Friday, July 26, 2024

జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం.....*

*జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం.....*

మానవ జీవితం అంతా దోషభూయిష్టం. దుఃఖభూయిష్టం. అప్పుడప్పుడు కొన్ని సుఖాలున్నా దుఃఖాలు మాత్రం తప్పవు. ఇలా దుఃఖాలతో కూడినదే ఈ మానవజన్మ అని తెలిస్తే దీనిపై వైముఖ్యం కలుగుతుంది. వైరాగ్యం కలుగుతుంది. ఇక ఈ జన్మలు వద్దు అనిపిస్తుంది. జన్మరాహిత్యానికి ప్రయత్నించాలి అనిపిస్తుంది. కనుక ఈ జన్మలోని దుఃఖ దోషాలను నిశితంగా పరిశీలించాలి. 
          
‘ప్రపంచం దుఃఖమయం, దేహం రోగమయం’ అని పెద్దలు చెబుతారు. ‘అనిత్యమసుఖంలోకం’ అని గీతాచార్యుడే అన్నాడు. ‘విద్ధి వ్యాద్యభి మానగ్రస్తం లోకం శోక హతం చ సమస్తం’ అని భజగోవిందంలో శంకరాచార్యులవారన్నారు. వ్యాధులతోను, అభిమానంతోను కూడి దుఃఖాల చేత సతమతమైపోతున్నదీ జన్మ అని. 
పుట్టేటప్పుడు ఏడుస్తాడు, చచ్చేటప్పుడూ ఏడుస్తాడు, మధ్యలో రోగాలొస్తే ఏడుస్తాడు, ముసలితనం వచ్చినా ఏడుస్తాడు. ఇవే జన్మ దుఃఖం, జరా దుఃఖం, వ్యాధి దుఃఖం, మరణ దుఃఖం. 

(i) జన్మదుఃఖం :- 

ఇది ఎలాంటిదో గర్భోపనిషత్ చెబుతున్నది.. కోడిగ్రుడ్డు అంత గర్భకోశంలో 9 నెలల నివాసం. అక్కడి క్రిములచేత పీడించబడటం, జఠరాగ్ని చేత తపించిపోవటం, తల్లి ఆహారవిహారాల వల్ల అలమటించిపోవటం, మావిచేత బిగించబడి తలక్రిందులుగా ఉండటం, పూర్వజన్మలస్మృతితో విపరీతంగా దుఃఖించటం, ప్రసూతివాయువుల చేత త్రోయబడటం, బయటబడి మలమూత్రాలలో పెద్దపురుగులాగా పొర్లాడటం - ఇవన్నీ జన్మదుఃఖాలే. 

(ii) మృత్యుదుఃఖం :- 

పుట్టిన ప్రతిజీవి తప్పించుకోలేని దుఃఖం ఈ మృత్యుదుఃఖం. ఈ దేహం మృత్యుదేవత సొత్తు. పాలు, వెన్న, నెయ్యి, జీడిపప్పు, స్వీటు, హాటులతో చక్కగాపెంచి, ఫారిన్ సెంట్లు, పౌడర్లు, సోపులు, కాస్మెటిక్స్ తో పోషించిన ఈ బంగారంలాంటి శరీరానికి చివరిదశ ఏమిటో కళ్ళు మూసుకొని ఒక్కసారి భావనకు తెచ్చుకోండి. మర్మస్థానాలు భేదించబడటం, అంగసంధులు వికలమైపోవటం, నాడుల నుంచి ప్రాణాలు నిర్బంధంగా బయటకురావటం, ప్రాణోత్ర్కమణ జరిగేటప్పుడు లక్ష తేళ్ళు ఒక్కసారిగా కుడితే కలిగేంత బాధ, వశం దప్పి మలమూత్రాలు విడిచి పెట్టటం, భరించలేని యాతన. ఇవి మృత్యురోగాలు. 

ఇంతేనా ? ఇక మరణించబోతున్నాను అని తెలియగానే అమ్మాయి పెళ్ళి, అబ్బాయి ఉద్యోగం, కట్టాలనుకున్న మేడలు, భార్యాబిడ్డలు అంతా గుర్తుకు వస్తారు. ఇంత సంపాదించి అన్నీ వదిలిపెట్టి పోతున్నానే అనే బాధ. ఇదంతా మృత్యు బాధ. 

