Monday, July 7, 2025

క్షమాపణ

😊🙏 మహోదయము, 

'క్షమాపణ’ గురించి లోతుగా అవగాహనా మరియు బహుళప్రయోజనాలను గురించి తెలుసుకుందాము. 

🌸 **క్షమాపణ యొక్క అసలైన అర్థము ఏమిటి?**

**క్షమించడము** అంటే:
మనలను లేదా ఇతరులను అనవసరముగా నిందించడము, కోపము, లోతైన మానసిక గాయాలు, అసూయ లేదా బాధలతో మన హృదయాన్ని నింపుకోవడము కాకుండా — **మనస్సులో శాంతిని, కరుణను, మరియు స్వీయనియంత్రణతో కూడిన స్వేచ్ఛను ఎంచుకోవడము.**

సంస్కృతములో "క్షమాపణ లేదా క్షమా గుణము" అనే పదములు కేవలము ఓ మంచి లక్షణమలే కాదు — శారీరక, మానసిక, భావోద్వేగ అధమ స్థితి విముక్తికి, మరియు ఆర్థిక మరియు ఆధ్యాత్మిక ఉన్నతికి దారితీసే ఒక శుద్ధి సాధనము.

"క్షమాపణ లేదా క్షమా గుణము" అంటే: ధైర్యము, సహనము, సహనశక్తి, దయ, దేవగుణము.

🌼 **క్షమాపణ యొక్క ప్రధాన కోణాలు**
       
🌹 *మనము, ఇతరులను క్షమించడము వలన మనలోని నింద, కోపము, విమర్శలను విడిచిపెట్టడముజరుగుతుందిమరియు భావోద్వేగ బానిసత్వము నుండి మనకు విముక్తి కలుగుతుంది.* 

🌹 *మనల్ని మనమే క్షమించుకోవడము వలన మనలోని నిండా స్వభావము, అపరాధ భావము, తక్కువతనాన్ని వదలి వేసి, మనము ఆత్మప్రేమ మరియు ఎదుగుదలకు ద్వారమును చేరుతాము.*

🌹 *మనము ఇతరులను హృదయపూర్వకమైన క్షమాపణ అడగడము వలన తత్సంబంధాలు పెరుగుతాయి లేదా వారి నుండి మనకు ఎలాంటి హాని ఉండదు మరియు మన కర్మలన్ని కూడా పరిశుద్దమవుతాయి.*

🌹 -మనము దైవమును హృదయపూర్వకమైన క్షమాపణ అడగడము వలన భగవంతుని కృపను స్వీకరించడము లేదా ఆహ్యానించడము, ఆధ్యాత్మిక శుద్ధిమరియు శాంతిని పొందుతాము.*
             |
🕊️ *మనల్ని, మరియు ఇతరులను పూర్తిగా మనము క్షమించడము వలన, మనకు కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాము:*
🌹 -1. శారీరక ఆరోగ్యము:*
* రక్తపోటు తగ్గుతుంది
* నిద్ర మెరుగవుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది
* నొప్పుల నివారణకు ఎంతగానో సహాయపడుతుంది

🌹 *2 మానసిక ఆరోగ్యము:*
* భావపరమైన ఉపశమనము కలుగుతుంది 
* మనలోని కోపము, బాధ, ఒత్తిడి తగ్గుతుంది
* మనలో భావజాల స్వేచ్ఛ, మానసిక స్పష్టత కలుగుతుంది

🌹 *3. ఆధ్యాత్మిక స్థాయిలో ఎదుగుదల:*
* కర్మ బంధాలు తొలగిపోతాయి
* స్పందన తరంగాలు (frequency) పెరుగుతాయి
* దైవ కృప ప్రసాదితమవుతుంది

🌹 4. బంధాలలో శాంతి:*
* మనపైన మనకు నమ్మకము పెరుగుతుంది
* మనలో అనురక్తత, కరుణ పెరుగుతుంది
* మనకు తరతరాలుగా వచ్చే బాధలన్నీ నివారణ అవుతాయి  

🌹 *5. అంతర్ముఖ శాంతి మరియు విముక్తి:*
* మనకు ఇతరుల చేసిన తప్పుల్ని మనము మోసే బాధ నుంచి బయటపడతాము
* మనము తేలికగా, ఆనందముగా జీవించగలుగుతాము
* మనలోని అసలైన ఆత్మ స్వరూపముతో మమేకమవుతాము

🧘‍♂️ *"క్షమించటము"ను ఏవిధముగా పూర్తి చెయ్యాలి?*
1. ఆత్మపరిశీలన:
👉 “మేము అంతర్గతముగా ఎవరినైనా నిందిస్తున్నామా? దాని వలన మనకు కలిగే ప్రయోజనమేమిటి?”
👉 “ఇటువంటి ప్రవర్తన లేదా క్రియలు, మమ్ములను ఎటువంటి ప్రవర్తనకు లేదా గుణములకు ప్రభావితము చేస్తున్నాయి?” అని మనల్ని మనమే ప్రశ్నించుకుందాము?

🌹 *2. కరుణాభావము:*
👉 ఇతరులు మనకు కోపము మరియు బాధలను కలిగించిన సమయములో వారి అజ్ఞానాన్ని, ఆవేదనను అర్థము చేసుకుందాము. "అన్ని అనార్తాలకు మూలము అజ్ఞానము". 

🌹 *3. క్షమాపణ లేఖ:*
👉 మన మనస్సులలో గూడు కట్టు కునివున్న బాధను మరియు వేదనలను తీర్చుకునేందుకు గాను ఒక హృదయపూర్వక క్షమాపణ లేఖను వ్రాద్దాము. ఇది చాలా సులభమైనది, సురక్షితము మరియు శ్రేష్టమైనది. క్షమాపణ లేఖను ఎవ్వరికిని పంపాల్సిన అవసరము లేదు. దానిని శ్రీఅగ్ని దేవుల వారికీ గాని లేదా మాతాశ్రీ గంగమ్మ తల్లికి గాని సమర్పిద్దాము.

🌹 *4. ప్రార్థన లేదా ధ్యానము:*
👉 మనకు శారీరకముగా లేదా మానసికముగా, కష్టములు, నష్టములు మరియు బాధలు కలిగించిన వారికీ శుభములు, మంగళములు మరియు శ్రేయస్సు సమృద్ధిగా కలగాలని ప్రార్థన చేద్దాము మరియు వీలయితే శుభాకాంక్షలు తెలియజేద్దాము. వారిని దైవ దూతలుగా భావిద్దాము. ఎందుకంటే మనలో కష్టములు, నష్టములు మరియు బాధలను తట్టుకొని,నిలబడే శక్తి పెరిగేందుకు వారు ప్రత్యక్షముగాను లేదా పరోక్షముగానూ సంహరించారు, వారికీ ధన్యవాదాలు.   

