ఆయుర్వేదం నందు ఔషదములు గ్రహించు ప్రాచీన పద్దతులు -
ఆయుర్వేదం లొ ఔషధసేవన అన్నది 5 పద్ధతులలో తీసుకొవడం జరుగుతుంది. ప్రాచీన గ్రంధాలలో ఈ పద్దతులు వివరించడం జరిగింది. వాటి గురించి మీకు వివరిస్తాను. అవి
1 - స్నేహన విధి .
2 - స్వేద విధి .
3 - వమన విధి .
4 - విరేచన విధి .
5 - నస్య విది.
* స్నేహన విధి -
తైలాధులను లేపనం చేయుట . చరుముట, రాచుట మొదలయినవి. దీనికి లేపనం అని పేరు కలదు.
* స్వేద విధి -
బాగా చెమట పట్టునట్లు ఔషధాలను వేడి నీటి యందు వేసి ఆ వేడినీటి యెక్క ఆవిరి పట్టుట. దీనిని కుంభ సేకం అనే పేరు కలదు. దీనిని ఆంగ్లమున "టర్కిష్ బాత్ " అని అంటారు.
* వమన విధి -
వాంతి అగునట్లు ఔషధాలను పుచ్చుకొనుట .
* విరేచన విధి -
భేదికి ( విరేచనం అయ్యే ఔషదం ) పుచ్చుకొని జీర్ణాశయం ని శుద్ది పరచుట.
* నస్య విధి -
కొన్ని మూలికల రసమును నాసికా రంద్రముల యందు పోయుట.
పైన చెప్పినవి పంచకర్మములు ఇంకా కొన్ని పద్ధతుల ద్వారా కూడా ఔషధాలను ఇచ్చే విధానాలు ఉన్నాయి . ఇవి ఎక్కువుగా చరక సంహిత , చక్రదత్త, సారంగధార సంహిత, అష్టాంగా హృదయము మొదలయిన ప్రాచీన గ్రంధాల యందు కలవు. వాటి గురించి మీకు వివరిస్తాను.
* అంజనము -
కొన్ని వస్తువుల సముదాయం చేత చేసినట్టి మాత్రను గాని , లేక మూలికల రసం గాని , తైలాధులను గాని , నవనీతం గాని నేత్రముల యందు ఉంచుట ఇదే కలికము లేక అంజనము అంటారు.
* గండుషము -
ఏదేని వస్తువులను వేసి నానబెట్టిన జలముతో పుక్కిలించుట .
* వస్తి శోధనము -
నాళము ద్వారా జలమును గుదస్థానము నందు ప్రవేశింప చేసి మలశోధనము చేయుట . ఇందువలన మలకోశము శుద్ది అగును. పొత్తి కడుపు పలచన అగును. ఇది హట యోగుల యొక్క షట్కర్మలు లలొ ఒకటై ఉన్నది. ఆంగ్లము నందు దీనిని "ఎనిమా " అందురు.
* నాళికా శోధనము -
చిమ్మన గ్రోవి ద్వారా జలమును యొనిస్థానము , కర్ణ రంధ్రము వీని యందు ప్రవేశింప చేసి మలినము వెలికి తీసి శుద్ది చేయుట . ఇది వస్తి శొధనము నందు ఒక బేధము . దీనిని వస్తి పీడనము అని చెప్పెదరు.
* ముఖ నిక్షిప్తము -
అతిమధురము, కరక్కాయ బెరడు మొదలగు వస్తువులను పుక్కిట యందు ఉంచుకుని ఆరసమును మింగుట .
* నిబంధనము -
గడ్డలు మొదలగు వానికి బియ్యపు పిండి లేక మూలికలు ఉడకబెట్టి కట్టుట.
* బంధము -
గాయములు కలిగినప్పుడు లేక అవయవములు స్థానము దప్పినను , విరిగినను, బద్ధపెట్టి కట్టుట దీనిని అంగ్లము నందు "బ్యాండేజ్ " అంటారు.
