిత్స యందు ఇమిడి ఉన్నవి . వాతదోషములను హరింపచేసి , వాతదోషము శరీరముకు సంక్రమించకుండా అనువాసవ వస్తికర్మ శమించునదిగా ( Soothing Treatment ) చెప్పబడెను . 

       ఇప్పుడు మీకు పంచకర్మల గురించి సంపూర్ణముగా వివరిస్తాను . 

 *  నస్యకర్మ  - 

        దీనికి శిరోవిరేచన కర్మ అని పిలుస్తారు . ద్రవరూపముగా గాని లేక చూర్ణ ( Powder ) రూపముగా గాని ఉన్న ఔషధములను నాసారంధ్రముల ద్వారా లోనికి పంపుటకే నస్యకర్మ అని పేరు . నాసామార్గములను శుభ్రపరచి , శిరస్సు నందు పేరుకుపోయిన శ్లేష్మమును హరించుట కొరకు ఈ నస్యకర్మ ను ఉపయోగించవచ్చు . 

 *  వమనకర్మ  - 

       వాంతి కలిగించు ఔషధాలను లోపలికి పంపి వాంతి చేపించి ఉదరము నందు గల వ్యర్ధములను బయటకి వెడలించు పద్దతి . 

 *  విరేచనకర్మ - 

       విరేచనములు కలిగించు ఔషధములను లోపలికి ఇచ్చి ప్రేగులు , మలాశయము మొదలగు వాని యందలి వ్యర్థములను విరేచనం ద్వారా బయటకి వెడలించుట. 

 *  నిరూహవస్తి - 

        ఈ ప్రక్రియ నందు ప్రేగులను శుభ్రపరచుటకు కొన్ని ద్రవ్యముల యొక్క కషాయములను గుదమార్గము ( మలద్వారం ) ద్వారా లొపలికి పంపుటకు నిరుహవస్తి అని పేరు . విషమమైన   ఉదావర్తము ( Irregular peristalsis ) చే జనించు ఆంత్రశూల ( Intestinal colic ) యందు మలబద్దకం నందు ఈ నిరుహవస్తి ఉపయోగించవలెను . 

 *  అనువాసనవ వస్తి - 

      దీనినే స్నేహవస్తి అని కూడా చెప్పెదరు . ప్రేగులను శుభ్రపరుచటే కాక , వాతదోషము వలన కలుగు వికారములను ఉపశమిపచేయుటకై ఓషధద్రవ్యములచే తయారుచేయబడిన తైలమును గుదమార్గముగా లోనికి పంపుటనే  అనువాసనవ వస్తి అని పేరు ఇది వాతమును హరించుటలో శ్రేష్టమైనది . 


         

కొన్ని ప్రాచీన భారతీయ ఆరోగ్య చిట్కాలు.*

*కొన్ని ప్రాచీన భారతీయ ఆరోగ్య చిట్కాలు.*
🏵️🙏🏵️🙏🏵️🙏🏵️🙏🏵️🙏

🏵️1. _*అజీర్ణే భోజనమ్ విషమ్.*_
➖➖➖➖➖➖➖➖➖➖➖
మధ్యాహ్న భోజనం జీర్ణం కాకపోతే, రాత్రి భోజనం చేయడం, విషం తీసుకోవడంతో సమానం అని ఈ సూత్రానికి అర్థం. ఆకలి అనేది మునుపటి ఆహారం జీర్ణం కావడానికి ఒక సంకేతం. కాబట్టి ఆకలి లేకుండా మళ్ళీ ఆహారం తీసుకోకూడదు.

🏵️2. *అర్ధరోగహరి నిద్రా*
➖➖➖➖➖➖➖➖➖
సరైన నిద్ర, మీ వ్యాధులలో సగం నయం చేస్తుంది. మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో, తగినంత నిద్ర కూడా అంతే ముఖ్యం. ఆరోగ్యవంతుడు రోజుకి కనీసం ఆరు గంటలు నిద్రపోవాలి. తిన్న ఆహారం జీర్ణం కావడానికి, శారీరక శ్రమ వల్ల కాళ్ళు, చేతులు, గుండె, మెదడు మొదలైన ముఖ్య అంగాలు అలసట తీరి సక్రమంగా పనిచేయడానికి నిద్ర ఉపకరిస్తుంది. అటువంటి వారికి రోగాలు దరిచేరవు. కనుక మంచి నిద్ర సగం రోగాలను హరించి వేస్తుంది అని ఈ సూక్తికి అర్థం.

🏵️3. _*ముద్గధాలి గధవ్యాలి*_
➖➖➖➖➖➖➖➖➖➖
అన్ని రకాల పప్పుధాన్యాలలో, పచ్చ *పెసలు* (Greengrams) ఉత్తమమైనవి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇతర పప్పుధాన్యాలు అన్నీ,
 ఒకటి లేదా మరొకటి దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి.

🏵️4. *బాగ్నస్తి సంధనకరో రాసోనాహా*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
వెల్లుల్లి విరిగిన ఎముకలతో కలుస్తుంది. వెల్లుల్లి తరచుగా తినేవారిలో ఎముకలు, వాటి జాయింట్లు గట్టిగా ఉంటాయి.

🏵️5. *అతి సర్వత్రా వర్జయేత్*
➖➖➖➖➖➖➖➖➖➖➖
అధికంగా తినేది ఏదైనా, అది మంచి రుచిని కలిగి ఉన్నా, ఆరోగ్యానికి మంచిది కాదు. మితంగా (తక్కువ) తినండి.

🏵️6. *నాస్తిమూలం అనౌషాధం*
➖➖➖➖➖➖➖➖➖➖➖
శరీరానికి ఎటువంటి ఔషధ ప్రయోజనం లేని కూరగాయలు అంటూ లేవు.

🏵️7. *నా వైద్యా ప్రభుయుయుషా*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
ఏ డాక్టర్ కూడా మన దీర్ఘాయువుకు ప్రభువు కాదు. వైద్యులకు కొన్ని పరిమితులు ఉన్నాయి.

🏵️8. *చింతా వ్యాధి ప్రకాషయ*
➖➖➖➖➖➖➖➖➖➖➖
చింత అనారోగ్యాన్ని తీవ్రతరం చేస్తుంది.

🏵️9. *వ్యాయమాశ్చ సనైహి సనైహి*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
ఏదైనా వ్యాయామం నెమ్మదిగా చేయండి. వేగవంతమైన వ్యాయామం మంచిది కాదు. నడక కూడా ఇందులోకి వస్తుంది.

🏵️10. *అజవత్ చార్వనం కుర్యాత్*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
మీరు తినే ఆహారాన్ని మేక లాగా నమలండి. ఎప్పుడూ ఆత్రుత తో ఆహారాన్ని మింగకూడదు. జీర్ణక్రియలో లాలాజలమే మొదట సహాయపడుతుంది.

🏵️11. *స్నానమ్ నామా మనఃప్రసాధనకరం దుస్వప్న విధ్వంసకం*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
స్నానం డిప్రెషన్ ను తొలగిస్తుంది. ఇది చెడ్డ కలలనును దూరం చేస్తుంది.

🏵️12. *న స్నానం ఆచరేత్ భుక్త్వా.*
➖➖➖➖➖➖➖➖➖➖➖
ఆహారం తీసుకున్న వెంటనే స్నానం చేయకండి. జీర్ణక్రియ ప్రతికూలంగా ప్రభావితమవుతుంది.

🏵️13. *నాస్తి మేఘసమం తోయం.*
➖➖➖➖➖➖➖➖➖➖➖
స్వచ్ఛతలో వర్షపునీటికి, ఏ నీరు సాటి రాదు. పల్లెటూళ్ళలో ఇప్పటికీ వర్షపు నీటిని పట్టి వడకట్టి త్రాగుతారు. కాని నేరుగా పడిన వర్షపు నీటినే పట్టాలి. ఇంటి చూరుల మీదనుంచి కారిన నీరుకాదు.

🏵️14. *అజీర్నే భేజాజం వారీ*
➖➖➖➖➖➖➖➖➖➖
మంచినీరు ఎక్కువగా తీసుకోవడం ద్వారా అజీర్ణాన్ని పరిష్కరించవచ్చు.

🏵️15. *సర్వత్ర నూతనం శాస్త్రం సేవకన్న పురాతనం.*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
తాజా విషయాలను ఎల్లప్పుడూ ఇష్టపడండి. ఓల్డ్ రైస్ మరియు ఓల్డ్ సర్వెంట్‌ను కొత్తగా మార్చాల్సిన అవసరం ఉంది. (ఇక్కడ సేవకుడి విషయంలో అసలు అర్థం ఏమిటంటే: అతని విధులను మార్చండికానీ, తొలగించవద్దు.)

🏵️16. *నిత్యామ్ సర్వ రసభ్యాసహా.*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
ఉప్పు, తీపి, చేదు, పులుపు, (Astringent మరియు pungent) అన్ని రుచులు కలిగి ఉన్న పూర్తి ఆహారాన్ని తీసుకోండి.

🏵️17. *జఠరామ్ పూరైధార్ధమ్ అన్నాహి*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
మీ కడుపు అరవంతు ఘనపదార్థాలతో, పావువంతు నీటితో నింపండి మరియు మిగిలినది ఖాళీగా ఉంచండి.

🏵️18. *భుక్త్వోపా విసస్థాంద్ర*
➖➖➖➖➖➖➖➖➖
ఆహారాన్ని తీసుకున్న తర్వాత ఎప్పుడూ పనిలేకుండా కూర్చోవద్దు. కనీసం 100 అడుగులు అయినా నడవండి.

🏵️19. *క్షుత్ సాధూతం జనయతి*
➖➖➖➖➖➖➖➖➖➖➖
ఆకలి, ఆహార రుచిని పెంచుతుంది. (ఇంకా చెప్పాలంటే, ఆకలితో ఉన్నప్పుడు మాత్రమే తినండి.)