🌹 *5. విడుదల ప్రకటన:*
👉 "గడచిన దినములల్లో జరిగిన అనవసరమైన సంఘటనలకు మరియు పరిస్థితులకు మేము, పిండ ప్రధానము చేసి, తిలోదకాలు ఇచ్చి వదులుకుంటున్నాము" అని మన హృదయముతో చెబుదాము మరియు ఆరోజు నుండి అలాగే ప్రవర్తించుదాము. మన హృదయముతో "మేము స్వేచ్ఛను ఎంచుకుంటున్నాము అని గట్టిగా చెబుదాము మరియు ఆరోజు నుండి అలాగే ప్రవర్తించుదాము. 

🪷 *ముఖ్యమైన గమనిక:* మనకు అవసరము లేని వ్యక్తులను మరియు పరిస్థితులను మర్యాదగాను మరియు గౌరవముతోనూ సాగనంపుదాము. ఇది చాలాశ్రేష్ఠమైన పద్దతి.

🌺 *ఆధ్యాత్మిక సూక్తి:*
"క్షమించడము అంటే మనలోని ఒక ఖైదీని విడిపించడము — ఆ ఖైదీ కూడా మనమే!"
– శ్రీ లూయిస్ బి. స్మిడ్స్

*శ్రీ భగవద్గీతలో భగవాన్ శ్రీకృష్ణ పరమాతూముల వారి పలుకులు:*
“క్షమాగుణము అనేది దేవగుణాల్లో ఒకటి, ఇది మోక్షానికి దారితీస్తుంది.”
అధ్యాయము 16 దైవాసుర సంపద్విభాగ యోగములోని శ్లోకము 3 — దైవగుణాల వివరములలో ఒక ముఖ్యమైన శ్లోకము:

📜 శ్లోకము (Chapter 16, Verse 3
"తేజః క్షమా ధృతిః శౌచమద్రోహో నాతిమానితా |
భవంతి సంపదం దైవీమభిజాతస్య భారత ||"

📖 *తెలుగు అనువాదము (భావార్థము):*
🌼 ఓ భారత,
"ఆత్మచైతన్యము, ప్రకాశవంతమైన ధైర్యము, క్షమా గుణము, హృదయ విశాలత, స్థైర్యము, సంకల్ప బలము,అంతర్గత మరియు బాహ్య శుభ్రత, ప్రేమ (ద్వేషములు లేని వారు, దురభిప్రాయములు లేని వారు), అతిగా గర్వపడని స్వభావము కలవారు" ఇవన్నియు దైవగుణములు, మోక్ష మార్గానికి దారితీసే లక్షణాలు. 

🪷 పైన తెలియజేసిన దైవ గుణములన్నియు సహజముగానే ప్రతి ఒక్కరిలోనూ జన్మతః ఉంటాయి. కానీ కొన్ని మార్చలేని పరిస్థితులు లేదా బలహీనతలు లేదా విధి వలన తాత్కాలికముగా మరుగునపడుతాయి అంతే గాని ఈగుణములు మనలో ఒక్కటి గాని లేవనే నిరాశ లేకుండా ఉందాము. అవన్నీ దాచి పెట్టామంతె.    

🕉️ *ఆధ్యాత్మిక బోధ:*
ఈ శ్లోకములో భగవాన్ శ్రీకృష్ణుల వారు మనకు ఇలా సూచిస్తున్నారు:
👉 మోక్షాన్ని పొందాలంటే మనము తప్పని సరిగా దైవగుణాలను కలిగి ఉండాలి.
👉 క్షమ, శౌచము, నిరహంకారత, ద్వేషరాహిత్యము ఆంటే ప్రేమ వంటి గుణాలు ఉన్నవారే నిజముగా దైవ స్వభావాన్ని ప్రతిబింబిస్తారు.

🪷 *సందేశము:*
👉 *క్షమించటమనేది బలహీనత కాదు — అది గొప్పదైన ఆధ్యాత్మిక ధైర్యము. మనమొకరిని క్షమించినప్పుడు, వారి దుర్మార్గాన్ని మన్నిస్తున్నాము అనే అర్థము కాదు* —
 *"మనలోని మానసిక గాయాలు లేదా బాధలు ఇక నుండి మనలను నియంత్రించవు లేదా బాధ పెట్టవని, మనము తీసుకొనే ఒక శక్తివంతమైన నిర్ణయము." 

🪷 *"సనాతన ధర్మమూ ఆంటే: ఆత్మచైతన్యము, ప్రకాశవంతమైన ధైర్యము, క్షమా గుణము, హృదయ విశాలత, స్థైర్యము, సంకల్ప బలము,అంతర్గత మరియు బాహ్య శుభ్రత మరియు ప్రేమ"*


 మర్యాదగాను మరియు గౌరవముతోనూ వదిలించుకుందాము. ఇది చాలాశ్రేష్ఠమైన పద్దతి.

🌺 ఆధ్యాత్మిక సూక్తి:
"క్షమించడము అంటే మనలోని ఒక ఖైదీని విడిపించడము — ఆ ఖైదీ కూడా మనమే!"
– శ్రీ లూయిస్ బి. స్మిడ్స్

శ్రీ భగవద్గీతలో భగవాన్ శ్రీకృష్ణ పరమాతూముల వారి పలుకులు:
“క్షమాగుణము అనేది దేవగుణాల్లో ఒకటి, ఇది మోక్షానికి దారితీస్తుంది.”
అధ్యాయము 16 దైవాసుర సంపద్విభాగ యోగములోని శ్లోకము 3 — దైవగుణాల వివరములలో ఒక ముఖ్యమైన శ్లోకము:

📜 శ్లోకము (Chapter 16, Verse 3
"తేజః క్షమా ధృతిః శౌచమద్రోహో నాతిమానితా |
భవంతి సంపదం దైవీమభిజాతస్య భారత ||"

📖 **తెలుగు అనువాదము (భావార్థము):
🌼 ఓ భారత,
"ఆత్మచైతన్యము, ప్రకాశవంతమైన ధైర్యము, క్షమా గుణము, హృదయ విశాలత, స్థైర్యము, సంకల్పబలము,అంతర్గత మరియు బాహ్య శుభ్రత, ప్రేమ (ద్వేషములు లేని వారు, దురభిప్రాయములు లేని వారు), అతిగా గర్వపడని స్వభావము కలవారు" ఇవన్నియు దైవగుణములు, మోక్ష మార్గానికి దారితీసే లక్షణాలు. 

