Monday, July 19, 2021

మలబద్ధక సమస్య గురించి వివరణ - constipation solution

 మలబద్ధక సమస్య గురించి వివరణ  - 2 . 


   అంతకు ముందు పోస్టు నందు మలబద్దకం మరియు దాని లక్షణాల గురించి వివరించాను. ఇప్పుడు మీకు మలబద్దకం నివారణ గురించి వివరిస్తాను . 

 

 నివారణా యోగాలు  - 


 *  ఎక్కువుగా పాలిష్ చేయబడిన బియ్యాన్ని 

ఆహారముగా వాడరాదు. వీలులేని పరిస్థితుల్లో పాలిష్ బియ్యాన్ని వాడవలసి వచ్చినపుడు ప్రతిరోజు తవుడు ( Rice bran ) రెండు స్పూనులు చక్కెరతోగాని , తేనెతో గాని కలుపుకుని తినవలెను . లేదా తవుడుకు కొంచం నీరు చేర్చి చారులో కలుపుకుని లోపలికి తీసుకోవాలి . 


 *  బజారు నందు లభ్యం అయ్యే గోధుమపిండి మరియు మైదాపిండి నందు పీచుపదార్థాలు పుష్కలంగా లేవు . కావున బజారులో దొరుకు గోధుమపిండికి బదులుగా గోధుమలు తెచ్చుకుని శుభ్రపరచి మనమే మిల్లులో పట్టించుకుని వాడుకోవడం మంచిది . 


 *  పైన చెప్పిన విధముగా పాలిష్ తవుడు , మిల్లులో పట్టించిన గోధుమపిండి వాడటం వలన మలబద్దకం నివారణ అగుటయే కాకుండా B1 , B2 , నియాసిన్ విటమిన్లు కూడా సమృద్దిగా లభ్యం అగును. 


 *  వరి అన్నం మరియు గోధుమపిండితో చేసిన చపాతీలు , రొట్టెలు వాడునప్పుడు వీలైనంత అధికంగా ఆకుకూరలు , కూరగాయలు వాడాలి . దీనివలన మలబద్దకం తగ్గుటయే కాకుండా ఖనిజ లవణాలు , విటమిన్లు కూడా లభ్యం అగును . 


 *  భోజనము చేసిన అర్థ గంట తరువాత 2 గ్లాసులు , రాత్రి పడుకునే ముందు 2 గ్లాసులు , ఉదయాన్నే పండ్లు తోముకున్న తరువాత 2 గ్లాసుల నీటిని తాగవలెను . ఉదయాన్నే నీటిని తాగి కొంచంసేపు నడవటం లేదా వ్యాయామం చేయుట ద్వారా సుఖవిరేచనం అగును. 


 *  కాఫీ , టీ అలవాటు ఉన్నవారు క్రమముగా అలవాటును తగ్గించుకోవాలి. రోజుకు రెండుసార్ల కన్నా ఎక్కువసార్లు కాఫీ , టీలు సేవించరాదు . 


     మలబద్ధక సమస్యతో బాధపడువారు త్రిఫలా చూర్ణం రెండు స్పూన్లు  మోతాదులో ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో కలిపి రాత్రిపూట పడుకునే ముందు తీసుకొనుచున్న ఉదయాన్నే సుఖవిరేచనం అగును. నేను ఇంతకు ముందు చెప్పిన విధముగా ఔషధాలు వాడుటయే కాక ఆహారం నందు ముఖ్యముగా మార్పులు చేసుకొనవలెను . మలబద్దకం మొదలయింది అంటే మీయొక్క అనారోగ్య సమస్యలు మొదలవుతున్నట్లే  కావున మొదటిలోనే సమస్య నివారించుకోవడం ఉత్తమం 

No comments:

Post a Comment