మరణానికి మరొక మారుపేరు "మార్పు". మార్పుని మనందరం చాలా సహజంగా స్వీకరిస్తాం. కానీ మరణం అనే పదాన్ని వాడగానే చాలా భయపడి పోతూవుంటాం. మానవునికి జీవించివున్నప్పుడు ఆరు దశలున్నాయి. వీటినే "అవస్థాషట్కము" అని అంటారు. అవి 1. పుట్టుట, 2. ఉండుట, 3. పెరుగుట, 4. మారుట, 5. క్షీణించుట, 6. నశించుట. దీనినే భగవద్గీతలో రెండవ అధ్యాయం సాంఖ్యయోగము 13వ శ్లోకంలో నాలుగు అవస్థలుగా చెప్పారు.: 'దేహినోస్మిన్ యధాదేహే కౌమారం యౌవనం జరా తథాదేహాన్తర ప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతి '

జీవికి బాల్యము, యౌవనము, వార్ధక్యము, మరియు దేహాంతరప్రాప్తి అను నాలుగు అవస్థలు కలవని. ఇవన్నియూ మార్పులే అని. మనిషి, బాల్యము పోయి, యౌవనము వచ్చినప్పుడు, దుఃఖించుటలేదు, యౌవనముపోయి, వార్ధక్యము వచ్చినప్పుడు దుఃఖించుటలేదు, కానీ వార్ధక్యము పోయి మరణం ఆసన్నమైనప్పుడు మాత్రము దుఃఖపడుతూ, భయం పొందుతూ ఉంటాడు. మనిషి, మనిషిపై అతిగా మమకారం, బంధాన్ని పెంచుకోవటంవల్ల భౌతిక వస్తువులు, సుఖాలపై ప్రీతిని, మోహాన్ని, బంధాన్ని అతిగా పెంచుకోవటంవల్ల తాను ప్రేమిస్తున్నవి తాను అనుభవిస్తున్నవి సుఖాన్ని ఇస్తున్నవి ఇక ఉండవేమో అన్న ఆలోచనే మరణంపై భయాన్ని కలుగచేస్తుంది.మృత్యు భయం వీడకపోవటానికి కారంణం...
భూమి పుట్టి ఇంతకాలమైనా ఇన్ని మరణాలు చూసినా మనిషికి ఈ మృత్యు భయం వీడకపోవటానికి కారణం ‘మోహం' మహాభారతంలోని అరణ్యపర్వంలో యక్షుడు, ధర్మరాజుని ప్రపంచంలో అన్నిటినీమించి ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటని అడుగుతాడు! అందుకు ధర్మరాజు ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండడం చూస్తూ కూడా మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండి పోతాననుకోవటమే ఆశ్చర్యమని చెబుతాడు! మృత్యువుని గురించి నచికేతుడు యమధర్మరాజుని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. అది ‘కఠోపనిషత్' గా ప్రసిద్ధి చెందింది. ఇక భగవద్గీతలో కూడా దీన్ని గురించి చెప్పబడింది. దాని ప్రకారం - ఏది అభౌతికమైనది అంటే.‘ఆత్మే' అభౌతికమైనది.దీనికి చావు పుట్టుకలు ఉండవు. ఈ ఆత్మ దేహధారణ చేస్తే ‘జీవాత్మ' అవుతుంది. ‘జీవాత్మ' దేహత్యాగం చేస్తే ‘ఆత్మ'గా మిగిలిపోతుంది. పాంచభౌతికమైన శరీరం మరణించిన తర్వాత భూతత్వం. భూమిలోను అగ్నితత్వం. అగ్నిలోను, జలతత్వం, జలములోను వాయుతత్వం. వాయువులోను శబ్దతత్వం. ఆకాశంలోను లయమౌతాయి. ఇదీ క్లుప్తంగా గీత చెప్పింది.మృత్యువును, జననం అంత సహజంగా చూస్తారు.

భూమి పుట్టిన తర్వాత ఇన్ని మృత్యువులు సంభవించాయి కదా మరి అది మిగిల్చిన సందేశం ఏమిటంటే పూర్తిగా నిరాసక్తతగా ఉండండి Be Totally Detached ఎందుకంటే మృత్యువు సమీపించినప్పుడు జరిగేది అదే చనిపోవటమంటే అన్నిటినీ వదులుకోవటం To give up everything మృత్యువు అన్నిటినుంచి మనల్ని తోసివేస్తుంది. ఇవన్నీ క్రోడీకరిస్తే మృత్యువు అంటే స్వేచ్ఛగా ఉండటమే అనుక్షణం మనం శ్వాస, నిశ్వాసాల ద్వారా మరణిస్తూనే ఉన్నాం, కొందరు అనుకున్నట్లు పుడుతూ కూడా ఉన్నాం. పునర్జన్మ అంటే ఇదే So, Living is Dying ఇలా అనుక్షణం మరణించే మనం మృత్యువుని చూసి భయపడటం అర్ధరహితం, 
జర-మరణ-మోక్షయ
మామ్ ఆశ్రిత్య యతన్తి యే
తే బ్రహ్మ తద్ విదుః కృత్స్నమ్
అధ్యాత్మమ్ కర్మ చఖిలమ్.