పైన తెలియజేసిన దైవ గుణములన్నియు సహజముగానే ప్రతి ఒక్కరిలోనూ జన్మతః ఉంటాయి. కానీ కొన్ని మార్చలేని పరిస్థితులు లేదా బలహీనతలు లేదా విధి వలన తాత్కాలికముగా మరుగునపడుతాయి అంతే గాని ఈగుణములు మనలో ఒక్కటి గాని లేవనే నిరాశ లేకుండా ఉందాము. అవన్నీ దాచి పెట్టామంతె.    

🕉️ ఆధ్యాత్మిక బోధ:
ఈ శ్లోకములో భగవాన్ శ్రీకృష్ణుల వారు మనకు ఇలా సూచిస్తున్నారు:
👉 మోక్షాన్ని పొందాలంటే మనము తప్పని సరిగా దైవగుణాలను కలిగి ఉండాలి.
👉 క్షమ, శౌచము, నిరహంకారత, ద్వేషరాహిత్యము ఆంటే ప్రేమ వంటి గుణాలు ఉన్నవారే నిజముగా దైవ స్వభావాన్ని ప్రతిబింబిస్తారు.

🪷 చివరి సందేశము:
👉 క్షమించటమనేది బలహీనత కాదు — అది గొప్పదైన ఆధ్యాత్మిక ధైర్యము.
మనమొకరిని క్షమించినప్పుడు, వారి దుర్మార్గాన్ని మన్నిస్తున్నాము అనే అర్థము కాదు —
 "ఈ మానసిక గాయాలు లేదా బాధలు ఇక నుండి మనలను నియంత్రించదు లేదా బాధ పెట్టదని, మనము తీసుకొనే ఒక శక్తివంతమైన నిర్ణయము." 

"సనాతన ధర్మమూ ఆంటే: ఆత్మచైతన్యము, ప్రకాశవంతమైన ధైర్యము, క్షమా గుణము, హృదయ విశాలత, స్థైర్యము, సంకల్పబలము,అంతర్గత మరియు బాహ్య శుభ్రత మరియు ప్రేమ"

                    😊🙏
*జై సనాతన ధర్మ భారత మాతాకీ జై*


క్షమాపణ

  

🌼 క్షమాపణ అనే గుణమును కలిగిఉంటే ఆధ్యాత్మిక మార్గములో ప్రయాణము చాలా సులువు.
ప్రస్తుతమున్న పరిస్థితులలో మనము పొరపాట్లు లేదా తప్పులు చేయడమన్నది సహజం. కానీ, హృదయపూర్వక క్షమాపణ + సరైన చర్య = దైవ తత్వానికి మార్గము 
“గతాన్ని మనము మార్చలేము, కానీ మన చర్యల ద్వారా నష్ట పోయినవారికి వీలయితే , ఆ నష్టమును భర్తీ చేస్తేనే నిజమైన "క్షమాపణ" అర్థము మరియు పరమార్థము ఇచ్చే శక్తి మాత్రం మనకు ఉంది.
 
ఇది కేవలము క్షమాపణ మాత్రమే కాదు, ఇది ఆత్మశుద్ధి యాత్రకు మొదటి మెట్టు.

🪷 1. మనము చేసిన తప్పు వలన జరిగిన బాధను తెలుసుకోవడము

మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి:
 “మా మాటలు లేదా పనులు వారి మనసును ఎంతగా బాధపరిచాయి?”
 “ఆ బాధ ఎంత లోతుగా ఉండొచ్చును?”
ఈ తెలివైన స్వీయవిమర్శ - ఒక శుద్ధి ప్రక్రియ.

🪷 2. సత్యవంతమైన బాధను అనుభవించండి – కానీ ఎవ్వరిని నిందించవద్దు

తప్పు చేసినందుకు గాను మనస్ఫూర్తిగా బాధపడటము = మన మనస్సును శుద్ధి చేస్తుంది.

మన మనసులో చెప్పుకుందాము:
“అప్పటి పరిస్థితుల్లో మాకున్నతెలివి మరియు శక్తికి తగినట్టుగా మేము ప్రవర్తించాము. కానీ మేము మెరుగవుతున్నాము. గతములో మేము చేసిన పని తప్పని ఇప్పుడు మాకు బోధ పడింది.
👉 సత్యవంతమైన బాధ + అవగాహన = మేధస్సు

🪷 3. శక్తివంతమైన మార్పును కలిగిద్దాము (Practical Amends)
వ్యక్తిగతంగానైనా సరే లేదా భగవంతుని మనసులోనే అడుగుదాము:
“మేము చేసిన తప్పును సరిదిద్దేందుకు మేము ఏమి చేయ్యాలి?”

ఉదాహరణకు ఈ క్రిందివాణ్ణి చేద్దాము:
* హృదయపూర్వకమైన క్షమాపణ 🙏
* ఒక పత్రము లేదా సందేశము ✉️
* ఓ మంచి పని లేదా సేవ 🌷
* అదే తప్పును మళ్ళీ తిరిగి చేయకుండా జాగ్రత్తపడటము 🌱

🪷 4. మొదటగా మనల్ని మనమే క్షమించుకోవాలి
ఈ మంత్రమును మనసులో పదే పదే చెప్పుకుందాము:
“అప్పటి పరిస్థితుల్లో మాకున్నతెలివి మరియు శక్తికి తగినట్టుగా మేము ప్రవర్తించాము. కానీ మేము మెరుగవుతున్నాము. కాబట్టి మనల్ని మనమే క్షమించుకుందాము.”

👉 స్వీయఆత్మ క్షమాపణ లేకుండా ఎవ్వరిని పూర్తిగా క్షమించడము సంభవించదు.

🪷 5. మన వలన బాధపడిన వారి ఆత్మల‌కు శాంతి మరియు ఆశీర్వాదములను పంపుదాము 
మన మనసులో భగవంతుని ఎదుట ఇలా చెపుదాము:
మా వలన కష్టనష్టములు మరియు బాధ కలిగిన వారికీ శాంతి కలగును గాక. మనము ఈపని చెయ్యడము వలన మనలో ప్రేమ మరియు కరుణ పెరుగుతుంది.”
👉 ఇది ఒక *శక్తివంతమైన ఆధ్యాత్మికము మరియు శాంతి వంతమైన వేదిక*ను నిర్మిస్తుంది.