🏵️20. *చింతా జరానామ్ మనుష్యానమ్*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
చింతించడం 😭అనేది వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది. కనుక అనవసరపు చింతలతో ఆరోగ్యాన్ని పాడుచేసుకోకండి.

🏵️21. *సతం విహయ భోక్తవ్యం*
➖➖➖➖➖➖➖➖➖➖➖
ఆహారం తీసుకొనే సమయం వచ్చినప్పుడు, ఎంతటి పనినైనా కూడా పక్కన పెట్టండి. నిదానంగా భోజనం చేయండి. వేగంగా తినడం, పని ఉందని అసలు భోజనమే మానివేయడం చాలా అనర్థదాయకం.

🏵️22. *సర్వ ధర్మేశు మధ్యమామ్.*
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
ఎల్లప్పుడూ మధ్యే మార్గాన్ని ఎంచుకోండి. దేనిలోనైనా విపరీతంగా వెళ్లడం మానుకోండి. ఈ ఆరోగ్య సూత్రాలు పాటించిన వారికి చిరాయువు, నిత్య ఆరోగ్యం  తప్పక లభిస్తాయి.

🙋‍♂️

Saturday, January 15, 2022

అశ్వగంధ చూర్ణం ఉపయోగాలు -

అశ్వగంధ చూర్ణం ఉపయోగాలు - 

    కొంతకాలం క్రితం అశ్వగంధ గురించి కొన్ని వివరాలు మీకు అందించాను. ఈ మధ్యకాలంలో   అశ్వగంధ గురించి మరింత విలువైన సమాచారం తెలుసుకున్నాను . వీటిలో చాలా వరకు నేను నా పేషెంట్స్ కి ఇచ్చినప్పుడు కొన్ని ఇతర సమస్యలు తీరడం నా దృష్టికి వచ్చింది.  ఇప్పుడు నా స్వానుభావాలు మరియు కొన్ని అత్యంత పురాతన గ్రంథ పరిశోధనలో నాకు లభ్యమైనవి కూడా మీకు వివరిస్తాను . 

 స్వచ్ఛమైన అశ్వగంధ తయారీ విధానం - 

      మెట్టభూములు మరియు అడవులలో లభ్యమగు మంచి ముదురు పెన్నేరు గడ్డలను తెచ్చి మట్టి , ఇసుక , దుమ్ము వంటి వ్యర్థపదార్థాలు లేకుండా శుభ్రపరచుకొని నీడ యందు ఎండించవలెను . పూర్తిగా ఎండిన తరువాత  కత్తితో ముక్కలుగా కొట్టి ఒక గిన్నెలో వేసి అవి మునుగునంత వరకు దేశి ఆవుపాలు పోసి సన్నటిసెగపైన పాలు ఇగురునంత వరకు ఉడికించవలెను . అలా ఉడికించిన తరువాత గడ్డలను బాగుగా ఎండించవలెను . ఆ దుంపల యందు తడి పూర్తిగా ఆరిపోయేంత వరకు ఎండించవలెను . లేనిచో ఆ దుంపలకు బూజు పట్టును . ఇలా పూర్తిగా ఎండిన దుంపలను మరలా ఉడికించి ఎండించవలెను . ఇలా మొత్తం 11 సార్లు చేసి ఆ తరువాత బాగుగా ఎండించి చూర్ణం చేసి వస్త్రగాలితం చేసుకుని వచ్చిన మెత్తటి చూర్ణాన్ని తడి తగలకుండా జాగ్రత్తగా నిలువచేసుకోవలెను . 

 మోతాదు - 

     2 నుంచి 3 గ్రాముల మోతాదులో ఉదయము మరియు సాయంత్రం భోజనానికి అరగంట ముందు ఆయా సమస్యను బట్టి వైద్యులు సూచించిన అనుపానంతో వాడవలెను . 

       అశ్వగంధ 7 సార్లు శుద్ది చేయవలెను అని చెప్పుదురు . 11 సార్లు శుద్ది చేసిన ప్రశస్తముగా ఉండును . మరియు బలంగా పనిచేయును . 

  ఔషధోపయోగాలు  - 

 *  శరీరానికి అమితమైన బలాన్ని ఇచ్చును . శుష్కించు శరీరం కలవారు దీనిని వాడుట వలన శరీరానికి కండపట్టి బలంగా తయారగుదురు . 

 *  నిద్రలేమితో బాధపడువారికి ఈ అశ్వగంధ అత్యంతద్భుతముగా పనిచేయును . అశ్వగంధ ప్రధానముగా నరాల మీద పనిచేసి నరాలకు బలాన్ని చేకూర్చును . దీనిని వాడుట వలన ప్రశాంతమైన నిద్ర లభించును . 

 *  క్షయరోగముతో ఇబ్బంది పడువారికి ఇది అత్యంత బలవర్ధకమైనది . ఊపిరితిత్తులకు బలాన్ని చేకూర్చుటయే కాక శరీర రోగనిరోధక శక్తి పెంచుటలో అత్యంత వేగముగా పనిచేయును . 

 *  విరిగిన ఎముకలు త్వరగా కట్టుకొనుటకు ఈ అశ్వగంధ బాగుగా పనిచేయును . 

 *  స్త్రీలు మరియు పురుషలలో కలుగు వంద్యదోషాలను నివారించును . 

 *  రక్తము నందలి దోషములను పోగొట్టును . 

 *  కీళ్లనొప్పులు నుంచి ఉపశమనం కలిగించును . 

 *  నాడీవ్యవస్థ కు చెందిన వ్యాధుల పైన బాగుగా పనిచేయును . 

 *  పక్షవాతం మొదలగు వాతవ్యాధుల యందు దీని పనితీరు అద్బుతముగా ఉంటుంది . 

 *  మెదడులోని న్యూరాన్ల పైన దీని ప్రభావం ఉంటుంది. దీనిని వాడుట మూలన మెదడు చురుకుగా పనిచేయును . జ్ఞాపకశక్తి మెరుగుపడును . 

 * అగ్నిమాంద్యము , మలబద్దకం నివారించును .

 *  బాలింతలకు వచ్చు సూతికారోగము నివారించును . 

 *  శరీరంలోని టాక్సిన్స్ బయటకి పంపి శరీరాన్ని శుద్ది చేయును . 

 *  కఫ సంబంధ దోషములైన శ్వాస ( ఆయాసం ) , శోష మొదలైన వాటిని నివారించును . 

 *  గ్రంధి సంబంధ రోగాలు ఉదాహరణకి థైరాయిడ్ వంటి వాటిపై అమోఘముగా పనిచేయును . 

 *  గుండెసంబంధ సమస్యల కలవారు అశ్వగంధ వాడవలెను . 

 *  కొంతమంది పిల్లలు శారీరకంగా ఎండుకుపోయి ఉంటారు. అటువంటివారికి తేనె అనుపానంగా ఈ అశ్వగంధ చూర్ణమును ఇచ్చిన మంచి కండపట్టి పుష్టిగా తయారగుదురు . 

 *  వృద్ధాప్యము నందు వచ్చు సమస్యలను ఎదుర్కోవడానికి అశ్వగంధ నిత్యము సేవించవలెను . 

 *  స్త్రీల శారీరక బలహీనతని పోగొట్టును . ప్రదర రోగములను నివారించును . 

 *  మూర్చరోగులకు ఇది వరం వంటిది . 

 *  స్త్రీలలో కలుగు బహిష్టు సంబంధ సమస్యలను నివారించును . 

 *  స్త్రీ మరియు పురుషులలో హార్మోన్స్ మీద ఇది చాలా అద్బుతముగా పనిచేయును . 

      పైన చెప్పిన అనేక ఉపయోగాలు మాత్రమే కాకుండగా అనేకమంది HIV వ్యాధిగ్రస్తులకు ఇది నేను ఇవ్వడం జరిగింది. దీనిని ఉపయోగించిన తరువాత వారిలో CD4 కౌంట్ నందు మార్పు కనిపించింది. అంతకు ముందు ఉన్నటువంటి నీరసం , నిస్సత్తువ తగ్గిపోయాయి.  ఇలా మరెన్నో వ్యాధులపైన దీనిని ప్రయోగించాను . అద్బుతమైన ఫలితాలు వచ్చాయి . 

      మీకు ఇక్కడ మరొక్క ముఖ్యవిషయం చెప్పవలెను . నేను మామూలుగా ఆయుర్వేద షాపుల్లో దొరికే శుద్ధిచేయని మామూలు అశ్వగంధ చూర్ణము ఉపయోగించినప్పటికంటే నేను పాలల్లో ఉడకబెట్టి తయారుచేసిన అశ్వగంధ చూర్ణం వాడుట వలన ఫలితాలు అతి తక్కువ సమయములో వేగముగా ఫలితాలు వచ్చాయి . ఈ అశ్వగంధ చూర్ణం వాడువారు పాలు , పెరుగు , వెన్న , పప్పు తరచుగా వాడవలెను . తాంబూలం , మద్యము , కర్బుజా పండు , పనసపండు , చల్లనినీరు , చద్ది అన్నం నిషిద్దం . 

  

చర్మవ్రణము ( keloid ) గురించి వివరణ -

చర్మవ్రణము ( keloid ) గురించి వివరణ - 

      చర్మవ్రణ సమస్య ప్రస్తుత కాలంలో కనిపించే ప్రధానమైనది. ఈ సమస్యకు అల్లోపతి మరియు హోమియోపతి వైద్యవిధానములో సంపూర్ణ పరిష్కారం లేదు . ఆయుర్వేదం నందు ఈ సమస్యకు సంపూర్ణ పరిష్కారం కలదు. ఈ సమస్యలో ప్రధానంగా శరీరం మీద కొన్ని భాగాలలో ముఖ్యముగా ఛాతి మధ్యభాగములో మరియు ఉదరము , గడ్డము కింద , భుజముల దగ్గర ఉబ్బెత్తుగా వ్రణము లేచును . అది రాయివలె గట్టిగా ఉంటుంది. కొంతకాలము అయిన పిదప దాని నుంచి తెల్లటి పదార్ధము బయటకి వచ్చును . ఇది చిన్నగా వ్యాప్తి చెందుతూ మిగిలిన భాగాలకు కూడా వ్యాపించును . 

