Monday, January 20, 2025

కాకరకాయ ఉపయోగాలు -

కాకరకాయ ఉపయోగాలు - 

     కాకరకాయలో రెండు రకాలు కలవు. పెద్ద కాకర , పొట్టికాకర అని పిలుస్తారు . పెద్ద కాకర కాయలో రెండురకాలు కలవు. అవి ఆకుపచ్చ కాకర మరియు తెల్లకాకర కాయల రకం ఒకటి . 

           వంకాయలో తెల్ల కాకర కాయలు అపథ్యమై ఉండగా కాకర కాయల్లో తెల్లనివి అత్యంత శ్రేష్టమైనవి. కాకరకాయ స్వస్థకరం అయినది. రసాయనిక గుణం కలది. జీర్ణశక్తిని కలిగిస్తుంది. కాకరకాయలు పైత్యశాంతిని కలిగించును. ఎముకలలో మూలుగుకు బలాన్ని చేకూర్చే గుణం కలదు. 

                  కాకరకాయ గురించి ప్రసిద్ధ ఆయుర్వేద గ్రంధం "సర్వఔషధి గుణకల్పం " ఈవిధంగా వివరిస్తుంది. " కాకర కాయ కొంచం కాకచేయును .సర్వరోగాలను పోగొట్టును . నేత్రాలకు మేలు చేయును . లఘువుగా ఉండును. అగ్నిదీప్తిని ఇచ్చును " అని వివరణాత్మకంగా ఇచ్చెను . మరొక ప్రసిద్ద గ్రంథం " ధన్వంతరి నిఘంటువు " నందు కూడా కాకరకాయ విశేషగుణ ధర్మాల గురించి వివరణలు ఉన్నాయి . దానిలో కాకరకాయ శీతవీర్యం , తిక్తరసం కలిగి ఉండును. గట్టిపడిన మలాన్ని బేధించును. లఘువుగా ఉండి వాతాన్ని కలుగచేయకుండా ఉంటుంది. పెద్దకాకర కొంచం వేడిచేయును . రుచిని పుట్టించి సర్వరోగాలను పోగొడుతుంది . నేత్రాలకు మేలుచేయును . అగ్నిదీపనకరమై ఉండును. అని కాకర యొక్క విశేష గుణాల గురించి వివరించెను .  

               కుక్క , నక్క మొదలగు జంతువులు కరిచినప్పుడు పైకి కట్టడానికి , లోపలికి సేవించడానికి కాకర ఆకు , కాయ , పండు మంచి ఉపయోగకరములై ఉండును . కాకరకాయలు సాలెపురుగు విషాన్ని కూడా విరిచేస్తాయి. కాకర చేదుగా ఉండటం వలన రక్తశుద్ధి చేయును . కాకర కాయల కూర వీర్యస్తంభనమైనది. 

        చర్మవ్యాధులు ఉన్నవారు కాకరకాయను తరుచుగా వాడటం వలన రక్తశుద్ధిని కలుగచేయును . పొడుగు కాకరకాయలు అగ్నిదీప్తిని కలిగించును. లేత కాకరకాయల కూర త్రిదోషాలను హరించును . ముదురు కాయల కూర విరేచనకారి. పొట్టి కాకరకాయలు కూడా ఇంచుమించు ఇదే గుణాన్ని కలిగి ఉండును. కాని ఇవి మిక్కిలి చేదుగా ఉండును. ఆకలిని పుట్టిస్తాయి. 

                కాకరకాయలు ముక్కలుగా కోసి ఎండబెట్టి వరుగు చేసి నిలువచేసుకొంటారు . ఈ వరుగు నేతితో వేయించుకొని తింటే చిరుచేదుగా ఉండి త్రిదోషాలను పోగోట్టును కొన్ని ప్రాంతాలలో కాయలనే కాకుండా పండిన కాకరకాయలు ను కూడా కత్తిరించి వరుగు చేసి నిలువచేస్తారు . ఈ వరుగు కఫవాతాన్ని తగ్గించి పిత్తాన్ని పెంచును. జఠరాగ్ని పెంపొందింపచేయును . కాసను తగ్గించును. రుచిని పుట్టించును. 

             కాకరకాయలను శరీరం నందు వేడి కలిగినవారు వాడకుండా ఉంటే మంచిది . శరీర బలానికి మందు తీసుకునేవారు పెద్ద కాకరకాయతో చేసిన వంటకాలు వాడకూడదు. అలా వాడటం వలన బలం పెంచే మందు శరీరానికి పట్టదు. 

    కాకరకాయకు విరుగుడు వస్తువుల్లో ప్రధానం అయినది పులుసు . అందుకే కాకరపులుసు , పులుసుపచ్చడి దోషరహితం అయి ఉంటుంది. కాకరకాయ పులుసుతో పాటు నెయ్యి , ఆవాలు , దోసకాయ కూడా విరుగుడు వస్తువులు . 


  

క్షీరసాగరమధన సందర్భంలో మాంగళ్యవివరణ..

*🙏🛕🕉️సత్సంగం!!!* 

క్షీరసాగరమధన సందర్భంలో మాంగళ్యవివరణ...

🙏🌹“మ్రింగెడివాడు విభుండని మ్రింగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మ్రింగుమనే సర్వమంగళ మంగళసూత్రంబు నెంత మదినమ్మినదో !🙏🌹

🌿పరమశివుడు భయంకరమైన హాలాహలాన్ని త్రాగి కూడా చిరంజీవి గా ఉన్నడంటే అది ఆయన గొప్ప కాదట, అమ్మ పార్వతీ దేవి కంఠాన్న ఉన్న మాంగల్యాభరణం గొప్పదనమట.

🌹“మాంగల్యం తంతునానేనా
మమజీవన హేతునా !
కంఠే భద్నామి సుభగే
త్వం జీవ శరదాంశతం”🌹

🌸ఓ సుభగా ! నా జీవనానికి ఆధారమైన ఈ మంగళ సూత్రాన్ని నీ కంఠానికి కడుతున్నాను. నువ్వు దీనిని ధరించి నా జీవితాన్ని నిలుపుతావు. అటువంటి నువ్వు నూరేళ్ళు జీవించు, అంటే పుణ్యస్త్రీగా, ముత్తయిదువుగా సకల సౌభాగ్యాలతో జీవించు అని స్పష్టముగా తెలుస్తున్నది.

🌿పూర్వం భారతదేశంలో మాతృస్వామిక వ్యవస్థ విరాజిల్లినప్పుడు ఎటువంటి ఆచారాలు, కట్టుబాట్లు ఉండేవి కాదు. బలవంతుడిదే రాజ్యం అన్న రోజులవి.

🌸భారతావనిలో పిండారీలు, థగ్గులు వంటి కిరాత జాతులవారు వలస వచ్చారు. ఒక తెగకు చెందిన స్త్రీలను మరొక తెగకు చెందిన పురుషులు ఎత్తుకొనిపోయేవారు. 

🌿మహిళ మెడలో మంగళసూత్రం కనిపిస్తే చాలు ఏ హాని చేయకుండా విడిచిపెట్టేవారు. కిరాతకులు కూడా ఈ మంగళ సూత్రాన్ని గౌరవించారు. 

🌸అలా కోట్లాది మగువల మాన ప్రాణాలను కాపాడిందీ మంగళసూత్రం. అందుకే అప్పటినుండీ ఆడపిల్ల పుడితే బాల్యంలోనే పెళ్ళి చేసి మాంగల్యం వేసేవారు.

🌿ఆదిశంకరాచార్యుల వారు వ్రాసిన సౌందర్యలహరి పుస్తకములో కూడా మంగళ సూత్రానికి విశేష విశిష్టత కల్పించారు.

🌸మంగళసూత్రంలో ముత్యం, పగడం ధరింపజేసే సాంప్రదాయం మనది, ఎందుకంటే, ముత్యం చంద్రగ్రహానికి ప్రతీక. చంద్రుడు దేహ సౌఖ్యం, సౌందర్యం, మనస్సు, శాంతి, ఆనందములకు, అన్యోన్యదాంపత్యములకు కారకుడు, 

🌿శారీరకంగా నేత్రములు, క్రొవ్వు, గ్రంథులు, సిరలు, ధమనులు, స్తనములు, స్త్రీల గుహ్యావయములు, నరములు, ఇంద్రియములు, గర్భధారణ, ప్రసవములకు కారకుడు.

🌸పగడం కుజగ్రహనికి ప్రతీక. కుజగ్రహ దోషాల వలన అతికోపం, కలహాలు, మూర్ఖత్వం, సామర్ధ్యము, రోగము, ఋణపీడలు, అగ్ని, విద్యుత్భయములు, పరదూషణ, కామవాంఛలు, దీర్ఘసౌమాంగల్యము, దృష్టి దోషము యిత్యాదులు మరియు శారీకంగా ఉదరము, రక్తస్రావము, గర్భస్రావము, ఋతుదోషములు మొదలగునవి.

🌿ఖగోళంలో ముఖ్యమైన నక్షత్రాలు 27 ఆ 27 నక్షత్రాలలో చంద్రుడు 27 రోజులు సంచారంగావించి 28వ రోజున కుజునితో కలిసే రోజే స్త్రీకి ఋతుసమయం. అంటే అర్ధం, ఆరోగ్యమైన స్త్రీకి 28వ రోజులకు ఋతుదర్శనమవాలి. 

🌸భారతీయ సాంప్రదాయ స్త్రీలకు మంగళసూత్రములో ముత్యం మించిన విలువైనది లేనేలేదు, దానికి తోడు జాతిపగడం ధరించడం మన మహర్షులు చెప్పటంలో విశేష గూడార్ధమున్నది.

🌿అదేమిటంటే ముత్యం పగడం ధరించిన పాత తరం స్త్రీలలో ఆపరేషన్ అనేది చాలా అరుదైన విషయం. కాని నేటితరం స్త్రీలలో కానుపు ఆపరేషన్తోనే జరగటం సర్వ సాధారణమైపోయింది.

🌸ముత్యం, పగడం సూర్యుని నుండి వచ్చే కిరణాలలో ఉండే ఎరుపు (కుజుడు) తెలుపు (చంద్రుడు) స్వీకరించి స్త్రీ భాగంలోని అన్ని నాడీకేంద్రములను ఉత్తేజపరచి శరీరకంగా, భౌతికంగా ఆ జంట గ్రహాలు స్త్రీలలో వచ్చే నష్టాలను, దోషాలను తొలగిస్తాయనటంలో ఎటువంటి సందేహం వలదు.

🌿కనుక చంద్ర కుజుల కలయిక ప్రతి స్త్రీ జీవితంలో ఎంత ప్రాముఖ్యం వహిస్తాయో అలాగే ముత్యం, పగడం రెండూ కూడా కలిపిన మంగళసూత్రం స్త్రీకి అత్యంత శుభఫలితాలు సమకూర్చగలవు.

🌸పాశ్చాత్య అనుకరణ వెర్రిలో ఊగుతున్న మన ఆడ కూతుర్లను మందలించైనా తిరిగి మన ధర్మం వైపు తీసుకుని వద్దాం. దీని విశిష్టతని అర్ధం అయ్యే వరకు తెలియపరుద్దాం.

సైంటిస్ట్ లకు చుక్కలు చూపించిన దైవ లీలలు.*

*🕉️🛕సైంటిస్ట్ లకు చుక్కలు చూపించిన దైవ లీలలు.*

ఇండియా అంటేనే మిస్టరీలకు పెట్టింది పేరు. భారతదేశంలో ఎక్కడ చూసినా దేవాలయాలు దర్శనమిస్తూనే వుంటాయి. అయితే వీటిలో కొన్ని మిస్టరీతో మిళితమై ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అలాంటి మిస్టరీలు ఇప్పటివరకూ వీడనే లేదు. మన దేశంలో ఎన్నెన్నో మిస్టరీలున్న దేవాలయాలు చాలా వున్నాయి. ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత కలిగివుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

మొదటగా శని శింగనాపూర్ ని చూద్దాం.💐💐

మహారాష్ట్రలో ఒక గ్రామం. ఈ వూరిలోని ఏ ఒక్క ఇంటికి కూడా తలుపులుండవు. అయితే ఇక్కడ దొంగతనాలు జరిగిన సంఘటన ఒకటి కూడా లేవు. ఒకవేళ దొంగతనం చేస్తే అక్కడ వుండే శనిదేవుడు.. శని రూపంలో శిక్షిస్తాడని భక్తులనమ్మకం. మరో విశేషం ఏంటంటే డబ్బులు దాచిపెట్టే బ్యాంకులకు కూడా ఇక్కడ వారు తాళాలు వేయరు.

యాగంటి 💐

ఆంధ్రప్రదేశ్ లోఇది ప్రసిద్ధిచెందిన క్షేత్రం. ఇక్కడ వున్న నంది విగ్రహం మిస్టరీ ఇప్పటివరకూ వీడనేలేదు. మొదట్లో చిన్నగావున్న నంది విగ్రహం రానురాను పెరుగుతూవచ్చి ఆలయప్రాంగణాన్ని ఆక్రమించుకుందని స్థానికులు చెబుతూంటారు. దీనికి సైంటిస్టులు చెప్పే మాట ఏమిటంటే.. ఆ రాయి పెరిగే స్వభావ గుణాన్ని కలిగివుందని, అందుకే ప్రతి 20 ఏళ్ళకు ఒక ఇంచు చొప్పున పెరుగుతూ ఉంటుందని అంటుంటారు. అయితే భక్తులనమ్మకం మాత్రం అది కాదు. యుగాంతంలో ఆ నంది పైకి లేచి రంకె వేస్తుందని అక్కడి భక్తులందరూ నమ్ముతూవుంటారు..

