Sunday, October 1, 2023

కొలెస్ట్రాల్ అన్నది ఒక రకపు కొవ్వుపదార్ధము👩🏻‍⚕️*

*👩🏻‍⚕️కొలెస్ట్రాల్ అన్నది ఒక రకపు కొవ్వుపదార్ధము👩🏻‍⚕️*



కొలెస్ట్రాల్ అన్నది ఒక రకపు కొవ్వుపదార్ధము , దీన్ని Lipids అంటారు . 
ఇది జంతు జీవనానికి ప్రధానమైనది . మన శరీరానికీ కొలెస్ట్రాల్ అవసరము . ప్రతి జీవకణం లోని పొరల నిర్మాణానికి , బైల్ సాల్ట్స్ , అన్ని హార్మోన్లు ముఖ్యముగా స్త్రీ-పురుష జననేంద్రియాల నిర్వహణ చేసే హార్మొన్లు , వాటి నిర్వహణకు ఇది అవసరము . గుండె జబ్బులకి ప్రధాన కారణము మన శరీరం లో పేరుకుపోతున్న కొలెస్ట్రాల్ . ఇది ఎంత రహస్యం గా పెరుగుతుందంటే చివరిదాకా మనకు తెలియదు . అందుకే మన గుడెను మనం రక్షించుకొవాలంటే కొలెస్ట్రాల్ ని పెరగనివ్వకుండా నియంత్రంచుకోవాలి . ఈ పెరిగిన కొలెస్ట్రాల్ గుండెనే కాదు ఇతర చోట్ల కూడా తన ప్రభావాని చూపుతుంది . అందుకే మంచి ఆహారపు అలవాట్ల తో , మంచి నడవడికతో దీన్ని మనము కంట్రోల్ చేసుకో్వచ్చును .


*ఉపయోగాలు :*

కొలెస్ట్రాల్‌ను చాలామంది మన శరీరానికి హాని కలిగించే పదార్థంగానే భావిస్తుంటారు. కానీ నిజానికిది మన శరీరానికి ఎంతో అవసరమైన ఒక రకం కొవ్వు పదార్థం అని తెలియదు.కొలెస్ట్రాల్‌(ఫ్యాట్స్ +ప్రోటీన్స్ ) అన్నది ఒక రకం కొవ్వు. ఇది నూనెలు, వృక్ష సంబంధ కొవ్వులో అసలు ఉండదు. వెన్నతీయని పాలు, గుడ్లు, మాంసాహారం వంటి జంతు సంబంధమైన ఆహారం నుంచి వస్తుంది. అయితే దీనికంటే కూడా ఎక్కువ భాగం మన శరీరమే లోపల లివర్‌లో తయారు చేసుకుంటుంది. శరీరంలో కొలెస్ట్రాల్‌ అవసరం చాలా ఎక్కువ. శరీరంలో కణాలన్నీ ఆరోగ్యంగా ఉండటానికీ, కీలకమైన హార్మోన్ల తయారీకీ, జీర్ణప్రక్రియకు అవసరమైన పైత్యరసం ఉత్పత్తి కావటానికీ.. 
A,D,E,K విటమిన్లు శరీరము గ్రహించుటకు , ఇలా ఎన్నో విధాలుగా కొలెస్ట్రాల్‌ ఉపయోగపడుతుంది. కాబట్టి మనం నేరుగా ఆహారం రూపంలో తీసుకున్నా, తీసుకోకున్నా శరీరమే దీన్ని తయారు చేసుకుంటూ ఉంటుంది. మనం బయటి నుంచి తీసుకునేది, లోపల తయారయ్యేది.. ఇలా ఏ రూపంలోనైనాగానీ రక్తంలో కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉండటం పెద్ద సమస్య! ఇదే అనర్థాలకు మూలం! కాబట్టి.. ఎవరైనా కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవాల్సిందే. కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్లు అనే కొవ్వులు నీటిలో కరిగేవి కాదు కాబట్టి రక్త ప్రవాహంలో తేలికగాకలవలేవు. అందుకే కొలెస్ట్రాల్‌ను మన లివర్‌.. ప్రోటీన్లతో జతచేసి.. Lipo-Proteins గా రక్తప్రవాహంలోకి పంపిస్తుంది.
కొలెస్టిరాల్ నిల్వలు ఎప్పుడు ప్రమాదకరము ?

టోటల్ కొలెస్టిరాల్ :
200 మి.గా% వరకు — మంచిది .
200 – 239 %–కొంతవరకు రిష్క్ ,
240 – కంటే ఎక్కువ % — హై రిష్క్ ,
LDL :
100 లోపు — మంచిది ,
100-129 — ఉండవచ్చును ,
130-159—కొంతవరకు రిష్క్ ,
160– అంతకంటె ఎక్కువ హై రిష్క్ ,
HDL : 50 మి.గ్రా% — మంచిది ,
50- 35 ——-కొద్దిక రిష్క్ ,
35 — తక్కువ – హై రిష్క్ …. ఈ స్టేజీ లో గుండె జబ్బులు వచ్చే అవకాశము ఎక్కువ .

❄️❄️❄️❄️❄️❄️❄️

No comments:

Post a Comment