         ఈ సమస్య ప్రధానముగా రక్తదోషము వలన సంభంవించును . శరీరం నందు అధికమైన వాతాది దోషములు  ప్రకోపము చెంది రక్తము పైన ప్రభావం చూపించుట మూలన రక్తం దోషము పొంది చర్మముపైన వ్రణము ఏర్పడును . ఈ సమస్య గురించి మరింత సమాచారం మీకు అందచేస్తాను . ముందు వ్రణాల గురించి మీకు వివరిస్తాను . 

         వ్రణాలు 2 రకాలు . అవి వరసగా 

             *  శారీరకములు . 

             *  ఆగస్తకములు . 

     వాతాదిదోషములు చేత జనియించిన వ్రణములు శారీరకములు . శస్త్రాలు , మిగిలిన ఆయుధాలు వలన కలుగు దెబ్బల చేత జనియించిన వ్రణములుని ఆగస్తకములు అని పిలుస్తారు . 

 *  వాతదోషము పొందుట వలన కలుగు వ్రణ లక్షణాలు - 

     వ్రణము కదలకుండా గట్టిగా ఉండును. చీము మెదలైనవి మెల్లగా స్రవించును . అధికమైన బాధ కలిగి ఉండును . పోటు కలుగును . అదురుచుండును . శ్యామవర్ణం కలిగి ఉండును . ఈ లక్షణములు కలిగిన వ్రణము వాతముచే జనియించింది అని తెలుసుకొనవలెను . 

 *  పిత్తజ వ్రణ లక్షణములు - 

       దప్పిక , మూర్చ , జ్వరం , తాపము , లోపల చెడిపోయి పగులుతున్నట్లు ఉండటం , దుర్గన్ధముతో కూడిన చీము స్రవించుట మొదలైన ఈ లక్షణములు కలిగినది పిత్తప్రకోపముచే జనించిన వ్రణము అని తెలుసుకొనవలెను . 

 *  కఫజ వ్రణ లక్షణము - 

       మిక్కిలి జిగటగా ఉండటం , భారముగా ఉండటం , నునుపు కలిగి ఉండటం , నిశ్చలముగా ఉండటం , కొంచము నెప్పి కలిగి ఉండటం , తెల్లటి రంగుతో కలిగి ఉండటం , చీము కొంచము స్రవించుట , వ్రణము పక్వము చెందుటకు చాలా సమయం పట్టును . ఇటువంటి లక్షణాలు కలిగింది కఫదోషము వలన జనియించిన వ్రణము అని తెలుసుకోవలెను . 


     పైన చెప్పిన విధముగా శరీరంలో ఏర్పడు దోషముల వలన శరీరంపైన వ్రణాలు ఏర్పడును .
ఈ చర్మవ్రణములు వృద్ధిచెందుతూ మనిషిని కురుపిని చేయును . 

      ఈ చర్మవ్రణాల నివారణకు ప్రత్యేకమైన చికిత్స అవసరం . ఈ సమస్యతో ఇబ్బందిపడువారు చికిత్సకోరకు నన్ను సంప్రదించగలరు.  

  

ప్రాచీన భారతీయ వాస్తు శాస్త్ర రహస్యాలు -

ప్రాచీన భారతీయ వాస్తు శాస్త్ర రహస్యాలు  - 

  నేను భారతీయుడిగా పుట్టినందుకు చాలా గర్విస్తున్నాను . ఎందుకంటే ప్రపంచంలో మరే దేశానికి , మరే సంస్కృతికి లేనంత గొప్ప ప్రాచీన విజ్ఞానం మన భారతీయులకు మన దేశానికే సోoతం . అటువంటి ప్రాచీన అద్బుతమైన విజ్ఞానాన్ని మనం మర్చిపోతున్నాం . ప్రస్తుత పరిస్థితుల్లో కొంతవరకు అయినా మరలా మీకు తెలియచేయాలి అనే ఈ చిన్న ప్రయత్నం .

            మన ప్రాచీన శాస్త్రాలలో వాస్తుశాస్త్రానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. దానిలోని కొన్ని రహస్యాలు మీకు తెలియచేస్తాను.

 *  ప్రప్రధముగా గృహనిర్మాణం కావించునప్పుడు భూమిని పరీక్షించవలెను . అలాచేయనిచో ఆ గృహనిర్మాణం వ్యర్థం అగును. 

 *  గృహనిర్మాణం కావించు భూమి యందు చిల్లపెంకులు ఉన్నచో అది అశుభప్రదము . ఎముక యొక్క బూడిద ఉన్నచో అది నష్టప్రదము , బొగ్గులు మరియు చౌడు ఉన్నచో జీవహాని .

 *  గృహనిర్మాణం చేయు భూమి తెల్లని రంగు కలిగి ఉన్నచో శ్రేష్టము . ఎర్రని రంగు గల భూమి మధ్యమము , పచ్చని రంగు కలిగిన భూమి అధమము , నల్లనిరంగు కలిగిన భూమి విడువవలెను .

 *  భూమిని త్రవ్వినప్పుడు దానిలోని మృత్తిక నాలుకపై వేసుకొనినచో తియ్యగా ఉన్న శ్రేష్టం , మిశ్రమం అయినది మధ్యమం , పుల్లనిరుచి అధమం , చేదు రుచి కలిగినది మరింత అధమం.

 *  తవ్విన మన్ను వాసన చూడగా తామరపద్మం వాసన వచ్చినచో శ్రేష్టం , గుర్రం మరియు ఏనుగు మదం వాసన వచ్చినచో మధ్యమం , పశువు మరియు ధాన్యం వాసన వచ్చినచో అది అధమం , ఇతర వాసనలు వచ్చినచో విడువవలెను . 

 *  నాలుగు దిక్కులు సమ చతురస్రం కలిగి గంధపు వర్ణం కలిగిన భూమి గృహనిర్మాణానికి అత్యంత అనుకూలం .

 *  గృహనిర్మాణ స్థలం నందు ఒక మూర చతురస్రాకారంగా గొయ్యి తవ్వి దాని యందు రాత్రి సమయం లో నిండా నీరుపోసి పొద్దున్న లేచి చూడగా నీరు పూర్తిగా ఇంకిపోకుండా నిలిచి యున్నచో శుభప్రదం . ఇదే పద్ధతిని కొన్ని ప్రాచీన వాస్తుగ్రంధాలలో నీటిజాడని కనుక్కోవడానికి వాడేవారు. అదే గుంటలో నీరు ఇంకి బురదగా ఉన్నచో మధ్యస్తంగా నీరు పడును. నీరు పూర్తిగా ఇంకి భూమి నెర్రెలు కొట్టి ఉంటే ఎంత ప్రయత్నించినను నీరు పడదు.

 *  దేవాలయములకు శంఖువు శిలతో చేయవలెను .  గృహములకు శంఖువు కర్రతో చేయవలెను . 

 *  బ్రాహ్మణులకు పదహారు అంగుళములు , రాజులకు పదిహేను అంగుళములు , వైశ్యులకు పదునాలుగు అంగుళములు , శూద్రులకు పదమూడు అంగుళములు ఉన్న శంఖములను గృహగర్భము నందు వాడవలెను . ఆయా ప్రమాణాలలో సగం వర్తులాకారంలో ఉండవలెను . ఇది మగధదేశ నియమం .

 *  శంఖువు ఎనిమిది అంగుళాల లావు వుండవలెను . 

 *  వృత్తాకారం గల స్థలం నందు గృహనిర్మాణం చేసి అందు నివసించేవారు దరిద్రులు అగును. విషమ కోణములు గల భూమి యందు నివసించేవారు దుఃఖితులు అగుదురు. ముక్కోణం గల స్థలం నందు ఇండ్లు కట్టి నివసించేవారు సివిల్ మరియు కేసులు సంప్రాప్తినుంచి ఇబ్బందులు పడును. చేట వంటి ఆకారం గల భూమి యందు గృహం నిర్మించి ఉండువారు ఎంతటి ధనవంతులు అయినను క్రమంగా రుణగ్రస్తులు అయ్యి దరిద్రులు అగును. కావున యోగ్యమైన భూమి యందే గృహనిర్మాణం చేయవలెను . 

 *  వాయువ్యమునకు గాని , ఆగ్నేయమునకు ముఖం కలిగి ఆ దిక్కుగా కట్టిన గృహము అగ్నిచే దహించబడును అని భృగుమహర్షి తెలియచేసెను . ఈశాన్య నైరుతి దిశలకు అభిముఖము కలిగి దిశతిరిగినట్టు కట్టిన గృహము నాశనం పొందును. కలహములచే ఎల్లప్పుడూ పీడించబడును.

 *  గృహారంభం పగటిపూట మధ్యాహ్నానికి పూర్వమే చేయవలెను . మధ్యాహ్నం నందు మరణప్రదం . సంధ్యాసమయం , రాత్రికాలం నందు ఐశ్వర్యం కోరువారు చేయకూడదు . 

 *  రాత్రియందు శంఖుస్థాపన చేసినచో గృహహాని .

 *  రాత్రిని నాలుగు భాగములు చేసి అందు నాలుగోవ బాగం యందు ఘడియలలో గృహారంభ ప్రతిష్ట చేయవచ్చు అని విశ్వకర్మ తన వాస్తుశాస్త్రం నందు తెలియచేశారు.