వృద్ధాప్యం మరియు మృత్యువు నుండి విముక్తి కోసం ప్రయత్నించే తెలివైన వ్యక్తులు భక్తితో నన్ను ఆశ్రయిస్తారు. అతీంద్రియ మరియు ఫలవంతమైన కార్యకలాపాల గురించి వారికి పూర్తిగా తెలుసు కాబట్టి వారు నిజానికి బ్రహ్మం..

చివరిగా ఒక్క వ్యాఖ్య
జయంతి తే సుకృతినో రససిధ్ధాః కవీశ్వరాః |

నాస్తి తేషాం యశః కాయం జరా మరణజం భయం ||

పంచ మహా యజ్ఞాలంటే ఏమిటి?*

*🙏🕉️పంచ మహా యజ్ఞాలంటే ఏమిటి?*

*ఇవి ఋత్విక్కులు చేసేయజ్ఞాలు కాదండీ. శాస్త్ర ప్రకారం ప్రతి వ్యక్తీ అను నిత్యం పాటించ వలసిన విధులు. అవి ఏమిటి?*

1. దేవ యజ్ఞం

పూర్వం నిత్యాగ్నిహోత్రులు వుండేవారు.
వారు తాము భోజనం చేసే ముందు కొంచెం అన్నాన్ని అగ్నికి ఆహుతి చేసేవారు. దీనికి ఆహుతం అని పేరు. అలాకాక ఇంట్లో వారందరూ అగ్నికి సమిధలు సమర్పించినా ఆహుతం చేసినట్లే. సృష్టికి మూలకారకుడైన దేవదేవుని నిత్యం తలుచుకుని ఆయనకు కృతజ్ఞతలు తెలపటమే దీని ముఖ్యోద్దేశ్యం.

2. పితృ యజ్ఞం

మనల్ని కని పెంచి ఇంత వారిని చేసిన తల్లితండ్రలను ప్రేమగా చూడాలి. చిన్నప్పుడు వారు మనల్ని ఎంత ప్రేమగా చూశారో, మన అవసరాలెలా తీర్చారో, అలాగే వారి పెద్ద వయసులో వారిని కనిపెట్టుకుని వుండాలి. ఇలా వారి ఋణాన్ని కొంతయినా తీర్చుకోగలం. ఇది పితృ యజ్ఞం.

3. భూత యజ్ఞం

గృహస్తు సర్వప్రాణికోటిమీద దయ కలిగి పుండాలి. పశు పక్షులు, క్రిమి, కీటకాదులు మానవుడి మీద ఆధార పడి వున్నాయి. అందుకే మనిషికి భూత
దయ వుండాలి. అన్నం తినే ముందు ఒక ముద్ద అన్నం పక్షుల కోసం బయట (పక్షులు వచ్చే ప్రదేశంలోపెట్టాలి. ఇంటి ముందు కుక్కకి, ఇంట్లో పిల్లికి అన్నం పెట్టాలి. ఇంట్లో పశువులు వుంటే వాటికి పెట్టాలి. క్రిమి కీటకాల కోసం కొంచెం అన్నం (తినక ముందు) పక్కన పెట్టాలి. (మన పెద్దలు వీటిని పాటించటం మీలో కొందరయినా చూసే వుంటారు). జలాశయాలలో జలచరాలకు కూడా
ఆహారం వెయ్యాలి. సర్వ ప్రాణులయందూ దయ కలిగి వుండి ప్రతి నిత్యం కనీసం ఏదో ఒక దానికన్నా ఆహారం ఇవ్వాలి.

4. మనుష్య యజ్ఞం

మన పెద్దలు అతిధి దేవో భవ అన్నారు.

అప్పటివారు ఆతిధ్యం కోరి వచ్చినవారు తమకు తెలియనివారయినా వారిని ఆదరించి సత్కరించేవారు. రోజులు మారినాయి. అయినా
ఇంటికొచ్చినవారిని మన కులం వారా, మన మతం వారా మన కేవిషయంలో నైనా పనికి వస్తారా లేదా వగైరాలాలోచించకుండా వారు వచ్చిన సమయాన్నిబట్టి తగు విధంగా గౌరవించాలి. తోటి వారి పట్ల దయ కలిగి వుండాలి. అందరితో
సఖ్యంగా వుండాలి. ఎవరైనా సహాయం కోరితే, మనం చెయ్యగలిగితే నిస్వార్ధంగా చెయ్యాలి.