లేపాక్షి💐

ఆంధ్రప్రదేశ్ లోని ఆనంతపురం జిల్లాలో లేపాక్షి వుంది. ఇక్కడ వున్న స్థంభాలు చాలా మిస్టరీగా మిగిలిపోయాయి. ఈ ఆలయాన్ని 16 వ శతాబ్దంలో నిర్మించారు. ఈ స్థంభం క్రింద పేపర్ కానీ, క్లాత్ కానీ ఈజీగా పట్టించేయోచ్చు. అంటే స్థంభానికి కింద ఫ్లోర్ గ్యాప్ ఉంటుందన్నమాట. స్థంభం క్రింద ఫ్లోర్ ఏ సపోర్ట్ లేకుండా ఆలయాన్ని మోస్తుందని అర్థం. స్థంభం నేలని తాకకుండా ఆలయాన్ని ఎలా మోస్తుందో, ఇంతవరకు ఎవ్వరూ చెప్పలేకపోయారు..

తంజావూరులో మిస్టరీ💐

తంజావూరులోని బృహదీశ్వరాలయం ఇప్పటికి ఒక మిస్టరీగానే వుంది. దీనిని రాజరాజచోళుడు 11 వ శతాబ్దంలో నిర్మించాడు. ఈ ఆలయంలో రహస్యం దాగి వుంది. ఈ ఆలయంలో దాగిన రహస్యం నీడ. ఈ ఆలయపు నీడలు ఎవరికి కనిపించవు. సంవత్సరం పొడుగునా ఏ రోజు చూసినా.. సాయంత్రంవేళ ఆ దేవాలయం నీడలు భూమి మీద పడకపోవడంతో ఇది ఎవరికీ అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయింది. అలాగే ఆ ఆలయానికుపయోగించిన గ్రానైట్ ను కూడా ఎక్కడ నుండి తీసుకోచ్చారనేది కూడా తెలియదు.

పూరీజగన్నాథ్ ఆలయం💐

పూరీజగన్నాథ్ ఆలయంలో నీడ ఎలాంటి సమయంలో కూడా కనిపించదు. అంతేకాదు పూరీక్షేత్రానికి సమీపంలో బంగాళాఖాతం సముద్రం వుంది. ఆ సముద్రపు శబ్దంకూడా ఈ ఆలయంలోకి వినిపించదు. ఆలయ సింహద్వారం వరకూ సముద్రఘోష వినిపిస్తుంది. అది దాటి లోపలికి వెళ్తే శబ్దం అనేదే వుండదు. మరి ఆ టెక్నాలజీ ఏంటో కూడా అంతుచిక్కలేదు..

షోలాపూర్💐

మహారాష్ట్రలోని షోలాపూర్ మనం రోజూ ఉపయోగించే బెడ్ షీట్ లకు పెట్టిందిపేరు. ఇక్కడ ఒక వింత గ్రామం వుంది పేరు షెత్పల్.. ఈ గ్రామంలో పాములకు పూజ చేయటం ఆనవాయితీ. ఈ గ్రామంలో ప్రతిఇంట్లో పాములకు కూడా ఒక గదివుంటుంది. ప్రతి ఇంట్లో మనుష్యులు తిరిగినట్టే పాములు కూడా తిరుగుతూవుంటాయి. కాని ఇంతవరకూ ఆ గ్రామంలో ఏ పాము ఎవరినీ కరిచినట్టు కంప్లైంట్స్ కూడా లేవు. ఏమైనా పాము తిరుగుతోంది.. అంటేనే భయమేస్తోంది కదూ..

అమ్రోహా💐

ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహా షర్ఫుద్దీన్ షావిలాయత్ కు ప్రసిద్ధిచెందింది. ఈ పుణ్యక్షేత్రం చుట్టూ కాపలాగా ఎవరుంటారో తెలుసా? తేళ్ళు!! అవును.. ఇక్కడ ఆలయంలోపల.. చుట్టూ తేళ్ళు తిరుగుతూనే వుంటాయి. ఒకటికాదు, రెండుకాదు వేలసంఖ్యలో. అయితే ఇవి అక్కడకు వచ్చే భక్తులను కుట్టవు. వారు వాటిని పట్టుకుంటారు కూడా.

తుార్ప గోదావరి జిల్లా లోని దివిలి గ్రామంలో తిరుపతి అనే ఉరు ఉంది అక్కడ వేంకటేశ్వర ఆలయం ఉంది అది ఎవరు ఎంత ఎత్తిలో ఉంటే అంతే ఎత్తి లో కనిపిస్తుంది

ఇలాంటి ఎన్నో మిస్టరీలు మనదేశంలో ఉన్నాయి. వీటి రహస్యాలు ఏంటి అన్నది మన శాస్త్రవేత్తలకు ఇంతవరకు అర్ధం కాలేదు. ఇప్పటికి అవి మిస్టరీగానే ఉండిపోయాయి.

దేవాలయ దర్శనంలో ఉన్న సాంకేతిక ఏమిటో తెలుసుకుందాం

*🙏🕉️మన దేవాలయ దర్శనంలో ఉన్న సాంకేతిక ఏమిటో తెలుసుకుందాం.🥀_*

_*1. మూలవిరాట్ :* భూమిలో ఎక్కడైయితే electronic & magnetic తరంగాలు కలుస్తాయో అక్కడ మూల విరాట్ ఉంటుంది. ప్రతిష్ఠించే ముందు రాగి రేకులను కాల్చి ఉంచుతారు. అవి ఈ తరంగాలకు catalyst గా పని చేస్తాయి._

_*2. ప్రదక్షిణ :* మనం గుడి చుట్టు clockwise direction లో తిరిగినపుడు ఆ తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది. గుడిలోనే దేవుడు వుంటాడా అనేది ఒక వాదన.. ఎక్కడైన వుంటాడు కాని ఈ దేవాలయ దర్శనం అందుకు పెట్టారు. పుణ్యక్షేత్రాలు vedic architecture మీద ఆధారపడి వుంటాయి. యివి మన శరీరం లోని షఠ్ చక్రాలను ప్రభావితం చేస్తాయి._

_*3. ఆభరణాలతో దర్శనం :* ఆడవారిని మగవారిని నగలు వేసుకుని గుడికి వెళ్ళమనేది మన సంపదను చూపించడానికి కాదు.. బంగారం వంటివి ఈ తరంగాలను బాగా గ్రహిస్తాయని..._

_*4. కొబ్బరి కాయ :* ఇది స్వచ్ఛతకు గుర్తు. పై టెంక మన అహంకారాన్ని.. దాన్ని పగలగొడితే వచ్చే కొబ్బరి మన కల్మషం లేని మనసును.. అవతలి వారి ప్రేమ కొబ్బరినీళ్ళు అంత తియ్యగా ఉంటాయి అనడానికి సంకేతం..._

_*5. మంత్రాలు :* ఉదాహరణకు మనం ఒక ఫోన్ నెంబర్ గుర్తుంచుకోవాలి అంటే 96.. 26.. అలా ఒక పధ్ధతిలో అమరుస్తాం.. అంటే మనకి తెలియకుండానే neurons ని ఆక్టివేట్ చేసి డేటా ని దాస్తున్నాం.. అదే విధంగా మంత్రోచ్ఛారణలు అక్షర నియమంతో ఒక లయను కల్గి neuron లను ఉత్తేజపరువస్తాయి._

_*6. గర్భగుడి :* గర్భగుడి ద్వారం ఒక వైపుకు ఉండటం వల్ల ఆ శక్తిని మన శరీరం గ్రహిస్తుంది. అందుకే మరీ ఎదురుగా కాక ఒక వైపుకు ఉండమంటారు._

_*7. అభిషేకం :* విగ్రహాలు పంచ లోహాలతో ఉంటాయి.. వాటికి పాలు తేనె వంటి వాటితో అభిషేకించినపుడు కింద ఉన్న తరంగాల శక్తితో ఔషధ గుణాన్ని సంతరించుకుంటాయి. అంతేగాని సినీ కటౌట్ లకు పాలాభిషేకాలు మూర్ఖత్వం._

_*8. హారతి :* పచ్చ కర్పూరానికి ఎన్నో ఔషధ గుణాలు.. హారతి తీసుకునేటపుడు ఆ వెచ్చదనాన్ని మన కంటికి తగిలేలా చేయాలి.. దీనికి ఆయుర్వేద పరిభాష లో స్వేదకర్మ అని పేరు. ఊరికే గాల్లో హారతి తీసుకుంటే చాలదు._

_*9. తీర్థం :* ఇందులో పచ్చ కర్పూరం.. తులసి.. లవంగాలు ఇలా ఎన్నో.. పంచామృతంతో అభిషేకం చేసినవి తీర్థం గా ఇస్తారు._

_*10. మడి :* తడిబట్టలకి ఆక్సిజన్ ని ఎక్కువగా తీసుకునే గుణం ఉంటుంది.. అందుకే మడి..!_
     🙏🕉️❤️🔯🛕🙏

Sunday, January 19, 2025

*ఆకులు పండ్లు కాయలు వాటి ఆరోగ్య విలువలు


 *ఆకులు పండ్లు కాయలు వాటి ఆరోగ్య విలువలు* 

🍐అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి.
🌿కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది.
🍒నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.
🍑గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.
🍇అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తరచుగా తింటే మలబద్దకం పోతుంది.
🍏జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి.
🍷బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది.
🍪సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే, పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.
🍋మామిడిపండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది.
🍓దానిమ్మరసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది.
🍲ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ది చెందుతుంది.
🍍అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. మలబద్దకాన్ని కూడా వదిలిస్తుంది.
🍈కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్ లు శిరోజాలకు మేలు చేస్తాయి.
🍃మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్ ని దరికి చేరనివ్వదు.
🍒ద్రాక్షలో అధికపాళ్ళలో ఉండే బోరాన్.. ఆస్టియో పొరాసిస్ రాకుండా కాపాడుతుంది.
🍠బీట్ రూట్ రసం ‘లో బీపీ ‘ సమస్య నుంచి గట్టేక్కిస్తుంది.
🍉క్యారెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
🌽మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషదం.
🍅ఉల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి.
🍑అనాసపళ్ళలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. వాపుల్ని తగ్గిస్తుంది.
🍐పుచ్చకాయలో ఉండే లైకొపీన్.. గుండె, చర్మ సంబందిత వ్యాధుల నుంచి కాపాడుతుంది.
🍊సపోటాపళ్ళు మలబద్దకాన్ని నివారిస్తాయి.
🍜దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంది.
🍲ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి.
🐬🐟చేపలు తింటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
🍊కమలాఫలాలు న్యుమోనియాకు చక్కని మందు.
🍉క్యారెట్లు నరాల బలహీనత నుండి కాపాడతాయి.
🍎యాపిల్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది.
🍵వాము దంత వ్యాధులను తగ్గిస్తుంది.
🍏పచ్చి జామకాయలో ఉండే టానిస్ మాలిక్, ఆక్సాలిన్ ఆమ్లాలు నోటి దుర్వాసనను పోగోడుతాయి.
☕ఉలవలు ఊభకాయాన్ని తగ్గిస్తాయి.
🍇ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి, మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది.
🍒ద్రాక్షలో ఉండే పైటోకెమికల్స్..b కొలెస్ట్రాల్ ని దరి చేరనివ్వవు.
🍏జామపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
🍎ప్రోస్త్రేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టొమాటోలకు ఉంది.
🍒నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి.
🍑మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు.
🌾మునగ కాయలు ఆకలిని పెంచుతాయి.