 *  భార్య గర్భవతిగా ఉన్నప్పుడు గృహారంభాలు చేయకూడదు . అలా చేసినచో గర్భహాని మరియు గృహహాని జరుగును. అలా చేయవలసివచ్చించో 5 మాసాల తరువాత చేసుకోవచ్చు.

 *  గర్బము ధరించిన స్త్రీ యొక్క భర్త సింధు  స్నానం , చెట్లు నరకుట , క్షౌరము , శవమును మోయుట , విదేశీయానం నిషిద్దం .

 *  నూతన గృహములు నిర్మించుకొనువారు నిర్మాణానికి కొత్త కలపనే వాడవలెను . పాత గృహం కలప , కాలిన కలప వాడరాదు.

 *  విష్ణు ఆలయములకు వెనక భాగం , ఈశ్వరాలయంకు ఎదుటను , శక్తి ఆలయములకు పక్క భాగములలో , వీధి శూలల యందు గృహం నిర్మించరాదు.

 *  గృహము నందు మూడు ద్వారములు , మూడు మంచములు , మూడు దీపములు , 3 కిటికీలు ఉన్నచో ఆ గృహము దుఃఖప్రధమం అగును.

 *  గృహము యొక్క గోడ దళసరి 12 భాగములు చేయగా లోపలి వైపు 7 భాగములు వెలుపలి వైపు 5 భాగములు ఉంచి మధ్య యందు ద్వారం ఉంచవలెను .

 *  ద్వారము లేనిది కూపం అనియు , ఒక ద్వారం కలిగినదానిని దిగుడు బావి అనియు నాలుగువైపులా మెట్లు ఉన్నదానిని పుష్కరణి అని అంటారు. అదేవిదంగా పొడవుగా ఉన్నదానిని దీర్గికా అనియు , ఎల్లప్పుడూ నీరు ఉండేదాన్ని కుల్యం అని కూడా అంటారు.

 *  లోగిలి యందు నీరు తూర్పుదిశకు వెళ్ళుట వృద్ధికరం . ఉత్తరదిశగా వెళ్లుట ధనప్రదం , పడమట దిశ యందుట ప్రవహించుట ధనక్షయం , దక్షిణదిశకు నీరుపోవుట మృత్యుపదం .

 *  గృహనిర్మాణం చేయు భూమి దక్షిణ , పశ్చిమాలు ఎత్తుగా ఉండటం శుభపరిణాము . తూర్పు , ఉత్తరములు  పల్లముగా వుండవలెను . 

 *  తిధి వృద్ది క్షయముల యందు , రోగగ్రస్తులగా ఉన్నప్పుడు , భయంతో కూడిన పరిస్థితులు ఉన్నప్పుడు , రాజాటంకం కలిగినప్పుడు , భార్య గర్భిణిగా ఉన్నప్పుడు, తనకు గ్రహస్థితి బాగాలేనప్పుడు , దుస్వప్నములు , దుశ్శకునాలు కనిపించినప్పుడు , ఇంట్లో మైల ఉన్నప్పుడు , అమావాస్య దగ్గర్లో , వర్జ్య ఘడియల్లో శంఖుస్థాపన నిషిద్దం .

 *  గృహం అతిఎత్తైనది అయితే చోరభయం , అతికూరచ అవుటవల్ల దరిద్రం , అతి వెడల్పు వలన మరణం సంభంవించును.

 *  ఆయష్షు కోరుకునే వారు  తూర్పుముఖంగా , కీర్తికాముకులు దక్షిణముఖముగా , ఐశ్వర్యకాముకులు పడమటి ముఖంగా కూర్చుని భోజనం చేయవలెను  . శార్ధకర్మలు యందు కాక మరే సమయంలోను ఉత్తరాభిముఖంగా భోజనం చేయరాదు . తల్లితండ్రులు జీవించి ఉన్నవాడు , తల్లి కాని తండ్రి కాని జీవించి ఉన్నవాడు కూడా దక్షిణ ముఖంగా తిరిగి భోజనం చేయరాదు .  ఇదియే గృహము నందు భోజన నియమము . 

  *  స్వగృహము నందు తూర్పు తలగడ , అత్తవారింట దక్షిణ తలగడ , ఇతరచోట్ల పడమర తలగడ పెట్టుకుని పడుకోవలెను . ఉత్తర తలగడగా ఎప్పుడూ పడుకోగూడదు .

 *  గడ్డియందు , దేవాలయం , పాషాణం , పల్లపు ప్రదేశం , మార్గము, ద్వారం, గృహమధ్య ప్రదేశం , ఒంటరిగా , స్మశానం , నాలుగు దార్లు కలిసేచోట , ఇంటి దూలం క్రింద , తన మరియు పర స్త్రీల సమీపం నందు పడుకోరాదు.

 *  గృహమధ్యమం నందు వృక్షాలు ఉండరాదు.తులసి ఉండవచ్చు.

      
                

Sunday, January 2, 2022

ప్రాచీన భారతం నందు రసౌషదాల ఉపయోగం మరియు రసవాద విద్య -



    రసవాదవిద్య ఈ పేరు వినుటకు కొంత విచిత్రంగా మరియు కొత్తగా అనిపించవచ్చు. వేమన గురించి తెలిసిన వారికి ఈ విద్య బాగా పరిచయం. నా స్నేహితుల్లో కొంతమంది కూడా దీనిని సాధించుటకు నల్లమల అడవులలో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు . అంతకు ముందు రసౌషదాలు మరియు రసవాదం గురించి కొంత వివరణ ఇచ్చాను . ఇప్పుడు మరికొన్ని కొత్త విషయాలు, నేను కొన్ని పురాతన గ్రంథాలు పరిశోధించి తెలుసుకున్న విషయాలు ఇప్పుడు మీకు తెలియచేస్తాను.

            క్రీస్తుశకం 3 , 4 శతాబ్దాలు కాలంనాటి వాగ్బాటాచార్యుని కాలం వరకు రసౌషదాలు అంతగా ప్రాచుర్యంలో లేవు . అసలు ముందు మీకు రసౌషదాలు అంటే ఏమిటి ? వాటిని ఎందుకు ఉపయోగిస్తారు ? అనే విషయాలు మీకు తెలియచేస్తాను . అందరూ ఆయుర్వేదం అంటే మూలికలు , చూర్ణాలు , కషాయాలు అని మాత్రమే అనుకుంటారు . కాని ఆయుర్వేదం లో చాలా తక్కువ మందికి తెలిసిన మరొక విభాగం ఉంది. అదే "రసౌషద" విభాగం. ఈ విభాగంలో పాదరసం , బంగారం , వెండి , అభ్రకం , వజ్రం వంటి లోహాలని ఉపయోగించి వాటిని సరైన పద్దతిలో పుటం పెట్టి వాటి యొక్క లోహాలక్షణాలని పోగొట్టి శుద్ది చేసి ఔషదాలుగా మార్పుచేయడమే రసౌషద విధానం . ఈ విధానం లో పాదరసాన్ని శుద్ది చేసి రోగి అవసాన దశలో ఉన్నప్పుడు శుద్ధ పాదరసాన్ని సరైన మోతాదులో ప్రయోగిస్తే అల్లోపతి వైద్యవిధానంలో వాడే ఇంజక్షన్ కంటే వేగం గా పనిచేసి రోగి యొక్క ప్రాణాన్ని నిలబెట్టును. నేను తయారుచేసే ఔషధాలలో భస్మాలు వాడినపుడు చాలా వేగవంతమైన ఫలితాలు చూశాను . 

                 ఇప్పుడు మీకు రసవాదం గురించి తెలియచేస్తాను . ఈ విద్య అత్యంత ప్రాచీన విద్య . మీరు ఒక విషయం గమనించండి ప్రాచీన కాలంలో ఇప్పటిలా పెద్ద పెద్ద గనులు బంగారం కోసం తవ్వలేదు . మరి అంత బంగారం ఎలా వచ్చింది ? దానిలో చాలా వరకు రసవాద విద్య ద్వారా తయారు చేయబడినది. నేను అంతకు ముందు మీకు రసవాదం  గురించి తెలియచేసిన విషయాలు లో కొన్ని విషయాలు మరలా ఒక్కసారి మీకు గుర్తుచేస్తాను. తెలంగాణా లో వరంగల్ మరియు కరీంనగర్ ప్రాంతాలలో పెద్ద కొండలపై కొన్ని చోట్ల చాలా పాత కోటలు ఉన్నాయి. కొన్నిచోట్ల అవి చెట్లతో పూర్తిగా కప్పబడి దగ్గరకి వెళ్లేంత వరకు అక్కడ కోట ఉందని తెలీదు . ఆ కోటల యొక్క భూగర్భ గదుల్లో పెద్ద పెద్ద కుండలలో 3 రకాల రంగుల్లో మెత్తటి పొడి ఉంటుంది. వాటిని నేను కూడా చూశాను. వాటిలో మొదటిది ఇటుకరాయి రంగులో ఉంటుంది. రెండొవది బూడిద రంగులో మూడొవది సిమెంట్ రంగుతో ఉంటుంది.  ఆంద్రప్రదేశ్ లో ద్రాక్షారామం ఏరియాలో కూడా ఇలాంటి కుండలు ఉన్నాయి.  ఇవి తెల్లమొదుగ,  ఎర్రచిత్రమూలం మరియు నల్లవావిలి చెట్ల నుంచి మరియు వాటి రసాల నుంచి శాస్త్రోక్తంగా తయారుచేసిన భస్మాలు . వీటిని ఉంచిన సమీపంలో ఎక్కడో ఒకచోట ఒక మట్టిపాత్రలో ఒక పసరు ఉంటుంది. ఈ మూడు చూర్ణాలను సరైన పాళ్ళలో తీసుకుని ఆ మట్టిపాత్రలో ఉన్న పసరు కలపడం వలన స్వర్ణం లభిస్తుంది అని కొన్ని గ్రంథాలలో ఉంది.  అది ఏ విధంగా చేయాలో అదే స్థలంలో రహస్యంగా ఉంచబడిన రాగిరేకులో పొందపరచబడి ఉంటుంది. ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను . రసవాద విద్య కోసం ప్రయత్నించినవాడు ఆ విద్య సాధించడంలో విఫలం అయినా ఒక గొప్ప వైద్యుడు మాత్రం కాగలడు .  

