🕉️ *“మనమంతా ఎంతో శ్రద్దగా సాత్విక ఆహరమును తీసుకుంటున్నాము, యోగా, వ్యాయామములు చేస్తున్నాము, సేవా కార్యక్రమాలల్లో పాల్గొంటున్నాము, ధ్యానము చేస్తున్నాము, ధర్మాన్ని అనుసరిస్తున్నాము.కా నీ, అన్నీ చేస్తున్నప్పటికీ, మనము సుఖముగా, సంతోషముగా, ఆనందముగా, ఆర్థిక సమృద్ధిని మరియు శాంతితో ఎందుకు జీవించడము లేదు?”*
❔ *ఈ ప్రశ్న మనందరిలోనూ ఉన్నదే కదా, అంతే కాకుండా ఇవన్నీ ఎంతో నిష్ఠగా చేసే (వారికే కష్టాలు అధికముగా రావడము మనందరమునూ చూస్తూనే ఉన్నాము. కాబట్టి ఈ విషమును గూర్చి క్లుప్తముగా తెలుసుకుందాము.*
🪷 *మనమంతా ఎంతో శ్రద్దగా సాత్విక ఆహారమును తీసుకుంటున్నాము, యోగా, వ్యాయామములు చేస్తున్నాము, సేవా కార్యక్రమాలల్లో పాల్గొంటున్నాము, దానములు మరియు ధ్యానము చేస్తున్నాము, సేవను మరియు ధర్మాన్ని అనుసరిస్తున్నాము. అన్నీ చేస్తున్నప్పటికీ, *మన శరీరములో ఆరోగ్యము లేదు, మనసులో ప్రశాంతత లేదు, హృదయములో ఆనందము లేదు, ఆర్థికంగా పుష్కలత లేదు, ఆత్మ స్థాయిలో ఆనందము కనిపించడము లేదు. సనాతన ధర్మము ప్రకారము, దీని వెనుక ఉన్న లోతైన కారణాలను తెలుసుకుందాము.*
🌼 *సనాతన ధర్మము ప్రకారము – పైన తెలియజేసినవన్నీపొందలేకపోవడానికి గల 7 ముఖ్యమైన కారణాలు*
1️⃣ *మనము“ అన్ని పనులనూ చేస్తున్నాము” కానీ “చైతన్యవంతముగా పనులనూ చేయడాన్ని మర్చిపోయాము*:
🪷 *మనము యోగా, వ్యాయామాలు, ధ్యానము, దానాలు మరియు సేవ చేస్తున్నాము – కాని మనలో *“నేను చేస్తున్నాను” అనే అహంకార భావము అలానే ఉండి పోయింది.*
🕉️ *శ్రీ భగవద్గీత చెబుతున్నది*:
😊 *“నాహం కర్తా – హరి కర్తా”*
👉 *మనము కర్తలము కానే కాదు, పరమాత్మనే కర్త.*
✅ *మనము చేసిన పొరపాటు:* *మానసికముగా "నేను చేస్తున్నాను" అనే భావముతో పుణ్యమును కూడబెట్టే ప్రయత్నమును చేసాము.*
2️⃣ *ప్రతి ఫలాశతో ఆచరణ – (ప్రతిఫలమును పొందాలనే కోరిక):*
🪷 *“మనము మంచి చేస్తే, మనకు మంచే జరగాలి” అని అనుకుంటున్నాము – ఇది వ్యాపార ధర్మము, అంతే గాని భక్తి ధర్మము కనే కాదు.*
🕉️ *శ్రీ భగవద్గీత చెబుతున్నది:*
😊 *“కర్మణ్యేవాధికారస్తే, మా ఫలేషు కదాచన”*
✅ *మనము చేసిన పొరపాటు:* *ఆచరణను ప్రేమతో కాకుండా ఫలితాల కోసము చెయ్యడము.*
3️⃣ *బహ్య శుద్ధి మాత్రమే ఉంది - అంతర్గత (చిత్త మరియు ఆత్మ) శుద్ధి లేదు*
🪷 *మనము శరీర శుద్ధి, ఆహార నియమాలు పాటిస్తున్నాము. కాని మన మనస్సులో ఇంకా *ద్వేషము, స్వార్థము, అపరాధ భావము, మానసిక గాయాలు అలాగే ఉన్నాయి.*
🔥 *సనాతన ధర్మము చెబుతున్నది:* *“మధ్యే మార్గము = అంతర్ముఖత”*
✅ *మనము చేసిన పొరపాటు:* *ధ్యానముతో పాటుగా మనస్సులోని చెడు భావాలను శుద్ధి చేయకపోవడము.*
4️⃣ *మనము “మంచి”గా నటిస్తున్నాము – కాని, మనలోని “నిజమైన” మనల్ని, మనము చూడడము లేదు:*