Saturday, January 18, 2025

నోక్టూరియా

*నోక్టూరియా!*

 నోక్టురియా అంటే రాత్రిపూట మూత్ర విసర్జన చేయడం గుండె వైఫల్యం యొక్క లక్షణం, మూత్రాశయం కాదు.
 శివపురిలోని ప్రముఖ వైద్యుడు డాక్టర్ బన్సాల్, నోక్టురియా వాస్తవానికి గుండె మరియు మెదడుకు రక్త ప్రసరణలో అడ్డుపడే లక్షణం అని వివరిస్తున్నారు. పెద్దలు, వృద్ధులు ఎక్కువగా రాత్రిపూట నిద్రలేచి మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. నిద్రకు భంగం వాటిల్లుతుందనే భయంతో పెద్దలు రాత్రి పడుకునే ముందు నీళ్లు తాగడానికి దూరంగా ఉంటారు. నీళ్లు తాగితే మూత్ర విసర్జనకు మళ్లీ మళ్లీ లేవాల్సి వస్తుందని అనుకుంటారు. పెద్దలు మరియు వృద్ధులలో తరచుగా తెల్లవారుజామున గుండెపోటు లేదా స్ట్రోక్‌లు రావడానికి పడుకునే ముందు లేదా రాత్రి మూత్ర విసర్జన తర్వాత నీరు త్రాగకపోవడం ఒక ముఖ్యమైన కారణం అని వారికి తెలియదు. నిజానికి, నోక్టురియా అంటే తరచుగా మూత్రవిసర్జన చేయడం అనేది మూత్రాశయం పనిచేయకపోవడం వల్ల వచ్చే సమస్య కాదు. వయస్సుతో పాటు వృద్ధులలో గుండె పనితీరు తగ్గిపోవడమే దీనికి కారణం, ఎందుకంటే గుండె శరీరం యొక్క దిగువ భాగం నుండి రక్తాన్ని పీల్చుకోలేకపోతుంది.
 అటువంటి పరిస్థితిలో, పగటిపూట మనం నిలబడి ఉన్న స్థితిలో, రక్త ప్రవాహం మరింత క్రిందికి ఉంటుంది. గుండె బలహీనంగా ఉంటే, గుండెలోని రక్తం తగినంతగా ఉండదు మరియు శరీరం యొక్క దిగువ భాగంలో ఒత్తిడి పెరుగుతుంది. అందుకే పెద్దలు మరియు వృద్ధులు పగటిపూట శరీరం యొక్క దిగువ భాగంలో వాపు పొందుతారు. వారు రాత్రి పడుకున్నప్పుడు, శరీరం యొక్క దిగువ భాగం ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతుంది మరియు తద్వారా చాలా నీరు కణజాలాలలో నిల్వ చేయబడుతుంది. ఈ నీరు తిరిగి రక్తంలోకి వస్తుంది. ఎక్కువ నీరు ఉంటే, నీటిని వేరు చేయడానికి మరియు మూత్రాశయం నుండి బయటకు నెట్టడానికి మూత్రపిండాలు చాలా కష్టపడాలి. నోక్టురియా యొక్క ప్రధాన కారణాలలో ఇది ఒకటి.
 కాబట్టి మీరు పడుకున్నప్పుడు మరియు మీరు మొదటిసారి టాయిలెట్‌కి వెళ్లడానికి సాధారణంగా మూడు లేదా నాలుగు గంటలు పడుతుంది. ఆ తర్వాత, రక్తంలో నీటి పరిమాణం మళ్లీ పెరగడం ప్రారంభించినప్పుడు, మూడు గంటల తర్వాత మళ్లీ టాయిలెట్కు వెళ్లాలి.
 మెదడు స్ట్రోక్ లేదా గుండెపోటుకు ఇది ఎందుకు ముఖ్యమైన కారణం అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది?
 రెండు మూడు సార్లు మూత్ర విసర్జన చేసిన తర్వాత రక్తంలో నీరు చాలా తక్కువగా ఉంటుందని సమాధానం. శ్వాస తీసుకోవడం వల్ల శరీరంలోని నీరు కూడా తగ్గిపోతుంది. దీనివల్ల రక్తం మందంగా మరియు జిగటగా మారుతుంది మరియు నిద్రలో హృదయ స్పందన మందగిస్తుంది. మందపాటి రక్తం మరియు నెమ్మదిగా రక్త ప్రసరణ కారణంగా, ఇరుకైన రక్తనాళాలు సులభంగా నిరోధించబడతాయి...
 పెద్దలు మరియు వృద్ధులు ఎల్లప్పుడూ ఉదయం 5-6 గంటల సమయంలో గుండెపోటు లేదా పక్షవాతంతో బాధపడుతున్నారని గుర్తించడానికి ఇదే కారణం. ఈ స్థితిలో వారు నిద్రలోనే చనిపోతారు.
 నోక్టురియా అనేది మూత్రాశయం పనిచేయకపోవడం కాదు, వృద్ధాప్య సమస్య అని అందరికీ చెప్పాల్సిన మొదటి విషయం.
 అందరికీ చెప్పాల్సిన మరో విషయం ఏమిటంటే పడుకునే ముందు గోరువెచ్చని నీళ్లు తాగాలి, రాత్రి మూత్ర విసర్జనకు లేచిన తర్వాత మళ్లీ తాగాలి.
 నోక్టురియాకు భయపడవద్దు. పుష్కలంగా నీరు త్రాగండి, ఎందుకంటే నీరు త్రాగకపోవడం మిమ్మల్ని చంపుతుంది.
 మూడవ విషయం ఏమిటంటే, గుండె యొక్క సామర్థ్యాన్ని పెంచడానికి, మీరు సాధారణ సమయంలో ఎక్కువ వ్యాయామం చేయాలి. మానవ శరీరం అతిగా వాడితే పాడైపోయే యంత్రం కాదు, దానికి విరుద్ధంగా, ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే అంత బలంగా ఉంటుంది. అనారోగ్యకరమైన ఆహారాన్ని, ముఖ్యంగా అధిక పిండి పదార్ధాలు మరియు వేయించిన ఆహారాన్ని తినవద్దు.
 ఈ కథనాన్ని మీ పెద్దలు మరియు వృద్ధులతో పంచుకోవాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను.
 సీనియర్ సిటిజన్లకు చాలా ముఖ్యం.
 ఇది ఆరోగ్య సమస్య గురించి.. *నోక్టూరియా* గురించి డా.బన్సల్ రాసిన ఆసక్తికరమైన మరియు సమాచార కథనం.

 ఇది ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్ల కోసం ఉద్దేశించినది కాబట్టి, దయచేసి దీనిని విస్మరించవద్దు. దీన్ని చదవండి మరియు అవసరమైన వ్యక్తులతో భాగస్వామ్యం చేయండి!

Friday, January 17, 2025

దేశవాళీ వరి వంగడాలు -* *ప్రయోజనాలు*

*దేశవాళీ వరి వంగడాలు -* *ప్రయోజనాలు* 

అంతర్జాల సేకరణ :
   *పులి రాజు 
     *పాలమూరు : 8309731976 ,9705307529

 ప్రకృతి ప్రసాదించిన కొన్ని దేశవాళీ వరి విత్తనాలు వాటి ప్రాముఖ్యత గురుంచి తెలుసుకుందాం 

 *దేశి వరి రకాలు వాటి* *ప్రాముఖ్యత.* 

 *రక్త శాలి:* 

ఈ రైసు ఎరుపు రంగులో ఉంటుంది.అత్యంత పోషక విలువలు,ఔషధ మూలికా విలువలు కలిగినది. ఆయుర్వేదలో వాతము పిత్తము కఫము నివారించును అని మరియు మూడు వేల సంవత్సరాల కన్నా ఎక్కువ కాలము నాటిది అని చెప్పబదినది. ఈ రైస్ను ఎర్రసాలి,చెన్నేల్లు,రక్తాసలి అని కూడా అంటారు. ఎరుపు రకాల్లోమోస్ట్ వ్యాల్యూబుల్ రైస్.

 *కర్పూకవుని:* 

ఈ రైసు నలుపు రంగులో ఉంటుంది.బరువు తగ్గుటకు అనువైన ఆహారముకొలెస్ట్రాల్ తగ్గుటకు, క్యాన్సర్ నివారణకు ఉపయోగపడుతుంది.ఈ రైస్ను యాంటీ ఏజింగ్ రైస్ అని కూడా అంటారు.

 *కుళ్లాకార్:* 

ఈ రైసు ఎరుపు రంగులో ఉంటుంది.గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది సాధారణ ప్రసవానికి తోడ్పడుతుంది మరియు పిల్లలకు జ్ఞాపకశక్తి ఎక్కువగా పెరుగుతుంది. ఈ రైస్లో మాంగనీసు,విటమిన్ బి6,కాల్షియం, ప్రోటీన్స్ ,కార్బోహైడ్రేట్స్ ,పొటాషియం ,ఫైబర్ అధికంగా ఉంటాయి. ప్రపంచములో అత్యంత ముఖ్యమైన మానవ ఆహార పంట బియ్యం.

 *పుంగార్:* 

ఈ రైసు ఎరుపు రంగులో ఉంటుంది. అధిక పోషకాలు,ప్రోటీన్స్ కలిగి ఉంటుంది మరియు ఆకలిని కూడా ప్రేరేపిస్తుంది,శరీరానికి బలాన్ని ఇస్తుంది. గర్భాధారణ సమయంలో తీసుకుంటే సుఖ ప్రసవానికి తోడ్పడుతుంది.ఇది100% మహిళలకు మంచిది.

 *మైసూర్ మల్లిగా:* 

ఈ రైసు తెలుపు రంగులో ఉంటుంది.ఎదిగే పిల్లలకు అవసరమైన అధిక పోషకాలు,ప్రోటీన్స్ లభించే గుణం కలిగి ఉంది. పిల్లలకు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.పిల్లలకు మోస్ట్ వ్యాల్యూబుల్ రైస్.

 *కుజిపాటలియా,* సన్నజాజులు, చింతలూరు సన్నాలు,సిద్ధ సన్నాలు: 

ఇవి తెలుపు,సన్న రకాలు.ఈ బియ్యంలో కొవ్వు రహిత మరియు సోడియం లేనివి.తక్కువ కేలరీలు కలిగి వుంటాయి,గ్లూకోజ్ పదార్థంలు తక్కువగా ఉంటాయి,రోగనిరోధకశక్తి పెరగడానికి తోడ్పడతాయి.


 *రత్నచోడి* 

ఈ బియ్యం తెలుపు,సన్నరకం అధిక పోషక విలువలు ఉన్నాయి. కండపుష్టికి మరియు శరీర సమతుల్యతకు ఉపయోగపడుతుంది. శరీరానికి బలాన్ని చేకూరుస్తుంది. పూర్వకాలంలో సైనికులకు ఆహారంగా వాడేవారు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.


 *బహురూపి,* 

గురుమట్టియా,వెదురు సన్నాలు: తెలుపు,లావు రకం ఈ బియ్యంలో అధిక పోషకాలు,పీచు పదార్థంలు కలిగి ఉంటాయి.కాల్షియం,ఐరన్,జింకు ఎక్కువగా ఉంటాయి.మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి తోడ్పడుతాయి.బహురూపి శ్రీకృష్ణదేవరాయల వారు కూడా తినేవారు.రోగనిరోధక శక్తి పెరగడానికి సహాయపడుతాయి.

 *నారాయణ కామిని:* 

ఈ రైసు తెలుపు, సన్న రకము .ఇందులో అధిక పోషకాలు, పీచుపదార్థాలు,కాల్షియం ఎక్కువగా ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి తోడ్పడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

 *ఘని:* 

ఈ రైసు తెలుపు,చిన్న గింజ రకం. అధిక పోషకాలు కాల్షియం ఐరన్ ఎక్కువ. శరీరానికి బలాన్ని చేకూరుస్తుంది.వర్షా కాలమునకు ఇది అనువైన విత్తనం.చేను పై గాలికి పడిపోదు.రోగనిరోధక శక్తి పెరుగుతుంది.


 *ఇంద్రాణి* 

 ఈ బియ్యం తెలుపు,సన్నరకం, సెంటెడ్ రకము. కాల్షియం,ఐరన్,D విటమిన్ ఎక్కువగా ఉంటుంది. పిల్లలు బాగా ఇష్టపడి తింటారు. పెద్దవాళ్లు కూడా తినవచ్చు. గుల్ల భారిన(బోలు)ఎముకలు దృఢముగా మారడానికి సహాయపడుతుంది,జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

 *ఇల్లపు సాంబ:* 

 ఈ రైసు తెలుపు, సన్నరకం,ఇది మైగ్రేన్ సమస్యలను,సైనస్ సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది.శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

 *చిట్టి ముత్యాలు:* 

 ఈ రైసు తెలుపు,చిన్న గింజ రకం,కొంచెం సువాసన కలిగి ఉంటుంది. ప్రసాదంలకు,పులిహారమునకు,బిర్యానీలకు చాలా బాగుంటుంది. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

 *దేశీ బాసుమతి:* 

ఈ రైసు తెలుపు,పొడవు రకము,సువాసన కలిగి ఉంటుంది. ఇది బిర్యానీలకు అనుకూలంగా ఉంటుంది.

 *కాలాజీరా:* 

ఈ రైస్ తెలుపు రంగులో ఉంటుంది.ఇది సువాసన కలిగిన బేబీ బాస్మతి రైస్.ఇది బిర్యానీలకు చాలా అనుకూలంగా ఉంటుంది.

 *పరిమళ సన్నము* 

,రాంజీరా,రధునీ పాగల్,గంధసాలె,తులసీబాసో,బాస్ బోగ్, కామిని బొగ్: ఇవన్నీ తెలుపు రకము. సుగంధభరితమైన బియ్యం.ఇవి ప్రసాదంలకు, పులిహారములకు,పాయసములకు చాలా బాగుంటాయి.రోగనిరోధకశక్తిని పెంపొందిస్తాయి.

 *దూదేశ్వర్,అంబేమెహర్* 

(scented వెరైటీ ): ఈ రైసు తెలుపు,బాలింతల స్త్రీలకు పాలు పెరగడానికి తోడ్పడుతాయి.తద్వారా పిల్లలకు రోగనిరోధక శక్తి పెరుగుతుంది.తల్లి పిల్లలకు అధిక పోషకాలు అందుతాయి,తద్వారా ఆరోగ్యంగా ఉంటారు.

