Friday, July 30, 2021
మరణించు వాని లక్షణములు ముందుగా తెలుసుకొనుట(death identification)
Wednesday, July 28, 2021
దంత సంబంధ సమస్యలు - నివారణ . ( teeth problems
దంత సంబంధ సమస్యలు - నివారణ .
పంటి చిగుళ్ల వ్యాధులలో సాధారణం అయినవి రెండు రకాలుగా ఉండును. అవి
1 - చిగుళ్ల నుండి రక్తం కారుట .
2 - చిగుళ్లలో పుండు లేచి చీము పట్టుట .
చిగుళ్లు తోమునప్పుడు లేదా చిగుళ్లను చేతితో గట్టిగా అదిమినప్పుడు రక్తం వచ్చును. ఈ వ్యాధిని వీలైనంత తొందరగా నివారించకున్న పళ్లు త్వరగా ఊడిపోవును .
ఈ సమస్య రావడానికి ప్రధానమైన కారణాలు
* సరిగ్గా పళ్లు తోముకోకపోవడం .
* విటమిన్ "C " లోపం .
* శరీరంలో విషపదార్థాలు క్రమంగా చేరడం .
ప్రతినిత్యం రెండుపూటలా దంతములను శుభ్రపర్చుకొనవలెను . గోరువెచ్చని నీటిలో ఉప్పు కలుపుకుని ఆనీటితో నోటిని పుక్కిలించి దంతములను శుభ్రపరచవలెను . చిగుళ్ల నుండి రక్తస్రావం అవుచున్న బ్రష్ వాడరాదు. చేతి వ్రేలుతో జాగ్రత్తగా తోమవలెను . అతి చల్లటి మరియు అతి వేడి పదార్ధాలు తీసుకోరాదు . చక్కెర , స్వీట్స్ వీలైనంత తక్కువగా తీసుకోవలెను . నాలుకను శుభ్రముగా ఉంచుకొనవలెను .
విటమిన్ C పుష్కలంగా లభ్యం అయ్యే ఉశిరిక , జామ , నిమ్మ , నారింజ , అనాస మొదలగు వాటిని ప్రతిరోజు వాడవలెను .
విటమిన్ A , E , C లోపము వలన చిగుళ్లలో పుళ్లు ఏర్పడి చీముకారును . వ్యాధినిరోధక శక్తి తగ్గుట కూడా ప్రధానకారణం . ఈ సమస్యతో బాధపడేవారికి నోరు విపరీతముగా దుర్వాసన వచ్చును .
గాయాలలో రక్తం ధారగా పోతున్నప్పుడు - ( for woonds
గాయాలలో రక్తం ధారగా పోతున్నప్పుడు -
ఏదన్నా ప్రమాదాలలో గాయాల పాలు అయినప్పుడు రక్తస్రావం తీవ్రంగా ఉంటుంది. ఆ స్థితిలో పత్రబీజం ఆకులను ముద్ద చేసి గాయం పైన వేసి కట్టుకట్టి మరుక్షణమే పత్రబీజం ఆకులు మెత్తగా దంచి 10 నుండి 20 గ్రాములు మోతాదుగా ఒక చెంచా పటికబెల్లం పొడి కలిపి లొపలికి తాగించాలి.వెంటనే గాయాలు నుండి రక్తం కారడం ఆగుతుంది . రక్తస్రావం త్వరగా ఆగకపోతే మరో రెండు మూడు మోతాదులు గా కూడా ఒక గంట వ్యవధిలో లొపలికి ఇవ్వవచ్చు. అప్పుడు తప్పకుండా రక్తం ఆగి ప్రాణాలు దక్కుతాయి.
ప్రమాదాలు జరిగినప్పుడు దెబ్బలు తగిలి ఆయా అవయవాలు పిప్పిపిప్పిగా నలిగిపోయినప్పుడు వైద్యులు ఈ అవయవాలను సరిచేసి వాటిపైన ఈ పత్రబీజం ఆకులు కట్టేవారు . చితికిపోయిన మాంసం ముద్ద యధాస్థితికి వచ్చి అతి త్వరలోనే ఆ అవయవం ఆరోగ్యాన్ని పుంజుకొని మామూలుగా పనిచేస్తుంది .
దీనిని సామాన్య పరిభాషలో "రణపాల " అని పిలుస్తారు .
గౌట్ గురించి సంపూర్ణ వివరణ ( gout details
గౌట్ గురించి సంపూర్ణ వివరణ -
ఈ వ్యాధిలో కాలిబాటన వ్రేళ్లు వాచి ఉంటాయి. నడిచినప్పుడు నొప్పిని కలిగించును. ఈ వ్యాధి కొంతకాలం ఉండి ఆ తరువాత దానంతట అదే తగ్గిపోవును . మరలా వస్తుంది. రక్తములో యూరిక్ ఆసిడ్ మోతాదు పెరగటం వలన ఈ సమస్య ఎక్కువుగా వచ్చును.
