Friday, October 20, 2023

రుద్రాక్షల విశేషాలు - సంపూర్ణ వివరణ - 2 .

రుద్రాక్షల విశేషాలు - సంపూర్ణ వివరణ - 2 .  

      రంగును బట్టి రుద్రాక్షలను మూడు రకాలుగా విభజించవచ్చు . రుద్రాక్షలు శ్వేత ,రక్తపీత , కృష్ణ వర్ణాలలో ఉంటాయి . అంటే తెలుపు , ఎరుపు , నలుపు రంగులలో ఉంటాయి . నిజానికి రుద్రాక్షల యొక్క రంగు అంత ఖచ్చితంగా నిర్ధారించడానికి వీలులేదు . నూటికి నూరుశాతం తెలుపు రుద్రాక్ష గాని లేదా మరో స్వచ్ఛమైన ఇంద్రధనస్సు రంగులలో ఏ ఒక్కదానికి చెందినది గాని ఉత్పత్తి అవుతున్న దాఖలాలు లేవు . 

     సాధారణంగా తెలుపు రుద్రాక్షలు అనేవి కాస్త జేగురు రంగు కలసినచో లేదా లేత పసుపు రంగులో ఉండేవో ఉంటాయి . ఈ రుద్రాక్షలు అరుదుగా ఉంటాయి .మనదేశములో మహారాష్ట్ర రాష్ట్రములో నాసిక్ పరిసర ప్రాంతాలలో ఈ రకం రుద్రాక్షలు లభ్యం అగును . పూర్తి ఎరుపు రంగు రుద్రాక్షలు కూడా సాధారణంగా తటస్థపడవు . రుద్రాక్ష పండు దశలో ఉండేటప్పుడు ఖచ్చితమైన ఎరుపు ఉండే అవకాశం ఉందిగాని ఎండి గట్టిబడిన తరువాత ఆ రంగు ఉండదు . సాధరణంగా ఎరుపు రుద్రాక్షలుగా పిలవబడేవి ఇటుక పొడి రంగులో ఉంటాయి . 

    స్వచ్చమైన నలుపు రంగు రుద్రాక్షలు కూడా ఎక్కడా లభించవు . మాములుగా ముదురు కాఫీ రంగు , ఎరుపు , నలుపుల మిశ్రమపు రంగులో ఉండే రుద్రాక్షలనే నలుపు రంగు రుద్రాక్షలు అంటూ ఉంటారు . ప్రపంచములో ఈ రంగు రుద్రాక్షలే ఎక్కువుగా లభిస్తాయి . 

   మొత్తానికి రుద్రాక్షల రంగు ఏదైనా వాటిలో పెద్ద పరిమాణంలో ఉన్నవి ధరించడం ఉత్తమ ఫలితాలు ఇస్తాయనడంలో సందేహం లేదు . ఇప్పుడు ఆధునిక కొలమానం ప్రకారం మూడు రకాల కొలతలు గురించి వివరిస్తాను . 

 * పెద్దరకం రుద్రాక్షలు - 

 2 నుండి 2 .5 సెంటీమీటర్లు . 
వీటిని ధాత్రిఫల ప్రమాణం అని పిలుస్తారు . 
 
 * మధ్యరకం రుద్రాక్షలు - 

 1 నుంచి 2 సెంటీమీటర్ల మధ్య . 
వీటిని బదరీఫల ప్రమాణం అని అంటారు. 

 * చిన్నరకం రుద్రాక్షలు - 

 1 సెంటీమీటరు కన్నా తక్కువ . 
వీటిని చణమాత్ర ప్రమాణం అంటారు . 

   తరవాతి పోస్టు నందు ముఖాలు ను బట్టి రుద్రాక్ష విభజన వాటి యందలి అద్భుత శక్తులు మరియు ఉపయోగాల గురించి సంపూర్ణంగా వివరిస్తాను . 

  

No comments:

Post a Comment