            భస్మాలలో రాజు వంటిది స్వర్ణభస్మం  చిన్నపిల్లలకు మనం అన్నప్రాసన  చేసేప్పుడు స్వర్ణప్రాసన అని ఉంగరాన్ని నాలుకకు నాకిస్తాం . దాన్నే మనం స్వర్ణ ప్రాసన అని మురిసిపోతాం . కాని అది ఎంతమాత్రమూ కాదు. నిజమైన స్వర్ణప్రాశన అంటే సరైన స్వర్ణభస్మంని లొపలికి ఇవ్వడం ముందు గుండుపిన్ను మొన చివర భాగముని తేనెలో మంచి తరువాత ఆవునెయ్యిలో మంచి చివర కొనభాగం స్వర్ణభస్మానికి ఆనించి రవ్వ అంత మోతాదులో నాలిక పైభాగాన రాయాలి .ఈ విధంగా ప్రతిరోజూ రెండు పూటలా శిశువుకి ఇస్తుంటే ఎదిగే కొద్ది ఆ శిశువు అమిత బలవంతుడు అయ్యి బ్రహుస్పతి అంత గొప్ప ఏకసంథాగ్రాహి అవుతాడు. స్వర్ణభస్మ సేవన చేయువానికి విషము కూడా ఎక్కదు. 

             ఈ రసవాదం , రసౌషధాలకు మూల పురుషుడు సిద్దనాగార్జునుడు అని చెప్తారు.  నిత్యనాధ సిద్దుడు రాసిన రసరత్నాకరం అను గ్రంథం నందు ఈ రసవాదం , ఔషదాలు , రత్నాలని భస్మాలుగా చేయుట మొదలగు వాటి గురించి చక్కని వివరణ ఉన్నది. 

   మన ప్రాచీనులు ఈ రసాలని మూడు రకాలుగా వర్గీకరణ చేశారు . అవి 

  *  మహారసములు .
  
  *  ఉప రసములు .

   *  సాదారణ రసములు . 

        పైన చెప్పిన వాటిలో అని రకాల ఖనిజాలను చేర్చి వాటిని వాటి యొక్క లక్షణాలుగా విభజించారు . 

         ఈ రసాలపై అదుపు సాధించిన వాటిని "రససిద్ధులు" అని పిలుస్తారు . ఈ రససిద్ధులలో సిద్ధ నాగార్జునుడు అగ్రగణ్యుడు. ఈ రకంగా మనదేశం నందు మొత్తం 27 మంది ప్రాచీన సిద్దులు ఉండేవారు అని తెలుస్తుంది. ఈ రససిద్దులు కు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. వీరు ముఖ్యంగా శైవసాంప్రదాయం పాటిస్తారు . వీరికి మహత్తు ఉన్ననూ వీరు ప్రదర్శించరు. వీరికి వచ్చు ప్రధాన విద్యలు అగ్నిలో దూకుట , అందులోనే కూర్చొనుట, కోరిన రూపం దరించుట , అదృశ్యం అగుట, బంగారం ద్రవ్యముగా మార్చుట దీనినే రసవాదులు "స్వర్ణదృతి " అని అంటారు. తామ్రమును అనగా రాగిని బంగారంగా మార్చుట, గంధకం (సల్పర్ ) నుంచి తైలం తీయుట , పాదరసాన్ని గులికలా చేసి బంధించుట దానిద్వారా ఆకాశయానం చేయుట ఇటువంటి ప్రక్రియల ను చేయువారిని సిద్దులు అందురు. 

             ఇటువంటి రససిద్ధులకు దక్షిణభారత దేశంలో తమిళనాడు ప్రసిద్ది. తమిళనాడులో ఎక్కువుగా రసాలను ఉపయోగించి వైద్యం చేసేవారు ఎక్కువ. నేను కూడా మొదట్లో మా పూర్వీకుల నుంచి వచ్చిన మూలికల వైద్యాన్ని మాత్రమే అనుసరించేవాడిని.వాటితోనే ప్రయోగాలు చేసేవాడిని. రసౌషదాల గురించి కనీసం ఆలోచించేవాడిని కాదు. ఒక స్నేహితుడిద్వారా కొంత రసౌషద పరిచయం కలిగింది. ఇప్పుడు నేను మూలికలతో పాటు స్వర్ణ భస్మం , అభ్రక భస్మం , రజత భస్మం , ముత్యభస్మం , శతపుటి అభ్రకభస్మం , కాంత భస్మం వంటి రసౌషదాలను విరివిగా వాడుతున్నాను . ఖరీదు ఎక్కువ అయినను కూడా ఫలితం తొందరగా వస్తుంది. ఈ రసౌషదాలలో పాదరసం ప్రధానం అయినది. కొంతకాలం క్రితం  సోమలత చెట్టు ని ఉపయోగించి కాయసిద్ది అనగా ముసలితనం రాకుండా నిలుపుచేసి నిత్యయవ్వనుడిగా ఎలా ఉండాలో మీకు వివరించాను .అది మూలికా విధానంలో అదే విధమైన ఫలితాన్ని రసౌషదాలలో ప్రధానం అయిన పాదరసం ఉపయోగించి కూడా అదేవిధమైన ఫలితాన్ని పొందవచ్చు. ఈ రసవిద్యకు ప్రధానంగా నలందా విశ్వవిద్యాలయం , విక్రమశిలా విద్యాపీఠం , నాగార్జునకొండ ప్రధానమైన కేంద్రాలుగా ఉండేవి .ఖిల్జీ ప్రభువు ఈ విద్యాలయాలను ద్వంసం చేయడం మూలాన ఈ రససిద్దులు దేశం నలువైపుల పారిపోవలసి వచ్చింది. వీరిలో అధికం టిబెట్ దేశమునకు వెళ్లిరి. అందువలనే తాంత్రికులకు టిబెట్ దేశం ప్రసిద్ది . ఈ సిద్ధసాంప్రదాయం నందు జాతి ,కుల,మత భేదములు ఉండేవి కావు దానివలన అప్పటి బ్రాహ్మణులు శుచిగా శుద్ధిగా చేయవలసిన మంత్రభాగం ఆచరిస్తూ ఈ తంత్రభాగాన్ని తిరస్కరించారు.

           ఈ సిద్దులు కొంతమంది మనమధ్యనే తిరుగుతుంటారు . ఈ రససిద్ధులే తరువాత ధాతువాదులుగా , రసవాదులుగా పిలవబడిరి . ఈ విద్యని అరబ్ దేశం నందు     " కిమియాగరి" అని పేరు కలదు . ఈ పదమే తరువాతికాలంలో " కెమిస్ట్రీ " గా రూపాంతరం చెందినది. అసలు రసవిధానం మొదట వైద్యం కోసమే ప్రవేశపెట్టబడినది. రససిద్దులకు లోహాన్ని శుద్ధిచేయటం , దేహాన్ని శుద్ధిచేయడం అనగా దేహంలోని టాక్సిన్స్, వ్యర్థాలను పూర్తిగా బయటకి పంపే విధానం . ఈ లోహశుద్ధి పాదరసాన్ని పరీక్షించుట ద్వారా తెలియును . అనగా ఒక ఖనిజం (మెటల్)  ను తీసుకుని దానియందు పరమాణువులు రెండోవదగు ఉచ్చ తరగతికి చెందిన ఖనిజం ( metal) గా మార్చు శక్తి పాదరసంకి కలదు. రససిద్దులు పాదరసం శివుని వీర్యంగా, గంధకం పార్వతీదేవి రజస్సుగా వారు భావిస్తారు. ఈ పాదరసంతో చేయు చికిత్సలకు ప్రత్యేక నియమనిబంధనలు అవసరంలేదు . అదే మూలికల చికిత్స చేయునప్పుడు శరీరశుద్ధి చేయవలెను ప్రధమంగా వంటి కొన్ని నియమాలు కలవు.  

         ఇలా రసౌషదాల గురించి చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి. ప్రస్తుతం సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఎయిడ్స్ , క్యాన్సర్ వంటి మొండి వ్యాధులకు ఈ రసౌషదాలు చక్కని పరిష్కారం . క్యాన్సర్ సమస్యకి వాడే ఔషధాల్లో వజ్రభస్మం వాడటం వలన రోగి తొందరగా కొలుకుంటాడు.

             ఈ విధంగా చెప్పకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉంటాయి. కాని చాలా మందికి రస ఔషదాలు , రసవాదం గురించి పరిచయం లేదు వారు అర్థం చేసుకొనుటకు ఇబ్బంది ఎదురు అగును. కావున కేవలం కొంతమాత్రమే ఇచ్చాను. ఇది చదివినవారిలో రసవాదులు ఉంటే వారికి మాత్రం సంపూర్ణంగా అర్థం అగును.

 

హైందవ సంస్కృతి

::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
::  హైందవ సనాతన సంస్కృతి  :-
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

మన హైందవ సనాతన సంస్కృతిలోని ముఖ్యమైన సమాచారం ఈ తరం పిల్లలకు అందబాటులో. నేర్పించండి. చదివించండి.

 లింగాలు :-
"""""""""""""""
(1) పుం, 
(2) స్త్రీ, 
(3) నపుంసక

 వాచకాలు :-
"""""""""""""""""
(1) మహద్వా, 
(2) మహతీ, 
(3) అమహత్తు.