🪷 6. మనము చేసిన తప్పులను ఒక గుణ పాఠముగా మార్చుకుందాము 
మన మనసులో ప్రశ్నించుకుందాము:
 “ఈ అనుభవము ద్వారా మేము ఏమి నేర్చుకున్నాము? మన యొక్క ఆత్మ, ఏవిధముగా అభివృద్ధి చెందదలిచినది?”
👉 తప్పు → గుణ పాఠము → పరిపక్వత.(అర్థము చేసుకొని జీవిస్తే)

🪷 7. క్షమాపణను నిత్య జీవన మార్గముగా మార్చుకుందాము 
మన మాటలు-శక్తివంతమైనవి మరియు 
మన ఆచరణ-దైవ సాక్ష్యముగా మారుతుంది.
మన మనసులో ఒక వ్రతమూలాగా చేపట్టుదాము:
“ప్రతి రోజు మన ప్రేమ, మన యొక్క క్షమాపణలకు సాక్ష్యముగా ఉంటుంది.”

💖 క్షమాపణను అడిగే విధానము: 
ప్రతి పదాన్ని మనము ప్రేమ, దయతోనూ మరియు మనస్ఫూర్తిగా అడుగుదాము:

🧘‍♀️ "మేము చేసిన పనులకు మమ్ములను శిక్షించకుండా, దయచేసి మమ్మల్ని క్షమించండి.
మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాము.
మీకు మేము కృతజ్ఞులము.
మేము నేర్చుకుంటున్నాము.
మేము మారటానికి సిద్ధముగా ఉన్నాము.
మీలో శాంతి మరియు ప్రేమ సమృద్ధిగా కలుగును గాక. 
మన మధ్యన చక్కని ఒక మార్గము ఉండును గాక ."
మేము చేసిన తప్పుకు ఎప్పుడు మేమేమి చెయ్యాలో దయచేసి తెలియజేయండి, ప్లీజ్.

ముగింపు:
1 మొదటగా మనము చేసిన తప్పుల వలన జరిగిన నష్టమును మరల మరలా తలచుకొని, మనల్ని మనమే నిందించుకొనకుండా, మనల్ని మనమే క్షమించుకుందాము. మనల్ని మనము క్షమించుకొనకుండా వేరెవ్వరిని క్షమించలేము. (స్వీయ ప్రేమ)

2 . మనము చేసిన తప్పులను దేవుడు క్షమించాలి అంటే ముందుగా మనము ఇతరులు చేసిన తప్పులను క్షమించాలి (కరుణను కలిగివుండడము)

3 . పైన తెలియజేసిన పనులు చేసిన తరువాతనే మనము క్షమాపణలను కోరుదాము. (ఏకత్వ భావన)

పైన తెలియపరచి పనులను మనము హృదయపూర్వకముగా చెయ్యడము వలన, మన మధ్యలో ఉన్న ఎటువంటి విభేదాలు అయినా సరే తొందరలోనే సమసిపోతాయి.

దైవత్వమంటేనే "ప్రేమ, దయ, కరుణ మరియు ఏకత్వ భావన"  
కత్తితో సాధించలేనిది "ప్రేమ, దయ, కరుణ మరియు ఏకత్వ భావనలతో మనము సాదిద్దాము.

ఓం శ్రీ సమస్తా లోకా సన్మంగళాని భవంతు

సనాతన ధర్మము అంటేనే "ప్రేమ, దయ, కరుణ, క్షమిచడము మరియు జరిగిన వాటినన్నింటిని హృదయపూర్వకముగా అంగీకరించడము".


*జై సనాతన ధర్మ భారత మాతాకీ జై*


భారతీయ ప్రాచీన జీవన శైలి గొప్పతనం

🕉️ భారతీయ ప్రాచీన జీవన శైలి గొప్పతనం

పూజా విధానం | పాత్రలు | శాస్త్రీయ విజ్ఞానం | ప్రకృతి అనుసంధానం | దేవాలయ సంస్కృతి


---

🛕 1. దేవాలయాలు & పూజా విధానం – శాస్త్రీయతతో కూడిన ఆధ్యాత్మికత

దేవాలయ నిర్మాణం: వాస్తుశాస్త్రానికి అనుగుణంగా భూమి చుంబక కేంద్రాలపై నిర్మించడం వల్ల పాజిటివ్ ఎనర్జీ స్రవించేది.

ఘంటలు, శంఖం, దమరు: ఇవి విడుదల చేసే ధ్వనులు వాతావరణాన్ని శుద్ధి చేస్తాయి, మెదడులో రెండు వైపుల రిస్పాన్స్‌ను సమతుల్యం చేస్తాయి.

దీపారాధన, ధూపం, కర్పూరం: వ్యాధికారక సూక్ష్మజీవులను నశింపజేస్తుంది.



---

⚙️ 2. పాతకాలపు తంత్రज्ञानం – లోహ విజ్ఞానం

ఢిల్లీ లోహ స్తంభం: 1600 సంవత్సరాలుగా తుప్పు పట్టని అద్భుతం. ఫాస్ఫరస్ ఎక్కువగా ఉన్న లోహం వాడటం వల్ల ఇది సాధ్యపడింది.

వూట్జ్ స్టీల్ (Wootz Steel): ప్రపంచ ప్రఖ్యాత ‘డమాస్కస్’ ఖడ్గాలు భారత స్టీల్ వాడి తయారు చేసేవారు.

బెల్లాలు, శంఖాలు: శబ్ద తరంగాలు, కంపనాలు శరీరానికి, వాతావరణానికి శుభప్రభావం చూపేవి.



---

🍲 3. వంట పాత్రలు – ఆరోగ్యానికి మేలు చేసే శాస్త్రం

మట్టిపాత్రలు: తేమను నిలుపుతాయి, మినరల్స్ కలిపి పోషణ పెంచుతాయి.

తాంబేరు, పిత్తల, కంచు పాత్రలు:

తాంబేరు సూక్ష్మజీవులను చంపుతుంది.

కంచు ఆహారాన్ని ఎక్కువసేపు పాడవకుండా ఉంచుతుంది.

లోహాల విష ప్రభావాన్ని తగ్గించేందుకు లోపల సీసం పూత వేయడం ఎంతో శాస్త్రీయమైనది.


ఇనుప పాన్: మన శరీరానికి అవసరమైన ఐరన్‌ను సహజంగా అందిస్తుంది.



---

🚰 4. త్రాగునీటి పాత్రలు – శుద్ధి & ఆరోగ్యం

తాంబేరు గ్లాసులు, కుళాయి:

తాంబేరు నీటిని శుద్ధి చేస్తుంది.

కాలేయ, కడుపు సంబంధిత సమస్యలకు శుభప్రభావం.