*మనము బాహ్యముగా సానుకూలముగానే ఉంటున్నాము, కానీ లోపల బాధలు, అసంతృప్తి, భయాలు ఇంకా మిగిలేవున్నాయి.*
🌼 *సనాతన ధర్మము చెబుతున్నది:*
*“సత్యం శివం సుందరం”*
✅ *మనము చేసిన పొరపాటు:* *మన లోపలి బాధలను మనము అంగీకరించకుండా, దాచివెయడము.*
5️⃣ **స్వధర్మాన్ని మర్చిపోవడము – (అనుకరనాత్మక జీవితమును అనుసరించడము)**
🪷 *మనము మంచిగా పని చేస్తున్నాము – కానీ అది నిజముగా మన యొక్క ఆత్మ ధర్మమా? లేక మనము ఇంకొకరిని చూసి అనుకరిస్తున్నామా? అని మనమెప్పుడైనా ప్రశ్నించుకున్నామా.*
🕉️ *శ్రీ భగవద్గీత చెబుతున్నది:*
😊 *“శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్”*
✅ *మనము చేసిన పొరపాటు: మనకు చెందిన స్వధర్మాన్ని గట్టిగా పట్టుకోనకుండా, పరులకు చెందిన ధర్మాన్ని అనుసరించడము. ఇది సనాతన ధర్మానికి విరుద్ధము.*
6️⃣ *శ్రద్ధ లేని సేవ – ప్రేమ లేకుండా కర్తవ్యము*:
*మనము సేవను అనుభూతితో కాకుండా, కేవలము ఒక డ్యూటీగా చేస్తున్నాము. దీనివల్ల మనలోని భక్తి బలహీనమవుతున్నది.*
🌷 *సేవ అంటే=ప్రేమతో కూడిన త్యాగము.*
✅ *మనము చేసిన పొరపాటు:* *మనము ప్రతి రోజూ పనులను “ఎందుకు చేస్తున్నాము?” అన్న ఆత్మ పరిశీలన చేసుకోకపోవడము.*
7️⃣ *ఆనందము కోసము బయట వెతుకుతున్నాము – కానీ అది మనలోనే ఉంది.*
🪷 *మనము ఆనందాన్ని సాధించాలనుకుంటున్నాము – కానీ ఆనందమనేది మన సహజ స్వరూపము అని మర్చిపోయాము.*
📜 *ఉపనిషత్తులు చెబుతున్నాయి:*
*😊 “ఆనందో బ్రహ్మేతి” – ఆనందమే పరబ్రహ్మ*
*😊 “తత్త్వమసి” – నీవే అది*
✅ *మనము చేసిన పొరపాటు:* *మనము ఆనందాన్ని వెలుపల వెతకడము మరియు లోపల చూడడమనే ప్రక్రియను మర్చిపోవడము.*
🌺 **సారాంశము:**
🔺 *మనము చేసిన పొరపాట్లు* / ✅ *పరిష్కారములు*
🌹 *అహంకారముతో చేయడము* / *దైవాన్ని కర్తగా అంగీకరించడము*
🌹 *ప్రతి ఫలాపేక్ష జీవితము* / *ఫలాన్ని త్యజించడము*
🌹 *అంతర్ముఖత లేకపోవడము* / *మానసిక శుద్ధి, క్షమాభావము*
🌹 *నిజాన్ని దాచడము* / *ధైర్యముగా ఆత్మ పరిశీలన చేయ్యడము*
🌹 *స్వధర్మమును మర్చిపోవడము* / *మన ఆత్మ ధర్మాన్ని అనుసరించడము*
🌹 *ఒక డ్యూటీ లాగా సేవ* / *ప్రేమతోనూ మరియు పరమార్థముతోనూ సేవ చేయ్యడము*
🌹 *ఆనందము కోరకు పోరాటము* / *నిశ్శబ్దము ద్వారా దివ్యత్వాన్ని గుర్తించడము*
✨ **సనాతన సత్యజ్ఞానములో జీవిద్దాము – ఆనందమనేది - మన సహజ ధర్మము మరియు జన్మ హక్కు**
🪷 *మన యొక్క లక్ష్యము – త్యాగముతో కూడిన జీవితము మరియు స్వయం ప్రకాశముగా ఉండే ఆనందభరితమైన స్థితి.*
*🪷 మనము వెళ్ల వలసిన మార్గములు – దైవ శరణాగతి, భక్తి, ధ్యానము, నిజమైన సేవ.*
*🪷 మనము పొందవలసిన అనుభవాలు – శరీరము ఆరోగ్యంగానూ, మనస్సు శాంతముగానూ, హృదయము ఆనందముగానూ, ఆత్మలో పరిపూర్ణ శాంతి.*
*జై సనాతన ధర్మ భారత మాతాకీ జై*
No comments:
Post a Comment