 *కుంకుమసాలి:* 

ఈ రైసు తెలుపు,రక్త ప్రసరణ మెరుగుపరచడానికి, మలినాలను శుభ్రం చేయడానికి ఉపయోగపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

 *చికిలాకోయిలా:* 

ఈ రైసు తెలుపు,సన్న రకము, దీని వల్ల లాభం కిడ్నీలో రాళ్లు, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నవారు,డైలీ కిడ్నీ డయాలసిస్ వారికి చాలా ఉపయోగంగా ఉంటుంది.కిడ్నీకి సంబంధించిన సమస్యల నుండి ఇబ్బంది పడకుండా సహాయపడుతుంది.

 *మడమురంగి* 

 ఈ రైసు ఎరుపు,లావు రకము.ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్,ఐరన్, జింక్,కాల్షియం ఉంటాయి.వర్షాకాలంలో అడుగు పైన ముంపును కూడ తట్టుకునే రకము. మంచి దిగుబడిని కూడా ఇస్తుంది.ఇది తీర ప్రాంతాల్లో ఎక్కువగా పండిస్తారు.

 *కెంపు సన్నాలు:* 

ఈ రైసు ఎరుపు, సన్నరకం,ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, కార్బోహైడ్రేట్స్,కాల్షియం,జింక్,ఐరన్,అధిక పోషకాలు ఉంటాయి,రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

 *కాలాబట్టి* 

,కాలాబట్,,బర్మా బ్లాక్,మణిపూర్ బ్లాక్: ఇవి నలుపు రంగులో ఉంటాయి.ఇవి అధిక యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ కలిగినవి. ఈ రైస్ వలన కలిగే లాభాలు,క్యాన్సర్ మరియు డయాబెటిస్, గుండె జబ్బుల వంటి అనారోగ్యాల బారిన నుండి రక్షణ కల్పిస్తుంది.ఎల్.డి.ఎల్ కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది.ఈ బియ్యంలో విటమిన్ బి,ఇ,నియాసిన్,కాల్షియం,మెగ్నీషియం,ఐరన్, జింకు వంటి ఖనిజ విలువలు,పీచు పదార్ధాలు అధికము.ఈ బియ్యంలో ఆంకోసైనిన్స్, యాంటీ ఆక్సిడెంట్లుగా పని చేయడమే గాక రోగనిరోధక ఎంజైములను క్రియాశీలకము చేస్తుంది. మోస్ట్ వ్యాల్యూబుల్ రైస్.

 *పంచరత్న:* 

ఈ రైసు ఎరుపు రంగులో ఉంటుంది,ఇది వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ కలిగి ఉంటుంది.అమైనో ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి.ఇది కూడా వండర్పుల్ రైస్.

 *మా పిళ్లేసాంబ:* 

ఈ రైసు ఎర్రగా ఉంటుంది.గర్భాధారణ సమస్యలతో బాధపడుతున్న దంపతులకు చాలా ఉపయోగం.రోజు ఇరువురు కనీసం 5నుండి6 నెలల వరకు తిన్నచో గర్భాధారణ జరుగును. ఇది ప్రాక్టికల్గా నిరూపించబడినది.దీనివలన కండ పుష్టి, దాతు పుష్టి ,వీర్య పుష్టి కలుగును. ఇమ్యూనిటీపవర్ కూడా పెరుగును.


 *నవార* 

ఈ బియ్యం ఎరుపు రంగులో ఉంటుంది. ఇది కేరళ సాంప్రదాయ ఆయుర్వేద ఔషధం.ఈ విత్తనం త్రేతాయుగము నాటిది. షుగర్ వ్యాధి గ్రస్తులకు షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి ఔషధంలా పనిచేస్తుంది. మరియు మోకాళ్ళు,మోచేతి కీళ్ళ నొప్పులు,నరాల బలహీనత తగ్గడానికి తోడ్పడుతుంది.కేరళ ఆయుర్వేదంలో ఈ బియ్యంను వండి బాడీ మసాజ్ లో వాడుతారు పక్షపాతం ఉన్నవారికి. ఈ బియ్యాన్ని ఇండియన్ వయాగ్రా రైస్ అని కూడా అంటారు. ఇది అన్ని వయసుల వారూ తినవచ్చును.ఒక పూట మాత్రమే తినవలెను. ఈ రైస్ యొక్క ప్రత్యేకత బియ్యం నుండి కూడా మొలకలు వచ్చును. ఇది వండర్ఫుల్ రైస్.

 *రాజముడి:* 

ఈ రైస్ తెలుపు ఎరుపు కలిగి ఉంటుంది.దీనిని ప్రాచీన కాలంలో మైసూర్ మహారాజుల కోసం ప్రత్యేకముగా పండించిన బియ్యముల్లో ఇది ఒకటి.దీనికి ప్రత్యేకస్థానం ఉంది.ఈ రైస్లో డైటరీ ఫైబర్,యాంటీ ఆక్సిడెంట్స్ ,జింక్,ఐరన్ అధికంగా ఉంటాయి. అందువలన శరీరాన్ని ఇన్ఫెక్షన్లు మరియు ప్రీరాడికల్స్ నుండి నిరోధిస్తుంది.శరీరము అశ్వస్థత నుండి కోలుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. చర్మం యొక్క ఆకృతిని పెంచడానికి సహాయపడుతుంది.రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది

అశోక చక్రవర్తి

మన దేశంలో " *అశోక చక్రవర్తి* " *జయంతి* ఎందుకు జరుపుకోరు??

ఎంత ఆలోచించినా "సమాధానం" దొరకలేదు కదా! 
మీరు ఈ " *చారిత్రక విషయాలను* " కూడా పరికించండి!🤔🤔🤔 

# అశోక చక్రవర్తి తండ్రి పేరు - *బిందుసార గుప్త,* తల్లి పేరు - *సుభద్రణి* ప్రపంచవ్యాప్తంగా ఉన్న చరిత్రకారులు "గొప్ప చక్రవర్తి" అని పిలుచుకునే " *అశోక చక్రవర్తి* " యొక్క రాజ చిహ్నం 
" *అశోక చక్రం* " ను భారతీయులు తమ జెండాలో ఉంచారు. 

# "చక్రవర్తి" రాజ చిహ్నం " *చార్ముఖి సింహం* "ను భారతీయులు *"జాతీయ చిహ్నం"* గా పరిగణిస్తారు మరియు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు మరియు *"సత్యమేవ జయతే"* ని స్వీకరించారు.

 # అశోక చక్రవర్తి పేరు మీద ఉన్న సైన్యం యొక్క అత్యున్నత యుద్ధ గౌరవం *"అశోక చక్రం".* ఇంతకు ముందు లేదా తర్వాత ఇలాంటి రాజు లేదా చక్రవర్తి లేరు"... 

# *"అఖండ భారత్"* (నేపాల్, బంగ్లాదేశ్, మొత్తం భారతదేశం, పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్) యొక్క విస్తారమైన భూభాగాన్ని ఒంటరిగా పాలించిన చక్రవర్తి. 

# అశోక చక్రవర్తి కాలంలో "23విశ్వవిద్యాలయాలు"స్థాపించబడ్డాయి.ఇందులో *తక్షశిల, నలంద, విక్రమశిల, కాందహార్* మొదలైనవి ప్రముఖమైనవి.
ప్రపంచనలుమూలల నుంచి విద్యనభ్యసించడానికిఇక్కడికి వచ్చేవారు. 

# "చక్రవర్తి" పాలనను ప్రపంచంలోని మేధావులు మరియు చరిత్రకారులు భారతీయ చరిత్రలో అత్యంత " *స్వర్ణయుగ కాలం* "గా పరిగణిస్తారు. 

# "అశోకచక్రవర్తి" యొక్క పాలనలో భారతదేశం *"విశ్వ గురువు".* గా భాసిల్లింది
భారతదేశం " *బంగారు పక్షియై* " పరిఢవిల్లింది. ప్రజలందరూ సంతోషంగా మరియు వివక్ష లేకుండా ఉన్నారు. 

# వీరి హయాంలో అత్యంత ప్రసిద్ధ హైవే " *గ్రేడ్ ట్రంక్ రోడ్* " వంటి అనేక హైవేలునిర్మించబడ్డాయి. 

# *2,000 కిలోమీటర్ల* మేర మొత్తం "రోడ్డు"కి ఇరువైపులా చెట్లు నాటబడ్డాయి. "సరస్సులు" నిర్మించబడ్డాయి. 

# జంతువుల కోసం కూడా తొలిసారిగా " *వైద్యగృహాలు* " (ఆసుపత్రులు) ప్రారంభించ బడ్డాయి.చంపడం ఆగిపోయింది. 

# అలాంటి " *గొప్ప చక్రవర్తి అశోకుని* " జన్మదినాన్ని తన దేశమైన భారతదేశంలో ఎందుకు జరుపు కోలేదు?? 

లేదా ......
*సెలవు దినంగా ఎందుకు ప్రకటించలేదు?* 

ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవాల్సిన *పౌరులు* తమ చరిత్రను మరచిపోవడం బాధాకరం, 
తెలిసిన వారు ఎందుకు జరుపుకోకూడదో తెలియడం లేదు??

# *గెలిచినవాడు చంద్రగుప్తుడు* అని కాకుండా 
*"గెలిచినవాడు అలెగ్జాండర్"* ఎలా అయ్యాడు?? 

*చంద్రగుప్త మౌర్యుని ప్రతాపం చూసి* అలెగ్జాండర్ సైన్యం యుద్ధానికి నిరాకరించిందని అందరికీ తెలుసు. 
చాలా ఘోరంగా వారి నైతికత దెబ్బతింది మరియు 
అలెగ్జాండర్ 
" *వెనుదిరగవలసి వచ్చింది* ".

# ఈ " *చారిత్రక తప్పిదాన్ని* " సరిదిద్దడానికి మనమందరం కలిసి ప్రతిజ్ఞ చేద్దాం.🙏 

ఈ చారిత్రక నిజాల్ని కనీసం *ఐదు* గ్రూపుల కన్నా పంపుదాం🙏
 
# *కొందరు పంపరు*... 
అయితే మీరు తప్పకుండా పంపుతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్న👍🏻

*వర్ధిల్లాలి భారతి యశస్సు*

ఆత్మలన్నీ ఈ ఏడు ఆత్మ

విశ్వంలో ఉన్న కోటానుకోట్ల ఆత్మలన్నీ ఈ ఏడు ఆత్మ స్థాయిలలో ఏదో ఒక దానికి చెంది ఉంటాయి.

*1. శైశవ ఆత్మ (అజ్ఞాని):-*
 దేవుడు ఉన్నాడా? ఉంటే చూపించు? 'ఆధారాన్ని' చూపించు అనేవాడు.

*2. బాల ఆత్మ (విపరీత జ్ఞాని):-*
 మేము చెప్పేదే కరెక్ట్.,
 అని వితండవాదం చేసేవారు.

*3. యువ ఆత్మ (ప్రాపంచిక జ్ఞాని):-*
 పైకి అన్నీ చెప్తాడు. కానీ ఆచరించడు.

*4. ప్రౌఢ ఆత్మ (వేదాంతి):-*
'అంతా దైవమే, అంతా మాయే, మనం నిమిత్తమాత్రులం' అనేవాడు.

*5. వృద్ధ ఆత్మ (యోగి):-*
ధ్యానం చేస్తూ, దివ్య దృష్టిని ఉత్తేజింప చేసుకున్నవాడు. కానీ దివ్య దృష్టి మాత్రం 'మనసు చేసే ట్రిక్స్' అని అనుకునేవాడు.

*6. విముక్త ఆత్మ (ఋషి/రాజర్షి):-*
ఎంత మాత్రం మాట్లాడకూడదు, సాధన చేయాలి అనే వాడు.
 సాధన చేస్తూ దగ్గర వచ్చే వాళ్లకు ధ్యానం చేయండి అని చెప్తాడు.

*7. పరిపూర్ణ ఆత్మ (బ్రహ్మర్షి):-*
అన్ని చోట్లకు తిరుగుతూ, "ప్రతిఫలాపేక్ష" లేకుండా ఆత్మజ్ఞానాన్ని అందించేవారు.

ఎవరైతే బ్రహ్మర్షి స్థితిలో ఉంటారో-- వారు జనన మరణ చక్రమును దాటుతారు. వారికి మరల జన్మ తీసుకునే అవసరం ఉండదు.