ఉదయం తాంబేరు నీరు తాగితే త్రిదోషాలను సమతుల్యం చేస్తుంది.


మట్టి కుళాయిలు: నీటిని సహజంగా చల్లగా ఉంచుతాయి. ఫ్రిజ్ అవసరం లేదు.



---

🌿 5. ప్రకృతితో అనుసంధానమైన జీవితం

ప్రాచీన వ్యవసాయం: రసాయనాలు లేని, పశు ఆధారిత ప్రకృతి వ్యవసాయం. పంచగవ్య, గోమయం వాడేవారు.

ఋతు ఆహారం: ఋతువులకు అనుగుణంగా ఆహారం – ఇది శరీరానికి తగిన శక్తిని ఇస్తుంది.

ఆయుర్వేదం: జీవన శాస్త్రం. పంచభూతాల సమతుల్యత, శరీర ధాతువుల బలాన్ని ఆధారంగా తీసుకొని చికిత్స.



---

🧘 6. దినచర్య (Daily Routine) – ఆరోగ్యానికి నిబంధనలు

బ్రహ్మ ముహూర్తంలో లేవడం: మెదడుకు ఉత్తమ సమయం. హార్మోన్ సమతుల్యతకు సహాయం.

తెప్పెన లాగడం (Oil Pulling), నస్యం, అభ్యంగం: శరీర డిటాక్స్ కోసం.

తాజా వంట, మళ్లీ వేయకూడదు: ప్రాణశక్తి (ప్రాణం) కాపాడుతుంది.



---

🪔 7. సనాతన ధర్మం – ఖగోళం & జీవితం

యజ్ఞాలు: వాతావరణాన్ని శుద్ధి చేస్తాయి, NASA అధ్యయనాల ప్రకారం ఓజోన్ స్థాయి పెరుగుతుంది.

నవగ్రహ పూజలు: ఖగోళ శక్తులతో మన జీవన ప్రక్రియను అనుసంధానం చేస్తుంది.

108 మణులు ఉన్న జపమాల: భూమి–సూర్య మధ్య దూరానికి సంబంధించి ఖగోళ గణితంలోని చిహ్నం.



---

🔔 గమ్యం: ఎందుకు ఈ జీవితం గొప్పది?

✅ ప్లాస్టిక్ లేదు – ప్రకృతికి హాని లేదు
✅ శాస్త్రం & ఆధ్యాత్మికత కలయిక
✅ ఆరోగ్యం, ప్రకృతి, సమాజం – అన్ని సమతుల్యం



లిపిడ్ ప్రొఫైల్ అంటే ఏమిటి?*

*లిపిడ్ ప్రొఫైల్ అంటే ఏమిటి?* 

ఒక ప్రముఖ వైద్యుడు లిపిడ్ ప్రొఫైల్‌ను చాలా చక్కగా వివరించాడు మరియు దానిని ఒక ప్రత్యేకమైన రీతిలో వివరించే అందమైన కథను పంచుకున్నాడు. 
మన శరీరం ఒక చిన్న పట్టణం అని ఊహించుకోండి. 
ఈ పట్టణంలో అతిపెద్ద సమస్య సృష్టించేది - *కొలెస్ట్రాల్* అతనికి కొంతమంది సహచరులు కూడా ఉన్నారు. నేరంలో అతని ప్రధాన భాగస్వామి - *ట్రైగ్లిజరైడ్* 

వీధుల్లో తిరగడం, గందరగోళం సృష్టించడం మరియు రోడ్లను అడ్డుకోవడం వారి పని. 

*హృదయం* ఈ పట్టణం యొక్క నగర కేంద్రం. అన్ని రోడ్లు హృదయానికి దారి తీస్తాయి. ఈ సమస్య సృష్టించేవారు పెరగడం ప్రారంభించినప్పుడు, ఏమి జరుగుతుందో మీరు ఊహించవచ్చు. వారు గుండె పనిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ మన శరీర పట్టణంలో కూడా ఒక పోలీసు దళం మోహరించబడింది - అదే *HDL* మంచి పోలీసు ఈ సమస్య సృష్టించేవారిని పట్టుకుని జైలులో పెడతాడు 

*(కాలేయం)*. అప్పుడు కాలేయం వారిని శరీరం నుండి తొలగిస్తుంది - మన డ్రైనేజీ వ్యవస్థ ద్వారా. కానీ అధికారం కోసం ఆకలితో ఉన్న ఒక చెడ్డ పోలీసు - *LDL* కూడా ఉన్నాడు. 
LDL ఈ దుర్మార్గులను జైలు నుండి బయటకు తీసుకెళ్లి తిరిగి వీధుల్లోకి పంపుతుంది. 

మంచి పోలీసు *HDL* (తగ్గిన ) పడిపోయినప్పుడు, మొత్తం పట్టణం అల్లకల్లోలంగా మారుతుంది. 

అటువంటి పట్టణంలో ఎవరు నివసించాలనుకుంటున్నారు? 

మీరు ఈ దుర్మార్గులను తగ్గించి మంచి పోలీసుల సంఖ్యను పెంచాలనుకుంటున్నారా? *నడక* ప్రారంభించండి! ప్రతి అడుగుతో *HDL* పెరుగుతుంది మరియు *కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్* మరియు *LDL* వంటి దుర్మార్గులు తగ్గుతాయి. 

మీ శరీరం (పట్టణం) లో మళ్ళీ ప్రాణం పోసుకుంటుంది. మీ గుండె - నగర కేంద్రం - దుండగుల అడ్డంకి *(హార్ట్ బ్లాక్)* నుండి రక్షించబడుతుంది. మరియు గుండె ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి మీకు అవకాశం వచ్చినప్పుడల్లా - ప్రారంభించండి

*ఆరోగ్యంగా ఉండండి...* మరియు *మీకు మంచి ఆరోగ్యం కావాలని కోరుకుంటున్నాను* *ఈ వ్యాసం HDL (మంచి కొలెస్ట్రాల్) పెంచడానికి మరియు LDL (చెడు కొలెస్ట్రాల్) తగ్గించడానికి ఉత్తమ మార్గాన్ని మీకు చెబుతుంది, అంటే నడక.* ప్రతి అడుగు HDL ను పెంచుతుంది. 