5. బ్రహ్మ యజ్ఞం

ప్రతి వారూ, ప్రతి రోజూ వేద మంత్రాలు కానీ శాస్త్రిలని కానీ చదవాలి. ఇప్పుడు వేద మంత్రాలు చదివే వారి సంఖ్య తక్కువగానీ ప్రతి వారూ ఎవరికి
వీలయిన, ఎవరికి ఆసక్తి వున్న, ఎవరికి అనుకూలంగా వున్న శాస్త్రాలను చదవాలి. ప్రతి రోజూ కొత్త విషయాలను తెలుసుకునే ఆసక్తి
చూపించాలి. అంతేకాదు. తను తెలుసుకున్నది ఇతరులకు చెప్పాలి. ప్రతి మనిషికీ భగవంతుని పట్ల విశ్వాసం, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, భూత దయ, తోటి మనిషులతో కలిసి వుండే మనస్తత్వం,
శాస్త్రం తెలుసుకుని నలుగురితో పంచుకునే జిజ్ఞాస
వున్నాయనుకోండి. ఈ ప్రపంచం ఎలా వుంటుందో ఒక్కసారి ఊహించుకోండి.

మనిషిని సక్రమ మార్గంలో నడపటానికే ఈ పంచ యజ్ఞాలను నిర్దేసించారు మన పెద్దలు.

మన నిత్య జీవితంలో ఉపయోగించే శ్లోకాలు మరియు స్తోత్రము లు

*🙏మన శ్లోక సంపద.🙏🕉️* 

మన నిత్య జీవితంలో ఉపయోగించే శ్లోకాలు మరియు స్తోత్రము లు 

1. ప్రభాత శ్లోకం.....

కరాగ్రే వసతే లక్ష్మీః
కరమధ్యే సరస్వతీ
కరమూలే స్థితా గౌరీ
ప్రభాతే కరదర్శనమ్

2.స్నాన శ్లోకం.....

గంగే చ యమునే చైవ
గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి
జలేస్మిన్ సన్నిధిం కురు

3. బొట్టు పెట్టుకునే శ్లోకం......

కుంకుమం శోభనం దివ్యం
సర్వదా మంగళప్రదం
ధరణేనాస్య శుభదం
శాంతిరస్తు సదామామ్

4.ఓం విఘ్నేశ్వరాయ నమః....

శుక్లాం బరధరం విష్ణుం
శశి వర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్
సర్వ విఘ్నోప శాంతయే
అగజానన పద్మార్కం
గజానన మహర్నిశం
అనేకదంతం భక్తానా
మేకదంత ముపాస్మహే

5.ఓం గురవే నమః......

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః
గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మా
తస్మై శ్రీ గురవే నమః

6. దక్షిణామూర్తి శ్లోకం....

గురవే సర్వ లోకానాం 
భిషజే భవరోగిణాం
నిధయే సర్వ విద్యానాం
శ్రీ దక్షిణా మూర్తయే నమః

8.శ్రీ రామ శ్లోకం.....

శ్రీ రామ రామ రామేతి 
రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం
రామ నామ వరాననే

9.శివ స్తోత్రం......

త్ర్యంబకం యజామహే
సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుక మివ బంధనాథ్
మృత్యోర్ ముక్షీయ మామృతాత్.

10. సరస్వతీ శ్లోకం.....

సరస్వతీ నమస్తుభ్యం
వరదే కామ రూపిణీ
విద్యారంభం కరిష్యమి
సిద్దిర్భవతు మే సదా.

11. లక్ష్మీ శ్లోకం.....

లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం 
శ్రీరంగ ధామేశ్వరీం
దాసీభూత సమస్త దేవ వనితాం 
లోకైక దీపాంకురామ్
శ్రీమన్మంధ కటాక్ష లబ్ధ విభవత్‌ 
బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం
సిద్ద లక్ష్మీ మోక్ష లక్ష్మీ 
జయ లక్ష్మీ సరస్వతీ
శ్రీ లక్ష్మీ వరలక్ష్మీచ 
ప్రసన్న మమ సర్వదా

12.అన్నపూర్ణ శ్లోకం.....

అన్నపూర్ణే సదాపూర్ణే 
శంకర ప్రాణవల్లభే 
జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధం 
బిక్షాం దేహి చ పార్వతి
మాతా చ పార్వతీ 
దేవి పితా దేవో మహేశ్వరః బాంధవాః శివభక్తాశ్చ
స్వదేశో భువనత్రయమ్ 

13. గాయత్రి మంత్రం.....

ఓం భూర్భువస్వః
తత్స వితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి
ధియోయోనఃప్రచోదయాత్

14. కృష్ణార్జునశ్లోకం.....

యత్ర యోగీశ్వరం కృష్ణో 
యత్ర పార్దో ధనుర్దరః
తత్ర శ్రీ విజయో భూతిః
దృవానీ తిర్మతిర్మమ

15 ఆపద నివారణ స్తోత్రం......