Tuesday, January 14, 2025

_*శ్రీ గోదా కళ్యాణము*

జై వాసవి ! జై జై వాసవి !!
            శుభ సోమవారం 
     భోగి పండుగ శుభాకాంక్షలు

_*శ్రీ గోదా కళ్యాణము*


భోగిపండగనాడే శ్రీ గోదారంగనాథుల కళ్యాణము జరుపటం ఆనవాయితీగా వస్తున్న ఆచారము. ధనుర్మాసం నెలరోజులూ వ్రతంలో భాగముగా అమ్మ అనుగ్రహించిన *“ తిరుప్పావై ”* ని అనుసంధించి ఆఖరున కల్యాణంతో ముగించి , శ్రీ గోదారంగనాథుల కృపకు పాత్రులుకావటం మనందరకూ అత్యంత ఆవశ్యకం. శ్రీ విల్లి పుత్తూరంలో వేంచేసియున్న వటపత్ర శాయికి తులసీ దమనకాది పాత్రలను వివిధ రకాల పుష్పాలను మాలాలుగా కూర్చి స్వామికి సమర్పిస్తున్న శ్రీవిష్ణుచిత్తులకు శ్రీ భూదేవి అంశమున లభించిన గోదాదేవి దినదిన ప్రవర్డమానముగా పెరుగుతూ తండ్రియొక్క భక్తి జ్ఞాన తత్సార్యాలకు వారసురాలైనది. తండ్రిచే కూర్చబడిన తోమాలలను ముందుగా తానే ధరించి *“స్వామికి తానెంతయు తగుదును”* అని తన సౌందర్యమును నీటి బావిలో చూసుకుని మరల అ మాలలను బుట్టలో పెడుతూ ఉండేడిది. ఇది గమనించిన విష్ణుచిత్తులు ఆమెను మందలించి స్వామికి ఇట్టిమాలలు కైంకర్యము చేయుట అపరాధమని తలచి మానివేసిరి. శ్రీస్వామి విష్ణుచిత్తులకు , స్వప్నమున సాక్షాత్కరించి ఆమె ధరించిన మాలలే మాకత్యంతప్రీతి - అవియే మాకు సమర్పింపుడు అని ఆజ్ఞ చేసిరి. ఈమె సామాన్య మనవకాంత కాదనియు తన్నుద్దరించుటకు ఉద్భవించిన యే దేవకాంతయో భూదేవియో అని తలుస్తూ స్వామి ఆజ్ఞ మేరకు మాలా కైంకర్యమును చేయసాగిరి.

యుక్త వయస్సు రాలైన గోదాదేవిని చూసిన విష్ణు చిత్తులు ఆమెకు వివాహము చేయనెంచి అమ్మా ! నీకు పెండ్లీడు వచ్చినది నీ వేవరిని వరింతువో చెప్పుము నీ కోరిక మేరకే వివాహము చేతును అనిరి. తండ్రి మాటలు వినిన గోదాదేవి లఙ్ఞావదనయై తమరు సర్వజ్ఞులు తమకు తెలియనిదేమున్నది అపురుషోత్తముని తప్ప నేనింకెవరినీ వరింపను ఇతరుల గూర్చి యోచింపను అని తన మనోభీష్టాన్ని తెలియజేసెను. అప్పుడు విష్ణుచిత్తులు *“కొమడల్”* అను లోకప్రసిద్ద గ్రంధము ననుసరించి ఆ వటపత్రశాయి వైభవముతో ప్రారంభించింది నూట ఎనిమిది దివ్య తిరుపతిలలో అర్చామూర్తులైయున్న పెరుమాళ్ళ వైభవాతిశయయులను వర్ణింపసాగిరి అ క్రమములో చివరకు *“అజికియ మనవాళన్ అను శ్రీరంగనాథుల రూపరేఖా విలాసములను వర్ణింపగనే “జితాస్మి”* అని , ఆమె హృదయమందంతటను అరంగనాథుని దివ్య మంగళ స్వరూపమే నింపి యుంచుకొనినదై గగుర్పాటు పొందుచుండెను. ఆ స్థితిని గమనించిన విష్ణుచిత్తులు *“అదెట్లు సాధ్యము”* అని చింతాక్రాంతులై నిదురింప -- ఆ శ్రీరంగనాధులు స్వప్నమున శాక్షాత్కరించి నీ పుత్రిక భూజిత గోదను మాకు సమర్పింపుడు ఆమెను పాణిగ్రహణము చేసికొందును. వివాహ మహొత్సావానికి నా అజ్ఞమేరకు తగిన సామగ్రులు తీసుకుని పాండ్యమహారాజు ఛత్రధ్వజ చామరాదులతో మరియు రత్నాదులచే అలంకరించబడిన దంతపు పల్లకిలో మిమ్ముల స్వాగతించెదడు అని పలుకగా -- విష్ణుచిత్తులు మేల్కోంచి అత్యంత ఆనందోత్సాహములతో తనజన్మ సార్ధకమైనదని పొంగి పోవుచూ _ సకల మంగళ వాయిద్యములు మ్రోగుచుండగా గోదాదేవిని శ్రీ రంగమునకు తోడ్కొని పోయిరి. అచట సమస్త జనులున్నా పాండ్యమహీభూపాలుడున్నా విష్ణు చిత్తులను _ ఆ సన్నివేశము దర్శించి ధనుల్వైరి.

ఇట్లు అండాళ్ తల్లి తాను చేసిన ధనుర్మాస వ్రత కారణమున పరమాత్మను తానుపొంది మనలను ఉద్దరించుటకు మార్గదర్శినియై నిలచినది. శ్రీరంగనాధుడు , స్వయముగా అమెనే వరించి _ పాణిగ్రహణము చేసినాడు దీనినే మనము భోగిపండుగనాడు భోగ్యముగా జరుపుకొనుచున్నాము. శ్రీ గోదా రంగనాథుల కళ్యాణము చూచినను చేయించినను , ఈ కథ వినినను __చదివిననూ సకల శుభములు చేకూరుననుటలో సందేహములేదు. గోదారంగనాథుల వారి కల్యాణి గీతాన్ని నిత్యమూ అలపిద్దాం లోకకల్యాణానికి పాటు పడదాం.

*కల్యాణ గీతిక*

*(కాంభోజ రాగము _ త్రిపుట తాళము )* 

ప .. _ శ్రీ గోదారంగనాధుల కళ్యాణము గనరే

అ..ప.. _ శ్రీ కల్యాణముగని _ శ్రీల భిల్లరే!

చ.. _ ఆకాశమే విరిసి _ పందిరి యైనది భూదేవియే మురిసి __ అరుగు వేసినది

అష్టదిక్కులు మెరసి _ దివిటీలు నిలిపినవి అష్టైశ్వర్యములు తరలి __ నిలువెల్ల కురిసినవి….

చ … విష్ణు చిత్తుని కన్య విష్ణువునే వలచినది నిష్టతో మార్గళి వ్రతము చేసినది ఇష్టసఖులను మేల్కోల్పి _ వెంటగోన్నది జిష్ణుని హితకరు కృష్ణుని చేబట్టినది

చ …. జీవాత్మయే పరమాత్మకు అంశమ్మని చాటినది శేషి శేషభూతులు పరమార్ధము తెలిపినది దివ్య మంగళ విగ్రహ సాయుజ్యము నరశినది దివ్య ద్వయ మంత్రార్ధంబిలను --స్థాపించినది

చ … శ్రీ గోదా రంగనాథుల కల్యాణ గుణ విభవము శ్రీ ద్వయ మంత్ర రత్నమ్మున కన్వీయ మీజగము ఇదిగనిన అనుసందీంచిన శుభప్రదము మదినిపాడరె _ రంగనాథుని గీతము జయము జయము

*అండాళ్ దివ్య తిరుగడిగళే శరణమ్*


ఆండాళ్ లేదా గోదాదేవి , శ్రీ విష్ణుచిత్తులకు పూలతోటలో లభించిన కుమార్తె. ఈమెను విష్ణుచిత్తుల దంపతులు చాలా అల్లారుముద్దుగా పెంచుకున్నారు. యుక్త వయస్సులో వచ్చిన తరువాత గోదా దేవి , శ్రీవారు అయిన రంగనాథుడినే తన పతిగా పొందాలని తలచినది.

 

బోగి విశేషాలు

#సనాతన_హిందూ_బంధువులకు
#బోగి_పండగ_శుభాకాంక్షలు.

#బోగి 
భోగి లేదా భోగి పండుగ అనేది ఒక ముఖ్యమైన పండుగ. తెలుగు రాష్ట్రాల ప్రజలు పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటిరోజును భోగి అంటారు. భోగి పండుగ సాధారణంగా జనవరి 13 లేదా జనవరి 14 తేదిలలో వస్తుంది. దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరమవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవుట వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగ భగ మండే చలి మంటలు వేసుకునేవారు, ఉత్తరాయణం ముందురోజుకి చలి విపరీతంగా పెరగడం ఈ చలిని తట్టుకునేందుకు భగ భగ మండే మంటలు అందరు వేయటం వలన ఈ రోజుకు భోగి అనే పేరు వచ్చింది

#విశేషాలు:-
మకర సంక్రమణ మహాపర్వానికి ముందు రోజుకి ఒక ప్రాధాన్యం ఉంది. దీనికి భోగిపర్వం అని పేరు. అయితే భోగము అనే మాటకు అర్థం ఏమిటంటే అనుభవము అని. ఆనందంగా దేనిని అనుభవిస్తామో లేదా దేనిని అనుభవించడం వల్ల ఆనందం పొండుతామో దానిని భోగము అనాలి. అలాంటి భోగములు అనుభవించవలసిన రోజుని భోగి అంటారు. నిజమైన ఆనందాన్ని అనుభవించడమే నిజమైన భోగం. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఆనందం. సామాన్యుల ఆనందాలు వేరు. వాళ్ళకి లౌకిక విషయాలు దొరికితే అది భోగం. ఆ విషయంతో విసుగు కలిగితే మరో విషయం లభించాలని. కానీ ఏది లభిస్తే మరి ఇంకేదీ కావాలని అనిపించదో, ఏది పరిపూర్ణమైన ఆనందమో అదే నిజమైన భోగం. అలాంటి భోగం యోగం వల్లనే లభ్యం అవుతుంది. అందుకే యోగులే భోగులు కాగలరు. అలాంటి దివ్య భోగం ఈరోజున అమ్మ గోదాదేవి ఆండాళ్ళమ్మ పొందినది. అదేమిటంటే పరమాత్మ ప్రాప్తి. రంగనాథుని చేపట్టినది. రంగనాథుని అనుగ్రహాన్ని పొందినది. రంగనాథుని సాంగత్యం అనబడేటటువంటి ఆ కైవల్యానందం అనే భోగాన్ని అమ్మ పొందినది కనుక ఈరోజు భోగి అనే పేరు భక్తి సాంప్రదాయం పరంగా నిర్వచించేవారు చెబుతారు. సరిగ్గా ఈ రోజుతో ధనుర్మాసం పూర్తి అవుతున్నది. తర్వాత నుంచి మకర మాసం వస్తున్నది సౌరమానం ప్రకారంగా. ఈ ధనుర్మాస వ్రతమంతా ఈరోజు పూర్తీ జరిగి దాని ఫలితంగా అమ్మవారు స్వామియొక్క అనుగ్రహాన్ని పొందినది.

#బోగి_నాడు_ఏమి_చేయాలి ???
సూర్యోదయం కు పూర్వమే నిద్రలెవ్వాలి, కాలకృత్యాలు దంతధావనాలు పూర్తి చేసుకొని తలకు ఒంటికి నువ్వుల నూనె అలదుకోవాలి, దానివలన ఐశ్వర్య ప్రాప్తి ఆరోగ్య ప్రాప్తి అని చెబుతున్నారు పెద్దలు, తర్వాత అబ్యాన్గన స్నానం చేయాలి, ఉతికినవి కానీ నూతనమైనవి కానీ వస్త్రాలు ధరించి దేవాలయం కి వెళ్లి దైవదర్శనం చేసుకోవాలి ఇంట్లో కూడా పూజ చేసుకోవాలి సాత్విక ఆహారం భుజించాలి ...

Wednesday, January 8, 2025

వ్యక్తిత్వ వికాస సంబంధ 40 పుస్తకాలు(

*వ్యక్తిత్వ వికాస సంబంధ 40 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు* 
------------------------------------------------
మీరు మారాలనుకొంటున్నారా? www.freegurukul.org/g/VyakthithwaVikasam-1

నిత్య జీవితంలో సైకాలజీ www.freegurukul.org/g/VyakthithwaVikasam-2

మిమ్మల్ని మీరు గెలవగలరు www.freegurukul.org/g/VyakthithwaVikasam-3

యువతా! లెండి!మేల్కోండి!మీ శక్తిని తెలుసుకోండి! www.freegurukul.org/g/VyakthithwaVikasam-4

మనస్తత్త్వ శాస్త్రము www.freegurukul.org/g/VyakthithwaVikasam-5

బాడీ సైకాలజీ www.freegurukul.org/g/VyakthithwaVikasam-6

వ్యక్తిత్వ వికాసం www.freegurukul.org/g/VyakthithwaVikasam-7

నిత్య జీవితంలో ఒత్తిడి - నివారణ www.freegurukul.org/g/VyakthithwaVikasam-8

స్ఫూర్తి www.freegurukul.org/g/VyakthithwaVikasam-9

యువ శక్తి www.freegurukul.org/g/VyakthithwaVikasam-10

మిమ్మల్ని మీ పిల్లలు ప్రేమించాలంటే www.freegurukul.org/g/VyakthithwaVikasam-11

రిలాక్స్ రిలాక్స్ www.freegurukul.org/g/VyakthithwaVikasam-12

విద్యా మనో విజ్ఞాన శాస్త్రము www.freegurukul.org/g/VyakthithwaVikasam-13

ధీరయువతకు www.freegurukul.org/g/VyakthithwaVikasam-14

వ్యక్తిత్వ వికాసం www.freegurukul.org/g/VyakthithwaVikasam-15

వ్యక్తిత్వ వికాసం www.freegurukul.org/g/VyakthithwaVikasam-16

విజయం మీది www.freegurukul.org/g/VyakthithwaVikasam-17

స్వీయ భావన-వికాసం www.freegurukul.org/g/VyakthithwaVikasam-18

వండర్ మెమరీ టెక్నిక్స్ www.freegurukul.org/g/VyakthithwaVikasam-19

జ్ఞాపకశక్తి - చదివేపద్ధతులు www.freegurukul.org/g/VyakthithwaVikasam-20

నీ గమ్యం తెలుసుకో www.freegurukul.org/g/VyakthithwaVikasam-21

నీలో ఇద్దరు www.freegurukul.org/g/VyakthithwaVikasam-22

మీరూ 'శ్రీ'లు www.freegurukul.org/g/VyakthithwaVikasam-23

విజయపధం www.freegurukul.org/g/VyakthithwaVikasam-24

కలసి జీవిద్దాం-వ్యక్తిత్వ వికాస విజయమాల www.freegurukul.org/g/VyakthithwaVikasam-25