కాబట్టి - *రండి, ముందుకు సాగండి మరియు కదులుతూ ఉండండి.* *వృద్ధుల వారోత్సవ శుభాకాంక్షలు* ఈ విషయాలను తగ్గించండి:- 
1. ఉప్పు 

2. చక్కెర 

3. శుద్ధి చేసిన పిండి 

4. పాల ఉత్పత్తులు 

5. ప్రాసెస్ చేసిన ఆహారాలు 

*ప్రతిరోజూ ఇవి తినండి:-* 

1. కూరగాయలు 2. పప్పులు 3. బీన్స్ 4. గింజలు 5. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ 6. పండ్లు *మర్చిపోవడానికి ప్రయత్నించాల్సిన మూడు విషయాలు:* 
1. మీ వయస్సు 2. మీ గతం 3. మీ మనోవేదనలు *అలవాటు చేసుకోవాల్సిన నాలుగు ముఖ్యమైన విషయాలు:* 

1. మీ కుటుంబం 2. మీ స్నేహితులు 3. సానుకూల ఆలోచన 4. ఇంటిని శుభ్రపరచడం మరియు స్వాగతించడం *అలవాటు చేసుకోవాల్సిన మూడు ప్రాథమిక విషయాలు:* 
1. ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండండి 2. మీ స్వంత వేగంతో క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయండి 3. మీ బరువును తనిఖీ చేసుకోండి మరియు నియంత్రించండి *మీరు అలవర్చుకోవాల్సిన ఆరు ముఖ్యమైన జీవనశైలి అలవాట్లు:* 
1. నీరు త్రాగడానికి దాహం వేసే వరకు వేచి ఉండకండి. 
2. విశ్రాంతి తీసుకోవడానికి అలసిపోయే వరకు వేచి ఉండకండి. 
3. వైద్య పరీక్షల కోసం అనారోగ్యంతో బాధపడే వరకు వేచి ఉండకండి. 
4. అద్భుతాల కోసం వేచి ఉండకండి, దేవునిపై నమ్మకం ఉంచండి. 
5. మీపై ఎప్పుడూ నమ్మకం కోల్పోకండి. 

Sunday, July 6, 2025

మహోదయము సత్యాలు

😊🙏 *మహోదయము*      

🕉️ *“మనమంతా ఎంతో శ్రద్దగా సాత్విక ఆహరమును తీసుకుంటున్నాము, యోగా, వ్యాయామములు చేస్తున్నాము, సేవా కార్యక్రమాలల్లో పాల్గొంటున్నాము, ధ్యానము చేస్తున్నాము, ధర్మాన్ని అనుసరిస్తున్నాము.కా నీ, అన్నీ చేస్తున్నప్పటికీ, మనము సుఖముగా, సంతోషముగా, ఆనందముగా, ఆర్థిక సమృద్ధిని మరియు శాంతితో ఎందుకు జీవించడము లేదు?”*

❔ *ఈ ప్రశ్న మనందరిలోనూ ఉన్నదే కదా, అంతే కాకుండా ఇవన్నీ ఎంతో నిష్ఠగా చేసే (వారికే కష్టాలు అధికముగా రావడము మనందరమునూ చూస్తూనే ఉన్నాము. కాబట్టి ఈ విషమును గూర్చి క్లుప్తముగా తెలుసుకుందాము.*

🪷 *మనమంతా ఎంతో శ్రద్దగా సాత్విక ఆహారమును తీసుకుంటున్నాము, యోగా, వ్యాయామములు చేస్తున్నాము, సేవా కార్యక్రమాలల్లో పాల్గొంటున్నాము, దానములు మరియు ధ్యానము చేస్తున్నాము, సేవను మరియు ధర్మాన్ని అనుసరిస్తున్నాము. అన్నీ చేస్తున్నప్పటికీ, *మన శరీరములో ఆరోగ్యము లేదు, మనసులో ప్రశాంతత లేదు, హృదయములో ఆనందము లేదు, ఆర్థికంగా పుష్కలత లేదు, ఆత్మ స్థాయిలో ఆనందము కనిపించడము లేదు. సనాతన ధర్మము ప్రకారము, దీని వెనుక ఉన్న లోతైన కారణాలను తెలుసుకుందాము.*

🌼 *సనాతన ధర్మము ప్రకారము – పైన తెలియజేసినవన్నీపొందలేకపోవడానికి గల 7 ముఖ్యమైన కారణాలు*
 
1️⃣ *మనము“ అన్ని పనులనూ చేస్తున్నాము” కానీ “చైతన్యవంతముగా పనులనూ చేయడాన్ని మర్చిపోయాము*:
🪷 *మనము యోగా, వ్యాయామాలు, ధ్యానము, దానాలు మరియు సేవ చేస్తున్నాము – కాని మనలో *“నేను చేస్తున్నాను” అనే అహంకార భావము అలానే ఉండి పోయింది.*

🕉️ *శ్రీ భగవద్గీత చెబుతున్నది*:
😊 *“నాహం కర్తా – హరి కర్తా”*
👉 *మనము కర్తలము కానే కాదు, పరమాత్మనే కర్త.* 
✅ *మనము చేసిన పొరపాటు:* *మానసికముగా "నేను చేస్తున్నాను" అనే భావముతో పుణ్యమును కూడబెట్టే ప్రయత్నమును చేసాము.*

2️⃣ *ప్రతి ఫలాశతో ఆచరణ – (ప్రతిఫలమును పొందాలనే కోరిక):*
🪷 *“మనము మంచి చేస్తే, మనకు మంచే జరగాలి” అని అనుకుంటున్నాము – ఇది వ్యాపార ధర్మము, అంతే గాని భక్తి ధర్మము కనే కాదు.*

🕉️ *శ్రీ భగవద్గీత చెబుతున్నది:*
😊 *“కర్మణ్యేవాధికారస్తే, మా ఫలేషు కదాచన”*
✅ *మనము చేసిన పొరపాటు:* *ఆచరణను ప్రేమతో కాకుండా ఫలితాల కోసము చెయ్యడము.*

3️⃣ *బహ్య శుద్ధి మాత్రమే ఉంది - అంతర్గత (చిత్త మరియు ఆత్మ) శుద్ధి లేదు*
🪷 *మనము శరీర శుద్ధి, ఆహార నియమాలు పాటిస్తున్నాము. కాని మన మనస్సులో ఇంకా *ద్వేషము, స్వార్థము, అపరాధ భావము, మానసిక గాయాలు అలాగే ఉన్నాయి.* 

🔥 *సనాతన ధర్మము చెబుతున్నది:* *“మధ్యే మార్గము = అంతర్ముఖత”*
✅ *మనము చేసిన పొరపాటు:* *ధ్యానముతో పాటుగా మనస్సులోని చెడు భావాలను శుద్ధి చేయకపోవడము.*