ఈ సమస్య రావడానికి గల కారణాలు -
అధిక పరిమాణం ప్రొటీన్స్ గల పదార్ధాలలో "ప్యూరిన్స్ " అనబడు పదార్థాలు ఉంటాయి. ఇది జీర్ణం అగునప్పుడు యూరిక్ ఆమ్లం తయారగును. సాధారణముగా ఇది మూత్రములో విసర్జించబడుతుంది. కాని కొన్ని సందర్భాలాలో ఇది పూర్తిగా విసర్జించబడదు . ఇది రక్తములో నిలువ ఉండిపోతుంది. ఈ విధముగా విసర్జించబడని యూరిక్ ఆమ్లం స్పటిక రూపములో ముఖ్యముగా కాలిబాటన వ్రేలి కీలు వద్ద నిక్షిప్తమై ఉంటుంది . కావున బ్రొటన వ్రేలు వాచి నొప్పి కలిగించును.
ఈ యురిక్ ఆమ్లము ఎక్కువుగా ఉత్పత్తి అగుటకు కారణాలు -
* ప్యూరిన్ ఎక్కువ గల ఆహార పదార్థాలు అయిన మాంసము విపరీతముగా తినటం .
* నీరు తక్కువుగా తాగుతూ మద్యము , కాఫీ , టీ మొదలైన వాటిని అధికంగా సేవించుట .
* విపరీతమైన మానసిక సంఘర్షణ .
* వంశపారంపర్యముగా రావడం .
Monday, July 19, 2021
మలబద్ధక సమస్య గురించి వివరణ - constipation solution
మలబద్ధక సమస్య గురించి వివరణ - 2 .
అంతకు ముందు పోస్టు నందు మలబద్దకం మరియు దాని లక్షణాల గురించి వివరించాను. ఇప్పుడు మీకు మలబద్దకం నివారణ గురించి వివరిస్తాను .
నివారణా యోగాలు -
* ఎక్కువుగా పాలిష్ చేయబడిన బియ్యాన్ని
ఆహారముగా వాడరాదు. వీలులేని పరిస్థితుల్లో పాలిష్ బియ్యాన్ని వాడవలసి వచ్చినపుడు ప్రతిరోజు తవుడు ( Rice bran ) రెండు స్పూనులు చక్కెరతోగాని , తేనెతో గాని కలుపుకుని తినవలెను . లేదా తవుడుకు కొంచం నీరు చేర్చి చారులో కలుపుకుని లోపలికి తీసుకోవాలి .
* బజారు నందు లభ్యం అయ్యే గోధుమపిండి మరియు మైదాపిండి నందు పీచుపదార్థాలు పుష్కలంగా లేవు . కావున బజారులో దొరుకు గోధుమపిండికి బదులుగా గోధుమలు తెచ్చుకుని శుభ్రపరచి మనమే మిల్లులో పట్టించుకుని వాడుకోవడం మంచిది .
* పైన చెప్పిన విధముగా పాలిష్ తవుడు , మిల్లులో పట్టించిన గోధుమపిండి వాడటం వలన మలబద్దకం నివారణ అగుటయే కాకుండా B1 , B2 , నియాసిన్ విటమిన్లు కూడా సమృద్దిగా లభ్యం అగును.
* వరి అన్నం మరియు గోధుమపిండితో చేసిన చపాతీలు , రొట్టెలు వాడునప్పుడు వీలైనంత అధికంగా ఆకుకూరలు , కూరగాయలు వాడాలి . దీనివలన మలబద్దకం తగ్గుటయే కాకుండా ఖనిజ లవణాలు , విటమిన్లు కూడా లభ్యం అగును .
* భోజనము చేసిన అర్థ గంట తరువాత 2 గ్లాసులు , రాత్రి పడుకునే ముందు 2 గ్లాసులు , ఉదయాన్నే పండ్లు తోముకున్న తరువాత 2 గ్లాసుల నీటిని తాగవలెను . ఉదయాన్నే నీటిని తాగి కొంచంసేపు నడవటం లేదా వ్యాయామం చేయుట ద్వారా సుఖవిరేచనం అగును.
* కాఫీ , టీ అలవాటు ఉన్నవారు క్రమముగా అలవాటును తగ్గించుకోవాలి. రోజుకు రెండుసార్ల కన్నా ఎక్కువసార్లు కాఫీ , టీలు సేవించరాదు .
మలబద్ధక సమస్యతో బాధపడువారు త్రిఫలా చూర్ణం రెండు స్పూన్లు మోతాదులో ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో కలిపి రాత్రిపూట పడుకునే ముందు తీసుకొనుచున్న ఉదయాన్నే సుఖవిరేచనం అగును. నేను ఇంతకు ముందు చెప్పిన విధముగా ఔషధాలు వాడుటయే కాక ఆహారం నందు ముఖ్యముగా మార్పులు చేసుకొనవలెను . మలబద్దకం మొదలయింది అంటే మీయొక్క అనారోగ్య సమస్యలు మొదలవుతున్నట్లే కావున మొదటిలోనే సమస్య నివారించుకోవడం ఉత్తమం