Friday, April 10, 2020

పండ్లరసాలు వాటి ఉపయోగాలు - fruits juices benefits

 * కాకరకాయ  -

    కాకరకాయ రసం రక్తాన్ని శుద్ధిచేస్తుంది. ఇది ఆకలిని పెంచుతుంది. పేగులలో ఉండే పురుగులకు నిర్మూలిస్తుంది. మూలశంఖ నుండి విశ్రాంతినిస్తుంది. ఇది డైయూరిటిక్ అవడం వలన మూత్రపిండాలలో మంటని తగ్గిస్తుంది. మూత్రపిండాలలో రాళ్లని కరిగిస్తుంది. ఇది మధుమేహా వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగకరం. కీళ్లవాతం, కామెర్లతో బాధపడేవారు ఖాళీ కడుపుతో ఈ కాకరకాయ రసం తీసుకోవడం మంచిది .
* వెల్లుల్లి  -

         వెల్లుల్లి చాలా శక్తివంతమైన యాంటిసెప్టిక్. వెల్లుల్లి రసాన్ని అంతే మొత్తంలో నీరుకి కలిపి తీసుకుంటే కలరా క్రిములు నశిస్తాయి. వెల్లుల్లిని టైఫాయిడ్ నిరోధించడానికి వాడవచ్చు . దీనిలో ఉండే సల్ఫాయిడ్ నూనె ముఖ్యమైనది. శ్వాసవ్యాధులకు , న్యుమోనియా సమస్యలకు ఇది అద్భుతమైన మందు. న్యుమోనియా లక్షణాలు అయిన టెంపరేచర్ , శ్వాస , నాడి అవకతవకలను కేవలం ఏడు రోజులలోనే వెల్లుల్లి రసం వాడటం వలన మాములు స్థితికి తేబడ్డాయి.

              ఎటువంటి కడుపుబ్బరానికి అయినా , పక్షవాతం , శరీరం మొత్తం పట్టేయడం , గుండె సమస్య , కడుపునొప్పి , ఎన్నో రోగాలను నయం చేస్తుంది . బ్రాంకైటిస్ వ్యాధిలో వెల్లుల్లి చాలా అద్భుతంగా పనిచేస్తుంది . కొంతమంది వైద్యులు వెల్లుల్లిని క్షయవ్యాధి చికిత్సలో భాగంగా సూచిస్తున్నారు. వెల్లుల్లి శ్లేష్మాన్ని బయటకి పంపుతుంది. నిద్రని కలిగిస్తుంది . జీర్ణశక్తిని అభివృద్ధిపరుస్తుంది. బరువు పెరగడానికి సహాయపడుతుంది.

               పేగులలో ఉండే ఇన్ఫెక్షన్ సమస్యను నిరోధించి పేగులకు జీవం ఇస్తుంది. అజీర్ణం , జీవరసాలు మెల్లగా ప్రవహించడం , గ్యాసుకి అద్భుతమైన మందు. దీర్ఘకాలిక విరేచనాలు వంటి దీర్ఘకాలిక ప్రేగు వ్యాధులను అదుపుచేయడం లో మంచిఫలితాలు వస్తాయి.

        పుండ్లు , అల్సర్లు కుళ్ళిపోకుండా ఉండటానికి వెల్లుల్లిని వాడతారు. వీటితోపాటుగా వెల్లుల్లి రసాన్ని ఇన్ఫెక్షన్ కి గురి అయిన పుండ్లు శుభ్రపరచడానికి వాడతారు. చెడు అల్సర్లు కూడా తొందరగా బాగుపడుతుంది. నొప్పి ఆగిపోతుంది . పుండ్లు , అల్సర్లు డ్రెస్సింగ్ చేయడానికి వెల్లుల్లి రసానికి మూడు భాగాలు నీటితో కలిపి పలచగా చేసి పుండ్లు , అల్సర్ల ను కడగడానికి ఉపయోగించవలెను . గౌట్ , మూత్రపిండాలలో , ఊపిరితిత్తుల్లో రాళ్లు విషయంలో ఉపయోగకరం . ఇది అధిక రక్తపోటును తగ్గించును . చెముడు , చెవిలో పోటు సమస్యలకు ఒక్క చుక్క చెవిలో వేసిన నయం అగును.


 *  క్యాబేజి  -

        గ్యాస్ట్రిక్ , డియోడనల్  అల్సర్లు నయం చేసే విటమిన్ "U " అనే కొత్తరకం విటమిన్ దీనిలో ఉంది . క్యాబేజీని బాగా ఉడికించినప్పుడు అల్సర్ ని నయం చేసే పదార్థం నాశనం అవుతుంది. అంతేకాదు క్యాబేజి తగుపాళ్లలో ఐరన్ కలిగి ఉంటుంది. కాబట్టి రక్తహీనత చికిత్సలో ఉపయోగకరం . ఈ క్యాబేజి రసం కీళ్లవాపు , న్యూరాస్ దేనియా , చిగుళ్ల నుంచి చీము స్రవించుట, అజీర్ణం , రక్తహీనత , దృష్టిలోపం , స్థూలకాయం వంటి పరిస్థితులకు ప్రభావవంతంగా పనిచేయును .

            క్యాబేజి బయటవైపు ఉండు పచ్చని ఆకులు విటమిన్ "A " ను కలిగి ఉంటాయి. లోపలి తెల్ల ఆకులు దీనిని కలిగి ఉండవు. కాబట్టి బయట ఆకులను పారవేయకూడదు. అంతేగాక బయట ఆకులలో ఐరన్ ఎక్కువుగా ఉంటుంది.
పండ్లరసాలు వాటి ఉపయోగాలు  - 4 .