4️⃣ *మనము “మంచి”గా నటిస్తున్నాము – కాని, మనలోని “నిజమైన” మనల్ని, మనము చూడడము లేదు:*
*మనము బాహ్యముగా సానుకూలముగానే ఉంటున్నాము, కానీ లోపల బాధలు, అసంతృప్తి, భయాలు ఇంకా మిగిలేవున్నాయి.*

🌼 *సనాతన ధర్మము చెబుతున్నది:*
*“సత్యం శివం సుందరం”*
✅ *మనము చేసిన పొరపాటు:* *మన లోపలి బాధలను మనము అంగీకరించకుండా, దాచివెయడము.*

5️⃣ **స్వధర్మాన్ని మర్చిపోవడము – (అనుకరనాత్మక జీవితమును అనుసరించడము)**
🪷 *మనము మంచిగా పని చేస్తున్నాము – కానీ అది నిజముగా మన యొక్క ఆత్మ ధర్మమా? లేక మనము ఇంకొకరిని చూసి అనుకరిస్తున్నామా? అని మనమెప్పుడైనా ప్రశ్నించుకున్నామా.*

🕉️ *శ్రీ భగవద్గీత చెబుతున్నది:*
😊 *“శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్”*
✅ *మనము చేసిన పొరపాటు: మనకు చెందిన స్వధర్మాన్ని గట్టిగా పట్టుకోనకుండా, పరులకు చెందిన ధర్మాన్ని అనుసరించడము. ఇది సనాతన ధర్మానికి విరుద్ధము.*

6️⃣ *శ్రద్ధ లేని సేవ – ప్రేమ లేకుండా కర్తవ్యము*:
*మనము సేవను అనుభూతితో కాకుండా, కేవలము ఒక డ్యూటీగా చేస్తున్నాము. దీనివల్ల మనలోని భక్తి బలహీనమవుతున్నది.*
🌷 *సేవ అంటే=ప్రేమతో కూడిన త్యాగము.*
✅ *మనము చేసిన పొరపాటు:* *మనము ప్రతి రోజూ పనులను “ఎందుకు చేస్తున్నాము?” అన్న ఆత్మ పరిశీలన చేసుకోకపోవడము.*

7️⃣ *ఆనందము కోసము బయట వెతుకుతున్నాము – కానీ అది మనలోనే ఉంది.*
🪷 *మనము ఆనందాన్ని సాధించాలనుకుంటున్నాము – కానీ ఆనందమనేది మన సహజ స్వరూపము అని మర్చిపోయాము.*

📜 *ఉపనిషత్తులు చెబుతున్నాయి:*
*😊 “ఆనందో బ్రహ్మేతి” – ఆనందమే పరబ్రహ్మ*
*😊 “తత్త్వమసి” – నీవే అది*

✅ *మనము చేసిన పొరపాటు:* *మనము ఆనందాన్ని వెలుపల వెతకడము మరియు లోపల చూడడమనే ప్రక్రియను మర్చిపోవడము.*

🌺 **సారాంశము:**
🔺 *మనము చేసిన పొరపాట్లు* / ✅ *పరిష్కారములు*                            
🌹 *అహంకారముతో చేయడము* / *దైవాన్ని కర్తగా అంగీకరించడము*               
🌹 *ప్రతి ఫలాపేక్ష జీవితము* / *ఫలాన్ని త్యజించడము*                      
🌹 *అంతర్ముఖత లేకపోవడము* / *మానసిక శుద్ధి, క్షమాభావము*                 
🌹 *నిజాన్ని దాచడము* / *ధైర్యముగా ఆత్మ పరిశీలన చేయ్యడము*                
🌹 *స్వధర్మమును మర్చిపోవడము* / *మన ఆత్మ ధర్మాన్ని అనుసరించడము*             
🌹 *ఒక డ్యూటీ లాగా సేవ* / *ప్రేమతోనూ మరియు పరమార్థముతోనూ సేవ చేయ్యడము*                 
🌹 *ఆనందము కోరకు పోరాటము* / *నిశ్శబ్దము ద్వారా దివ్యత్వాన్ని గుర్తించడము*

✨ **సనాతన సత్యజ్ఞానములో జీవిద్దాము – ఆనందమనేది - మన సహజ ధర్మము మరియు జన్మ హక్కు**

🪷 *మన యొక్క లక్ష్యము – త్యాగముతో కూడిన జీవితము మరియు స్వయం ప్రకాశముగా ఉండే ఆనందభరితమైన స్థితి.*

*🪷 మనము వెళ్ల వలసిన మార్గములు – దైవ శరణాగతి, భక్తి, ధ్యానము, నిజమైన సేవ.*
*🪷 మనము పొందవలసిన అనుభవాలు – శరీరము ఆరోగ్యంగానూ, మనస్సు శాంతముగానూ, హృదయము ఆనందముగానూ, ఆత్మలో పరిపూర్ణ శాంతి.*         

*జై సనాతన ధర్మ భారత మాతాకీ జై*


Thursday, July 3, 2025

తిప్పతీగ ఉపయోగాలు - సంపూర్ణ వివరణ

తిప్పతీగ ఉపయోగాలు - సంపూర్ణ వివరణ . 

      తిప్పతీగ అనునది ప్రతి వూరు డొంకలలో పెరుగుతుంది . దీనిని సంస్కృతంలో " గుడూచీ" అని పిలుస్తారు . దీనికి అర్థం వ్యాధుల నుండి రక్షించునది అని అర్థం. " అమృత" అనే పేరు కూడా దీనికి కలదు. అనగా అమృతమునకు సమానం అయినది అని అర్థం. 

            ఇప్పుడు మీకు దీనిలోని ఔషధ గుణముల గురించి మీకు వివరిస్తాను. 

  తిప్పతీగ యందలి ఔషధ గుణములు - 

 * ఇది వాత , పిత్త , కఫ దోషముల మూడింటి మీద పనిచేస్తుంది . బలకరము , ఆకలిని పెంచుతుంది . మెదడుకు మంచిది . నేత్రములకు బలాన్ని ఇచ్చును. పాండు , కామెర్లు , జ్వరము , మూత్రవ్యాధులు , కుష్ఠు , దగ్గు మొదలగు వ్యాధులను పోగొట్టును . కడుపులోని నులిపురుగులను నశింపచేయును . తల్లిపాలను శుద్ధిచేయును . 

 * జ్వరములలో తిప్పతీగ కషాయం 20ml ఉదయము , సాయంత్రం ఇచ్చిన జ్వరములు తగ్గును. 

 * మూత్రసంబంధ వ్యాధులలో తిప్పతీగ రసములో తేనె కలిపి ఇవ్వాలి. కామెర్ల యందు కూడా తిప్పతీగ రసములో ప్రతిరోజూ తేనె కలిపి ఇచ్చిన కామెర్ల సమస్య తగ్గును. 

