Friday, October 20, 2023

రుద్రాక్షల విశేషాలు - సంపూర్ణ వివరణ .

రుద్రాక్షల విశేషాలు - సంపూర్ణ వివరణ . 

 ఈ రుద్రాక్షలు అనేవి పలు పరిమాణాల్లో లభ్యం అగును . వీటిని పరిమాణాన్ని బట్టి మూడు రకాలుగా వర్గీకరిస్తారు . అవి 

  1 - ధాత్ర ఫల ప్రమాణము . 

  2 - బదరి ఫల ప్రమాణము . 

  3 - చణ మాత్రము . 


    రుద్రాక్షలు పలు రంగులలో కూడా లభ్యం అగును . తెలుపు , ఎరుపు , నలుపు రంగులు ప్రధానం అయినవి . ఈ రుద్రాక్షలు పలు ముఖాలను కలిగి ఉంటాయి. ఏకముఖం నుండి ఇరవై ఒక్క ముఖాలు కలిగిన రుద్రాక్షలు కూడా ఉంటాయి . 

       రుద్రాక్షల గురించి వ్యాసమహర్షి తన గ్రంథాలలో వివరించారు. ఈయన వివరణ ప్రకారం ఈ రుద్రాక్షలు అన్ని రకాలు ఒకే ప్రదేశములో లభ్యం అయ్యేవి కావు . ఒక్కోరకం ఒక్కో ప్రదేశములో విరివిగా వ్యాపించి ఉండేవి . తెలుపు లేదా పసుపు రంగు కలిగిన రుద్రాక్షలు కేవలం పశ్చిమ తీరప్రాంత పర్వత సాణువుల్లో పెరిగే వృక్షాల నుండి లభ్యం అగును . ఏకముఖి రుద్రాక్షలు కేవలం నేపాల్ లో మాత్రమె ఉన్నాయి . దశముఖ రుద్రాక్షలు కేవలం మలేసియా దేశములో గల వృక్షాల నుంచే లభ్యం అగును . ఇరవైఒక్క ముఖాలు కలిగిన రుద్రాక్షలు బయట బజారులో అమ్ముతుంటారు . కాని అవి ఎక్కడ నుంచి లభ్యం అగునో , ఆ వృక్షాలు ఎక్కడ ఉన్నాయో ఎవరికీ తెలీదు . ఇలా వేరువేరు ప్రదేశాలలో లభ్యం అయ్యే రుద్రాక్షల గురించి వ్యాస మహర్షి తన గ్రంథాలలో రాయటం చాలా ఆసక్తి కలిగిస్తుంది . అంతేకాదు భూమి మీద లభ్యం అయ్యే ఏ ఫలానికి లేక కాయకు లేని "అయస్కాంత క్షేత్రం" ఈ రుద్రాక్షలకు ఉంది . 

    ప్రస్తుతం ఈ అయస్కాంత క్షేత్రాన్ని నిర్ధారించుట ద్వారానే రుద్రాక్ష అసలైనదో , నకిలీదో తేల్చి చెప్పే విధానం ఇప్పుడు విస్తృతంగా వాడుకలో ఉంది . అసలైన రుద్రాక్షను గనుక రెండు రాగినాణాల మధ్య ఉంచి పట్టుకుంటే అది స్వయం చలనంతో పరిభ్రమిస్తుంది . ఇలాంటివే మరికొన్ని అద్భుతమైన భౌతిక లక్షణాలు రుద్రాక్షలకు ఉన్నాయి .

     రుద్రాక్ష ధారణ వలన సుఖశాంతులు కలుగుతాయని , జ్ఞానం పెంపొందించునని , ఆధ్యాత్మిక వికాసం కలుగుతుందని , కుండలిని శక్తి పెరుగుతుందని , సకలసంపదలు లభిస్తాయని , ఆయురారోగ్యాలు వృద్ధిచెందుతాయని మన ప్రాచీన గ్రంథాలు ఉద్ఘోషిస్తున్నాయి . 

     తరవాతి పోస్టు నందు మరింత వివరణాత్మకంగా రుద్రాక్ష విశేషాలు వివరిస్తాను . 

         

No comments:

Post a Comment