* నాభిచ్చేదనకు పూర్వమే మగశిశువునకు జాతకర్మ చేయవలెను . ఆ బాలుని నోటికి మంత్రపూర్వకముగా తేనెను గాని , నేతిని గాని బంగారముతో తాకించవలెను .
* బాలునకు పదోవరోజు కాని , పన్నెండోవ దినమున కాని మంచి తిథి యందు , నక్షత్రము నందు , ముహూర్తము నందు నామకరణము చేయవలెను .
* బాలికల పేరు సుఖముగా ఉచ్చరించే విధముగా ఉండవలెను . క్రూరమైన అర్ధము లేనిదిగా , స్పష్టమైన అర్ధము కలిగినటువంటిది , మంగళకరం అయినది , దీర్ఘాక్షరం చివర ఉండునది అయి ఉండవలెను .
* నాలుగోవ మాసము నందు శిశువును సూర్యదర్శనార్ధనము ఇంటి నుండి బయటకి తీసుకువెళ్ళవలెను. ఆరొవ మాసము నందు అన్నప్రాశనం చేయవలెను . అటుల కుదరనిచో తమ కులాచారమును బట్టి మంగళకరదినము నందు చేయవచ్చు .
* చెవులు కుట్టించుట అందరికి మొదట సంవత్సరం నందు గాని మూడొవ సంవత్సరము నందుగాని చేయవలెను .
* ఆయువును కోరువాడు తూర్పుముఖముగా , కీర్తికోరువాడు దక్షిణముఖముగా , సంపద కోరువాడు పశ్చిమ ముఖముగా , భుజించవలెను . సత్యమును కోరువాడు ఉత్తరముఖంగా భుజించవలెను .
* ఆహారమును పూజించవలెను . తాను తినగా మిగిలినటువంటి ఆహారం మరియొకరికి పెట్టరాదు. మరలా దానిని భుజించకూడదు.
* అధికంగా ఆహారంను తినరాదు. అన్నము తినుచూ ఎచ్చటికి వెళ్ళరాదు . అధిక భోజనం ఆరోగ్యభంగమును కలిగించును. ఆయుర్దాయము తగ్గించును .
* తల్లివంశమునకు చెందనదియు , తండ్రి గోత్రమునకు చెందనదియు అగు కన్య వివాహమాడదగినది . కపిల వర్ణం కలిగినదియు , అధికాంగములు కలిగినదియు , రోగగ్రస్తురాలును , పరుషపదాలు మాటలాడునదియు , అధికంగా వెంట్రుకలు కలిగినదియు , వెంట్రుకలు లేనిదగు కన్యను వివాహమాడరాదు .
* నక్షత్రములు , వృక్షములు , నదులపేర్లు కలిగినటువంటి , పర్వతాదుల పేర్లు , సర్పాదుల పేర్లు , భయంకర నామాలు కలిగిన కన్యను వివాహామాడరాదు.
* శుభమును కోరిన తండ్రి , సోదరుడు , భర్త , మరిది మొదలగు వారందరిచేత స్త్రీలు గౌరవించతగి ఉన్నారు . స్త్రీలను పూజించు గృహముల యందు దేవతలు సంతోషముతో నివసిస్తారు. స్త్రీలను గౌరవించని గృహముల యందు ఎన్ని పుణ్యకార్యాలను చేసినను అవన్ని నిష్ప్రయోజనమే .
* శునకములకు , పాపులకు , రోగులకు , కాకులకు పరిశుద్ధమైన భూమిపై మాత్రమే భోజనం పెట్టవలెను . ముందుగా అతిథికి భోజనం పెట్టవలెను . పిమ్మట బిక్షువునకు, బ్రహ్మచారికి పెట్టవలెను .
* అతిథికి భోజనం పెట్టకుండా తినరాదు. ఇంటికి వచ్చిన బంధువులకు కూడా ప్రీతితో యధాశక్తి భోజనం పెట్టి సత్కరించవలెను. కొత్తగా వివాహం అయిన స్త్రీలకు , బాలికలకు , రోగులకు , గర్భిణీ స్త్రీలకు అతిధులకంటే ముందుగానే భోజనం పెట్టవలెను .
* ఒకే వస్త్రముతో భోజనం చేయరాదు . వస్త్రము లేకుండా స్నానం చేయరాదు . మార్గము నందు మూత్రవిసర్జన చేయరాదు . భస్మము నందు, ఆవుల మందల యందు , పంటపొలముల యందు , నీటి యందు, ఇటుకల పైన, పర్వతము పైన , శిధిలమైన దేవాలయాల నందు , పుట్టయందు మూత్రవిసర్జన చేయరాదు . ప్రాణులు గల గోతుల యందు , నడుచుచు , నిలబడియు , నదీతీరముల యందు మూత్రవిసర్జన చేయరాదు .
* అగ్నిని నోటితో ఆర్పరాదు, దిగంబరంగా స్త్రీని చూడరాదు. అగ్ని యందు అశుద్ధపదార్థాన్ని వేయరాదు . నిప్పుని కాళ్లతో తన్నరాదు. సంధ్యాకాలము నందు భోజనం చేయరాదు , ప్రయాణించకూడదు . భూమిని కాలితో గీకరాదు, తన మెడయందలి హారమును స్వయముగా తీయరాదు . అశుచి పదార్థమును , రక్తమును, విషములను నీటియందు కలపరాదు. పాడుబడిన గృహము నందు ఒంటరిగా నిద్రించరాదు . తనకంటే పెద్దవారిని మేల్కొలపరాదు . రజస్వల అయిన స్త్రీతో సంభాషించరాదు. మేయుచున్న ఆవును బయటకి తోలరాదు . వ్యర్థముగా కాళ్ళుచేతులు ఊపరాదు, ఇంద్రధనుస్సును చూడరాదు , వేరొకరికి చూపరాదు . దోసిట్లో నీరు తాగరాదు.తినే భక్ష్యములను తొడమీద పెట్టుకుని తినరాదు. ప్రయోజనము లేని విషయాల గురించి అతిగా ఆలోచించరాదు.
తరవాతి పోస్టులలో మరిన్ని మనువు ఉపదేశించిన ధర్మసూత్రాలు వివరిస్తాను.

No comments:
Post a Comment