ఆపదా మపహర్తారం
ధాతారం సర్వ సంపదాం
లోకాభిరామం శ్రీరామం
భూయో భూయో నమామ్యహం

16.శయన శ్లోకం..‌...

రామస్కంధం హనుమంతం
వైనాతేయం వృకోదరం
శయనేయః స్మరేన్నిత్యం
దుస్వప్నం తస్య నస్యతి

17. శమీ వృక్ష శ్లోకం.....

శమీ శమయతే పాపం
శమీ శతృవినాశనం
అర్జునస్య ధనుర్ధారీ
రామస్య ప్రియదర్శినీ

18. బ్రహ్మ శ్లోకం....

నమో గోభ్యః శ్రీమతీభ్యః
సౌరాభేయీభ్య ఏవచ
నమో బ్రహ్మానుతాభ్యశ్చ
పవిత్రాభ్యో నమోనమః

19. దేవీ శ్లోకం.....

సర్వ మంగళ మాంగల్యే
శివే సర్వార్థ సాదకే
సరణ్యే త్రయంబకే దేవి
నారాయణి నమోస్తుతే

20.తులసమ్మ శ్లోకం..... 

యన్మూలే సర్వతీర్థాని
యన్మధ్యే సర్వదేవతాః
యదాగ్రే సర్వవేదాశ్చ
తులసి త్వాం నమామ్యహం

21. వృక్ష ప్రార్థన శ్లోకం......

ములతో బ్రహ్మరూపాయ
మధ్యతో విష్ణు రూపిణే
అగ్రత శ్శివ రూపాయ
వృక్షరాజాయ తే నమః

22. గీత శ్లోకం......

ప్రారబ్ధం భుజ్యమానోపి
గీతాభ్యాస రతస్సదా
స ముక్త స్స సుఖీ లోకే
కర్మణా నోపలిప్యతే

23. ప్రభాత భూమి శ్లోకం.....

సముద్ర వసనే దేవి
పర్వత స్తన మండలే
విష్ణు పత్నీ నమస్తుభ్యం
పాదస్పర్శం క్షమస్వమే

24. మాతృ చందన శ్లోకం.....

భూప్రదక్షిణ షట్కేన
కాశీయాత్రాయుతేన చ
సేతుస్నాన శతైర్యశ్చ
తత్ఫలం మాతృవందనే

25. నవగ్రహ శ్లోకం......

అదిత్యా చ సోమాయ
మంగళాయ బుధాయ చ
గురు శుక్ర శనిభ్యశ్చ
రాహవే కేతవే నమః

26.మహావిష్ణు శ్లోకం.......

నమస్తే దేవదేవేశ 
నమస్తే ధరణీధర
నమస్తే సర్వ నాగేంద్ర
ఆదిశేష నమోస్తుతే

27. ధన్వంతరి శ్లోకం....

ఓం నమో భగవతే వాసుదేవయ ధన్వంతరమూర్తయే
అమృత కలశ హస్తాయ
సర్వమాయనాశనాయ
త్రైలోక్యనాథయ
శ్రీ మహావిష్ణవే నమః

28. కృష్ణ శ్లోకం....

అయోధ్యా మధురా మాయా
కాశీ కాంచీ అవంతికా
పూరీ ద్వారవతీ చైవ
సప్తైతే మో‌‌క్ష దాయకాః

29. హనుమ స్తోత్రం......

మనోజవం మారుతతుల్యవేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం
వతాత్మజం వానరయూధ ముఖ్యo
శ్రీరామదూతం శిరసా నమామి

30.నవదుర్గ శ్లోకం.......

ప్రధామా శైలాపుత్రీచ
ద్వితీయ బ్రహ్మచారిణి
తృతీయా చంద్ర ఘంటేతి
కుష్మాండేతి చతుర్థికీ
పంచమా స్కంద మాతేతి
షష్టా కాత్యాయనేతిచ
సప్తమా కాళరాత్రీచ
అష్టమాచాతి భైరవీ
నవమా సర్వాసిద్ధిశ్చాత్
నవదుర్గా ప్రకీర్తితా

31. సంధ్యా దీప దర్శన శ్లోకం.....
దీపం జ్యోతి పరంబ్రహ్మ
దీపం సర్వతమోపహం
దీపేన సాధ్యతే సర్వం
సంధ్యా దీపం నమోస్తుతే

32. గోమాత శ్లోకం......

గోవర్ధనం ధరంవందే
గోపాదం గోప రూపిణం
గోకులోద్భవ ఈశానం
గోవిందం గోపికా ప్రియం

33. అపరాధ స్తోత్రం ......