 పురుషలు :-
"""""""""""""""""
(1) ప్రథమ, 
(2) మధ్యమ, 
(3) ఉత్తమ.

 దిక్కులు :-
""""""""""""""
(1) తూర్పు, 
(2) పడమర, 
(3) ఉత్తరం,
(4) దక్షిణం

మూలలు :-
""""""""""""""""
(1) ఆగ్నేయం, 
(2) నైరుతి,
(3) వాయువ్యం, 
(4) ఈశాన్యం

 వేదాలు :-
"""""""""""""
(1) ఋగ్వేదం,
(2) యజుర్వేదం,
(3) సామవేదం,
(4) అదర్వణ వేదం

 ఉపవేదాలు :-
"""""""""""""""""""
(1) ధనుర్వేద,
(2) ఆయుర్వేద, 
(3) గంధర్వ, 
(4) శిల్ప.

 పురుషార్ధాలు :-
"""""""""""""""""""""
(1) ధర్మ,
(2) అర్థ,
(3) కామ,
(4) మోక్షాలు.

 చతురాశ్రమాలు :-
"""""""""""""""""""""""
(1) బ్రహ్మ చర్యం,
(2) గార్హస్య్ద,
(3) వానప్రస్ధం,
(4) సన్యాసం.

 పంచభూతాలు :-
"""""""""""""""""""""""
(1) గాలి, 
(2) నీరు,
(3) భూమి,
(4) ఆకాశం,
(5) అగ్ని.

  పంచేంద్రియాలు :-
""""""""""""""""""""""""""
(1) కన్ను, 
(2) ముక్కు, 
(3) చెవి, 
(4) నాలుక,
(5) చర్మం.

  భాషా భాగాలు :-
""""""""""""""""""""""""
(1) నామవాచకం,
(2) సర్వనామం,
(3) విశేషణం, 
(4) క్రియ,
(5) అవ్యయం.

 లలిత కళలు :-
""""""""""""'"'"""""""
(1) కవిత్వం,
(2) చిత్రలేఖనం,
(3) నాట్యం,
(4) సంగీతం,
(5) శిల్పం.

  పంచకావ్యాలు :-
"""""""""""""""""""""""
(1) ఆముక్తమాల్యద,
(2) వసుచరిత్ర,
(3) మనుచరిత్ర,
(4) పారిజాతాపహరణం,
(5) శృంగార నైషధం.

  పంచగంగలు :-
"""""""""""""""""""""
(1) గంగ,
(2)  కృష్ణ,
(3) గోదావరి,
(4) కావేరి, 
(5) తుంగభద్ర.

  దేవతావృక్షాలు :-
""""""""""""""""""""""""
(1) మందారం, 
(2) పారిజాతం,
(3) కల్పవృక్షం, 
(4) సంతానం,
(5) హరిచందనం.

  పంచోపచారాలు :-
"""""""""""""""""""""""""
(1) స్నానం,
(2) పూజ, 
(3) నైవేద్యం,
(4) ప్రదక్షిణం,
(5) నమస్కారం.

  పంచాగ్నులు :-
"""""""""""""""""""""
(1) బడబాగ్ని,
(2) జఠరాగ్ని, 
(3) కష్టాగ్ని, 
(4) వజ్రాగ్ని, 
(5) సూర్యాగ్ని.

  పంచామృతాలు :-
"""""""""""""""""""""""""
(1) ఆవుపాలు,
(2) పెరుగు,
(3) నెయ్యి,
(4) చక్కెర, 
(5) తేనె.

 పంచలోహాలు :-
"""""""""""""""""""""
(1) బంగారం, 
(2) వెండి, 
(3) రాగి,
(4) సీసం,
(5) తగరం.

 పంచారామాలు :-
""""""""""""""""""""""""
(1) అమరావతి, 
(2) భీమవరం, 
(3) పాలకొల్లు,
(4) సామర్లకోట,
(5) ద్రాక్షారామం

  ధర్మరాజు అడిగిన ఊళ్ళు :-
"""""""""""""""""""""""""""""""""""""
(1) ఇంద్రప్రస్థం,
(2) కుశస్థం,
(3) వృకస్థలం, 
(4) వాసంతి, 
(5) వారణావతం.

   వేదాంగాలు (స్మ్రతులు) :-
"""""""""""""""""""""""""""""""""""
(1) శిక్ష, 
(2) వ్యాకరణం,
(3) ఛందస్సు,
(4) నిరుక్తం,
(5) జ్యోతిష్యం, 
(6) కల్పం.

 షడ్రుచులు :-
"""""""""""""""""
(1) తీపి,
(2) పులుపు, 
(3) చేదు,
(4) వగరు, 
(5) కారం,
(6) ఉప్పు.

  అరిషడ్వర్గాలు (షడ్గుణాలు) :-
"""""""""""""""""""""""""""""""""""""""
(1) కామం, 
(2) క్రోధం,
(3) లోభం, 
(4) మోహం,
(5) మదం,
(6) మత్సరం.

  ఋతువులు :-
""""""""""""""""""""
(1) వసంత,
(2) గ్రీష్మ,
(3) వర్ష, 
(4) శరద్ఋతువు, 
(5) హేమంత,
(6) శిశిర.

 షట్చక్రాలు :-
""""""""""""""""
(1) మూలధార,
(2) స్వాధిష్టాన, 
(3) మణిపూరక,
(4) అనాహత,
(4) విశుద్ధ,
(5) ఆజ్ఞాచక్రాలు.

   షట్చక్రవర్తులు :-
""""""""""""""""""""""""
(1) హరిశ్చంద్రుడు, 
(2) నలుడు,
(3) సగరుడు,
(4) పురుకుత్సుడు,
(5) పురూరవుడు, 
(6) కార్తవీర్యార్జునుడు.

  సప్త ఋషులు :-
""""""""""""""""""""""""
(1) కాశ్యపుడు,
(2) గౌతముడు, 
(3) అత్రి,
(4) విశ్వామిత్రుడు, 
(5) భరద్వాజ,
(6) జమదగ్ని,
(7) వశిష్ఠుడు.

  తిరుపతి సప్తగిరులు :-
"""""""""""""""""""""""""""""""
(1) శేషాద్రి,
(2) నీలాద్రి, 
(3) గరుడాద్రి, 
(4) అంజనాద్రి, 
(5) వృషభాద్రి, 
(6) నారాయణాద్రి, 
(7) వేంకటాద్రి.

  కులపర్వతాలు :-
""""""""""""""""""""""""
(1) మహేంద్ర, 
(2) మలయ, 
(3) సహ్యం, 
(4) శుక్తిమంతం,
(5) గంధమాధనం,
(6) వింధ్య, 
(7) పారియాత్ర.

  సప్త సముద్రాలు :-
"""""""""""""""""""""""""
(1) ఇక్షు,
(2) జల, 
(3) క్షీర, 
(4) లవణ,
(5) దది,
(6) సూర, 
(7) సర్పి.

  సప్త వ్యసనాలు :-
""""""""""""""""""""""""
(1) జూదం,
(2) మద్యం,
(3) దొంగతనం, 
(4) వేట,
(5) వ్యబిచారం, 
(6) దుబారఖర్చు,
(7) కఠినంగా మాట్లాడటం.

    సప్త నదులు :-
""""""""""""""""""""""
(1) గంగ, 
(2) యమునా, 
(3) సరస్వతి, 
(4) గోదావరి, 
(5) సింధు,
(6) నర్మద, 
(7) కావేరి.
                
   ఊర్ధ్వలోకాలు :-
""""""""""""""""""""""""
(1) భూ,
(2) భువర్ణో,
(3) సువర్ణో, 
(4) తపో, 
(5) జనో,
(6) మహా, 
(7) సత్య.

  అదో లోకాలు :-
""""""""""""""""""""""
(1) అతల, 
(2) వితల, 
(3) సుతల, 
(4) తలాతల, 
(5) రసాతల,
(6) మహాతల,
(7) పాతాళ.

   జన్మలు :-
"""""""""""""""
(1) దేవ, 
(2) మనుష్య, 
(3) రాక్షస, 
(4) పిశాచి, 
(5) పశు, 
(6) పక్షి, 
(7) జలజీవ,
(8) కీటక.

    కర్మలు :-
"""""""""""""""
(1) స్నానం,
(2) సంధ్య,
(3) జపం,
(4) హోమం,
(6) స్వాధ్యాయం, 
(7) దేవపూజ, 
(8) ఆతిథ్యం, 
(9) వైశ్యదేవం.

  అష్టదిగ్గజాలు :-
""""""""""""""""""""""
(1) ఐరావతం, 
(2) పుండరీకం, 
(3) కుముదం, 
(4) సార్వభౌమం,
(5) అంజనం,
(6) సుప్రతీకం,
(7) వామనం, 
(8) పుష్పదంతం.

   అష్టదిగ్గజకవులు :-
"""""""""""""""""""""""""""
(1) నందితిమ్మన, 
(2) పెద్దన, 
(3) ధూర్జటి,
(4) పింగళి సూరన,      
(5) తెనాలిరామకృష్ణ, 
(6) రామరాజభూషణుడు,
(7) అయ్యలరాజురామభద్రుడు, 
(8) మాదయగారిమల్లన

   శ్రీ కృష్ణుని అష్ట భార్యలు :-
"""""""""""""""""""""""""""""""""""
(1) రుక్మిణి,
(2) సత్యభామ,
(3) జాంబవతి, 
(4) మిత్రవింద, 
(5) భద్ర,
(6) సుదంత,
(7) కాళింది, 
(8) లక్షణ.