* మర్దనము -
తైలాధులను వ్యాధిగల స్థలము నందు లేపనము చేసి చేతితో పట్టుట . దీనిని ఆంగ్లము నందు "మసాజ్ " అంటారు.
* తాపనము -
వ్యాధి బాధ గల చోట ఇసుక, తవుడు, ఆకులు మొదలగు వానిని వేయించి గుడ్డలో మూటకట్టి కాని లేక వేడి నీళ్ళని గాజు బుడ్డియందు ఉంచి కాని కాపడం పెట్టుట .
* లేపనము -
తలనొప్పి, గడ్డ, మొదలయిన వాటికి పట్టు వేయుట .
* అభ్యంగనము -
తైలము , మూలికల రసము , జంభిఫల రసము ( నిమ్మకాయ ) , లాంటి కొన్ని స్నేహ వస్తువులను తలకు రాచుకొని స్నానం చేయుట .
* చూర్ణము -
పదార్ధాలను చక్కగా దంచి వస్త్రగాలితం చేసుకొనుట ( వస్త్రము నందు జల్లెడ పట్టుట ).
* కల్కము -
ఔషద యోగముల యందు చేర్చుట కొరకై కొన్ని వస్తువులు చేర్చిన సముదాయము ఇదే కల్కద్రవ్యము .
* ఘటిక -
ఔషద వస్తువులను నూరి చిన్న చిన్న మాత్రలుగా చేసి ఎండలో నుంచి గాని లేక నీడలో ఉంచిగాని ఎండబెట్టుట . దీనినే వటకం , మాత్ర , గుళిక అని చెప్పెదరు.
* రక్త మొక్షనము -
శరీరం నందు ఎచ్చట నైనా గడ్డలు మొదలయినవి కలిగినపుడు హస్త , పాదాల యందు రక్తము హెచ్చుగా నుండినప్పుడు మూలికాదులను కట్టి గాని లేక జలగలను కరిపించి గాని లేక సలాకు ( పదునైన వస్తువు ) తో గాని పొడిచి రక్తము తీయుట .
* ధూమ పానము -
కొన్ని మూలికలను చేర్చిన చుట్టను గాని లేక మూలికాదుల చూర్ణం ని నిప్పు పైన వేసి ఆ పొగను గాని వేము మొదలగు కొయ్యలను గాని పీల్చుట .
* ధూప వర్తి -
మూలికాదుల రసమున తడిపి ఎండించిన గుడ్డను వత్తిగా చేసి కాల్చి ముక్కుతో పీల్చుట .
* ధూపము -
సాంబ్రాణి లేక మరికొన్ని ఇతర వస్తువులను పొడిచేసి నిప్పు మీద వేసి ఆ పొగను శరీరం పైన సోకించుట .
* ఆఘ్రణము -
కొన్ని వస్తువులను వాసన చూడుట .
* పోట్టణం -
ఏదేని మూలికలను ఆకుల యందు చుట్టి కుంపటి లొ గాని , కుమ్ములో గాని ఉంచి ఉడికించి తీసుకొనుట . ఇది పుటపాక బేదము .
* పుట పాకము -
మూలికాదులను ఆకులలో చుట్టి కుమ్ములలో నుంచి తీసి వాని యెక్క రసము పిండు కొనుట.
* పిష్టపాకము -
ఏదేని మూలికలను రోటిలో వేసి దంచి ఆవిరి మీద పెట్టి ఉడికించి తినుట.
* చిక్కాన పాకము -
లేహ్యాధులను ఉండచేసినప్పుడు అందు పల్లము పడిన యెడల దానిని చిక్కాన పాకము అనబడును . అనగా ఔషధమును చేతితో తీసీ ఉండ చేయునప్పుడే చేతికి అంటుకోను పాకము .

No comments:
Post a Comment