Friday, April 10, 2020

జామకాయ గురించి సంపూర్ణ వివరణ - guava benefits

 జామచెట్టు దక్షిణ అమెరికాకు చెందినది. అయితే ఇప్పుడు ప్రపంచమంతా కనిపిస్తుంది. ఇది ప్రాచీనకాలం నుంచి భారతదేశంలో ప్రజలు ఎంతో ఇష్టపడతారు. ఇది చలికాలంలో తేలికగా లభ్యం అవుతుంది. ఈ జాతిలో తెల్లజామకాయ , ఎర్ర జామకాయ అను రెండురకాలు ఉన్నాయి. తెల్ల జామకాయ ఎర్ర జామకాయ కంటే రుచిగా ఉంటుంది. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ మరియు వారణాశి లో పండే జామకాయలు గొప్ప ఔషధ గుణాలు కలిగి ఉంటాయి.

 గుణాలు -

         జామకాయ అంగుళికరంగా , వగరుగా , తీపిగా ఉంటుంది. మలబద్ధకాన్ని దూరం చేస్తుంది . శరీరానికి చలువచేయును . పిత్తరసాన్ని ఎక్కువుగా ప్రవహించకుండా నిరోధిస్తుంది. ఇది ఆకలిని పెంచుతుంది . జీర్ణాశయంలో మండుతున్న అనుభూతిని తగ్గిస్తుంది . మానసిక బ్రాంతి , హిస్టీరియాలను నయంచేస్తుంది . దప్పికను తీర్చుతుంది. ఇది పేగులలోని పురుగులను నాశనం చేస్తుంది. ఉన్మాదం నుండి ఉపశమనం ఇస్తుంది.

         జామకాయలో నీటి శాతం - 76.1 % , ప్రోటీన్ - 1.5 %, కొవ్వు - 0.2 % , కార్బో హైడ్రేట్లు - 14.5 % , క్యాల్షియం - 0.01 % , ఫాస్ఫరస్ - 0 .04 % , ఐరన్ - 1 మిల్లీగ్రాముల నుంచి 100 గ్రా , విటమిన్ C - 300 మిల్లీగ్రాముల నుంచి 100 గ్రాముల వరకు ఉంటుంది.

       జామకాయ విటమిన్ C ని ఎక్కువ కలిగి ఉంటుంది. ఈ పండు మగ్గి మెత్తగా అయితే మాత్రం విటమిన్ C తగ్గుతుంది . జామకాయ తొక్క మరియు తొక్కకు దగ్గరలో ఉండే గుజ్జు ఎక్కువ మొత్తంలో విటమిన్ C ని కలిగి ఉంటాయి.

  తీసుకునే విధానం  -

         జామకాయని బాగా నమిలి తినవచ్చు . కాని ఎక్కువ పోషకాలను పొందాలంటే రసం తీసుకోవాలి . ప్రతి 100 ml రసంలో 70 నుంచి 170 మిల్లీగ్రాముల విటమిన్ C ఉంటుంది.

       జామకాయ మలబద్ధకాన్ని మంచి ఔషధముగా పనిచేయును . రక్తములోని మలినాలను తీసివేయును . కుష్టు ఇతరవ్యాధుల చికిత్సలో చాలా అద్భుతముగా పనిచేయును .

No comments:

Post a Comment