అపరాధ సహస్రాణి
క్రియంతే మహర్నిశం మయా
దాసోయమితి మాం మత్వా 
క్షమస్వ పరమేశ్వర

అన్యథా శరణం నాస్తి 
త్వమేవ శరణం మమ
తస్మాత్ కారుణ్యభావేన 
రక్ష రక్షో జనార్ధన.

సర్వం మాయం.*

♦️       *సర్వం మాయం.*      ♦️👇
▪️తాజా అన్నం మాయం.
▪️తాజా కూరలు మాయం.
▪️కోడళ్ళ పనితనం మాయం.
▪️అత్తమామల మాటసాయం మాయం.
▪️అల్లుళ్ళ గౌరవ హోదా మాయం.
▪️పోస్టుమాన్ మాయం.
▪️ఆసాంతం వినే వైద్యుడు మాయం.
▪️చీర, రవిక మాయం.
▪️పుస్తక పఠనం మాయం.
▪️రేడియోకి శ్రోతలు మాయం.
▪️పెరడు బావి మాయం.
▪️సైకిలు మాయం. 
▪️ఎండావకాయ మాయం.
▪️కుంపటిపై దిబ్బరొట్టి మాయం.
▪️మట్టి వాసన మాయం.
▪️పిడతకింద పప్పు బండి మాయం.
▪️వందరోజులాడే సినిమాలు మాయం.
▪️అర్ధరాత్రయినా నిశ్శబ్దం లేని నిశిరాత్రులు మాయం.
▪️వెంట ఉండే ఉపాధ్యాయుడు మాయం.
▪️కుంకుడు కాయ, సీకాకాయ మాయం.
▪️వాకిట అలుకుళ్ళు, ముగ్గులు, పూల మొక్కలు మాయం.
▪️పిచ్చుకలు, సీతాకోకచిలుకలు మాయం. 
▪️సత్తు గిన్నె చారు మాయం.
▪️స్కూల్లో మైదానం మాయం.
▪️సంఘంలో పరోపకారం మాయం.
▪️వానపాము మాయం.
▪️చెరువుల్లో ఆటలు మాయం. అసలు చెరువులే మాయం.
▪️ చింతపిక్కలాట, అచ్చంగిల్లాట, తొక్కుడు బిళ్ళలు ఆటలు, కోతికొమ్మచ్చి, కబడ్డీ మాయం.
▪️గోడిం బిళ్ల / కర్ర - బిళ్ల మాయం, దాక్కుంటే దొంగాట మాయం.
▪️అవ్వలు, బామ్మలు కబుర్లు, కథలు మాయం.
▪️థూళి లేని గాలి మాయం.
▪️పాళీ ఉన్న పెన్ను మాయం.
▪️ పెద్దల మాటలు మాయం, పెద్దల సలహాలు మాయం, ఖాళీ ఉన్న స్నేహితుడు మాయం.
▪️నిలకడగా కురిసే వాన మాయం.
▪️నిర్మానుష్యమైన ఏకాంతం మాయం.
▪️కంటికి నిద్ర మాయం.
▪️వెన్నెల చూడాలనే కన్నులు మాయం.
▪️ ఏకాగ్రత మాయం.
▪️హారన్ మోత లేని వీధి మాయం.
♦️దోమలు లేని పార్కులు మాయం.
▪️తోటమాలి కొలువే మాయం.
▪️దాచుకుందా మంటే వడ్డీరేటు మాయం. అసలే మాయం.

▪️"ఒక అల్లం పెసరె" అని కేక వేసే పాక హోటల్ మాయం.
▪️సగం సగం పంచుకునే తేనీరు మాయం.
▪️నిఖార్సయిన చెగోడీ, వడియం, అప్పడం మాయం. కూర్చుని తినే పంక్త భోజనాలు మాయం.
▪️ప్రేమ ప్రకటించే  ప్రేమ లేఖలు మాయం.
▪️సాయం కాలం మల్లెపువ్వులు పెట్టుకుని కాటన్ చీరతో స్వాగతించే ధర్మపత్ని మాయం. ఎందుకూ...పంచ కట్టు, లుంగీతో, చక్కటి షేవింగ్ తో ఉండే భర్త మాయం.
▪️ఆఫీసు నుండి రాగానే నాన్నా నాకేమి తెచ్చావు అని ఎదురుపడే‌ సంతానం మాయం.
▪️ఏమండీ రాత్రికి ఏమి చేయమంటారు అని అడిగే ధర్మపత్ని మాయం. ఈ పండక్కి నాకేం కొనిస్తారని భార్య కోరికలు మాయం.
**ఆత్మీయతలు మాయం, అనుబంధాలు మాయం,
▪️ కుటుంబ సభ్యులు నలుగురు కూర్చొని మాట్లాడే కాలం మాయం................. అందుకే ఎవరికి వాడు, ఎవరి చరవాణి లోకి వాళ్ళు మాయం. మాయం మాయం
▪️ *. సమయం  మాయం.* సర్వం మాయం.
▪️ *అంతా అయోమయం.*ఎక్కడికి పోతోంది ప్రపంచం?
🙏🙏🤝🤝

Sunday, July 14, 2024

జప మాలలు - ఫలితాలు.