మనస్స్సరీరాలపై పరిసరాల ప్రభావం www.freegurukul.org/g/VyakthithwaVikasam-26

మానసిక శక్తులు www.freegurukul.org/g/VyakthithwaVikasam-27

మేధో వికాసం www.freegurukul.org/g/VyakthithwaVikasam-28

మాట మన్నన www.freegurukul.org/g/VyakthithwaVikasam-29

ప్రచారం పొందటం ఎలా www.freegurukul.org/g/VyakthithwaVikasam-30

పిల్లల శిక్షణా సమస్యలు www.freegurukul.org/g/VyakthithwaVikasam-31

బాడీ లాంగ్వేజ్-శరీరభాష www.freegurukul.org/g/VyakthithwaVikasam-32

ఎలా చదవాలి ? www.freegurukul.org/g/VyakthithwaVikasam-33

నవీన విద్య www.freegurukul.org/g/VyakthithwaVikasam-34

ఫస్ట్ క్లాస్ లో పాసవడం ఎలా ? www.freegurukul.org/g/VyakthithwaVikasam-35

జ్ఞాపకశక్తికి మార్గాలు www.freegurukul.org/g/VyakthithwaVikasam-36

వైజ్ఞానిక హిప్నాటిజం www.freegurukul.org/g/VyakthithwaVikasam-37

మనో విజ్ఞాన శాస్త్రం - పరీక్ష www.freegurukul.org/g/VyakthithwaVikasam-38

విశ్వనాథ నవలలు మనస్తత్త్వ చిత్రణ www.freegurukul.org/g/VyakthithwaVikasam-39

పాటల ద్వారా ప్రేరణ www.freegurukul.org/g/VyakthithwaVikasam-40

వ్యక్తిత్వ వికాసం పై అధ్యయనం, పరిశోధన చేయడానికి కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి.

Friday, January 3, 2025

నిద్ర - నియమాలు -

నిద్ర - నియమాలు -

      మానవుడు ఆరోగ్యముగా ఉండవలెను అనిన ఆహారం మరియు నిద్ర ఇవి రెండు ముఖ్యమైనవి . నిద్ర వలన శ్రమ , అలసట తొలగిపోవును . నిద్ర సరిగ్గా పోనిచో శరీరం అశక్తతో నీరసంగా తయారగును. ముఖ్యంగా చిన్నపిల్లలకు , వృద్దులకు నిద్ర అత్యంత ముఖ్యం అయినది. ప్రతిమనిషి 5 గంటల నుంచి 8 గంటలపాటు తప్పకుండా నిద్రించవలెను. నిద్రను రెండురకాలుగా విభజించవచ్చు. అవి  

              1 . గాఢనిద్ర.

              2 . కలతనిద్ర .

 గాడనిద్ర - 

       మైమరచి , బాహ్య విషయాలు తెలియకుండా రెండు నుంచి మూడు గంటల పాటు నిద్రించుట . దీనివల్ల మానసికపరమైన ఉల్లాసం , విశ్రాంతి లభించి మానవుడు దైనందిక కార్యక్రమాలు చురుకుగా నిర్వర్తించగలడు.

 కలతనిద్ర -

        మనుష్యుడు నిద్రించునప్పుడు కొంతవరకు బాహ్యవిషయాలు తెలియుచుండును. ఎవరైనా బిగ్గరగా మాట్లాడటం , శబ్దము చేసిన వెంటనే మెలుకువ వచ్చును. ఈ నిద్ర వలన పూర్తి విశ్రాంతి కలుగదు. కొంతవరకు శారీరక విశ్రాంతి మాత్రం లభించును.

 నిద్ర నియమాలు -

 * కొన్నాళ్ళు జబ్బు పడి లేచినవారు , జ్వరముతో బాధపడువారు , నిద్రవచ్చినప్పుడు కునికిపాట్లు పడవచ్చు కాని పూర్తిగా నిద్రపోగూడదు అని ఆయుర్వేదం స్పష్టంగా చెప్పినది.

 * జ్వరంతో ఉన్నప్పుడు ఆహారం తీసుకుని మరలా నిద్రించినచో జ్వరం వెంటనే తిరగబెట్టును. కావున వైద్యుడు చెప్పిన నియమాల ప్రకారమే నిద్రించవలెను.

 * ఎదైనా పరిస్థితులలో రాత్రి జాగరణ చేసినచో రాత్రి ఎంతకాలం నిద్ర తగ్గినదో అంత సమయంలో సగభాగం ఉదయాన్నే ఆహారం తీసుకొకుండా నిద్రించవలెను.

 * ఏప్రిల్ మరియు మే నెలలలో అనగా గ్రీష్మఋతువు నందు ఎండలు అధికంగా పగలు నిద్రించుట పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఆరోగ్యం కలిగించును.

 * సాయంత్రం సమయంలో టీ మరియు కాఫీని తాగడం ఆపినచో రాత్రి సమయం నందు చక్కటి నిద్రపట్టును .

 * ఎక్కువుగా పొగ తాగేవారికి నిద్రపట్టదు. పొగలోని నికోటిన్ అంటూ విషపదార్థం శరీరంలోని నరములకు ఉత్తేజం కలిగించి నిద్రను రానివ్వదు.

 * నిద్రించుటకు ముందు ఆలోచనలను దూరం పెట్టి ప్రశాంతంగా ఉండి వెలికిలిగా పడుకొని ధ్యానం చేయుట ద్వారా మంచి నిద్రపట్టును . మధ్యలో మెలకువ వచ్చిన ఎడమ చేతి వైపు తిరిగి పడుకోవలెను .

 * పొలం పనిచేయువారు మరియు ఫ్యాక్టరీ పనిచేయువారు సాయం సమయాన గోరువెచ్చని నీటితో స్నానం చేసి 10 గంటల లోపు నిద్రకు ఉపక్రమించవలెను.

 * శారీరక శ్రమ లేనివారు చన్నీటి స్నానము చేయవచ్చు . గదిలో తక్కువకాంతి ఇచ్చే బల్బ్ లను ఉంచరాదు.

 * ఉదయం నిద్రలేచే ముందు మంచం పైన అటూఇటూ నాలుగు నుంచి అయిదు సార్లూ పొర్లి చేతులు , కాళ్లు విదల్చవలెను.

 * నిద్ర లేచించిన వెంటనే కాళ్లు , చేతులు వేళ్లు మెటికలు విరవడం వలన శరీర అవయవాలు శక్తిని పుంజుకోనును.

  
 

Thursday, January 2, 2025

సన్మార్గం

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

                      *సన్మార్గం*
                    ➖➖➖✍️

*జీవితాన్ని ధర్మబద్ధంగా కొనసాగించడానికి సన్మార్గమే ఉత్తమ సాధనం. తోటివారికి సహాయం చేయడం, సంఘ శ్రేయస్సు కోసం పాటుపడటమే సన్మార్గం. స్వార్థంతో ప్రవర్తించి, ఇతరులకు కీడు చేయడమే దుర్మార్గం.*

*సన్మార్గంలో నడిచిన వ్యక్తి ఎప్పటికప్పుడు తానేమిటో, తన స్థాయి ఏమిటో తెలుసుకుంటాడు. ఆత్మవిమర్శ చేసుకొంటూ ఉన్నతమైన బాటలో ప్రయాణిస్తాడు.*

*ఈ సమాజం ఎలా అయినా ఉండనీ గాక, మనమెలా ఉన్నామన్నదే ముఖ్యం. ఏం చేస్తామన్నదే ముఖ్యం. కమలం బురద మధ్యలో జీవిస్తున్నా తన తేజస్సు కోల్పోదు. కోమలత్వాన్ని వీడదు. మనిషి కూడా కమలం లాగే బతకాలి.*

*సన్మార్గంలో సాగడం వల్లే మనిషి ఈ సమాజంలో అత్యుత్తమ గౌరవాన్ని పొందుతాడు. మానవత్వం వల్లే అందరికీ ఆదర్శప్రాయుడవుతాడు. అందుకే భగవంతుడు ప్రసాదించిన ఈ జన్మ ద్వారా అందరికీ సహాయం చేసే స్థాయికి మనిషి ఎదగాలి.*

*మరుజన్మ ఉన్నదో లేదో మనకు తెలియదు. గత జన్మ ఎలాంటిదో కూడా తెలియదు. ఈ జన్మలో లభించిన పవిత్రమైన మానవ జన్మను ప్రతి మనిషీ సార్థకం చేసుకోవాలి. పదిమందినీ ఉద్ధరించే ప్రయత్నం చేయాలి.*

*ఒకసారి సన్మార్గం వైపు ప్రయాణించిన మనిషి చెడుమార్గం వైపు మరి కన్నెత్తి చూడడు.*

*సత్‌ కార్యాలు చేస్తూ ముందుకు సాగుతాడు. దారి దోపిడులు చేసే రత్నాకరుడనే బోయవాడు నారద మహాముని ఉపదేశం వల్ల పరివర్తన చెంది, రామనామ జపంతో వాల్మీకిగా ప్రసిద్ధి పొందాడు. ఆదికావ్యమైన రామాయణాన్ని లోకానికి అందించాడు.*

*బుద్ధుడు సిద్ధార్థుడిగా ఉన్నప్పుడు ఎన్నో రాజభోగాలను అనుభవించాడు. ఆ సిద్ధార్థుడే అన్నింటినీ వదులుకుని సన్మార్గాన్ని అవలంభించి జ్ఞానోదయం పొందాడు. మహా బోధకుడిగా మారి అమరుడయ్యాడు.*

*శ్రేష్ఠులైనవారు దేన్ని ధర్మంగా భావించి ఆచరిస్తారో సజ్జనులూ దాన్నే ఆచరిస్తారని బోధించాడు శ్రీకృష్ణుడు.*

*జ్ఞానులు, మహాత్ములు సన్మార్గాన్ని అనుసరించారు, చరితార్థులయ్యారు. ప్రతి మనిషీ మహనీయుల మార్గాన్నే అనుసరించాలి. కీర్తి శిఖరాలు చేరుకోవాలి.*

*రావణాసురుడు గొప్ప శివభక్తుడు. స్త్రీ వ్యామోహం వల్ల దుర్మార్గంగా ప్రవర్తించి, చివరికి నాశనమయ్యాడు.*

*వివేకం కోల్పోయి బంధుమిత్రుల హితవచనాలు పెడచెవిన పెట్టినందువల్ల కౌరవ నాశనానికి కారకుడయ్యాడు దుర్యోధనుడు. *

*ఏ మనిషైనా దుర్మార్గుడిగా మారడానికి ఎంతోకాలం పట్టదు. మంచివాడిగా, మానవోత్తముడిగా గుర్తింపు పొందడానికి చాలా కాలం పడుతుంది. తద్వారా వచ్చే కీర్తి చిరస్థాయిగా నిలిచిపోతుంది.*

*సన్మార్గమే మనిషికి సంపద. సన్మార్గంలో ప్రయాణించే మనిషికి ధనధాన్యాలు లేకపోయినా అన్ని సంపదలూ ఉన్నట్లే. సత్ప్రవర్తన లేనివారికి సంపదలు ఉన్నా అవి లేనట్లేనన్నది నీతికోవిదుల మాట.*

*చూసిన ప్రతిదాన్ని ఆశించడం, ఆశించినదానికోసం పాకులాడటం, కోరుకున్నది దొరక్కపోతే బాధపడటం... ఇవన్నీ మనిషి అశాంతికి కారణాలు. ఇవే మనిషిని దుర్మార్గం వైపు నడిపిస్తాయి. అందుకే మనిషి ఎప్పటికప్పుడు కోరికలను నియంత్రించుకుని స్థిరచిత్తం ఏర్పరచుకోవాలి.*

*#సన్మార్గం మనిషికి సుఖశాంతులు ప్రసాదిస్తుంది. సన్మార్గంలో నడిచే వ్యక్తుల మనసులు కడిగిన ముత్యాల్లా నిర్మలంగా ఉంటాయి. వారు ఎవరితోనైనా మృదుమధురంగా మాట్లాడతారు. కలిమిలోను, లేమిలోను నిబద్ధత కలిగి ఉంటారు. మంచి పనుల ద్వారా అందరినీ ఆకట్టుకుంటారు. సన్మార్గంలో ప్రయాణించిన మనిషి,మనీషిగా ఎదుగుతాడు. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకుంటాడు. మంచి బాటలో నడిచిన మనిషికి దైవానుగ్రహం తప్పక లభిస్తుంది. అందుకే సన్మార్గం అందరికీ అనుసరణీయం.*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

బ్రహ్మరాత

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

                 *బ్రహ్మరాత*
               ➖➖➖✍️

బ్రహ్మరాతను సైతం
బ్రహ్మాండమైన రాతగా మార్చి
చూపిన వసంతుడు …

బోధ చేస్తూ ఒక మునిదంపతులు ఉండేవారు. ఆ ముని చాలా ప్రతిభావంతుడు. సకలశాస్త్రాలు, విద్యలు తెలిసినవాడు. ఆ ముని భార్య సాక్షాత్తూ అన్నపూర్ణయే. ఆమె శిష్యులను తన కన్నబిడ్డల్లా చూసుకునేది. ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా వారి ఆకలిని తీర్చేది.