 * కీళ్లనొప్పుల యందు తిప్పతీగ , శొంఠి కలిపి ఇచ్చిన కీళ్లనొప్పులు తగ్గును. 

 * ప్రతిరోజూ తిప్పతీగ రసం తాగించి రోగి బలానుసారం కందికట్టులో నెయ్యి చేర్చిన అన్నము తినుచున్న కుష్ఠు వ్యాధి తగ్గును. 

 * తిప్పతీగ రసమును ప్రతిరోజూ ఉదయం , సాయంత్రం ఒక నెలరోజుల పాటు సేవిస్తే ఏ వ్యాధులు రాకుండా , ముసలితనం రాకుండా మానవుడు ఆరోగ్యముగా ఉండును. 

 * తిప్పతీగ చూర్ణము , బెల్లం , నెయ్యి , తేనె కలిపి ముద్దగా చేసి ఉండలా చేసి రోజూ ఒక ఉండ తింటే మానవుడు ఆరోగ్యముగా 100 సంవత్సరాలు జీవిస్తాడు. 

 * తిప్పతీగ రసం కొద్దిగా నూనెలో కలిపి తాగిన బోదకాలు తగ్గును. 

 * తిప్పతీగ కషాయంలో పిప్పలి చూర్ణం కలిపి ఇచ్చిన చాలా రోజుల నుంచి వేధిస్తున్న జీర్ణజ్వరం తగ్గును. 

 * తిప్పతీగ కషాయం ప్రతిరోజూ సేవించిన మధుమేహం తగ్గును. మూత్రాశయపు రాళ్లు కూడా కరిగిస్తుంది. 

 * మొలల సమస్య ఉన్నవారు తిప్పతీగ స్వరసాన్ని మజ్జిగతో కలిపి వాడవలెను . 

 * తిప్పతీగ కషాయాన్ని సేవించిన వాంతులు తగ్గును. 

 
       

Tuesday, July 1, 2025

అంజీర తో లాభాలు*


*+++++++++++++++++++*
*అంజీర తో లాభాలు*
*!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!*

అంజీర (Anjeer/Fig) ఒక పోషక విలువలతో నిండి ఉన్న పండు. ఇది తాజా లేదా ఎండబెట్టిన రూపంలో అందుబాటులో ఉంటుంది. ఆరోగ్యానికి అంజీర ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తుంది. క్రింది విధంగా అంజీర ప్రయోజనాలను తెలుగులో వివరించాం:

అంజీర్‌తో ఆరోగ్య ప్రయోజనాలు:

1. జీర్ణవ్యవస్థ మెరుగుపరుస్తుంది
అంజీరులో ఫైబర్ అధికంగా ఉండటం వలన ఇది జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది. మలబద్ధకం (Constipation) సమస్యను నివారించడంలో సహాయపడుతుంది.


2. హృదయ ఆరోగ్యానికి మంచిది
ఇందులో పటాసియం, మాంగనీస్ వంటి ఖనిజాలు ఉండటం వలన రక్తపోటును నియంత్రించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.


3. రక్తహీనతకు నివారణ
అంజీరులో పొట్టెరైన్స్ (Iron) ఉండటం వలన ఇది రక్తహీనత (Anemia) నివారణకు ఉపయోగపడుతుంది.


4. ఎముకల బలం పెరుగుతుంది
కాల్షియం, మెగ్నీషియం ఉండటంతో ఎముకల బలాన్ని పెంచుతుంది. ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు దూరం చేస్తుంది.


5. ఇమ్యూనిటీ పెరుగుతుంది
అంజీరులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ C ఉండటం వలన రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.


6. చర్మం మెరిసిపోతుంది
అంజీరులోని పోషకాలు చర్మానికి పోషణనివ్వడం వలన తళతళలాడే చర్మాన్ని పొందవచ్చు.


7. బరువు తగ్గాలనుకునేవారికి మంచిది
తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ ఉండటం వలన ఇది ఆకలి నియంత్రణలో సహాయపడుతుంది.



వాడక విధానం:

ప్రతి రోజు ఉదయం 2-3 ఎండిన అంజీరును నీళ్లలో నానబెట్టి తినటం మంచిది.

తాజా అంజీరును జ్యూస్ లేదా స్మూథీగా తీసుకోవచ్చు.


గమనిక: డయాబెటిస్ ఉన్న వారు డాక్టర్ సూచనల మేరకు మాత్రమే తీసుకోవాలి, ఎందుకంటే ఇందులో ప్రకృతిసిద్ధమైన షుగర్లు ఎక్కువగా ఉంటాయి.

ఇది ప్రకృతి అందించిన ఆరోగ్య ఖజానా!

అంజీరాతో ఆరోగ్యం

అంజీరా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తీపి వగరు రుచితో నోరూరించే అంజీరా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా లైంగిక సమస్యలు మలబద్దకము, అజీర్తి, మధుమేహం, దగ్గు వంటి సమస్యలుకు పరిష్కారం లభిస్తుంది.

అంజీరాలో అధిక మోతాదులో పీచుతో పాటు విటమిన్ ఎ,బి1, బి2, కాల్షియం, మెగ్నిషియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. మూడు అంజీరాలు తింటే మూడు గ్రాముల పీచు లభిస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థ తీరును మెరుగుపరిచి మలబద్దక సమస్యను తగ్గిస్తుంది. బరువు పెరగడం చాలా మందిని వేధిస్తున సమస్య. ఇలాంటి వారు అంజీరాను వాడితే చాలా మంచిది. అలాగని మరీ ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు. తక్కువగా పాలతో తీసుకుంటే మంచిది. అంజీరాలో పెప్టిన్ అనే పదార్ధం కొవ్వును కరిగించుటకు ఉపయోగపడుతుంది. అంజీరాలో ఉండే కొన్ని రకాల పోషకాలు మోనోపాజ్ తరువాత వచ్చే రొమ్ము కాన్సర్ రాకుండా అడ్డుకోవడంలో కీలకంగా పనిచేస్తుంది. దీనిలోని పోటాషియం రక్తంలోని చక్కెర నిలువలను తగ్గిస్తుంది. అధిక రక్తపోటును తగ్గిస్తుంది. అంజీరాలో ఉండే కాల్షియం బలాన్ని వృద్ధి చేస్తుంది. ప్రతి రోజూ రాత్రి రెండు మూడు అంజీరాలను పాలలో నానబెట్టి తింటే లైంగిక సామర్ధ్యం పెరుగుతుంది.