   అష్ట భాషలు :-
""""""""""""""""""""""
(1) సంస్కృతం, 
(2) ప్రాకృత, 
(3) శౌరసేని,
(4) పైశాచి,
(5) సూళికోక్తి, 
(6) అపభ్రంశం, 
(7) ఆంధ్రము.

   నవధాన్యాలు :-
""""""""""""""""""""""""
(1) గోధుమ,
(2) వడ్లు, 
(3) పెసలు,
(4) శనగలు, 
(5) కందులు,
(6) నువ్వులు, 
(7) మినుములు, 
(8) ఉలవలు,
(9) అలసందలు.

  నవరత్నాలు :-
"""''''""""""""""""""""
(1) ముత్యం, 
(2) పగడం, 
(3) గోమేధికం,
(4) వజ్రం,
(5) కెంపు,
(6) నీలం, 
(7) కనకపుష్యరాగం, 
(8) పచ్చ (మరకతం), 
(9) ఎరుపు (వైడూర్యం).

   నవధాతువులు :-
""""""""""""""""""""""""
(1) బంగారం,
(2) వెండి,
(3) ఇత్తడి, 
(4) రాగి, 
(5) ఇనుము,
(6) కంచు,
(7) సీసం, 
(8) తగరం, 
(9) కాంతలోహం.

  నవరసాలు :-
"""""""""""""""""""
(1) హాస్యం,
(2) శృంగార, 
(3) కరుణ, 
(4) శాంత, 
(5) రౌద్ర, 
(6) భయానక,
(7) బీభత్స, 
(8) అద్భుత,
(9) వీర.

   నవబ్రహ్మలు :-
""""'"""""""""""""""""
(1) మరీచ, 
(2) భరద్వాజ, 
(3) అంగీరసుడు, 
(4) పులస్య్తుడు, 
(5) పులహుడు, 
(6) క్రతువు, 
(7) దక్షుడు, 
(8) వశిష్ఠుడు, 
(9) వామదేవుడు.

   నవ చక్రాలు :-
""""""""""""""""""""""
(1) మూలాధార, 
(2) స్వాధిష్టాన, 
(3) నాభి, 
(4) హృదయ, 
(5) కంఠ, 
(6) ఘంటికా,
(7) భ్రూవు, 
(8) గగన, 
(9) బ్రహ్మ రంధ్రం.

  నవదుర్గలు :-
"""""""""""""""""""
(1) శైలపుత్రి, 
(2) బ్రహ్మ చారిణి, 
(3) చంద్రఘంట,
(4) కూష్మాండ,
(5) స్కందమాత, 
(6) కాత్యాయని, 
(7) కాళరాత్రి, 
(8) మహాగౌరి, 
(9) సిద్ధిధాత్రి.

   దశ బలములు :-
""""""""""""""""""""""""""
(1 )  విద్య, 
(2 )  స్నేహ, 
(3 )  బుద్ధి, 
(4 )  ధన, 
(5 )  పరివార, 
(6 )  సత్య, 
(7 )  సామర్ధ్య, 
(8 )  జ్ఞాన,
(9 )  దైవ, 
(10) కులినిత.

  దశ సంస్కారాలు :-
""""""""""""""""""""""""""
( 1 ) వివాహం, 
( 2 ) గర్భాదానం, 
( 3 ) పుంసవనం , 
( 4 ) సీమంతం, 
( 5 ) జాతకకర్మ, 
( 6 ) నామకరణం, 
( 7 ) అన్నప్రాశనం, 
( 8 ) చూడకర్మ,
( 9 ) ఉపనయనం, 
(10) సమవర్తనం.

  దశ  మహాదానాలు :-
"""""""""""""""""""""""""""""
( 1 ) గో,
( 2 ) సువర్ణ,
( 3 ) రజతం,
( 4 ) ధాన్యం, 
( 5 ) వస్త్ర,
( 6 ) నెయ్యి, 
( 7 ) తిల,
( 8 ) సాలగ్రామం,
( 9 ) లవణం, 
(10) బెల్లం.

   అర్జునుడికి గల పేర్లు :-
""""""""""""""""""""""""""""""""
(*) అర్జునుడు, 
(*) పార్ధుడు,
(*) కిరీటి, 
(*) శ్వేతవాహనుడు, 
(*) బీభత్సుడు, 
(*) జిష్ణుడు, 
(*) విజయుడు, 
(*) సవ్యసాచి, 
(*) ధనుంజయుడు 
(*) పాల్గుణుడు.

   దశావతారాలు :-
"""""""""""""""""""""""""
( 1 ) మత్స్య, 
( 2 ) కూర్మ,
( 3 ) వరాహ, 
( 4 ) నరసింహ, 
( 5 ) వామన, 
( 6 ) పరశురామ, 
( 7 ) శ్రీరామ,
( 8 ) శ్రీకృష్ణ, 
( 9 ) బుద్ధ,
(10) కల్కి.

  జ్యోతిర్లింగాలు :-
""""""""""""""""""""""""
హిమలయపర్వతం ~ కేదారేశ్వరలింగం .

కాశీ ~ కాశీవిశ్వేశ్వరుడు .

మధ్యప్రదేశ్ ~ మహాకాలేశ్వరలింగం, ఓంకారేశ్వరలింగం. (2)

గుజరాత్ ~ సోమనాధలింగం, నాగేశ్వరలింగం. (2)

మహారాష్ట్ర ~ భీమశంకరం, త్ర్యంబకేశ్వరం,    ఘృష్ణేశ్వరం, వైద్యనాదేశ్వరం. (4)

ఆంధ్రప్రదేశ్ ~ మల్లిఖార్జునలింగం (శ్రీశైలం) 

తమిళనాడు ~ రామలింగేశ్వరం 

  షోడశ మహాదానాలు :-
""""""""""""""""""""""""""""""""
( 1 ) గో, 
( 2 ) భూ, 
( 3 ) తిల, 
( 4 ) రత్న, 
( 5 ) హిరణ్య, 
( 6 ) విద్య, 
( 7 ) దాసి, 
( 8 ) కన్య, 
( 9 ) శయ్య, 
(10) గృహ, 
(11) అగ్రహార, 
(12) రధ, 
(13) గజ, 
(14) అశ్వ, 
(15) ఛాగ (మేక), 
(16) మహిషి (దున్నపోతు).

    అష్టాదశవర్ణనలు :-
""""""""""""""""""""""""""""
( 1 ) నగరం, 
( 2 ) సముద్రం, 
( 3 ) ఋతువు, 
( 4 ) చంద్రోదయం, 
( 5 ) అర్కోదయం, 
( 6 ) ఉద్యానము, 
( 7 ) సలిలక్రీడ, 
( 8 ) మధుపానం, 
( 9 ) రతోత్సవం, 
(10) విప్రలంభం, 
(11) వివాహం, 
(12) పుత్రోత్పత్తి, 
(13) మంత్రము,
(14) ద్యూతం,
(15) ప్రయాణం,
(16) నాయకాభ్యుదయం, 
(17) శైలము, 
(18) యుద్ధం.

    అష్టాదశ పురాణాలు :-
"""""""""""""""""""""""""""""""""
( 1 ) మార్కండేయ, 
( 2 ) మత్స్య, 
( 3 ) భవిష్య, 
( 4 ) భాగవత, 
( 5 ) బ్రహ్మ, 
( 6 ) బ్రహ్మవైవర్త, 
( 7 ) బ్రహ్మాండ, 
( 8 ) విష్ణు, 
( 9 ) వాయు, 
(10) వరాహ,
(11) వామన, 
(12) అగ్ని, 
(13) నారద, 
(14) పద్మ, 
(15) లింగ, 
(16) గరుడ, 
(17) కూర్మ, 
(18) స్కాంద.

   భారతంలోపర్వాలు :-
"""""""""""""""""""""""""""""""
( 1 ) ఆది, 
( 2 ) సభా, 
( 3 ) అరణ్య, 
( 4 ) విరాట, 
( 5 ) ఉద్యోగ, 
( 6 ) భీష్మ, 
( 7 ) ద్రోణ, 
( 8 ) కర్ణ, 
( 9 ) శల్య, 
(10) సౌప్తిక, 
(11) స్ర్తి, 
(12) శాంతి, 
(13) అనుశాసన, 
(14) అశ్వమేధ, 
(15) ఆశ్రమవాస, 
(16) మౌసల, 
(17) మహాప్రస్థాన, 
(18) స్వర్గారోహణ.

 సంస్కృతరామాయణంలోకాండలు :-
""""""""""""""""""""""""""""""""""""""""""""""""
( 1 ) బాల ,
( 2 ) అయోధ్య, 
( 3 ) అరణ్య, 
( 4 ) కిష్కింద, 
( 5 ) సుందర ,
( 6 ) యుద్ధ. 

{ తెలుగులో 7వకాండ ఉత్తర (లవకుశ కథ) }

  భాగవతంలో స్కంధాలు :-
"""""""""""""""""""""""""""""""""""
(*) రాముని వనవాసం 14సం.

(*) పాండవుల అరణ్యవాసం 12సం. 
      అజ్ఞాతవాసం 1సం.

 శంఖాలు :-
""""""""""""""
భీముడు      -  పౌండ్రము
విష్ణువు        -  పాంచజన్యం
అర్జునుడు    -  దేవదత్తం.

  విష్ణుమూర్తి  -  ఆయుధాలు  :-  
"""""""""""""""""""""""""""""""""""""""    
ధనస్సు   - శారంగం,
శంఖం     - పాంచజన్యం,
ఖడ్గం      - నందకం,
చక్రం       - సుదర్శనం.

  విల్లులు :-
"""""""""""""""
అర్జునుడు   -  గాంఢీవం
శివుడు        -  పినాకం
విష్ణువు        -  శారంగం

  వీణలు - పేర్లు :-
""""""""""""""""""""""
కచ్చపి     - సరస్వతి,
మహతి   - నారధుడు,
కళావతి   - తుంబురుడు.

