Thursday, October 5, 2023

వ్యాధుల నివారణలో విటమిన్ల ఉపయోగాలు -

వ్యాధుల నివారణలో విటమిన్ల ఉపయోగాలు - 1

  ప్రస్తుత సమాజంలో ప్రతి మనిషి ఏదో ఒక అనారోగ్యముతో ఇబ్బందిపడుతున్నారు . ఈ అనారోగ్యాలకు ముఖ్యకారణం సరైన ఆహారం తీసుకోకపోవడమే . మనం తీసుకునే ఆహారం పురుగుమందులతో కలిసి ఎప్పుడో విషంగా మారిపోయింది . ఇలాంటి విషపూరిత ఆహారం మరియు సరైన పోషకాలు లేని ఆహారం తీసుకోవడం లేదో అప్పుడే శరీరం రోగగ్రస్తం అయిపోతుంది . 

     మన శరీర ఆరోగ్యం అనేది విటమిన్ల పైన ఆధారపడి ఉంటుంది. విటమిన్ల లోపం ఏర్పడినప్పుడు ఆయా రోగాలు సంభవిస్తాయి. రోగగ్రస్తం అయిన శరీరము నందు రోగాన్ని పారదోలుటకు ఒక్క ఔషధం వాడటమే కాదు ఆ రోగం రావడానికి ఏ విటమిన్ తక్కువ అయ్యిందో గమనించి ఆ విటమిన్ కలిగిన ఆహారాన్ని లోపలికి తీసుకోవడం వలన ఆ జబ్బు నుంచి త్వరగా బయటపడవచ్చు . 

 ఈ విషయము గురించి రోగికి చికిత్స చేయు వైద్యుడికి సంపూర్ణ అవగాహన ఏర్పరుచుకోవాలి . 

   ఇప్పుడు ఆ విటమిన్ల లోపం వలన కలుగు సమస్యల గురించి మీకు వివరిస్తాను . వీటి గురించి నా గ్రంధాలలో సంపూర్ణ వివరణ ఇచ్చాను . 


 * విటమిన్ D - 

  సాధారణంగా మన శరీరం విటమిన్లను తయారుచేసుకోలేదు . వాటిని ఆహార రూపంలో బయట నుంచి లోపలికి తీసుకోవాలి . D విటమిన్ మన శరీరంలో తయారగును . దీన్ని మన శరీరం సూర్యరశ్మి నుంచి తయారుచేసుకుంటుంది . ఎముకలు బలంగా ఉండుటకు ఈ విటమిన్ అత్యంత ముఖ్యమైనది . రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది . రక్తనాళాలు బలంగా ఉండుటకు తోడ్పడును . ఇన్సులిన్ ఉత్పత్తి సవ్యముగా జరిగేలా చూస్తుంది . అలానే ఇన్సులిన్ శరీరం గ్రహించేలా చూస్తుంది . శరీరంలో కణవిభజన నియంత్రిస్తుంది ఫలితముగా క్యాన్సర్ రాకుండా కాపాడును . 

            విటమిన్ D లోపము వలన ప్రేగు క్యాన్సర్ , రొమ్ము క్యాన్సర్ , ప్రోస్టేట్ గ్రంధి క్యాన్సర్ , క్లోమ క్యాన్సర్ సంభవించును . ఉదయం 6 నుంచి 7 సమయములో వచ్చు సూర్యరశ్మిలో విటమిన్ D ఎక్కువుగా ఉండును. ఈ సమయములో సూర్యనమస్కారాలు చేయుట ఉత్తమం . D విటమిన్ లోపిస్తే పిల్లల ఎదుగుదల లోపిస్తుంది . 

    ఈ D విటమిన్ పాలు , గోధుమలు మరియు దేశీవాళీ ఆవునెయ్యిలో ఎక్కువుగా ఉండును . బాదంలో కూడా ఈ విటమిన్ లభ్యం అగును. మెగ్నీషియం కూడా ఉండును . ఈ మెగ్నీషియం లోపించిన తలవెంట్రుకలు ఊడును . 

    

No comments:

Post a Comment