జప మాలలు - ఫలితాలు.

 * స్వచ్చమైన స్పటిక మాలతో జపం చెస్తే రాజ్యాధికారం, లభించును. సర్వ భోగములు సిద్ధించును. గుణవంతులైన సంతానం లబించును.
 
 * ముత్యాల మాలతో జపం చేస్తే సర్వ శాస్రములు, సర్వ విద్యలు నాలుక పై తాండవ మాడును.
 
 * పగడ మాలతో జపం చేసిన లోకం లొని సమస్త మానవులు, జంతువులు, పశువులు, క్రూర జంతువులు ను వశీకరణం చేసుకొవచ్చు .
 
 * ఇంద్ర నీల మణుల మాలతో గాని , మరకత మణుల మాలతో కాని జపం చేయడం వలన శత్రు భయంకరులు అవుతారు.
 
 * బంగారు మాలతో జపం చేయడం వలన అష్టైశ్వర్యములు పొందుదురు.
 
 * మాణిక్య మాలతో జపం చేసిన వారు తాను కొరిన కన్యను పొందుదురు.
 
 * పాదరస గులికలతో కూర్చబడిన మాలతో జపం చేసిన సమస్త ప్రయోజనములు పొందగలుగు శక్తి వంతులగురు .

  
         

ఉప్పు గురించి సంపూర్ణ వివరణ -

ఉప్పు గురించి సంపూర్ణ వివరణ - 

       ఆయుర్వేదం నందు లవణమును ( ఉప్పు ) 6 రకాలుగా వర్గీకరించారు. అవి 

  * సైన్ధవ లవణము . 

  * సాముద్ర లవణము.

  * బిడా లవణము . 

  * సౌవర్చ లవణము . 

  * రోమక లవణము . 

  * ఔద్బిద లవణము . 

           లవణములు అన్నియు లవణ రసమును కలిగి ఉండి వేడిచేయు గుణమును కలిగి ఉండును. ఆహారంలో ఉపయోగించుటకు అన్ని లవణముల కంటే సైన్ధవ లవణము మంచిది . 

 * సైన్ధవ లవణము - 

      హృద్రోగము నందు , వాపుల యందు , రక్తపోటు సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారికి ఉప్పు నిషిద్ధమైనప్పటికీ సైన్ధవ లవణమును కొద్దిమోతాదులో వాడవచ్చు . సింధుపర్వత ప్రాంతమున భూగర్భగనుల నుండి సేకరించుట చేత దీనికి సైన్ధవ లవణం అని పేరువచ్చింది. ఇది సహజముగా పరిశుద్ధం అయినది. ఆకలిని పుట్టించును . ఆహారమును జీర్ణం చేయును . చలువ చేయును . నేత్రములకు మంచిది . వాత, పిత్త, కఫ దోషముల యందు పనిచేయును . 

              వ్రణములను శోధించి మాన్పును . నేత్రరోగులకు మంచిది . దాహమును అణుచును . విరేచనం చేయును . శ్లేష్మాన్ని కరిగించును. పాలతో కలిపి పుచ్చుకొనవచ్చు. దీనిని అమితముగా పుచ్చుకొనిన పైత్యమును చేయును . అతిసార రోగమును పుట్టించును . 

 * సాముద్ర లవణము - 

         ఈ లవణమును సముద్రపు నీరు ఎండబెట్టి చేయుదురు . ప్రతిరోజు మనం వాడుకునే ఉప్పు ఈకోవలోకే వచ్చును. ఇది విరేచనకారి , ఆకలిని పెంపొందించును. శ్లేష్మాన్ని వృద్ధిచెందించును . వాతాన్ని అణుచును. కఫవాతము , గుల్మము , విషము , శ్వాసకాస వీనిని హరించును . నేతిలో ఉప్పు వేసి పుచ్చుకొనిన శూలలు ( నొప్పులు ) తగ్గును. పరిణామ శూలతో అనగా ఆహారం అరుగు సమయములో నొప్పితో ఇబ్బందిపడేవారు భోజనం చేసే సమయములో మొదటిముద్దలో కొంచం ఉప్పు కలుపుకుని తినుచున్న పరిణామశూల నయం అగును. 5 గ్రాముల సాముద్ర లవణమును చల్లని నీటితో కలిపి ఇచ్చిన రక్తముతో కూడిన వాంతులు నయం అగును.  

