దంత సంబంధ సమస్యలు - నివారణ .
పంటి చిగుళ్ల వ్యాధులలో సాధారణం అయినవి రెండు రకాలుగా ఉండును. అవి
1 - చిగుళ్ల నుండి రక్తం కారుట .
2 - చిగుళ్లలో పుండు లేచి చీము పట్టుట .
చిగుళ్లు తోమునప్పుడు లేదా చిగుళ్లను చేతితో గట్టిగా అదిమినప్పుడు రక్తం వచ్చును. ఈ వ్యాధిని వీలైనంత తొందరగా నివారించకున్న పళ్లు త్వరగా ఊడిపోవును .
ఈ సమస్య రావడానికి ప్రధానమైన కారణాలు
* సరిగ్గా పళ్లు తోముకోకపోవడం .
* విటమిన్ "C " లోపం .
* శరీరంలో విషపదార్థాలు క్రమంగా చేరడం .
ప్రతినిత్యం రెండుపూటలా దంతములను శుభ్రపర్చుకొనవలెను . గోరువెచ్చని నీటిలో ఉప్పు కలుపుకుని ఆనీటితో నోటిని పుక్కిలించి దంతములను శుభ్రపరచవలెను . చిగుళ్ల నుండి రక్తస్రావం అవుచున్న బ్రష్ వాడరాదు. చేతి వ్రేలుతో జాగ్రత్తగా తోమవలెను . అతి చల్లటి మరియు అతి వేడి పదార్ధాలు తీసుకోరాదు . చక్కెర , స్వీట్స్ వీలైనంత తక్కువగా తీసుకోవలెను . నాలుకను శుభ్రముగా ఉంచుకొనవలెను .
విటమిన్ C పుష్కలంగా లభ్యం అయ్యే ఉశిరిక , జామ , నిమ్మ , నారింజ , అనాస మొదలగు వాటిని ప్రతిరోజు వాడవలెను .
విటమిన్ A , E , C లోపము వలన చిగుళ్లలో పుళ్లు ఏర్పడి చీముకారును . వ్యాధినిరోధక శక్తి తగ్గుట కూడా ప్రధానకారణం . ఈ సమస్యతో బాధపడేవారికి నోరు విపరీతముగా దుర్వాసన వచ్చును .
No comments:
Post a Comment