అలా ఒకనాడు ఆ ముని దంపతుల వద్దకు ‘వసంతుడు’ అనే ఒక అనాథ వచ్చి శిష్యుడిగా చేరాడు. అతడు బాగా చురుకైనవాడు, తెలివైనవాడు కావడంతో అతనికి గురువుగారు నేర్పించే విద్యలన్నీ ఇట్టే అబ్బేవి. వసంతుడు కొన్నాళ్ళకే తన గురువుకు తెలిసిన విద్యలన్నీ పూర్తిగా నేర్చేసుకున్నాడు. ఇక అతనికి నేర్పడానికి తనవద్ద ఉన్న జ్ఞానం సరిపోకపోవడంతో, తనకు గురువులైన వారి వద్దకు పంపించి మరీ విద్యాభ్యాసం చేయించాడు ఆ గురువర్యుడు. అయితే కొన్నాళ్ళకే అతనికి నేర్పడానికి తమవద్ద ఉన్న విద్యలన్నీ పూర్తయ్యాయని ఆ పెద్ద గురువులైన వాళ్ళు కూడా చెప్పారు.

ఇదిలావుండగా నిండు చూలాలైన గురుపత్ని ప్రసవించే సమయం రావడంతో, వసంతుడు ఆశ్రమంలో అన్ని పనులు తానే చూసుకుంటూ, తల్లితో సమానురాలైన గురుపత్నిని కాలు క్రింద పెట్టకుండా చూసుకుంటున్నాడు. ఆమెకు పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. ఆశ్రమంలోపల ప్రసవం జరుగుతుండగా వసంతుడు గుమ్మం బయటకు వచ్చి కూర్చున్నాడు.
కాసేపట్లో లోపలి నుండి చంటిబిడ్డల ఏడుపులు వినవచ్చాయి. గురుపత్ని కవలపిల్లలకు జన్మనిచ్చింది. ఒక మగపిల్లవాడు, ఒక ఆడపిల్ల.

ఇంతలో దివి నుండి భువికి దిగివచ్చిన ఒక దివ్యపురుషుడు వడివడిగా ఆశ్రమంలోకి వెడుతూ, గుమ్మం ముందు కూర్చున్న వసంతుడికి కనిపించాడు. మామూలు మనుషులకైతే అతను కనిపించి వుండేవాడు కాదు. కాని వసంతుడు దేవరహస్యాలు కూడా నేర్చుకున్నాడు కాబట్టి ఆ వచ్చిన అతనెవరో ఇట్టే కనిపెట్టేశాడు వసంతుడు. అతడు ''బ్రహ్మ''. అప్పుడే పుట్టిన పిల్లలకు నొసటి రాత రాయడానికి వచ్చాడని అర్థం చేసుకున్న వసంతుడు ఓపిగ్గా బయట కాచుకుని కూర్చున్నాడు వసంతుడు. 

బ్రహ్మ బయటకు రాగానే ఆయనకు ప్రణామం చేసి ''స్వామి'' మా గురువుగారి పిల్లల నుదుట ఏమి రాశారో దయచేసి సెలవివ్వగలరు అని వినమ్రపూరితంగా అడిగాడు. 

బ్రహ్మ తనను చూడగలిగిన ఈ పిల్లవాడు సామాన్యుడు కాడు అని తెలుసుకొని, వసంతుడు అడిగిన విధానానికి ముచ్చటపడి, ఇతరులకు తెలియజెయ్యరాని రహస్యాన్ని అతనికి చెప్పడానికి నిర్ణయించుకున్నాడు. 

అప్పుడు ఇలా చెప్పాడు.. “నాయనా! ఈ అబ్బాయి నిరక్షర కుక్షి అవుతాడు. ఇతని జీవితకాలమంతా ఇతని వద్ద ఒక మూట బియ్యము, ఒక ఆవు, ఒక పూరిపాక తప్ప మరిక ఏమీ ఉండవు. ఇతడు రోజంతా కష్టపడినా తన రెక్కల కష్టంతో కనాకష్టంగా పెళ్లాన్ని, పిల్లల్ని పోషిస్తాడు అంతే” అన్నాడు. “ఇక ఆ అమ్మాయి మాత్రం వేశ్య అవుతుంది. డబ్బుల కోసం రోజుకో పురుషుడితో సంభోగించే వారకాంత అవుతుంది” అని చెప్పి అక్కడినుండి వెళ్ళిపోయాడు బ్రహ్మ. 

అది వినిన వసంతుడు నిశ్చేష్టుడయ్యాడు. సాక్షాత్తూ దైవసమానులైన తన గురుదంపతులకి పుట్టిన పిల్లలకు ఇలాంటి రాత రాసాడేమిటా విధాత అని విచారంగా ఆలోచనలో మునిగిపోయాడు. వెంటనే తన గురువుగారిని “బ్రహ్మ రాత మార్చగలమా” అని అడిగాడు వసంతుడు. 

దానికి, ఆయన “అది సాధ్యం కాదు నాయనా. అది ఎవ్వరికీ సాధ్యం కాదు” అని చెప్పాడు. పిల్లలు పెద్దవాళ్ళయ్యే కొద్దీ వాళ్ళ రాత నిజమవడం వసంతుడికి కనిపించసాగింది.

ఆ ఇద్దరికీ చదువులు వంటపట్టడం లేదు. ఎందరికో విద్యాబుద్ధులు నేర్పిన గురువుగారి పిల్లలు ఇలా అయ్యారేమిటా? అనే దిగులుతో, వసంతుడికి దేనిమీదా ఏకాగ్రత కుదరడంలేదు. దానికితోడు ఆ పిల్లలిద్దరూ వసంతుడి వెంటపడి ‘అన్నయ్య, అన్నయ్య’ అని తిరుగుతూ వుంటే, అతడికి దుఃఖం మరింత ఎక్కువ కాసాగింది. 

ఒకరోజు గురువుగారితో చెప్పి, ఆయన అనుమతి పొంది దేశం చుట్టి రావడానికి బయలుదేరి వెళ్ళాడు. 

ఎన్నో చోట్లకు వెళ్ళి ఎందరో పండితులను కలిసాడు.
వారందరిని వసంతుడు ప్రశ్నించాడు… “బ్రహ్మ రాసిన రాతను మార్చగలమా?”

దానికి వసంతుడికి అందరు చెప్పిన సమాధానం ‘బ్రహ్మరాత మార్చడం అసాధ్యం. అది ఎవరితరమూ కాదు’ అని. 

అలా అక్కడా ఇక్కడా తిరుగుతూ, తన అన్వేషణను కొనసాగిస్తూ ఇరవై సంవత్సరాలకు పైగా గడిపాడు. అప్పటికి గురువుగారి పిల్లలకు పాతికేళ్ళు వచ్చాయి. వసంతుడికి వాళ్ళు ఎలా ఉన్నారో చూడాలనిపించసాగింది.

ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. అప్పుడు అక్కడి పరిస్థితి గురువుగారి కుమారుడి పేరు శంకరుడు అని, ఆ ఊరిలోనే కూలిపని చేస్తున్నాడని, గురువుగారి కుమార్తె పేరు ‘వసంతసేన’ అని దగ్గరలోని ఒక పట్టణంలో వ్యభిచార వృత్తిలో ఉందని తెలుసుకున్నాడు. తనకు పుట్టిన పిల్లల దుస్థితి చూసి దిగులుతో మంచం పట్టి, గురు దంపతులు మరణించారని కూడా వసంతుడు తెలుసుకున్నాడు.

వసంతుడు బాగా ఆలోచించాడు. ముందు శంకరుడిని వెతుక్కుంటూ వెళ్ళాడు. వసంతుడిని చూడగానే అన్నయ్యా! అంటూ బావురుమన్నాడు శంకరుడు. చిన్న పూరిపాక, చిరిగిపోయిన దుస్తుల్లో భార్య, ఒక కొడుకు, ఇంట్లో ఎటు చూసినా విలయతాండవం చేస్తున్న కటిక దారిద్య్రం ఇదీ శంకరుడి దుస్థితి. “తమ్ముడూ, నువ్వు బాధపడకు. ఇప్పటినుండి నేను చెప్పినట్లు చెయ్యు” అన్నాడు వసంతుడు. 

దానికి శంకరుడు, ''సరే అన్నయ్యా! ఇకనుండి నువ్వు ఎలా చెపితే అలానే చేస్తాను'' అన్నాడు శంకరుడు.

“ముందు ఆ ఆవుని తోలుకుని పట్టణానికి వెళదాం పద” అన్నాడు వసంతుడు. 

ఏమి మాట్లాడకుండా ఆవును తోలుకుని వసంతుడిని అనుసరించాడు శంకరుడు. 

ఇద్దరూ నేరుగా పట్టణంలోని సంత దగ్గరకు వెళ్ళారు. అక్కడ ఒక దళారి దగ్గరకు వెళ్ళి “ఈ ఆవుని ఎంతకు కొంటావు” అని అడిగాడు వసంతుడు. తరువాత అతను చెప్పిన ధరకు అమ్మేసాడు వసంతుడు. 

శంకరుడికి ఏమీ అర్థం కాకపోయినా, వసంతుడికి ఎదురు చెప్పలేదు. ఆవును అమ్మగా వచ్చిన డబ్బుతో వంటకు అవసరం అయిన సరుకులను, శంకరుడి భార్యకు, పిల్లలకు కొత్త బట్టలు కొన్నారు. తిరిగి గ్రామానికి బయలుదేరారు. ఇంటికి రాగానే ఆ సరుకులతో వంట చేయించాడు వసంతుడు. శంకరుడి భార్య, పిల్లలు ఆవురావురుమని తిని ఆకలి తీర్చుకున్నారు.

తర్వాత వసంతుడు శంకరుడితో “తమ్ముడూ అన్నదానం చేద్దాం. ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా వడ్డించు” అని చెప్పాడు. 

శంకరుడు మారు మాట్లాడకుండా అలాగే చేశాడు. కాని శంకరుడు ఆ రోజు రాత్రి వసంతుడితో, “అన్నయ్యా! ఇంతవరకు ఆ ఆవు వుంది కదా అన్న ధైర్యం నాకు ఉండేది, ఇప్పుడు ఉన్న ఆ ఒక్క ఆధారం కూడా పోయింది. దాన్ని అమ్మగా వచ్చిన ధనం కూడా అన్నదానానికి ఖర్చయిపోయింది. తెల్లవారితే ఎలా గడపాలో అని భయంగా వుంది” అని అన్నాడు. 

దానికి వసంతుడు “తమ్ముడూ, నువ్వు ఏమీ ఆలోచించకుండా సుఖంగా నిద్రపో. ప్రొద్దునకంతా సర్దుకుంటాయి” అని ధైర్యం చెప్పాడు.

ప్రొద్దున్నే లేచి తలుపు తెరచి బయటికి వచ్చి చూసిన శంకరుడి ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది. శంకరుడి ఇంటిముందు ఒక ఆవు నిలబడి వుంది. శంకరుడి ఆస్తి ఎప్పుడూ ఒక్క ఆవే అని తను రాసిన రాత పొల్లుపోకుండా ఉండడానికి రాత్రికి రాత్రి బ్రహ్మయే స్వయంగా ఒక ఆవుని తీసుకొని వచ్చి అక్కడ కట్టేవాడు. ఆ రోజు కూడా ఆవును తీసుకెళ్ళి సంతలో అమ్మి, వచ్చిన ఆ డబ్బుతో అన్నదానం చేయించాడు వసంతుడు. “తమ్ముడూ, ఇక ఇలాగే ప్రతిరోజూ క్రమం తప్పకుండా చేస్తూ ఉండు” అని చెప్పి వసంతుడు అక్కడి నుండి వసంతసేనను వెతుక్కుంటూ బయలుదేరాడు. 

అన్ని దానాల్లోకెల్లా గొప్పదైన అన్నదానాన్ని క్రమం తప్పకుండా చేస్తున్నందున శంకరుడు తన జీవితంలో అనంతమైన పుణ్యాన్ని మూట కట్టుకున్నాడు.

వసంతుడు వాళ్ళని, వీళ్ళని అడుగుతూ వెళ్ళి వసంతసేనను కలుసుకున్నాడు. వసంతసేన ఒక అవ్వతో కలసి ఒక ఇంట్లో ఉంటోంది. ఆమె వసంతుడిని చూడగానే భోరుమని ఏడ్చేసింది. “అన్నయ్యా! నేను మహాపాపిని. ఈ పాప పంకిలంలో కూరుకుపోయాను. మీలాంటి ఉన్నతుడిని చూడటానికి కూడా నాకు అర్హత లేదు” అని బావురు మంది. 