                      తేలు కుట్టినప్పుడు 5 గ్రాముల ఉప్పు నీటితో కలిపి కరిగిన తరువాత ఇచ్చిన తేలు విషం వెంటనే తగ్గును. వేడినీటితో పుచ్చుకొనిన వాంతి చేయును . కడుపులో నొప్పి , గుండెల్లో నొప్పి వచ్చు సమయమున ఉప్పును ఒక కడాయిలో వేసి వేయించి ఒక గుడ్డలో పోసి మూటకట్టి నొప్పి భాగములో కాపడం పెట్టిన తగ్గును. వాతము , శ్లేష్మములను హరించి శరీరానికి వేడిపుట్టించును. 

         ఉప్పును అధికంగా తీసుకోవడం వలన కొన్నిరకాల దుర్గుణాలు కలుగును. ఎముకలు మరియు వీర్యము యొక్క బలాన్ని తగ్గించును . నేత్రవ్యాధులు , రక్తస్రావము , కుష్ఠు , విసర్పి , వెంట్రుకలు రాలిపోవుట , తెల్లబడుట వంటి దుర్గుణాలు కలుగును. 

       మిగిలిన లవణాలు అయిన సౌవర్చలవణము , బిడా లవణము , ఔద్బధ లవణము , రోమక లవణము వంటివి సురేకారముతో తయారుచేయును . వాటిని ఔషధముల యందు మాత్రమే ఉపయోగిస్తారు . ఆహారం నందు వాడుటకు పనిచేయవు . 

               

Wednesday, July 10, 2024

తిరుమల సర్వస్వం* 🔔

🔔 *తిరుమల సర్వస్వం* 🔔

1.తిరుమల పూర్వ నామధేయమేమిటి?                         
Ans.: వరహాపర్వతం.

2. శ్రీవారిఆలయంలో సరుకులు నిల్వ చేసే గిడ్డంగిని ఏమంటారు? 
Ans. : *ఉగ్రాణం.* 

3. వెండివాకిలి కి ఇంకో పేరేమిటి?
Ans. : *నడిమిపడివాకిలి.*

4. స్వామివారికి అవసరమయ్యే పూలమాలలు తయారయ్యే ప్రదేశాన్ని ఏమంటారు? 
Ans.: *పరిమళపు అర.* 

5. సంపంగి ప్రదక్షిణ లో ప్రసాదాలు నిల్వ ఉంచి విక్రయించే ప్రదేశాన్ని ఏమంటారు?
Ans.: *పోటు.* 

6. వెండి వాకిలి ఉన్న ప్రాకారం ఎత్తు ఎంత?
Ans. : *30 అడుగులు.* 

7. విమాన ప్రదక్షిణ మార్గానికి ఇంకో పేరు ఏంటి?
Ans.: *అంగప్రదక్షణ.* 

8. బంగారు వాకిలి ముందున్న మండపాన్ని ఏమంటారు?
Ans.: *మహామణిమండపం.* 

9. బంగారు వాకిలి దాటాక వచ్చేమండపాన్ని ఏమంటారు?
Ans.: *కొలువు మండపం.*

10. రాములవారి మేడ దాటాక వచ్చే మండపం ఏమిటి?
Ans. : *శయన మండపం.* 

11. శ్రీవారి డోలోత్సవం ఎక్కడ జరుగుతుంది?
Ans.: *అద్దాల మండపం.* 

12. అద్దాల మండపానికి ఇంకో పేరేమిటి? 
Ans.: *డోలా మండపం.*

13. అద్దాల మండపానికి ఎదురుగా ఉన్న మండపం ఏమిటి?
Ans. : *రంగనాయకుల మండపం.*

14. తిరుమల రాయ మండపంలో ఉన్న విగ్రహం ఎవరిది?
Ans.: *రాజా తొడరమల్లు.* 

15. ధ్వజ స్థంబాన్ని అనుకుని ఉన్న పీఠాన్ని ఏమంటారు?
Ans.: *బలి పీఠం.*

16. శ్రీవారి ఆలయాన్ని శుద్ధిచేసే కార్యక్రమాన్ని ఏమంటారు?
Ans. : *కోయిల్ తిరుమంజనం.*

17. చక్రస్నానం ఏడాదికి ఎన్నిసార్లు చేయిస్తారు?
Ans. : *4 సార్లు.*

18. విష్ణు సహస్రనామాల్లో ''శ్రీనివాస'' అని ఎన్ని సార్లు వస్తుంది?
Ans.: *2 సార్లు*
 
19. సుప్రభాతం లో ఎన్ని శ్లోకాలున్నాయి?
Ans. : *29*

20. ఏడాదిలో ఆలయాన్ని ఎన్నిసార్లు తిరుమంజనం చేస్తారు?
Ans. : *7 సార్లు...*