అష్టదిక్కులు         పాలకులు         ఆయుధాలు 
-----------------     ------------------   ---------------------

తూర్పు                ఇంద్రుడు             వజ్రాయుధం 
పడమర               వరుణుడు          పాశం
ఉత్తర                  కుబేరుడు            ఖడ్గం
దక్షిణం                 యముడు           దండం
ఆగ్నేయం             అగ్ని                    శక్తి 
నైరుతి                 నిరృతి                 కుంతం 
వాయువ్యం          వాయువు           ధ్వజం 
ఈశాన్యం             ఈశానుడు          త్రిశూలం 

 మనువులు                   మన్వంతరాలు 
-------------------           -------------------------

స్వయంభువు       -     స్వారోచిష 
ఉత్తమ                 -    తామసి 
రైతవ                   -    చాక్షువ 
వైవస్వత              -    సవర్ణ 
దక్ష సువర్ణ            -    బ్రహ్మ సువర్ణ
ధర్మసవర్ణ             -    రుద్రసవర్ణ 
రౌచ్య                   -    బౌచ్య 

  సప్త స్వరాలు :-
""""""""""""""""""""""
 స   ~  షడ్జమం      -{ నెమలిక్రేంకారం    }
 రి   ~   రిషభం       -{ ఎద్దురంకె             }
 గ   ~   గాంధర్వం   -{ మేక అరుపు        }
 మ ~   మధ్యమ     -{ క్రౌంచపక్షికూత      }
 ప   ~   పంచమం   -{ కోయిలకూత        }
 ద   ~   దైవతం      -{ గుర్రం సకిలింత     }
 ని   ~   నిషాదం     -{ ఏనుగు ఘీంకారం }

  సప్త ద్వీపాలు :-
""""""""""""""""""""""
జంబూద్వీపం   - -   అగ్నీంద్రుడు 
ప్లక్షద్వీపం         - -    మేధాతిధి
శాల్మలీద్వీపం    - -   వప్రష్మంతుడు
కుశద్వీపం        - -    జ్యోతిష్యంతుడు
క్రౌంచద్వీపం      - -    ద్యుతిమంతుడు
శాకద్వీపం         - -    హవ్యుడు
పుష్కరద్వీపం    - -   సేవకుడు

 తెలుగు వారాలు :-
"""""""""""""""""""""""""
(1) ఆది, 
(2) సోమ, 
(3) మంగళ, 
(4) బుధ, 
(5) గురు, 
(6) శుక్ర, 
(7) శని.

  తెలుగు నెలలు :-
"""""""""""""""""""""""""
( 1 ) చైత్రం,
( 2 ) వైశాఖం,
( 3 ) జ్యేష్ఠం, 
( 4 ) ఆషాఢం, 
( 5 ) శ్రావణం, 
( 6 ) భాద్రపదం, 
( 7 ) ఆశ్వీయుజం, 
( 8 ) కార్తీకం, 
( 9 ) మార్గశిరం, 
(10) పుష్యం, 
(11) మాఘం, 
(12) ఫాల్గుణం.

  రాశులు :-
""""""""""""""
( 1 ) మేషం,
( 2 ) వృషభం, 
( 3 ) మిథునం, 
( 4 ) కర్కాటకం,
( 5 ) సింహం, 
( 6 ) కన్య, 
( 7 ) తుల, 
( 8 ) వృశ్చికం, 
( 9 ) ధనస్సు, 
(10) మకరం, 
(11) కుంభం, 
(12) మీనం.

  తిథులు :-
""""""""""""""""
( 1 ) పాఢ్యమి, 
( 2 ) విధియ, 
( 3 ) తదియ, 
( 4 ) చవితి,
( 5 ) పంచమి, 
( 6 ) షష్ఠి, 
( 7 ) సప్తమి, 
( 8 ) అష్టమి, 
( 9 ) నవమి, 
(10) దశమి, 
(11) ఏకాదశి, 
(12) ద్వాదశి, 
(13) త్రయోదశి, 
(14) చతుర్దశి, 
(15) అమావాస్య /పౌర్ణమి.

  నక్షత్రాలు :-
"""""""""""""""""
( 1 ) అశ్విని, 
( 2 ) భరణి, 
( 3 ) కృత్తిక, 
( 4 ) రోహిణి, 
( 5 ) మృగశిర, 
( 6 ) ఆరుద్ర, 
( 7 ) పునర్వసు, 
( 8 ) పుష్యమి, 
( 9 ) ఆశ్లేష, 
(10) మఖ, 
(11) పుబ్బ, 
(12) ఉత్తర, 
(13) హస్త, 
(14) చిత్త, 
(15) స్వాతి, 
(16) విశాఖ, 
(17) అనురాధ, 
(18) జ్యేష్ఠ, 
(19) మూల, 
(20) పూర్వాషాఢ, 
(21) ఉత్తరాషాఢ, 
(22) శ్రావణం, 
(23) ధనిష్ఠ, 
(24) శతభిషం, 
(25) పూర్వాబాద్ర, 
(26) ఉత్తరాబాద్ర, 
(27) రేవతి.

  తెలుగు సంవత్సరాల పేర్లు :-
""""""""""""""""""""""""""""""""""""""
( 1 ) ప్రభవ :-
1927, 1987, 2047, 2107

( 2 ) విభవ :- 
1928, 1988, 2048, 2108

( 3 ) శుక్ల :-
1929, 1989, 2049, 2109

( 4 ) ప్రమోదూత :-
1930, 1990, 2050, 2110

( 5 ) ప్రజోత్పత్తి :-
1931, 1991, 2051, 2111

( 6 ) అంగీరస :- 
1932, 1992, 2052, 2112

( 7 ) శ్రీముఖ :-
1933, 1993, 2053, 2113

( 8 )భావ. - 
1934, 1994, 2054, 2114

9యువ.  - 
1935, 1995, 2055, 2115

10.ధాత.  - 
1936, 1996, 2056, 2116

11.ఈశ్వర. - 
1937, 1997, 2057, 2117

12.బహుధాన్య.-
1938, 1998, 2058, 2118

13.ప్రమాది. - 
1939, 1999, 2059, 2119

14.విక్రమ. - 
1940, 2000, 2060, 2120

15.వృష.-
1941, 2001, 2061, 2121

16.చిత్రభాను. - 
1942, 2002, 2062, 2122

17.స్వభాను. - 
1943, 2003, 2063, 2123

18.తారణ. - 
1944, 2004, 2064, 2124

19.పార్థివ. - 
1945, 2005, 2065, 2125

20.వ్యయ.-
1946, 2006, 2066, 2126

21.సర్వజిత్తు. - 
1947, 2007, 2067, 2127

22.సర్వదారి. - 
1948, 2008, 2068, 2128

23.విరోధి. - 
1949, 2009, 2069, 2129

24.వికృతి. - 
1950, 2010, 2070, 2130

25.ఖర. 
1951, 2011, 2071, 2131

26.నందన.
1952, 2012, 2072, 2132

27 విజయ.
1953, 2013, 2073, 2133,

28.జయ. 
1954, 2014, 2074, 2134

29.మన్మద.
1955, 2015, 2075 , 2135

30.దుర్మిఖి. 
1956, 2016, 2076, 2136

31.హేవళంబి. 
1957, 2017, 2077, 2137

32.విళంబి. 
1958, 2018, 2078, 2138

33.వికారి.
1959, 2019, 2079, 2139

34.శార్వారి. 
1960, 2020, 2080, 2140

35.ప్లవ
1961, 2021, 2081, 2141

36.శుభకృత్. 
1962, 2022, 2082, 2142

37.శోభకృత్. 
1963, 2023, 2083, 2143

38. క్రోది.
1964, 2024, 2084, 2144, 

39.విశ్వావసు.
1965, 2025, 2085, 2145

40.పరాభవ.
1966, 2026, 2086, 2146

41.ప్లవంగ. 
1967, 2027, 2087, 2147

42.కీలక. 
1968, 2028, 2088, 2148

43.సౌమ్య. 
1969, 2029, 2089, 2149

44.సాధారణ . 
1970, 2030, 2090, 2150

45.విరోధికృత్. 
1971, 2031, 2091, 2151

46.పరీదావి. 
1972, 2032, 2092, 2152

47.ప్రమాది. 
1973, 2033, 2093, 2153

48.ఆనంద. 
1974, 2034, 2094, 2154

49.రాక్షస. 
1975, 2035, 2095, 2155

50.నల :-
1976, 2036, 2096, 2156, 

51.పింగళ                 
1977, 2037, 2097, 2157

52.కాళయుక్తి         
1978, 2038, 2098, 2158

53.సిద్ధార్ధి              
1979, 2039, 2099, 2159

54.రౌద్రి                 
1980, 2040, 2100, 2160

55.దుర్మతి              
1981, 2041, 2101, 2161

56.దుందుభి             
1982, 2042, 2102, 2162

57.రుదిరోద్గారి         
1983, 2043, 2103, 2163

58.రక్తాక్షి                 
1984, 2044, 2104, 2164

59.క్రోదన                  
1985, 2045, 2105, 2165

60.అక్షయ              
1986, 2046, 2106, 2166. 

కులవృత్తులు.
బ్రాహ్మణ,క్షత్రియ, వైశ్య, రజక, మంగలి, వడ్రంగి, కుమ్మరి, కమ్మరి, కంసాలి, సాలెలు, జాలరి, మేదరి, కర్షకుడు, చెప్పులుకట్టేవారు.

జానపద కళలు.
హరికథ, బుర్రకథ, ఒగ్గుకథ, తోలుబొమ్మలాట, బుడబుక్కలాట, కోలాటం, పులివేషం, యక్షగానం, వీధినాటకాలు, డప్పులనృత్యం, గంగిరెద్దులమేళం, కర్రసాము.

...............