“ఊరుకో చెల్లీ! ఊరుకోమ్మా! ఈ పాపపు పంకిలం నుండి నువ్వు బయటపడే మార్గం చెబుతాను. ఇక ఇవాల్టి నుండి నేను చెప్పినట్లు చెయ్యి” అని ఆమెను ఓదార్చాడు వసంతుడు. 

దానికి సరే అని ఒప్పుకుంది వసంతసేన.

ఆ రాత్రికి విటులు ఎవ్వరు వచ్చినా లక్ష వరహాలు చెల్లిస్తేనే లోపలికి ప్రవేశం అని చెప్పమని అక్కడ వసంతసేనతో ఉన్న అవ్వకు చెప్పాడు వసంతుడు. 

ఆమె ఆశ్చర్యపడుతూ “అయ్యా! ఇది జరిగే వ్యవహారం కాదు” అని ఏదో చెప్పబోయింది. 

వసంతుడు ఆమెను మధ్యలోనే వారించి “నేను చెప్పినట్లు చెయ్యి” అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్లుగా. 

ఆ రాత్రి ఇద్దరు, ముగ్గురు విటులు వచ్చి లక్ష వరహాలు అనగానే వెనుదిరిగి వెళ్ళిపోయారు. అది వాళ్ళు ఊహించలేని మొత్తం. కాని అర్ధరాత్రి సమీపిస్తూ ఉంది అనగా ఒక మహాపురుషుడు మాత్రం లక్ష వరహాలతో వచ్చి ఆ రాత్రి వసంతసేనతో గడిపి వెళ్ళాడు. ఆ మరుసటిరోజు రాత్రి కూడా అలాగే జరిగింది. తన రాత తప్పకూడదని, లక్ష వరహాలు ఇచ్చి వసంతసేనతో సంభోగించింది సాక్షాత్తూ ఆ బ్రహ్మే నని వసంతుడికి తెలుసు. 

అలా బ్రహ్మ సంభోగం వలన అప్పటివరకు ఆమె మూటగట్టుకున్న పాపాలన్నీ పటాపంచలయ్యాయి.
ఆమె జన్మ చరితార్థమైంది. 

అలా వసంతుడు వాళ్ళిద్దరి చేత పుణ్యకర్మలు చేయించి, గురుదంపతుల ఋణం తీర్చుకున్నాడు.
**********************

ఈ ప్రపంచంలో ప్రతి జీవి నుదుట తలరాత రాసేది బ్రహ్మే అయినా దానిని చక్కగా తీర్చిదిద్దుకునే శక్తిని, అవకాశాన్ని మాత్రం ప్రతి జీవికి ఇచ్చాడు అని గ్రహించాడు, దానిని నిరూపించాడు. అలా బ్రహ్మ రాతను సైతం బ్రహ్మాండమైన రాతగా మార్చి చూపాడు వసంతుడు...

ప్రాతః జూద ప్రసంగేణ!
మధ్యాహ్నే స్త్రీ ప్రసంగతః
రాత్రౌచొర ప్రసంగేణ!
కాలౌ గచ్చతి ధీమతాం!

ఇందులో మనకి పైకి కనిపించేది…
ప్రాతః కాలంలో జూదం గురించి మాట్లాడుకోవాలి. 

మధ్యాహ్నం స్త్రీ కి సంబంధించిన విషయాలు మాట్లాడుకోవాలి. 

రాత్రికి దొంగతనముల గురించి మాట్లాడుకోవాలి.

ఇలా ఎవరైతే మాట్లాడుకుంటారో వారే బుద్ధిమంతులు. ఇదే పైకి కనిపిస్తుంది.

ఇందులో అంతరార్ధం చూద్దాం…

ప్రాతఃకాలం అంటే బాల్యం.
బాల్యంలో మహాభారతం చదువుకోవాలి. వ్యసనాల వలన కలిగే అనర్ధాలు, ఎలా బ్రతకాలో తెలియజేసే ధర్మాలు తెలుస్తాయి. 

మధ్యాహ్నం స్త్రీ! అంటే! యుక్తవయస్సులో రామాయణం చదువుకోవాలి. పరస్త్రీ ని చెరబట్టడం వలన కలిగే అనర్ధాలు, స్త్రీ ఔన్నత్యం, భార్యని ఎలా చూసుకోవాలో తెలుస్తుంది.

సాయంత్రం దొంగతనాలు అంటే… వృద్దాప్యంలో భాగవతం చదువుకోవాలి. వృద్దాప్యంలో కావలసింది మోక్షం మాత్రమే! 
ఇంకా ఏ కోరిక కోరినా తప్పే. శ్రీకృష్ణుడు దొంగతనం పేరుతో చేసిన లీలలు తెలుసుకోవడం, ఇంకా అయన లీలలు తెలుసుకుని ఆయన నామం జపించడం వలన మోక్షం సులభంగా లభిస్తుంది. 

ఇది పైన సంస్కృత శ్లోకంలో ఉన్న అర్ధం, అంతరార్ధం.
పైన చెప్పిన మూడు గ్రంధాలూ దొరికాయి కదా అని చదివేయకూడదు. అర్ధం తెలియక అపార్ధం చేసుకునే ప్రమాదం ఉంది. 

ఎన్ని చదివినా 
ఇంకా ఏదో కొత్త విషయం తెలుస్తూనే ఉంటాయి...✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

కలశము అంటే ఏమిటి?..!

🎻🌹🙏కలశము అంటే ఏమిటి?..!!

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌿నీటితో నిండిన ఇత్తడి లేక మట్టి లేక రాగి పాత్ర; పాత్ర మొదట్లో మామిడి ఆకులు; వాటి పైన కొబ్బరి కాయ ఉంచబడుతుంది.

🌸తెలుపు లేక ఎరుపు దారం దాని మెడ చుట్టూ లేక పూర్తిగా కానీ సమ చతురస్రాకారపు నమూనాలో చుట్టబడి ఉంటుంది.

🌿అటువంటి పాత్ర 'కలశం' అనబడుతుంది. ఆ పాత్రను నీటితో గానీ బియ్యముతో గానీ నింపినప్పుడు 'పూర్ణకుంభము' అనబడుతుంది.

🌸అది దివ్యమైన ప్రాణశక్తితో నింపబడిన జడ శరీరానికి ప్రతీక అవుతుంది.

🌿ప్రాణశక్తి వలననే అన్ని అద్భుతమైన పనులను చేసే శక్తి శరీరానికి వస్తుంది.

🌸సంప్రదాయ బద్ధమైన గృహ ప్రవేశము, వివాహము, నిత్య పూజ మొదలైన అన్ని ప్రత్యేక సందర్భాలలో తగిన వైదిక క్రియతో కలశం ఏర్పాటు చేయబడుతుంది.

🌿స్వాగతానికి చిహ్నంగా ప్రవేశ ద్వారం వద్ద ఉంచబడుతుంది.

🌸ఇది మహాత్ములను సంప్రదాయ పద్ధతిలో ఆహ్వానించేటప్పుడు కూడా వాడబడుతుంది.

🌹🙏మనము కలశాన్ని ఎందుకు పూజిస్తాము అంటే 🙏🌹

🌿సృష్టి ఆవిర్భావానికి ముందు శ్రీ_మహావిష్ణువు పాల సముద్రములో తన శేషశయ్య పై పవ్వళించి ఉన్నాడు.

🌸అతని నాభి నుండి వెలువడిన పద్మములో నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించి ఈ ప్రపంచాన్ని సృష్టించాడు.

🌿కలశంలొని నీరు సర్వ సృష్టి ఆవిర్భవానికి ప్రథమ జాతమైన నీటికి ప్రతీకగా నిలుస్తుంది.

🌸ఇది అన్నింటికీ జీవన దాత. లెక్కలేనన్ని నామరూపాలకి, జడ పదార్థాల మరియు చరించే ప్రాణుల యొక్క అంతర్గత సృష్టికర్త.

🌿ఈ ప్రపంచంలో ఉన్నదంతా సృష్టికి ముందుగానున్న శక్తి నుంచి వచ్చినది, శుభప్రదమైనది.

🌹ఆకులు కొబ్బరికాయ సృష్టికి ప్రతీక.🌹

🌸చుట్టబడిన దారము సృష్టిలో అన్నింటినీ బంధించే 'ప్రేమ' ను సూచిస్తుంది.

🌿అందువల్లనే 'కలశం' శుభసూచకంగా పరిగణింపబడి పూజింపబడుతున్నది.

🌸అన్ని పుణ్య నదులలోని నీరు, అన్ని వేదాలలోని జ్ఞానము మరియు దేవతలందరి ఆశీస్సులు కలశంలోకి ఆహ్వానించబడిన తరువాత అందులోని నీరు 'అభిషేకము' తో సహా అన్ని వైదికక్రియలకి వినియోగింప బడుతుంది.

🌿దేవాలయ కుంభాభిషేకములు ఎన్నో రకాల పూజలు కలశజలముల అభిషేకాలతో విశిష్ట పద్దతిలో నిర్వహిస్తారు.

🌸పాల సముద్రాన్ని రాక్షసులు, దేవతలు మధించినపుడు అమరత్వాన్ని ప్రసాదించే అమృత కలశంతో భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు.

🌿కాబట్టి 'కలశం' అమృతత్వాన్ని కూడా సూచిస్తుంది.

🌸పూర్ణత్వాన్ని సంతరించుకున్న జ్ఞానులు ప్రేమ, ఆనందాలతో తొణికిసలాడుతూ పవిత్రతకు ప్రతీకగా ఉంటారు.

🌿వారిని ఆహ్వానించేటప్పుడు వారి గొప్పదనానికి గుర్తింపుగా మరియు వారిపట్ల గల గౌరవనీయమైన భక్తికి నిదర్శనంగా పూర్ణకుంభంతో హృదయ పూర్వకంగా స్వాగతమిస్తాము...🚩🌞🙏🌹🎻

    🙏ఓం నమో నారాయణాయ 🙏

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

Wednesday, January 1, 2025

పిల్లలు పక్క తడపటం


*<>•<>•<>•<>•<>•<>•<>•<>*
*ఆరోగ్యమస్తు*
*+++++++++++++++++*
*పిల్లలు పక్క తడపటం*
*!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!*
*పిల్లలు పక్క తడపటం*
*దీనిని ఆయుర్వేదంలో* *శయ్యామూత్రం” అంటారు* *చిన్నప్పుడు సరే కాని పెద్దపిల్లలు కూడా పక్క తడుపుతుంటారు. టీ*కూల్ డ్రింక్స్, చెరకు రసం, చాక్లెట్లు వంటి వాటిల్లో మూత్రాన్ని అధికం చేసే నైజం ఉంటుంది. కాబట్టి* *అలాంటి ఆహారపదార్థాలు పిల్లలకు ఎక్కువగా ఇవ్వకూడదు. పిల్లలను రాత్రిపడుకో బెట్టే ముందు మూత్ర విసర్జన చేయించాలి. పడుకున్న తరువాత 3, 4 గంటల తరువాత మళ్ళీ ఒకసారి లేపి చేయించాలి కొన్ని రోజులు ఇలా చేస్తే మధ్యరాత్రిలో వాళ్ళంతట వాళ్ళే లేవగలుగుతారు*.

*1.ఎ) బంక మన్ను, తేనె, నెయ్యిల మిశ్రమాన్ని పొత్తి కడుపు ప్రాంతంలో, మూత్రాశయం పై పట్టులాగా వేస్తూ ఉంటే కొన్ని రోజులకు మూత్రాశయపు కండరాలు, నాడీవ్యవస్థ శక్తివంతంగా తయారయి, మూత్ర విసర్జన మీద నియంతణ వస్తుంది*.

*బి) దొండచెట్టు వేర్లను తెచ్చి నలగ గొట్టి రసం తీసి త్రాగిస్తే మార్పు కనిపిస్తుంది. అలాగే ఆవాలను పొడిచేసి రోజుకు అరగ్రాము చొప్పున పాలతో త్రాగించినా లేదా అన్నంతో కలిపి పెట్టినా ఫలితం ఉంటుంది*.

*2. ఎండు కొబ్బరి పొడి100 గ్రా॥లు (మెత్తగా చేయాలి)*

*జొన్న పేలాల పొడి100 గ్రాములు*

*తెలగ పిండి100 గ్రాములు*

*పాత బెల్లం 100 గ్రాములు*

*అన్నింటిని కలిపి రోట్లో వేసి దంచాలి. 10 నుండి 20 గ్రా॥ల మోతాదుగా లడ్డూల్లాగా చేసుకొని తడి తగలకుండా నిలువ చేసుకోవాలి. ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి చొప్పున కొంచెం కొంచెం చప్పరించి తినాలి. దీని వలన నిద్రలో పక్క తడిపే సమస్య పోతుంది. ఇది మంచి పుష్టిదాయకమైనది. బలాన్ని దేహదారుఢ్యాన్ని కలిగిస్తుంది*

*మూత్రంలో మంట* :

*1. దోస గింజలను నీళ్ళతో మెత్తగా నూరి 3 పూటలు త్రాగుతూ ఉంటే మూత్రంలో మంట, ఉడుగు తగ్గుతుంది*
*2అరకప్పు ముల్లంగి రసంలో ఒక చెంచా కండ చక్కెర కలిపి రెండు పూటలు సేవిస్తూ ఉంటే మూత్రంలో చరుకు, మంట, పోటు తగ్గును*