 ద్రాక్షారసం -

     ద్రాక్ష ఎక్కువుగా జనవరి నుంచి మార్చి నెలల మధ్యకాలంలో ఎక్కువుగా లభ్యం అవుతాయి. ద్రాక్షపళ్లు నలుపు , ఆకుపచ్చ , వంకాయ రంగులలో లభ్యం అగును. ఇవి వివిధ ఆకారాలలో , వివిధ పరిమాణాల్లో లభ్యం అగును. చిన్నవాటిలో గింజలు ఉండవు. పెద్దవాటిలో గింజలు ఉంటాయి.

          చరకసంహితలో చరక మహర్షి ఈ ద్రాక్షపళ్ళు గురించి చాలా చక్కగా వివరించారు. ద్రాక్షాపళ్లు మంచి పథ్యముగా , తియ్యగా , శరీరము నందు శాంతము కలిగించే విధముగా ఉండును. గొంతు , చర్మం, జుట్టు, కళ్ళకు సంబంధించిన సమస్యలకు అద్భుతముగా పనిచేయును . ఆకలిని పెంచును. శరీరము నందు మంట, దాహము , జ్వరం , కుష్టు , క్షయ , క్రమం లేని రుతువులు , గొంతు సమస్య , వాంతులు , స్థూలకాయం , దీర్ఘకాల కామెర్లు అనగా హెపటైటిస్ వంటి వాటి మంచి ఔషధముగా పనిచేయును . ఉదరము నందు ఆమ్లతత్వాన్ని తగ్గించును .

           అనేక పురాతన ఆయుర్వేద గ్రంథాలలో యవ్వనాన్ని నిలిపి ఉంచుటకు ముసలితనం తొందరగా రానివ్వకుండా ఉంచుటలో ద్రాక్ష అద్భుతముగా పనిచేయును అని రాసి ఉంది. ఇవి మంచి పోషకాలను కలిగి ఉంటాయి. గ్యాస్ సమస్య కూడా తగ్గిపోవును . ద్రాక్షపళ్లు యూరిక్ సమస్యలు , మూత్రకోశములో మండుతున్న అనుభూతి , మూత్రపిండాలలో రాళ్లు నుండి మంచి ఉపశమనాన్ని కలిగించును.

                 ఈ ద్రాక్షపళ్ళు రసాన్ని వైద్యులు ఎక్కువుగా కీళ్ల వాపులు , ఋతుసంబంధ సమస్యలు , రక్తస్రావానికి వాడుతుంటారు. పచ్చి ద్రాక్షపండ్లలో ఎక్కువ ఆమ్లమూలాలు తక్కువ పంచదార ఉంటాయి. కాని పండిన ద్రాక్షపండ్లలో పంచదార మొత్తం గమనించదగినంత పెరిగిపోవును. ద్రాక్షలో ఉండే పంచదారలో గ్లూకోజ్ ఎక్కువుగా ఉండును. ద్రాక్షపండ్లను మిగతాపండ్లను సమాన తూకంలో తీసుకుని చూస్తే ద్రాక్షపండ్లలోనే గ్లూకోజ్ అధికంగా ఉండును. ద్రాక్షపండ్లలో ఉండే గ్లూకోజ్ శరీరంలో తొందరగా కలిసిపోవును. రక్తహీనతతో బాధపడేవారు ద్రాక్షారసం తీసుకోవడం వలన మంచి ఫలితాలు పొందవచ్చు. ద్రాక్షలో ఉండే మాలిక్ , సిట్రిక్ , టార్టారిక్ ఆమ్లాలు రక్తాన్ని శుద్ధిచేస్తాయి. ప్రేగుల , మూత్రపిండాలు చురుకుపరుస్తాయి.

                  ద్రాక్షపండ్లను సహజరూపంలో తీసుకోవచ్చు . కాని వైద్యపరంగా స్వచ్చమైన తాజా రసములో ఎక్కువ విలువలు ఉంటాయి. ద్రాక్షపండ్లు ప్రతినిత్యం తీసుకోవడం వలన మలబద్దకం సమస్య తీరును . మొలల సమస్య కూడా తగ్గుముఖం పట్టును . పిత్తరసం ఎక్కువ అయ్యి ఉదరంలో మండుతున్నట్టు ఉండే భావన శాంతపరచగలిగే శక్తి వీటికి ఉంది.సాధరణ బలహీనత , నిస్సత్తువ , నిలిచిపోయిన బరువు , చర్మం ఎండిపోవుట , దృష్టి డిమ్ముగా ఉండటం వంటి సమస్యలతో బాధపడేవారు ఈ రసాన్ని వాడవలెను.

       ద్రాక్షారసాన్ని కొన్నిరోజులపాటు ఆగకుండా వాడటం వలన అనవసరమైన వేడి శరీరం నుంచి తీసివేయబడింది. శరీరం శుభ్రంగా , చల్లబడును. ద్రాక్షారసం తాగడం వలన రక్తవిరేచనాల లక్షణాలు అన్ని మాయం అవుతాయి. క్యాన్సర్ నయం చేస్తుంది. రక్తహీనత వలన బాధపడేవారు ప్రతినిత్యం 300 మి.లీ ద్రాక్షరసం తీసికొనవలెను

No comments:

Post a Comment